
సక్లేశ్‌పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్‌తో జత కట్టిందని గుర్తుచేశారు.
కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్‌పుర సెగ్మెంట్‌లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment