సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు
న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్‌స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది.
కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్‌కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు.