r
-
మీ తప్పుల వల్లే కరువు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై బతకాలని తాము అనుకోవడం లేదని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయన్న విషయాన్ని మరుగున పెట్టారు. సింగరేణిలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే బొగ్గు గనులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పదేళ్లయినా తేల్చలేదు. వర్షాలు వాళ్లున్నప్పుడే పడలేదు. వచ్చిన వర్షాన్ని ఒడి సి పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వ రం ప్రాజెక్టు కుంగిపోయినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెపితే గోదావరి నీటిని అవసరం లేకపోయినా కిందకు వదిలేశారు. కృష్ణాలో నీటి నిల్వల సంగతి తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం, కాల్వల్లో నీటిని చూసి జనం ఓట్లేస్తారనే ఉద్దేశంతో పంటలు లేకపోయినా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు కరువొచ్చిందని అంటున్నారు. రూ. 43 వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్న ట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? తప్పులన్నీ మీవైపే ఉన్నాయి..’అంటూ భట్టి ధ్వజమెత్తా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘విద్యుత్–తాగునీరు–ఆర్థికం’అంశాలపై నిర్వ హించిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పులు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు చెల్లించాం ‘రైతుబంధు కింద గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దాచిపెడితే మేమేదో ఖర్చు పెట్టినట్టు గా ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మేము అధికారం చేపట్టేనాటికి రూ.3,960 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రతి రూపాయి పోగేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తు న్నాం. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులందరం 24 గంటలూ కష్టపడుతూ ఓ తపస్సు లా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు తిరిగి చెల్లించాం. రైతుబంధు కింద రూ.5,575 కోట్లు, ఆరీ్టసీకి రూ.1,120 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం రూ.3,924 కోట్లు, గృహజ్యోతి కోసం రూ.200 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.80 కోట్లు, బియ్యం సబ్సిడీల కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం రూ.734 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీలు, హోంగార్డులకు వేతనాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు... ఇలా మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భట్టి సవాల్ చేశారు. విద్యుత్‌కు అంతరాయమే తప్ప కోతల్లేవు ‘విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నాం. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 15,673 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా చిన్న కోత లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు పోతే అది అంతరాయం మాత్రమే. నిర్వహణ పనుల కోసం ఆపేస్తున్నదే తప్ప కోత కాదు. 2031–32 సంవత్సరం వరకు 29 వేల నుంచి 30వేల మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చినా అందుకు తగిన కార్యాచరణ మా వద్ద ఉంది..’అని డిప్యూటీ సీఎం తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎ క్కడా నీటి సమస్య రానివ్వబోం. త్వరితగతి న పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు నిధు లు కేటాయిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు నిర్మిస్తాం. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టమైన ప్ర కటన ఉంటుంది..’అని భట్టి తెలిపారు. 10 లక్షల కోట్లు ప్రభుత్వ అకౌంట్లలోకి రాలేదు గత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను భట్టి ఖండించారు. ‘కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ఒక పెద్దమనిషి చెపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల మాట అటుంచితే తెలంగాణపై బీజేపీకి కనీస ప్రేమ ఉన్నా లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదు. నాడు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర కోల్పోయే 3 వేల ఎకరాల భూమి విషయంలో వారిని ఒప్పించి పరిహారం ఇచ్చి ఉంటే నేడు కాళేశ్వరం ప్రాజెక్టే వచ్చేది కాదు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కింద వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమే. మరి ఆయన చెపుతున్నట్టు మిగిలినవి ఎక్కడ ఇచ్చారో తెలియదు. ప్రభుత్వ అకౌంట్లలోకి అయితే రాలేదు. బీజేపీ ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, బీఆర్ఎస్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఏమయ్యాయో, ఆ రెండు పారీ్టలు ఏం సాధించాయో?’వారే సమాధానం చెప్పాలి..’అని భట్టి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నాలు తెలంగాణ సమాజానికే నష్టం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా మా ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు. ఐదేళ్ల పాటు నిశి్చంతగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫిరాయింపుల చట్టంపై సమీక్ష కమిటీ: ఓం బిర్లా
ముంబై: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సారథ్యం వహిస్తారని ఆదివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగం పదో షెడ్యూల్లో ఉంది. దీని ప్రకారంఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా అనర్హత వేటు వేయవచ్చు. -
Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు. -
కోరమాండల్ లాభం రూ.755 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది. ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. -
భారత్‌లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్‌లో మినీ ల్యాండ్ క్రూజర్‌ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్‌లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం
ముంబై: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్ఆర్ఓ– సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్‌టెక్ ప్లేయర్లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి. గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని దాస్ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం, ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్‌టెక్ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్‌టెక్ ప్లేయర్ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్‌టెక్ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీబీడీసీ పురోగతి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్‌లో భాగమయ్యారని దాస్ తెలిపారు. యూపీఐ క్యూఆర్ కోడ్లతో సీబీడీసీ పూర్తి ఇంటర్–ఆపరేబిలిటీని కూడా ఆర్బీఐ ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన, కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కో–ఛైర్మన్ శ్రీనివాస్ జైన్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్ విడుదలకానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘భోళాశంకర్’ ట్రైలర్‌ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్‌ని రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహర్ మూవీస్. -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరు తెరపైకి వచి్చంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్ దార్‌ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది. ఆయన పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది. పాక్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రయతి్నస్తోంది. రుణాలు, పెట్టుబడులతో ఆర్థికంగా కుదురుకోవడానికి చాలా సమయం పట్టనుంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు షరీఫ్ ప్రభుత్వం ఇష్టపడడంలేదు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వంతో నెట్టుకురావాలని భావిస్తోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్ నియామకంపై పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్‌లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్‌ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్‌బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్‌లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఉద్విగ్న క్షణాలు .. 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్క, తమ్ముడు
లాహోర్: 75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ కలుసుకున్నారు. చిన్నతనంలో వేరుపడిన అక్క, తమ్ముడిని సామాజిక మాధ్యమాలు వృద్ధాప్యంలో కలిపాయి. ఇటీవల వీరిద్దరూ కర్తార్‌పూర్ కారిడార్ వద్ద కలుసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. పంజాబ్‌కు చెందిన సర్దార్ భజన్ సింగ్ కుటుంబం 1947లో దేశ విభజన సమయంలో చెల్లాచెదురైంది. కొడుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరగా కూతురు మహేంద్ర కౌర్ భజన్ సింగ్ వెంటే ఉన్నారు. ఇటీవల రెండు కుటుంబాల వారు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌లో ఉండే మహేంద్ర కౌర్ (81), పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండే షేక్ అబ్దుల్ అజీజ్ (78) స్వయానా అక్క, తమ్ముడని తెలుసుకున్నారు. తమ కుటుంబాలతో కలిసి కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో కలుసుకున్నారు. ఆలింగనాలు, ఆనంద బాష్పాలతో ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని డాన్ పత్రిక పేర్కొంది. -
12 దాకా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. -
Karnataka Assembly Election 2023: జేడీ(ఎస్)కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లే
సక్లేశ్పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్‌తో జత కట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్పుర సెగ్మెంట్లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్‌ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్‌ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్‌టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
గ్రీన్కో రూ. 5,700 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రీన్కో రూ.5,700 కోట్ల నిధులను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్ కంపెనీ ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు (ఏడీఐఏ) సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఈక్విటీ నిధులను 25 గిగావాట్ అవర్ కంటే అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగిస్తామని గ్రీన్కో గ్రూప్ జేఎండీ మహేశ్ కొల్లి వెల్లడించారు. తాజాగా అందుకున్న పెట్టుబడిలో జీఐసీ 51 శాతం, ఓరిక్స్ 16, ఏడీఐఏ 14, వ్యవస్థాపకులు 13 శాతం సమకూర్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన గ్రీన్కో గ్రూప్ ఖాతాలో భారత్‌లో 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ల సామర్థ్యం గల సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
బడ్జెట్ ప్రకటనలపై ప్రధాని మోదీ వెబినార్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రకటించిన పలు నిర్ణయాలపై భాగస్వాములతో ప్రధాని వెబినార్లు నిర్వహించనున్నారు. గురువారం గ్రీన్ గ్రోత్ పై తొలి వెబినార్ జరగనుంది. ఇందులో వ్యవసాయం, కోపరేటివ్ రంగాల భాగస్వాములతో ప్రధాని మాట్లాడనున్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని 12 వెబినార్లను నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 11 వరకు ఇవి జరుగుతాయని తెలిపింది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల రంగం, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, మహిళా సాధికారత, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) అంశాలపై ఈ వెబినార్లు నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన సప్షర్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు, భాగస్వాములు అందరి మధ్య సమన్వయం, ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా ఈ వెబినార్ల నిర్వహణకు ప్రధాని ఆమోదం తెలిపినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. -
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్ షా
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్ పెదవి విరిస్తే తాము బృహత్ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్గా పేరు పెట్టి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. -
‘చార్జ్‌షీట్’లో సుశీల్ పేరు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్లో చేర్చారు. సుశీల్‌తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్‌షీట్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్శాల్ స్టేడియంలో సాగర్‌పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు. -
Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి
నాగపూర్: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు. నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్ భగవత్ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు. ‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. -
ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్ శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(60) సోమవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. -
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్టుపై... మోకాలడ్డిన చైనా
ఐక్యరాజ్యసమితి: చైనా మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐరాసలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్–ఖైదా శాంక్షన్స్ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు రుజువు కావడంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
Dutch GP 2022: వెల్డన్ వెర్స్టాపెన్
జాండ్‌వూర్ట్ (నెదర్లాండ్స్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ (ఎఫ్1) 2022 సీజన్లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆదివారం జరిగిన డచ్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్స్టాపెన్ 319 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్ షుమాకర్ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), సెర్గియో పెరెజ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి ఈనెల 11న జరుగుతుంది. విజేత వెన్నెల–శ్రియాన్షి జోడీ పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో కలగొట్ల వెన్నెల–శ్రియాన్షి వలిశెట్టి (భారత్) జోడీ అండర్–19 మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెన్నెల–శ్రియాన్షి ద్వయం 21–19, 21–18తో నర్దన–రిధి కౌర్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) 25–23, 17–21, 10–21తో సరున్‌రక్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దివ్యం అరోరా–రిధి కౌర్ (భారత్) జోడీ టైటిల్ దక్కించుకుంది. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
సామ్రాజ్య భారతి 1858/1947.. స్వతంత్ర భారతి 1948/2022
సామ్రాజ్య భారతి 1858/1947 బ్రిటిష్ వారితో ఝాన్సీకి సమీపంలోని గ్వాలియర్‌లో జరిగిన యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీర మరణం పొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ అనే రాజ్యానికి ఆమె రాణి. 1857లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. జననాలు : బిపిన్ చంద్రపాల్, జగదీశ్ చంద్రబోస్, బేగమ్ కైఖుస్రో జహాన్, బాబా సావన్‌సింగ్ జన్మించారు. బిపిన్ స్వాతంత్య్ర సమరయోధులు. జగదీశ్ చంద్రబోస్ ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. కైఖుస్రో భోపాల్‌కి నవాబ్ బేగమ్. ఆమె 1901 నుంచి 1926 వరకు భోపాల్‌ను పాలించారు. బాబా సావన్‌సింగ్ ఆధ్యాత్మిక సాధువు. ‘ది గ్రేట్ మాస్టర్’గా, ‘బడే మహరాజ్జీ’ గా ప్రసిద్ధి. బిపిన్, జగదీశ్ బంగ్లాదేశ్‌లో, బాబా సావన్ పంజాబ్‌లో జన్మించారు. ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పాలన అంతమైనట్లు నవంబర్ 1న బ్రిటిష్ పార్లమెంటు ప్రకటించింది. అప్పటికి మూడు నెలల క్రితమే ‘భారత ప్రభుత్వ చట్టం 1858’ ని అమల్లోకి తెచ్చింది. భారతదేశంలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా బ్రిటన్ ఈ చట్టాన్ని చేసి, ఈస్టిండియా కంపెనీ పాలన స్థానంలో బ్రిటన్ రాణి విక్టోరియా ప్రత్యక్ష పాలనను ప్రవేశపెట్టింది. భారత్‌లో బ్రిటన్ రాణి పాలన మొదలైంది కూడా ఆ ఏడాది నవంబర్ 1వ తేదీనే. స్వతంత్ర భారతి 1948/2022 జనవరి 30 వ తేదీ సాయంత్రం 5.03 గంటలకు గాంధీజీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని బిర్లా హౌస్ నుంచి బయల్దేరి ప్రార్థన సమావేశాన్ని నిర్వహించడానికి ఉద్యానవనం వైపు కదులుతున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం చెప్పిన 200 మంది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల్లో నాథూరామ్ గాడ్సే కూడా ఉన్నాడు. ఆటోమేటిక్ 9 ఎం.ఎం. బెరెట్టా పిస్టల్‌తో దగ్గరి నుంచి మహాత్ముని ఛాతీ మీదకు మూడుసార్లు తూటాలు పేల్చాడు. అంతిమ క్షణంలో గాంధీజీ ‘హే రామ్’ అని ఉచ్చరిస్తూ ఊపిరి వదిలారు. పరాయి పాలనను పారదోలే విషయంలో అత్యంత ఆచరణాత్మకమైన మార్గం కోసం మహాత్ముడు పడిన తపన, ఆయన చేపట్టిన వివిధ ఉద్యమాల స్వరూప స్వభావాలలోనూ ప్రతిఫలించడం విశేషం. గాంధీజీ హత్య గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా? మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే. -
ఈశాన్యంలో అవినీతి సంస్కృతి అంతం
నామ్సాయ్(అరుణాచల్ ప్రదేశ్): ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. ఆయన ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ(ఎన్డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్ రాష్ట్రం ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని పాసీఘాట్‌లో ఎన్డీయూ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్సాయ్ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై అమిత్ షా మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమన్నారు. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
‘పీకే’పై మల్లగుల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరిక అంశం పార్టీ చీఫ్ సోనియాగాంధీ కోర్టుకు చేరింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో చర్చించి సోనియా నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. పీకే ప్రతిపాదనలపై కాంగ్రెస్ కమిటీ సమర్పించిన నివేదికపై కమిటీ సభ్యులు, సీనియర్లతో సోనియా సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ప్రియాంక గాంధీతో పాటు సుర్జేవాలా, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, పి.చిదంబరం తదితరులు పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరతారా అన్నదానిపై ఓ వైపు చర్చ నడుస్తుంటే మరోవైపు ఆయన తెలంగాణలో టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న వైనాన్ని సోనియా సమక్షంలో నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో రెండు రోజులుగా పీకే మంతనాలు, ఆ పార్టీతో పీకే సంస్థ ఐప్యాక్ కుదుర్చుకున్న ఒప్పందం తదితరాలను నేతలు వివరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా చేసిన దిగ్విజయ్‌సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తినట్టు చెబుతున్నారు. పలు ప్రత్యర్ధి పార్టీలతో పీకేకు సంబంధాల దృష్ట్యా పార్టీ నిర్ణయాలను ఆయనతో పంచుకునే విషయంలో గోప్యత పాటించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరే పక్షంలో పూర్తిగా పార్టీ సేవకే అంకితం కావాలని, ఇతర పార్టీలతో ఎలాంటి సంబంధమూ కొనసాగించొద్దని మరో నేత అన్నట్టు సమాచారం. ‘నీ శత్రువులతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమ్మొద్దు’ అంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్ పీకేను ఉద్దేశించేదేనని నేతలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పీకేకు సంబంధాలు కాంగ్రెస్‌కు మేలే చేస్తాయని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. -
వీఐపీలకు భద్రత రద్దు
చండీగఢ్: పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (48) శనివారం గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. శుక్రవారం మొహాలిలో జరిగిన సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా మాన్ ఎన్నికవడం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. కేంద్ర హోం శాఖ సూచనల ప్రకారం బాదల్ కుటుంబం, మాజీ సీఎంలు కెప్టెన్ అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వంటి వారు మినహా మిగతా వారి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవాలన్నారు. -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్‌తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్‌తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్‌తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
మహిళా ఐఏఎఫ్‌పై లైంగిక దాడి
న్యూఢిల్లీ/చెన్నై: తనపై లైంగిక దాడి జరిగిందని ఐఏఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ ఓ మహిళా ఐఏఎఫ్ అధికారి కోయంబత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని 26న మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్ హార్ముఖ్ తన వద్ద శిక్షణ తీసుకుంటున్న ఐఏఎఫ్ మహిళా అధికారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐఏఎఫ్ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, వారు ఆమె చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించిన ‘టూ ఫింగర్ టెస్ట్’నూ ఆమెపై నిర్వహించారు. అయితే, తాజాగా స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత ఆ కేసు తమకు బదిలీ అయ్యిందని, కోర్ట్ మార్షల్ నిర్వహిస్తామని ఐఏఎఫ్ తెలిపింది. -
బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో కీలుబొమ్మని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏర్పాటు చేయదలిచే ఉమ్మడి పోరాట వేదికలో మమతకు స్థానం కల్పించకూడదన్నారు. మమత ఒక అవిశ్వసనీయ మిత్రురాలని, కాంగ్రెస్‌ను పణంగా పెట్టి జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘అన్నం పెట్టే చేతులను కరవడం ఆమెకు అలవాటు. ప్రతిపక్షాల ఐక్య వేదికకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమె బీజేపీ పంపిన ట్రోజన్‌హార్స్ (శత్రువును మాయ చేసేందుకు గ్రీకులు వాడిన సాధనం). బీజేపీపై యుద్ధంలో ఆమెను నమ్మకూడదు’’ అని అధిర్ విమర్శించారు. తన కుటుంబసభ్యులను, పార్టీ నేతలను సీబీఐ దాడుల నుంచి రక్షించుకునేందుకు మమత ప్రధాని చెప్పినట్లు నడుచుకుంటారని, ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ లక్ష్య సాధనకు పరోక్షంగా సహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతకు టీఎంసీ వెన్నుపోటుదారన్నారు. తొక్కేసి ఎదుగుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్‌ను పణంగా పెట్టి టీఎంసీ ఎదిగిందని, ఇప్పుడు జాతీయవ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు టీఎంసీలో చేరడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. దీంతో టీఎంసీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని మమత కలలు కంటున్నారని, వారికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉందని అధిర్ చెప్పారు. కాంగెస్ర్ ఉన్నంతకాలం ఆమెను ప్రతిపక్ష ఉమ్మడి నేత కానీయమని, ఇది తెలిసే ఆమె కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించారు. మోదీకి దీటైన నేత రాహుల్ కాదు, మమత అని టీఎంసీ మీడియాలో రావడంపై ఆయన స్పందించారు. వారివి పిచ్చివాళ్ల ఊహలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాహుల్ గాంధీ సమర్ధవంతమైన ప్రతిజోడి అని అధిర్ చెప్పారు. దేశంలో ఇంకా కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ల వాటా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి తప్ప మరే పార్టీకి ఇంత ఓట్ల వాటా లేదన్నారు. అందువల్ల ప్రతిపక్ష ఉమ్మడి నాయకత్వానికి కాంగ్రెస్ సహజ ఎంపికని అభివర్ణించారు. తమ పార్టీ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏర్పడడం కల్ల అని చెప్పారు. పంజాబ్‌లో సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
అఫ్గాన్‌లో పరిస్థితి ఆందోళనకరం
