gulam nabi azad
-
‘ఆజాద్‌కు అంత సీన్ లేదు.. కశ్మీర్లో విజయం మాదే’
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపు మాది అంటే.. లేదు మాదే అంటున్నారు. ఇక, తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా..‘గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో.. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. అలాగే, సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు. అయితే, కశ్మీర్లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
గులాంనబీ రాజకీయ అస్త్రసన్యాసం
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్ రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆజాద్ బుధవారం(ఏప్రిల్17) ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) తరపున జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనన్నట్లు ఆజాద్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. అనంత్‌నాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున మహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అల్తాఫ్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5 వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
jammu: అనంత్‌నాగ్ నుంచి బరిలో గులాంనబీ
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్(డీపీఏపీ) మంగళవారం(ఏప్రిల్ 2) ఒక ప్రకటనలో తెలిపింది. డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ పోటీపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్(ట్విటర్)లో ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ ఉదంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జితేంద్రసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2022లో డీపీఏపీ పార్టీని స్థాపించారు. ఇదీ చదవండి.. బారామతిలో వదిన మరదళ్ల సమరం -
Article 370: సుప్రీం కోర్టు తీర్పుపై నిరుత్సాహ పడం: మెహబూబా ముఫ్తీ
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, ఆ పార్టీ నేతలు స్వాగతించగా కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. సుప్రీం కొర్టు తీర్పుకు నిరుత్సాహ పడటం లేదు. ఈ విషయంలో జమ్ము కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో తాము ఓడిపోనట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి. #WATCH | On SC verdict on Art 370 in J&K, PDP chief Mehbooba Mufti says, "...We should not be disheartened... J&K has seen several ups and downs... SC's verdict stating Article 370 was a temporary provision, is not our defeat, but the defeat of the idea of India... I want to say… pic.twitter.com/moTm2HPzpO — ANI (@ANI) December 11, 2023 ప్రస్తుతం జమ్ము కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరవద్దని ఆదేశించారు. మేము అంతా గృహ నిర్భందంలో ఉన్నాం. ఏళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయం యుద్ధం ఇది. మేము ఇక్కడి నుంచి వెళ్లము. మీమంతా ఏకమై.. కలిసిపోరాడుతాం’అని తెలిపారు. డొమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... సుప్రీకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైందని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. On SC verdict on Article 370, National Conference leader Omar Abdullah says, "We had knocked on the doors of the Supreme Court because we were hoping for justice...We respect the Supreme Court...Our attempts will not end here. Will we approach the courts again? We will decide… pic.twitter.com/eWWbPhY9Pp — ANI (@ANI) December 11, 2023 అదే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘న్యాయం కోసం ఆశించి సుప్రీంకోర్టు ఆశ్రయించాం. మాకు న్యాయం దక్కుతుందని ఆశించాం. అయితే సుప్రీం కోర్టుపై మాకు గౌరవం ఉంది. మా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోతాయా? మళ్లీ కోర్టులను ఆశ్రయిస్తామా? అనే దానిపై న్యాయ సంప్రదింపుల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
కొంపదీసి అనుభవంతో చెప్పట్లేదుగా సార్..!
కొంపదీసి అనుభవంతో చెప్పట్లేదుగా సార్..! -
కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది. ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్‌లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు. హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది. హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది -
వారితో చేతులు కలపడం దండగ..
శ్రీనగర్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడానికి విపక్షాలు ఏకమవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు మేరకు జూన్ 23న విపక్షాలన్నీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఈ కూటమి వలన ఏ ప్రయోజనం లేదని వ్యాఖ్యలు చేశారు. తమకు ఏమాత్రం లాభం లేకున్నా ఏ విపక్షమైన ఎందుకు మద్దతిస్తుందని అన్నారు. ఏమి తీసుకుంటారు? ఏమి ఇస్తారు? శ్రీనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత పొత్తుల వలన ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో కానీ ఎన్నికలకు ముందు ఈ పొత్తుల వలన ఏ ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి బెంగాల్ రాష్ట్రాన్నే తీసుకోండి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గానీ సిపిఐ(ఎం) పార్టీకి గానీ ఒక్క సీట్ కూడా లేదు. అలాంటప్పుడు వారు బెంగాల్లో ఏమి ఆశిస్తారు.. బదులుగా మమతా బెనర్జీకి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏమివ్వగలరు. అబ్బే పనవ్వదు.. వీరంతా అధికార బీజేపీ పార్టీని ఓడించడానికి మాత్రమే సంకల్పించుకుని ఏకమైతే పర్వాలేదు గానీ పరస్పర ప్రయోజనాల కోసం కలిస్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేను గతంలోనే చెప్పాను కాంగ్రెస్ పార్టీ రాష్టాల్లో కంటే కేంద్రంలోనే ఎక్కువ నష్టపోయిందని. లాభమో నష్టమో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ పుంజుకుంటోంది. ఈ ఘనత ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది. ఇది కూడా చదవండి: దేశంలో ముందస్తు ఎన్నికలు రావచ్చు: సీఎం నితీశ్ -
రాహుల్ గాంధీకి వాళ్లతో లింకులు.. ఆజాద్ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. రాహుల్ విదేశాలకు వెళ్లి కలవకూడని వ్యాపారవేత్తలను కలుస్తారని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. దీన్నే అవకాశంగా అందిపుచ్చుకున్న బీజేపీ.. రాహుల్ విదేశాల్లో కలిసిన ఆ వ్యాపారవేత్తలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. వాళ్లను ఎందుకో కలిశారో కూడా వివరణ ఇవ్వాలని నిలదీసింది. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తిన ఆయన మోదీ, అదానీ విమానంలో కలిసి ప్రయాణించిన ఫొటోను కూడా సభలో ప్రదర్శించారు. అయితే రెండు రోజుల క్రితం అదానీ కంపెనీలకు చెందిన రూ.20వేల కోట్ల బినామీ డబ్బు ఎవరిదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజాన్ని దాస్తూ బీజేపీ ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ పేరులోని అక్షరాలతో కాంగ్రెస్ మాజీ నాయకులు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్లు కలిసేలా ఫొటో పోస్టు చేశారు. ఇందులో గులాం నబీ ఆజాద్ పేరుతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత బిశ్వ శర్మ, అనిల్ ఆంటోని పేర్లు ఉన్నాయి. सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं! सवाल वही है - अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023 దీనిపైనే స్పందిస్తూ ఆజాద్ రాహుల్‌పై ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ అభిమానమే అని, అందుకే ఇంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటానికి మాత్రం రాహుల్ గాంధీనే ప్రధాన కారణమని ఆజాద్ మరోసారి తేల్చిచెప్పారు. …their entire family (the Gandhis) have all along had association with businessmen, including him (Rahul Gandhi). He (Rahul) goes abroad and meets undesirable businessmen… - Ghulam Nabi Azad Rahul Gandhi must explain who are these businessmen he meets and for what purpose? pic.twitter.com/2juk0GlvhW — BJP (@BJP4India) April 9, 2023 కాగా.. అదానీ పేరులోని అక్షరంతో తన పేరును చూపడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. అదానీతో సంబంధం లేని తనను ఈ వ్యవహారంలోకి లాగినందుకు రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
ఆజాద్ పార్టీకి షాక్.. తిరిగి కాంగ్రెస్ గూటికి 17 మంది కశ్మీర్ నేతలు..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్‌తో కలిసివెళ్లిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వీరంతా సొంతగూటికి చేరుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లోకి ప్రవేశించడానికి రెండు వారాల ముందు వీరంతా మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిస్తోంది. సొంతగూటికి వచ్చిన 17 మంది కాంగ్రెస్ నాయకుల్లో కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ చీఫ్ పీర్జాద మహమ్మద్ సయీద్ వంటి ముఖ్య నాయకులున్నారు. వీరంతా రెండు నెలల క్రితం గులాం నబీ ఆజాద్‌తో కలిసి కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. ఆయన స్థాపించిన కొత్త పార్టీలో చేరారు. అయితే పార్టీలో తమకు విలువ ఇవ్వడం లేదని, ఆయనను నమ్మి మోసపోయామని కొద్ది రోజుల క్రితమే వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ పార్టీ నుంచి కొందరు సస్పెండ్ కూడా అయ్యారు. శుక్రవారం మొత్తం 19 మంది కశ్మీర్ నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. అయితే ఇద్దరు కశ్మీర్ నుంచి ఢిల్లీ రాలేకపోయారు. గులాం నబీ ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారా? అని కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించగా.. తనకు ఆయన గురించి ఏమీ తెలియదని చెప్పారు. కాంగ్రెస్ సిద్దాంతాలను నమ్మేవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చని స్పష్టం చేశారు. చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్.. -
పొలిటికల్ ట్విస్ట్..‘అక్కడ బీజేపీని కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదు’
Ghulam Nabi Azad.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు.. ఈసారి గుజరాత్లో పాగావేసేందు రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ స్పందించారు. పార్టీని వీడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాకిచ్చారు. కాగా, జమ్మూ కాశ్మీర్లో మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పటికీ లౌకికత్వం అనే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కేవలం పార్టీ సిస్టమ్ బలహీన పడుతున్నదన్న కారణంతోనే తాను బయటికి వచ్చానని అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్లే బీజేపీని ఓడించవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అని అన్నారు. పంజాబ్ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. కానీ.. ఆప్ సర్కార్ పంజాబ్‌ను సమర్థంగా పాలించడంలో విఫలమైందన్నారు. పంజాబ్ ప్రజలు మరోసారి ఆప్‌ను గెలిపించరని జోస్యం చెప్పారు. ఇక, ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. J&K | Although I have separated from Congress, I wasn't against their policy of secularism. It was only due to the party's system getting weakened. I would still want that Congress performs well in Gujarat & HP Assembly polls. AAP isn't capable to do so: Ghulam Nabi Azad pic.twitter.com/yjzRNIffwt — ANI (@ANI) November 6, 2022 -
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును ఆయన సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉర్దూ, సంస్కృతంలో దాదాపు 1500 పేర్లు పరిశీలించామని చెప్పారు. హిందూ, ఉర్దూ రెండూ కలిపితే హిందూస్థానీ అన్నారు. ప్రజాస్వామ్యం, శాంతి, స్వాత్రంత్ర్యాన్ని ప్రతిబించేలా పార్టీ పేరు ఉండాలనుకున్నామని ఆజాద్ చెప్పారు. అందుకే చివరగా 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ పార్టీ జెండా నిలువుగా మూడు రంగుల్లో ఉంది. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో తీర్చిదిద్దారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్ముకశ్మీర్‌కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఆజాద్ ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధానికి తెగదెంపులు చేసుకొని గత నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు ఆజాద్. హస్తం పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల ఆనవాయితీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు వైద్యుడు చికిత్స అందిచాల్సింది పోయి కాంపౌడర్లు చికిత్స చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్ -
గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు
శ్రీనగర్: కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిషన్ కశ్మీర్ కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆజాద్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ముష్కర సంస్థ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచురించడం ఆందోళన కల్గిస్తోంది. పోస్టర్లో ఆజాద్‌ను రాజకీయ ఊసరవెల్లి అని ఆరోపించారు ఉగ్రవాదులు. ఆయన ద్రోహి అని విధేయత అంటే ఏంటో తెలియదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికతోనే కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తన గార్డులను మార్చడానికి ముందు ఆజాద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు ఆజాద్. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో సొంత రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. తనకు ఆ ఆలోచన లేదని ఆజాద్ చెప్పారు. చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ -
కాంగ్రెస్ పార్టీకి నా రక్తం ధారపోశా: గులాం నబీ ఆజాద్
సాక్షి, జమ్మూ: కాంగ్రెస్ పార్టీకి తన రక్తం ధారపోస్తే పార్టీ తనను విస్మరించిందని ఆరోపించారు జమ్ముకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత తొలిసారి జమ్మూలోని సైనిక్ ఫామ్స్‌లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మా కృషితో కాంగ్రెస్ ఏర్పడిందిగానీ.. ట్వీట్స్, ఎస్ఎంఎస్లతో కాదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని మేము రక్తం ధారపోసి నిర్మించాం. కానీ, కంప్యూటర్లు, ట్విట్టర్ ద్వారా ఏర్పాటు కాలేదు. కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వారి పరిధి కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితం. దాంతోనే కాంగ్రెస్ ప్రస్తుతం అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన వారు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారు. వారు డీజీపీ, కమిషనర్లకు కాల్ చేసి గంటల్లోనే బయటకు వస్తున్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్ పుంజుకోలేకపోతోంది.’ అని ఆరోపించారు ఆజాద్. సొంత పార్టీపై క్లారిటీ.. సొంతపార్టీ ఏర్పాటుపై పలు విషయాలు వెల్లడించారు ఆజాద్. తమ పార్టీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, భూమి హక్కులు, స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని తెలిపారు. ఇటీవల గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్‌లో రాజీనామాలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ నేతలు తారా చంద్, అబ్దుల్ మజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ,ఘరు రామ్, బల్వాన్ సింగ్ వంటి ఆజాద్ పక్షాన నిలిచారు. శనివారం పార్టీ నేత అశోక్ శర్మ కూడా తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీకి పంపారు. ఆయన కూడా గులాం నబీ ఆజాద్ పార్టీలో చేరనున్నారు. #WATCH | J&K: "People from Congress now go to jail in buses, they call DGP, Commissioners, get their name written & leave within an hour. That is the reason Congress has been unable to grow," says Ghulam Nabi Azad at a public meeting in Jammu pic.twitter.com/SVjxTVUeQ4 — ANI (@ANI) September 4, 2022 ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా 5వేల మంది కార్యకర్తల రాజీనామా!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. తాజాగా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా సుమారు 5000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు గురువారమే తమ రాజీనామాలను అందించనున్నట్లు తెలిసింది. ఆజాద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు అధిష్టానానికి తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశంగా స్పష్టమవుతోంది. కొద్ది నెలల్లోనే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మరోవైపు.. జమ్ముకశ్మీర్ ఎన్నికలు సైతం 2023లో జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల రాజీనామా ఒక్కటే కాదు.. ఇటీవల సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, ఆజాద్‌ల భేటీ హరియాణా కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఆజాద్‌తో భేటీ అయిన వారిలో ఆనంద్ శర్మ, భూపింద్ సింగ్ హుడా, పృథ్విరాజ్ చావన్‌లు ఉన్నారు. దీంతో గాంధీ కుటుంబానికి, పార్టీకి విదేయతపై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: కశ్మీర్ లోయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఆజాద్ వెంటే కార్యకర్తలంతా! -
ఆజాద్ దెబ్బకు కాంగ్రెస్ ఖాళీ!
శ్రీనగర్: కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన నిష్క్రమణతో జమ్ముకశ్మీర్‌లో హస్తం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అక్కడ ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. ఆజాద్ స్థాపించబోయే పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు. కాగా.. మంగళవారం ఏకంగా 100 మంది కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ కాంగ్రెస్‌లో దాదాపు 95శాతం మంది కార్యకర్తలు తనవెంటే వస్తారని ఆజాద్ చెబుతున్నారు. పంచాయతీ, డీసీసీ సభ్యులు కూడా తన కొత్త పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత చాలా మంది కశ్మీర్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతామని బహిరంగంగా ప్రకటించారు. చెత్తతో సమానం మరోవైపు కశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికార్ రసూల్ ఆజాద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆజాద్‌కు కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన వారు తమకు చెత్తతో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాయకులు, కొత్త విజన్‌తో పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తామన్నారు. బీజేపీతో కలవను రాజీనామా అనంతరం తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ఆజాద్ ప్రకటించారు. తాను బీజీపీతో కలిసే అవకాశమే లేదన్నారు. కశ్మీర్‌పై కనీస అవగాహన ఉన్నవారిని ఎవర్ని అడిగినా.. బీజేపీతో తాను కలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెబుతారని పేర్కొన్నారు. ఎవరి ఓటు బ్యాంకు వాళ్లకు ఉందని వివరించారు. చదవండి: అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల జాగారం.. రాత్రంతా నిరసనలే.. -
రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ..
న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. తను అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం తొలిసారి ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23 గ్రూప్‌లో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తనతో సమస్య ఏర్పడిందని అన్నారు. తాను మోదీ ఏజెంట్ కాదని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. లోక్‌సభలో మోదీని కౌగిలించుకున్నది రాహులా? నేనా అని ప్రశ్నించారు. మోదీ తన గురించి రాజ్యసభలో చెప్పలేదని, కశ్మీర్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారని ప్రస్తావించారు. కాగా అయిదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన అగ్రనేత గులాం నబీ ఆజాద్ చివరికి ఆపార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ రెబల్‌గా మారారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరిగా పేరొందిన ఆజాద్.. శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు? రాజీనామా అనంతరం.. రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పతనానికి రాహుల్ గాంధే కారణమంటూ 5 పేజీల లేఖను సమర్పించాడు. రాహుల్ గాంధీ తీరు వల్లే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీని నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలో చేరనని, సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక కొత్త పార్టీని ప్రారంభించిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలను ఆజాద్ ఖండించారు. -
చేరుతారట కానీ! మళ్లీ పార్టీ వీడరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నార్సార్!
చేరుతారట కానీ! మళ్లీ పార్టీ వీడరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నార్సార్! -
అశోక్ గెహ్లోత్ (రాజస్థాన్ సీఎం) రాయని డైరీ
రాహుల్‌ని నిందిస్తూ సోనియాజీకి గులామ్ నబీ ఆజాద్ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖ నాకెంతో ఆవేదనను కలిగించింది. ఒక తల్లికి ఆయన ఏం చెప్పదలచుకున్నారు? ‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చేసిందేమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పించిన పద్మభూషణ్‌ని రెండు చేతులతో అపురూపంగా స్వీకరించడమేనా! అవార్డు కోసం ఆయన పట్టిన చేతులు ఎక్కడివి? కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినవే కదా. కాంగ్రెస్ లేనిదే తను లేనన్న సంగతిని మరిచి, కాంగ్రెస్‌కు ఎవరూ లేకుండా పోతున్నప్పుడు ప్రధాన ద్వారం వద్ద తను కాపలా ఉండి, కాంగ్రెస్‌ని కాయాల్సింది పోయి, ‘నేనూ వెళ్లిపోతున్నాను – ఇట్లు ఆజాద్’ అని ఉత్తరం రాసి వెళ్లిపోతారా?! రాహుల్ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఆరోపిస్తున్న ఆజాద్.. తనెందుకు కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా రాహుల్‌లోని ‘అపరిపక్వత’ను పట్టించుకుంటున్నారు?! తన పరిపక్వతను ప్రదర్శించుకోడానికా? ‘‘మేడమ్‌జీ, నేనుంటాను కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా..’’ అని భరోసాగా పగ్గాలెందుకు అడిగి తీసుకోలేకపోయారు? ఇస్తే తీసుకుందాం అని చూస్తున్నవాళ్లా, ఇస్తున్నా తీసుకోడానికి ఆసక్తి చూపనివాళ్లా .. ఎవరు అసమర్థులు? తల్లి మెడికల్ చెకప్ కోసం ఆ కుటుంబం దేశం దాటి వెళ్లిన సమయం చూసి, తనిక్కడ గడప దాటి కాంగ్రెస్ కుటుంబ గౌరవాన్ని బయటపడేశారు ఆజాద్! ఆ గౌరవం తిరిగి నిలబడాలంటే రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ అవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. వట్టి మార్గం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వాళ్లందరికీ గట్టి సమాధానం కూడా. వెళ్లినవాళ్లు హూందాగా ఒక్కరైనా వెళ్లారా! రాహుల్‌పై ఒక రాయి విసిరే వెళ్లారు. పార్టీని బతికించుకుందామని అనుకున్నవాళ్లు పార్టీలో ఉండి, పార్టీతో పోరాడతారు. పార్టీలో తమకు బతుకు లేదనుకున్నవాళ్లే ఇలా గులామ్ నబీ ఆజాద్‌లు, జైవీర్ షేర్గిల్లు, కపిల్ సిబాల్‌లు, ఆశ్వినీ కుమార్‌లు, ఆర్పీయన్ సింగ్‌లు, సునీల్ జాఖడ్‌లు, జ్యోతిరాదిత్య సింథియాలు అవుతారు. ఈ రాళ్లన్నిటికీ తిరుగులేని జవాబు.. రాహుల్ బాబు. రాహుల్‌కి ఫోన్ చేశాను. న్యూయార్క్‌లో స్టే చేసినట్లున్నారు. ‘‘మేడమ్ ఎలా ఉన్నారు రాహుల్?’’ అని అడిగాను. ‘‘ఇంకెలా ఉంటారు అశోక్‌జీ. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు మీరు అంగీకరించి ఉండాల్సింది అని మమ్మీ ఇంతక్రితం కూడా అన్నారు. ఇప్పుడే చెకప్ కోసం లోపలికి వెళ్లారు’’ అన్నారు రాహుల్. ‘‘గాంధీలు కాకుండా వేరొకరు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఉండటం దేశానికి కలిసిరాలేదు రాహుల్‌బాబూ. ఇండియా తిరిగి రాగానే మీరు మీ సహజమైన కృతనిశ్చయం ప్రతిఫలించే చిరునవ్వుతో పార్టీ బాధ్యతలు స్వీకరించాలి’’ అని అభ్యర్థించాను. రాహుల్ పెద్దగా నవ్వారు. ‘‘ఏంటి రాహుల్ నవ్వుతున్నారు?’’ అన్నాను. ‘‘నా సహజమైన కృతనిశ్చయం దేనికి సంబంధించినదో తెలిసుండి కూడా అందుకు పూర్తి విరుద్ధమైన ప్రతిఫలనాన్ని మీరు నాలో ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటే నవ్వొచ్చింది అశోక్‌జీ..’’ అన్నారు! ఆ మాటకు ముగ్ధుడినైపోయాన్నేను. అంత క్లారిటీని ఇంతవరకు నేను ఏ కాంగ్రెస్ నాయకుడిలోనూ చూళ్లేదు! పార్టీ అయోమయంలో ఉండొచ్చు. రాహుల్ స్పష్టంగానే ఉన్నారు. తమకేం కావాలో పైకి చెప్పని గులామ్ నబీ ఆజాద్ వంటి వాళ్ల కన్నా, తనకేం వద్దో తెగేసి చెబుతూ వస్తున్న రాహుల్బాబే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల నాయకుడని నాకనిపించింది. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) -
కాంగ్రెస్ మునిగిపోతున్న ఓడ.. అందుకే వాళ్లంతా బయటకు
ముంబై: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడ అని అన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పఢ్నవీస్. ఈ ఓడ ఇక పైకి రాదని తెలిసిన వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని పేర్కొన్నారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతూ గులాం నబీ ఆజాద్ సరైన అంశాలనే లేవనెత్తారని ఫడ్నవీస్ అన్నారు. అయితే అవన్నీ ఆ పార్టీ అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అందుకే వాటిపై స్పందించాలనుకోవట్లేదని చెప్పారు. మరోవైవు మరాఠీ సంస్థ సంభాజీ బ్రిగేడ్‌తో శివసేన జట్టుకట్టిన విషయంపైనా ఫడ్నవీస్ స్పందించారు. ఒకరి పతనానికి సమయం ఆసన్నమైనప్పుడు తెలివిగా ఆలోచించలేరని వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్ -
మాజీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆజాద్ రాజీనామా అందుకేనా?
Ghulam Nabi Azad.. కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్.. అందరికీ షాకిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాస్తూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి పరిణితి లేకపోవడంతో ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కాగా, ఆజాద్ రాజీనామా తర్వాత.. అనూహ్యంగా ఆయనకు ఇతర పార్టీల నేతలు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అమిన్ భట్.. గులామ్ నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై తాము చర్చించామని, తాము బీజేపీకి బీ టీం కాదని భట్ స్పష్టం చేశారు. అనంతరం.. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని అమిన్ భట్ కామెంట్స్ చేశారు. దీంతో, అమిన్ భట్ కామెంట్స్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధిక ప్రాముఖ్యతనిచ్చింది. అందులో భాగంగానే పద్మభూషణ్‌తో సత్కరించింది. దీంతో, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆజాద్.. బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. ఈ క్రమంలో బీజేపీలో చేరికపై ఆజాద్ స్పందిస్తూ.. తాను బీజేపీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ స్పష్టం చేశారు. #JammuandKashmir's former Youth Congress president, Amin Bhatt, met #GhulamNabiAzad and said that he will become the next Chief Minister of J&K. (@Sreya_Chattrjee)https://t.co/bGHLcRKcwM — IndiaToday (@IndiaToday) August 27, 2022 ఇది కూడా చదవండి: జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు ఎవరిచ్చారో తెలియదు.. లిస్ట్‌లో కాంగ్రెస్ టాప్! -
ఆజాద్ నిష్క్రమణ చెప్పేదేమిటి?
ఎన్నికల్లో ఓటమి పొందినప్పుడూ, జీ–23 నేతలు లేఖలు రాసినప్పుడూ మాత్రమే ఉనికి చాటుకునే కాంగ్రెస్ ఈమధ్యకాలంలో నేతలు పార్టీనుంచి తప్పుకున్నప్పుడు సైతం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నిష్క్రమించారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రులు కపిల్ సిబల్, అశ్వినీకుమార్ లతోపాటు జైవీర్ షేర్గిల్, హార్దిక్ పటేల్, సునీల్ జాఖడ్లున్నారు. మరో నేత ఆనంద్ శర్మ పార్టీ నుంచి తప్పుకోనంటూనే అధినేతలపై విమర్శలు చేశారు. హిమాచల్ ప్రచార సారథ్యం బాధ్యతలు తీసుకోదల్చుకోలేదని ప్రకటించారు. పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపైనా, ఆయన్ను పల్లెత్తు మాట అనని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా ఆజాద్ పోతూ పోతూ పదునైన విమర్శలే చేశారు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అవన్నీ గత పది పన్నెండేళ్లుగా పార్టీని వీడి పోతున్నవారంతా చెబుతున్నవే. వానాకాలం వచ్చిందంటే జనావాస ప్రాంతాల్లో శిథిల భవంతు లపై స్థానిక సంస్థల అధికారులు ఆరా తీస్తారు. అక్కడ ఎవరైనా నివసిస్తుంటే ఖాళీ చేయిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ అలాంటి శిథిలావస్థలోనే ఉంది. అందులో ఉండటం రాజకీయంగా ముప్పు కలిగిస్తుందన్న భయంతో కొందరు నిష్క్రమిస్తుంటే... వేరేచోట అవకాశం దొరక్క తప్పనిసరై ఉండి పోతున్నవారు మరికొందరు. నిష్క్రమిస్తున్నవారు అధికార వ్యామోహంతోనే ఆ పని చేస్తున్నారని రాహుల్, సోనియా విధేయులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. జనాగ్రహం సెగ తగిలి అధికారానికి దూరం కావటం పార్టీకి కొత్తేమీ కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించిన చరిత్ర ఆ పార్టీకుంది. కానీ ఇప్పటి స్థితి వేరు. కాంగ్రెస్ జవసత్వాలతో ఉన్నదనీ, చిత్తశుద్ధితో, కలిసికట్టుగా ప్రయత్నిస్తే గత వైభవం ఖాయమనీ పార్టీ శ్రేణులు నమ్మడానికి తగిన పరిస్థితులు లేవు. కోటరీలే అక్కడ కొలువు దీరాయి. భజన బృందాలదే అక్కడ పైచేయి అయింది. జనాదరణ ఉన్న నేతలపై చాడీలు చెప్పేవారే ఎక్కువయ్యారు. వారికే పార్టీలో పెద్ద పీట. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి తప్పకపోవటం, నెగ్గిన చోట్ల సైతం అధికార భ్రష్ఠత సంప్రాప్తించటం స్వీయ వైఫల్యాలు, ముఠా కుమ్ములాటల పర్యవ సానమే. కనీసం వీటిపై సక్రమంగా సమీక్షలు జరిగితే, ఏం చేయాలన్న అంశంలో అందరి అభి ప్రాయాలూ తెలుసుకుంటే మున్ముందు నష్టాలు రాకుండా చూసుకునే వీలుండేది. కానీ ఆ సమీక్షల జాడ లేదు. ఇలాంటి దుస్థితిలో ఆజాద్ పార్టీని వీడారంటే ఆశ్చర్యపడాల్సిందేముంది? అయితే పార్టీ వర్తమాన దుస్థితికి తనను మినహాయించుకుని కారణాలు వెదకటం ఆజాద్‌కు తగదు. పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేయడంతోపాటు సంతోష, సంక్షోభ సమయాల్లో అధిష్ఠాన వర్గం దూతగా, పార్టీ పరిశీలకుడిగా, రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఎన్నో అవతారాలెత్తి పెత్తనం చెలాయించిన ఆజాద్‌కు ఇన్ని దశాబ్దాలుగా పార్టీలో పైనుంచి కిందివరకూ ఏం జరుగు తున్నదో తెలియలేదని ఎవరైనా అనుకుంటే వారి అమాయకత్వం. కాంగ్రెస్ సంస్కృతిగా స్థిరపడిన అనేక అవలక్షణాలకు ఆజాద్ కూడా బాధ్యుడే. అందులో తనకు కర్తృత్వం లేదని ఆయన వాదించ వచ్చు. అలా చూసినా సీనియర్ నేతగా ఆ అవలక్షణాలను అడ్డుకున్నదెక్కడ? రాహుల్ పార్టీలోకి ప్రవేశించాక, ముఖ్యంగా 2013లో పార్టీ ఉపాధ్యక్షుడయ్యాక సంస్థాగత సలహాసంప్రదింపుల వ్యవస్థ ధ్వంసమైందన్న ఆయన ఆరోపణలో అబద్ధమేమీ లేదు. కానీ అంతక్రితం ఏమంత సవ్యంగా ఉన్నదని! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చని పోయాక ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీ కక్షగట్టి అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బందులపాలు చేసినప్పుడు ఆజాద్ సీనియర్ నేతగా నిర్వహించిన పాత్రేమిటి? అదేమీ లేకపోగా హైదరాబాద్కొచ్చినప్పుడు ‘మా మాట వింటే జగన్ కేంద్ర మంత్రి అయ్యేవారు, ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు...’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి మరిచారా? అధికారంలో ఉండగా అధినేతలకు పరమ విధేయత నటించడం, అది కోల్పోయాక రాళ్లు రువ్వడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. తప్పును తప్పని సూటిగా చెప్పలేకపోతే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కనీసం అలా చెప్పేవారికైనా అండగా నిలవాలనీ, వారు లేవనెత్తే అంశాల్లో హేతుబద్ధత ఉన్నదనీ అధిష్ఠానానికి చెప్పాలని అనిపించని సీనియారిటీకి విలువేముంటుంది? ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఏలుబడి సాగుతోంది. తమిళనాడు, జార్ఖండ్‌లలో అధికార కూటముల్లో భాగస్వామిగా ఉంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్‌కు అధికారయోగం అసాధ్యం. అక్కడ కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేసిందని సర్వేలు చెబుతున్నాయి. మరో రాష్ట్రం మేఘాలయాలో మహా అయితే అధికార కూటమిలో మైనారిటీ పక్షంగా కొనసాగే చాన్సుంది. దేశంలో మరెక్కడా ఆ పార్టీకి ఆశాజనకమైన స్థితి లేదు. అంతర్గతంగా చూస్తే నాయకత్వం నిస్తేజంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరగాల్సిన ఎన్నికలు కాస్తా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. మంచి రోజుల్లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు అంటున్నాయి. సుముహూర్తాలు చూసుకుంటే సరిపోదు. ఎదురయ్యే వైఫల్యాలపై ఆత్మవిమర్శ ఉండాలి. స్వీయలోపాలపై దృష్టి సారించాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు విలువివ్వాలి. ముఠా సంస్కృతిని ప్రోత్సహించడం ఆపాలి. అంతవరకూ కాంగ్రెస్‌కు మంచి రోజులు రావు. ఉండవు. -
ఆజాద్ బాటలో మరో ఐదుగురు.. కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్ తగులుతోంది. సీనియర్లు, యువనేతలు అనే తేడా లేకుండా చాలా మంది పార్టీని వీడుతున్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేయగానే.. కశ్మీర్‌కు చెందిన మరో ఐదుగురు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆజాద్‌కు అత్యంత సన్నిహితులైన వీరంతా.. ఆయన బాటలోనే నడుస్తామని తేల్చి చెప్పారు. ఆజాద్ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ నేతల్లో జీఎం సరూరి, హజి అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఆమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాని, చౌదరి మహ్మద్ అక్రమ్ ఉన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్ అభ్యన్నతి కోసమే తాను ఆజాద్‌తో కలిసి ముందుకుసాగాలనుకుంటున్నట్లు చిబ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోల్పోయిందన్నారు. అందకే పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ వస్తోందని చెప్పారు. చదవండి: బీజేపీతో టచ్‌లో లేను.. ఆజాద్ క్లారిటీ -
బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం గులాం నబీ ఆజాద్ నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ పార్టీలో చేరుతారు? అని జోరుగా చర్చ మొదలైంది. ఆయన బీజేపీలో చేరుతారానే ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిపై ఆజాద్ స్పష్టతనిచ్చారు. తాను బీజీపీతో అసలు టచ్‌లో లేనని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. తాను ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూడటం లేదని ఆజాద్ వివరించారు. ఇప్పటికైతే సొంత రాష్ట్రానికే పార్టీని పరిమితం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై భవిష్యత్తులో ఆలోచిస్తానన్నారు. అయితే తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఆజాద్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న ఆజాద్.. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈమేరకు ఐదు పేజీల లేఖను సోనియా గాంధీకి పంపారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013లో ఆయన ఉపాధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచే పార్టీ నాశనమైందని ఆరోపించారు. రాహుల్ వచ్చాక పార్టీలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవట్లేదని, సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికారని ధ్వజమెత్తారు. మరోవైపు ఆజాద్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పార్టీ నేతలు ఆయనకు ఎంతగానో గౌరవించారని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో ఆజాద్ పార్టీకీ ద్రోహం చేశారని, ఆయన డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఘాటు విమర్శలు చేశారు. చదవండి: ఆజాద్‌ది ద్రోహం.. ఆయన ఆరోపణల్లో నిజం లేదు -
పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. గౌరవం ఉండదు.. మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఆహ్వానం.. కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
కాంగ్రెస్‌కు ఊహించని షాకిచ్చిన గులామ్ నబీ ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్ జోక్యం పెరిగిందని ఆరోపణలు చేశారు. Congress leader Ghulam Nabi Azad resigns from all positions including primary membership of Congress Party pic.twitter.com/hOFp1FQkCj — ANI (@ANI) August 26, 2022 ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌవరం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. "It is therefore with great regret and an extremely leaden heart that I have decided to sever my half a century old assocation with Indian National Congress," read Ghulam Nabi Azad's resignation letter to Congress interim president Sonia Gandhi pic.twitter.com/X49Epvo1TP — ANI (@ANI) August 26, 2022 -
కాంగ్రెస్‌లో ఆజాద్ ‘రాజీనామా’ కలకలం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాందీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు ఆయన. కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలె రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్ ఎన్నికల నేపథ్యంతో.. పార్టీ ఆయనకు తాజా బాధ్యతలను అప్పగించింది. అయితే ఆ బాధ్యతలను ఆజాద్ ‘డిమోషన్’గా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నందున.. జమ్మూకశ్మీర్‌కు పరిమితం చేయటం తన హోదాను తగ్గించినట్లు అవుతుందని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు.. ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన గులామ్ అహ్మెద్ మిర్.. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ ఆజాద్ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవటం సైతం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో పీసీసీని సోనియా మంగళవారం పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. ప్రచారం కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ, పబ్లికేషన్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ, ఎన్నికల కమిటీలను నియమించారు సోనియా గాంధీ. పీసీసీ చీఫ్‌గా వికార్ వసూల్ వనీని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమణ్ భల్లాను నియమించారు. అయితే తనను ప్రచార కమిటీ చీఫ్‌గా నియమించగా.. ఆజాద్ ఇలా షాకిచ్చారు. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
పద్మ అవార్డుల ప్రదానంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. అందులో నలుగురికి పద్మ విభూషణ్,17 మంది పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అయితే, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. పద్మా పురస్కారాలను రామ్‌నాథ్ కోవింద్ గ్రహీతలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పద్మ శ్రీ అవార్డు అందుకునే ముందు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సందర్భంగానే శివానంద.. రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో పైకి లేపారు. మరోవైపు.. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుమార్తెలు క్రితిక, తరణి స్వీకరించారు. కాగా, రాధే శ్యామ్ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, పారాలింపిక్ రజత పతక విజేత దేవేంద్ర జఝారియా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన కిన్నెర మొగిలయ్య, తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్త గరికపాటి నరిసింహారావులు పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అయితే, విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండో విడతలో అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది. #WATCH Swami Sivananda receives Padma Shri award from President Ram Nath Kovind, for his contribution in the field of Yoga. pic.twitter.com/fMcClzmNye — ANI (@ANI) March 21, 2022 -
షాక్‌లో సోనియా.. కాంగ్రెస్‌పై ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత, జీ-23 గ్రూప్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం, మతం వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రజలను విభజించటంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని ఆరోపించారు. అందులో కాంగ్రెస్ పార్టీ సైతం ఉందని విమర్శలు గుప్పించారు. ఆదివారం జమ్మూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్‌లో 1990లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని అన్నారు. ఈ దాడుల కారణంగా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కాశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. దీనికి దాయాది దేశమే ముఖ్య కారణమన్నారు. #WATCH ...Political parties may create a divide 24x7 on basis of religion, caste & other things; I'm not forgiving any party incl mine...Civil society should stay together. Justice must be given to everyone irrespective of caste, religion: Ghulam N Azad, Cong at an event in Jammu pic.twitter.com/2OCo76ny4x — ANI (@ANI) March 20, 2022 ఈ క్రమంలో కులం, మతం వంటి వివిధ అంశాల పరంగా 24x7 ప్రజలను విభజించి పాలించడంలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సైతం ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా అన్ని పార్టీలను క్షమించనని కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎప్పుడూ ఐకమత్యంతో ఉండాలి. కుతం, మతంతో కాకుండా అందరికీ సమానంగా న్యాయం అందాలని అతిపెద్ద హిందువు, లౌకికవాది అయిన మహత్మా గాంధీ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు.. కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండ ఆధారంగా ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలైన పలు రికార్డులను బద్దలు కొడుతోంది. -
Sakshi Cartoon: తప్పుకునేలా చేస్తున్నామంతే!
-
కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సోనియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో సోనియా గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీలో భారీ ప్రక్షాళన, పలు అంశాలపై వీరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ చర్చల్లో ఆజాద్ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, హుడా.. ప్రస్తుత హర్యానా పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇక, గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్న సోనియా.. సిబల్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు నేతలు.. కాంగ్రెస్ “అసమ్మతి నేతల” అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్‌కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
పార్టీ కోసం జీవితాలు ధారపోశాం.. ఇప్పుడిలా! : గులాం నబీ ఆజాద్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం అయ్యింది. పంజాబ్‌లో అధికారం కోల్పోయి.. యూపీలో అవమానకరమైన ఫలితాల్ని చవిచూసింది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి సంస్కరణలు ‘ఇప్పటికైనా అవసరమ’నే విషయాన్ని ఇటు సీనియర్లు, అటు జూనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘‘ఫలితాలతో దిగ్భ్రాంతికి లోనయ్యా. ఒక్కో రాష్ట్రంలో మా ఓటమిని చూసి నా గుండె రక్తమోడుతోంది. పార్టీ ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా’’ అని CWC సభ్యుడు గులాం నబీ ఆజాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ కోసం మా యవ్వనాన్ని, జీవితాన్ని ధారపోశాం. పార్టీలోని బలహీనతలను గురించి నేను మరియు నా సహచరులు చాలా కాలంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గమనించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా’’ అని గులాం నబీ ఆజాద్ తెలిపారు. మరో సీనియర్ నేత శశిథరూర్ కూడా ‘మార్పు అనివార్యం..సంస్కరణ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. 1/2 All of us who believe in @INCIndia are hurting from the results of the recent assembly elections. It is time to reaffirm the idea of India that the Congress has stood for and the positive agenda it offers the nation — and (contd) — Shashi Tharoor (@ShashiTharoor) March 10, 2022 ‘‘అంతా తప్పు జరిగింది. కాంగ్రెస్‌లో సీరియస్‌గా పోటీ చేయాలనే ఉద్దేశ్యం లేదు...నరేంద్ర మోదీ, అమిత్ షా లాగా పూర్తి బలంతో పోరాడి ఉండాల్సింది. పంజాబ్‌లో నాయకత్వాన్ని మార్చుకోవడంతో సంస్థలో గందరగోళం నెలకొంది. మా ఇన్నింగ్స్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే కాంగ్రెస్‌లో యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్(75). జీ-23 భేటీ 2014 నుంచి ఇప్పటిదాకా 45 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్చింది కేవలం ఐదు మాత్రమే. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. నాయకత్వ.. వ్యవస్థీకృత లోపాలు, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసేవారిని పక్కనబెట్టడం లాంటివి కాంగ్రెస్‌లో లుకలుకలకు కారణం అవుతున్నాయి. దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్ నేతలు అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను మరోలా అర్థం చేసుకుని.. జీ-23గా పేరుపెట్టి సీనియర్లను వేరుగా చూడటం ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి నేపథ్యంలో.. ఈ జీ-23లోని కొందరు సభ్యులు.. గులాంనబీ ఆజాద్ ఇంట్లో శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏమని ప్రచారం చేయాలి? యూపీ ఎన్నికల్లో భాగంగా.. ఒక్క ప్రియాంక గాంధీనే ఆ రాష్ట్రంలో 209 ర్యాలీల్లో పాల్గొంది. లఖింపురీ రైతుల హత్య గురించి హత్రాస్‌కు వెళ్లి మరీ రాహుల్‌తో గళం వినిపించారామె. కానీ, ఏదీ పని చేయలేదు. ఈ నేపథ్యంలో యువ వర్గం.. సమర్థవంతమైన మార్పు కావాలనుకుంటోంది. ‘హిందూ-ముస్లిం కార్డుతో బీజేపీ గెలుస్తోందని పదే పదే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రచారానికి ఆస్కారం ఎక్కడ ఉంది? పంజాబ్‌లో ముస్లిం ఓటర్ల శాతం ఎంత? సామర్థ్యం లేని నాయకత్వం వల్లే ఇలాంటి ఫలితాల్ని చూడాల్సి వస్తోంది. అది పార్టీ అధినాయకత్వం కూడా అంగీకరించాల్సిందే. నానాటికీ సంక్షోభంలోకి జారుకొంటున్న పార్టీని కాపాడుకోవాలంటే.. పాత రక్తాన్ని తప్పించి.. తమకు అవకాశం ఇవవ్వాలని కోరుకుంటోంది యువరక్తం. ఒకవైపు సీనియర్ల సలహాలు.. సీనియర్ల గోల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ వర్కింగ్ కమిటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆజాద్ అన్న కొడుకు..
శ్రీనగర్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ సోదరుడి కుమారుడు ముబాశిర్ ఆజాద్ ఆదివారం బీజేపీలో చేరారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను చేరే విషయం గులాం నబీ ఆజాద్‌తో చర్చించలేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆజాద్‌ను అగౌరవపరచడం తనను చాలా బాధించిదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి సేవ చేసిన ఆజాద్‌ను పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రశంసిస్తే.. కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ప్రభావితం చేసిన కారణంగానే బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం పనులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు గతేడాది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేయాలంటూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఆజాద్ కూడా ఉండటం విశేషం. -
సీనియర్లకు షాకిచ్చిన కాంగ్రెస్..!
న్యూఢిల్లీ: అసమ్మతి నేతలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో వారికి చోటివ్వలేదు. తొలి విడత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్టార్ క్యాంపెయినర్ జాబితా విడుదల చేసింది. దీనిలో అసమ్మతి నేతలుగా పేరుపొందిన జీ 23 నేతలు ఒక్కరు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ జాబితాలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలెట్, నవజోత్ సింగ్ సిధు, అభిజిత్ ముఖర్జీ, మహ్మద్ అజారుద్దిన్ తదితరులు ఉన్నారు. జీ23 గ్రూప్‌గా పేరు పొందిన అస్మమతి నేతలకు ఎవరికి ఈ జాబితాలో స్థానం దక్కలేదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. గతంలో సీనియర్ నేత వీరప్ప మొయిలీ ‘‘జీ 23 గ్రూప్ అంటూ ఏం లేదు. సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ ఐకమత్యంగా ఉంది’’ అని తెలిపారు. గత వారం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయినప్పటికి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. -
మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్ ఎంపీ ఫన్నీ కౌంటర్
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం పూర్తయి వెళ్లిపోతుండడంతో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ గురించి ప్రధానమంత్రి మోదీ భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే. మోదీ కన్నీళ్లు సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మోదీ కన్నీళ్లపై మాత్రం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫన్నీగా స్పందించారు. మోదీది ‘కళాత్మకమైన ప్రదర్శన’గా రాజ్యసభలో అభివర్ణించారు. రాజ్యసభలోనే మోదీ కన్నీళ్లపై స్పందించారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి రాసిన పుస్తకంపై చర్చ జరగ్గా దీనిలో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘మోదీ భావ ప్రదర్శన కళాత్మకమైనది’ అని పేర్కొన్నారు. రైతు నేత రాకేశ్ టికాయత్ కన్నీరు పెడితే మోదీ తాను కూడా కన్నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. రైతుల నిరసనలపై ఘాజీపూర్ సరిహద్దులో ఇటీవల తికాయత్ కంటతడి పెట్టిన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పరోక్షంగా సభలో శశిథరూర్ ప్రస్తావించారు. -
గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ భావోద్వేగం
సాక్షి న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పదవీ విమరణ చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యసభలో పదవీకాలం ముగుస్తున్న నేతలనుద్దేశించి ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ నేత ఆజాద్‌పై అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు. గులాం నబీ తనకు నిజమైన స్నేహితుడని అభివర్ణించిన ప్రధాని, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆజాద్ సేవలను కొనియాడుతూ కన్నీరు పెట్టారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్‌కు సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో సభ చప్పట్లో మారుమోగింది. ఆజాద్ తన సొంత పార్టీ గురించి మాత్రమే కాకుండా దేశం, సభ గురించి కూడా ఆజాద్ ఆందోళన చెందే వారన్నారు. 2007లో కశ్మీర్ ఉగ్రదాడి సమయంలో గుజరాతీ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయన చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్షణం గుజరాతీ పర్యాటకులను యోగ క్షేమాలపై తనకు అప్డేట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకన్నా మిన్నగా స్పందించారంటూ ఆయన సహాయానికి సెల్యూట్ చేశారు. గులాం నబీ తనకు చాన్నాళ్ల నుంచి తెలుసు అని, ఒకే సారి సీఎంలుగా పనిచేశామని, గార్డెనింగ్‌లో ఆయనకు మంచి పట్టుందన్నారు. అలాగే ఆ సమయంలో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయత్నాలను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ‘మీ పదవీ విరమణను అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి’ అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ అన్నారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలన్నారు. అలాగే కశ్మీర్ ఎన్నికలను ఆజాద్ స్వాగతించారంటూనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై ఆజాద్ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 -
ఆశ్చర్యం: కాంగ్రెస్ ఎంపీపై మోదీ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోమవారం రాజ్యసభలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజ్యసభ ప్రతిపక్షనేత (కాంగ్రెస్) గులాంనబీ అజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో హుందాగా మాట్లాడుతారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా సభలో కొత్తగా అడుగుపెట్టేవారు అజాద్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. అంతేకాకుండా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన స్థానిక ఎన్నికలను సైతం మోదీ ప్రస్తావించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో గులాంనబీ అజాద్ ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. మోదీ ప్రసంగంతో అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులు సైతం అశ్చర్యానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖ సందించిన సీనియర్లలో గులాంనబీ అజాద్ ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. పార్టీలో సమూల మార్పులు జరగాలని గత ఏడాది ఆగస్టులో లేఖ రాసి, అసమ్మతిని బహిర్గతం చేసిన జీ–23లోని కీలక నేతల్లో ఆయన కూడా ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాకుండా పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని అధిష్టానికి హెచ్చరికాలు సైతం జారీచేశారు. పలుమార్లు పార్టీ నాయకత్వంలో అసమ్మతి గళం వినిపించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ప్రధాని మోదీ అజాద్‌పై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆ చట్టాలను రద్దు చేయండి!
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, రైతుల ఉద్యమాన్ని చర్చలో ప్రస్తావించేందుకు అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదరడంతో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. చర్చలో సాగు చట్టాలు, రైతాంగ ఉద్యమం అంశాలను ప్రస్తావించేందుకు వీలుగా చర్చా సమయాన్ని మరో ఐదు గంటల పాటు పెంచేందుకు అధికారపక్షం అంగీకరించింది. దాంతో, ఆ చర్చ ముందుగా అనుకున్న 10 గంటల పాటు కాకుండా, మొత్తం 15 గంటల పాటు కొనసాగనుంది. ఇందుకు గానూ, బుధవారం ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే, గురువారం జీరో అవర్‌ను, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు, అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దాంతో, బుధవారం చర్చ ప్రారంభమైంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీసుకోవద్దని, రైతులను శత్రువులుగా పరిగణించవద్దని సూచించారు. చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తే బావుంటుందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సూచించారు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉండటం విశేషం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా, పలు సందర్భాల్లో రైతుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై జరిగిన ఘటనలను ఖండిస్తున్నామని, జాతీయ పతాకాన్ని అవమానించడం ఎవరూ సహించరని ఆయన స్పష్టం చేశారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ తరువాత అదృశ్యమైన రైతుల ఆచూకీని గుర్తించడం కోసం కమిటీని వేయాలని సూచించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ డిమాండ్ చేశారు. ఆ చట్టాలు ఆమోదం పొందిన తీరును విమర్శించారు. దానిపై స్పందించిన చైర్మన్ వెంకయ్యనాయుడు.. నిబంధనల ప్రకారమే అవి ఆమోదం పొందాయని స్పష్టం చేశారు. రైతులను శత్రువులుగా చూడొద్దని, వారి భయాందోళనలను గుర్తించి, ఆ చట్టాలను రద్దు చేయాలని చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ కోరారు. ఉద్యమంలో రైతులు చనిపోతున్నా పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు ఉద్యమిస్తే పెద్ద పెద్ద నేతలే గద్దె దిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ‘అధికారం నెత్తికెక్కకూడదు. రైతులతో చర్చించండి. ఇది ప్రజాస్వామ్యం. మన జనాభాలో వారే ఎక్కువ. చట్టాలను రద్దు చేస్తామని వారికి చెప్పండి’ అని యాదవ్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతాఏర్పాట్లపై స్పందిస్తూ.. ‘ఈ పార్లమెంటు వద్ద, పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద కూడా అంత భద్రత లేదు. వారేమైనా ఢిల్లీ మీద దాడికి వచ్చారా? వారేమైనా మన శత్రువులా?’ అని ప్రశ్నించారు. రైతులు దేశానికి అన్నం పెడ్తున్నారని, వారి పిల్లలు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉన్నారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించారని సీపీఎం సభ్యుడు ఎలమారం కరీమ్ విమర్శించారు. లోక్‌సభలో.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌పై బుధవారం లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్‌రంజన్ చౌధురి రైతు ఉద్యమ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయం జరగాలని, అందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో, సభను సాయంత్రం 4.30కు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తరువాత కూడా సభ్యుల నిరసన కొనసాగడంతో, వరుసగా మూడుసార్లు సభను స్పీకర్ వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు రైతు ఉద్యమం, సాగు చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని ఆధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. సభ్యుల నిరసనల మధ్యనే జీరో అవర్‌ను నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. ‘దేశమంతా గమనిస్తోంది. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దిగజార్చవద్ద’ని పలుమార్లు ఆయన సభ్యులను కోరారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారిలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ, మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌తో పాటు డీఎంకే, కాంగ్రెస్, ఆప్ పార్టీల సభ్యులున్నారు. -
అసమ్మతి నేతలతో సోనియా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పార్టీలో ప్రక్షాళన జరగాలని అధిష్టానానికి వ్యతిరేకంగా ఇటీవల కీలక వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ నేతల అసంతృప్తిని చల్చార్చే ప్రయత్నానికి కాగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంచలనం రేపింది. చదవండి: కాంగ్రెస్ తీరు మారినట్టేనా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, సీడబ్ల్యూసీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని 23 మంది సీనియర్ నాయుకులు అసమ్మతి గళం వినిపించారు. ఎట్టకేలకు అసమ్మతి నేతలతో భేటీ అయిన సోనియా, సీనియర్ నేతల మధ్య కమల్‌నాథ్ సంధాన కర్తగా వ్యహరిస్తున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లోట్, అంబికా సోని, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, వివేక్ తంఖా, శశి థరూర్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పీ. చిదంబరం పాల్గొన్నారు. అసమ్మతి నేతలతో జరుగుతున్న ఈ భేటీ పాధాన్యత సంతరించుకుంటోంది. -
కాంగ్రెస్ తీరు మారినట్టేనా?
పార్టీ సీనియర్ నేతలు రాసిన లేఖపై గత నాలుగు నెలలుగా మౌనంగా వుండిపోయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టకేలకు ‘సరైన విధానం’లో స్పందించినట్టు కనబడుతోంది. శనివారం మొదలుపెట్టి వరసగా కొన్ని రోజులపాటు సీనియర్ నాయకులతో ఆమె చర్చిస్తారని... వారిలో లేఖరాసిన నాయకులు కూడా వుంటారని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. రైతు ఉద్యమం, పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు వంటి సమ స్యల్ని చర్చించడానికని చెబుతున్నా అసమ్మతిని చల్లార్చడమే దీనిలోని ఆంతర్యమని వస్తున్న ఊహా గానాలు కొట్టివేయదగ్గవి కాదు. సమస్య తలెత్తినప్పుడు, సంక్షోభం ఏర్పడినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడటం సరైందే. కానీ ఇందుకామె సుదీర్ఘ సమయం తీసుకున్నారు. అంతేకాదు...తన విధేయు లతో లేఖ రాసినవారికి వ్యతిరేకంగా ప్రకటనలిప్పించారు. వారిపై జీ–23గా ముద్ర కొట్టి ఒక ముఠాగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ నేతల పార్లమెంటరీ పార్టీ పదవులను ఊడబెరికి విధేయు లతో నింపారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ ఆమె ప్రకటన చేశారు. వెనువెంటనే పార్టీ అత్యున్నత స్థాయి సంఘం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమా వేశమై సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని తీర్మానించింది. సీనియర్ నేతలు అడిగిం దేమిటి? నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవం చవిచూశాక అందుకు నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ స్థానంలో ఒక ‘ఫుల్ టైం’ నాయకత్వం వుండేలా చూడమని విన్నవించుకున్నారు. ‘పార్టీ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. దేశం కూడా సంక్షోభంలో వుంది. అందుకే దాపరికం లేకుండా, నిర్మొహమాటంగా వాస్తవా లేమిటో తేటతెల్లం చేస్తున్నామ’ని చెప్పారు. రాహుల్ మళ్లీ వచ్చి పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చుంటా నంటే వీరిలో చాలామంది కాదనకపోవచ్చు. వారి అభ్యంతరమల్లా ఆ పదవిని పూర్తికాలం బాధ్య తగా పరిగణించమనే! అధ్యక్ష పదవినుంచి వైదొలగిన సందర్భంలో తన సోదరి ప్రియాంకపై ఒత్తిళ్లు తీసుకురావడాన్ని గమనించి ఆమె కూడా బాధ్యతలు స్వీకరించే ప్రశ్నే లేదని రాహుల్ కుండ బద్దలు కొట్టారు. తెరవెనక ఆయన్ను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక చివరకు సోనియాగాంధీయే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధపడ్డారు. ఏడాదిన్నర గడిచినా పూర్తికాలం బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. లేఖకులంతా ఇన్నాళ్లూ సోనియాకు వీర విధేయులు. పార్టీ ఈ స్థితికి దిగజారడంలో వీరిలో కొందరి పాత్ర కూడా కాదనలేనిది. వివిధ రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేస్తూ, కొత్త ఆలోచనలతో ముందుకొస్తూ పార్టీని పటిష్టపరిచేవారిపై అధిష్టానానికి చాడీలు చెప్పి ఇబ్బందులు సృష్టించడంలో, నిష్క్రమించేలా చేయడంలో కొందరు కీలకపాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో బలగంలేని తమ అనుయాయులకు చోటిచ్చి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడటానికి దోహదపడ్డారు. ఇప్పుడు పుట్టి మునిగాక తమను తాము వేరుపరుచుకుని తప్పంతా అధినాయకత్వానిదేనంటున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో పరాజయ పరంపర కొనసాగుతుంటే... ఓడినచోటల్లా నాయకత్వ స్థానాల్లో వున్నవారు తప్పుకుంటుంటే... వాటి ప్రభావంతో వేరే రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదలబారుతుంటే స్వీయ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుని ఆ లేఖ రాశారు. ఇది రాశాక కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, గోవా, కేరళ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉప ఎన్నికల ఫలితాలు సరేసరి. లేఖ రాసినవారి ఉద్దేశం ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడపదల్చుకున్న అధినాయకత్వం చేయాల్సిన పని ఆ నాయకుల్ని పిలిచి మాట్లాడటమే. పార్టీ తమ సొంత జాగీరుగా భావించడం, ప్రశ్నించినవారిని ద్రోహులుగా ముద్రలేయడం, నిష్క్రమించక తప్పని స్థితి కల్పించడంవంటివి ఎంతోకాలం సాగ బోవని గుర్తించడం అవసరం. అయితే సీనియర్ నేతలతో మాట్లాడటానికి ఎంచుకున్న సమయం సంశయాలు రేకెత్తిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు త్వరలో జరగాల్సివుంది. లేఖకుల అసంతృప్తిని ఏదో మేరకు చల్లార్చ కుండా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తే అది కొత్త సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. వారిలో ఎవరైనా బరిలో నిలిస్తే, కాంగ్రెస్‌ను రక్షించడానికే ప్రయత్నిస్తున్నామని మీడియాలో హోరెత్తిస్తే పార్టీ మరింత బజారున పడుతుంది. వర్కింగ్ కమిటీకి ఎంపిక కాకుండా ఎన్నిక జరగాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. సాధారణంగా మంచి టీమ్‌గా అక్కరకొస్తారని భావించినవారిని వర్కింగ్ కమిటీకి ఎంపిక చేయడం కాంగ్రెస్ అధి నేతల సంప్రదాయం. దానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరితే జవాబు చెప్పుకోవడం పార్టీకి కష్టమవుతుంది. అయితే లేఖరాసినవారు ఇంతవరకూ సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడ లేదు. తమ నాయకురాలు ఆమేనని ఇప్పటికీ చెబుతున్నారు. పరిస్థితి ఇలావున్నప్పుడే ఆ నాయకు లను మచ్చిక చేసుకోవడం అవసరమని సోనియా భావించి వుండొచ్చు. అయితే వారిలో ఎందరు ఆమె చెప్పినట్టు విని దారికొస్తారన్నదాన్నిబట్టి సంస్థాగత ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం వుంటుం దని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన తమ నిర్వాకమే పార్టీని ఈ స్థాయికి తెచ్చిందని, ఈ తీరును మార్చుకోనట్టయితే భవిష్యత్తు వుండదని ఇప్పటికైనా సోనియా గాంధీ గ్రహిస్తే మంచిదే. ఎల్లకాలమూ తాత్కాలిక ఏర్పాట్లతో బండి లాగించవచ్చుననుకుంటే అది అనర్థదాయకమే అవుతుంది. పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడం, సంస్థ కోసం నిజంగా కష్టపడేవారిని గుర్తించి బాధ్యతలు అప్పజెప్పడం వంటివి చేస్తేనే జనం ఏదో మేరకు ఆ పార్టీని విశ్వసిస్తారు. -
నిరసన స్వరం: హస్తంకు అధికారం కష్టమే
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త సమస్య వచ్చిపడుతోంది. ఇప్పటికే ప్రజల్లో ప్రాభల్యం కోల్పోతూ నానాటికీ కృషించి పోతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీలో సీనియర్ల నిరసన స్వరాలు మరింత తలనొప్పిగా మారియి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. నాయకత్వ తీరులో మార్పులు రాకపోతే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయవంరించదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు హస్తం పార్టీలో పుట్టించిన వేడి చల్లారకముందే మరోనేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేంద్రమాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 5స్టార్ సాంప్రదాయం ఎక్కువగా పెరిగిపోయిందని, నేతలు ప్రజల్లో కన్నా ఏసీ రూముల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. (కాంగ్రెస్ పార్టీని వదిలిపోండి) ఆదివారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘ పార్టీలో ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పడు లేవు. నాయకుల్లోచాలా మార్పులు వస్తున్నాయి. పార్టీ టికెట్ రావడమే ఆలస్యం 5 స్టార్ హోటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారు. ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటం చేయకుండా కేవలం ప్రెస్‌నోట్ రిలీజ్ చేయగానే ఇక తమ పని పూర్తి అయ్యిందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఈ తీరు వెంటనే మార్చుకోవాలి. జాతీయ నాయకత్వం కిందస్థాయి నేతలకు ఆదర్శంగా ఉండాలి. (లేఖ: యూపీ కాంగ్రెస్ నేతపై చర్యలు!?) గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని పటిష్టస్థితికి చేర్చగలిగాను. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాగలిగాను. ఆ సమయంలో పార్టీ ఇంఛార్జికి పూర్తి అధికారాలు ఉండేవి. అధిష్టానం ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకునేది కాదు. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చాయు. ఏపీలో వైఎస్సార్ నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ఆ తరువాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే ఎప్పటికీ అధికారంలోకి రాలేము. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పార్టీని పునాదుల నుంచి పునర్నిర్మించాలి. అధ్యక్షుడెవరని అడిగితే రెబెలియన్ అంటూ ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో రెబెలియన్ అంటూ ఎవరూ ఉండరు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు కనీసం విపక్ష నేత పోస్టు కూడా దక్కట్లేదు’ అని అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలతో పలువురు నేతలు విభేదిస్తుండగా.. మరికొందరి ఏకీభవిస్తున్నారు. -
రాష్ట్రపతితో భేటీ కానున్న గులాంనబీ ఆజాద్
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సమావేశాలు ముగిసేవరకు సభను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆజాద్ సహా మరికొంత మంది విపక్షనేతలు నేడు రాష్ట్రపతిని కలిసి కేంద్ర వైఖరికి నిరసనగా ఓ లేఖను సమర్పించనున్నారు. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు గులాంనబీ ఆజాద్ లేఖ రాశారు. ఈ బిల్లులు కార్మికుల జోవనోపాధిని ప్రభావితం చేస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బిల్లులను ఆమెదించడం ప్రజాస్వామ్యానికి మచ్చలా మారుతుందంటూ అభివర్ణించారు. మరోవైపు సస్పెన్షన్లను ఎత్తివేసే వరకు సభకు రాబోమని విపక్షాలు ప్రకటించాయి. (58 దేశాలు, రూ. 517 కోట్లు) కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో 24 గంటల ఏకధాటి నిరసన అనంతరం ఎంపీలు తమ దీక్షను విరమించారు. తదనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సైతం ఒకరోజు దీక్షకు దిగడం మరో విశేషం. అయితే సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పిన తర్వాతే సస్పెన్షన్ రద్దు చేయడాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇక పార్లమెంటు సమావేశాలు నేడు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు1వ తేదీ వరకూ ఇవి కొనసాగాల్సి ఉండగా కొంతమంది సభ్యులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. దీంతో షెడ్యూల్ కన్నా 8 రోజుల ముందే సభను వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకి వచ్చాయి. (ఎంపీల సస్పెన్షన్ : సమావేశాలు బహిష్కరణ) -
ఎంపీల సస్పెన్షన్: సమావేశాలు బహిష్కరణ
ఢిల్లీ : రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. సభ్యులపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. (చదవండి : 8 మంది ఎంపీల సస్పెన్షన్) కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై రగడ సోమవారం కూడా కొనసాగింది. దీంతో సభా మర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. (చదవండి : ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) -
రాయని డైరీ.. గులామ్ నబీ ఆజాద్ (కాంగ్రెస్)
సంజయ్‌గాంధీ ఉన్నప్పట్నుంచీ గాంధీల కుటుంబంతో నాకు అనుబంధం. పేరుకు నేను ఆజాద్‌నే గానీ, నేనూ ఒక గాంధీనే అన్నట్లు నాకై నాకు తరచు ఒక అనుభూతి వంటిది కలుగుతుంటుంది. గులామ్ నబీ గాంధీ! కాంగ్రెస్‌లో నాలా డెబ్బై నిండిన కాంగ్రెస్ గాంధీలు ఎంతమంది ఉన్నారో చేతి వేళ్ల మీద లెక్కించి చెప్పడం కష్టమైన సంగతే. కౌంట్‌కి పక్కవారి చేతి వేళ్లు కూడా అవసరం అవుతాయి. ఆ వేళ్లలో ఎవర్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ని చేసినా వాళ్లూ గాంధీలే. గాంధీలను దాటి, గాంధీలను దాచి కాంగ్రెస్ ఎటూ వెళ్లిపోలేదు. సీడబ్ల్యూసీ సమావేశం అయ్యాక ఇంటికి వచ్చేస్తుంటే దారి మధ్యలో ఒవైసీ ఫోన్ చేశాడు! ‘‘భాయ్‌జాన్.. మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి..’’ అన్నాడు. ‘‘అససుద్దీన్.. దయచేసి మరింకెప్పుడైనా చేయగలవా?’’ అన్నాను. అతడేవో పుల్లలు సిద్ధం చేసుకుని ఉంటాడు. వాటినిప్పుడు నా చెవుల్లో విరుస్తూ కూర్చుంటాడు. ‘‘సమావేశంలో అలసిపోయి ఉంటారేమో కదా. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవలసినంతగా మీరు మీ సమావేశంలో పాల్పంచుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. లేదా మీరు మీ అలసట సమయాన్ని రాహుల్ గాంధీకి సంజాయిషీ చెప్పుకోడానికి వినియోగించాలని తొందరపడుతూ ఉండి ఉండొచ్చు. సరే భాయ్‌జాన్ మరి. ఫోన్ కాకుండా ట్వీట్ చేస్తాను’’ అన్నాడు!! సీడబ్ల్యూసీ సమావేశాలను ఫాలో అవడం తప్ప హైదరాబాద్‌లో పెద్దగా పనులేమీ లేనట్లున్నాయి ఒవైసీకి. ‘‘పార్టీ అధినేతకు సంజాయిషీ ఇచ్చుకునే సంప్రదాయానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడే ఉంటారు ఒవైసీ. తగ్గించుకొనువారు కాంగ్రెస్‌లో హెచ్చింపబడతారు’’ అన్నాను. ఈమాటైతే నిజం. కాంగ్రెస్‌లో హెచ్చింపబడినవారు సాయంత్రానికో, ఆ మర్నాటికో తగ్గించబడరన్న భరోసా అయితే లేదు కానీ.. తగ్గించుకున్నవారు ఓ యాభై ఏళ్లకైనా హెచ్చింపబడతారు. హెచ్చింపబడేందుకు నేనిప్పుడు నా తగ్గింపు యాభైల దగ్గర ఉన్నాను. కారు దిగుతుండగా ఒవైసీ ట్వీట్! ‘పొయెటిక్ జస్టిస్’ అని పెట్టాడు! చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అట! ఇంట్లోకి రాగానే రాహుల్ బాబుకి ఫోన్ చేశాను. ‘దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది..’ అని వచ్చాక, కాసేపు రింగ్ అయి నాట్ ఆన్సరింగ్ అని వచ్చింది. పార్టీకి ఎన్నికలు జరిపించాలని సోనియాజీకి లెటర్ పెట్టడం రాహుల్బాబుకు బాగా కోపం తెప్పించిందని సీడబ్ల్యూసీ సమావేశంలో అతడు నన్ను తీక్షణంగా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది. రాహుల్‌బాబు ఎవర్నైనా తీక్షణంగా చూస్తున్నాడంటే తనింకా పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాడనే! అది నాకు సంతోషం అనిపించింది. మమ్మీకి బాగోలేక హాస్పిటల్లో ఉంటే మీరంతా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ కావాలని లెటర్ రాసి సంతకాలు పెడతారా.. అని సమావేశంలో పెద్దగా అరిచేశాడు. ‘పార్టీకి బాగోలేక మమ్మీకి రాసిన లెటరే కానీ, మమ్మీకి బాగోలేనప్పుడు చూసి పార్టీకి రాసిన లెటర్ కాదు రాహుల్ బాబూ..’ అని చెప్పడానికే రాహుల్‌కి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. నడుము వాలుస్తుండగా ఫోన్ రింగ్ అయింది. రాహుల్‌బాబు! ‘‘రాహుల్ బాబూ.. నువ్వింకా మేల్కొనే ఉన్నావా!’’ అన్నాను ఎగ్జయిటింగ్‌గా. ‘‘రాహుల్ బాబు కాదు గులామ్జీ. పార్టీని చార్జింగ్‌కి పెట్టి రాహుల్‌బాబు నిద్రపోతున్నాడు’’ అన్నారు సోనియాజీ. ఫోన్‌ని చార్జింగ్‌కి పెట్టి అనబోయి, పార్టీని చార్జింగ్‌కి పెట్టి.. అన్నట్లున్నారు సోనియాజీ. -
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై రచ్చ
-
గాంధీలదే కాంగ్రెస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్ సిబల్ కూడా బహిరంగంగా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు. ఉదయం నుంచి హైడ్రామా.. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు. ఒక్క తరుణ్ గొగోయ్ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది. దీనికి గులాం నబీ ఆజాద్ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్ నేతలు మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్సింగ్ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్ ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు. సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్‌లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్ దుమారం రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌కు కపిల్ సిబల్ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలికంగా సద్దుమణిగాయా? పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్‌ని అనలేదని, ఇతర కాంగ్రెస్ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్ చేసిన ట్వీట్ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్ వెంటనే స్పందించి ట్వీట్ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ స్వయంగా సిబల్‌తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్ వెంటనే ట్వీట్ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్ పటేల్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది. నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే చీఫ్‌గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా ‘మనది పెద్ద కుటుంబం. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్ సిబల్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు. బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది. సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ స్వరం వినిపించారు. ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ట్వీట్ మీటింగ్ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్ ఒక ట్వీట్ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్‌ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్ చేశారు. సోనియానే కొనసాగాలి పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్ బలహీనమయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు. అందుకే ఆ ట్వీట్‌ను తొలగించా!: సిబల్ రాహుల్ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ఆ తరువాత సీనియర్ నేత కపిల్ సిబల్ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్‌ను తొలగిస్తున్నానని సిబల్ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారు. రాజస్తాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్లో సిబల్ పేర్కొన్నారు. పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు ► ఇతరులు 13 మంది ► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు 18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యు.ఎన్.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్‌దయాళ్ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. -
‘ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌కు బానిసత్వం చేస్తారు?’
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్ నేతల మధ్య వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వార్తలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకెన్నాళ్లు కాంగ్రెస్ నాయకత్వంలో బానిసలుగా ఉంటారంటూ ఒవైసీ, ఆజాద్‌ను ప్రశ్నించారు. పొయెటిక్ జస్టిస్ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఆజాద్ కొన్నేళ్ల క్రితం మీరు ఇదే విషయం గురించి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీరు మమ్మల్ని బీజేపీ బీ జట్టు అన్నారు. ఇప్పుడు మీ పార్టీ నేతలే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు సమయం వృధా చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా కాంగ్రెస్ నాయకత్వానికి బానిసలుగా ఉంటారో ఆలోచించుకోండి’ అంటూ ఒవైసీ సంలచన వ్యాఖ్యలు చేశారు. -
రాజీనామాకు సిద్ధపడ్డ గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్ నేతల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించినట్లు సమాచారం. (కాంగ్రెస్ పార్టీలో విభేదాలు!) ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం. మరోవైపు తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. అదే విధంగా.. పార్టీ అధినాయకత్వాన్ని తక్కువ చేసి చూపేలా లేఖ రాయడం సరికాదంటూ సహచరులపై అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. బీజేపీతో కలిసి కుట్రపన్నామా?: కపిల్ సిబల్ ‘‘మేము బీజేపీతో కలిసి కుట్ర చేశామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడి రాజస్థాన్ హైకోర్టులో విజయం సాధించాం. 30 ఏళ్లలో మేము బీజేపీకి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాం. అయినప్పటికీ మేము బీజేపీతో కుట్రపన్నామా ?’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నల వర్షం కురిపించారు. -
ఆలోచనలో మార్పు రావాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలి. శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదు. పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది. ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు. దోషులను బహిరంగంగా శిక్షించాలి జయాబచ్చన్, ఎంపీ దిశ అత్యాచారం, హత్య లాంటి ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నా. రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులను దేశం ముందు తలదించుకునేలా చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల ఓ అత్యాచార ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. అప్పీల్‌కు వెళ్లిన దోషులు జీవితఖైదు పొందారని, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. హత్యాచార ఘటన జరిగిన 15–20 రోజుల్లోనే విచారించి దోషులను శిక్షించాలని ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి సూచించారు. టీఎంసీ ఎంపీ డా.సంతను సేన్, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్, అన్నాడీఎంకే ఎంపీ విజలా సత్యనాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే ఎంపీ పి. విల్సన్, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడారు. ఏకతాటిపైకి రావాలి గులాం నబీ ఆజాద్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు యావత్ దేశం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అత్యాచారం, హత్య ఘటనల నిరోధానికి చట్టాలు చేసినా, వాటి ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. మహిళలపై ఇలాంటి దాడులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కోరుకోరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు. -
ఢిల్లీలో విపక్షాల భేటీ
-
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా
చండీగఢ్: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ ఇస్తామని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
శ్రీనగర్‌లో ఆజాద్
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ శ్రీనగర్‌ను సందర్శించారు. లాల్ దేడ్ ఆస్పత్రిలోని రోగులను పరామర్శించి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల పర్యటనలో, రెండో రోజైన శనివారం ఆయన స్థానికులను కలుసుకొని ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉన్న పరిస్థితుల గురించి వాకబు చేశారు. సొంత రాష్ట్రమైన కశ్మీర్ చేరుకోవాలని ఆయన గతంలో ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చారు. -
ఆర్టికల్ 370 రద్దు : నేడు సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ సహా కశ్మీర్ పరిణామాలపై ఇతర పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గంగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆజాద్ పిటిషన్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్ సహా ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్లను విచారణకు చేపట్టనుంది. తమ సహచర నేత, చట్టసభ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ తరిగామి నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కశ్మీర్ ప్రజల బాగోగులను తాను తెలుసుకోగోరుతున్నానని ఆయన చెప్పారు. తాను మానవతా దృక్పథంతోనే పిటిషన్ దాఖలు చేశానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్ తెలిపారు. -
‘వారి కష్టాలకు రాళ్లు కూడా కన్నీరు కారుస్తాయి’
శ్రీనగర్ : కశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష బృందాన్ని వెనక్కి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆహ్వానం మేరకే తాను ఇక్కడికి వచ్చానని అయితే ఇప్పుడు ఇలా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ... లోయలో ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. అంతగా కావాలనుకుంటే విపక్ష నేతలు ఇక్కడ పర్యటించవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్ పర్యటనకు బయల్దేరారు. అయితే వీరి పర్యటనకు కశ్మీర్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అంతేగాక జాతీయ నేతలు పర్యటించాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే 144 సెక్షన్‌ను అమలు చేశారు. అనుమతి లేనప్పటికీ విపక్ష నేతల బృందం ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డగించిన అధికారులు తిరిగి పంపించివేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ గవర్నర్ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మమ్మల్ని ఎయిర్‌పోర్టు దాటి బయటకు రానివ్వడం లేదు. మాతో ఉన్న జర్నలిస్టులతో ఇక్కడి అధికారులు తప్పుగా ప్రవర్తించారు. వారిని కొట్టారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సాధారణంగా లేవు అనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..‘ కశ్మీర్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకే మమ్మల్ని అనుమతించడం లేదు. కశ్మీర్ నుంచి వస్తున్న ప్రయాణికులు తమ కష్టాలను విమానంలో మాతో పంచుకున్నారు. వారి మాటలు వింటే రాళ్లు కూడా కన్నీటి పర్యంతమవుతాయి. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి అని కేంద్ర సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. Congress leader GN Azad after opposition delegation returns from SRINAGAR: We weren't allowed to go to the city, but the situation in J&K is terrifying. The stories we heard from the passengers of Kashmir present in our flight, would bring tears even to a stone. #JammuAndKashmir pic.twitter.com/RlsmvyQsqc — ANI (@ANI) August 24, 2019 -
రాయని డైరీ
ఆర్టికల్ 370 రద్దు మీద స్టేట్మెంట్ రిలీజ్ చెయ్యడానికి అంతా కూర్చొని ఉన్నాం. గులామ్ నబీ ఆజాద్, పి.చిదంబరం ఆర్టికల్ 370 హిస్టరీ గురించి చెప్పారు. ‘త్రీసెవెంటీ హిస్టరీ మాకు తెలుసు. ప్రెజెంట్ ఏమిటో చెప్పండి’ అన్నారు పంజాబ్ స్టేట్ చీఫ్ సునీల్ జాఖడ్. ఆజాద్ ఆయన వైపు అసహనంగా చూసి, ‘మీరు ప్రెజెంట్‌లోనే ఉన్నారా?’ అని అడిగారు. ‘ప్రెజెంట్‌లోనే ఉన్నాను. ఎట్ ప్రెజెంట్ కాంగ్రెస్‌లోనే ఉన్నాను. చెప్పండి. మీరేం చెబితే అది వినాలని ఉంది’ అన్నారు జాఖడ్. ఆజాద్‌ని ఆగమన్నట్లు చూసి... ‘నేను చెప్పొచ్చా జాఖడ్‌జీ ప్రెజెంట్ ఏమిటో..’ అన్నారు చిదంబరం. ‘ఎవరు చెప్తే ఏంటి? చెప్పాల్సింది చెప్పాలి గానీ’ అన్నట్లు చూశారు జాఖడ్. ‘త్రీసెవెంటీకి ప్రెజెంట్ లేదు. కశ్మీర్‌కు ఫ్యూచర్ లేదు’ అని చెప్పారు చిదంబరం. ‘నేనడిగింది త్రీసెవెంటీ ప్రెజెంటూ, కశ్మీర్ ఫ్యూచరూ కాదు. మన పార్టీ ప్రెజెంట్ ఏమిటని! మన ప్రెజెంట్ ఏమిటో తెలిస్తే, మన ఫ్యూచర్ ఏంటో కూడా తెలుస్తుంది’ అన్నారు జాఖడ్. ఆయనెందుకో సమావేశం మొదలైనప్పట్నుంచీ ఉత్సాహలేమితో బాధపడుతున్నారు. ఆజాద్‌కి ముందే చెప్పాను. ‘సీడబ్ల్యూసీ సమావేశాన్ని నలుగురైదుగురితో కానిచ్చేద్దాం. స్టేట్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు వద్దు’ అని. ‘వాళ్లందర్నీ కలుపుకుంటేనే నలుగురైదుగురు అవుతున్నారు రాహుల్జీ’ అన్నారు ఆయన! ‘త్రీసెవెంటీపై మన స్టాండ్ ఏమిటో ఆల్రెడీ పార్లమెంటులో చెప్పేశాం కదా. పార్లమెంటులో చెప్పాక కూడా, మళ్లీ మనకి మనం మన స్టాండ్ ఏమిటో చెప్పుకోవడం ఏమిటి? చెప్పు కోడానికి ఈ మీటింగ్ ఏమిటి?’’ అన్నారు జాఖడ్. ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, వేణు గోపాల్.. జాఖడ్ వైపు చూశారు. ఆ చూడ్డం నిశితంగా, పరిశీలనగా ఉంది. అంత నిశితంగా ఏం పరిశీలిస్తున్నారు జాఖడ్‌లో! జాఖడ్‌ని చూశాక నా వైపు చూశారు. కాంగ్రెస్‌కు ఎట్టకేలకు ఒక కొత్త అధ్యక్షుడు దొరికాడు అన్నట్లుగా ఉంది వారి చూపు! కాంగ్రెస్‌లో ప్రశ్నించినవాళ్లు పాత అధ్యక్షులు అయినట్లు గుర్తుంది కానీ, కొత్త అధ్యక్షులు అయినట్లు గుర్తు లేదు మరి! ‘పార్లమెంట్లో మన స్టాండ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే జాఖడ్. పార్టీలోని వారికే పార్టీ స్టాండ్ ఏమిటో తెలియాలి. అందుకే ఈ మీటింగ్. మనలోనే కొందరు త్రీసెవెంటీ రద్దును సమర్థిస్తున్నారు. మిగతా కొందరు ఆ సమర్థించే వాళ్లను సమర్థిస్తూ, రద్దును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక పార్టీలో ఉన్నవాళ్లంతా ఒక స్టాండ్ మీద లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మీటింగులు తప్పవు’ అన్నారు ఆంటోనీ. జాఖడ్ ప్రశ్నించడం మానలేదు. ప్రశ్నిం చాలనుకున్న వారందరి ప్రతినిధిగా ఆయన సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చినట్లున్నారు. ‘‘ఇప్పుడీ త్రీసెవంటీ సమావేశం తర్వాత మన రిలీజ్ చెయ్యబోయే స్టేట్మెంట్.. పార్టీలో అంతా ఒకే మాట మీద ఉండాలనా, పార్టీలో ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉన్నా పర్వా లేదనా?’’ అని అడిగారు జాఖడ్. ‘ఎవరికి వారిగా ఉంటూనే అందరూ ఒకే పార్టీగా ఉండాలని రాహుల్ బాబు ఆశిస్తున్నారు’ అని, నా వైపు చూశారు అహ్మద్ పటేల్. ఆయనతో నేనెప్పుడు ఆ మాట అన్నానో నాకు గుర్తుకు రావడం లేదు! ‘‘ఎవరికి వాళ్లుగా ఉండేవాళ్లు ఒకే పార్టీగా గానీ, ఒకే పార్టీలో గానీ ఎందుకు ఉంటారు పటేల్జీ? కన్ఫ్యూజన్లో బీజేపీలోకి వెళ్లిపోతారు’’ అన్నారు జాఖడ్. పార్టీలో డెమోక్రసీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువైనట్లుంది! కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోగానే పార్టీకి డెమోక్రసీ అవసరమా, కన్ఫ్యూజన్ అవసరమా అనే దానిపై తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయించాలి. -
ప్రజాస్వామ్యం ఖూనీ : ఆజాద్
-
ఆర్టికల్ 370 రద్దు : విపక్షాల వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల నిరసనల నడుమే హోంమంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్, పీడీపీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. భయాందోళనలు రేకెత్తించి కశ్మీర్‌ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతులను చించివేసిన పీడీపీ సభ్యుల తీరును గులాం నబీ ఆజాద్ తప్పుపట్టారు. చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన చేపట్టిన పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపాలని ఛైర్మన్ మార్షల్స్‌ను ఆదేశించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. -
కాంగ్రెస్ పక్ష నేత నియామకం సందిగ్ధం
న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలి సమావేశం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అలాగే సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకునే విషయంలోనూ ముందడుగు పడలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశమే జరగలేదు. దీనిపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ చాలా ప్రతిపక్ష పార్టీలు సభలో తమ పార్టీ పక్ష నాయకుడిని ఎంపిక చేయలేదనీ, ఆ పని పూర్తయిన అనంతరం ప్రతిపక్ష పార్టీల భేటీ ఉండొచ్చని అన్నారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆధిర్ రంజన్ చౌధురీ, కేరళ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్ హాజరయ్యారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా నియమించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ, ఎదురుగాలిలోనూ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన శశి థరూర్‌ల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి. -
‘మరో వందేళ్లకైనా బీజేపీ ఆ పని చేయలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మరో 100 ఏళ్లు అధికారంలో ఉన్నా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన హిమాచల్ ప్రదేశ్‌లో మాట్లాడారు. ‘బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేయలేదు. ఇప్పుడే కాదు మరో 100 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్నా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని తొలగించలేదు. అటల్ బీహార్ వాజ్‌పేయి అధికారంలో ఉన్నప్పుడే ఆర్టికల్ 370ని తొలగించలేకపోయారు. ఇప్పుడు ఎలా తొలగిస్తారు. బీజేపీ వీలుకాని హామీలను ఇస్తూ ప్రజలను మోసగిస్తుంది’ అని అజాద్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలోనే ఉగ్రవాది అజార్ మసూద్‌ను విడిచిపెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల వేళలో తమకు ఇలాంటి విషయాలు ముఖ్యం కాదని, ప్రజలకు ఏం చేస్తామో చెప్పడమే తమ ప్రధాన అంశం అన్నారు. నిరుద్యోగం, పేదరిక నిర్మూళననే తమ పార్టీ ధ్యేయం అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 273పైగా సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయ పార్టీలను నుంచి ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అజాద్ పేర్కొన్నారు. -
ప్రాంతీయ పార్టీలకు ప్రధాని పదవి
సిమ్లా/న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయపార్టీల నుంచి ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం సిమ్లాలో తెలిపారు. బుధవారం పట్నాలో ఆయన మాట్లాడుతూ పీఎం పదవికి కాంగ్రెస్‌కు దక్కకపోయినా ఇబ్బంది లేదన్నారు. పీఎం పదవి తమకే కావాలనే సంకేతాలను గతంలో కాంగ్రెస్ ఇవ్వడంతో కొన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు దూరం జరిగాయి. అయితే ఆజాద్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామనీ, సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందని ఆయన తెలిపారు. -
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే!
నిజామాబాద్‌నాగారం: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఇంకా మభ్యపెడుతున్నాయని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ అనుభవిస్తూ, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆజాద్ ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చింది ఒకరైతే, అనుభవించేది మరొకరని కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, నోట్ల రద్దు, జీఎస్టీకి టీఆర్ఎస్ మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేసినా కేసీఆర్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటుపై బీజేపీ, టీఆర్ఎస్ మాయమాటలు చెబుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ తీసుకొచ్చిన కనీస ఆదాయ పథకం పేదల బతుకుల్లో వెలుగులు నింపుతుందన్నారు. మధుయాష్కిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నియంత పాలన: షబ్బీర్ కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పేద ముస్లింలను ఓవైసీ ఏనాడూ పట్టించుకోలేదని, వారి ఓట్లతో గెలిచి వారి సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత కేవలం హామీల కవితలకే పరిమితమైంది తప్ప నెరవేర్చలేదని.. పసుపుబోర్డు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయకపోవడంతోనే ఎంపీ కవితపై రైతులు పోటీలకు దిగారని గుర్తుంచుకోవాలన్నారు. హామీలు నెరవేర్చలేదు: గద్దర్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జీఎస్టీతో పాటు కేఎస్టీ అమలవుతోందని గద్దర్ ఆరోపించారు. ఏ పని చేపట్టినా కేఎస్టీ చెల్లిస్తేనే వాటి పనులు జరుగుతాయని, లేకుంటే ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి: మధుయాష్కి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి మధుయాష్కి తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాకు అలీసాగర్, గుత్ప పథకాలతో పాటు పాస్‌పోర్టు కార్యాలయం, మెడికల్ కళాశాల తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఈ సారి గెలిపిస్తే సదా మీ సేవలో ఉంటానన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్‌రెడ్డి, నేతలు మహేష్‌కుమార్‌గౌడ్, కేశ వేణు, తాహెర్‌బిన్ తదితరులు పాల్గొన్నారు. -
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
-
మన దళాలు సత్తా చాటాయ్ : ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ : వైమానిక దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నేడు జరిగిన వైమానిక దాడులు నేరుగా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా సాగుతూ ఉగ్రమూకలను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి భారత్ పోస్టులకు సైన్యం చేరుకుందని ఆజాద్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులకు వైమానిక మెరుపు దాడులు జరిగిన తీరును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన దళం మిరేజ్ యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. -
ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం
-
ఒంటరిగా 80 స్థానాల్లో పోటీ
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం ఒంటరి పోరుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వెల్లడించారు. ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్‌తో సమావేశమైన ఆజాద్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని పోతామని ఆజాద్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అఖిలేష్, మాయావతిలు శనివారం కూటమిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం పరచడానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫిబ్రవరిలో 15 ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతో కీలకమైన యూపీలో బలం పెంచుకునేందుకు హస్తం నేతలు సర్వశక్తులొడ్డుతున్నారు. కాగా రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలలో తాము అభ్యర్థిని నిలపమని ఎస్పీ, బీస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ ‘వార్ రూమ్’ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు బుధవారం ఏఐసీసీ వార్ రూమ్‌లో భేటీ అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని, ఈ లోపే క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుందని భేటీలో నిర్ణయించారు. గత నెలలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతలో ఇంకా వెనకబడే ఉన్నామని పలువురు ప్రస్తావించారు. ఎన్డీయేను అధికారం నుంచి దింపేందుకు అవసరమైన వ్యూహాలపై భేటీలో చర్చించారు. అయితే, విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడం బీజేపీకి లాభించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ప్రస్తావించిన ఖర్గే, అహ్మద్ పటేల్ తదితర నేతలు వాటిని అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. కీలక రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుపై ఒక అవగాహన, స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు, రాష్ట్రాల్లోని పీసీసీలకు మధ్య సమన్వయం అవసరమని పలువురు సూచించారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ‘ఏక వ్యక్తి సైన్యం’లా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన సంస్థాగత బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, పార్టీలో రాష్ట్రాల వారీగా సీనియర్లు, యువ నేతల మధ్య సయోధ్యకు, సహకారానికి రాహుల్ ప్రయత్నించాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు విజయావకాశాలు బలంగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందన్నారు. -
‘తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యం’
నాగర్ కర్నూలు: తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మహాగర్జన సభలో బుధవారం ఆజాద్ మాట్లాడారు. మీ కోసం ఒక శుభవార్త.. కేసీఆర్ ఈ సారి చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డిపై జరిగిన కుట్ర బాధాకరమన్నారు. రేవంత్‌ని బంధించి సభ నిర్వహించే దుస్థితికి కేసీఆర్ దిగిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. యువకులు, వృద్ధులు, రైతులందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు..మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అని అబద్ధపు వాగ్దానం చేసి వాళ్లని మోసం చేశారని దుయ్యబట్టారు. జిల్లాలు, ప్రముఖ మండల కేంద్రాల్లో నిర్మిస్తానన్న వంద పడకల ఆసుపత్రులు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. దేశంల మొత్తంలో ఫాంహౌస్‌లో కూర్చుని రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలైతే..నేను తెచ్చానంటూ బూటకపు మాటలతో కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. బిడ్డకు జన్మనిచ్చిన వాళ్లే ఆ బిడ్డ బాగోగులను బాగో చూసుకోగలరని, అలాగే తెలంగాణా మావల్లే ఏర్పడిందని, తామే బాగు చేస్తామని అన్నారు. మహాకూటమిని గెలిపించాలని ప్రజానీకానికి విన్నవించుకుంటున్నామని తెలిపారు. హర్షవర్దన్‌ను గెలిపించండి..ఈ ప్రాంతాన్ని మేం అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. -
కూటమి వస్తే సీఎం రేవంత్ రెడ్డేనా?
సాక్షి, హైదరాబాద్ : సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్ ఉన్నారు. రేపు అదే కుర్చీలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు’ అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డెనా? ఎన్నికల కీలక దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీశాయి. ఆయన వ్యూహత్మకంగా అన్నారా లేక, ఆయాచితంగా అన్నారా? అనే ప్రశ్న సీనియర్ నేతలను వెంటాడుతోంది. కాగా సీఎం రేసులో ఇదివరకే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రేవంత్.. ఆయన పరిచయాలతోనే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పలువురు నేతలకు టికెట్లు దక్కించుకోగలిగారు. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను పరామర్శించిడానికి వెళ్లిన ఆజాద్ సీఎం పీఠంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
‘సీఎం సీటులో రేవంత్ కూడా ఉండొచ్చు’
సాక్షి, వికారాబాద్ : సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఈరోజు సీఎం సీటులో కేసీఆర్ ఉండొచ్చని, రేపు అదే సీటులో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చని అన్నారు. అర్థరాత్రి రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఆయన కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల ప్రచారానికి నేడు (బుధవారం) చివరి రోజు కావడంతో ఉదయమే ప్రచారానికి వెళ్లిన రేవంత్ కోసం ఆజాద్ గంటపాటు ఎదురుచూశారు. మంగళవారం కేసీఆర్ కోస్గి సభ ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ రేవంత్‌ను మంగళవారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘కేసీఆర్ మావద్ద కూలీగా పనిచేశాడు’
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్ పుణ్యానికి సీఎం అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు జరిగిన రోడ్‌షోలో ఆజాద్‌తో పాటు సినీ నటి నగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ తన వద్ద కూలీ మనిషిలా పనిచేశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్థులు..!
సాక్షి, నల్లగొండ : ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. బద్ధ శత్రువులైన ఈ ఇద్దరు నేతలు ఎన్నికల వేళ చేతులు కలుపడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలో దుబ్బాక నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గులాం నబీ ఆజాద్ తదితరులు దుబ్బాక ఇంటికి వెళ్లారు. దుబ్బాకతోపాటు ఆయన అనుచరగణం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరిక అనంతరం నల్గొండ పట్టణంలో మహాకూటమి నేతలు రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బాక నర్సింహారెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని పోటీకి దింపి.. కేసీఆర్ తనను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఏమీకాదని, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామన్నారు. -
‘మెరుపులా వచ్చింది.. మెరుపులానే పోతుంది’
జడ్చర్ల: కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ మెరుపులా వచ్చిందని..ఎన్నికలై పోయిన తర్వాత మెరుపులానే కనపడకుండా పోయిద్దని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన మైనార్టీల సదస్సుకు గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణాలో మా బలం పెరిగిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్టేట్మెంట్తో తెలంగాణ రాలేదని, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణాను తామే ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మా రెడ్డి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. -
ముగ్గురూ..ముచ్చట
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్లో ప్రజాఫ్రంట్ అగ్రనేతల ప్రచారం జోరందుకుంది. గురువారం కూటమి అభ్యర్థుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జమ్ము అండ్ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ తదితరులు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా చేసిన ప్రచారంతో శ్రేణుల్లో నూతనోత్తేజం ఉరకలేస్తోంది. గెలుపుపై అభ్యర్థుల్లో సైతం ధీమా వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పక్షాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు ప్రత్యేక వ్యూహంతో విభిన్న కార్యక్రమాలతోముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిæకే రాహుల్ గాంధీ, చంద్రబాబులు సనత్‌నగర్, నాంపల్లి బహిరంగ సభల్లో ప్రసంగించగా, అంతకుముందు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నేతల భేటీలు.. రోడ్‌షోలు రాహుల్ గాంధీ గురువారం నగర శివారు శంషాబాద్‌లోని ఓ హోటల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు, కేజీ టు పీజీ జేఏసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. విద్యా రంగ సమస్యలపై వారితో చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో ప్రసంగించారు. ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్‌కు సృష్టికర్త తానే నంటూ చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఘనత తనదేనంటూ ప్రసంగించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శనస్త్రాలు సంధించారు. బీజేపీపై మండి పడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ర్యాలీ, బహిరంగ సభల్లో గులాం నబీ అజాద్ ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. -
‘ఎంఐఎంని ప్రోత్సహించి కాంగ్రెస్ తప్పు చేసింది’
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీ అభివృద్ధి ఎంఐఎంకు పట్టదని విమర్శించారు. వాళ్లకు కావాల్సిందల్లా భూకబ్జాల్లో పోలీసుల సహకారం అని మండిపడ్డారు. ఎంఐఎం విషయంలో తమ పార్టీ తప్పుచేసిందని అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు ఒకటే అని ఆరోపించారు. ఢిల్లీలో ఆ మూడు పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడని.. కానీ తెలంగాణలో మాత్రం తాము వేర్వేరు అన్నట్టు పోటీ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, జాతులను, ధర్మాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ కోసమే పనిచేసిందని అన్నారు. కేసీఆర్ బీజేపీ గెలుపు కోసం, బీజేపీ కేసీఆర్ గెలుపు కోసం కష్టపడుతున్నాయని ఆయన ఆరోపించారు. కూటమిలో ఉన్న అందరు కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి మీటింగ్ కూడా పెట్టారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఇద్దరు కవల పిల్లలేనంటూ ఆరోపించారు. బేటీ బచావో.. బేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు గతంలో కంటే ఇప్పుడే పెరిగాయని పేర్కొన్నారు. కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా.. వారికి మూడెకరాల భూమి ఇస్తా.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్నారు.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ విద్యా వ్యతిరేకి.. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండ పని చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. -
