అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది. | r. narayana murthy meets Hamali workers | Sakshi
Sakshi News home page

అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.

Published Sun, Jul 27 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.

అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.

వారి లోకం ఆకలిరాజ్యం. చిరునామా అభ్యుదయుం. చరిత్ర పుటల్లో విప్లవశంఖాల్లా విరుచుకుపడిన శ్రామికులు.. ఇప్పుడు చతికిల పడుతున్నారు. పిడికిళ్లు బిగించడం మాత్రమే తెలిసిన కామ్రేడ్లు.. కష్టం ఇదని ఎలుగెత్తి నినదించలేకపోతున్నారు. గుండెలు మండించే బాధలు ఎన్నున్నా.. కండలు కరిగించడంలో వీరిది ముందడుగే. ఆర్థికంగా గరీబులైనా.. ఆత్మాభిమానంలో కుబేరులే. అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.

హక్కులు పొందలేక దిక్కులు చూస్తోంది. పదండి ముందుకు పదండి తోసుకు అని మహాకవులు ఘోషించి దశాబ్దాలు దాటినా.. ఈ శ్రామికుల వేదన తీరడం లేదు. జగన్నాథ రథ చక్రాలు ఎన్ని వెళ్లినా.. వీరి బతుకులు బాగుపడిందీ లేదు. పచ్చడి మెతుకుల కోసం.. తలకు మించిన భారాన్ని భుజానికెత్తుకుంటూ బతుకుపోరు సాగిస్తున్న హమాలీ కార్మికులను స్టార్ రిపోర్టర్ రూపంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పలకరించారు. హక్కుల కోసం పోరుతప్పదంటూ.. వారి అంతరంగాన్ని మన ముందుంచారు.
 
రైతు అన్నం పెడతాడు. కార్మికుడు కష్టపడతాడు. వీరిద్దరి ఉసురు తగిలితే దేశానికి భవిష్యత్తు ఉండదు. కార్మికుడ్ని, కర్షకుడ్ని ఏ జాతి అరుుతే పూజిస్తుందో..  ఆ దేశం బాగుపడుతుంది. కార్మికుడు వీధిన పడితే పోయేది ప్రభుత్వం పరువే. నా విజ్ఞప్తి ఒక్కటే.. దేశంలో కార్మికుల ఆకలి కేకలు ఉండకూడదు.
 
ఆర్. నారాయణమూర్తి: పట్టుర.. పట్టు హైలెస్సా..ఉడుంపట్టు హైలెస్సా.. పట్టుర పట్టు ఉడుంపట్టు హైలెస్సా.. పట్టకపోతే పొట్టే గడవదు హైలెస్సా....
వెంకన్న: మేం పనిచేసేటప్పుడు గీ పాట చెవిల పడినా.. మా నోట పలికినా మస్తు హుషారొస్తది సార్.
ఆర్. నారాయణమూర్తి: అంతే కదా మరి.. హమాలీ కార్మికులు.. బరువులు భుజానికి ఎత్తకపోతే పొట్టకు ఉండదు కదా బ్రదర్.
కె.రాములు: ఎత్తాలే సార్.. ఎంత బరువైనా ఎత్తాలి. అవసరమైతే ఇరవై గంటలైనా కూసోకుండ పని చేయాలి. పని లేకపోతే పస్తులే కదా.
ఆర్. నారాయణమూర్తి: అసంఘటిత కార్మికుడి పరిస్థితి ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ప్రతి శ్రామికుడూ.. కార్మికుడే. సంఘటిత, అసంఘటిత పేరుతో మీపై సవతి ప్రేవు చూపకూడదు. దేశంలో పనిచేసే ఏ కార్మికుడికైనా తిండి, బట్ట, విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నా వంతు పోరాటం చేస్తున్నా.. మీరు ఇంకా పోరాడాలి.
బి. రాములు: మా కష్టాలు, మా బతుకులను మీరు తీసిన సినిమాలలో చూపించి చాలా మందిని చైతన్య పరిచిండ్రు సార్. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత పోరాటం చేస్తే ఏంది సార్. మా బతుకు మాత్రం ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది.
ఎమ్. నర్సింహ: ఒకటి రెండు కాదు.. హైదరాబాద్ సిటీల మా హమాలీ కార్మికులు లక్షా పది వేల మంది ఉన్నరు సార్. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం మేమే తలో చెయ్యి వేసుకుంటం కానీ, ప్రభుత్వం నుంచి గానీ, కంపెనీ యజమానుల నుంచి చిల్లి గవ్వ రాదు.
ఆర్. నారాయణమూర్తి: అంటే మీరు పని చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే.. యజమాని బాధ్యత తీసుకోడు.. ప్రభుత్వవుూ పట్టించుకోదు...మరి ఎలా కామ్రేడ్?
కె. కిష్టయ్య: ఏం చేస్తం సార్. మొన్నామధ్య ఒకాయన రేకులు ఎత్తుతుంటే.. అతని చేతిమీద బరువైన రేకు పడి చెయ్యి కట్ అయ్యింది. మేమే ఆస్పత్రికి తోల్కవోయి.. తలా ఇన్ని పైసలేస్కొని వైద్యం చేరుుంచినం. లక్ష రూపాయులైంది. షాపాయున ను అడిగితే నాకేం సంబంధం అన్నడు. లారీ ఓనర్‌దీ అదే వూట.
ఆర్. నారాయణమూర్తి: కూరగాయులు, బట్టలు, ఇనుప వస్తువులు, స్టీలు సామాన్లు, మోటార్లు, బస్తాలు ఒకటేమిటి.. ఏది వూర్కెట్‌లోకి
రావాలన్నా.. మీరు భుజానికెత్తాల్సిందే. మీ పని చాలా గొప్పది, వుుఖ్యమైనది. వురి మీకు గుర్తింపు కార్డులున్నాయూ ?
సంగయ్య: నేను 20 ఏళ్ల నుంచి ఒకటే కంపెనీల పని చేస్తున్న సార్. ఇప్పటికీ గుర్తింపు కార్డు లేదు. ఏందంటే...హమాలోళ్లకి ఐడెంటిటీ ఎవరిస్తర్రా అంటరు. ఆఫీస్ బాయ్‌లకు కూడా కార్డులుంటరుు. వూకు వూత్రం ఇవ్వరు.
ఆర్. నారాయణమూర్తి: మీరంతా ఎక్కడ పని చేస్తున్నారు? ఉండేదెక్కడ?
మధు: రాణిగంజ్ దగ్గర పని చేస్తం. అక్కడ మోటార్లు, పెద్ద పెద్ద మిషన్లను లారీలకు ఎక్కిస్తం. మా ప్రాంతంలో 400 మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఇక మేము ఉండేదంటారా.. ఒకరు ఉప్పల్‌లో, ఒకరు నాచారంలో, ఒకరు
బోయిన్‌పల్లిలో.. నగరంలో నాలుగు దిక్కుల నుంచి వస్తుంటం.
ఆర్. నారాయణమూర్తి: పెట్రోలు, ఇతర ఖర్చులు బాగా పెరిగిపోయాయి.. ఖర్చులెట్లా తట్టుకుంటున్నారు బ్రదర్.
కె. కొమరయ్య: పెట్రోలుకు మాకు సంబంధమేంది సార్. నూటికి తొంభై మంది సైకిళ్ల మీదనే వస్తరు. అవి తొక్కే సరికే పెయ్యి మొత్తం పుండవుతుంది.
వెంకయ్య: ఇప్పుడు రేట్లు వింటుంటే గుండె బరువెక్కిపోతోంది. యూభై రూపాయూల్లేనిది బియ్యుం వస్తలేవు. ఇంటి కిరారుుకే సగం జీతం పోతుంది. పిల్లల చదువులు, వైద్యం అంటే పేదోళ్ల ఒంటి మీద కొరడా దెబ్బలే.
మధు: వూ జవూనాల పదేళ్లు రాంగనె పనికి పంపేటోళ్లు. మేవుట్ల చెయ్యులేం సార్. ఎంత కష్టమైనా పిల్లల్ని చదివించాలనుకుంటున్నం.
ఆర్. నారాయణమూర్తి: నిజం బ్రదర్. నేటి బాలలే...రేపటి పౌరులు. పిల్లలకు అక్షరం నేర్పించాలి. ఈ స్వతంత్ర దేశంలో అన్నీ తానై నడించాల్సిన ప్రభుత్వం సర్వం ప్రైవేటీకరణ చేసి.. ప్రజలను రోడ్డు మీద నిలబెడుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి బస్సు, రైలు అన్నింటినీ ప్రైవే ట్ పరం చేసి చోద్యం చూడాలనుకుంటోంది. ఫలితం.. పేదవాడి ఆకలి కేకలు.
బి. రాములు: అంతే కదా సార్. ఎన్నికల ముందు మాత్రం మా దగ్గరకొచ్చి మీకు గుర్తింపు కార్డులిస్తం, మీకు ఈఎస్‌ఐ కార్డులిస్తమంటూ ఓట్లడుగుతరు.
ఆర్. నారాయణమూర్తి: మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయుకుల దగ్గరికి వెళ్లి మీ సమస్యల గురించి చెప్పారా?
శ్రీశైలం: ఏడ సార్.. పోలేదు.
ఆర్. నారాయణమూర్తి: వెళ్లి అడగాలి కదా. అవసరమైతే పోరాడాలి. మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే ఇంకెవరు ముందుకొస్తారు. సంఘటిత కార్మికుడికి మీరేం తీసిపోరు. మీరు చేసే కష్టం ప్రజల కోసమే.. వాళ్లు చేసేది ప్రజల కోసమే.
ఎన్. భాస్కర్‌రెడ్డి: మేం ఎక్కువ కోరికలు ఏమీ కోరడం లేదు సార్. మాకు గుర్తింపు కార్డులివ్వాలి. కనీసం వైద్య సదుపాయం కల్పించాలి. సొంతిల్లు ఇవ్వకపోయినా కనీసం అద్దె కట్టుకునే స్తోమత కల్పించాలి.
ఆర్. నారాయణమూర్తి: పని లేని రోజున మీ పరిస్థితి ఏంటి?
బి. రాములు:  వూలో కొందరి ఇంటోళ్లు పూలు, కూరగాయులు అవుు్మతరు. నాలుగు ఇళ్లలో పని చేసి ఇంత సంపాదిస్తున్నరు.  అందుకే పని లేని రోజు.. నాలుగు  పచ్చడి మెతుకులైనా పుడుతున్నరుు.
ఎమ్. నర్సింహ: సిటీల మా సంపాదనతో ఇల్లు నడపడం కష్టమనుకున్నోళ్లు భార్యాబిడ్డల్ని ఊళ్లనే ఉంచి ఇక్కడ ఒక్కరే పని చేసుకుంటున్నారు.
మధు: సార్.. మీరు తీసే సినిమాలు మమ్మల్ని చానా ఆలోచింపజేసినయి. అప్పుడు మాత్రం మా పని మీద వూకు గౌరవం కలుగుతుంది. హక్కుల కోసం పోరుసాగిస్తాం సార్..
ఆర్. నారాయణమూర్తి: ఒకే.. లాల్‌సలాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement