సాక్షి, నేషనల్ డెస్క్: ఏసీ గదులు, ప్రైవేట్ బాత్ టబ్‌లు. విందుల కోసం ప్రత్యేకమైన, విలాసవంతమైన గదులు. సంపన్నుల ఇళ్లలో ఉండే విలాసాల గురించి తెలిసిందే. ఇప్పుడంటే సరే గానీ ఏకంగా 2 వేల ఏళ్ల కిందటే ఇలాంటి నిర్మాణాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పురాతన రోమన్ నగరమైన పోంపెయ్‌లో ఇలాంటివన్నీ ఉన్నట్టు తాజాగా తేలింది. 2 వేల ఏళ్ల కింద నిర్మించిన పెద్ద ప్రైవేట్ థర్మల్ కాంప్లెక్స్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది.
పోంపెయ్ పార్కు మధ్య ప్రాంతంలో బాత్ హౌస్‌లు బయటపడ్డాయి! నాటి పాలక వర్గ సభ్యులు విందుల కోసం 30 మంది సామర్థ్యమున్న విశాలమైన గదులను ఏర్పాటు చేసుకున్నారని పోంపెయ్ పురావస్తు పార్కు డైరెక్టర్ గాబ్రియేల్ జుచ్‌ట్రీగల్ తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రోత్సహించడం, ఏకాభిప్రాయ సాధన తదితరాల కోసం సం సమావేశాలు, ఒప్పందాలు వంటివి ఇక్కడ జరిగేవని వెల్లడించారు.
ఇటీవల ఇదే ప్రాంతంలో అప్పటి బేకరీ, లాండ్రీ షాప్, రెండు విల్లాలను కనుగొన్నారు. అప్పట్లో మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వత బద్ధలవ్వడంతో దాని బూడిద కింద పోంపెయ్‌తో పాటు హెర్కులేనియం నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడవన్నీ తవ్వకల్లో బయట పడుతున్నాయి. నాటి ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఎముకలు కూడా పురావస్తు శాస్త్రవేత్తలకు లభించాయి.
ఇదీ చదవండి: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment