![ఫైనల్‌లో బింద్రా ఓటమి..](/styles/webp/s3/article_images/2017/09/4/61470672070_625x300.jpg.webp?itok=3sD1koKn)
ఫైనల్‌లో బింద్రా ఓటమి..
రియో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. భారత హాకీ పురుషుల జట్టుతో పాటు షూటర్ అభినవ్ బింద్రా తీవ్రంగా నిరాశపరిచాడు. 2-1 తేడాతో భారత్‌పై జర్మనీ హాకీ జట్టు విజయం సాధించింది.
పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్‌లో బింద్రా ఓటమి పాలయ్యాడు. దీంతో భారత్ షూటింగ్ విభాగంలో ఏ పతకాన్ని సాధించలేకపోయింది. బింద్రా 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటలీ ఆటగాడు కెంప్రైనీ 206.1 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో ఉక్రెయిన్ ప్లేయర్ కూలిష్, మూడో స్థానంలో రష్యా ఆటగాడు మస్లిన్నికోవ్ నిలిచారు.
అంతకు ముందు బింద్రా ప్రాథమిక రౌండ్‌లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్‌లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.