జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స‍్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.
ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు.
గాజాలో శాంతి
పదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది.
కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment