Regional Party
-
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
Mizoram Election Result 2023: మిజోరంలో జెడ్పీఎం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) సంచలన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)ను మట్టికరిపించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరం ఎన్నికల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి రెండు స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్ఎఫ్కు దారుణ పరాభవం ఎదురైంది. ఎంఎన్ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి జోరామ్‌తాంగ ఓటమిపాలయ్యారు. ఐజ్వాల్ ఈస్ట్–1 స్థానంలో ఆయనపై జెడ్పీఎం అభ్యర్థి లాల్థాన్సాంగ 2,101 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. జెడ్పీఎం నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహొమా.. సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి జె.వాంచ్వాంగ్పై 2,982 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మంత్రుల్లో ఏకంగా 9 మంది పరాజయం పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి తాన్లూయా, ఆరోగ్య శాఖ మంత్రి ఆర్.లాల్థాంగ్లియానా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లారౌత్కిమా, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానా, వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రి సి.లాల్రిన్సంగా, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.లాల్రిన్లియానా, ఎక్సైజ్ శాఖ మంత్రి లాల్రినామా తదితరులు ఓడిపోయారు. పాఠశాల విద్యా శాఖ మంత్రి లాల్చాందామా రాల్టే, పర్యాటక శాఖ సహాయ మంత్రి రాబర్ట్ రొమావియా రాయ్టే విజయం సాధించారు. మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధ్యక్షుడు లాల్దుహొమా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పారీ్టలు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 23 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. రాష్ట్రంలో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) సైతం పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ‘ఆప్’ ఖాతా తెరవలేకపోయింది. స్వతంత్రులెవరూ నెగ్గలేదు. ఇందిరాగాంధీ అంగరక్షకుడు కాబోయే ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన మొట్టమొదటి ఎంపీగా అప్రతిష్ట మూటగట్టుకున్న 73 ఏళ్ల లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. లాల్దుహొమా ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందికి ఇన్చార్జిగా సేవలందించారు. ఆయన నాయకత్వంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) 2019లో రాజకీయ పారీ్టగా ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నాలుగేళ్లలో మిజోరం ఎన్నికల్లో అతిపెద్దగా పార్టీగా అవతరించి, అధికారం చేపడుతుండడం విశేషం. లాల్దుహొమా తొలిసారిగా 1984లో కాంగ్రెస్ టికెట్‌పై మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. కేవలం 846 ఓట్ల తేడాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మిజోరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో ఆ పారీ్టకి రాజీనామా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి లాల్ థాన్హాలాకు, కేబినెట్ మంత్రులకు వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు లాల్దుహొమాపై ఆరోపణలు వచ్చాయి. 1988లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. అలాగే 2020లో ఎంఎన్ఎఫ్ ఎమ్మెల్యేగా ఉన్న లాల్దుహొమాపై మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సాయ్‌లో అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ లాల్దుహొమాపై ఎంన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మిజోరంలో ఈ చట్టం కింద అనర్హతకు గురైన మొదటి ఎమ్మెల్యే లాల్దుహొమా కావడం గమనార్హం. జెడ్ఎన్పీ అభ్యర్థిగా 2003లో, 2008లో, 2018లో, 2021లోఎమ్మెల్యేగా ఆయన విజయం దక్కించుకున్నారు. రాజకీయ యోధుడిని ఓడించిన మూకదాడి బాధితుడు రాయ్‌పూర్: మత ఘర్షణల్లో కుమారుడిని కోల్పోయి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ తండ్రి చూపిన ధర్మాగ్రహం.. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్నికల్లో మట్టికరిపించింది. ఆదివారం వెల్లడైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందనేది ఓ సారి గమనిస్తే.. బేమేతరా జిల్లా బిరాన్‌పూర్ గ్రామంలో ఈశ్వర్ సాహూ అనే కార్మికుడికి 23 ఏళ్ల భువనేశ్వర్ సాహూ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ గ్రామంలో జరిగిన మత ఘర్షణల్లో వేరే మతానికి చెందిన అల్లరిమూక భువనేశ్వర్ సాహూను హతమార్చింది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ తమ సాజా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవీంద్ర చౌబేను తండ్రి వేడుకున్నాడు. భూపేశ్ బఘేల్ సర్కార్ తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఈశ్వర్ సాహూ కన్నీరుమున్నీరవడం, ఆయన ఆక్రందన నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హత్య ఘటన తర్వాత హతుడి తల్లినీ అల్లరిమూక బెదిరించింది. హత్యకు నిరసనగా నాడు విశ్వహిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలనే సంకల్పంతో ఇతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాజా నియోజకవర్గంలో రాజకీయ యోధుడిగా పేరొందిన రవీంద్ర చౌబేకు పోటీగా బరిలో నిలిపింది. ఈశ్వర్ సాహూకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహావేశాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. రవీంద్ర చౌబే కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. ‘ ఈశ్వర్ సాహూ ఒకప్పుడు కార్మికుడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే. హంతకులకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు ఈశ్వర్ తగిన గుణపాఠం చెప్పారు’ అని బీజేపీ ఐటీ విభాగ జాతీయ సమన్వయ కర్త అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. -
Karnataka Assembly Election 2023: జేడీ(ఎస్)కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లే
సక్లేశ్పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్‌తో జత కట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్పుర సెగ్మెంట్లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. -
వ్యూహం మార్చుకున్న టీఎంసీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనట్లేనా?
కోల్‌కతా: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. ఇకపై బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించనుంది. అవంటే గిట్టని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘బీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలతో చర్చలు ప్రారంభించాం. మా వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుంది’ అని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి టీఎంసీ సాయం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించడంతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్ అన్నారు -
కాంగ్రెస్‌తో లాభం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను పక్కనబెడతామన్నారు. జీవం కోల్పోయిన ఆ పార్టీ కోసం వేచి చూడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ వ్యవస్థాగతంగా గెలవగలిగే స్థితిలో ఉండేది. ఆ పార్టీ ఇప్పుడు ప్రతి చోటా ఓటమి చవిచూస్తోంది. గెలుపుపై ఆ పార్టీ నేతలకు ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. విశ్వసనీయత కోల్పోయిన ఆ పార్టీపై ఆధారపడటంలో అర్థం లేదు’అని తెలిపారు. బలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తే మరింత శక్తివంతంగా మారవచ్చునని చెప్పారు. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో మళ్లీ అధికారంలోకి రాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతుండగా, మమతా బెనర్జీ కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని కావాలనుకుంటున్నారనీ, ఇద్దరికీ తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఓట్లు లూటీ చేసి బీజేపీ గెలిచింది యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజా తీర్పుకి అద్దం పట్టడం లేదని మమతా బెనర్జీ అన్నారు. కాషాయ కూటమి ఎన్నికల యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. అందుకే సమాజ్‌వాదీ ఓడిందన్నారు. బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు. ‘‘ఏదో కొన్ని రాష్ట్రాల్లో నెగ్గామని బీజేపీ గొంతు పెంచొద్దు. ఈ విజయం ప్రజాతీర్పుకు నిదర్శనం కాదు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు. బీజేపీ పగటి కలలు ఆపాలి’’ అన్నారు. -
జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. చదవండి: అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని.. -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేలా వివిధ ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి బలీయమైన నేషనల్ ఫ్రంట్‌గా ఏర్పడుతాయని విశ్వాసముందన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోదన్నారు. తాము ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫ్రంటే బీజేపీని ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీతో తమ పార్టీ మైత్రీ బంధం కథ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీతో తమ పొత్తు శాశ్వతమన్నారు. రైతులకు సంబంధించిన అంశాలే తమ పార్టీ మేనిఫెస్టోలో కీలకమని, ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. అందుకే, వ్యవసాయ చట్టాలపై కేంద్రం తీరుకు నిరసనగా దశాబ్దాల నాటి బీజేపీ మైత్రీ బంధాన్ని సైతం తెంచుకుని, ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్‌లో అమలు కానీయ బోమన్నారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బాదల్ భార్య హర్సిమ్రత్ కౌర్ సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ప్రాంతీయ పార్టీలకు ప్రధాని పదవి
సిమ్లా/న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయపార్టీల నుంచి ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం సిమ్లాలో తెలిపారు. బుధవారం పట్నాలో ఆయన మాట్లాడుతూ పీఎం పదవికి కాంగ్రెస్‌కు దక్కకపోయినా ఇబ్బంది లేదన్నారు. పీఎం పదవి తమకే కావాలనే సంకేతాలను గతంలో కాంగ్రెస్ ఇవ్వడంతో కొన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు దూరం జరిగాయి. అయితే ఆజాద్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామనీ, సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందని ఆయన తెలిపారు. -
ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు: అఖిలేశ్
లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లొస్తాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ల కన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లొస్తాయనుకుంటున్నాను. తదుపరి ప్రధాని ప్రాంతీయ పార్టీల నుంచే అవుతారు’ అని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని రేసులో మీరున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ‘నేను ప్రధాని రేసులో లేను. కానీ తర్వాతి పీఎం ఉత్తర ప్రదేశ్ నుంచే అయితే నేను సంతోషిస్తా. ప్రధాని అభ్యర్థికి నా పూర్తి మద్దతుంటుంది’ అని అన్నారు. ఒక వేళ ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రియాంక గాంధీ వాద్రాకు మద్దతునిస్తే అన్న ప్రశ్నకు ‘మా కూటమి బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతోనే ఉంటుంది. వారణాసి నుంచి పోటీకి మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం’ అని తేల్చి చెప్పారు. బీజేపీ–కాంగ్రెస్ మధ్య రహస్య కూటమి ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఇటీవల యోగి ఆదిత్యనాథ్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఎవరికైనా గర్వం ఎక్కువ కాలం కొనసాగదు. ఈసారి రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన సమాధానం చెప్తారు’ అని వ్యాఖ్యానించారు. -
ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర
తిరువనంతపురం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయని, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీలకు అనేక అవకాశాలు దక్కాయని, కానీ ఆయా పార్టీలు తాము ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ఇక వారికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ తిరువనంతపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలో ని పలు ప్రాంతీయ పార్టీలతో టీఆర్ఎస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్, బీజేపీలతో కలవకూడదన్నదే ప్రాంతీయ పార్టీల కూటమి ప్రాథమిక ఎజెండా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఒకపక్క కీలకపాత్ర పోషిస్తూనే.. మరోపక్క కాంగ్రెస్, బీజేపీలను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు కృషిచేస్తాయి. కాంగ్రెస్, బీజేపీలను సాగనంపాల్సిన సమయం వచ్చింది. దేశంలో నాన్–కాంగ్రెస్, నాన్–బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. దీనికోసం మేం తీవ్రంగా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. అంతర్గతంగా పనిచేస్తున్నాం.. ఫెడరల్ ఫ్రంట్‌లో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఫ్రంట్ ఎలాంటి పాత్ర పోషించబోతుందో చూస్తారని అన్నారు. ఫ్రంట్‌లో భాగంగా ఒకే భావస్వారూప్యత గల పార్టీలతో అంతర్గతంగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశ పురోగతి కోసమే ఈ ఫ్రంట్ పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. -
ప్రాంతీయ పార్టీలతో పట్టువిడుపులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల సహాయంతో 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదిరించాలనే వ్యూహానికి కాంగ్రెస్ పదునుపెడుతోంది. ప్రాంతీయ పార్టీకి స్వేచ్ఛనిచ్చినట్లు చూపించడం ద్వారా పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక శక్తులైన ప్రాంతీయ పార్టీలను కూడగట్టాలనేది కాంగ్రెస్ ఆలోచన. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతున్న నేపథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోవడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. అయితే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో పార్టీ నేతల్లో అసంతృప్తిని అర్థం చేసుకోవడం, పార్టీ ప్రయోజనాలకోసం వారికి నచ్చజెప్పడం రాహుల్ గాంధీ ముందున్న పెద్ద సవాల్. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందే కూటములు ఏర్పాటు చేసుకోవాలంటూ రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగానే ఢిల్లీతోనే ఈ పొత్తులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు గానూ.. కాంగ్రెస్ 4, ఆప్ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో బలహీనంగా ఉన్నందున ఎస్పీ, బీఎస్పీలతో సీట్ల విషయంలో ఆ పార్టీ పట్టుబట్టకపోవచ్చని సమాచారం. -
ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు
కుటుంబ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కుటుంబ కలహాలతో బజారుకెక్కిందన్నారు. కుటుంబ పార్టీలు ఎక్కడున్నా అదే జరుగుతుందని, ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక... రూ.వంద కోట్ల స్వాహాకు దారితీసిందన్నారు. నగరంలో చిన్న వాన వచ్చినా నదుల మాదిరిగా పరిస్థితి తయారవుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో పలువురు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్, క్యాంప్ ఆఫీసుల నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి 85 వేల ఇళ్లు కేటాయించినా, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు 3 ఎకరాలు తదితర హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,060 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.430 కోటల బకాయిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాస్తు పేరిట కొత్త సెక్రటేరియట్ భవనాలకు రూ.350 కోట్లు వెచ్చించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘స్వచ్ఛ దివాళి-సేప్ దివాళి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. -
వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం
-
జాతీయ పక్షాల్లో ‘ప్రాంతీయ’ బెంగ
విశ్లేషణ సరిగ్గా తొలి విడత ఎన్నికలకు వారం ముందు కాంగ్రెస్ ముందుకు తెచ్చిన సెక్యులర్ ఫ్రంట్ ప్రతిపాదనతో బీజేపీ ఉలిక్కిపడింది. ఆ ఉలికిపాటు కాంగ్రెస్‌లాగే బీజేపీ సైతం గెలుపు పట్ల ధీమాగా లేదని స్పష్టం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో కింగ్మేకర్స్ అనే వాస్తవాన్ని ఈ చర్య, ప్రతిచర్యలతో కాంగ్రెస్, బీజేపీలు అంగీకరించక తప్పలేదు. ‘గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకోడం’ అని వినడమేగానీ చూడలేదు. ఆ ముచ్చటను బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీర్చారు. దేశ రక్షణను సైతం మరచి కాంగ్రెస్ రక్షణలో మునిగిన రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఇలా ‘సెక్యులర్ ఫ్రంట్’ అన్నారో లేదో జైట్లీ భుజాలు తడుముకున్నారు. ‘థర్డ్ ఫ్రంట్ పీడ కల’అని కలవరించసాగారు. అంతకుముందే జాతీ య ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని ‘కాంగ్రెస్ ఓటమి ఒప్పుకోలు’ అని ఆదివారం రాత్రి విందు భోజనంగా వడ్డించింది. కేరళ ఎన్నికల బరిలో ప్రత్యర్థులైన కమ్యూనిస్టులను తిట్టాల్సిన తిట ్లన్నీ తిట్టి మరీ ఆంటోనీ బయటకు తీసిన ‘సెక్యులర్ ఫ్రంట్’ను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సహజంగానే దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎంతగా తిట్టిపోస్తున్నా, థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నా... ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే ముప్పును నివారించడానికి వామపక్షాలు కాంగ్రెస్‌తో చేతులు కలపక తప్పదని ఆంటోనీ మాటల సారాంశం. కాంగ్రెస్ సహా బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి సెక్యులర్ ఫ్రంట్‌గా అధికారం నెరపవచ్చన్న ఎర. 1996 కాదు 2014 పోలింగ్‌కు సరిగ్గా వారం ముందు అంటే రాజకీయ పార్టీలు ఆత్మవంచనను కట్టిపెట్టాల్సిన సమయం. ఆంటోనీ అదే చేశారు. ఈ ఎన్నికల్లో తమది ఎదురీతేనని ముందే తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల తదుపరి ఆడాల్సిన ‘ఆట’కు ఎప్పుడో సిద్ధమైంది. సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్ నుంచి బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ వరకు ఎన్నికల తదుపరి థర్డ్ ఫ్రంట్ గురించి చర్చిస్తుండగా... దాన్ని వదిలి కాంగ్రెస్ ‘సెక్యులర్ ఫ్రంట్’ అనడం... కొత్త సీసాలో పాత సారాను అందించే ప్రయత్నమేనా? కాంగ్రెస్ ప్రస్తావించని థర్డ్‌ఫ్రంట్ ‘పీడకల’ను గురించి కలవరిస్తూ జైట్లీ ఆ పార్టీ 1996ను పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. 1996 ఎన్నికలకు ముందే ‘నేషనల్ ఫ్రంట్’ ఉంది. ఎన్నికల తర్వాత అది వామపక్ష ఫ్రంట్‌తో కలసి ‘యునెటైడ్ ఫ్రంట్’గా మారింది. కాంగ్రెస్ దానికి బయటి నుంచి మద్దతునిచ్చి ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సైతం నిలవలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించింది. సీపీఎమ్ అగ్రనేత, బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఏకగ్రీవంగా యునెటైడ్ ఫ్రంట్ ప్రధానిగా నిర్ణయించినా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కారత్ ‘చారిత్రక తప్పిదం’ చేసి మోకాలడ్డారు. కాంగ్రెస్ యథేచ్ఛగా యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంతో ఆటలాడే అవకాశాన్ని కల్పించారు. అదే అదను కాంగ్రెస్‌గా వరుసగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ల ప్రభుత్వాలను నిలిపి, కూలదోసి 1998 మధ్యంతర ఎన్నికలకు పరుగులు తీసింది. ఏం బావుకుంది? 1998లో ఒక్క సీటు ఎక్కువ సంపాదించి (140 + 1), కిక్కురుమనకుండా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూచోవాల్సి వచ్చింది. బీజేపీ 21 సీట్లు పెంచుకోగా (161 + 21 = 182). ఎన్డీఏగా బీజేపీ కూటమి 254 స్థానాలతో పూర్తి కాలం సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలిగింది. ఆ చేదు అనుభవం తర్వాత కూడా కాంగ్రెస్ మళ్లీ అదే ఆట ఆడాలనుకుంటోందా? అవుననే అనుకున్నా, దాన్ని చూసి జైట్లీ పీడకలంటూ ఎందుకు బెదిరిపోతున్నట్టు? అదీ కూడా నాడు యునెటైడ్ ఫ్రంట్‌కు వెన్నెముకగా నిలిచిన వామపక్షాలు నేడు దయనీయమైన స్థితిలో ఉండగా ఎందుకీ భుజాల తడుములాట? బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకటే పీడకల తిరిగి అధికారంలోకి రానున్నామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆర్భాటమంతా మేకపోతు గాంభీర్యమేనని అందరికీ తెలిసిందే. కాకపోతే జైట్లీ పీడకల బీజేపీ ప్రదర్శిస్తున్న గెలుపు ధీమా గుట్టును బయటపెట్టింది. ఆ పార్టీ అదే పనిగా ఊదరగొడుతున్నట్టుగా మోడీ గాలి దేశాన్ని చుట్టేయడం లేదు. బీజేపీకి ఒంటరిగా కాదుగదా, ఎన్డీఏకు కూడా 1998లోలాగా ఓటర్లు 254 సీట్లను కట్టబెట్టేయబోవడం లేదు. ఆ విషయం బాగా వారికే తెలుసు. కాబట్టే యూపీఏ అవినీతిని ప్రధాన అస్త్రం చేసుకున్న ఆ పార్టీ కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్పకు తిరిగి పార్టీ తీర్థం ఇచ్చింది. ‘చీపురు దెబ్బ’కన్నా జంకక బళ్లారి, కడగ్, కొప్పల్, చిత్రదుర్గ జిల్లాల్లో ఆ పార్టీ తలరాతను మార్చేయగల శ్రీరాములును (బీఎస్ఆర్ కాంగ్రెస్) అక్కున చేర్చుకుంది. బెంగళూరు పబ్ కీచక పర్వం ఫేమ్, శ్రీరామ్‌సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ ఓట్లను చీల్చి అసలుకే ఎసరు పెడతారన్న భయంతోనే కర్ణాటక బీజేపీ అతనికి పార్టీ తీర్థం ఇచ్చింది. సుపరిపాలన, అభివృద్ధి నినాదాలతో దేశవ్యాప్తంగా పట్టణ ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఖంగుతినిపించిన కేజ్రీవాల్ తలనొప్పి కొంత ఉపశమించినా, ‘ఆప్’ సంధించే అవినీతి అస్త్రాలు పంటి కింది పోటులా పరిణమించాయి. ఈ స్థితిలో జాతీయ నాయకత్వం ముతాలిక్ను ‘త్యాగం’ చేయక తప్పదని కర్ణాటక బీజేపీకి నచ్చజెప్పుకోక తప్పింది కాదు. దాన్ని బీజేపీ యువ నాయకత్వం జాతీయ నాయకత్వంపై సాధించిన విజయంగా అభివర్ణించడం మన మీడియా సృజనాత్మక కాల్పనికతా శక్తికి నిదర్శనం. ముతాలిక్ ప్రహసనం తర్వాత కూడా ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలున్న సబీర్ ఆలీని పార్టీలో చేర్చుకుని, సాగనంపాల్సిన దుస్థితిని ఆ పార్టీ ఏరికోరి తెచ్చుకోవాల్సి వచ్చిందంటే ఊరికే రాలేదు. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వం వల్ల బీజేపీ మెరుగుపడిందే తప్ప, 1996 నాటి స్థితి నుంచి ఎంతో దూరం ముందుకు సాగింది లేదు. ఇక ఎన్డీఏ పరిస్థితి 1998కు చాలా దూరంలో ఉంది. నాడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, బీజేడీ నేత నవీన్‌పట్నాయక్‌లు నేడు ఎన్డీఏలో లేరు. వారేగాక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఎవరికి వారే ఎన్నికల తర్వాత రెండు ప్రధాన కూటముల్లో ఎవరికీ మెజారిటీ రాని స్థితినే అంచనా వేస్తున్నారు. మరో ప్రధాని పోటీదారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బీజేపీని వీడి ఆయనకు ఆయనే జాతీయ రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తెరమరుగయ్యారు. రంగంలో ఉన్నవారంతా ఎవరికివారేఅవకాశం వస్తే ప్రధాని గద్దెనెక్కే అవకాశం కోసం వేచి చూస్తున్నవారే. అందుకే ‘వలసల’ కోసం బీజేపీ అంగలార్చడం, కాంగ్రెస్ సెక్యులర్ ఫ్రంట్ జపం. అవి రెండూ ప్రధాన జాతీయ పార్టీలను వేధిస్తున్న ఒకే పీడ కలకు అద్దం పడతాయి. ఇంతవరకు ప్రధాన జాతీయ పక్షాలకు తోకలుగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలు రేపటి ఎన్నికల తదుపరి కింగ్‌మేకర్స్‌గా మారనున్నాయనే చేదు వాస్తవమే అది. సెక్యులర్ ఫ్రంట్ పాచిక పారేనా? ఇంతకూ కాంగ్రెస్ మాట్లాడుతున్న సెక్యులర్ ఫ్రంట్‌కు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు చెబుతున్న థర్డ్‌ఫ్రంట్‌కు తేడా ఏమైనా ఉందా? 1996కు భిన్నంగా కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్‌లో భాగస్వామినవుతానని సూచిస్తోంది. ఒడ్డున కూచోవడం గాక, ప్రభుత్వంలో చేరి ప్రధాని పదవిని ఇతరులకు అప్పగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఆ అంశమే బీజేపీకి కలవరాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్‌లాగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించడానికి అది ప్రధాని పదవిని ‘త్యాగం’ చేయగల స్థితిలో లేదు. కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రాంతీయ నేతలందరిలోనూ తహతహను రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే ఒక్కరికే అవకాశం ఉండటమే కాంగ్రెస్ దురదృష్టం. ఇంతటి ‘బ్రహ్మాస్త్రాన్ని’ పొదిలో ఉంచుకొని ప్రయోగించడానికి కాంగ్రెస్ ఎందుకు ఇంత ఆలస్యం చేసినట్టు? కాంగ్రెస్ పాచిక ఎంత వరకు పారుతుందో లేదోగానీ దాన్ని ప్రయోగించడానికి ఇంతకు మించిన మంచి ముహూర్తం మరొకటి ఉండదు. ముందే సెక్యులర్ ఫ్రంట్ ప్రతిపాదనను తెచ్చి... ప్రధాని పదవి కోసం గోడ మీద వేచి చూస్తున్న నేతలు ఎటో ఒక వైపు దూకేలా చేయడం కంటే ఎన్నికల తర్వాతికి ఆ కుమ్ములాటను వాయిదా వేయటం కాంగ్రెస్‌కు లాభం. బీజేపీకి నష్టం. ఎన్నికలకు ముందు బెట్టు చేస్తున్న వామపక్షాలు ఎన్నికల తదుపరి బీజేపీ బూచి భూతద్దంలో కనిపిస్తుంటే ఏ ములాయంసింగో చొరవచేసి సెక్యులర్ ఫ్రంట్‌కు ఒప్పించకపోరని కాంగ్రెస్ ధీమా. ఎన్నికల ఫలితాలు నిజంగానే కాంగ్రెస్ ఊహిస్తున్న పరిస్థితిని సృష్టిస్తే కాంగ్రెస్ సెక్యులర్ ఫ్రంట్ ఆటకు తెరలేస్తుందనే అనుకోవాలి. పిళ్లా వెంకటేశ్వరరావు -
కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాంతీయ పార్టీలతో పొత్తులేకుంటే చిత్తయిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఏ పార్టీ వెంటలేకుండా ఒంటరిపోరుకు దిగడం తుంటరితనమే అవుతుందని అధిష్టానానికి ముఖం చాటేస్తున్నారు. ఒకరు ఓపిక లేదంటే, మరొకరు కాంగ్రెస్‌లో ఒకేఒక్కడు వృద్ధాప్యాన్ని అడ్డంపెట్టుకున్నారు. మరొకరు కుమారుడికి ఇవ్వండి తనకొద్దని అధిష్టానం వద్ద వాపోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన 8 మంది ఎంపీల్లో ఒక్కరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుర్గతికి అద్దం పడుతోంది. ఆరణి సిట్టింగ్ ఎంపీ కృష్ణస్వామి తనకు రాజకీయ విరామం తీసుకోవాలని ఉందని ప్రకటించారు. మాజీ కేంద్రమంత్రి తంగబాలును సేలం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ ఆదేశించగా విముఖతను బహిరంగా ప్రదర్శించి ఎవరైనా యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ముఖం చాటేస్తున్న కేంద్ర మంత్రులు చిన్నా చితకా నేతలే కాదు, కేంద్రమంత్రులు, సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీకి ముఖం చాటేస్తున్నారు. పైగా తనకు వద్దంటే తనకు వద్దు అని, కుమారులకు ఇవ్వాలని కీచులాడుకుంటున్నారు. కేంద్ర మంత్రి పీ చిదంబరం సైతం పోటీకి వెనకడుగు వేస్తుండగా, శివగంగై సిట్టింగ్ ఎంపీగా పోటీచేసి తీరాలని రాహుల్‌గాంధీ ఆయన్ను ఆదేశించారు. గత ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా చిదంబరం గెలిచారు. ఓడిపోయిన చిదంబరం గోల్మాల్ చేసి గెలిచారనే అపవాదును ఎదుర్కొన్నారు. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మరిచిపోని ఆయన తన కుమారుడు కార్తీకి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. దిండుగల్లు నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ సిద్దన్ తనకు వయసైపోయిందని, పోటీచేయలేనని తప్పించుకుంటున్నారు. చిదంబరం వద్దంటున్నందున శివగంగై స్థానాన్ని తన కుమారుడు జయసింహ నాచియప్పన్‌కు కేటాయించాలని మరో కేంద్ర మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కోరుతున్నారు. 1999 ఎన్నికల్లో శివగంగై నుంచి తమిళ మానిల కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన చిదంబరంను కాంగ్రెస్ అభ్యర్థిని సుదర్శన్ నాచియప్పన్ ఓడించారు. అదే ధీమాతో ఈసారి గెలవచ్చని సుదర్శన్ ధీమాతో ఉన్నారు. అయితే ఎవ్వరి కుమారులకు ఇచ్చేది లేదు చిదంబరం పోటీ చేసి తీరాల్సిందేనని అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే అదే స్థానాన్ని తనకు కానీ, తన కుమారునికి కానీ కేటాయించాలని కోరుతూ సుదర్శన్ నాచియప్పన్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మయిలాడుదురై నుంచి పోటీచేయాల్సిందిగా కేంద్ర మంత్రి జీకే వాసన్‌ను ఆయన అనుచరులు వత్తిడితెస్తున్నారు. తాను ప్రచారానికి పరిమితం కానున్నట్లు ఆయన నిర్ణయించుకున్నారు. శ్రీపెరంబదూర్ నుంచి పోటీచేయాలని మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్‌ను ఆధిష్టానం ఆదేశించింది. పోటీ చేయడం ఇష్టం లేదని ఆమె పార్టీకి చెప్పుకున్నారు. ఒకే ఒక్కడు బడా నేతలంతా పోటీ నుంచి తప్పుకునేందుకే ఆసక్తి చూపుతుండగా, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ మాత్రం తిరుపూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత ప్రదర్శించారు. అధిష్టానం ఆదేశిస్తే తనకు తిరుపూరును కేటాయించాలని కోరనున్నట్లు సుమారు రెండువారాల క్రితమే ప్రకటించారు. వద్దుబాబోయ్ అనే నేతల వెంటపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం పోటీకి సిద్ధంగా ఉన్న ఇళంగోవన్ విషయంలో నాన్చుడుధోరణిని అవలంభిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం విడ్డూరం. నాలుగో జాబితాపై ఆశలు : అభ్యర్థులే కరువైన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తొలిదశగా 20 మందితో బలవంతంగా అభ్యర్థులను సిద్ధం చేసుకుని మంగళవారం పేర్లను ప్రకటించాలని భావించింది. అయితే కేంద్రమంత్రులే ఎదురుతిరగడంతో తమిళనాడు జాబితాను పక్కనపెట్టి మిగిలిన రాష్ట్రాలతో మూడో జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ కూటముల మధ్య నలిగిపోయి పరాజయం పాలయ్యేకంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని నేతలు భావిస్తున్నారు. నాలుగోజాబితాలోనైనా రాష్ట్రానికి చోటుదక్కుతుందో లేదోనని కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపడుతున్నారు.