రాంనగర్: జిల్లాలో రైతులు తమ పంట రుణాలను ఈ సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో రెండవ విడత రుణమాఫీ కింద విడుదలైన రూ. 293.11 కోట్ల (50శాతం) సంబంధిత బ్యాంకులలో జమచేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రుణం పొందిన రైతులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి తమ రుణాలను రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఆ ప్రకటన లో కోరారు.