సూదిమొనంతా లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కేసీఆర్ లేదా టీఆర్ఎస్ నేతలను తాము ఎప్పుడూ అడగలేదని, కనీసం వారి తో మాట్లాడలేదన్నారు. ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాట్లాడి మాత్రమే పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మ ద్, శ్రీనివాస కృష్ణన్లతో కలసి ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన చర్చల పరంపరను వివరించారు. ప్రజల ఆకాంక్షల ప్రకారమే తెలంగాణ ఇచ్చాం ‘రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. నేనే అందరితో చర్చలు జరిపా. ప్రాంతాలవారీగా పార్టీ నేతలతో డజన్లసార్లు సమావేశమయ్యా. ఆ చర్చల్లో తెలంగాణ కి చెందిన పార్టీ నేతలు ప్రత్యేకించి ఎంపీలు రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని ఒత్తిడి తేవడంతోపాటు గొడ వ చేశారు. అధికార పార్టీలో ఉండి వారు పార్లమెం టు కార్యకలాపాలను స్తంభింపజేశారు. ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ నేతలు మాత్రం నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు. రాష్ట్రం ఏర్పాటు చేశాక మాత్రం ఆందోళనకు దిగారు. మీరే హైకమాండ్ ఇష్టమన్నారు కదా అని అడిగితే హైకమాండ్ తెలంగాణ ఇవ్వదని భావించి అలా చెప్పామన్నారు.తెలంగాణ నేతలు, ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మేము ఒక్కసారి కూడా ఇప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడలేదు. ఈ నిర్ణయం తీసు కోవడంలో టీఆర్ఎస్ పాత్ర లేదు. ఒకవేళ వాళ్ల పాత్ర ఏదైనా ఉందనుకుంటే ఎప్పుడు, ఎవరు, ఎలాంటి హామీ ఇచ్చారో, చర్చలు జరిపారో చెప్పాలని టీఆర్ఎస్ను చాలెంజ్ చేస్తున్నా’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పం టను దళారి దోచుకున్నట్టు టీఆర్ఎస్ వ్యవహరించిం దని విమర్శించారు. ‘తెలంగాణ కోసం విత్తనాలు వేసింది మేము. దుక్కి దున్నింది మేము. పంట పం డించింది మేము. పంటను కోసుకెళ్లింది మాత్రం టీఆర్ఎస్’అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తారని ఆశిస్తున్నామన్నారు. దొందూ దొందే!: అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దొందూ దొందేనని, ఇద్దరూ యువతను పూర్తిగా వంచించారని ఆజాద్ దుయ్యబట్టారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కనీసం సీఎం అయ్యే నాటికి ఉన్న ఖాళీలనూ భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయలేని ఆయన కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారని నిలదీశారు. అలాగే ఐదేళ్ల లో 10 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ ఇప్పటివరకు 5–6 లక్షల ఉద్యోగాలే కల్పించగలిగారని విమర్శించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఒక్కటే ఇస్తే సరిపోదని, వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే నిజమైన ఉపశమనమని ఆజాద్ అభిప్రాయపడ్డారు. మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ..? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గుజరాత్ వరకు లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు గతంలో వచ్చి ఉన్నత విద్య అభ్యసించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం అయ్యాక స్థానిక విద్యార్థులు, బయటి నుంచి వచ్చి చదువుకుంటున్న వారు ఇబ్బందుల పాలవుతున్నారని, మిగులు బడ్జెట్ ఉన్నా రా>ష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నిలిపివేయడం వల్ల 50–70 శాతం విద్యా సంస్థలు నిర్వీర్యమైపోయాయని, 70–75 శాతం మంది సాంకేతిక విద్యకు దూరమయ్యారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదలకు కట్టిస్తామని చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్సార్ ఘనతే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని ఆజాద్ కొనియాడారు. అప్పుడు అమల్లోకి వచ్చిన 4 శాతం రిజర్వేషన్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయన్నారు. ‘2004 ఎన్నికల ప్రచారంలో నేను రెండు హామీలిచ్చాను. అప్పుడు మా సిట్టింగ్ స్థానాలను కూడా పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మా నేతల్లో అసంతృప్తి వచ్చింది. వారందరినీ ఎమ్మెల్సీలు చేస్తామని చెప్పాను. అందుకోసం కౌన్సిల్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాను. ఆ తర్వాత ముస్లిం రిజర్వేషన్ల గురించి కూడా చెప్పాను. దక్షిణా దిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకకన్నా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. అందుకే అక్కడ 4 శాతం రిజర్వేషన్లు ఉంటే ఏపీలో 5 శాతం ఇస్తామని హామీ ఇచ్చాను. ఇదే విషయాన్ని ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌కు ఫోన్లో చెప్పాను. ఆయన కూడా సమ్మతించి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ దీనిపై కొందరు కోర్టుకెళ్లడంతో దాన్ని 4 శాతం చేయాల్సి వచ్చింది. ఆ 4 శాతమే ఇప్పటివరకు కొన సాగుతోంది. మేం 5 శాతం ఇచ్చినప్పుడే కోర్టు అంగీ కరించలేదు. ఇప్పుడు 12 శాతం అంటే కూడా ఒప్పుకోదని కేసీఆర్‌కు బాగా తెలుసు. అమలు సాధ్యం కాదని తెలిసీ ఆయన అబద్ధాలు చెప్పి మోసం చేశారు. అధికారంలోకి వస్తే హుస్సేన్‌సాగర్ నీటిని పాలలాగా మారుస్తామంటూ ఇచ్చే తప్పుడు హామీ ఎలాంటిదో ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామం టూ కేసీఆర్ ఇచ్చిన హామీతోనే నిలువునా మోసం చేశారు’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్దే కుటుంబ పాలన టీఆర్ఎస్ది కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే గాంధీ కుటుంబం కూడా కాంగ్రెస్‌ను, దేశాన్ని ఏలిందని టీఆర్ఎస్ నేతలంటున్నారు కదా అని ప్రశ్నించగా గాంధీ కుటుంబ పాలనకు, టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చాలా తేడా ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆజాద్ కోరారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన నెహ్రూ ప్రధాని అయ్యారని, ఆయన మరణించాక ఇందిరాగాంధీ, ఆమె చనిపోయాకే రాజీవ్‌గాంధీ ప్రధానులు అయ్యారన్నారు.అంతే తప్ప కేసీఆర్ నియమించినట్లుగా కొడుకు, అల్లుడు మంత్రులుగా, కూతురు ఎంపీ కాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదన్నప్పుడు తెలంగాణ ఇచ్చాక ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించగా తామెప్పుడూ టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని అడగలేదని ఆజాద్ చెప్పారు. ఆ విషయం కూడా కేసీఆరే చెప్పారని, పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోనే ఉండనని కేసీఆర్ చెప్పారని, ఈ విషయంలోనూ కేసీఆర్ మోసం చేశారన్నారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. బీజేపీతో వ్యవహరించే విషయంలో టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆజాద్ మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి విషయాల్లో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవగా టీఆర్ఎస్ మాత్రం బీజేపీకి మద్దతు పలికిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ టీఆర్ఎస్ అదే చేసిందని, బయట మాత్రం బీజేపీపై గొడవ చేస్తున్నట్లు నటించిందని విమర్శించారు. కేసీఆర్ చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులోనూ అబద్ధం ఉంటుందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో కేంద్రం చేసింది తప్పయితే అందులో టీఆర్ఎస్ పాత్ర కూడా ఉంటుందని, ఆ రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆజాద్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఎంఐఎంను సర్కారీ పార్టీగా ఆయన అభివర్ణించారు. అధికారంలో ఎవరుంటే వారితో కలసి ఒవైసీ వెళ్తారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించి ప్రశ్నించగా వివిధ రాష్ట్రాల్లోని పార్టీల మధ్య పొత్తులకు అంగీకారం తెలపాల్సిన ఐదుగురు సభ్యుల అధిష్టాన కమిటీలో తానూ సభ్యుడినని, ఇప్పటివరకు అధిష్టానం వద్ద ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. -
దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత నాలుగేళ్లుగా అప్రకటిత అత్యయిక స్థితి నెలకొందని, ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశత్వంతో వ్యవహరి స్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ ఆరోపిం చారు. ప్రధాని మీడియాను గుప్పిట్లో పెట్టుకుని, విపక్షాలు మాట్లాడింది చూపించకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.520 కోట్లకు ఒక రాఫెల్ విమానం చొప్పున మొత్తం 126 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోగా, ప్రధాని మోదీ ఏకంగా రూ.1,670 కోట్లకు ఒక విమానం చొప్పున కేవలం 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. ఒకే రకమైన విమానాన్ని 300 శాతం అధిక ధరతో కొనుగోలు చేయడం కుంభకోణం కాదా? ప్రజలపై పడిన రూ.41 వేల కోట్ల అదనపు భారానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ నేతలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, రక్షణతో రాజీపడిందని విమర్శించారు. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొవడానికి 128 యుద్ధ విమానాలు అవసరమని 2007లో వాయుసేన అధిపతి ప్రతిపాదించారని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ముప్పు తీవ్రత ఇంకా పెరిగిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్యను 128 నుంచి 36కు తగ్గిస్తూ ప్రధాని మోదీ సొంతంగా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రపంచంలో 21 శతాబ్దపు అతిపెద్ద కుంభకోణం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందమని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని, జేపీసీ ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేసినా, ఆయన నోరు మెదపలేదని, జేపీసీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. పార్లమెంటరీ, కార్యనిర్వాహక వ్యవస్థలు విఫలం కావడంతో మరో దారి లేక మీడియా ద్వారా రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని అజాద్ చెప్పారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదన్నారు. నెహ్రు, ఇందిర, వాజ్‌పేయి ఏనాడూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. స్వయంగా రాఫెల్ ఒప్పందం చేసుకున్న ప్రధాని మోదీ.. సభ లోపల, బయట ఎక్కడా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడంలేదని విమర్శించారు. యూపీఏతో పోలిస్తే 9 శాతం తక్కువ అని న్యాయశాఖ మంత్రి, 20 శాతం తక్కువ అని ఆర్థిక మంత్రి, 40 శాతం తక్కువ అని వాయుసేన అధిపతి అంటారని.. ప్రధాని మోదీకి తప్ప, మరెవరికీ అసలు ధర ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ఎవరికీ చెప్పకుండా సొంతంగా ఒప్పందం... రక్షణ మంత్రి నేతృత్వంలో వాయుసేన, సైన్యం, నావికాదళం, కోస్ట్‌గార్డ్, డీఆర్డీవో, డిఫెన్స్ ప్రొడక్షన్స్ విభాగాల అధిపతులతో కూడిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ 2007లో చేసిన సిఫారసుల ఆధారంగా 126 యుద్ధ విమానాల కొనుగోళ్లకు గత యూపీఏ ప్రభుత్వం 2010లో టెండర్లు నిర్వహించి అతి తక్కువ ధర సూచించిన ఫ్రెంచ్ కంపెనీ ‘అస్సాల్ట్ ఏవియేషన్’తో 2014లో ఒప్పందం కుదుర్చుకుందని అజాద్ తెలిపారు. ఎగరడానికి సిద్ధంగా 18 విమానాలను సరఫరా చేయాలని, మిగిలిన 108 విమానాలను ఫ్రెంచ్ కంపెనీ పర్యవేక్షణలో హెచ్ఏఎల్లో తయారుచేయాలని ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన ప్రధాని మోదీ 2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్, కనీసం కేంద్ర మంత్రివర్గం, సెక్యూరిటీ అఫైర్స్ కమిటీ, రక్షణమంత్రి, విదేశాంగ మంత్రిలకు సైతం తెలపకుండా ప్రధాని ఇంత పెద్ద నిర్ణయాన్ని స్వయంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకున్నారని ఆరోపించారు. హెచ్ఏఎల్కు బదులు అప్పటికి ఇంకా రిజిస్ట్రర్డ్ కాని ఓ ప్రైవేటు కంపెనీ(రిలయన్స్ గ్రూపు)కి ప్రయోజనం కలిగించడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని 2015 ఏప్రిల్‌లో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే జూన్‌లో పాత ఒప్పందాన్ని రద్దు చేశారని, గ్రామపంచాయతీల్లో జరిగే పనులకు సైతం ఇలా చేయరని అజాద్ తప్పుబట్టారు. హెచ్ఏఎల్కు అవకాశం ఇచ్చి ఉంటే అత్యాధునిక విమానాల ఉత్పత్తిలో అనుభవం గడించేదని, భవిష్యత్తులో విదేశాల నుంచి విమానాల కొనుగోళ్లకు అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాగా, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖలను కేంద్రం కక్షసాధింపు చర్యలకు వాడుకోవడంతో అవి విశ్వనీయత కోల్పోయాయని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వీహెచ్, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. సుబ్బరామిరెడ్డికి అజాద్ పరామర్శ... విలేకరుల సమావేశం అనంతరం అజాద్.. గాంధీభపన్లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. తర్వాత షబ్బీర్ అలీ మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై, రాత్రికి పార్క్ హయత్‌కు హోటల్‌కు వెళ్లి బస చేశారు. గురువారం గాంధీభవన్‌లో మరోసారి టీ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమవుతారు -
కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం అభియోగాలు..
సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లపై ఢిల్లీ కోర్టులో దేశద్రోహం ఫిర్యాదు నమోదైంది. పటియాలా హౌస్ కోర్టులో న్యాయవాది శశభూషణ్ఈ మేరకు ఫిర్యాదు దాఖలు చేశారు. జమ్మూ కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా హతమారుస్తున్నారని గులాం నబీ ఆజాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆజాద్‌పై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, సైన్యంపై వదంతులు వ్యాప్తిం చేయడం వంటి అభియోగాలు నమోదు చేసి చర్యలు చేపట్టాలని శశిభూషణ్ కోర్టును అభ్యర్థించారు. సైన్యాన్ని అమాయకులను హతమార్చే కిల్లర్లుగా పేర్కొనడమంటే దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదని పిటిషనర్ తన అప్పీల్లో పేర్కొన్నారు. మరోవైపు కాశ్మీరీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న పర్వేజ్ ముషారఫ్ ప్రతిపాదనను సమర్ధించారన్న మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్పైనా దేశద్రోహ అభియోగాలు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని సోజ్ ఆరోపించారు. తాను రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా సోజ్ మాట్లాడుతూ పొరుగుదేశంతో యుద్ధాన్ని నివారించేందుకు కశ్మీర్‌ను పాక్‌కు అప్పగించేందుకు వల్లభాయ్ పటేల్ సిద్ధమయ్యారని, ఈ మేరకు పాక్ తొలిప్రధాని లయాఖత్ అలీ ఖాన్‌తో మంతనాలు జరిపారని సోజ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లార్డ్ మౌంట్‌బాటెన్ ప్రస్తావించారని, జవహర్లాల్ నెహ్రూ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తన పుస్తకానికి ప్రాచుర్యం కల్పించుకునేందుకే సోజ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టింది. -
‘కాంగ్రెస్ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో సైనిక, పారా మిలటరీ దళాలు ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా చంపుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని విడదీయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తారిఖ్ హమీద్ వంటి పాకిస్తానీ వకాల్తాదార్లను పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని వాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తారిఖ్ హమీద్‌ను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆజాద్, సోజ్‌లతో పాటు ప్రస్తుతం మరో పాకిస్తానీ ప్రతినిధి(వకాల్తాదారు) హమీద్‌కు కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం లభించింది. పాకిస్తానీ భాష మాట్లాడే మిస్టర్ హమీద్ కర్రా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ’ బీజేపీ ట్వీట్ చేసింది. Azad and Soz are not exceptions, another Pakistan proxy finds his rightful place in the Congress party! Mr Tariq Hameed Karra, who is known for speaking the language of Pakistan, recently joined the Congress in the presence of Smt. Sonia and Rahul Gandhi. #CongLeTGathbandhan pic.twitter.com/sMVu3bbmXN — BJP (@BJP4India) June 22, 2018 -
కుంతియాను అవమానించారా?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన కాంగ్రెస్ బస్సుయాత్ర కోఆర్డినేషన్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఇన్చార్జ్గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్చార్జ్గా ఉండాలని నాకేం లేదు. కానీ పార్టీ ప్రకటించిన తర్వాత ఏమైనా చేసుకోండి. అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని కుంతియా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.’ కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుంతియా సమర్థవంతంగా పని చేయడం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. అయితే అధికారిక ప్రకటన రాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు ఆజాద్ రాకను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కుంతియ కినుక వహించినట్లు సమాచారం.