Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్‌ తదితర వివరాలు | Paris Paralympics 2024: Indian athletes, Dates, History, List Of Games And All You Need To Know | Sakshi
Sakshi News home page

Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్‌ తదితర వివరాలు

Published Wed, Aug 21 2024 10:33 AM | Last Updated on Wed, Aug 21 2024 10:40 AM

Paris Paralympics 2024: Indian athletes, Dates, History, List Of Games And All You Need To Know

పారిస్‌లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్‌ 28 నుంచి పారిస్‌ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్‌ తొలిసారి సమ్మర్‌ పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్‌ 8న జరిగే క్లోజింగ్‌ సెర్మనీతో ముగుస్తాయి.

2021 టోక్యో పారాలింపిక్స్‌లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్‌ జనాలు లేకుండా సాగాయి.

ఈసారి పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్‌ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్‌కు పంపుతుంది.

ఈసారి పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్‌ ఒలింపిక్స్‌ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్‌ సందర్భంగా అథ్లెట్లు పారిస్‌లోనే ఐకానిక్‌ ల్యాండ్‌మార్క్స్‌ చుట్టూ మార్చ్‌ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్‌ పోటీలు ఆగస్ట్‌ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం​ పోటీలు జరుగుతాయి.

పారిస్‌ పారాలింపిక్స్‌లోని క్రీడా విభాగాలు..
బ్లైండ్‌ ఫుట్‌బాల్‌
పారా ఆర్చరీ
పారా అథ్లెటిక్స్‌
బోసియా
గోల్‌బాల్‌
పారా బ్యాడ్మింటన్‌
పారా కనోయ్‌
పారా సైక్లింగ్‌
పారా ఈక్వెస్ట్రియాన్‌
పారా తైక్వాండో
పారా ట్రయథ్లాన్‌
పారా టేబుల్‌ టెన్నిస్‌
సిట్టింగ్‌ వాలీబాల్‌
వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌
వీల్‌చైర్‌ ఫెన్సింగ్‌
వీల్‌చైర్‌ రగ్బీ
వీల్‌చైర్‌ టెన్నిస్‌
పారా స్విమ్మింగ్‌
షూటింగ్‌ పారా స్పోర్ట్‌

పారాలింపిక్స్‌లో ఈసారి భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్‌లో భారత్‌ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్‌ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్‌టైమ్‌ హై రికార్డు సెట్‌ చేసింది. ఈసారి భారత్‌ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత్‌ అథ్లెట్లు..

పారా ఆర్చరీ (6)

హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)

రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)

శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)

పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)

సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)

శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)

పారా అథ్లెటిక్స్ (38)

దీప్తి జీవన్‌జీ - మహిళల 400మీ -టీ20

సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64

సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64

అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46

సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46

రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46

నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41

యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56

ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51

ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51

అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51

నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47

రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47

మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63

శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63

శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63

సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46

మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46

రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46

ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35

భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34

మను - పురుషుల షాట్ పుట్ - F37

పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57

రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40

సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64

అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35

దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54

ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64

దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47

సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57

హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57

సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55

కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55

రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11

అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46

భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46

సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12

కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53

పారా బ్యాడ్మింటన్ (13)

మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3

నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5

కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6

శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్‌డ్ డబుల్స్ SH6

సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5

సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4

తరుణ్ - పురుషుల సింగిల్స్ S4

మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3

మన్‌దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3

పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5

మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5

తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5

నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్‌డ్ డబుల్స్ SH6

పారా కనోయ్‌ (3)

ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2

యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1

పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1

పారా సైక్లింగ్ (2)

అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్

జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్

బ్లైండ్ జూడో (2)

కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1

కోకిల: మహిళల -48కిలోల జె2

పారా పవర్ లిఫ్టింగ్ (4)

పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకు

అశోక్ - పురుషుల 63 కేజీల వరకు

సకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళల

కస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళల

పారా రోయింగ్ (2)

అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2x

నారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2x

పారా షూటింగ్ (10)

అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్‌డ్ 25m పిస్టల్ SH1

అవని ​​లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్‌డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1

మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్‌డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1

నిహాల్ సింగ్: P3 - మిక్స్‌డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్‌డ్ 50m పిస్టల్ SH1

మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1

రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్‌డ్ 50m పిస్టల్ SH1

సిద్ధార్థ బాబు: R3 - మిక్స్‌డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్‌డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1

శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్‌డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్‌డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2

స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1

రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1

పారా స్విమ్మింగ్ (1)

సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై - S7

పారా టేబుల్ టెన్నిస్ (2)

సోనాల్‌బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10

భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10

పారా తైక్వాండో (1)

అరుణ- మహిళల కే44- 47 కేజీలు

పారలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ గత పారాలింపిక్స్‌లోనే 19 పతకాలు సాధించింది.

1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్‌బర్గ్ 1972 ( స్విమ్మింగ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )

2. భీమ్‌రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)

3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)

4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్‌పుట్ L6లో రజతం)

5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)

6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)

7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)

8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)

9. మరియప్పన్ తంగవేలు - రియో ​​2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)

10. వరుణ్ సింగ్ భాటి - రియో ​​2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)

11. దేవేంద్ర ఝఝరియా- రియో ​​2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)

12. దీపా మాలిక్ - రియో ​​2016 (మహిళల షాట్‌పుట్ F53లో రజతం)

13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)

14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)

15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)

16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)

17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)

18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)

19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)

20. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)

21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)

22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)

23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)

24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)

25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)

26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)

27. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం

28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)

29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)

30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)

31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement