Abhinav Bindra
-
అభినవ్ బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’
పారిస్: ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’ను అందజేసింది. ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది. 1975 నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్‌ను అందజేస్తున్నారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ థామస్ బాక్ ఈ అవార్డును బింద్రాకు అందజేశారు. -
Wrestlers Protest: వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా
న్యూఢిల్లీ: పోలీసు నిర్బంధం నుంచి ఆదివారం రాత్రి విడుదలైన భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ‘మా తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలోనే వెల్లడవుతుంది. మేమంతా ఇంకా కలుసుకోలేదు. మమ్మల్ని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. నన్ను అర్ధరాత్రి దాటాక విడిచి పెట్టారు. మిగతా రెజ్లర్లను రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. అందువల్లే అందరం కలువలేకపోయాం. అంతా కలిసి చర్చించుకున్నాకే తదుపరి పోరాటానికి దిగుతాం’ అని బజరంగ్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రెజ్లర్లు మళ్లీ నిరసన చేసేందుకు అనుమతి కోరితే ఇస్తామని, అయితే జంతర్‌మంతర్ వద్ద మాత్రం శిబిరానికి అనుమతి లేదని, ఢిల్లీలో ఇంకెక్కడైనా దీక్ష చేపట్టవచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా దేశానికి ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని బీజింగ్ ఒలింపిక్స్ (2008) చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. మహిళా రెజ్లర్లపై దాష్టీకానికి పాల్పడిన దృశ్యాలు తనను కలచివేశాయని రాత్రంత నిద్రేలేకుండా చేసిందని ట్వీట్ చేశాడు. స్టార్ రెజ్లర్లతో ఖాకీల కాఠిన్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కానే కాదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి అన్నాడు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన చిత్రాలు తనను బాధించాయని, సాధ్యమైనంత త్వరలో వారి సమస్య పరిష్కరించాలని మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
ఎంఆర్ఐ స్కానింగ్ చేయలేనంత తీవ్రంగా గాయాలు.. బీసీసీఐకి బింద్రా సలహా
Abhinav Bindra Tweet On Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన భారత క్రికెటర్ రిషభ్ పంత్‌కు మరింత మెరుగైన చికిత్స అవసరమని బీసీసీఐ భావించింది. దాంతో ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న డెహ్రాడూన్ ఆస్పత్రి నుంచి పంత్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఇకపై ముంబైలోని ప్రతిష్టాత్మక కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో పంత్‌కు చికిత్స కొనసాగుతుందని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధానంగా పంత్ మోకాలి గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటం, వాటికి తక్షణ చికిత్స అవసరం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సచిన్, యువరాజ్, బుమ్రా స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్, ఆర్థోస్కోపీ నిపుణుడైన డాక్టర్ దిన్షా పర్దీవాలా పంత్ చికిత్సను పర్యవేక్షిస్తారు. దిన్షా గతంలో సచిన్, యువరాజ్, బుమ్రా, జడేజాలతో పాటు పలువురు ఇతర అథ్లెట్లకు చికిత్స అందించారు. పంత్ కోలుకునేందుకు బోర్డు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని షా చెప్పారు. తీవ్రత ఎంతగా ఉందంటే అయితే, ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నా... అతని మోకాలు, మడమ గాయాల తీవ్రత ఎంతగా ఉందంటే ఇప్పటి వరకు వాటికి కనీసం ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయలేకపోయారు. ఇదే కాస్త ఆందోళన కలిగించే అంశం. ఇదిలా ఉంటే.. రిషభ్ పంత్ పట్ల బీసీసీఐ తీసుకుంటున్న శ్రద్ధ పట్ల ఒలంపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘రిషభ్ త్వరగా కోలుకునేందుకు బోర్డు చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం. అయితే, ఈ కష్టకాలంలో అతడికి మానసికంగా మద్దతు కూడా అవసరం. తనకు భరోసా కల్పించేలా మరిన్ని చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది’’ అని బింద్రా ట్విటర్ వేదికగా బీసీసీఐకి సలహా ఇచ్చాడు. కాగా భారత షూటర్ అభినవ్ బింద్రా బీజింగ్ ఒలంపిక్స్‌లో దేశానికి పసిడి పతకం అందించిన విషయం తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా బింద్రా చరిత్ర సృష్టించాడు. చదవండి: Sanju Samson: మరీ ఇంత దరిద్రం ఏంటి భయ్యా! ఇలాగైతే ‘కెరీర్’కు ఎండ్ కార్డ్ పడ్డట్లే! Ind Vs SL- Jitesh Sharma: ఎవరీ జితేశ్ శర్మ? సంజూ స్థానంలో అతడే ఎందుకు? బీసీసీఐ ఆలోచన అదేనా?! -
Abhinav Bindra: బుల్లెట్ దిగింది..
2000 సిడ్నీ ఒలింపిక్స్.. 18 ఏళ్ల వయసులో పతకం ఆశలతో బరిలోకి దిగిన అతనికి ఏదీ కలిసి రాలేదు. చివరకు దక్కింది 11వ స్థానం. కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్.. ఈసారి తన ఆట ఎంతో మెరుగైందని భావిస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్లాడు.. కానీ ఈసారి 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! ఒక వ్యక్తిగత క్రీడాంశంలో, అదీ మానసికంగా ఎంతో దృఢంగా ఉండాల్సిన ఆటలో, రెండు ఒలింపిక్స్‌లో వరుస వైఫల్యాల తర్వాత వెంటనే కోలుకొని తర్వాతి నాలుగేళ్ల కాలానికి లక్ష్యాలు పెట్టుకొని సిద్ధం కావడం అంత సులువు కాదు. కానీ ఆ ఆటగాడి పట్టుదల ముందు ప్రతికూలతలన్నీ తలవంచాయి. బీజింగ్‌లో అతని బుల్లెట్ గురి తప్పలేదు. సరిగ్గా టార్గెట్‌ను తాకి పసిడి పతకాన్ని అతని మెడలో వేసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కాని ఘనతను అందించింది. ఆ శూరుడే అభినవ్ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు. ఆటలో అద్భుతాలు చేయగానే మనలో చాలా మందికి సహజంగానే అతని నేపథ్యంపైనే ఆసక్తి పెరుగుతుంది. అయితే విజయగాథలన్నీ పేద కుటుంబం నుంచో, మధ్యతరగతి కుటుంబాల నుంచో మొదలు కావాలనేం లేదు.. కోటీశ్వరుడైనా క్రీడల్లోకి వెళితే స్కోరు సున్నా నుంచే మొదలవుతుంది. అందుకే ఎక్కువగా వినిపించే సాధారణ స్థాయి నుంచి శిఖరానికెదిగిన లాంటి కథ కాదు బింద్రా జీవితం. అతను ఐశ్వర్యంలో పుట్టాడు. దేశంలోనే టాప్ స్కూల్లో ఒకటైన ‘డూన్ స్కూల్’లో చదువుకున్నాడు. ఉన్నత విద్యను అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో అభ్యసించాడు. తిరిగొచ్చి తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడమే తరవాయి.. కానీ బింద్రా మరో బాటను ఎంచుకున్నాడు. అది కూడా సరదా కోసమో, వ్యాపారంలో అలసిపోయాక వారాంతంలో టైమ్ పాస్‌గా ఆడుకునేందుకో కాదు. ఆటలో అగ్రస్థానానికి చేరేందుకు అడుగు పెట్టాడు. అందుకే పగలు, రాత్రి కష్టపడ్డాడు. ఒక వ్యాపారవేత్తగా సాధించే కోట్లతో పోలిస్తే అంతకంటే విలువైన దానిని అందుకున్నాడు. కోట్లాది భారతీయుల ప్రతినిధిగా, వారంతా గర్వపడేలా తన రైఫిల్‌తో సగర్వంగా విశ్వ క్రీడా వేదికపై జనగణమన వినిపించాడు. చిరస్మరణీయం డబ్బుంటే చాలు క్రీడల్లోకి వెళ్లిపోవడం చాలా సులువు అనే అభిప్రాయం మన దేశంలో బలంగా పాతుకుపోయింది. నిజానికి అలాంటి వాళ్లు ఆటల్లో రాణించాలంటే ఇతరులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేరణ ఉండాలి. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా సాధించాలనే లక్ష్యం, పట్టుదల కొత్తగా పుట్టుకురావాలి. సరిగ్గా చెప్పాలంటే చుట్టూ ఉన్న సకల సౌకర్యాలు, విలాసాలకు ఆకర్షితులవకుండా ఏకాగ్రత చెదరకుండా పోటీల్లో దిగాలి. అలా చూస్తే మా అభినవ్ సాధించిన ఘనత అసాధారణం. దాని విలువ అమూల్యం’ బింద్రా స్వర్ణ పతకం సాధించిన తర్వాత అతని కుటుంబ మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఆ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ బింద్రా.. తన నేపథ్యం వల్లే ఎదిగాడనే మాటను చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఎందుకంటే 2008 ఆగస్టు 11న బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా స్వర్ణ పతకం గెలుచుకున్నాడనే వార్త విన్న తర్వాత హృదయం ఉప్పొంగని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో అదీ టీమ్ గేమ్ హాకీలో భారత జట్టు చివరిసారిగా స్వర్ణం సాధించిందని జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో వింటూ వచ్చిన కొత్త తరానికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విలువేమిటో అప్పుడే తెలిసింది. ఇల్లే షూటింగ్ రేంజ్‌గా.. షూటింగ్ ధనవంతులు మాత్రమే ఆడుకునే ‘ఎలీట్ పీపుల్స్ గేమ్’. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. గన్స్ మొదలు పోటీల్లో వాడే బుల్లెట్స్, జాకెట్, అనుమతులు, పన్నులు.. ఇలా అన్నీ బాగా డబ్బులతో కూడుకున్న వ్యవహారమే. అభినవ్ తండ్రి అప్జిత్ బింద్రా పెద్ద వ్యాపారవేత్త. పంజాబ్‌లో ఆగ్రో ఫుడ్ బిజినెస్, హోటల్స్ వ్యాపారంలో పెద్ద పేరు గడించాడు. కొడుకు తాను షూటింగ్ ప్రాక్టీస్‌కు వెళతానని చెబితే తొలుత ఆయన కూడా సరదా వ్యాపకంగానే చూశాడు. కానీ అభినవ్ మొదటి రోజు నుంచి కూడా దానిని ప్రొఫెషనల్, కాంపిటీటివ్ స్పోర్ట్‌గానే భావించాడు. అందుకే సాధన మాత్రమే కాదని ఫలితాలు కూడా ముఖ్యమని అతని మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేశాడు. దాంతో తండ్రికి కూడా కొడుకు లక్ష్యాలపై స్పష్టత వచ్చింది. అందుకే ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాడు. చండీగఢ్‌లోని తమ ఇంట్లోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసేశాడు. అభినవ్‌కు 24 గంటలు అదే అడ్డా అయింది. అన్నీ మరచి ప్రాక్టీస్‌లోనే మునిగాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలతో భారత జట్టులో చోటు దక్కింది. 1998 కామన్వెల్త్ క్రీడల్లో పతకం రాకున్నా, భారత్ నుంచి పాల్గొన్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) గుర్తింపు పొందాడు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో తొలి పతకం వచ్చినా అది ‘పెయిర్స్’ విభాగంలో కాబట్టి అంతగా సంతృప్తినివ్వలేదు. రెండు ఒలింపిక్స్ వచ్చి పోయాయి కానీ ఫలితం దక్కలేదు. ఏదైనా సాధించాలనే తపన పెరిగిపోతోంది కానీ సాధ్యం కావడం లేదు. 2005కు వచ్చే సరికి వెన్ను గాయం దెబ్బ కొట్టింది. దాదాపు ఏడాది పాటు గన్ కూడా ఎత్తలేకపోయాడు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. తేదీలు మారుతున్నా పెద్ద ఘనత సాధించలేకపోవడంతో బింద్రా మనసులో మథనం మొదలైంది. తాను ఎక్కడ వెనుకబడుతున్నాడో గుర్తించాడు. అసాధారణమైన ఏకాగ్రత అవసరం ఉండే క్రీడ షూటింగ్. మిల్లీ సెకండ్ దృష్టి చెదిరినా పతకం సాధించే స్థితినుంచి నేరుగా పాతాళానికి పడిపోవచ్చు. దీనిని అధిగమించాలంటే మన దేశంలో అందుబాటులో లేని ప్రత్యేక శిక్షణ తనకు ఎంతో అవసరం అనిపించింది. అందుకే జర్మనీ చేరుకున్నాడు. ఏడాదికి పైగా విరామం లేకుండా అత్యున్నత స్థాయి కోచ్‌ల వద్ద సాధనలో రాటుదేలాడు. మొదటి ఫలితం 2006, ఆగస్ట్.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో వచ్చింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అతను నిలిచాడు. ఈ గెలుపు సరిగ్గా రెండేళ్ల తర్వాత అందుకున్న ఒలింపిక్స్ పతకానికి తొలి అడుగుగా నిలిచింది. ఈ రెండేళ్లలో అతను మరింతగా కష్టపడ్డాడు. బీజింగ్‌లో షూటింగ్ పోటీలు ఎలా ఉంటాయనేదానిపై పూర్తి స్థాయిలో అక్కడ ఉండే వాతావరణం సహా రిహార్సల్స్ చేశాడు. ఎంతగా అంటే మైక్‌లో అనౌన్సర్ పేరు చెప్పినప్పుడు తాను పోటీలో వేసుకునే షూస్‌తో ఎలా నడవాలి అనే సూక్ష్మమైన అంశాలను కూడా వదిలిపెట్టనంతగా. చివరకు తన లక్ష్యం చేరడంలో సఫలమయ్యాడు. అవార్డులు, రివార్డులు.. సుమారు రెండు దశాబ్దాల కెరీర్లో బింద్రా 150కి పైగా పతకాలు గెలిచాడు. భారత ప్రభుత్వం అతడిని క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ హోదా కూడా బింద్రాకు ఉంది. ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ – మై ఆబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్’ పేరుతో బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకరూపంలో వచ్చింది. ఆట తర్వాతా ఆటతోనే.. గన్ పక్కన పెట్టేసిన తర్వాత బింద్రా క్రీడలతో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు. సాధారణంగా రిటైరయ్యేవాళ్లు ఒక కోచ్‌గానో, లేక క్రీడా సమాఖ్యల్లో పరిపాలకులుగానో తమ పాత్రను నిర్వర్తించేందుకు సిద్ధమైపోతారు. బింద్రా కూడా కోచింగ్ వైపు దృష్టి పెడితే స్పందన కూడా అద్భుతంగా ఉండేది. కానీ ఇక్కడా అతను భిన్నమైన మార్గాన్నే ఎంచుకున్నాడు. ఒక షూటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల క్రీడాంశాలకు సంబంధించి ఒక కీలక అంశాన్ని అతను ఎంచుకున్నాడు. ఎంతో ప్రతిభ, సత్తా ఉన్నా కీలక సమయాల్లో విశ్వవేదికపై మన భారతీయులు వెనుకబడుతున్న విషయాన్ని అతను గుర్తించాడు. అందుకే ఈతరం పోటీ ప్రపంచంలో ‘స్పోర్ట్స్ సైన్స్’పై దృష్టి పెట్టాడు. బింద్రా నేతృత్వంలో పని చేస్తున్న ‘అభినవ్ ఫ్యూచరిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ భారత క్రీడల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడకంపై సహకారం అందిస్తుంది. ‘అభినవ్ బింద్రా టార్గెటింగ్ పెర్ఫార్మెన్స్’ ద్వారా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. భువనేశ్వర్‌లో అభినవ్ బింద్రా స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కూడా పని చేస్తోంది. ఇక తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ప్రాథమిక స్థాయిలో క్రీడలకు అత్యుత్తమ కోచింగ్ సౌకర్యాలు అందించడంలో కృషి చేస్తోంది. ఈ అన్ని సంస్థల్లో కలిపి వేర్వేరు క్రీడా విభాగాలకు చెందిన సుమారు 5 వేల మంది అథ్లెట్లు ప్రయోజనం పొందడం విశేషం. అందుకే ఆపేశాను కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత ఆటనుంచి తప్పుకోవడం అంత సులువు కాదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఏదో ఒక టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు తలపడుతూనే ఉంటారు. ఆటపై తమకు ఉన్న ప్రేమే అందుకు కారణమని చెబుతుంటారు. ఈ విషయంలో బింద్రా భిన్నంగానే నిలబడ్డాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో బింద్రా ఆఖరి సారిగా పోటీ పడ్డాడు. ఆ మెగా ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచిన అతను త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆ సమయంలో బింద్రా వయసు 34 ఏళ్లు. అందుకే అతని రిటైర్మెంట్ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఒక అభిమాని.. ట్విట్టర్ ద్వారా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తే దానికి ఏమాత్రం భేషజం లేకుండా బింద్రా స్పష్టంగా సమాధానమిచ్చాడు. ‘ఒకటి.. నా నైపుణ్యం రోజురోజుకూ తగ్గిపోతోందని అర్థమైంది. రెండు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో విఫలమయ్యాను. మూడు.. నేను అక్కడే వేలాడుతూ ఉంటూ మరో యువ ప్రతిభావంతుడి అవకాశం దెబ్బ తీసినట్లు అవుతుంది. అలా చేయదల్చుకోలేదు’ అని అతను చెప్పాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం
అభినవ్ బింద్రా.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో గెలుచుకున్న స్వర్ణ పతకం. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా అభినవ్ బింద్రా చరిత్ర లిఖించాడు. అందుకే క్రీడాభిమానులు అంత తొందరగా అభివన్ బింద్రా పేరు మరిచిపోలేరు. 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా 2017లో 34 ఏళ్ల వయసులోనే బింద్రా అధికారికంగా షూటింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తన రిటైర్మెంట్కు ముందు జరిగిన 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికి అభినవ్ బింద్రా పతకం సాధించలేకపోయాడు. తాజాగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి గేమ్స్‌లో 61 పతకాలు సాధించిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా ఖాతాలో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బింద్రా స్పందించాడు.'' కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. ఈసారి పతకాలు సాధించిన వారిలో ఎక్కువమంది అథ్లెట్ల జీవితాలు అందరికి ఆదర్శప్రాయం కావడం జాతికే గర్వకారణం. మనందరం భారతీయులం.. ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం'' అంటూ పేర్కొన్నాడు. కాగా బింద్రా ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే ఒక అభిమాని.. మీరు తొందరగా రిటైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటో చెబుతారా అని అడిగాడు. దానికి బింద్రా మూడు ముక్కల్లో ముగించాడు. '' (1).. నా నైపుణ్యం కాస్త మసకబారినట్లుగా అనిపించింది.. (2).. ఒకసారి పతకం తెచ్చాను.. ఇంకోసాది దేశానికి పతకం తేవాలన్న నా కళ ఫెయిల్ అయింది.. (3).. 34 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఇచ్చానంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే. ఈ రోజుల్లో మన భారత్‌లో యంగ్ టాలెంట్ విరివిగా ఉంది.. ప్రోత్సహించడమే మన లక్ష్యం.. దానిని పాడు చేయొద్దు.. అందుకే గౌరవంగా తప్పుకున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. 1.) Recognised my fading skills 2). Failed in two successive Games 3). Was the appropriate time to give my spot to a younger athlete and talent ! ( did not just want to hold on to it ) — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) August 11, 2022 Why he retired too early is something he will answer someday to his fans.. — The Patriot..🇮🇳 (@Indian_567) August 11, 2022 చదవండి: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు -
Rahul Dravid: సెంచరీ చేసినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అందుకే..
Rahul Dravid Comments: టీమిండియా వాల్.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాటర్‌గా గుర్తింపు.. పాకిస్తాన్ గడ్డపై చిరస్మరణీయ ఇన్నింగ్స్(డబుల్ సెంచరీ)తో ఆకట్టుకున్న క్రికెటర్.. ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్న దిగ్గజం.. అవును ఈ ఉపోద్ఘాతమంతా రాహుల్ ద్రవిడ్ గురించే! క్రికెట్ ప్రపంచంలో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇదంతా ద్రవిడ్ మేటి క్రికెటర్‌గా ఎదిగిన తర్వాతి విషయం. కానీ.. అంతకు ముందు సామాన్యుల్లాగే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదట! ముఖ్యంగా.. స్కూళ్లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత కూడా ఓ పత్రికలో ద్రవిడ్ పేరు తప్పుగా రాశారట. అది చూసిన ద్రవిడ్.. తన పేరు అందరికీ తెలిసేలా చేయాలనే పట్టుదలతో ముందుకు సాగి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నారు. నా పేరు ఇదీ అని నమ్మలేదు! ఈ విషయాలను స్వయంగా రాహుల్ ద్రవిడ్ స్వయంగా చెప్పుకొచ్చారు. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్ అభినవ్ బింద్రాతో పాడ్‌కాస్ట్‌లో భాగంగా ఆయన ఈ ఘటన గురించి పంచుకున్నారు. ఈ మేరకు ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ఆ ఎడిటర్ కచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని భావించి ఉంటారు.. ద్రవిడ్ అనే పేరుతో ఎవరూ ఉండరని అనుకుని ఉంటారు. అందుకే డేవిడ్ అని రాశారేమో!? ఎందుకంటే దాదాపుగా చాలా మందికి ఆ పేరు ఉంటుంది. అప్పుడే నాకు ఓ విషయం అర్థమైంది. స్కూల్ క్రికెట్లో సెంచరీ చేసిన తర్వాత కూడా నా పేరు ఎవరికీ తెలియలేదు. కాబట్టి మరింత మెరుగ్గా రాణించాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే పట్టుదల పెరిగింది. నా పేరు ఇది అని నమ్మడానికి కూడా కొంతమంది ఇష్టపడలేదు.. దానిని కచ్చితంగా మార్చాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసులో మొదలుపెట్టి కాగా 1973లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన రాహుల్ ద్రవిడ్.. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చిన్నతనంలో బెంగళూరుకు వచ్చాడు. 12 ఏళ్ల వయసులో కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 1991లో రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 1996లో శ్రీలంకతో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. మొత్తంగా 509 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. 24,208 పరుగులు సాధించాడు. ఇందులో 48 సెంచరీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న ద్రవిడ్.. జట్టుతో పాటు వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. Rahul ‘David’ recounts a crucial lesson he learnt after scoring his 1st century in school cricket. Tune in to my podcast ‘In the Zone’ to dissect the mind of THE gentleman from the gentleman’s game.@under25universe https://t.co/A9iUknxEMu #InTheZoneWithAB #Under25Original pic.twitter.com/v2CAvNAPRB — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) July 25, 2022 చదవండి: Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు Ind Vs WI 2nd ODI: టీమిండియా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన నాలుగో జట్టుగా.. -
నా అంత్యక్రియలు అయిపోయాక మెసేజ్ చేస్తా!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇవేనా స్ట్రోకులు? ఉక్రెయిన్ స్థానాన్ని భర్తీ చేసేలా భారీ గోధుమ ఎగుమతులు అంటూ ముందు పతాక శీర్షికలకు ఎక్కాలి. తర్వాత దేశీయ ధరల పరిస్థితిని బట్టి గోధుమ ఎగుమతులను నిషేధించాలి. మళ్లీ అమెరికా ఆ నిర్ణయంతో సంతోషంగా లేదు కాబట్టి, నిషేధాన్ని సడలించాలి. ఇదంతా కూడా ఐదు రోజుల వ్యవధిలో! అయినా మాస్టర్ స్ట్రోకుల్లో విశ్వగురువు కాబట్టి ఏ ఆశ్చర్యమూ కలగడం లేదు. – జైరామ్ రమేశ్, రాజ్యసభ ఎంపీ దానిక్కూడా రారా మరి! నా అంతిమ క్రియలు జరిగిన తర్వాత, నా స్నేహితుల్లో ఎవరైనా నా ఫోన్‌ను తీసుకుని, వాటికి హాజరు కానివారికి ఇలా సందేశం పంపాలని కోరుకుంటాను: ‘మిమ్మల్ని ఇవ్వాళ చాలా మిస్సయ్యాను. అయినా ఫర్లేదు, త్వరలోనే కలుసుకుంటాను’. – అంజలి, వ్యంగ్య రచయిత లేవాలి... నడవాలి... డెస్కు దగ్గర రోజంతా అలా కదలకుండా కూర్చోవడానికి మన శరీరం డిజైన్ కాలేదు. అది మన దేహ దారుఢ్యానికీ, భంగిమకూ, మానసిక ఆరోగ్యానికీ కూడా భయంకరమైనది. కాబట్టి, గంటలో అది కొద్ది నిమిషాలే అయినా సరే ఒకసారి లేచి నడవాలి. అలాగే లంచ్ వేళల్లో ఫోన్ మీద పడొద్దు– చిన్న నడక అయినా సాగించాలి. ఎంత సాధ్యమైతే అంత! – కరోలా సైకోరా, డబ్ల్యూహెచ్ఓ క్యాన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ అదుపు అవసరం విపాసన, జిక్ర్, యోగా, ధ్యానం తరగతుల వల్ల ఏం ప్రయోజనం, ఇంకొకరిని ట్రోల్ చేయాలన్న అమితమైన కోరికను అవి నియంత్రించలేకపోతే? – ఖాలిద్ అనీస్ అన్సారీ, సోషియాలజీ ప్రొఫెసర్ రుచి అద్భుతం నా జీవితంలో మొదటిసారి మామిడిపండు తిన్నాను. అది ఎంత బాగుందో చెప్పలేను. – జో వాల్ష్, యూఎస్ మాజీ అధ్యక్ష అభ్యర్థి క్షేమంగా ఉండాలి అస్సాం వరదల దృశ్యాలు చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఈ విపత్తు వల్ల ప్రభావితులైన జనాలందరికీ నా ప్రార్థన. – అభినవ్ ఎ.బింద్రా, ఒలింపియన్ లేదు వయసు ‘స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్’ పత్రిక వారి ‘స్విమ్‌సూట్ 2022’ కవర్ పేజీ మీద 74 ఏళ్ల వయసులో మోడల్‌గా ఉండటం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇలాంటివి చేయడానికి ఇదే సమయం. – మాయే మస్క్, యూఎస్ రచయిత్రి నామకరణం ఇలా... మారుతీ సుజుకీ హాచ్బాక్ కార్లలో ‘జెన్’ అనేది ఒక ఆక్రోనిమ్ అని మీకు తెలుసా? జెడ్.ఈ.ఎన్. అంటే, జీరో ఇంజిన్ నాయిస్. – మీర్జా ఆరిఫ్ బేగ్, పాత్రికేయుడు -
నీరజ్ చోప్రాకి అభినవ్ బింద్రా క్యూట్ గిఫ్ట్..
ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలిచిన షూటర్ అభినవ్ బింద్రా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్‌ను అభినందించిన బింద్రా.. .తన తరఫునుంచి ‘టోక్యో’ పేరు గల కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి దానికి తోడుగా ‘పారిస్’ను తీసుకురావాలని ఆకాంక్షించాడు. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఫైనల్లో సురేఖ బృందం యాంక్టాన్ (యూఎస్ఏ): వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వెన్నం జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కాంపౌండ్ విభాగంలో సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియ గుర్జర్ లతో కూడిన జట్టు సెమీ ఫైనల్లో 226–225 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో కొలంబియాతో భారత్ తలపడుతుంది. అంతకు ముందు భారత జట్టు... ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్‌పై, క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై గెలుపొందింది. చదవండి: ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్! -
మూడేళ్లలో ఒలింపిక్స్ అంటే కొంత కష్టమే!
ఢిల్లీ: సాధారణంగా నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ సారి మూడేళ్లకే ఒలింపిక్స్ రానుండటం ఆటగాళ్ల సన్నాహకాలపై కొంత ప్రభావం చూపుతుందని షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా అభిప్రాయ పడ్డాడు. సాధారణంగా ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా విశ్రాంతి అనంతరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు తొలి ఏడాదిని వాడుకుంటారని, ఇప్పుడు తొందరగా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నాడు. క్వార్టర్స్‌లో శ్రీజపై మనిక గెలుపు వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. బుడాపెస్ట్ (హంగేరి)లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన మనిక బాత్రా 3–2 (7–11, 11–18, 8–11, 13–11, 11–6)తో శ్రీజపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక–సత్యన్ జంట టైటిల్ పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో ఈ జోడి 3–0 (11–6, 11–5, 11–4)తో అలియక్సండర్– డారియా ట్రిగొలొస్ (బెలారస్) జంటపై గెలిచింది. ఫైనల్లో భారత ద్వయం హంగేరికి చెందిన నండోర్– డోరియా మదరస్జ్ జోడీతో తలపడుతుంది. -
టోక్యో ఒలింపిక్స్ : పతకాల వేటలో భారత్ గమనం ఎటు?
నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడలు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు ఒకే వేదికపై తలపడే సమరం ఇది. అటువంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ మళ్లీ మన ముందుకొచ్చేశాయి. ఈసారి టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ వాస్తవానికి గతేడాదే జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈసారి కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికి జపాన్ ప్రభుత్వం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒలింపిక్స్ విలేజ్‌ను తయారు చేశామని చెప్పుకొస్తుంది. ఇప్పటికే ఒలింపిక్స్ జరుగుతున్న ప్రాంతంలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగించే అంశమైనప్పటికి జపాన్ ప్రభుత్వం మాత్రం పకడ్బందీ చర్యలతో సిద్ధమవుతుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఈసారి కూడా భారత్.. ఒలింపిక్స్ క్రీడలకు సిద్ధమైంది. 135 కోట్లకు పైగా జనాభా ఆశలను మోసుకుంటూ 119 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. ప్రతీసారి నూతనోత్సాహంతో బరిలోకి దిగే భారత్ జట్టు పట్టుమని పది పతకాలు కూడా సాధించలేక చతికిలపడుతోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ మరి అలాంటి ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో మనదేశ స్థానం ఏంటి? చిన్న చిన్న జనాభా ఉన్న దేశాలు కూడా పతకాలను కొల్లగొడుతుంటే భారత్ మాత్రం ఎందుకు వేటలో వెనుకబడిపోయింది. మరి ఈసారి పతకాల వేటలో భారత్ గమనం ఏ విధంగా ఉండబోతుంది. 1900 సంవత్సరం నుంచి చూసుకుంటే భారత్ సాధించిన పతకాల సంఖ్య 28. ఇందులో 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 క్యాంస్య పతకాలు ఉన్నాయి. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తుంది. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతిభకు కొదువ లేదు. మరి ఒలింపిక్స్‌లో ఎందుకు వెనుకడుగు వేస్తున్నామనేదానిపై ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. భారత హాకీ జట్టు(1980 ఒలింపిక్స్) ఇక 1900 సంవత్సరంలో భారత్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఒలింపిక్స్ నుంచి ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్స్ విభాగంలో నార్మన్ ప్రిచర్డ్( పురుషుల 200 మీటర్ల పరుగు, పురుషుల 200 మీటర్ల హార్డిల్స్) విభాగాలలో రెండు రజత పతకాలు సాధించాడు. కాగా 1920లో తొలిసారి భారత జట్టు ఒలింపిక్స్ క్రీడలకు వెళ్లింది. అప్పటినుంచి ప్రతీ వేసవి ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 28 పతకాలు సాధించినప్పటికి.. అందులో అత్యధికంగా హాకీ నుంచి గెలిచినవే. 1928 నుంచి 1980 మధ్య కాలంలో మన దేశ హాకీ క్రీడ ఒలింపిక్స్‌లో స్వర్ణయుగం చూసింది. ఈ మధ్య కాలంలో జరిగిన 12 ఒలింపిక్ క్రీడలలో భారత హాకీ జట్టు 11 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం గెలవడం విశేషం. ఆ తర్వాత కూడా 1960 రోమ్ ఒలింపిక్స్‌లో రజతం, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ స్వర్ణం, 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో కాంస్యం, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో క్యాంస్యం.. ఇక చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత హాకీ జట్టు మళ్లీ ఆ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఇక వ్యక్తిగత విభాగంలో భారత్‌కు వచ్చిన పతకాలు అంతంత మాత్రమే. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో కె.డి. జాదవ్ వెయిట్‌లిఫ్టింగ్‌లో క్యాంస్యం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతకముందు నార్మన్ ప్రిచర్డ్ వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచినప్పటికి అతను బ్రిటీష్ ఇండియన్ కావడంతో తొలి భారతీయుడిగా పరిగణించలేదు. ఇక అప్పటినుంచి చూసుకుంటే 1996 అట్లాంటా ఒలింపిక్స్ వరకు అంటే దాదాపు 44 సంవత్సరాల తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో రెండో వ్యక్తిగత పతకాన్ని సాధించింది. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పురుషుల సింగిల్స్‌లో ఫెర్నాండో మెలిజెని ఓడించి క్యాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇక ఆ తర్వాత 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరీ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో క్యాంస్య పతకం సాధించింది. అలా భారత్ నుంచి పతకం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. ఇక హాకీ జట్టు తర్వాత మనకు ఒలింపిక్స్‌లో పతకాలు ఎక్కువగా వచ్చింది షూటింగ్ విభాగంలో. ఈ విభాగంలో మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రాజవర్థన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్స్ ట్రాప్ విభాగంలో రజతం గెలవగా... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచి మువ్వన్నెల పతాకాన్ని బీజింగ్ గడ్డపై రెపరెపలాడించాడు. హాకీ జట్టు తర్వాత స్వర్ణం సాధించడం మళ్లీ ఇదే. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్యాంస్యం, పురుషుల 25మీ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ క్యాంస్య పతకం గెలిచారు. ఇక క్రీడల వారిగా చూసుకుంటే హాకీ(11), షూటింగ్(4) తర్వాత రెజ్లింగ్ విభాగంలో ఐదు పతకాలు, బాక్సింగ్ విభాగంలో రెండు, బాడ్మింటన్ విభాగంలో రెండు, అథ్లెట్ విభాగంలో రెండు, టెన్నిస్ విభాగంలో ఒకటి, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒకటి సాధించింది. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ఒలింపిక్స్‌లో మాత్రం వెనుకబడిపోవడం క్రీడాభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఇక ప్రతీ ఒలింపిక్స్‌లో చైనా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు సత్తా చాటుతున్నాయి. ఏ ఒలింపిక్స్ చూసిన ఈ మూడు దేశాలే తొలి మూడు స్థానాలు నిలుస్తున్నాయి. మరి రెండు రోజుల్లో మొదలుకానున్న టోక్యో ఒలింపిక్స్‌లోనైనా భారత్ ఆశించిన విజయాలు సాధిస్తుందా అన్నది చూడాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్..
న్యూఢిల్లీ: జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి నిత్యం శ్రమించాలి. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్న వెంటుకవాసిలో ఓటమి పాలవుతాం. చదువు విషయానికి వస్తే పరీక్షల ముందు ప్రిపేరషన్ ప్రారంభించినా సరిపోతుందేమో కానీ.. క్రీడల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒలింపిక్స్ జరిగేది నాలుగేళ్లకోసారి కదా.. మూడో ఏట నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతానంటే సరిపోదు. నాలుగేళ్లు శ్రమిస్తేనే మన కల సాకారం అవుతుంది అంటారు అభినవ్ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్ సృష్టించారు అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించారు. అయితే అభినవ్ విజయం కన్నా దాదాపు 50 ఏళ్ల ముందే భారత్ ఖాతాలో ఈ రికార్డు నమోదయ్యేది. అది కూడా పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ వల్ల. కానీ దురదృష్టం కొద్ది ఆ అవకాశం చేజారింది. ఈ విషయాన్ని స్వయంగా మిల్కా సింగ్ తెలిపారు. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి వెల్లడించారు. ఆ వివరాలు.. 1958లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 200మీటర్లు, 400 మీటర్ల విభాగంలో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. ఆ తర్వాత మిల్కా సింగ్ లక్ష్యం 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్. అందుకోసం తీవ్రంగా శ్రమించారు మిల్కా సింగ్. అప్పటికి ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మిల్కా సింగ్ స్వర్ణం గెలుస్తారని భావించారు. కానీ దురదృష్టం కొద్ది ఆయన నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ బాధ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు మిల్కా సింగ్. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో మిల్కా సింగ్ మాట్లాడుతూ.. ‘‘1960 రోమ్ ఒలింపిక్స్‌లో సెమి ఫైనల్స్, ఫైనల్స్ మధ్య రెండు రోజుల విరామం ఉంది. ఆ 2 రోజులు నామీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ప్రపంచం నన్ను గమనిస్తుంది.. నేను తప్పక విజయం సాధించాలని భావించాను. రోమ్కు వెళ్లడానికి ముందు ప్రతి ఒక్కరు నేను 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధిస్తానని భావించారు. రేసులో నేను ముందంజలో ఉన్నాను. 200మీటర్ల దూరాన్ని 21 సెకన్లలో పూర్తి చేశాను. ఇప్పటివారికి ఇది పూర్తిగా అసాధ్యం. అయితే అదే వేగంతో వెళ్తే నేను రేస్ పూర్తి చేయలేనని భావించి నా వేగాన్ని కాస్త తగ్గించాను. అదే నేను చేసిన పెద్ద తప్పదం. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా మునుపటి వేగాన్ని అందుకోలేకపోయాను. ఫలితంగా నాలుగో స్ధానంలో నిలిచాను. ఇది నా దురదృష్టం కాదు.. ఇండియాది. చనిపోయే వరకు ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది’’ అన్నారు మిల్కా సింగ్. ఈ రేస్‌లో మిల్కా సింగ్ 45.6 సెకండ్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా అమెరికాకు చెందిన ఓటిస్ డేవిస్ 44.9 సెకండ్స్లో రేసు ముగించి స్వర్ణం గెలిచాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బంగారు కల నెరవేరిన వేళ...
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్‌లలోనూ మన దేశం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... ఇన్నేళ్లయినా అది భారత్‌కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది. పాతికేళ్ల కుర్రాడి తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సరిగ్గా పసిడి లక్ష్యాన్ని తాకింది. దాంతో విశ్వ క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా చరిత్రకెక్కాడు. అతని ప్రదర్శన కారణంగా ఆ క్షణాన పోడియంపై వినిపించిన జనగణమన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది. ‘నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని చీకటి రోజు’... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన తర్వాత అభినవ్ బింద్రా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్య ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచిన తర్వాత అతను ఈ మాట అన్నాడు. మరి ఇలా అయితే తర్వాతి లక్ష్యం ఏమిటి... వెంటనే మిత్రులు అడిగారు. ఏముంది, మరో నాలుగేళ్లు శ్రమించడమే అంటూ బింద్రా చిరునవ్వుతో జవాబిచ్చాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితమే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా బింద్రా పాల్గొన్నాడు. అయితే అప్పుడు క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో మరో నాలుగేళ్లు కష్టపడాలంటే ఎంతో ఓపిక, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. కానీ బింద్రా అన్నింటికీ సిద్ధపడ్డాడు. ఒకే లక్ష్యంతో... బింద్రా కలవారి బిడ్డ. డబ్బుకు ఎలాంటి లోటు లేదు. ప్రాక్టీస్‌కు సమస్య రాకుండా ఇంట్లోనే తండ్రి సొంతంగా షూటింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇంకా బయటకు కనిపించని, తనకు మాత్రమే తెలిసిన ఇతర లోపాలున్నాయనేది బింద్రా గుర్తించాడు. అన్నింటికి మించి తన ఫిట్నెస్ స్థాయికి తగినట్లుగా లేదని అతనికి అర్థమైంది. 4 కిలోల షూటింగ్ సూట్, 5 కిలోల గన్‌తో గురి కుదరడం లేదని తెలిసింది. అంతే... ఆరు నెలలు రైఫిల్‌కు విరామం ఇచ్చి పూర్తిగా ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టాడు. శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు. బింద్రాకు కోచ్ గాబ్రియేలా అభినందన ఒక దశలో విరామం లేకుండా పది నిమిషాలు పరుగెత్తడమే కష్టంగా కనిపించిన అతను కనీసం గంటన్నర పాటు ఆగకుండా పరుగెత్తసాగాడు. కీలక సమయంలో బింద్రా లోపాలను సరిదిద్ది అతని షూటింగ్‌ను తీర్చి దిద్దడంలో స్విట్జర్లాండ్ మహిళా కోచ్ గాబ్రియేలా బుల్మన్ పాత్ర కీలకమైంది. 1988 నుంచి 2004 వరుసగా ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న గాబ్రియేలా... ముఖ్యంగా బింద్రా వెన్నుపై భారం పడకుండా సరైన పొజిషనింగ్‌తో షూటింగ్ చేయడంలో అతడిని తీర్చిదిద్దింది. ఇక బీజింగ్‌కు అతను ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించను, నేను షూటింగ్ చేసేందుకు మాత్రమే వెళుతున్నా అని ముందే చెప్పేశాడు. అలా సాధించాడు... విజయానికి, పరాజయానికి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉండే షూటింగ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అభినవ్ సిద్ధమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 596 పాయింట్లు సాధించిన భారత షూటర్ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో బింద్రా అత్యుత్తమ ప్రదర్శన ముందు మిగతా షూటర్లు వెనుకబడ్డారు. మొత్తం పది రౌండ్లలోనూ ఒక్కసారి కూడా 10 పాయింట్లకు తగ్గకుండా బింద్రా మాత్రమే షూట్ చేయగలిగాడు. ఓవరాల్‌గా 700.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన బింద్రా భారత జాతి గర్వపడే ఘనతను సృష్టించాడు. 9వ రౌండ్ ముగిసేసరికి హెన్రీ హకినెన్ (ఫిన్లాండ్), బింద్రా సమాన పాయింట్లతో ఉన్నారు. చివరి రౌండ్లో బింద్రా 10.8 పాయింట్లు స్కోరు చేయగా... తీవ్ర ఒత్తిడిలో హకినెన్ 9.7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి మూడో స్థానానికి పడిపోయాడు. ఆగస్టు 11, 2008న బింద్రా సాధించిన ఘనతతో భారత్ యావత్తూ పులకించింది. 28 ఏళ్ల తర్వాత సాంకేతికంగా భారత్ ఖాతాలో స్వర్ణపతకం చేరినా... వ్యక్తిగత విభాగంలో బంగారం గెలిచిన ఏకైక అథ్లెట్‌గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత అభినవ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరగ్గా, 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే బీజింగ్‌లో అతను స్వర్ణపతకాన్ని అందుకున్న క్షణం మన క్రీడాభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయం. సాక్షి క్రీడా విభాగం -
జరీన్ ఎవరు.. అభినవ్ నీకు రూల్స్ తెలుసా?
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. బీఎఫ్ఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ కావడంతో దానికే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. దీనికి జరీన్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. వెంటనే స్పందించినందకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నానని జరీన్ తన సమాధానంలో పేర్కొన్నారు. కాకపోతే ఇలా కిరణ్ రిజ్జు వరకూ ఈ వివాదాన్ని తీసుకు రావడంతో మేరీకోమ్ మండిపడ్డారు. ‘ అసలు ఆమె ఎవరు.. ఆమె గురించి నాకు అస్సలు తెలియదు’ అంటూనే కాస్త ఘాటుగా స్పందించారు. ‘ ఈ వివాదాన్ని తెరపైకి తెవడంతో నేను షాక్ అయ్యా. నేను ఎనిమిది వరల్డ్ చాంపియన్స్ పతకాలు గెలిచా. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఎవర్నీ పంపాలో బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. అటువంటప్పుడు నీ ఏడుపు ఏమిటి. భారత బాక్సింగ్ జట్టులో చోటు కోసం లాబీయింగ్ చేయకు’ అంటూ మేరీకోమ్ ఎదురుదాడికి దిగారు. అదే సమయంలో జరీన్‌కు మద్దతుగా నిలిచిన భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రాపై మేరీకోమ్ నోరు పారేసుకున్నారు ‘నీ పని నువ్వు చూసుకో. బాక్సింగ్‌లో దూరకు. నీకు బాక్సింగ్ గురించి కానీ రూల్స్ కానీ తెలియదు. నేను ఏమైనా షూటింగ్ గురించి మాట్లాడానా. నీకు బాక్సింగ్ పాయింట్ల విధానం తెలుసా’ అంటూ మండిపడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మేరీకోమ్ ఎంతటి చాంపియన్ అయినా కానీ ఇలా మాట్లాడటం తగదంటున్నారు అభిమానులు. దేనికైనా హుందాగా సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కొందరు మేరీకోమ్ అతి చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. మేరీకోమ్-జరీన్‌లు 51 కేజీల వెయిట్ కేటగిరీలో ఉండటంతోనే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదం పెద్దదిగా మారింది. -
'నాకు న్యాయం కావాలి'
రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్తో మరో యువ బాక్సర్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలతో స్టార్ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ సమయంలో మేరీ కోమ్ పక్షాన నిలిచిన ఫెడరేషన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్ జట్టులో మణిపూర్ సీనియర్ బాక్సర్ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో యువ బాక్సర్ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్ దిగ్గజమైన మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం. నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్ ట్రయల్స్ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ అవకాశమని బీఎఫ్ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్ బెర్తు కట్టబెట్టింది. నిఖత్ డిమాండ్ సబబే: బింద్రా భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా బాక్సర్ నిఖత్ జరీన్ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్ కెరీర్లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు. -
బింద్రాకు అరుదైన గౌరవం
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రా అరుదైన గౌరవం పొందాడు. షూటింగ్ క్రీడకు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అతడికి ‘బ్లూ క్రాస్’ పురస్కారం అందజేసింది. ఐఎస్ఎస్ఎఫ్ అవార్డుల్లో ఇది అత్యున్నతమైనది కాగా, భారత్ నుంచి ఈ ఘనత పొందిన తొలి షూటర్ బింద్రానే కావడం విశేషం. 36 ఏళ్ల బింద్రా... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో స్వర్ణం నెగ్గాడు. -
నవ యువ శకం...
సాక్షి క్రీడావిభాగం : వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్) భారత్‌కు వ్యక్తిగత పతకాలు అందించిన క్రీడాంశం షూటింగ్. ఏథెన్స్లో రాజ్యవర్ధన్ రాథోడ్ రజతం... బీజింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం... లండన్‌లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచారు. దాంతో రియో ఒలింపిక్స్‌లోనూ మళ్లీ పతకం ఖాయమని షూటింగ్‌పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ మన షూటర్ల గురి తప్పింది. ‘రియో’కు అర్హత పొందిన 12 మందిలో అభినవ్ బింద్రా మినహా మిగతా వారు కనీసం టాప్–5లో నిలువలేకపోయారు. ఫలితంగా భారత షూటర్లు రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. ఒకవైపు అనుభవజ్ఞులైన షూటర్లు విఫలమవ్వగా... మరోవైపు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) మాత్రం ‘రియో’ ఫలితాలతో వెంటనే మేల్కొంది. ప్రతిభావంతులైన కొంతమంది యువ షూటర్లను ఎంపిక చేసింది. మాజీ స్టార్ షూటర్లు జస్పాల్ రాణా, దీపాలి దేశ్‌పాండే ఆధ్వర్యంలో వారికి శిక్షణ మొదలైంది. రెండేళ్లు తిరిగేలోపు ఈ యువ షూటర్లు ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించారు. ఆదివారం రాత్రి మెక్సికోలో ముగిసిన సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు, ఒక రజతంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు సాధించారు. దాంతో 32 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో తొలిసారి భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర లిఖించింది. కెరీర్లో ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే 23 ఏళ్ల షాజర్ రిజ్వీ, 17 ఏళ్ల హరియాణా అమ్మాయి మనూ భాకర్, 18 ఏళ్ల బెంగాల్ షూటర్ మెహులీ ఘోష్ పతకాల బోణీ కొట్టారు. రిజ్వీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించడమే కాకుండా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. మనూ భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ ఈవెంట్లో ఒక్కో పసిడి పతకం సొంతం చేసుకుంది. మెహులీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ ఈవెంట్లో ఒక్కో కాంస్యం సాధించింది. కెరీర్లో రెండో ప్రపంచకప్ ఆడిన అఖిల్ షెరాన్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో పలువురు స్టార్ షూటర్లను వెనక్కినెట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పతక విజేతలు వీరే... స్వర్ణాలు ►మనూ భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్; మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఓం ప్రకాశ్ జతగా). ►షాజర్ రిజ్వీ: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. ►అఖిల్ షెరాన్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్. రజతం ►అంజుమ్ ముద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్. కాంస్యాలు ►రవి కుమార్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్. ►జీతూ రాయ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. ►మెహులీ ఘోష్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (దీపక్ కుమార్ జతగా). ‘మెక్సికో ప్రపంచకప్ టోర్నీలో భారత షూటింగ్లో కొత్త శకం మొదలైంది. భారత షూటింగ్ భవిష్యత్‌కు ఈ యువ షూటర్లు భరోసా ఇచ్చారు. రాబోయే కాలంలోనూ ఈ యువ షూటర్లు ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌లో శిఖరాగ్రాన నిలవాలని ఆశిస్తున్నాను. యువ షూటర్ల విజయంలో తెరవెనుక ఉండి కీలకపాత్ర పోషించిన వారందరికి తగిన గుర్తింపు ఇవ్వాలి’. – అభినవ్ బింద్రా -
ప్రభుత్వ ఉద్యోగాలకు అభినవ్ బింద్రా గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తన రెండు ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. షూటింగ్ విభాగంలో పరిశీలక హోదా బాధ్యతలకు, టార్గెట్ ఒలింపిక్ పోడియం(టీవోపీ) పథకం ఐడెంటిఫికేషన్ కమిటీ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కొన్ని ప్రైవేట్ స్పోర్ట్స్ ప్రాజెక్టులతో తాను సంబంధాలు పెంపొందించుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్‌కు ఓ లేఖ రాశారు. తనపై విశ్వాసం ఉంచి ఇన్నాళ్లు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలన్నారు. తన సొంత ప్రాజెక్టులైన అభినవ్ బింద్రా టార్గెటింగ్ పర్ఫామెన్స్(ఏబీటీపీ) సెంటర్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యే క్రమంలో పలు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని, మరింత సమర్ధంగా పనిచేసేందుకోసమే తాను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం తప్పవుతోంది. -
సొంతగడ్డపై భారత్ ‘గురి’ అదిరేనా
► నారంగ్, జీతూరాయ్లపై ఆశలు ► నేటి నుంచి ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: రియోలో నిరాశపరిచిన భారత షూటర్లు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్లో పతకాలపై గురిపెట్టారు. శుక్రవారం నుంచి జరిగే ప్రపంచకప్ షూటింగ్లో సత్తాచాటేందుకు సిద్ధమయా్యరు. ఇక్కడి డాక్టర్ కర్నిసింగ్ షూటింగ్ రేంజ్లో పది రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. భారత మేటి షూటర్లు గగన్ నారంగ్, జీతూరాయ్, హీనా సిదు్ధలపై భారత్ ఆశలు పెట్టుకుంది. 1999 తర్వాత... ఒలింపిక్ చాంపియన్ , భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా లేకుండా భారత బృందం తలపడుతున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. ప్రయోగాత్మక ఈవెంట్లకు ఈ ప్రపంచకప్ వేదికైంది. మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సిఫార్సు చేసిన మిక్స్డ్ జెండర్ (మహిళా, పురుషులు కలిసి ఆడే పోటీలు) ఈవెంట్లను తొలిసారిగా ఈ టోర్నీలోనే పరిశీలించనున్నారు. 50 దేశాలకు చెందిన 452 మంది షూటర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఆతిథ్య భారత్ నుంచి 63 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయా్యరు. భారత్‌లో గతంలోనూ ప్రపంచకప్ షూటింగ్ ఈవెంట్లు (1997, 2000, 2003) జరిగినప్పటికీ ఈ ఈవెంట్ మాత్రం ప్రత్యేకవైుంది. ఇప్పటిదాకా భారత్‌లో జరిగిన మెగా ఈవెంట్లన్నీ కేవలం షాట్‌గన్ పోటీల (ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్)కు మాత్రమే పరిమితం కాగా... తాజా ప్రపంచకప్‌లో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఇలా అన్ని కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ (2020)కు ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడం మరో విశేషం. ఈ ఈవెంట్లలో చివరిసారిగా... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య త్వరలోనే కొన్ని ఈవెంట్లను ఒలింపిక్ క్యాలెండర్ నుంచి తొలగించనుంది. పురుషుల డబుల్ ట్రాప్, 50 మీ. పిస్టల్, 50 మీ. ప్రోన్ ఈవెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. మును్మందు ఇందులో పోటీపడే అవకాశం లేదని తెలిసినా... ఆఖరి సారిగా ప్రపంచకప్‌లో ఆయా ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు షూటర్లు బరిలోకి దిగుతున్నారు. కొత్తగా మిక్స్డ్ జెండర్ ఈవెంట్స్ యూరోపియన్ పియన్ ప్, జూనియర్ ప్రపంచకప్, యూత్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ జెండర్ పోటీలను తొలిసారిగా ఓ మేజర్ టోర్నమెంట్లో ఆడిస్తున్నారు. ఇందులో భాగంగా 10 మీ. ఎయిర్ రైఫిల్, 10 మీ. ఎయిర్ పిస్టల్, ట్రాప్, స్కీట్ ఈవెంట్లలో పురుషులు, మహిళలు కలిసి గురిపెటా్టల్సి వుంటుంది. అయితే ఇది పూర్తిస్థాయి పోటీలు కాకపోవడం... ప్రయోగాత్మక పరిశీలన నేపథ్యంలో ఇందులో గెలిచిన వారికి పతకాల బదులు బ్యాడ్జిలు అందజేస్తారు. -
సస్పెండ్ చేసి మంచి పని చేశారు!
న్యూఢిల్లీ:ఇండియన్ ఒలింపిక్స్ సంఘం(ఐఓఏ)ను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత షూటర్ అభినవ్ బింద్రా సమర్ధించాడు. క్రీడల్లో పారదర్శకత ఉండాలంటే ఇటువంటి మంచి నిర్ణయాలు ఎంతైనా అవసరమని పేర్కొన్నాడు. ఐఓఏ పట్ల క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామానికి సంకేతమని బింద్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ వేసిన ముందడుగు కొన్ని విలువల్ని కాపాడటానికి దోహదం చేస్తుందన్నాడు. ఎక్కడైనా అవినీతి కూడిన పరిపాలన ఎంతోకాలం సాగదనడానికి ఇదే ఉదాహరణనని బింద్రా తెలిపాడు. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్రీడా శాఖ డిమాండ్ చేసినా దాన్ని ఐఓఏ పక్కన పెట్టేసింది. దాంతో తాత్కాలికంగా ఐఓఏపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. -
సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్‌స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది. కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్‌కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు. -
అభినవ్ బింద్రా నేతృత్వంలో..
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత షూటర్ల పేలవ ప్రదర్శనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కమిటీకి షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించనున్నట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సమీక్షలో షూటర్ల వ్యక్తిగత ప్రదర్శను సమీక్షించిన అనంతరం వారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత్ నుంచి హీనా సిద్ధూ, మనవ్ జీత్ సింగ్ సిద్ధూ, గగన్ నారంగ్, జితూ రాయ్, అపూర్వ చండీలా తదితరులతో కూడిన షూటింగ్ బృందం రియోకు వెళ్లిన పతకం సాధించడంలో విఫలమైంది. రియోలో అభినవ్ బింద్రా, జితూ రాయ్‌లు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఈ నేపథ్యంలో భారత రైఫిల్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇటీవల భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ కూడా భారత షూటర్ల రియో ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్‌లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందంటూ షూటర్లకు ముందస్తు హెచ్చరికలు పంపారు. -
'సింధు..నాతో జాయిన్ కావాలి'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకాన్ని ఖాయం చేసుకున్న భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం జరిగే తుదిపోరులో సింధు విజయం సాధించి బంగారు పతకాన్ని తీసుకురావాలని భారత షూటర్ అభినవ్ బింద్రా ఆకాంక్షించాడు. ఒలింపిక్స్‌లో సింధు పసిడి సాధించి తనతో జాయిన్ కావాలంటూ బింద్రా కోరాడు. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న బింద్రా.. ఆ క్లబ్లో తాను ఒక్కడినే ఉన్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం పతకం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం రాలేదు. ఆ తరువాత ఇన్నాళ్లకు సింధు స్వర్ణానికి అడుగు దూరంలో నిలవడంతో ఆ ఘనతను సాధించాలని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లు సింధు స్వర్ణ పతకంపై ధీమా వ్యక్తం చేశారు. తుదిపోరులో సింధు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇప్పటివరకూ సింధు ప్రదర్శన ఆద్యంత అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. దీంతో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. -
పతకం పోయింది.. ఇక జర్నలిస్ట్ అవుతా!
భారత్ క్రీడాభిమానుల ఆశల్ని నిలబెట్టేందుకు చివరివరకు పోరాడిన షూటర్ అభినవ్ బింద్రా వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయాడు. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో బ్రిందా తుదివరకు పోరాటపటిమ కనబరిచి.. నాలుగోస్థానంలో నిలిచాడు. ఈ నిరాశాజనకమైన ఫలితంతో బింద్రా అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడబోతున్నది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాన్ని అందించి దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన బింద్రా.. ఇక విరామం తీసుకోబోతున్నాడు. విశ్వక్రీడల్లో వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత ఆటగాడిగా కీర్తి గడించిన బింద్రా.. ఫైనల్ తర్వాత మీడియాతో మాట్లాడాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు తర్వాత కాస్తా రిలాక్స్డ్గా కనిపించిన బింద్రా సరదాగా జోకులు పేల్చారు. నిజం చేదుగా ఉంటుందనే విషయాన్ని క్రీడలు ఎప్పుడూ నేర్పిస్తాయని, ఆ పాఠాలను నేర్చుకొని ముందుకుసాగడమే ఏ ఆటగాడైనా చేయాల్సిన పని అని ఆయన పేర్కొన్నారు. 'నాకు సాధ్యమైనంత మేర ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను. కేవలం ప్రపంచంలో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పతకంతో ఇంటికి వెళ్లే అవకాశముంది. ఇదేదో తొమ్మిది దేశాలు ఆడే ఆటకాదు. ఇందులో 200 దేశాలు పాల్గొంటాయి. చాలా కష్టమైన క్రీడ ఇది' అని బింద్రా అన్నారు. రిటైరైన తర్వాత జర్నలిస్టు కావాలని అనుకుంటున్నానని, అది కుదరకపోతే కేక్ షాప్ పెట్టుకొని శేష జీవితాన్ని గడుపుతానని బింద్రా సరదాగా జోకులు వేశారు. -
బ్యాడ్‌లక్ బింద్రా
♦ ‘షూట్ ఆఫ్’లో పతకం కోల్పోయిన భారత షూటర్ ♦ నాలుగో స్థానంతో సరి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం ఎలా ఉంటుందో భారత దేశానికి చూపించిన ఘనుడు... అనేక ప్రపంచ స్థాయి పోటీలలో త్రివర్ణాన్ని రెపరెపలాడించిన యోధుడు... భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా భారంగా కెరీర్‌ను ముగించాడు. రియో తన ఆఖరి ఈవెంట్ అని ముందే ప్రకటించిన బింద్రా... పతకం సాధించకపోయినా, ఆఖరి క్షణం వరకూ పోరాడి ఆకట్టుకున్నాడు. పతాకధారిగా బ్రెజిల్ వెళ్లిన అభినవ్... పతకాన్ని కోల్పోయినా మనసులు గెలిచాడు. త్రుటిలో పతకం అవకాశం కోల్పోయిన అభినవ్ బింద్రా పోటీలకు ముందు కొత్త రైఫిల్‌తో సిద్ధం కావాల్సి వచ్చింది. సోమవారం ఉదయం అతను తన గన్‌తో సహా జారి పడ్డాడు. దాంతో అందులో కీలకమైన ‘సైట్’ విరిగిపోయింది. దాంతో అప్పటికప్పుడు రైఫిల్‌ను మార్చుకున్నాడు. నిజానికి షూటింగ్లాంటి ఈవెంట్లో ఇన్ని రోజులుగా సాధన చేసిన, అలవాటైన ఉపకరణంతో కాకుండా కొత్తదానితో ఆడటం అంత సులువు కాదు. అందుకు సర్దుకునేందుకు చాలా సమయం పడుతుంది. కానీ ఇలాంటి గందరగోళం తర్వాత కూడా బింద్రా తన స్థాయిలో చివరి వరకు పోరాడాడు. షూటాఫ్‌లో మెడల్ చేజారి నాలుగో స్థానం దక్కింది. రిటైర్మెంట్పై ఇదే తుది నిర్ణయమా అనే ప్రశ్నకు జవాబిస్తూ బింద్రా... ‘నా వద్ద కొత్త రైఫిల్ అమ్మకానికి ఉంది. మీకేమైనా కావాలా’ అని సరదాగా బదులిచ్చాడు. రియో డి జనీరో: ఒక్క షాట్‌తోనే పతకావకాశాలు తారుమారు అవుతాయని షూటింగ్లో మరోసారి రుజువైంది. రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఏడు సిరీస్‌ల తర్వాత అభినవ్ బింద్రా, సెరిహి కులిష్ (ఉక్రెయిన్) 163.8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మూడు-నాలుగు స్థానాలను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇందులో బింద్రా 10 పాయింట్లు స్కోరు చేయగా... కులిష్ 10.5 స్కోరు చేసి ముందంజ వేశాడు. ఆ తర్వాత నికోలో కాంప్రియాని (ఇటలీ), వ్లాదిమిర్ మస్లెనికోవ్ (రష్యా), సెరిహి కులిష్ స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడ్డారు. చివరకు కాంప్రియాని (206.1 పాయింట్లు) పసిడి సొంతం చేసుకున్నాడు. కులిష్ (204.6 పాయింట్లు) రజతం సంపాదించగా... మస్లెనికోవ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అభినవ్ బింద్రా 625.7 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. లండన్ ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్లో కాంస్యం సాధించిన భారత షూటర్ గగన్ నారంగ్ ఈసారి విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో ఈ హైదరాబాద్ షూటర్ 621.7 పాయింట్లు సాధించి 23వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో టాప్-8లో నిలిచినవారు ఫైనల్లో పోటీపడ్డారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో.. ఆ మాటకొస్తే ప్రపంచ షూటింగ్లో బింద్రా ఓ మరిచిపోలేని అధ్యాయం. భారతీయులు షూటింగ్‌కు పనికిరారనే అపవాదును తొలగించి.. పట్టుదలతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటాడు. టాయ్ గన్స్‌తో మొదలైన ప్రాక్టీస్‌ను ఒలింపిక్స్ మెడల్‌గా మార్చటం అంత సులువేం కాదు. జర్మనీలో విదేశీయులను వ్యతిరేకిస్తున్నా.. కదిలేది లేదంటూ కఠోరమైన సాధన చేశాడు. బాడీ బ్యాలెన్స్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్‌తో జర్మన్ కోచ్‌ను ఒప్పించాడు. ఆటతోనే కాదు.. దృక్పథంతోనూ అందర్నీ మెప్పించాడు. ఏక కాలంలో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన తొలి, ఏకైక భారతీయుడు అభినవ్ బింద్రానే. 2006లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ చాంపియన్ షిప్లో బంగారు పతకం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకంతో షూటింగ్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. భారత్‌కు ఓ వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం రావడం అదే తొలిసారి. ఈ ఫీట్ సాధించటం ఓ భారతీయుడికి నిజంగా కలే. మూడు ఒలింపిక్స్‌లో (ఏథెన్స్, బీజింగ్, రియో) ఫైనల్స్ చేరిన తొలి భారత షూటర్ కూడా బింద్రానే. సిడ్నీతో మొదలై జర్మనీలో శిక్షణ పొందుతున్నప్పుడే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బింద్రా. అప్పుడు పెద్దగా రాణించలేకపోయినా.. 2001 ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో ఆరు బంగారు పతకాలు గెలిచాడు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో బంగారం గెలిచి ఉత్సాహంగా ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాడు. 597 పాయింట్లతో ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేసినా ఫైనల్లో తడబాటుకు గురై ఎలిమినేట్ అయ్యాడు. 2006లో జాగ్రెబ్‌లో జరిగిన ప్రపంచచాంపియన్ షి్ప్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మెల్బోర్న్ కామన్వెల్త్లో బంగారం ఆ తర్వాత జరిగిన వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలోనూ సత్తా చాటాడు. షూటింగ్లో త్రివర్ణ పతాకానికి గౌరవం కల్పించిన అభినవ్ బింద్రాకు 2000లో అర్జున అవార్డు, 2001లో ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు వరించాయి. తన ప్రతిభను నేటి తరానికి పంచేందుకు గోస్పోర్ట్ ఫౌండేషన్‌తో జతకలిసిన బింద్రా.. రిటైర్మెంట్ తర్వాత షూటింగ్లో శిక్షణ ఇవ్వనున్నాడు. -
ఫైనల్లో బింద్రా ఓటమి..
రియో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. భారత హాకీ పురుషుల జట్టుతో పాటు షూటర్ అభినవ్ బింద్రా తీవ్రంగా నిరాశపరిచాడు. 2-1 తేడాతో భారత్‌పై జర్మనీ హాకీ జట్టు విజయం సాధించింది. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్లో బింద్రా ఓటమి పాలయ్యాడు. దీంతో భారత్ షూటింగ్ విభాగంలో ఏ పతకాన్ని సాధించలేకపోయింది. బింద్రా 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటలీ ఆటగాడు కెంప్రైనీ 206.1 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో ఉక్రెయిన్ ప్లేయర్ కూలిష్, మూడో స్థానంలో రష్యా ఆటగాడు మస్లిన్నికోవ్ నిలిచారు. అంతకు ముందు బింద్రా ప్రాథమిక రౌండ్లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.