Komatireddy Venkata Reddy
-
కేసీఆర్ తడాఖా అప్పుడే తెలిసింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషమని,రేపటి నుంచి ఆయనను ఎండ కట్టడాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(జనవరి31) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఎన్ని ఇల్లు ఇచ్చావు.రేపటి నుంచి తడాఖా చూపిస్తా అని కేసీఆర్ అంటున్నారు.కేసీఆర్ తడాఖా ఏంటో పార్లమెంటు ఎన్నికల్లో చూశాం.పదహారు లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తే తొమ్మిదింటిలో డిపాజిట్ కూడా రాలేదు.నువ్వేదో నాయకుడివి అనుకుంటున్నావు.తెలంగాణ సాధనలో నీ పాత్ర అసలే లేదు. నాలాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడు.మాటలతో పదేళ్లు కేసీఆర్ రాజకీయాలు చేశాడు.ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.బయటికి వస్తా అంటున్నావ్ కదా ఏ జిల్లాకు పోదాం చెప్పు. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు.ఏడు లక్షల కోట్ల అప్పు చేశావు’ -
థియేటర్ ఘటన రాజకీయం చేయవద్దు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, మరోసారి ఈ అంశం ఆసక్తికరంగా మారింది.ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో తాజాగా కోమటిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ..‘సంధ్య ధియేటర్ వద్ద ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చాడు. ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ లేదు. సంధ్య థియేటర్ వద్ద ఘటనను రాజకీయం చేయవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పరామర్శకు లీగల్ సమస్యలేంటి?. శ్రీతేజ్‌కు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది?. సినీ ఇండస్ట్రీ శ్రీతేజ్‌ను ఎందుకు పరామర్శించ లేదు’ అని ప్రశ్నించారు. అంతకుముందు.. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు.పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా తెలిపారు. అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా.. థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని.. దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ కార్యాలయాలపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
దొంగతనాలు చేసినోడివి.. సంచులు మోసి జైలుకెళ్లినోడివి..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి మధ్య మాట ల యుద్ధం జరిగింది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. కిరాయి హత్యలు, దొంగతనాలు, జైలుకు వెళ్లడాల నుంచి రాజీనామాల సవాళ్ల దాకా వెళ్లింది. సోమవారం సభలో విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ..‘‘ఆయనలో ఉక్రోషం చూస్తుంటే.. చర్లపల్లి జైలులో ఉన్నట్టుగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.దీనికి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ.. ‘‘చర్లపల్లి జైలు జీవితం ఆయనకు (రేవంత్‌కు) అనుభవం. కాబట్టే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ తాను అక్కడికే వెళతానని భావి స్తున్నారేమో! నాకైతే ఉద్యమకాలంలో చంచల్‌గూడకు వెళ్లి న జైలు జీవితం గుర్తుకొస్తోంది. సీఎంకు మాత్రం చర్లపల్లి జైలులో గడిపినదే గుర్తుకొస్తోంది’’అని కామెంట్ చేశారు. మిల్లులో దొంగతనం చేస్తే ఏం చేశారో తెలుసు! జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘‘సూర్యాపేట బియ్యం మిల్లులో దొంగతనం చేస్తే మిల్లర్లు ఎవరిని పట్టుకుని చెట్టుకు కట్టేశారో.. నిక్కరేసుకున్న పిల్లాడ్ని అడిగినా చెప్తాడు..’’అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకట్‌రెడ్డి మరిన్ని వివరాలు చెప్తారన్నారు. వెంటనే మంత్రి వెంకట్‌రెడ్డి లేచి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన గ్రామానికి చెందిన సమితి మాజీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ–2 నిందితుడు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వాళ్ల నాన్న ఏ–6, ఏ–7 నిందితులు.రామిరెడ్డి హత్య కేసులో ఏ–3 నిందితుడు. ఆ సమయంలో నల్గొండ జిల్లా నుంచి బహిష్కరించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ పెట్రోల్ బంక్‌లో జరిగిన దొంగతనం కేసులోనూ ఉన్నారు. మద్య నిషేధం సమయంలో కర్ణాటక నుంచి దొంగతనంగా మ ద్యం తెప్పించినందుకు మిర్యాలగూడ పోలీసుస్టేషన్లో ఇ ప్పటికీ కేసు ఉంది. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప ఉద్యమాలు చేశాడా?’’అంటూ ఆరోపణలు గుప్పించారు. నిరూపించు.. లేకుంటే ముక్కు నేలకు రాయి! కోమటిరెడ్డి వ్యాఖ్యలతో విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహంగా సీట్ల నుంచి లేచి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన (కోమటిరెడ్డి) మాటలను రికార్డుల నుంచి తొలగించాలి. లేదా ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. అలా చూపిస్తే.. ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.రుజువు చేయకపోతే కోమటిరెడ్డితోపాటు సీఎం కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి’’అని సవాల్ విసిరారు. దీనితోపాటు ‘‘చెత్తగాళ్ల మాటలు.. చెత్త మాటలు.. వాటిని రికార్డుల నుంచి తొలగించండి. నాపై వారు చేసిన ఆరోపణలపై సభా కమిటీ వేయండి..’’అని స్పీకర్‌ను కోరారు. తనపై రాజకీయ కక్షతో పెట్టిన ఆ హత్యకేసులను కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని వివరించారు. కోర్టు చుట్టూ తిరిగినది నిరూపిస్తా.. వెంటనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘జగదీశ్‌రెడ్డి హత్య కేసులో కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగారని నిరూపిస్తా. నేను అన్నది నిరూపించకపోతే ఇదే సభలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నల్గొండ ఎస్పీ, కోర్టు నుంచి రికార్డులు తెప్పించండి’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ట్రెజరీ బెంచ్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, సబ్జెక్టుపై మాట్లాడాలని జగదీశ్‌రెడ్డికి సూచించారు.జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘‘స్పీకర్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. నేనెక్కడా విషయాన్ని పక్కదారి పట్టించలేదు. సీఎం, కోమటిరెడ్డిలే సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు’’అని పేర్కొన్నారు. దీనిపై సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పారు. సభ్యులను అవమానించేలా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచులు మోసి జైలుకెళ్లింది మీరేనంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్‌రెడ్డి పదేపదే కోరడంతో స్పీకర్ స్పందించారు. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి విమర్శలు చేశారు. ‘‘మా నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. సంచులు మోసి జైలుకు పోయింది మీరే’’అని వ్యాఖ్యానించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ఈ దశలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తర్వాత జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపుశాసనసభలో సీఎం, ఇతరులను ఉద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తర్వాత తాను మాట్లాడుతానంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అనుమతి కోరగా.. స్పీకర్ తిరస్కరించారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయగా.. స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమ కురీ్చల వద్దకు వెళ్లారు. -
పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వం
మాదాపూర్: రాష్ట్రం నుంచి ప్రతి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మందులను ఎగుమతి చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. తమది పారి శ్రామిక అనుకూల ప్రభుత్వమని, పారి శ్రామికవేత్తలకు మంత్రివర్గం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని, ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్యా రానివ్వబోమని అన్నా రు. ఓఆర్అర్, ఆర్ఆర్ఆర్ల మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి పరిశ్ర మను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మాదా పూర్లోని హైటెక్స్‌లో మూడురోజుల పాటు కొనసాగే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిదని భట్టి పేర్కొన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు.కరోనా కాలంలో ఫార్మాసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి అవిశ్రాంతంగా శ్రమించారని అభినందించారు. రాష్ట్ర్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్టు భట్టి తెలిపారు. మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి గ్రామీణ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఫార్మా దిగ్గజాలకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కంపెనీలు తమ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో టిమ్స్, వరంగల్‌లో గవర్నమెంట్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హస్పిటల్ రూ.8 వేల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ చైర్మన్ బి.పార్థసారథిరెడ్డి, భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ మొంటుకుమార్ పటేల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ రఘువంశీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.అమీన్పూర్లో ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్ – పల్సస్ గ్రూప్ ప్రకటనసాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ట్రాన్స్ఫార్మేటివ్ ఏఐ డ్రివెన్ ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పల్సన్ గ్రూప్ తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ఫార్మా హబ్ ఏర్పాటుతో దాదాపు 10 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొంది. అమీన్‌పూర్‌లోని ఐటీ/ఐటీఈఎస్ జోన్లో అద్భుతమైన మౌలిక వసతులు, రవాణా సౌకరర్యాలు ఉండడం హబ్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సహా 1,400కు పైగా సైన్స్, టెక్నాలజీ, మెడికల్ జర్నల్స్‌ను ప్రచురించే గొప్ప వారసత్వంతో పల్సస్ గ్రూప్ సమాజానికి గణనీయమైన సహకారం అందిస్తోందని పేర్కొంది. హెల్త్‌కేర్ ఐటీ హబ్ ప్రయోజనాలు ఇలా... ⇒ రోగులకు మెరుగైన వైద్య సేవలు⇒ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా మారుతుంది⇒10 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన⇒అనుబంధ పరిశ్రమలు, సేవల ద్వారా 40 వేల పరోక్ష ఉద్యోగాలు⇒ స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలు. -
‘అరి’కి ముందే మరో చిత్రం
కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్ ఒకరు. పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్‌ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి తదితరులు పాల్గొన్నారు. అరి మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్య పురిమెట్ల రెండో మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన cinematography minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , సుందర్ పాలుట్ల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు , పేపర్ బాయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతుంది... pic.twitter.com/OiR51KtiGB— ARI (MY NAME IS NOBODY) (@ArvyCinemas) May 21, 2024 -
'సీతాకళ్యాణ వైభోగమే' టీజర్ రిలీజ్ చేసిన తెలంగాణ మంత్రి
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'సీతాకళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా.. రాచాల యుగంధర్ నిర్మించారు. ఏప్రిల్ 26న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలా చిత్ర టీజర్‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. (ఇదీ చదవండి: మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!) 'టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి' అని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాని తీసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
మంత్రి కోమటి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కేటీఆర్ తన భాష మార్చుకోవాలి: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని ఎలా అంటావంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్) ఫామ్ హౌలో పెట్టాడా అని విమర్శించారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది మీలాగా పూటకో మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు.కేసీఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్‌కు పోతుంటే వాసాలమర్రిలో శ్మశానాలు అడ్డంగా ఉన్నావని గ్రామాన్ని దత్త తీసుకొని వదిలేశాడని మండిపడ్డారు. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టిపెట్టాలి: మంత్రి కోమటిరెడ్డి
-
నకిరేకల్ లో ఎంపీ కోమటిరెడ్డితో కలిసి వేముల వీరేశం ర్యాలీ
-
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నన్ను బాధించాయి :కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
బెంగళూరులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
బీఆర్ఎస్ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్
-
ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ!
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడను కలిపే జాతీయ రహదారి-65ని ఆరు లేన్లుగా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సందర్భంగా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ పెరగడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. ఈ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్స్పాట్ల మరమ్మ తు పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని అభ్యర్థించారు. ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా మార్చే పనులను రాబోయే 2 నెలల్లోగా ప్రారంభిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. -
ప్రియాంక గాంధీతో సమావేశమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో.. పోటీగా రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. -
కాంగ్రెస్‌లో ‘పదవుల’ సెగలు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, వరంగల్: టీపీసీసీలో భారీగా పదవుల పందేరం చేసినా అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు వేసినప్పుడల్లా అలకలు సాధారణమే అయినా.. ఈసారి ఒకరిద్దరు ముఖ్య నేతలు స్పందించిన తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు టీపీసీసీ కమిటీలపై బహిరంగంగానే స్పందించగా.. మరికొందరు పార్టీ సీనియర్ల వద్ద అసంతృప్తి వెలిబుచ్చారు. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో పేర్లు కనిపించని కొందరు నేతలు.. తమకు పదవులు ఎందుకివ్వలేదంటూ పీసీసీ పెద్దలను కలుస్తున్నారు. మరికొందరు పదవుల పందేరం చేసిన తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇక 26 జిల్లాలకు మాత్రమే డీసీసీ అధ్యక్షులను ప్రకటించి మిగతా జిల్లాలను పెండింగ్‌లో ఉంచడంపైనా చర్చ జరుగుతోంది. ఇంకా హైపవర్ కమిటీలో ఉంటుందేమో..? టీపీసీసీ కొత్త కమిటీల నియామకం తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారన్న దానిపై చర్చ జరిగింది. కానీ ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడిన వెంకట్‌రెడ్డి అసంతృప్తిని బయటపెట్టలేదు. ఈ కమిటీల్లో పేరు లేకపోతే ఇంకా హైపవర్ కమిటీల్లో ఉంటుందేమోనని వ్యాఖ్యానించారు. తనకు పదవులు ప్రాధాన్యం కాదని, మంత్రి పదవినే వదులుకున్నానని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, నల్లగొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. ఇక మాజీ మంత్రి కొండా సురేఖ పీసీసీ కమిటీల కూర్పుపై బహిరంగంగా అసంతృప్తి వెలిబుచ్చారు. తనకన్నా జూనియర్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో నియమించి, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీకి పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. తన ఎగ్జిక్యూటివ్ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని పేర్కొన్నారు. అనంతరం ఆమె రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించడం గమనార్హం. ఇక వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా పదవిపై అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాను టీపీసీసీ కమిటీలో కొనసాగలేనంటూ పీసీసీ పెద్దలకు సమాచారం ఇచ్చారని అంటున్నాయి. వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి డీసీసీలను పెండింగ్‌లో పెట్టడంతో ఆయాచోట్ల పదవులు ఆశిస్తున్న జంగా రాఘవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, నల్గొండ రమేష్, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు వేర్వేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో మరో జాబితా.. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటు టీపీసీసీ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులతో కూడిన జాబితా త్వరలోనే వస్తుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, పోటీ నేపథ్యంలోనే 9 డీసీసీలు ఆగిపోయాయని.. త్వరలోనే వాటిని కూడా భర్తీ చేస్తారని అంటున్నాయి. రేవంత్ నివాసం వద్ద హడావుడి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఆదివారం సందడి నెలకొంది. టీపీసీసీ కమిటీల్లో పదవులు లభించిన నాయకులు రేవంత్‌ను కలిసి, కృతజ్ఞతలు చెప్పేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చారు. గీతారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంటే! టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డిని కొనసాగిస్తున్నారా, లేదా అన్నదానిపై ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్టు వారి పేర్లతో సహా పేర్కొంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డిని తొలగించారనే చర్చ వచ్చింది. అయితే గీతారెడ్డిని పీఏసీ సభ్యురాలిగా నియమించారే తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించలేదని.. మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో గీతారెడ్డి పీఏసీ సభ్యురాలిగా, మిగతా నలుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. -
రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: గత రెండున్నర సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసి, ప్రాణాలను బలిగొన్న రోగాలు మళ్లీ రాకుండా ప్రజలను కాపాడాలని శ్రీవారిని ప్రార్థించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. ఈ రోజు విడుదలైన గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేను చూడలేదు. దేవుని సన్నిధిలో రాజకీయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోవిడ్ కారణంగా ఆర్ధిక పరిస్ధితి చిన్నాభిన్నమైంది. స్వామి వారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు అన్ని తొలగిపోవాలి. ఏ పార్టి అధికారంలో ఉన్నా, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కష్టపడి ప్రజల కష్టాలను తొలగించాలి. షర్మిలను త్రోయింగ్ చేసి తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నాం. షర్మిలకు నచ్చజెప్పి తీసుకెళ్లి ఉండాల్సింది. ప్రస్తుతం రాజకీయాలను నేను దూరంగా ఉన్నాను. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్లో అందరి ఎంపీల కంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నది నేనే. ప్రస్తుతానికి నా నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. చదవండి: ('ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్') -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈజ్ బ్యాక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. గత నెల 21న విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకట్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తాన్నది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కానీ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు రావడం ఆసక్తికరంగా మారింది. ఆడియో లీక్ నేపథ్యంలో.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కొద్దిరోజుల కింద లీకవడం కలకలం రేపింది. దీనిపై ఏఐసీసీ గత నెల 23నే ఆయనకు నోటీసిచ్చింది. పది రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. ఆ గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటరెడ్డి జోడో యాత్రలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడు విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని, తన ఆలోచనను అధిష్టానానికి చెప్పానని వెంకట్‌రెడ్డి సన్నిహితులతో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఫేక్ ఆడియోలు సృష్టించి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. దీనిపై తనకు క్లీన్చిట్ వచ్చేంత వరకు అధిష్టానం పెద్దలను కానీ, పార్టీ నేతలనుగానీ కలవబోనని వెంకట్‌రెడ్డి అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏఐసీసీ నోటీసుకు వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారు? గడువు ముగిసేలోపు సమాధానమిస్తారా లేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రచారానికి హోం గార్డ్స్ కాదు.. ఎస్పీ స్థాయి వారు వెళతారు: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
కానీ.. చచ్చినా మునుగోడు ప్రచారానికి రారట!!
కానీ.. చచ్చినా మునుగోడు ప్రచారానికి రారట!! -
తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేం కోవర్టులమా?
-
నల్లపిల్లి పేరుతో బండి సంజయ్ డ్రామాలాడుతున్నారు: కేటీఆర్
-
ఆ ప్రాంతాల్లో రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: జిల్లా ప్రజలకి, రైతాంగానికి నష్టం కలిగించే చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీకి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం నల్లగొండ జిల్లా ప్రజలకు,రైతాంగానికి తీవ్ర నష్టం కలుగజేస్తుందన్నారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా నల్లగొండ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందన్నారు. 'నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే. ఫ్లోరైడ్ రూపుమాపింది మేమే. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ ల కెనాల్స్ బాగున్నాయి. మాదగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నది బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధం. జీవో రద్దు చేయాలనీ సీఎంకి లేఖ రాస్తా. అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తా. ఎస్ఎల్బీసీ 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 20టీఎంసీలు కేటాయించాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: (Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్) -
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి
రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అది పెద్ద సమస్య అవుతుందని చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఉదంతాలనే ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో నేత అద్దంకి దయాకర్‌లు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డిలు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ సమయంలో ఆయన సోదరుడు ఎంపీ అయిన వెంకటరెడ్డి ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఆయన కాంగ్రెస్‌ను వీడనని చెప్పారు. కానీ అదే సమయంలో ఆయన మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో ఎంతవరకు పార్టీకి సహకరిస్తారన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తుంటారు. వెంకటరెడ్డి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలా పడితే అలా విమర్శలు చేయడం వల్ల జరిగే నష్టాన్ని సరిగా అంచనా వేసుకున్నట్లు లేరు. రాజకీయ నేత ఎవరైనా తమకు ఎలా అవకాశాలు వస్తాయా? తద్వారా తాము అనుకున్నవైపు వెళ్లవచ్చని చూస్తుంటారు. రాజగోపాలరెడ్డి బిజెపిలోకి వెళ్లినా, వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినా, పార్టీ మారతారా?లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే తనను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి తరుణంలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నిమిత్తం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చండూరు వద్ద ఒక సభ నిర్వహించారు. రాజగోపాలరెడ్డి కి వ్యతిరేకంగా జరిగిన ఈ సభను తనకు తెలియకుండా పెడతారా అని వెంకటరెడ్డి నిరసన తెలిపారు. తాను ఆ సభకు వెళ్లనని కూడా స్పష్టం చేశారు. అయినా వీరి అండ లేకపోయినా, జన సమీకరణలో కాంగ్రెస్ నేతలు సఫలం అయ్యారు. కానీ ఆ సభలో వెంకటరెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆయన ఒక అసభ్య పదాన్ని కూడా వాడారు. దాంతో వెంకటరెడ్డి మరింత మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మరో సందర్భంలో కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ అన్న పాయింట్ పై మాట్లాడుతూ హోంగార్డు ఎంత సీనియర్ అయినా, ఐపిఎస్ కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. సహజంగానే కాంగ్రెస్ సీనియర్లలో ఇది కాక పుట్టిస్తుంది. అసలే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డి వెంటనే దీనిని అందుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో హోంగార్డుల వంటి తాము ఎందుకని, ఐపిఎస్ హోదా ఉన్న నాయకులే గెలిపించుకుంటారులే అని బదులు చెప్పారు. అసలు సభ పోయి, ఈ వివాదమే మునుగోడులో ప్రధాన అంశం అయి కూర్చుంది. ఒక వైపు కాంగ్రెస్‌లో టికెట్ కోసం కొందరు నేతల మధ్య పోటీ, దానిని తేల్చుకోలేక సతమతమవుతున్న తరుణంలో వెంకటరెడ్డి వివాదం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. అద్దంకి దయాకర్ , రేవంత్ రెడ్డిలు తమ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయినా వెంకటరెడ్డి శాంతించలేదు. దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న కొత్త డిమాండ్ పెట్టారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాందీ వద్దే తేల్చుకుంటానని ఆయన ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కూడా అధిష్టానానికి కొందరు నేతలు రేవంత్‌పై పిర్యాదు చేయకపోలేదు. అందరిని కలుపుకుని వెళ్లాలని రేవంత్‌ను డిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. అయినా రేవంత్ తొందరపాటుతో నోరు జారారు. అదే వెంకటరెడ్డికి ఆయుధం అయింది. ఒక దశలో రాజగోపాలరెడ్డిపై వెంకటరెడ్డినే పోటీకి నిలబెట్టాలన్న ఆలోచన కూడా చేశారని అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అసలు తాను మునుగోడులో ప్రచారం చేయవలసిన అవసరం లేని దశకు వెంకటరెడ్డి వెళ్లారు. ఆయన భవిష్యత్తులో పార్టీలో ఉంటారో, ఉండరో కానీ, ఆయా అంశాలపై చికాకు సృష్టిస్తారన్న భావన కలుగుతుంది. వ్యూహాత్మకంగా వెంకటరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయవలసిన కాంగ్రెస్ నేతలు, అందుకు విరుద్దంగా ఆయన వ్యూహంతో సతమతమవుతున్నారు. ఇదే వెంకటరెడ్డి కొంతకాలం క్రితం రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు తీవ్రమైన ఆరోపణ చేశారు. పార్టీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు పాతిక కోట్లు ఇచ్చి పదవి కొనుకున్నారని ఆయన ఆరోపించారు. దానిపై తొలుత ఠాకూర్ సీరియస్ అయినా, ఆ తర్వాత సర్దుకుని, వెంకటరెడ్డికి స్టార్ కాంపెయినర్ హోదా ఇచ్చారు. ఆ సందర్భం అలాంటిది. పార్టీలో ఉన్నంతవరకు వెంకటరెడ్డితో తగాదా పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో పార్టీ నేతలకు తెలుసు. ఎవరైనా నేత పార్టీకి దూరంగా ఉండాలని అనుకున్నా, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నా, దాగుడుమూతల గేమే ఆడతారు. పరిస్థితి మొత్తం తనకు అనుకూలంగా ఉందని ఆయన భావించే వరకు రాజకీయం ఇలాగే ఉంటుంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీని వీడడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక రాబోతోంది. అది కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ రచ్చ పార్టీకి పెద్ద తలనొప్పి అవుతుంది. దయాకర్ ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సన్నిహితంగానే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్‌కు దగ్గరైనట్లు ఉన్నారు. అయినా అనకూడని మాట అని వివాదంలో ఇరుకున్నారు. రేవంత్ మొదటి నుంచి దురుసుగా మాట్లాడే వ్యక్తే. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆరోపణలు గుప్పించడమే కాకుండా, కొంత అభ్యంతర భాషను కూడా వాడుతుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ నేతలు కూడా అంతే ఘాటుగా మాట్లాడుతుంటారు. అది రాజకీయ వివాదంగానే ఉంటుంది. కానీ సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే వాటికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డికి రేవంత్ వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. దీనివల్ల బిజెపి పక్షాన పోటీచేయనున్న తన సోదరుడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా వెంకటరెడ్డి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఉప ఎన్నికలో బిజెపి గెలిస్తే వెంకటరెడ్డి రాజకీయ నిర్ణయాలు ఒక రకంగా ఉండవచ్చు. అలాకాకుండా రాజగోపాలరెడ్డి ఓటమి చెందితే, ఆయనకు వచ్చే ఓట్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసుకుని రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ఎటు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కోమటిరెడ్డి చూసుకోగలుగుతారు. కాగా కాంగ్రెస్‌ను వీడడంపై రాజగోపాలరెడ్డి ద్రోహి అంటూ మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. ఇది రేవంత్ కుట్ర అని ఆయన విమర్శిస్తున్నా, ఉప ఎన్నికలో విజయం సాధించేవరకు ఆయన ఇలాంటి చిక్కులు ఎదుర్కోక తప్పదు. కాగా టిఆర్ఎస్లో కూడా అసమ్మతి చికాకుగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకరరెడ్డికి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయనకు పోటీగా కొందరు నేతలు జట్టుకట్టి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా ప్రభాకరరెడ్డి వైపే కేసీఆర్ ఆలోచన చేస్తే, స్థానికంగా ఆయనను వ్యతిరేకించే నేతలు టిఆర్ఎస్ విజయానికి ఎంత కృషి చేస్తారన్న డౌటు వస్తుంది. టిఆర్ఎస్, బిజెపిలు పోటాపోటీ సభలు నిర్వహించాయి. అమిత్ షా సభకు ఒక రోజు ముందుగానే కెసిఆర్ సభ నిర్వహించి బిజెపికి సవాల్ విసిరారు. భావి తెలంగాణ రాజకీయానికి దిక్సూచి వంటి మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఇంకా రాకముందే రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో పోరు, మరో వైపు సొంత పార్టీలో అసమ్మతి తలనొప్పులతో కాంగ్రెస్,టిఆర్ఎస్లు ఇబ్బంది పడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కొనసాగుతుండగానే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిట్మెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను సోనియాకు వివరించనున్నారు. అలాగే తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు మీడియాకు వివరించారు. చదవండి: (ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన) బాధ్యతలిస్తే ప్రచారం చేస్తా: కోమటిరెడ్డి దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించాడు. అనంతరం చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారి పనులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో మాత్రమే వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: (విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి) -
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ‘స్టార్’.. ఇది దేనికి సంకేతం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యానికి చేసింది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరివరకు బరిలో ఉన్న ఆయనకు ఉన్నట్టుండి ప్రత్యేక పదవి కట్టబెట్టడం, అది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చే ఈ పదవిని ఇప్పుడు ఇవ్వడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. నిజానికి వెంకటరెడ్డికి ఏఐసీసీలో ఏదైనా పదవి ఇస్తారని, లేదా ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా పంపుతారని ఇప్పటివరకు భావించారు. కానీ రాష్ట్రంలోనే కీలకమైన బాధ్యత అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డికి ఈ పదవి ఇవ్వడం వెనుక అధిష్టానానికి ప్రత్యేకమైన ఆలోచన ఉందని, రాష్ట్రంలో పార్టీ ఏకపక్షంగా ముందుకెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపట్ల వ్యతిరేకంగా ఉన్న ఆయనను ఈ పదవి ఇచ్చి బుజ్జగించారని, తద్వారా పార్టీలో సమస్యలు లేకుండా సర్దుబాటు చేశారనే వాదనా వినిపిస్తోంది. సమన్వయం కోసమేనా? ఇటీవల రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగేంతవరకు రాష్ట్ర పార్టీ రెండు వర్గాలుగా పనిచేసింది. ఓ వర్గం పూర్తిస్థాయిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బలపర్చగా.. మరోవర్గం అంటీముట్టనట్టుగా, ఒకదశలో వ్యతిరేకంగా వ్యవహరించింది. ఈ వర్గంలోని కొందరు నేతలు అప్పుడప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అసమ్మతి వ్యక్తపర్చేందుకు విధేయుల పేరిట సమావేశాలు నిర్వహించడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 40 మంది ముఖ్య కాంగ్రెస్ నాయకులను పిలిపించి మాట్లాడడం ద్వారా రాహుల్‌గాంధీ సమస్యను కొంతవరకు సర్దుబాటు చేయగలిగారు. ఈ పరిణామాలతో కొందరు పార్టీ సీనియర్లతో సమన్వయం చేసుకోవడం రేవంత్‌కు కష్టమనే భావనకు అధిష్టానం వచ్చిందని.. వారిని సమన్వయం చేసే బాధ్యత కోమటిరెడ్డికి అప్పగిస్తూ, స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పించిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇక పార్టీ కార్యక్రమాల నిర్వహణలో రేవంత్‌తోపాటు మరో కీలక నేతకూ భాగం కల్పించాలన్న ఉద్దేశంతోనే కోమటిరెడ్డిని ముందుకు తెచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. తద్వారా పార్టీలో రెండో అధికార కేంద్రం ఉందనే భావన కలుగుతుందని, ఇది అసమ్మతిని తీవ్రం కానివ్వదనే ఆలోచన కూడా పార్టీ అధిష్టానానికి ఉన్నట్టు నేతలు అంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ హోదా వల్ల ఎంపీ కోమటిరెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించి సభలు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని.. ఇందుకు అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా.. : కోమటిరెడ్డి నల్లగొండ/రామన్నపేట: శ్రీరామనవమి రోజున తనను పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించడం సంతోషకరమని, ఇది దేవుడి దీవెన అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు నల్లగొండకే తన పోరాటాన్ని పరిమితం చేశానని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ ఎలా నాశనం చేస్తున్నారో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు భూములిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం వాటిని లాక్కొని రియల్ ఎస్టేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూస్వాములను ఆదుకుంటోందని విమర్శించారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పూర్వ వైభవం తెస్తానని ప్రకటించారు. -
ఇంట్లో పోరు ఉండొద్దు.. కారుతో పొత్తుండదు
టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఎదుర్కోవడంపైనే నేతలు దృష్టిపెట్టి పనిచేయాలి. టీఆర్‌ఎస్‌తోగానీ, ఎంఐఎంతోగానీ పొత్తు, స్నేహం లాంటి ఆలోచనలు ఉండనే ఉండవు. అలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దు. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం. కొత్తవాళ్లను చేర్చుకోవడంపై దృష్టి పెట్టండి, యువతకు పెద్దపీట వేయండి. మనం.. ఓ కుటుంబం.. గతంలో జరిగింది.. జరిగిపోయింది.. మనమంతా ఒక కుటుంబం.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలి. నేను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తా.. –టీపీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలను గట్టిగా ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని.. ఇక నుంచి పార్టీ నేతలంతా విభేదాలు మాని ఏకతాటిపైకి రావాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది ముఖ్య నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను విన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు పార్టీలో ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే అధిష్టానానికి చెప్పుకొనేలా తాను ఏర్పాటు చేస్తానని.. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలని.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని ఆదేశించారు. తాను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని పార్టీ నేతలకు మాట ఇచ్చారు. కాగా.. సమావేశంలో భాగంగా పలువురు నేతలు తమతో విడివిడిగా మాట్లాడాలని రాహుల్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాహుల్.. త్వరలోనే అందరికీ వన్‌టూవన్ చర్చల కోసం సమయం ఇస్తానని మాట ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర నేతలు చెప్పే అంశాలను వినేందుకే రాహుల్ ప్రాధాన్యత ఇచ్చారని.. ఆయన కేవలం ఏడెనిమిది నిమిషాల పాటు మాత్రమే మాట్లాడారని తెలిసింది. సునీల్‌ను పరిచయం చేసిన రాహుల్ భేటీ సందర్భంగా సునీల్ కనుగోలును టీపీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ పరిచయం చేసి, పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి సునీల్ తన పని తాను చేసుకుంటున్నారని, ఆయనను ఓ ఏజెన్సీగా భావించవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. సునీల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని, ఆయన పూర్తిగా ఏఐసీసీ పరిధిలో పనిచేస్తారని, అవసరమైనప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటారని వివరించినట్టు సమాచారం. గతంలో మాట్లాడినవి మర్చిపోయా.. భేటీ సందర్భంగా తాను పార్టీకోసం ఏమేం చేశాననే దానిపై రాహుల్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల తాను మాట్లాడాల్సి వచ్చిందని.. తనకు 10 నిమిషాలు సమయమిచ్చి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాహుల్.. అంతా ఓ కుటుంబంలా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. రాహుల్ చెప్పిన మాటతో తాను సంతృప్తి చెందానని, గతంలో తాను మాట్లాడిన విషయాలన్నీ మర్చిపోయానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ నెలకొందని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని భేటీ సందర్భంగా పలువురు నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా టికెట్లను ప్రకటిస్తున్నారని, అలా జరగవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనగా.. అలా టికెట్లు ప్రకటించడం సరైంది కాదని, భవిష్యత్తులో అలా జరగొద్దని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఇక గత ఎన్నికల సందర్భంగా పొత్తుల పేరుతో చివరి వరకూ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోయామని, టికెట్లు వచ్చిన వారు సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించినట్టు సమాచారం. ఆరు నెలలు, ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని కూడా ఆయన కోరగా.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపై కసరత్తు చేద్దామని రాహుల్ చెప్పినట్టు తెలిసింది. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఓ స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పీఏసీకి అధికారం ఇవ్వడమా, లేక కొత్త కమిటీ ఏర్పాటు చేయడమా అన్నదానిపై చర్చిద్దామనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. రాహుల్‌తో భేటీ అయిన నేతలు వీరే రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీహెచ్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎం.కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి
-
ఎల్బీనగర్–మల్కాపూర్.. ఆరు లేన్లు
సాక్షి, హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిలో తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎల్బీనగర్–దండుమల్కాపూర్ సెక్షన్‌ను ఆరు వరసలుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. రూ.600 కోట్లతో సుమారు 25 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. రహదారి వెంట సర్వీస్ రోడ్లతోపాటు ఎనిమిది చోట్ల ఫైఓవర్లను నిర్మించనున్నారు. నిజానికి ఎల్బీనగర్–దండుమల్కాపూర్ మధ్య రోడ్డు విస్తరణ ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. గత ఏడాదే కేంద్రం దీనికి ఆమోదం తెలిపి, డీపీఆర్ తయారీకి ఆదేశించినా.. పనులు కదల్లేదు. నిర్మాణ సంస్థ అలసత్వం వల్ల ఆలస్యమవుతోందని ఇటీవలి భేటీ సందర్భంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. వేరే సంస్థకు అప్పగించి అయినా త్వరగా పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా.. విపరీతంగా రద్దీ ఉండే ఈ రహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది తప్పేలా ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనామా గోడౌన్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కోహెడ క్రాస్‌రోడ్డు, పెద్ద అంబర్‌పేట, అనాజ్పూర్రోడ్డు, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో వీటిని చేపడతారు. వనస్థలిపురంతోపాటు మరోచోట రెండు ఫుట్ఓవర్ వంతెనలను కూడా నిర్మిస్తారు. ఈ దారి వెంట సర్వీసురోడ్లు కూడా నిర్మించనున్నారు. ఫలించిన కోమటిరెడ్డి ఒత్తిడి.. హైదరాబాద్–విజయవాడ రహదారిని విస్తరించాలని చాలాకాలంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఓవైపు ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు నగరంలో రోడ్డు విస్తరణ, తర్వాత అక్కడి నుంచి విజయవాడ వరకు విస్తరణ జరగాల్సి ఉంది. దీనిపై కోమటిరెడ్డి ఒత్తిడి మేరకు నగరం పరిధిలో రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మేలోనే పనులు మొదలై.. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సానుకూలంగా స్పందించారు: కోమటిరెడ్డి ‘‘విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించేవారి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను కూడా రెండుమూడు సార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను. ఈ క్రమంలోనే రహదారి విస్తరణ చేపట్టాలని గడ్కరీని పలుమార్లు కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించారు’’అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దీనితోపాటు హైదరాబాద్ గౌరెల్లి ఔటర్ నుంచి పోచంపల్లి, వలిగొండ, భద్రాచలం మీదుగా ఒడిశా వరకు మరో జాతీయ రహదారిని నిర్మించాలని కోరగా.. గడ్కరీ సాసుకూలంగా స్పందించారని చెప్పారు. -
నిరుద్యోగ భృతిపై మాట తప్పిన కేసీఆర్
బయ్యారం: నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బాకీ పడ్డారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని శుక్రవారం రాత్రి ఆయన పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే అందరి బతుకులు బాగుపడుతాయని, ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసి.. సొంత పార్టీతో తగువు పెట్టుకొని తెలంగాణను సాధించామన్నారు. కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ శశాంకను ఫోన్లో కోరారు. -
కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం
నల్లగొండ: సీఎం కేసీఆర్ అసమర్థత వల్లనే నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నల్లగొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఆరోపించారు. శనివారం నల్లగొండలోని ఉత్తమ్ నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతీవిషయంలో కేసీఆర్ కేంద్రానికి మద్దతు పలుకుతూ వచ్చారని.. కానీ, కేంద్రం మాత్రం నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. అనుమతి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే ఏపీలో ప్రాజెక్టులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయని తెలిపారు. కృష్ణా బోర్డుపై విడుదల చేసిన నోటిఫికేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావాలని సూచించారు. శ్రీశైలం సొరంగమార్గం పూర్తయితే గ్రావిటీ ద్వారా సాగునీరు అందడంతోపాటు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్నారు. సీఎం దళితులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. -
TPCC: మరి అసంతృప్తుల పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: అదుగో.. ఇదుగో అంటూ ఆరు నెలలుగా దోబూచులాడుతూ వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి, ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించడంతోపాటు మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం కార్యవర్గం, కమిటీల కూర్పులో సామాజిక కోణాన్ని బట్టి ఎంపిక చేసింది. గతంలో పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్యను ఐదుకు పెంచింది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న వారిలో రేవంత్‌ను అధ్యక్షుడిగా నియమించగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లను తప్పించింది. అజారుద్దీన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ.. కొత్తగా సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు అవకాశమిచ్చింది. తద్వారా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు పదవులు ఇచ్చింది. 10 మంది సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంలోనూ సామాజిక కూర్పు పాటించింది. ఎస్సీలు ముగ్గురు, ముగ్గురు ఓసీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బీసీలు, ఒక మైనార్టీ నాయకుడికి అవకాశమిచ్చింది. ఇక ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీ నేత మధుయాష్కీగౌడ్‌కు, కన్వీనర్‌గా మైనార్టీ నాయకురాలు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీకి స్థానం కల్పించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఎస్సీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వగా, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అప్పగించింది. అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? రేవంత్‌కు పీసీసీ బాధ్యతలను అప్పగించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిలో పలువురు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. మరికొందరు రేవంత్‌ను అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, గాంధీ కుటుంబం పట్ల విధేయంగా ఉండేవారికి మాత్రమే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పలువురు పార్టీ సీనియర్లు ఏఐసీసీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల నుంచి రేవంత్‌కు ఏమేర సహకారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు రాజీనామాలు ప్రకటించగా.. మిగతావారు ఎలా స్పందిస్తారన్న దానిపై టీపీసీసీ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే రేవంత్ సీనియర్లను, తనను వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కోమటిరెడ్డికి ఏఐసీసీ పదవి? టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది. వెంకటరెడ్డి కొన్నాళ్లు వేచిచూసే ధోరణిలోనే ఉంటారని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలనే యోచనలో రేవంత్ శిబిరం ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత రాష్ట్రంలో నేతలను కలిశాక బాధ్యతల స్వీకరణ చేపట్టాలని.. ఆ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలను, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంతోనే కాంగ్రెస్ శ్రేణులకు ఊపు తేవాలని, దూకుడుగా ముందుకెళ్లాలని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎదిగి.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన రేవంత్‌రెడ్డి.. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. అనూహ్యంగా రాజకీయాల్లో ఎదిగారు. 2007–09 మధ్య ఉమ్మడి ఏపీ ఎమ్మెల్సీగా, 2009లో, 2014లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఆయన.. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన రేవంత్.. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పదునైన ప్రసంగాలతో ఆకట్టుకుని.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఏఐసీసీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నా తనదైన రీతిలో పనిచేస్తూ ముందుకు సాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదునైన ప్రసంగాలతో అధికార పక్షంపై విరుచుకుపడి.. ప్రతిపక్షంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఇటీవల రైతులకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడం.. అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, ఇటు ప్రజల్లో ఆదరణ పెరిగింది. పలు అంశాలపై ఎన్జీటీ, కోర్టుల్లో న్యాయ పోరాటం కొనసాగించడం ఆయనకు ఆదరణ పెంచింది. మరోవైపు లోక్‌సభలో ప్రసంగాలతోనూ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు. రైతులకు మద్దతుగా, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సం బంధించిన అనుబంధ పద్దులపై చర్చలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. మొత్తంగా రేవంత్ పార్టీలో చేరి నాలుగేళ్లు కాకుండానే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకుని సంచలనంగా నిలిచారు. జానా, షబ్బీర్ నివాసాలకు రేవంత్ తనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. తొలుత సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఆశీర్వదించాలని, తగిన సహకారం అందించాలని కోరారు. తర్వాత మైనార్టీ నేత షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి అభినందనలు అందుకున్నారు. రేవంత్ ఆదివారం కూడా పలువురు సీనియర్లను కలవనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏడేళ్లలో మూడో అధ్యక్షుడు తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో పీసీసీకి మూడో అధ్యక్షుడు వచ్చారు. మొదట పొన్నాల లక్ష్మయ్య చీఫ్‌గా ఉండగా.. 2015 మార్చిలో ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయన ఆరేళ్ల మూడు నెలలు పదవిలో కొనసాగారు. తాజాగా రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారు. ‘సింహం వచ్చింది.. పులి భయపడాలి’: ఆర్జీవీ వివాదాస్పద, ఆసక్తికర కామెంట్లు, ట్వీట్లకు పెట్టింది పేరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ టీపీసీసీ అధ్యక్ష నియామకంపై పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ సింహం రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయడం ద్వారా అద్భుత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ సింహాన్ని చూసి పులి భయపడాల్సి వస్తుంది’అని ట్వీట్ చేశారు. -
టీపీసీసీ చీఫ్.. తేలేనా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి హస్తిన బాట పట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికితోడు ఇటీవలే కేరళ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడం, పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి కొత్త పీసీసీని ఎన్నుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ సంగతినీ అధిష్టానం ఈసారి తేల్చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. కానీ, దీనిపై గాంధీభవన్ వర్గాలు గుంభనంగానే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం స్థాయిలో మరిన్ని చర్చ లు జరగాల్సి ఉందని, ఆ తర్వా తే తేలుతుందని అంటున్నాయి. మూడు రోజులుగా అక్కడే.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్ర పెద్దలను కలుస్తున్న ఆయన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్మెంట్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా శుక్రవారం హస్తిన బాట పట్టడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్‌లో మొదలైంది. అయితే, రేవంత్ కూడా తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగూ ఢిల్లీ వెళ్లారు కనుక పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముందని అంటున్నారు. వీరికి తోడు మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదని అంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరితో మాట్లాడిన తర్వాతే అధిష్టానం ఈ విషయాన్ని తేలుస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన చర్చలు ఇంకా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే! చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’ -
‘ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బందులు పడతారని పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోమటిరెడ్డి, కోర్టును అభ్యర్థించారు.(చదవండి: రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు: సీఎం కేసీఆర్) కాగా ఎల్ఆర్ఎస్ అంశంపై ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి కోర్టు ఒకేసారి విచారించనుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు టీ సర్కారు ఎల్ఆర్ఎస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన) -
అప్పట్లో రాజులు కూడా ఇలా చేయలేదు
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి దేవాలయ శిలలపై కేసీఆర్, కారు గుర్తు చిత్రాలను చెక్కించుకోవడం సిగ్గుచేటంటూ భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాడు దేశాన్ని పరిపాలించిన రాజులు కూడా తమ చిత్రాలను ఎక్కడా చెక్కించుకోలేదని విమర్శించారు. ప్రజలు, భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతీశారన్నారు. చెక్కిన గుర్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చర్యను ధార్మిక సంస్థల అధిపతులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. -
బడ్జెట్ నిరుత్సాహపరిచింది
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకులు పెదవి విరిచారు. బడ్జెట్ తమను నిరుత్సాహ పరిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తాము భావించడం లేదని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దగా కేటాయింపులు జరగలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పెంపు సామాన్యులపై భారంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామనడం తప్ప అందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. -
హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తన వ్యాఖ్యలతో, వ్యవహార సరళితో కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్న సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో దర్శనమిచ్చారు. అయితే, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో తాను ఢిల్లీకి వచ్చానని, తన హస్తిన పర్యటనలో ప్రత్యేకత ఏమీ లేదని రాజగోపాల్‌రెడ్డి మీడియాతో తెలిపారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటం చేసి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండేదని, తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకు ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు. బీజేపీలోకి చేరికపై రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ఆ పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపినట్టు కథనాలు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీరుపై, టీపీసీసీ వ్యవహార సరళిపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం బీజేపీయేనని ఆయన పేర్కొన్నట్టు వ్యాఖ్యలు వచ్చాయి. -
‘ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం ఇదే’
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణాలో భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉందని, తనను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రిలో బుధవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం భువనగిరి పార్లమెంటు స్థానమేనని ధీమా వ్యక్తం చేశారు. 80 నుంచి లక్ష మెజారిటీ గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పనిచేస్తామని అన్నారు. టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మంచినీళ్లు లేకపోతే పట్టించుకోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్న తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై స్పందించని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, గోవా క్యాంపు రాజకీయాలను ఏమనాలని ప్రశ్నించారు. ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపు రాజకీయాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. -
..ఐతే ఓకే లేకుంటే షాకే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. కనీస స్థాయిలో ఓట్లు, సీట్లు దక్కించుకునే వారికే పదవులపరంగా పార్టీలో ఇబ్బంది ఉండదని, ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కీలక నేత భవిష్యత్తుపై కచ్చితంగా ప్రభావం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి లోక్‌సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం బరిలో దింపింది కూడా ఇదే వ్యూహంతోనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాలో రాహుల్ కోటరీ నేతగా గుర్తింపు ఉన్న మధుయాష్కీ గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నా యి. ఉత్తమ్ (నల్లగొండ), కోమటిరెడ్డి (భువనగిరి), రేవంత్ (మల్కాజిగిరి) పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటములు, వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ స్థానాల్లో గెలిచిన నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఉత్తమ్‌కు ఊరట లభించేనా...? ఈసారి లోక్‌సభ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కీలకం కానున్నాయి. ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా అధిష్టానం ఆయనపై చర్యలకు పూనుకోకపోగా లోక్‌సభ ఎన్నికల రూపంలో రాహుల్ గాంధీ ఆయనకు మరో పరీక్ష పెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయనే పట్టుబట్టి మరీ నల్ల గొండ లోక్‌సభ నుంచి ఉత్తమ్‌ను పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితం తారుమారైతే టీపీసీసీ చీఫ్ మార్పు అంశం మళ్లీ తెరపైకి వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని పణంగాపెట్టి మరీ ఉత్తమ్‌ను లోక్‌సభ బరిలో దింపగా ఆయన గెలిస్తే అదే ఊపు మీద హుజూర్నగర్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని, లేదంటే ఆయన ఎమ్మెల్యేగానే మిగిలే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు కూడా ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న ఐదు స్థానాల్లో కేవలం రెండింటినే వారు గెలుచుకోగా వాటిలో వెంకట్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్‌సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సహకారంతో లోక్‌సభ బరిలో దిగిన వెంకటరెడ్డి... ఈ ఎన్నికల్లనూ ఓడిపోతే పార్టీలో కూడా సైలెంట్‌గానే ఉండాల్సి వస్తుందని, వచ్చే ఎన్నికల వరకు అలాగే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. రేవంత్‌కు కీలకం... మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి భవిష్యత్తుకు కూడా ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ... రేవంత్‌కున్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని గెలుపు అవకాశాలున్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేవంత్ గెలిస్తే పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారతారని, లేదంటే ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేననే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌లో ఎవరు గెలుస్తారు.. ఓడిపోతారనే దాన్ని బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. వారి భవిష్యత్తూ ప్రశ్నార్థకమే! ఖమ్మం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక, నిజామాబాద్ నుంచి బరిలో నిలిచిన మధుయాష్కీ గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు సైతం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రూపు గొడవలు, టికెట్ల కోసం పోటీని తట్టుకొని సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో రేణుకా చౌదరి చివరి నిమిషంలో ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగారు. సొంత ఇమేజ్‌పై గెలిచి వస్తానని అధిష్టానానికి ఆమె మాటిచ్చారు. ఇప్పుడు ఫలితం సానుకూలంగా వస్తే అధిష్టానం వద్ద రేణుక ఇమేజ్ పెరుగుతుందని, లేదంటే ఈసారి టికెట్ తెచ్చుకోవడం కూడా కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ముఖ్యనేత, రాహుల్‌కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ గౌడ్ భవిష్యత్తూ ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉంది. పార్టీతోపాటు నియోజకవర్గపరంగా కూడా ఆయనకు ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన భువనగిరి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరగ్గా అధిష్టానం నల్లగొండ స్థానానికి ఆయన పేరును పరిశీలించి చివరికి పాత స్థానమైన నిజామాబాద్ టికెట్నే యాష్కీకి కేటాయించింది. ఇప్పుడు ఆయన ఓడిపోతే నియోజకవర్గంలో భవిష్యత్తు గడ్డుగానే మిగిలిపోతుందని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరిమరీ టికెట్ తెచ్చుకుని మహబూబాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా అధిష్టానం ఆయనకు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు గెలిస్తే నాయక్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కేంద్ర మంత్రి స్థాయిలో కొనసాగవచ్చని లేదంటే ఆయన భవిష్యత్తూ అంధకారమేననే చర్చ జరుగుతోంది. ఎప్పుడూ జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఓడిన ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేశారని, ఇప్పుడు ఓడిపోతే ఈసారి జడ్చర్ల అసెంబ్లీ సీటు కూడా కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంమీద రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుల భవిష్యత్తును మే 23న వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిర్దేశించనున్నాయి. -
పది ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీవే
సాక్షి, తిప్పర్తి : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు, దేశ రక్షణకు పాటుపడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. రెండు సార్లు మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, గత ఐదేళ్ల పాలనలో దళితులకు అన్ని విధాలా అన్యాయం చేశారని విమర్శించారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరించిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే.. పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి
సాక్షి, నల్గొండ: ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో గల్లంతైన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్(45), అతని అల్లుడు జునేద్(28)లు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన రాహత్(35)లు ఉన్నారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జునేద్ మృతదేహం కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో మన్యం చెల్కలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌసుద్దీన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. -
ఉత్తమ్ ఓటమి ఖాయం.. నల్లగొండ నుంచి పోటీ అనుకున్నా!
సాక్షి, నల్లగొండ: ఎన్నికల తేదీ సమీపిస్తుండటం.. ప్రచారం గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుండటంతో తెలంగాణ ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లాలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కోదాడ, మిర్యాలగూడ, హుజుర్నగర్, నల్లగొండ తదితర కీలక నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న ఆయన ఈసారి హుజుర్నగర్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు. హుజుర్నగర్లో జరిగిన భారీ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాలు చూస్తే.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తోందన్నారు. సైదిరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత ఒకరోజు మొత్తం హుజూర్‌నగర్‌లో ఉండి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డి మహా కూటమిని పేరిట నాలుగు పార్టీలను వేసుకొని.. గెలుపొంది సీఎం కావాలని కలలు కంటున్నారని, ఆయన కలలు కల్లలేనని పేర్కొన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గాన్ని మరో గజ్వేల్‌లా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ నుంచి పోటీచేద్దామనుకున్నా.. ఈసారి ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేద్దామని అనుకున్నానని, కానీ గజ్వేల్ ప్రజలు గోల చేస్తారని, ఇక్కడ నుంచి పోటీ చేయలేకపోయనని కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన నల్లగొండ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ నుంచి భూపాల్‌రెడ్డి పోటీ చేయడం సంతోషంగా ఉందని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు. నల్లగొండ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని తెలిపారు. -
చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్థులు..!
సాక్షి, నల్లగొండ : ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. బద్ధ శత్రువులైన ఈ ఇద్దరు నేతలు ఎన్నికల వేళ చేతులు కలుపడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలో దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గులాం నబీ ఆజాద్ తదితరులు దుబ్బాక ఇంటికి వెళ్లారు. దుబ్బాకతోపాటు ఆయన అనుచరగణం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరిక అనంతరం నల్గొండ పట్టణంలో మహాకూటమి నేతలు రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బాక నర్సింహారెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని పోటీకి దింపి.. కేసీఆర్ తనను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఏమీకాదని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రటరీ నిరంజన్ రావ్లు ఇద్దరూ నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి!
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని.. కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని.. ఇవి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పగటి కలల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అయితే, కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీసీసీ చీఫ్ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. -
కేసీఆర్‌తో టచ్‌లో ఉత్తమ్.. ఎసరు పెడుతున్న టీ కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ పీసీసీ) చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేతలు పావులు కదుతుపున్నారు. ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు భేటీ అయి.. ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాహుల్-టీ కాంగ్రెస్ నేతల భేటీ ఇలా సాగింది. ‘ఉత్తంకుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నాయకులు ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని సీనియర్ నేతలు రాహుల్‌కు నివేదించారు. ఉత్తమ్ వ్యవహార శైలిపై బాగా లేదని, ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగితే 2019 ఎన్నికల్లో పార్టీకి 15 సీట్లు కూడా దక్కవని సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌ను కాకుండా వేరే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే.. పార్టీ బలోపేతానికి, 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని మాజీమంత్రి డీకే అరుణ రాహుల్‌కు హామీ ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ భేటీలో ఉత్తమ్‌పై పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ‘మై హోమ్స్’ రామేశ్వరరావు ద్వారా సీఎం కేసీఆర్‌తో ఉత్తమ్ సంప్రదింపులు జరుపుతున్నారని రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల విన్న అనంతరం ఈ అంశంపై లోతుగా చర్చించేందుకు మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. త్వరలో టీ-కాంగ్రెస్‌కు కొత్త ఇన్చార్జిని నియమించే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకే వచ్చాం..! న్యూఢిల్లీ : పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తాము అపాయింట్మెంట్ అడిగామని, అందుకోసమే ఆయన తమకు అపాయింట్మెంట్ ఇచ్చారని టీ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్‌తో సమావేశంలో చర్చించామని వారు తెలిపారు. ‘2019లో తెలంగాణలో పార్టీని అదికారంలోకి తీసుకువస్తామని రాహుల్ చెప్పాం. అందుకోసం పనిచేస్తున్నామని వివరిచాం. 2019లో కేంద్రంలో లౌకికవాద పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’ అని నేతలు అన్నారు. తెలంగాణలో పార్టీ నాయకుల్లో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా రాహుల్‌గాంధీని కలిశారని, అందుకే ఆయన తమ వెంట రాలేదని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కమిటీ వేసి ఆ కమిటీతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని రాహుల్‌ను కోరామని, 40 మంది సీనియర్ నేతల పేర్లతో ఒక నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు. ఒక రోజు సమయం కేటాయించి ఒక్కొక్కరితో మాట్లాడాలని రాహుల్‌ను కోరినట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి అంశాలపై రాష్ట్ర సీనియర్ నేతలతో చర్చించాలని, వారి నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. వారం రోజుల్లో రాహుల్ గాంధీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నామని, ముఖ్య నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పామని తెలిపారు. -
‘కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరు రాహుల్‌తో సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఇరువురు ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిలు రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు ఉదంతం సహా కోర్టు తీర్పును రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిపారు. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ చేసిన కృషిని రాహుల్ అభినందించారన్నారు. కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఏస్థాయిలోనైనా పోరాటం ఉధృతం చేయాలని చెప్పారన్నారు. అసలు సభను అగౌర పరిచింది టీఆర్ఎస్ పార్టీ అని.. అడ్డగోలుగా సభను అగౌరపరిచి నడపాలనుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఆధిక్యం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని.. నియంతృత్వ ధోరణి పనికి రాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారి వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రెండురోజుల పాటు బస్ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టేనని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు శుభపరిణామమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్పును గౌరవించాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీతో భేటి అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు మీడియాతో మాట్లాడుతూ.. ‘నెలన్నర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాహుల్ తెలుసుకున్నారు. అన్ని తెలుసుకుని మా ఇద్దరిని అభినందించారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చి ఆయనతో సమావేశమయ్యాం. 45 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీలో రాహుల్ ఇచ్చిన సందేశం మాలో ఉత్సాహాన్ని పెంచింది. కోర్టు తీర్పు స్ఫూర్తిగా అన్ని విషయాల్లో పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామని రాహుల్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అదే విధంగా లాయర్ జంధ్యాల రవిశంకర్‌ను కూడా ఆయన అభినందనలు చెప్పారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలని రాహుల్ సూచించారు. కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు -
రాహుల్‌తో కోమటిరెడ్డి, సంపత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిద్దరితో రాహుల్ సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ...‘అక్రమంగా తమ సభ్యత్వాన్ని రద్దు గురించి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అసెంబ్లీకి, స్పీకర్‌కు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రి సభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఆర్ఎస్ కుతంత్రాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం సమాచారన్ని లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 15 లక్షలమందిని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. కక్ష సాధింపు కోసం సభ్యత్వాలను రద్దు చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకు రావాలనే కేసీఆర్ చేసిన గుణాత్మక మార్పులు ఇవేనా. నీకు పోటీగా వస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తావా?. హైకోర్టు తీర్పును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. సానుకూలంగా స్పందించింది.’ అని తెలిపారు. కోమటిరెడ్డి, సంపత్తో పాటు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కూడా ఈసీని కలిసినవారిలో ఉన్నారు. -
కేసీఆర్ ...చావుకు భయపడేవాడిని కాదు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరలాగా పోలీసులను నమ్ముకొని బతుకుతుంటే...తాను దమ్మున్న గుండెని, ప్రజలను నమ్ముకున్నానని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ....‘నాకు గన్మెన్లను తీసివేసి నన్ను హత్య చేయించాలని చూస్తున్నావా?. నాకు ఏమైనా జరిగితే కేసీఆర్‌తో పాటు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చావుకు భయపడే వ్యక్తిని కాదు. నేను చనిపోతే నా కొడుకు దగ్గరకు వెళతాను అంతే. ఇక బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో కాల్ డేటాలో 26సార్లు మాట్లాడినవారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. నాలాంటి వాళ్లను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నీలాంటి పిరికిపందలాగా ఆస్పత్రిలో పోరాటం చేయలేదు. రోడ్డుమీద నిరాహార దీక్ష చేశాను. కోమాలోకి పోతానని తెలిసి కూడా భయపడకుండా దీక్ష చేశాను. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారు. అకారణంగా మా సభ్యత్వం రద్దు చేశారు. స్వామిగౌడ్‌పై దాడి చేసినందుకు మా సభ్యత్వం రద్దు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు ఇలా ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం జరగలేదు. కానీ కోర్టులో మాత్రం ప్లేట్ ఫిరాయించారు.గతంలో హరీశ్ రావు గవర్నర్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ...అందరినీ పిలిపించి మాట్లాడి.. వారం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనుసరించకుండా నా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం స్వామిగౌడ్‌కు మైక్ తగిలినందుకు కాదు, గవర్నర్ అడ్రస్‌ను అడ్డుకున్నందుకు ...మా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు. నాకున్న నలుగురు గన్మెన్లను తీసివేశారు. పీఏని ఉపసంహరించారు. కావాలనే పాత కేసులను రీ ఓపెన్ చేయించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిసింది.’ అని మండిపడ్డారు. -
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
-
సభ్యులపై వేటు.. కాంగ్రెస్ యాక్షన్‌ప్లాన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్ : నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేల శాసన స్వభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఈ మేరకు దూకుడుగా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ మంగళవారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టనున్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరిట గాంధీభవన్‌లో ఈ ఇద్దరు నేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. వీరి దీక్షకు సంఘీభావంగా సీనియర్ నాయకులంతా పాల్గొననున్నారు. అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేల స్వభ్యత్వం రద్దుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ఈ విషయంలో న్యాయపోరాటం కూడా చేయాలని భావిస్తోంది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసే అవకాశముంది. అదేవిధంగా కోమటిరెడ్డి, సంపత్‌పై చర్యలకు వ్యతిరేకంగా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నిరసన సభలు చేపట్టాలని వ్యూహం సిద్ధంచేస్తోంది. అధిష్టానం నుంచి అనుమతి రాగానే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతంగా నిర్వహించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఆ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వేదికపైకి హెడ్సెట్ విసిరేయడం.. అది తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయం అయింది, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు చెందిన మొత్తం 11 మంది సభ్యులను బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి శాసన మండలిలోనూ ఐదుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. -
కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’ అని అడిగిండు యాదగిరి. ‘ఎవరేసుడేందిరా? బాహుబలి అంటే ప్రభాసే కదా...?’ అన్నడు నర్సింగ్. ‘అరెవారీ... నీకు గింతగూడ జన్రల్ నాలెడ్జ్ లేదురా. మొన్న తెలంగాణ అసెంబ్లీల జానారెడ్డి సారేమన్నడు. కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి ఒస్తడు... పార్టీని గెలిపిస్తడు అని అన్నడు కదా...’ అన్నడు యాదగిరి. ‘అవ్ అవ్... జానారెడ్డి సారు గా మాట అనంగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి అసొంటోళ్లు లేసి జానారెడ్డే మా బాహుబలి అని చెప్పిండ్లు కదా ’ అన్నడు నర్సింగ్. ‘జానారెడ్డి లెక్కల బాహుబలి అంటే రాహుల్ గాంధీ. కోమటిరెడ్డి లెక్కల జానారెడ్డే బాహుబలి. జానారెడ్డి అంటే పడనోళ్లకు మరో లీడర్ బాహుబలి. ఇగ కొంతమంది లీడర్లయితే మాకంటే బాహుబలి ఎవరున్నరు అని మనసుల అనుకున్నరు. మరి వీళ్లల్ల రాజమౌళి ఎవరికి బాహుబలి వేషమిస్తడో ఏందో చూడాలె’ అన్నడు యాదగిరి. ‘మొత్తానికి కాంగ్రెసోళ్లందరు బాహుబలికి బాగనే ప్రచారం చేస్తున్నరు... అసలు కాంగ్రెస్‌ల ఎంతమంది బాహుబలులు ఉన్నరే?’ అని అడిగిండు నర్సింగ్. ‘కాంగ్రెస్‌ల బాహుబలులు ఉన్నారో లేదో తెల్వదుగనీ... కట్టప్పలు మాత్రం మస్తు మందున్నరు’ అన్నడు యాద్గిరి. ‘కాంగ్రెస్‌ల ప్రతి ఒక్కడూ కట్టప్పనే. జానా బాహుబలి అయితే పొన్నాల కట్టప్ప అయితడు... కోమటి రెడ్డి బాహుబలి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టప్ప అయితడు’ అని యాదగిరి చెబుతుంటే... ‘మరి అట్లయితే భళ్లాల దేవుడెవర్రా?’ అని అడిగిండు నర్సింగ్. ‘పిసిసి ప్రెసిడెంట్ కుర్చీల ఎవరు కూసుంటే వాళ్లే భళ్లాల దేవుడు’ అన్నడు యాదగిరి. అబ్బర నాయనా... మస్తు చెప్పినవ్... అన్నడు నర్సింగ్. – ఓరుగల్లు శ్రీ -
లక్ష్మణ రేఖ దాటిన కోమటిరెడ్డి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: గడ్డాలు, మీసాలు పెంచితే పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే బోగస్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ తదితరులు శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లం ఘించేలా మాట్లాడారని, పార్టీ లక్ష్మణ రేఖను దాటి రెండోసారి మాట్లాడారని మల్లు రవి అన్నారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడటం సరైందికాదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ అక్రమాలు: వంశీచంద్ కాగా, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శించారు. -
పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి
కడెం: రాష్ట్రంలో 2019 లో కాంగ్రెస్‌దే అధికారమని, అప్పుడు సీఎం రేసులో తానే ఉంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భవిష్య త్తులో ఎప్పటికైనా తాను సీఎంను కావటం ఖాయమని పేర్కొన్నారు. ఆయన తన స్నేహితులతో కలసి శుక్రవారంరాత్రి నిర్మల్ జిల్లా కడెంకు వచ్చారు. శనివారం హరితా రిసార్ట్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఆంధ్రావారిని తీవ్రంగా విమర్శించిన ప్రభుత్వ పెద్దలు.. నేడు ఆంధ్రా వారికే వివిధ కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను సీఎం ఇష్టారా జ్యంగా దుబారా చేస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మోదీ నిర్ణయం సరికాదని అన్నారు. ఆయన ఉదయం వాకింగ్‌కని ప్రాజెక్టుకు వెళ్లి పరిశీలించారు. వరద గేట్ల నుంచి లీకేజీలు, నీటిమట్టం గది, గేట్లు ఎత్తే గదులను చూసి, వాటిని మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. -
ఏ జిల్లాకు ఎవరెవరు?
డీసీసీ అధ్యక్షుల నియామకంపై టీపీసీసీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ జిల్లా కమిటీలకు సారథుల నియామకాలపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. నవంబర్లోనే డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. టీపీసీసీ కార్యవర్గం గతంలోనే పూర్తయినా జిల్లాల విభజన జరగడంతో మార్పులు చేర్పులు అనివార్యమైనాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎక్కువ మంది అవసరం కావడంతో సమర్థులూ, పార్టీకోసం పూర్తిసమయం పనిచేయగలిగే నాయకులకోసం టీపీసీసీ అన్వేషిస్తోంది. అయితే జిల్లాల విస్తీర్ణం తగ్గిపోవడంతో డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి సీనియర్లు అనాసక్తిగా ఉన్నారు. మరో పక్క అన్ని జిల్లాలకు కొత్తవారిని నియమించడంవల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో పాత జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగాలని టీపీసీసీ కోరింది. ఈ నేపథ్యంలో నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్ అర్బన్), ఒబేదుల్లా కొత్వాల్(మహబూబ్‌నగర్), ఐత సత్యం(ఖమ్మం), తాహెర్‌బిన్ హందాన్ (నిజామాబాద్) తదితరులు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.ఆదిలాబాద్ జిల్లాకు అధ్యక్షునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ డీసీసీ అధ్యక్షునిగా కొనసాగడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. పెద్ద జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన తాను చిన్న జిల్లాకు పనిచేయలేనని టీపీసీసీకి చెప్పినట్టుగా తెలిసింది. ఇక సంగారెడ్డి జిల్లా పగ్గాలను మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)కి అప్పగించడం దాదాపు ఖరారైనట్టుగా టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండలో ఉత్కంఠ నల్లగొండ డీసీసీ అధ్యక్షుని విషయంలో పార్టీ అగ్రనేతల అనుచరుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుచరుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంనేది ఉత్కంఠగా మరింది. కోమటిరెడ్డి సోదరులకు అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వారు ప్రతిపాదిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకు రేగ కాంతారావు పేరు టీపీసీసీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. జనగామ జిల్లాకు పొన్నాల లక్ష్మయ్య ప్రతిపాదించిన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి పేరు వినిపిస్తోంది. మహబూబాబాద్ డీసీసీకి భరత్చంద్రారెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షునిగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తే ఉద్దెమర్రి నర్సింహారెడ్డి ఖరారయ్యే అవకాశముంది. కాగా, జిల్లాలు చిన్నవి కావడం వల్ల పెద్ద నేతల మధ్య వివాదాలు తగ్గే అవకాశముందని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. తీవ్రమైన విభేదాలున్న జిల్లాలు మినహా డీసీసీల పదవులను నవంబర్ నెలాఖరులోగా భర్తీ చేయాలని టీపీసీసీ కృతనిశ్చయంతో ఉందని తెలుస్తోంది. -
వాస్తు పేరుతో కేసీఆర్ వేలకోట్లు వృథా
యాదాద్రి: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందని ఆరోపించారు. వాస్తు పేరుతో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేఖ పాలనపై త్వరలో పోరాటం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలిపారు. -
ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి
నల్లగొండ : ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధంతో పాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి విసిరిన సవాల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దమ్ముంటే గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై గెలవాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిలా పూటకో పార్టీ మారే అలవాటు తనకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే పోటీ చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే పార్టీ మారిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించాలన్నారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2014లో ఓడిపోయి...పైగా తనపై సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. కాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే.. తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా...
నల్లగొండ ఎంపీ గుత్తా సవాల్ నల్లగొండ: ‘నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నేనూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం ఎన్నికలకెళ్దాం. ప్రజలెవర్ని ఆమోదిస్తరో తెలుస్తది’ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. విచక్షణ కోల్పోయి కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదన్నారు. ఏనాడూ నాగలి పట్టని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క... నేడు వైఎస్ వేషధారణలో ట్రాక్టర్‌తో రోడ్ల మీదకు వచ్చి ప్రజల మెప్పు కోసం ఆరాటపడుతున్నారన్నారు. -
‘మండల వ్యవస్థ తెచ్చి ఎన్టీఆర్ ఓడిపోలేదా?’
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందుకే తాము గెలుస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంబరపడిపోతున్నారనీ, అప్పట్లో మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు ఓడిపోయిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇతరపార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరినవారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలవాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే 2019 ఎన్నికల్లో పోటీచేయబోనని కోమటిరెడ్డి సవాల్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కేవలం మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్లు మాత్రమే గెలుస్తారని చెప్పారు -
కేసీఆర్ సర్పంచ్‌గా మాత్రమే గెలుస్తారు
నల్లగొండ టూటౌన్: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోతారని, ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌గా మాత్రం గెలుస్తారని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఎవరు సంతోషంగా లేరన్నారు. వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును గడగడలాడించారని, త్వరలోనే కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే వస్తుందన్నారు. -
రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
-
రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను మాఫీ చేయకుండా వేధిస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రమే ముందుండటం బాధాకరమన్నారు. మాఫీ వడ్డీకే సరిపోతోందని, రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదని చెప్పారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేమని క్షమాపణ కోరిన సీఎం.. రుణమాఫీ చేయనందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం దగ్గర ఉన్న 4,700 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను రుణమాఫీ కోసం విడుదల చేయాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు. -
వాళ్లిద్దరి వల్లే కాంగ్రెస్ సర్వనాశనం: గుత్తా
నల్లగొండ: కాంగ్రెస్ నాయకులకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత జానారెడ్డి పలుమార్లు రాజకీయ సన్యాసం చేస్తానంటేనే తాము పార్టీ మారామని గుత్తా తెలిపారు. మరి బద్ధశత్రువులైన ఉత్తమ్, కోమటిరెడ్డిలు మంచి మిత్రులుగా ఎప్పుడు మారారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లదంతా ధృతరాష్ట్ర కౌగిలేనని గుత్తా వ్యాఖ్యలు చేశారు. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రి : కోమటిరెడ్డి
నల్లగొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ...ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పుణ్యమా అని పైసా ఖర్చులేకుండా గెలిచి..పార్టీ ఫిరాయించారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం కాగానే నాగార్జునసాగర్ ఎండిపోయిందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రిజర్వేషన్ల పేరుతో ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'జానారెడ్డివి కోవర్టు రాజకీయాలు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే పార్టీకి నష్టమని అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఐదు సార్లు ముహుర్తాలు పెట్టుకున్నారని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి కాంట్రాక్టులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అండంతో సంపాదించారని ఆరోపించారు. వీరంతా ఎంత తొందరగా కాంగ్రెస్ పార్టీని వీడితే అంత మంచిదని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాని ఎంపీ పాల్వాయి తెలిపారు. -
ఏం చేద్దాం.., అసలు ఏమైతాంది...?
*జిల్లా కాంగ్రెస్ పరిణామాలపై జానా, రాజగోపాల్ సమాలోచనలు *వెంకట్‌రెడ్డి, గుత్తా వ్యవహారంపై చర్చ *రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా..4 గంటలపాటు సుదీర్ఘ మంతనాలు *ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదన్న ఎమ్మెల్సీ *త్వరలోనే అధినేత్రి సోనియా వద్దకు.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరో మలుపు తిరిగాయి. వారం రోజులుగా పార్టీని కుదిపేస్తున్న అంశాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు కె.జానారెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు మంగళవారం సమాలోచనలు చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ రాజగోపాల్ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ)నేత జానారెడ్డి దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతున్న వార్తలతో పాటు రెండు, మూడు రోజులుగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇద్దరు నేతల జిల్లాలో జరుగుతున్న పరిణామాలతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. అసలు ఏమైతాంది... వాస్తవానికి వారం రోజులుగా జిల్లా కాంగ్రెస్ అట్టుడికిపోతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరే ఎపిసోడ్‌తోపాటు ఉన్నట్టుండి తెరమీదకొచ్చిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు, ఆయనకు షోకాజ్ జారీ అంశాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సుఖేందర్‌రెడ్డి పార్టీ వీడడం దాదాపు ఖాయమేనని, కోమటిరెడ్డి కూడా పార్టీతో అమీతుమీ తేల్చుకునేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల పర్యవసానం ఎలా ఉంటుందన్న దానిపై జానా, రాజగోపాల్‌రెడ్డి చర్చించారు. ఎవరు ఉన్నా... ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఇరువురు నేతలు ఈ భేటిలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడే దిశగా భవిష్యత్‌లో అడుగులు వేయాలని, ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోనూ అందరు నేతలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని.. అందుకోసం తామే పెద్దన్న పాత్ర పోషించాలని ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసుల జారీ గురించి కూడా మాట్లాడిన నేతలు అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే ఢిల్లీకి రాజగోపాల్ జిల్లాతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిసి అన్ని పరిస్థితులను వివరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జానాతో భేటి నుంచే ఢిల్లీ పార్టీ పెద్దలకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, జానాతో భేటి సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పార్టీ మారే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్లేది లేదని, ఎన్ని కష్టాలు వచ్చినా, పార్టీని కాపాడుకుంటానని, పార్టీ కోసమే పనిచేస్తానని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. -
అది సోనియాను తప్పుబట్టినట్లే:జానా
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. పార్టీలో ఉన్నత పదవులు, కార్యవర్గాలు సోనియాఆమోదంతోనే జరుగుతాయని, అటువం టి కార్యవర్గాన్ని దూషించడమంటే ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టడమేనని ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఉత్తమ్‌పై వెంకటరెడ్డి వ్యక్తిగత దూషణలు సమర్థనీయం కాదన్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని... ఈ తరుణంలో పార్టీ పటిష్టతకు సీనియర్ నాయకులు కృషి చేయాల్సి ఉందని సూచించారు. -
ఆ అర్హత టీపీసీసీకి లేదు
- షోకాజ్ నోటీసుపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి - అసలు ఈ అధ్యక్షుడినే నేను గుర్తించడం లేదు - స్వయంగా సోనియా వద్దకు వెళ్లి పరిస్థితులన్నీ తెలియజేస్తా - కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ నాశనం చేస్తున్నాడని విమర్శ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత టీపీసీసీకి లేదని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు తాను పీసీసీ అధ్యక్షుడినే గుర్తించనప్పుడు తనకు పీసీసీ నుంచి షోకాజ్ నోటీసులివ్వడమేమిటని ప్రశ్నించారు. తనను వివరణ అడిగే అర్హత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందన్నారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు ఇవ్వడంపై కోమటిరెడ్డి నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరికీ వివరణ ఇచ్చేది లేదని, ఏదైనా ఉంటే నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి చెప్పుకుంటానని.. రాష్ట్రంలోని పరిస్థితులను ఆమెకు తెలియజేస్తానని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని, ఆయన నాయకత్వంలో తాను పనిచేసే ప్రసక్తే లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అధ్యక్షుడిని తాను చూడలేదని, కుళ్లు కుతంత్రపు రాజకీయాలకు ఉత్తమ్ మారుపేరని విమర్శించారు. కార్యకర్తలతో మాట్లాడడం కూడా ఉత్తమ్‌కు తెలియదని, బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను త్యజించిన మంత్రి పదవిని ఇస్తే తీసుకుని అనుభవించిన తెలంగాణ ద్రోహి ఉత్తమ్ అని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోలీసు దెబ్బలు తిన్న తన లాంటి నేతలు పార్టీలో 100 మంది ఉన్నారని, అందులో ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా బాగుంటుందన్నారు. తాను పార్టీ మారుతానని ఎప్పుడూ చెప్పలేదని, మీడియానే ఆ ప్రచారం చేసిందని పేర్కొన్నారు. -
పొన్నాల కంటే ఉత్తమ్ ఎంపిక వరస్ట్
- సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కాంగ్రెస్ దుస్థితికి ఉత్తమే కారణం - ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదు - కాంగ్రెస్ పరిస్థితిపై సోనియాకు లేఖ రాస్తా.. సాక్షి, హైదరాబాద్: టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పీసీసీ అధ్యక్షునిగా నేనుంటే ఎన్నికల్లో గెలిపించేవాడిని. ఓడిపోతే పార్టీ పదవికి రాజీనామా చేసేవాడిని. నా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా ఓడించడానికి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్తమ్ డబ్బులు ఇచ్చాడు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో సవాల్ విసిరితే తప్పించుకున్న ఉత్తమ్.. పార్టీకి నాయకుడా? మంత్రి కేటీఆర్ చాలెంజ్ విసిరితే తీసుకోకుండా, తప్పించుకోవడానికి మీ నాన్న కేసీఆర్ రావాలని ఉత్తమ్ ఎలా అంటడు? ఇలాగైతే పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం ఏం కావాలి’ అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని అన్నారు. నంది ఎల్లయ్య లాంటి వ్యక్తిని వరంగల్‌కు ఇన్‌చార్జీగా ఎలా వేస్తారని నిలదీశారు. టీఆర్ఎస్ కంచుకోటలో నంది ఎల్లయ్య ఏం చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటా.. పదవులకోసం తాను పాకులాడటం లేదని, రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలు ఇస్తే తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోతున్నదన్నారు. గత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పొన్నాల, ఉత్తమ్ నియామకాలే కారణమన్నారు. పొన్నాల కంటే ఉత్తమ్ ఇంకా వీక్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ బతకదన్నారు. ఉద్యమంతో సంబంధంలేని పొన్నాలకు పదవి ఇవ్వడం తప్పయితే ఉత్తమ్‌ను పెట్టి మరో తప్పు చేశారని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్, పాలేరులో పార్టీ ఓటమికి ఉత్తమే కారణమన్నారు. తెలంగాణ ఇవ్వడంతో సోనియాగాంధీ చాలా గొప్ప సాహసం చేశారని, అయితే తెలంగాణ ఇచ్చిన ఘనతను చెప్పుకోవడంలో రాష్ట్ర సారథులు వైఫల్యం చెందారని ఆరోపించారు. తెలంగాణకోసం కొట్లాడిన వారికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండదన్నారు. పార్టీకి సర్జరీ చేయాలని, కోటేసుకుని నాలుగు మాటలు మాట్లాడినోళ్లకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందే పార్టీని నడిపించే నాయకుడిని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే 15, 20 మంది నాయకులు సీఎం అభ్యర్థులమని పార్టీలో ప్రచారం చేసుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. గాంధీభవన్‌లో ప్రెస్మీట్లు పెడితే ప్రయోజనం లేదని, ప్రజాక్షేత్రంలో కార్యకర్తలను ఉత్తేజం చేయాలని సూచించారు. మార్పులు చేయకుంటే పార్టీ మనుగడ కష్టమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాలపై సోనియాగాంధీకి లేఖరాస్తానని చెప్పారు. సీఎల్పీ నేత పనితీరును ప్రజలే విశ్లేషిస్తారని అన్నారు. -
ఎమ్మెల్యేల జీతాలు పెంచారు..రైతులేం పాపం చేశారు?
♦ కరువుపై చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రశ్న ♦ రైతు పెట్టుబడి 300 శాతం పెరిగింది మద్దతు ధర పదేళ్ల క్రితందే ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లంతోట ఎండిపోతే బాధపడ్డారట ♦ మరి సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని నిలదీత సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచారు. అడిగిన దానికన్నా పీఆర్సీ ఎక్కువిచ్చి సంతృప్తి పరిచారు. చివరికి ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారు.. కానీ రైతులేం పాపం చేశారు. వారు పండించిన పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర పదేళ్ల క్రితం నాటిదే ఇప్పుడూ ఉంది. రైతు పెట్టుబడి మాత్రం 300 శాతం పెరిగింది. అందుకే రైతుకు మద్దతు ధర ఏటా కనీసం 10 శాతం పెంచాలి. రైతు లేకుండా అన్నం దొరకదు. ఆ విషయాన్ని పాలకులు గుర్తించాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో కరువుపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది ప్రతీ ఎండాకాలంలో వచ్చే కరువు కాదు. గతంలో రాంరెడ్డి అనే రైతు 56 బోర్లు వేస్తే ఒక్కదాంట్లో నీళ్లు రాలేదని సీఎం చెప్పారు. కానీ నల్లగొండలో వందలాది మంది రాంరెడ్డిలున్నారు. ముఖ్యమంత్రి అల్లంతోట ఎండిపోతే బాధపడ్డారని పత్రికల్లో చూశా. మరి సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? కరువు ఇప్పుడుంటే తాత్కాలిక చర్యలు చేపట్టకుండా 5 ఏళ్ల తరువాతే తమ బాధ్యత అన్నట్లుగా ప్రవర్తించడం శోచనీయం’ అన్నారు. ‘మాట్లాడితే 60 ఏళ్ల కరువుకు మీరే బాధ్యులు అని కాంగ్రెస్‌ను వేలెత్తి చూపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు ఎవరు కట్టారు. రైతులు ఇప్పటి వరకు వ్యవసాయం చేసుకోలేదా? మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. చివరి సంవత్సరంలో ఎన్నికలే ఉంటాయి. మిగిలింది ఇంకా రెండేళ్లే. ఇంకా 60 ఏళ్ల పాలన, సమైక్యపాలన అంటే ప్రజలు క్షమించరు’ అని వ్యాఖ్యానించారు. కరువు ప్రాంత రైతులకు మధ్యాహ్న భోజనం అందించాలి రాష్ట్రంలో కరువు కరాళనృత్యం చేస్తున్నందున రైతులు, రైతు కూలీలను ఆదుకొనేందుకు గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలి. కరువు మండలాలుగా కేంద్రం 231నే గుర్తించినందున వాటి సంఖ్యను పెంచి, కరువు సాయం అందించేందుకు తోడ్పడాలి. ఖరీఫ్‌కు ముందే ఇన్పుట్ సబ్సిడీని అందించి రైతులకు సాయపడాలి. కరువు ప్రాంత గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. కరెంటు బిల్లులతో పాటు రైతులు, రైతు కూలీలు చెల్లించాల్సిన అన్ని బిల్లులను మాఫీ చేయాలి. రాష్ట్రంలో పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల రైతులకు అండగా నిలవాలి. కరువు సాయంగా రూ. 3,064 కోట్లు కావాలని కేంద్రానికి రాస్తే రూ. 56.03 కోట్లు మాత్రమే మంజూరయింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాలి. - పాయం వెంకటేశ్వర్లు (వైఎస్ఆర్సీపీ) రుణఅర్హత కార్డులు ఇవ్వాలి కరువు నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. గోదావరి, కృష్ణాల నుంచి లిఫ్ట్‌ల ద్వారా నీటిని తీసుకుంటే ఉపయోగం ఉండేది. రైతులతో పాటు పంటకౌలు మీద ఆధారపడ్డ 14లక్షల మంది రైతుకూలీలు కూడా తీవ్రంగా నష్టపోయారు. రైతులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. మిశ్రమ దాణాను పశువులకు అందించే ఏర్పాట్లు చేయాలి. - సున్నం రాజయ్య (సీపీఎం) ఆ విధానమే లోపభూయిష్టం కరువు మండలాలుగా గుర్తించేందుకు సర్కార్ అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఓ రైతు పొలంలో వర్షం పడితే పక్క రైతు పొలంలో ఎండకాసే పరిస్థితుల్లో మండలాలను యూనిట్‌గా తీసుకొని రెయిన్‌గేజ్‌లు ఏర్పాటు చేశారు. మండలం మధ్యలో ఉండే గ్రామంలో రెయిన్‌గేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. - రవీంద్రకుమార్ (సీపీఐ) గత పాలకులదే తప్పు ‘పల్లెపల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన... నా తెలంగాణలోన ’ అని 15 సంవత్సరాల క్రితం పాడినం. అనావృష్టి కొత్తది కాదు. అప్పుడే సమస్యను పరిష్కరించుకుంటే ఇలా మాట్లాడే అవసరం రాకపోను. రాష్ట్రంలో 16 వేల పెద్ద చెరువులు, 50 వేల చిన్న చెరువులు ఉండేవి. ఇప్పుడు 11వేల చెరువులు కనిపించకుండా పోయాయి. - రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్) -
పెండింగ్ ప్రాజెక్టులను మొదట పూర్తిచేయాలి
ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి ♦ నల్లగొండకు మంచినీరు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు సాక్షి,హైదరాబాద్ : రాష్ర్టంలో ఇప్పటికే 60, 70 శాతం నిర్మాణం జరిగిన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తిచేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని సొరంగం పనులు, ఇతర ప్రాజెక్టులు, కల్వకుర్తి, నెట్టంపాడు వంటి ప్రాజెక్టుల పనులు 60 శాతానికి పైగా పూర్తయినందున ముందుగా వాటిని పూర్తిచేయాలని కోరినట్లు చెప్పారు. ఉదయసముద్రం ప్రాజెక్టు నుంచి పూణే కాంట్రాక్టర్లు వైదొలగుతున్నట్లు తెలిసి ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు ఫోన్ చేయగా, శనివారం నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష ఉందని చెప్పారన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను సంప్రదించి క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని విజ్ఞప్తిచేసినట్లు ఆయన వెల్లడించారు. 2019లో మాదే అధికారం... శనివారం అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడిన నేపథ్యంలో పానగల్లు నుంచి నీటిని అందించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి దానిపై అధికారులను ఆదేశించారని తెలిపారు. నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇచ్చినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్లో పలువురు నాయకులు చేరుతున్నట్లు, ఆ పార్టీ ప్రముఖులను కాంగ్రెస్నాయకులు కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు, కిందిస్థాయిలో ఏవో పనుల కోసం అధికారపార్టీలో చేరుతుంటారని కోమటిరెడ్డి బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. -
పనుల కోసమే సీఎంను కలిశా..
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌కు నాయకత్వ కొరత ఏమీలేదని ఆపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒకరు పార్టీని వీడితే వందమంది నేతలు తయారవుతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని, అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పనులు జరుగుతాయనే నాయకులు.. అధికారపార్టీలో చేరుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సాగునీటి సదస్సులో పాల్గొన్నానని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ను కోరినట్లు చెప్పారు. శ్రీశైలం సొరంగ మార్గం, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి పూర్తిగా నిధులు కేటాయించాలని కోరామన్నారు. అంతేకానీ తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎంపీ సోదరుడు
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీలో వలసలు నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మదర్ డైయిరీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. గుత్తా జితేందర్ రెడ్డితో పాటు పలువురు మదర్ డైయిరీ డైరెక్టర్లు కూడా పార్టీలో చేరారు. వారందరికీ కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు డీసీసీబీ ఛైర్మన్ పాండురంగారావుతో పాటు ఇతర ముఖ్యనేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరంతా ఈనెల 8వ తేదీన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాగా సమావేశం అనంతరం తమ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యమంలో ఉత్తమ్ ఎక్కడ?: కోమటిరెడ్డి
హైదరాబాద్: ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న మా ఇంటికి వచ్చి కలసి పనిచేద్దామన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన సందర్భం లోనూ, పలు పోరాటాల సందర్భంలోనూ కలసి రాకుండా ఇప్పుడు కలసి పనిచేద్దామంటే ఎలా? ఉద్యమంలో ఉత్తమ్ ఎక్కడున్నారు? ఎవరి పని వారు చేసుకుందామని చెప్పా’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. -
తెలంగాణవాదులకు ఇదేనా గౌరవం?
మైకు ఇవ్వక పోవడంపై కోమటిరెడ్డి నిరసన పదవికి రాజీనామా చేస్తా.. సభపై అలిగితే ఎలా అని సీఎం అనునయింపు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొద్ది సేపు హల్ చల్ చేశారు. గురువారం అసెంబ్లీలో కొత్త పారిశ్రామిక విధానంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న తరుణంలో, తన కు ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, స్పీకర్ స్థానంలోఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని కోరారు. ఆయన రెండు సార్లు అభ్యర్థించినా పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఇస్తామంటూ డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన విసురుగా బయటకు వచ్చేశారు. ‘ తెలంగాణ కోసం మేమూ పోరాడాం. నా మంత్రి పదవినే వదులుకున్నా. తెలంగాణ వాదులకు సభలో ఇచ్చే గౌరవం ఇదేనా ’? అంటూ ఆయన లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హడావుడిగా బయటకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు రాను, రేపు రాను, ఎల్లుండి రాను. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించడంతో, సీఎం రమ్మంటున్నారంటూ బాలరాజు మరీమరీ చెప్పడంతో తిరిగి సభలోకి వెళ్లారు. కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయినా తనకు మైక్ ఇవ్వక పోవడంపై నిరసన తెలిపారు. దీంతో సీఎం సమాధానం చెబుతూ ‘ తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. సభపై అలిగితే ఎలా’? అని వ్యాఖ్యానించంగా, తాను సభపై అలగలేదని, స్పీకర్‌పై అలిగానని కోమటిరెడ్డి ప్రతిస్పందించారు. ఆతర్వాత వెంటనే సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి సభనుంచి బయటకు వచ్చి ఇదే విషయంపై వాదించారు. ‘నన్ను సభకు రమ్మని ఇబ్బంది పెట్టొద్దు. రేపే రాజీ నామా చేస్తా’ అంటూ పేర్కొనడంతో జానారెడ్డి, కోమటిరెడ్డిని బుజ్జగించారు. ‘మాట్లాడడానికి అవకాశం ఇమ్మని నీ పేరునే రాసిస్తా’ అంటూ అనునయించారు. -
చంద్రబాబు వల్లే కరెంటు సమస్య
మాజీ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత విద్యుత్ సమస్యకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని నల్లగొండ ఎమ్మె ల్యే, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యుత్ శాఖను తనకు అప్పగిస్తే సమస్య లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి కరెంట్ ఉండి కూడా ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోందని విమర్శించారు. మంగళవారం కోమటిరెడ్డి సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్-విజయవాడ రహదారిలో మెడికల్ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వనరులు ఉన్నా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టకపోవడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. పొన్నాల లక్ష్మ య్య తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నిం చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 4 నెలలే అయిందని, అప్పుడే ఆయనపై విమర్శలు చేసే ముందు గత 60 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీలు ఏంచేశాయనేదే తాను మాట్లాడుతున్నానని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే జరిపి మళ్లీ రేషన్‌కార్డుల కోసం వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని చెప్పారు. పార్టీ మారుతాననే ఊహాగానాలు తనపై ఎప్పుడూ ఉంటాయని తేలిగ్గా తీసేశారు. -
సోనియాను విస్మరించిన టీపీసీసీ నేతలు
నల్లగొండ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీని టీపీసీసీ నాయకత్వం విస్మరించిందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారని, అయితే ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చిన సోనియా కటౌట్లు నగరంలో ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పనితీరుకు ఇది నిదర్శమని విమర్శించారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తులు పార్టీలో ఉన్నంత కాలం పరిస్థితి ఇదే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో టీఆర్ఎస్కు తమ వంతు సహకారం అందిస్తామని, అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. -
పోలింగ్ సరళిపై కోమటిరెడ్డి హర్షం
నల్గొండ : మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగిన ఆయన పోలింగ్ సరళిపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కాగా జిల్లా కలెక్టర్ చిరంజీవులు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.