
సిమ్లా/న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయపార్టీల నుంచి ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం సిమ్లాలో తెలిపారు. బుధవారం పట్నాలో ఆయన మాట్లాడుతూ పీఎం పదవికి కాంగ్రెస్‌కు దక్కకపోయినా ఇబ్బంది లేదన్నారు. పీఎం పదవి తమకే కావాలనే సంకేతాలను గతంలో కాంగ్రెస్ ఇవ్వడంతో కొన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు దూరం జరిగాయి. అయితే ఆజాద్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామనీ, సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందని ఆయన తెలిపారు.