మాస్కో/వాషింగ్టన్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతుండడంపై భారత్ ఆందోళన వెలిబుచ్చింది. తక్షణమే హింసను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. ఆ దేశాన్ని ఎవరు పాలించాలనే విషయంలో చట్టబద్ధత’ను కూడా ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అఫ్గానిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నామని మాస్కోలో శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్తో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ ఆధీనంలో 85% అఫ్గాన్ భూభాగం ఉందని శుక్రవారం తాలిబన్ ప్రకటించింది. 30 ఏళ్లుగా అఫ్గాన్‌లో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని జైశంకర్ చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రితో సంతృప్తకరంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆగస్ట్‌తో మా మిషన్ పూర్తి: బైడెన్ ఆగస్ట్ 31 వరకు అఫ్గానిస్తాన్‌లో తమ మిలటరీ మిషన్ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 20 ఏళ్లుగా అఫ్గాన్‌లో అమెరికా చేపట్టిన సైనిక కార్యక్రమానికి లక్ష కోట్ల డాలర్ల వరకు ఖర్చు అయిందని, 2,448 మంది యూఎస్ సైనికులు చనిపోయారని, 20 వేల మందికి పైగా గాయాల పాలయ్యారని బైడెన్ వివరించారు. మరో తరం అమెరికన్లను అఫ్గానిస్తాన్‌కు పంపించబోమన్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకుంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దిగజారుతోందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ సివిల్ వార్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. -
Neena Nizar: ఇది నాకు పెద్ద షాక్.. పేరు లేని విలన్ కాటేసింది!
ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఎక్కడా ఆపకూడదని... ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా ఎక్కడా ఆగిపోకూడదని... నినా నైజర్ జీవితం చాటి చెబుతుంది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వెంటాడినా ఆ వ్యాధి తనను వీల్‌చెయిర్‌కే పరిమితం చేసినా చదువుల రాణిగా వర్ధిల్లింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగింది. తనకు పుట్టిన పిల్లలనూ అదే వ్యాధి కబళించి అడుగడుగునా నిరాశ తరుముతున్నా విధి విసిరిన ఛాలెంజ్‌ను చిరునవ్వుతో స్వీకరించింది. ‘అరుదైన వ్యాధి కారణంగా మేం ఒంటరిగా, బలహీనులుగా అనిపించవచ్చు. కానీ, మా కథను పంచుకోవడం ద్వారా చావు అంచున నిలబడిన వారిలో చిన్న ఆశను మిగిలిస్తే చాలు’ అంటోంది నీనా నైజర్. నాలుగు పదుల వయసు దాటిన నీనా నైజర్ దుబాయిలో ఓ వ్యాపారస్తుడి కుటుంబంలో పుట్టింది. పుట్టుకతోనే వెన్నెముకలో అరుదైన వ్యాధికి లోనైంది. ఏళ్లకేళ్లుగా చికిత్స జరుగుతూనే ఉంది. కానీ, వ్యాధి పేరేంటో తెలియలేదు. వెన్నెముకలో లోపాల వల్ల శరీరం అంతగా ఎదగలేదు. ఈ కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. ఇండియా వచ్చి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంది. లండన్, అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకుంది. ఏమంత ప్రయోజనం లేకపోయింది. అయినా ఆమె చదువుల తల్లిని వదిలిపెట్టలేదు. పీహెచ్‌డి పట్టా పుచ్చుకొని.. ‘చదువు ధైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. అందుకే, నా దృష్టి అంతా చదువు మీదే. నాకు 16 ఏళ్ల వయసులో అమెరికాలోని క్రైటన్ విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి పూర్తి స్కాలర్షిప్ తో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా శరీరం శస్త్రచికిత్సల కారణం గా మరింత బలహీనంగా ఉంది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. అంతదూరం పంపించడానికి ఒప్పుకోలేదు. కానీ, నేను చదువుకోవాల్సిందే అని బలంగా చెప్పి, వెళ్లాను. 2018 లో క్రైటన్ విశ్వవిద్యాలయం నుండి ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డి పట్టాతో బయటకు వచ్చాను’ అని వివరించే నినా నైజర్ చదువులోనే కాదు వ్యాస రచన, పెయింటింగ్, చర్చాపోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. దేశవిదేశాల్లో మోటివేషనల్ స్పీచుల్లో పాల్గొంది. తలకిందులైన ప్రపంచం.. పునర్నిర్మాణం తను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ఆడమ్‌ను కలుసుకున్న నినా పెళ్లి తర్వాత ప్రయాణం గురించి వివరిస్తూ ‘పిల్లలు కలగరనే భయంతో పెళ్లే వద్దనుకున్నాను. ఆడమ్ తన ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను’ అని వైవాహిక జీవితం గురించి ఆనందంగా చెప్పే నైజర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నైజర్కు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. చాలా ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత పుట్టిన చిన్నకొడుకులో మాత్రం పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద కొడుకుని పరీక్షించడంతో వాడిలోనూ ఈ అరుదైన సమస్య ఉందని, ఇది మెటాఫిసల్ కొండ్రోడైస్పా›్లసియా అని, జన్యుపరమైనదని వైద్యులు తేల్చారు. ‘ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను’ అంటున్న నినా, తన ఇద్దరు కుమారులతో వైద్య పరిశోధనల్లో భాగమైంది. ముగ్గురూ వీల్చైర్లలో ఉండటంతో వారు ఇంటి నుండి బయటకు రావాలంటే మరొకరి సహాయం కావాలి. కానీ, తన కుటుంబంలో నిత్యం నవ్వులు పూయించడానికి తపిస్తూనే ఉంది నినా. ‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇది వైకల్యం ఉన్నవారిలో కలిగే స్వతంత్ర భావనగా నేను ఆనందిస్తాను. మీ లక్ష్యం కేవలం ప్రయాణికుడిగా ఉంటే చాలదు, జీవితానికి బాధ్యత వహించాలి. ఈ రోజు నా కొడుకులు అర్షాన్, జహాన్ సూపర్ హీరోల్లా నాకు కనిపిస్తుంటారు. వారి ఆటపాటలు, అల్లరిని చూస్తుంటే ఎంతటి శత్రువునైనా ఓడించగల బలం వచ్చేస్తుంది’ అని ఆనందంగా వివరిస్తుంది నినా నైజర్. ఇప్పటికీ జీవితంలోని ఒడిదొడుకులను సవాళ్లుగా తీసుకొని చిరునవ్వుతో నిత్య పోరాటం చేస్తున్న నినా నైజర్ ఎంతో మంది నిరాశావాదులకు ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను. – నినా నైజర్ భర్త, పిల్లలతో నినా నైజర్ -
నా బెండ్ తీశాడు
‘‘చాలా రోజుల తర్వాత మరోసారి నన్ను ఆర్టిస్ట్‌గా గుర్తించే సినిమా ఇది. ‘గమ్యం’ తర్వాత నాకు మరో మొమరబుల్ మూవీ అవుతుంది. విజయ్ టాలెంట్ ఏంటో షూటింగ్ మొదలైన రెండు మూడు రోజుల్లోనే తెలిసిపోయింది. విజయ్ నా బెండు తీశాడు (నవ్వుతూ). ఆయన దర్శకత్వంలో ఇదే బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నవమి ముఖ్య పాత్రల్లో సతీష్ వేగేశ్న నిర్మించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి తేజ్ ‘బ్రీత్ ఆఫ్ నాంది’ (టీజర్)ని విడుదల చేశారు. సాయి తేజ్ మాట్లాడుతూ – ‘‘నరేశ్ అన్న నటించిన ‘నేను’, ‘గమ్యం’, ‘మహర్షి’ సినిమాల్లో ఆయన నటన నాకు చాలా ఇష్టం. ‘నాంది’ టీజర్ చాలా బాగుంది. నా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకి విజయ్ చాలా హెల్ప్ చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో కూడా ఎంతో రిస్క్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. విజయ్ కనకమేడల మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బ్రీత్ ఆఫ్ నాంది’కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిçస్తున్నాను’’ అన్నారు. -
మార్కెట్లో ఫైట్
తిబిలిసీ (జార్జియా రాజధాని) లోని ఫ్లీ మార్కెట్‌కు (పాత వస్తువులు, పురాతన వస్తువులు, సెకండ్‌హ్యాండ్ వస్తువులు దొరికే ప్రాంతం) వెళ్లారు ప్రభాస్. అక్కడ ఓ గొడవ జరిగింది. విలన్స్‌ను రఫ్ఫాడించారు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్ ముగిసింది. అక్కడి ఫ్లీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ ఫైట్‌ను చిత్రీకరించారని సమాచారం. ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జార్జియా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఎవరికివారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభాస్ కూడా స్వీయ గృహనిర్భందంలో ఉన్నారు. -
కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...
హెలన్ కెల్లర్ పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి. పుట్టినప్పుడు భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు. అసలు లేకపోతే వేరు. కొన్నాళ్ళు ఉండిపోతే ఆ బాధ వేరుగా ఉంటుంది. క్రమంగా ఆమెకు చూపు పోయింది. కొన్నాళ్ళకు వినికిడి శక్తి పోయింది. మరి కొన్నాళ్లకు మాట్లాడగలిగిన శక్తికూడా పోయింది. ఏదో కొద్దిగా మాట్లాడేవారు. అంత బాగా అర్థమయ్యేది కాదు. కానీ ఆవిడ గొప్పతనం ఏమిటంటే–ఎదురుగా ఉన్నది ఏదయినా సరే, ఇలా ముట్టుకుని స్పర్శజ్ఞానంతో చెప్పగలిగేవారు. చిరునవ్వు ఎప్పడూ ఆమె ముఖం మీదనించి చెరిగిపోలేదు. ఆమె స్నేహితురాలు ఒకరు ఓ రోజు ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చారు. అలా ప్రకృతిలోకి వెళ్ళివచ్చావు కదా, ఇంతసేపు ఏ అందాలు చూసి వచ్చావు... అని కెల్లర్ అడిగారు. ‘‘ఆ... చూడ్డానికేముంది, రోజూ ఉండేదేగా. కాసేపు అలా నడచి వచ్చా.’’ అని స్నేహితురాలు చెప్పింది. వెంటనే కెల్లర్..‘‘నాకు ఒక్క పువ్వుతొడిమ ముట్టుకుంటే.. ఆ తొడిమను అంత సున్నితంగా చేసిన వాడెవరు? దానిమీద ఆ పువ్వు పెట్టిన వాడెవరు? ఆ బరువుకి తొడిమ వంగిపోకుండా నిలబెట్టినవాడెవరు? అందులోంచి సువాసన వచ్చేట్టు చేసినవాడెవరు?...’’ అని కళ్ళులేని దాన్ని పువ్వు ముట్టుకుంటేనే ఆనందంతో చిరునవ్వు వస్తుందే... కన్నులు, చెవులు, నోరున్నదానివి, ప్రకృతి అందాలు అంతా చూసి చూడ్డానికి ఏముందంటావేం? అంది. అదీ హృదయంలో ఐశ్వర్యం ఉండటం అంటే. ఆవిడ ఒకసారి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి కచేరికి వచ్చారు. ఆమె పాడుతుంటే వినడానికి కెల్లర్‌కు అవకాశం లేదు. కానీ సుబ్బులక్ష్మిగారి కంఠంమీద వేలుపెట్టి, ఆ ధ్వని ప్రకంపనలతో గుర్తించేవారు.. ఆమె ఏం పాడుతున్నారో. సుబ్బులక్ష్మిగారి ఆరోజు పాడుతూ.‘కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...’ అని ఓ కీర్తన ఆలపిస్తున్నారు. కురాయ్ అంటే.. నాకు ఏ విధమైన ఫిర్యాదు... ఒన్రుమ్... ఒక్కటి కూడా ఇల్లై.. లేదు అని. ‘‘నువ్వు నాకు ఫలానా విషయంలో కష్టాన్నిచ్చావు. దానివల్ల నేను బాధపడ్డాను..అని చెప్పడానికి గోవిందా... నాకు ఏ ఫిర్యాదూ మిగల్చకుండా చేసావు... నాకు సమస్యలు ఇవ్వలేదు, కష్టాలు ఇవ్వలేదు... నాకు నీపై ఫిర్యాదు చేయడానికి... ఇల్లై గోవిందా... ఏమీ లేకుండా చేసావు గోవిందా...’’ అని ఆమె ఆర్తితో పాడుతున్నారు. నిజానికి సుబ్బులక్ష్మిగారు పడినన్ని కష్టాలు మరొకరు పడి ఉండరు. అన్ని కష్టాలకు ఓర్చుకుని ఆ స్థాయికి వెళ్ళారామె. అటువంటి తల్లి త్రికరణశుద్ధిగా ‘నాకు ఫలానాది ఇవ్వలేదని నా దైవానికి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు’ అని పాడుతుంటే... ఆమె కళ్ళవెంట కన్నీరు ధారలు కడుతున్నది. అక్కడే ఉన్న కెల్లర్ ఎలాగూ వినలేదు కాబట్టి ఆవిడ కంఠంమీద వేలుపెట్టి... కీర్తన ముగియగానే వేలు తీసేసి వలవలా ఏడ్చేసారు. సుబ్బులక్ష్మిగారు సంజ్ఞల ద్వారా అడిగారు... ఎందుకు ఏడుస్తున్నారని. దానికి కెల్లర్.. ‘‘నాకు కూడా ఇదే. భగవంతుడు నాకు ఏ సమస్యా ఇవ్వలేదు. నిజానికి నాకు వరాలిచ్చాడు. కళ్ళు, చెవులు, నోరు లేవు... అందువల్ల నేను జీవితంలో చాలా శ్రమపడి వృద్ధిలోకి వచ్చాను. అన్నీ ఇచ్చి ఉంటే...ఇంత శ్రమపడేదాన్ని కానేమో... విచ్చలవిడిగా వాడుకుని ఎందుకూ కొరగాకుండా ఉండిపోదునేమో... ఎన్ని జన్మలెత్తినా ఓ భగవంతుడా... నన్ను అనుగ్రహించి నాకున్న ఈ లోపాలు అలాగే ఉంచు. అప్పుడు నేను ఇలాగే ఉంటాను’’ అని సంకేతాలతో తెలియచేసారు. జీవితంలో మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పడు వాటిని విజయవంతంగా ఎదుర్కొని మనల్ని మనం నిగ్రహించుకోవడానికి, మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం పొందడానికి ఇటువంటి వారి అనుభవాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం
చర్ల/పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లో తమ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ హరిశంకర్ సాహూను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో గురువారం జరిగింది. దోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పనపల్లి గ్రామం దగ్గర మిస్మా–చిరోర్డ్‌గూడ రోడ్డు పనులను ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టారు. ఏడాది క్రితమే పనులు మొదలైనా మావోల హెచ్చరికలతో నిలిపివేశారు. కాగా, కాంట్రాక్టర్ ఆ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మళ్లీ ప్రారంభించారు. దీంతో గురువారం ఉదయం సాయుధులైన దాదాపు డజను మంది మావోయిస్టులు రోడ్డు నిర్మాణప్రాంతానికొచ్చి పనులు ఆపేయాలని అక్కడి కార్మికులను బెదిరించారు. అక్కడే ఉన్న హరిశంకర్‌ను తలపై పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. హరిశంకర్ ఎస్యూవీ వాహనం, మరో ఐదు వాహనాలను తగలబెట్టారు. రోడ్డు పనులకు వాడుతున్న ట్రక్కులు, రోడ్డు రోలర్లనూ దహనం చేశారు. -
పరిహారంలో ‘పచ్చ’పాతం!
సాక్షి, విశాఖపట్నం/పెదబయలు/కొయ్యూరు: మావోల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అడవిబిడ్డల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉద్యోగాలిస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఆర్థికంగా ఆదుకుంటామని వారికి ఇస్తున్న హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని పోలీసు వ్యవస్థ వారిని ఇన్ఫార్మర్లుగా వాడుకుంటూ తమ లక్ష్యాలను సాధించుకుంటోందే తప్ప వారు మరణిస్తే ఆయా కుటుంబాలను మాత్రం ఆదుకోవడంలేదని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి మావోల కదలికలు, సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేసే వీరికి ప్రభుత్వం రిక్తహస్తమే చూపుతోంది. కొన్ని సందర్భాల్లో అరకొర సాయమే అందిస్తోంది. మరోవైపు.. తమ లక్ష్యం దెబ్బతింటోందన్న భావనతో మావోలు వీరిని దొరికినప్పుడల్లా పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మట్టుపెడుతుంటారు. వీరి కుటుంబాలను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలతో పోలీస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పరిహారంపై విధివిధానాల్లేవు.. మావోల దాడుల్లో మృత్యువాతపడిన వారిలో ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతలేదు. పరిహారం, సాయంపై ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి విధివిధానాలు లేకపోవడం గిరిజనులకు శాపంగా మారుతోంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు తమ వారైతే ఒకలా.. సామాన్యులైతే మరోలా వ్యవహరిస్తున్నాయి. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా చనిపోతే వారి హోదాలు, స్థాయిని బట్టి గతంలో రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకు చెల్లిస్తున్నారు. అదే సాధారణ పౌరులైతే ఐదు లక్షల వరకు పరిహారం.. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి చిన్నపాటి కొలువు ఇస్తున్నారు. 20 ఏళ్లలో 94 మంది మృత్యువాత 1998–2018 మధ్య ఏఒబీ పరిధిలో మొత్తం 89 ఘటనలు జరిగాయి. వీటిలో 94మంది అమాయక గిరిజన పౌరులు మావోల తూటాలకు బలయ్యారు. 2014కు ముందు వరకు ఇన్ఫార్మర్లు, సామాన్యులు చనిపోతే వారికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం మంజూరు చేసేవారు. కానీ, గడిచిన నాలుగున్నరేళ్లలో చనిపోయిన ఏ ఒక్కరికీ పరిహారం పంపిణీ చేయడమే కాదు కనీసం ప్రతిపాదనలు పంపిన దాఖలాలు కూడా లేవు. అంతేకాదు.. 2014కు ముందు చనిపోయిన వారికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సైతం నేటికీ అందించలేని దుస్థితి నెలకొంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏఒబీ పరిధిలో సుమారు 20 మందికి పైగా చనిపోతే ఇప్పటివరకు ఒక్కపైసా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. వారికోలా.. వీరికోలా.. అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న మావోలు మట్టుబెట్టారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ ఉన్నతాధికారికి ఇవ్వనంత పరిహారం ఈ ఇరువురికీ ప్రభుత్వం ప్రకటించింది. కిడారి కుటుంబానికి రూ.1.20కోట్ల పరిహారంతో పాటు ఆయన చిన్న కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం, సోమ కుటుంబానికి రూ.1.05కోట్ల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇరువురికి విశాఖలో ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. ఉద్యోగాలు కాకుండా వీరివురురికి దాదాపు రూ.3కోట్లకు పైగా సాయం ప్రకటించడంపై విమర్శలు వచ్చినా ఎవరూ తప్పుపట్టలేదు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మృత్యువాతపడగానే అనూహ్యంగా స్పందించిన ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో మృతిచెందిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులపట్ల ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వారికి కోట్లల్లో పరిహారం ఇస్తున్న ప్రభుత్వం వీరికి కనీసం లక్షల్లో కూడా పరిహారం ఇవ్వకపోతే ఎలా గిరిజన సంఘాల నేతలు నిలదీస్తున్నారు. మంజూరైనా పంపిణీకాని పరిహారం ఇదిలా ఉంటే.. 2013–14లో మావోల చేతిలో తొమ్మిది మంది ప్రాణాలొదిలారు. వారికి 2015లో రూ.27.8 లక్షలు విడుదలైంది. చింతపల్లి మండలం బలపం గ్రామానికి చెందిన గబ్బాడి చిట్టిదొరకు రూ.14లక్షలు, చీకటిమామిడి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావుకు రూ.40వేలు, జీకేవీధి మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన ఎం.మత్స్య రాజుకు రూ.1.25లక్షలు, కుంకుంపూడికి చెందిన కొర్రా సన్యాసిరావుకు రూ.2.25 లక్షలు, కొయ్యూరు మండలం ఎండకోట గ్రామానికి చెందిన ఎం.రాజుకు రూ.5 లక్షలు, రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన యలమంచలి రమణకు రూ.2.5 లక్షలు, జి.మాడుగులకు చెందిన సింహాచలానికి రూ.5లక్షలు విడుదలయ్యాయి. అలాగే, మైదాన ప్రాంతానికి చెంది ఏజెన్సీలో ఆస్తి నష్టం జరిగిన నర్సీపట్నానికి చెందిన పి.సుజాతకు రూ.5లక్షలు, ఏలూరుకు చెందిన గంటా శివప్రసాద్‌కు రూ.5లక్షలు విడుదలై బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. కానీ, నేటికీ ఈ పరిహారం పంపిణీకి నోచుకోలేదు. ఇక గడిచిన నాలుగున్నరేళ్లలో మృత్యువాతపడిన పోలీస్ ఇన్ఫార్మర్లు, ఇతరులకు ఒక్కపైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. మాజీ మంత్రికే అందని సాయం సామాన్యులకే కాదు.. టీడీపీకే చెందిన మాజీమంత్రి మత్స్యరాజ మణికుమారికే పరిహారం అందకపోవడం గమనార్హం. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఆమె భర్త వెంకట్రాజును మావోలు హతమార్చారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, మణికుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మణికుమారి పిల్లల్ని చదివించి వారికి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెకు ప్రకటించిన రూ.5లక్షల పరిహారం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇక పిల్లల్ని చదివించేందుకు ఆర్థిక సహాయం చేస్తానన్న మాట కూడా నీటిమూటగానే మిగిలింది. ఒక పాపకు మాత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.25వేల వరకు ఆర్థిక సహాయం చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాల కోసం టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో బాక్సైట్ గనులున్న జెర్రెల పంచాయతీ సర్పంచ్ సాగిన వెంకటరమణను మావోలు మట్టుబెట్టారు. ఆయన కుటుంబానికి నేటికీ సాయం అందలేదు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామందే ఉన్నారు. కూలీపని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నాను ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామానికి చెందిన నా భర్త పాంగి రామన్నను 2015లో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. అలాగే, మమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. నాకు ముగ్గురు సంతానం. ఊరికాని ఊరిలో వారిని పోషించడం చాలా కష్టంగా ఉంది. సీఆర్పీఎఫ్ పోలీసులు వంటపాత్రలు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం, పోలీసులు ఆదుకోవాలి. – పాంగి రాశి,పాంగి రామన్న భార్య పాతికేళ్లవుతున్నా అందని పరిహారం శరభన్నపాలేనికి చెందిన సుబ్బారావును మావోయిస్టులు 1994లో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామంలో కాల్చి చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతని భార్య కొండమ్మకు పైసా కూడా పరిహారం దక్కలేదు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఇస్తామన్న రూ.ఐదు లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదు. వారసత్వ సర్టిఫికెట్లో తప్పు ఉందన్న కారణంతో జాప్యం చేస్తున్నారు. -
అందుబాటు గృహాలపై రెరా భారం
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చట్టం. కానీ, దీంతో అందుబాటు గృహాలకు కష్టకాలం వచ్చింది. ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి 7 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా ఉంటే.. ఇందులో రూ.40 లక్షలు లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు 2.37 లక్షలు ఉన్నాయి. మౌలిక వసతుల లేమి, నాసిరకమైన నిర్మాణాలు, లీగల్ సమస్యలే ఇందుకు కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో 2.37 లక్షల అందుబాటు గృహాలు ఖాళీగా (వేకెంట్)గా ఉన్నాయి. ఈ గృహాలు కూడా సంఘటిత రంగంలోని ప్రైవేట్ డెవలపర్లకు చెందినవే. ప్రభుత్వ గృహ పథకాలు, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్ల గృహాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రధాన నగరాల్లో సంఘటిత రంగంలోని డెవలపర్లు నిర్మించిన అందుబాటు ప్రాజెక్ట్‌లు, స్థానిక ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన బడ్జెట్ గృహాలు విక్రయమయ్యాయి. కానీ, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్లు చేపట్టిన నిర్మాణాలు, అసంఖ్యాకమైన చిన్న అపార్ట్మెంట్లు, సుదూర ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు మాత్రం అమ్ముడుపోకుండా ఉన్నాయి. ఎందుకు అమ్ముడుపోలేదంటే? రెరా కంటే ముందు లోప భూయిష్టమైన ప్రాజెక్ట్‌లను గుర్తించడంతో కొనుగోలుదారులు వెనకపడ్డారు. కానీ, రెరా అమల్లోకి వచ్చాక కస్టమర్లు గుర్తించలేకపోయినా సరే రెరా అథారిటీ, బ్యాంక్‌లు గుర్తిస్తాయి. దీంతో రెరా అమలయ్యాక గృహాల ఇన్వెంటరీ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణాలివే.. మౌలిక వసతులు: అందుబాటు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు డెవలపర్లు స్థానిక ప్రజల అవసరాలు, గృహ విస్తీర్ణాలపై అధ్యయనం చేయలేదు. కేవలం భూమి తక్కువ ధరకు దొరుకుతుందని, అభివృద్ధి నిబంధనలఖర్చు తగ్గుతుందనే కారణాలతో సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను నిర్మించారు. పని ప్రదేశాలకు, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో గృహాలను నిర్మించారు. నాసిరకం నిర్మాణాలు: చాలా వరకు అందుబాటు గృహాల డిజైన్, నాణ్యత అంశాల్లో నాసిరకం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పాత కాలం నాటి డిజైన్లతో నిర్మాణాలుండటం కూడా అమ్మకాలకు అడ్డంకే. నిర్మాణంలో నాణ్యత లేకపోతే అందుబాటు గృహాలైనా, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే ఏళ్లపాటు అమ్ముడుపోకుండా ఉంటాయి. లీగల్ సమస్యలు: చాలా వరకు అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌ల్లో అయితే అనుమతి ఉన్న ఫ్లోర్స్ కంటే ఎక్కువ అంతస్తు నిర్మాణాలున్నాయి. దీంతో అందుబాటు గృహాలు విక్రయానికి నోచుకోవట్లేదు. అమ్ముడుపోవాలంటే? కేంద్రం నిజంగా 2022 నాటికి అంద రికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ఉంటే గనక ముం దుగా ఖాళీగా ఉన్న అందుబాటు గృహాలను ఆక్రమించేయాలి. అంటే ఇన్వెంటరీగా ఉన్న గృహాలను తగ్గించడం తప్ప ఇతర మార్గం లేదు. ♦ నీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక వసతులున్న చోటే గృహాలు అమ్ముడుపోతాయి. అందుకే ఎక్కడైతే విక్రయించబడకుండా ఉన్న గృహాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వెంటనే మౌలిక వసతులను కల్పించాలి. దీంతో వెంటనే ఆయా ప్రాంతా ల్లో గృహాలు అమ్ముడుకాకపోయినా మెల్లగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు మొగ్గుచూపే అవకాశముంది. ♦ చిన్న చిన్న అతిక్రమణలు జరిగిన అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఒకవేళ అందుబాటు గృహాలు నో డెవలప్మెంట్ జోన్ (ఎన్‌డీజెడ్) లేదా పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో నిర్మించినట్ల యితే స్థానిక మున్సిపల్ నిబంధనల్లో మార్పు చేసి ప్రత్యేక స్కీమ్‌లను తీసుకురావాలి. దీంతో ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు గతంలో ముంబైలో సాల్ట్ ప్లాన్ ల్యాండ్స్‌లో నిర్మాణాలకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వటంతో పెద్ద ఎత్తున అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. -
ఈదుకుంటూ రావాల్సిందే!
మేసాయ్: థాయిలాండ్‌లోని గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, వారి సాకర్ కోచ్‌ను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు వాతావరణం ప్రతికూలంగా మారింది. వరదల ఉధృతి మరింత పెరగడంతో వారు గుహను ఆనుకుని ప్రవహిస్తున్న ఇరుకైన జలాశయం గుండా ఈదుకుంటూ బయటపడటం మినహా, ప్రస్తుతానికి మరో మార్గంలేదని అధికారులు తెలిపారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కూడా తేల్చారు. జూన్ 23న మ్యాచ్ ముగిసిన తరువాత వారు చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో విహార యాత్రకు వెళ్లి, వరదల కారణంగా గుహలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం జరుగుతున్న అన్వేషణ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 11–16 ఏళ్ల మధ్యనున్న ఆటగాళ్లు, 25 ఏళ్ల కోచ్ క్షేమంగానే ఉన్నారని, అయితే ప్రతికూల వాతావరణం వల్లనే బయటికి తీసుకురావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్న నేవీ సిబ్బంది, వైద్యులు వారికి ఆహారం, అందిస్తున్నారు. -
కళ్లు మూసుకుంటే సరిపోదు
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసుకోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు. అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు. అతను కళ్ళు తెరిచి అడిగాడు – ‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’ అని.గురువు చెప్పాడు ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను‘‘ అని. అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపుకోనివ్వండి‘‘ అని చెప్పాడు. అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది. శిష్యుడిని ప్రశ్నించాడిలా గురువు – ‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు‘‘ అనేసరికి శిష్యుడి నోటంట మరో మాట లేదు. ‘‘ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు‘‘ అని చెప్పాడు గురువు. ‘‘దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని నీకెవరు చెప్పార‘‘న్నాడు గురువు. – యామిజాల జగదీశ్ -
ఫోర్టిస్, ఎస్ఆర్ఎల్ల విలీనం రద్దు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎల్ (డయాగ్నస్టిక్స్ విభాగం) విలీనం రద్దయింది. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఈ రంగంలో సమస్యలు ప్రబలంగా ఉండటం, విలీన ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ రెండు సంస్థల విలీనం 6–8 నెలల్లో పూర్తవ్వగలదని అంచనా వేశామని, కానీ తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ ప్రక్రియ 19 నెలలుగా సాగుతోందని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం జరిగినా ఇంకా విలీనం పూర్తవ్వలేని పేర్కొంది. కాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) చండీగఢ్ బెంచ్ వద్ద ఈ విలీన స్కీమ్ పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఈ 19 నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయని, డయాగ్నస్టిక్స్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. అందుకు విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం పొందాల్సి ఉందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నౌషేరా–సుందర్బనీ బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ ఉగ్రవాదులు ఐదురోజుల క్రితమే నియంత్రణరేఖ (ఎల్వోసీ) దాటి భారత్‌లోకి చొరబడినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ చొరబాటుపై నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ చేపట్టాయన్నారు. ఇందులోభాగంగా సుందర్బనీ ప్రాంతంలో అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాల్సిందిగా ఆదేశించామన్నారు. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారనీ, భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ప్రాంతంలోని భూషణ్‌కుమార్ శర్మ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు భోజనం వండాల్సిందిగా వారిని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. సుందర్బనీలోని ఓ సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో పేలుడు పదార్థాలున్న 3 బ్యాగుల్ని గుర్తించామన్నారు. -
‘చిల్లర రాజకీయాలను నేను పట్టించుకోను’
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రైతులకు ఇచ్చే రూ.8వేల పథకంలో దొంగలు, దళారులకు అవకాశం ఇవ్వొద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. (కాగా రైతులకు పెట్టుబడిగా ఎరువుల కోసం రెండు పంటలకు రూ.8వేలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే). అలాగే త్వరలో 500మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారుల నియామకం చేస్తామన్నారు. వ్యవసాయ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని కేసీఆర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రైతు హిత సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేశారు. త్వరలో గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంఘాల్లో అవినీతిపరులకు చోటు కల్పించవద్దని ఏఈవోలను ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలను తాను పట్టించుకోనని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి నిర్ణయానికి ఓట్లతో ముడిపెట్టడం దిక్కుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. తన ఫాంహౌస్‌లో లాగే ప్రతిరైతు పంటలు పండించాలని కేసీఆర్ సూచించారు. తనకు ప్రస్తుతం 64 ఏళ్లని, ఏ వ్యాపకం లేదని, పచ్చటి తెలంగాణను కళ్లారా చూడాలనేదే తన కోరిక అని ఆయన అన్నారు. -
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్‌కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్‌నగర్‌లో ఆర్ఎంపీ బషీర్‌బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను ఆర్ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్‌కు చికిత్స చేసిన ఆర్ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.
వారి లోకం ఆకలిరాజ్యం. చిరునామా అభ్యుదయుం. చరిత్ర పుటల్లో విప్లవశంఖాల్లా విరుచుకుపడిన శ్రామికులు.. ఇప్పుడు చతికిల పడుతున్నారు. పిడికిళ్లు బిగించడం మాత్రమే తెలిసిన కామ్రేడ్లు.. కష్టం ఇదని ఎలుగెత్తి నినదించలేకపోతున్నారు. గుండెలు మండించే బాధలు ఎన్నున్నా.. కండలు కరిగించడంలో వీరిది ముందడుగే. ఆర్థికంగా గరీబులైనా.. ఆత్మాభిమానంలో కుబేరులే. అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది. హక్కులు పొందలేక దిక్కులు చూస్తోంది. పదండి ముందుకు పదండి తోసుకు అని మహాకవులు ఘోషించి దశాబ్దాలు దాటినా.. ఈ శ్రామికుల వేదన తీరడం లేదు. జగన్నాథ రథ చక్రాలు ఎన్ని వెళ్లినా.. వీరి బతుకులు బాగుపడిందీ లేదు. పచ్చడి మెతుకుల కోసం.. తలకు మించిన భారాన్ని భుజానికెత్తుకుంటూ బతుకుపోరు సాగిస్తున్న హమాలీ కార్మికులను స్టార్ రిపోర్టర్ రూపంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పలకరించారు. హక్కుల కోసం పోరుతప్పదంటూ.. వారి అంతరంగాన్ని మన ముందుంచారు. రైతు అన్నం పెడతాడు. కార్మికుడు కష్టపడతాడు. వీరిద్దరి ఉసురు తగిలితే దేశానికి భవిష్యత్తు ఉండదు. కార్మికుడ్ని, కర్షకుడ్ని ఏ జాతి అరుుతే పూజిస్తుందో.. ఆ దేశం బాగుపడుతుంది. కార్మికుడు వీధిన పడితే పోయేది ప్రభుత్వం పరువే. నా విజ్ఞప్తి ఒక్కటే.. దేశంలో కార్మికుల ఆకలి కేకలు ఉండకూడదు. ఆర్. నారాయణమూర్తి: పట్టుర.. పట్టు హైలెస్సా..ఉడుంపట్టు హైలెస్సా.. పట్టుర పట్టు ఉడుంపట్టు హైలెస్సా.. పట్టకపోతే పొట్టే గడవదు హైలెస్సా.... వెంకన్న: మేం పనిచేసేటప్పుడు గీ పాట చెవిల పడినా.. మా నోట పలికినా మస్తు హుషారొస్తది సార్. ఆర్. నారాయణమూర్తి: అంతే కదా మరి.. హమాలీ కార్మికులు.. బరువులు భుజానికి ఎత్తకపోతే పొట్టకు ఉండదు కదా బ్రదర్. కె.రాములు: ఎత్తాలే సార్.. ఎంత బరువైనా ఎత్తాలి. అవసరమైతే ఇరవై గంటలైనా కూసోకుండ పని చేయాలి. పని లేకపోతే పస్తులే కదా. ఆర్. నారాయణమూర్తి: అసంఘటిత కార్మికుడి పరిస్థితి ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ప్రతి శ్రామికుడూ.. కార్మికుడే. సంఘటిత, అసంఘటిత పేరుతో మీపై సవతి ప్రేవు చూపకూడదు. దేశంలో పనిచేసే ఏ కార్మికుడికైనా తిండి, బట్ట, విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నా వంతు పోరాటం చేస్తున్నా.. మీరు ఇంకా పోరాడాలి. బి. రాములు: మా కష్టాలు, మా బతుకులను మీరు తీసిన సినిమాలలో చూపించి చాలా మందిని చైతన్య పరిచిండ్రు సార్. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత పోరాటం చేస్తే ఏంది సార్. మా బతుకు మాత్రం ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎమ్. నర్సింహ: ఒకటి రెండు కాదు.. హైదరాబాద్ సిటీల మా హమాలీ కార్మికులు లక్షా పది వేల మంది ఉన్నరు సార్. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం మేమే తలో చెయ్యి వేసుకుంటం కానీ, ప్రభుత్వం నుంచి గానీ, కంపెనీ యజమానుల నుంచి చిల్లి గవ్వ రాదు. ఆర్. నారాయణమూర్తి: అంటే మీరు పని చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే.. యజమాని బాధ్యత తీసుకోడు.. ప్రభుత్వవుూ పట్టించుకోదు...మరి ఎలా కామ్రేడ్? కె. కిష్టయ్య: ఏం చేస్తం సార్. మొన్నామధ్య ఒకాయన రేకులు ఎత్తుతుంటే.. అతని చేతిమీద బరువైన రేకు పడి చెయ్యి కట్ అయ్యింది. మేమే ఆస్పత్రికి తోల్కవోయి.. తలా ఇన్ని పైసలేస్కొని వైద్యం చేరుుంచినం. లక్ష రూపాయులైంది. షాపాయున ను అడిగితే నాకేం సంబంధం అన్నడు. లారీ ఓనర్దీ అదే వూట. ఆర్. నారాయణమూర్తి: కూరగాయులు, బట్టలు, ఇనుప వస్తువులు, స్టీలు సామాన్లు, మోటార్లు, బస్తాలు ఒకటేమిటి.. ఏది వూర్కెట్లోకి రావాలన్నా.. మీరు భుజానికెత్తాల్సిందే. మీ పని చాలా గొప్పది, వుుఖ్యమైనది. వురి మీకు గుర్తింపు కార్డులున్నాయూ ? సంగయ్య: నేను 20 ఏళ్ల నుంచి ఒకటే కంపెనీల పని చేస్తున్న సార్. ఇప్పటికీ గుర్తింపు కార్డు లేదు. ఏందంటే...హమాలోళ్లకి ఐడెంటిటీ ఎవరిస్తర్రా అంటరు. ఆఫీస్ బాయ్‌లకు కూడా కార్డులుంటరుు. వూకు వూత్రం ఇవ్వరు. ఆర్. నారాయణమూర్తి: మీరంతా ఎక్కడ పని చేస్తున్నారు? ఉండేదెక్కడ? మధు: రాణిగంజ్ దగ్గర పని చేస్తం. అక్కడ మోటార్లు, పెద్ద పెద్ద మిషన్లను లారీలకు ఎక్కిస్తం. మా ప్రాంతంలో 400 మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఇక మేము ఉండేదంటారా.. ఒకరు ఉప్పల్‌లో, ఒకరు నాచారంలో, ఒకరు బోయిన్‌పల్లిలో.. నగరంలో నాలుగు దిక్కుల నుంచి వస్తుంటం. ఆర్. నారాయణమూర్తి: పెట్రోలు, ఇతర ఖర్చులు బాగా పెరిగిపోయాయి.. ఖర్చులెట్లా తట్టుకుంటున్నారు బ్రదర్. కె. కొమరయ్య: పెట్రోలుకు మాకు సంబంధమేంది సార్. నూటికి తొంభై మంది సైకిళ్ల మీదనే వస్తరు. అవి తొక్కే సరికే పెయ్యి మొత్తం పుండవుతుంది. వెంకయ్య: ఇప్పుడు రేట్లు వింటుంటే గుండె బరువెక్కిపోతోంది. యూభై రూపాయూల్లేనిది బియ్యుం వస్తలేవు. ఇంటి కిరారుుకే సగం జీతం పోతుంది. పిల్లల చదువులు, వైద్యం అంటే పేదోళ్ల ఒంటి మీద కొరడా దెబ్బలే. మధు: వూ జవూనాల పదేళ్లు రాంగనె పనికి పంపేటోళ్లు. మేవుట్ల చెయ్యులేం సార్. ఎంత కష్టమైనా పిల్లల్ని చదివించాలనుకుంటున్నం. ఆర్. నారాయణమూర్తి: నిజం బ్రదర్. నేటి బాలలే...రేపటి పౌరులు. పిల్లలకు అక్షరం నేర్పించాలి. ఈ స్వతంత్ర దేశంలో అన్నీ తానై నడించాల్సిన ప్రభుత్వం సర్వం ప్రైవేటీకరణ చేసి.. ప్రజలను రోడ్డు మీద నిలబెడుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి బస్సు, రైలు అన్నింటినీ ప్రైవే ట్ పరం చేసి చోద్యం చూడాలనుకుంటోంది. ఫలితం.. పేదవాడి ఆకలి కేకలు. బి. రాములు: అంతే కదా సార్. ఎన్నికల ముందు మాత్రం మా దగ్గరకొచ్చి మీకు గుర్తింపు కార్డులిస్తం, మీకు ఈఎస్ఐ కార్డులిస్తమంటూ ఓట్లడుగుతరు. ఆర్. నారాయణమూర్తి: మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయుకుల దగ్గరికి వెళ్లి మీ సమస్యల గురించి చెప్పారా? శ్రీశైలం: ఏడ సార్.. పోలేదు. ఆర్. నారాయణమూర్తి: వెళ్లి అడగాలి కదా. అవసరమైతే పోరాడాలి. మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే ఇంకెవరు ముందుకొస్తారు. సంఘటిత కార్మికుడికి మీరేం తీసిపోరు. మీరు చేసే కష్టం ప్రజల కోసమే.. వాళ్లు చేసేది ప్రజల కోసమే. ఎన్. భాస్కర్‌రెడ్డి: మేం ఎక్కువ కోరికలు ఏమీ కోరడం లేదు సార్. మాకు గుర్తింపు కార్డులివ్వాలి. కనీసం వైద్య సదుపాయం కల్పించాలి. సొంతిల్లు ఇవ్వకపోయినా కనీసం అద్దె కట్టుకునే స్తోమత కల్పించాలి. ఆర్. నారాయణమూర్తి: పని లేని రోజున మీ పరిస్థితి ఏంటి? బి. రాములు: వూలో కొందరి ఇంటోళ్లు పూలు, కూరగాయులు అవుు్మతరు. నాలుగు ఇళ్లలో పని చేసి ఇంత సంపాదిస్తున్నరు. అందుకే పని లేని రోజు.. నాలుగు పచ్చడి మెతుకులైనా పుడుతున్నరుు. ఎమ్. నర్సింహ: సిటీల మా సంపాదనతో ఇల్లు నడపడం కష్టమనుకున్నోళ్లు భార్యాబిడ్డల్ని ఊళ్లనే ఉంచి ఇక్కడ ఒక్కరే పని చేసుకుంటున్నారు. మధు: సార్.. మీరు తీసే సినిమాలు మమ్మల్ని చానా ఆలోచింపజేసినయి. అప్పుడు మాత్రం మా పని మీద వూకు గౌరవం కలుగుతుంది. హక్కుల కోసం పోరుసాగిస్తాం సార్.. ఆర్. నారాయణమూర్తి: ఒకే.. లాల్‌సలాం!