Nalgonda district collector
-
రుణాలు రెన్యువల్ చేసుకోవాలి : కలెక్టర్
రాంనగర్: జిల్లాలో రైతులు తమ పంట రుణాలను ఈ సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో రెండవ విడత రుణమాఫీ కింద విడుదలైన రూ. 293.11 కోట్ల (50శాతం) సంబంధిత బ్యాంకులలో జమచేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రుణం పొందిన రైతులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి తమ రుణాలను రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఆ ప్రకటన లో కోరారు. -
అర్థరాత్రి తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం !
నల్గొండ: వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ గెలుపునకు 7,013 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ గెలుపునకు 19,736 ఓట్లు కావాల్సి ఉందని వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ పూర్తి అయిందన్నారు. అలాగే రెండో ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. -
నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికలు రేపటికి వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. గురువారం నల్గొండలో కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు ఎన్నికైన వారి వివరాలను ఈ సందర్బంగా తెలిపారు. కోదాడ మున్సిపల్ ఛైర్మన్‌గా అనిత (కాంగ్రెస్), మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ నాగలక్ష్మి (కాంగ్రెస్), భువనగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా లావణ్య (బీజేపీ) ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే హుజూర్నగర్ నగర పంచాయతీ ఛైర్మన్‌గా జక్కుల వెంకయ్య (కాంగ్రెస్), దేవరకొండ నగర పంచాయతీ ఛైర్మన్‌గా మంజూ నాయక్ (కాంగ్రెస్)లు ఎన్నికైనట్లు తెలిపారు. -
'నల్గొండ జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'
నల్గొండ జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. మంగళవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 4.19 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. 6560 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్ఉల వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం 7 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగునున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్యలను నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో విశదీకరించారు.