బోస్టన్: అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పతకం శుక్రవారం వేలంలో దాదాపు రూ.5 కోట్లు పలికింది! దానిపై ‘ఒలింపియాడ్, 1904’అని రాసుంది. ముందువైపు విజేత పుష్పగుచ్ఛం పట్టుకొని ఉండగా వెనకవైపు పురాతన గ్రీస్‌లో విజయానికి అధిదేవత నైక్, దేవతల రాజు జ్యూస్ ఉన్నారు.
దీన్ని అమెరికన్ అథ్లెట్ ఫ్రెడ్‌షూల్‌కు ప్రదానం చేశారు. ఆ ఒలింపిక్స్‌లో అమెరికన్లు 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పతకాలిస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పతకాలే ఇచ్చేవారు. ఇలాంటి పతకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్‌ఆర్ ఆక్షన్ పేర్కొంది.
2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకంతో పాటు 1932, 1964, 1998 2012 ఒలింపిక్స్ పతకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులు వేలంలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటినుంచో మంచి ధర లభిస్తోంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలెస్‌లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుండటం 1932, 1984 తరువాత ఇది మూడోసారి.
ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్
Comments
Please login to add a commentAdd a comment