నల్గొండ జిల్లాలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. మంగళవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 4.19 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. 6560 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్ఉల వివరించారు.
ఎన్నికల నిర్వహణ కోసం 7 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగునున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్యలను నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో విశదీకరించారు.