Review committee
-
ఫిరాయింపుల చట్టంపై సమీక్ష కమిటీ: ఓం బిర్లా
ముంబై: ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు కమిటీ వేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీనికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సారథ్యం వహిస్తారని ఆదివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచూ పార్టీలు మారడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగం పదో షెడ్యూల్లో ఉంది. దీని ప్రకారంఎమ్మెల్యేలు పార్టీ మారినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా అనర్హత వేటు వేయవచ్చు. -
ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సమీక్షించనుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సిఫారసులు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించనుంది. -
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఓకే చెప్పింది. కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు. సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిందని అధికారులు తెలిపారు. తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్? దేశ రక్షణ రంగానికి తలమానికంగా చెప్పుకునే సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 31న రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌కానున్నారు. సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. రూ. 6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అటల్ భూజల్ (అటల్ జల్) పథకాన్ని రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు: స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి. రైల్వేలో సంస్థాగత మార్పులు సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్–ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐఆర్ఎంఎస్)గా పరిగణించాలని నిర్ణయించారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు. -
సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్‌స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది. కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్‌కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు. -
సైన్స్ గ్రూపుల్లో సగం సిలబస్‌లో ప్రాక్టికల్స్
-ఇంటర్మీడియట్లో దేశ వ్యాప్త అమలుకు ప్రతిపాదన - ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్ అమలుకు సిలబస్ కమిటీ చర్యలు - వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం హైదరాబాద్: ఇంటర్మీడియట్లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా చర్యలు చేపట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్మీడియట్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయ పడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ విద్యలో, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని గురువారం తీర్మానించింది. అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టుల్లో (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల మేరకు ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగానే ఉందని, దానిని మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఇంటర్మీడియట్ బోర్డు ఛైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆర్‌ఎంఎస్‌ఏ విభాగం హెడ్ ప్రొఫెసర్ రంజనా అరోరా, సీబీఎస్ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, ఆయా సబ్జెక్టుల్లోనూ 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. మిగితా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించింది. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని, 5 నుంచి 10 శాతం వరకే ఆయా రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆప్షనల్ సిలబస్‌ను రూపొందించుకునే అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్ ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచేలా ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిలీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.