బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తోందని ...
న్యూఢిల్లీ : బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. లోక్ సభలో బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తూ బిల్లులను పాస్ చేయించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ సామాజిక, సంక్షేమ పథకాల నిధులకు మోదీ సర్కార్ కోతలు పెడుతోందని ధ్వజమెత్తారు. లోక్సభలో బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రాజ్యసభలో నాన్ మనీ బిల్లులను మార్చి పాస్ చేయించుకుంటున్నారని ఆరోపించారు.