హైదరాబాద్: నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్‌లో అవాస్తవాలు పొందుపరిచారని, దీనిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు స్పందిం చింది. బీఈలో ఉత్తీర్ణత సాధించకపోయినా, సాధించినట్టు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది
. నామినేషన్ పత్రాల్లో బీఈ ఉత్తీర్ణులైనట్టు వెంకటరెడ్డి పేర్కొన్నారని, అయితే ఆయన ఉత్తీర్ణులు కాలేదని ఆధారాలను చూపినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని టీఆర్‌ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, 2009 ఎన్నికల నామినేషన్ పత్రాల్లో కూడా వెంకటరెడ్డి బీఈ ఉత్తీర్ణుైడైనట్టు పేర్కొన్నారని, దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెప్పించుకున్నామని కోర్టుకు నివేదించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, ఒకవేళ ఇదే నిజమైతే వెంకటరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఆదేశాలిస్తామన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టు నోటీసు
Published Wed, Apr 23 2014 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement