
ముంబై: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సారథ్యం వహిస్తారని ఆదివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగం పదో షెడ్యూల్‌లో ఉంది. దీని ప్రకారంఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా అనర్హత వేటు వేయవచ్చు.