శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు మాది అంటే.. లేదు మాదే అంటున్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా..‘గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్‌సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో.. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. అలాగే, సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. అయితే, కశ్మీర్‌లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment