
సాక్షి, నల్లగొండ : ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. బద్ధ శత్రువులైన ఈ ఇద్దరు నేతలు ఎన్నికల వేళ చేతులు కలుపడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలో దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గులాం నబీ ఆజాద్ తదితరులు దుబ్బాక ఇంటికి వెళ్లారు. దుబ్బాకతోపాటు ఆయన అనుచరగణం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది.
చేరిక అనంతరం నల్గొండ పట్టణంలో మహాకూటమి నేతలు రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బాక నర్సింహారెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని పోటీకి దింపి.. కేసీఆర్ తనను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఏమీకాదని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment