జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.
ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.
ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.
Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU
— Channel 4 News (@Channel4News) January 17, 2025
Comments
Please login to add a commentAdd a comment