పారిస్: ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు
ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’ను అందజేసింది.
ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది. 1975 నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్‌ను అందజేస్తున్నారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ థామస్ బాక్ ఈ అవార్డును బింద్రాకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment