నైరోబి: తన భాగస్వామితో ఏర్పడిన స్థల వివాదం చివరకు ఉగాండా మహిళా ఒలింపియన్ అథ్లెట్ రెబెకా చెపె్టగె ప్రాణాలను తీసింది. గత నెలలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెబెకా మారథాన్ ఈవెంట్‌లో పాల్గొని 44వ స్థానంలో నిలిచింది.
పలు అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలున్న ట్రాన్స్ ఎన్‌జొయా ప్రాంతంలో 33 ఏళ్ల రెబెకా స్థలం కొని ఇల్లు కట్టుకుంది. దీనిపై రెబెకా, ఆమె భాగస్వామి డిక్సన్ డియెమా మధ్య గత ఆదివారం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజు సోమవారం డిక్సన్ తనవెంట గ్యాసోలిన్ (పెట్రోలియం ఉత్పాదన)ను క్యాన్‌లో తీసుకొచ్చి రెబెకాపై పోసి నిప్పంటించాడు.
వెంటనే ఆమె శరీరమంతా మంటలు అంటుకోవడంతో పాటు డిక్సన్‌కూ కాలిన గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని కెన్యాలోని హాస్పిటల్‌లో చేర్పించగా గురువారం ఉదయం రెబెకా మృతి చెందింది. 30 శాతం కాలిన గాయాలున్న డిక్సన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీస్ కమాండర్ జెరెమా ఒలీ కొసిమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment