Gaza City
-
తాత్కాలికంగా ఖాళీ చేయిస్తామన్నారంతే..
గ్వాటెమాలా సిటీ: గాజా ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మిత్ర దేశాలతోపాటు, సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో, ట్రంప్ యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం ట్రంప్ మాటలకు మరో అర్థం చెప్పారు. గాజా పునర్నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అక్కడున్న 18 లక్షల మంది పాలస్తీనియన్లకు మరో చోట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలన్నదే ట్రంప్ మాటల వెనుక అర్థమంటూ వివరించారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మార్కో రుబియో గురువారం మొట్టమొదటి విదేశీ పర్యటన కోసం గ్వాటెమాలా వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగిన 15 నెలల యుద్ధం ఫలితంగా గాజా ప్రాంతం శిథిలాలతో నిండిపోయింది. వాటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలనే సదుద్దేశంతో ట్రంప్ చాలా జాలితో పాలస్తీనియన్లకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశారు. పునర్నిర్మాణ పనులు జరిపేటప్పుడు అర్థంతరంగా వెళ్లాలన్నా వారు ఎక్కడికీ వెళ్లలేరు, అక్కడే ఉండిపోనూ లేరు’అని చెప్పుకొచ్చారు. లీవిట్ వాషింగ్టన్లో మీడియాతో సమావేశంలో.. గాజాను ధ్వంసమైన ప్రాంతంగా పేర్కొంటూ శిథిల భవనాలతో కూడిన ఫొటోను ప్రదర్శించారు. అధ్యక్షుడు అక్కడి వారిని గాజా నుంచి తాత్కాలికంగా తరలించాలని స్పష్టంగా చెప్పారు. గాజా ప్రస్తుతం మనుషులకు ఏమాత్రం నివాసయోగ్యంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండిపోవాలనడం కూడా దుర్మార్గమైన సూచన అనిపించుకుంటుంది’అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, గాజాకు అమెరికా బలగాలను పంపే యోచనను ఆయన కొట్టిపారేయలేదు. చర్చలు సవ్యంగా సాగాలంటే అమెరికా బలగాలు అక్కడుండాల్సిన అవసరముందని చెప్పారు. గాజా పునర్నిర్మాణానికి ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలతో మిలటరీ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం ప్రకటించారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గ్యుటెరస్ ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెదికే ప్రయత్రంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశి్చమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు.ట్రంప్ ఏమన్నారంటే.. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశి్చమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. -
గాజాపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు.. ట్రంప్‌కు ఝలక్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాలస్తీనాలోని గాజాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందనే వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఇక, తాజాగా గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.గాజాగా విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ స్పందించారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా గుటేరస్..‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉంది. ఐక్యరాజ్యసమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం మరియు పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో, మనం సమస్యను మరింత దిగజార్చకూడదు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలపై భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. The Palestinian people have the right to simply live as human beings in their own land.The @UN is fully committed to peace, stability, and the inalienable rights of the Palestinian people.— António Guterres (@antonioguterres) February 5, 2025మరోవైపు.. గాజా ప్రాంతంలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్ సిద్దంగా లేరని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమని ట్రంప్ విశ్వస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. In the search for solutions on Gaza, we must not make the problem worse.It is vital to stay true to the bedrock of international law.It is essential to avoid any form of ethnic cleansing.— António Guterres (@antonioguterres) February 5, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు, సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు. -
USA: ఆంటోనీ బ్లింకెన్ చివరి సమావేశంలో రసాభాస(వీడియో)
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి విలేకరుల సమావేశంలో గందరగోళం నెలకొంది. గాజా వివాదంపై బైడెన్ పరిపాలన విధానాలను ఆయన సమర్థిస్తున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజా యుద్ధాన్ని కవర్ చేసిన జర్నలిస్టు బ్లింకెన్‌ను విమర్శించారు. దీంతో, వారిని సమావేశం నుంచి బయటకు లాకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అమెరికాలో విదేశాంగ శాఖలో ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో భాగంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. బైడెన్ నిర్ణయాలను సమర్ధించారు. బైడెన్ మంచి పరిపాలన అందించారని అన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, గాజా విషయంలో బైడెన్ చొరవతోనే కాల్పులు విరమణ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ సమయంలో గాజా యుద్ధాన్ని కవర్ చేసిన జర్నలిస్టు సామ్ హుస్సేనీ.. బ్లింకెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో జర్నలిస్టులు.. గాజా మారణహోమానికి మంత్రివి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బైడెన్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మొదలు అంతర్జాతీయ నేర న్యాయస్థానం దాకా ఇజ్రాయెల్ నరమేధం జరుపుతోందని, నాశనం చేస్తోందని చెప్పాయి. మీరు ఆ ప్రక్రియను గౌరవించమని చెబుతున్నారు. గాజా విషయంలో ఇన్ని రోజులు మారణహోమం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు అంటూ ప్రశ్నలు సంధించారు. మీరంతా నేరస్థులు. జర్నలిస్టుల చావులకు మీరే కారణం. మీరు ఎందుకు అంతర్జాతీయ న్యాయస్థానం దిహేగ్లో ఉండకూడదు అంటూ విమర్శించారు. దీంతో, బ్లింకెన్ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం.. సమావేశంలో ఉన్న సిబ్బంది సదరు జర్నలిస్టులను అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నినాదాలు చేశారు. గాజా మారణహోమానికి మంత్రి బ్లింకెన్ అంటూ నినాదం చేశారు. దీంతో, సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The goodbye he deserves!Secretary of State, Antony Blinken was confronted about America’s action in enabling genocide in Gaza.“Why aren’t you in The Hague?!”“300 reporters were on the receiving end of your bombs”“Why did you allow the holocaust of our time to happen?!” pic.twitter.com/f09fyThjDV— OnePath Network (@OnePathNetwork) January 17, 2025 -
Israel-Hamas: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU— Channel 4 News (@Channel4News) January 17, 2025 -
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారని ఎన్క్లేవ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సెంట్రల్ గాజాలోని నుసిరత్‌లో ఉన్న అల్-అవ్దా ఆసుపత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు. వీరంతా అల్-ఖుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మీడియా కథనాల ప్రకారం.. జర్నలిస్టులు ఆసుపత్రి లోపల నుంచి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో, వారు చనిపోయారు అని తెలిపింది. ఇక, మరణించిన జర్నలిస్టులను ఫాది హస్సౌనా, ఇబ్రహీం అల్-షేక్ అలీ, మహ్మద్ అల్-లదా, ఫైసల్ అబూ అల్-కుమ్సన్, అయ్మాన్ అల్-జాదీగా గుర్తించినట్లు అల్ జజీరా నివేదించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని జైటౌన్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సందర్భంగా వీరంతా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.Overnight, the IAF conducted an airstrike on a vehicle belonging to the TV news channel "Al Quds Today" in the Nuseirat refugee camp near the Al Awda hospital in central Gaza. The IDF later released a statement claiming that it targeted a Palestinian Islamic Jihad (PIJ)… pic.twitter.com/M7BIA8BTz0— AMK Mapping 🇺🇦🇳🇿 (@AMK_Mapping_) December 26, 2024 -
మా ప్రధాని అరెస్టు వారెంట్‌ను రద్దు చేయండి
టెల్ అవీవ్: యుద్ధ నేరాల కేసులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేయాలంటూ జారీ అయిన అరెస్ట్వారెంట్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఇజ్రాయెల్ ఆశ్రయించింది. తీర్పు వచ్చే వరకు ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్టు వారెంట్లను నిలిపివేయాలని గురువారం న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువడేదాకా వారెంట్ అమలును నిలుపుదల చేయాలని వేడుకుంది. గాజా స్ట్రిప్‌లో యుద్ధం చేస్తూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణానికి కారణమవుతూ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, అందుకే నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రకటించడం తెల్సిందే. హమాస్ సైనిక విభాగ సారథి మొహహ్మద్ డెయిఫ్పైనా ఇదే తరహాలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధి, అరెస్టు వారెంట్ల చట్టబద్ధతను తాము సవాలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే, ఇజ్రాయెల్ ప్రభుత్వం పట్ల అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఐక్యరాజ్య సమితి ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ మిత్రదేశాలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20 వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలకు సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, యోవ్ గాలెంట్లపై అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఈ చర్యను నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఫ్రాన్స్‌లు నెతన్యాహుకు మద్దతు పలికాయి. వారెంట్ల జారీని తప్పుబట్టాయి. మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం యూదుల పట్ల వివక్ష చూపిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. -
ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడులు
జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. -
ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి.. సంచలన వీడియో
జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్ చేశారు. Two Flares were fired earlier tonight at a Guard Shack outside the Home of Israeli Prime Minister Benjamin Netanyahu, in the Northern Town of Caesarea, the same Home that a Hezbollah Drone struck in October. Both Israeli Police and Shin Bet are Investigating. pic.twitter.com/0BfYEaN4Bq— OSINTdefender (@sentdefender) November 16, 2024 -
సంధి దిశగా ఇజ్రాయెల్, హమాస్.. యుద్ధానికి ముగిసినట్టేనా?
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మృతిచెందిన వారిలో హమాస్ కమాండర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ సంధి దిశగా కదులుతున్నాయి. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం జరిగే సూచనలు కన్పిస్తే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు వెల్లడించాయి. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి ఒక ఒప్పందానికి దారి తీయగలదని అమెరికా కొద్ది రోజుల క్రితమే ఆశాభావం వ్యక్తం చేసింది.దోహాకు చెందిన ఓ అధికార ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. అయితే, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయం అందాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.ఇక, బంధీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. పాలస్తీనా పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. తాజాగా ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 17 మంది మృతిచెందారు. నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 11 నెలల శిశువుతో సహా ఎక్కువగా మహిళలు, పిల్లలు మరణించారని 42 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. మృతుల్లో 13 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్టు పేర్కొంది.గాజాపై దాడుల్లో మరో హమాస్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల వెనక అతడి ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. చనిపోయిన కమాండర్ ఐక్యరాజ్యసమితి సహాయ ఏజెన్సీ కోసం కూడా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. యూఎన్ ఏజెన్సీలోని సభ్యులు హమాస్, ఇతర సాయుధ బృందాల్లో పనిచేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న 9 మందిని గతంలోనే యూఎన్ తొలగించింది. -
Israel-Hamas war: గాజా మసీదుపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జబాలియా దిగ్బంధం ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బీరుట్లో ఆరుగురి మృతి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. -
Israel-Hamas war: వెస్ట్‌బ్యాంక్‌పై భీకర దాడి
వెస్ట్‌బ్యాంక్: గాజాలో తమ అధీనంలోనే ఉన్న వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ బుధవారం విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. దాంతో 9 మంది మరణించారు. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లు స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వారు సాధారణ ప్రజలపై దాడి చేయకుండా నిరోధించడానికే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ అడపాదడపా దాడులు చేస్తున్నా ఇంతగా విరుచుకుపడడం ఇదే తొలిసారి. అక్కడి జెనిన్ సిటీని దిగ్బంధించినట్లు తెలుస్తోంది. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్, తుల్కారెమ్, అల్–ఫరా శరణార్థి శిబిరంలోకి సైన్యం చొచ్చుకెళ్లినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి నదవ్ సొషానీ ప్రకటించారు. ‘‘ఈ దాడి ఆరంభమే. వెస్ట్‌బ్యాంక్‌లో అతిపెద్ద సైనిక ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశాం’’ అన్నారు.ఇజ్రాయెల్ సైన్యానికి, తమకు కాల్పులు జరిగినట్లు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులు కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, గాజాలో మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లుగానే వెస్ట్‌బ్యాంక్‌లోని వారి స్థావరాలను ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
Israel-Hamas war: గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్–అల్–బలాహ్: గాజా నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న అల్–తబీన్ స్కూల్‌పై శనివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా డజన్ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. హమాస్‌తో 10 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. స్కూల్లోని హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగానే దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ప్రకటనను హమాస్ ఖండించింది. దాడి తీవ్రతకు విశాలమైన ఆ పాఠశాల భవనం శిథిలాల దిబ్బగా మారి, గ్రౌండ్ ఫ్లోర్లో మొండిగోడలు మాత్రమే మిగిలున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. 100కు మృతదేహాలను స్థానికులు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారని అల్–అహ్లి ఆస్పత్రి డైరెక్టర్ ఫదెల్ నయీమ్ చెప్పారు. స్కూలు భవనంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా హెచ్చరికల్లేకుండా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 6 వేల మంది తలదాచుకుంటున్న ఈ భవనంపై 3 క్షిపణులు పడ్డాయని అధికారులు చెప్పారు. చాలా మృతదేహాలు గుర్తు పట్టేందుకు కూడా వీలులేనంతా ఛిద్రమయ్యాయన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. -
పాలస్తీనాకు ఫేవర్‌గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..
దిహేగ్: పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకోవడం చట్టవిరుద్దమని కోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, పాలస్తీనా అంశంపై తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్ పాలస్తీనా విషయంపై కీలక తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అధీనంలో తీసుకోవడం చట్ట విరుద్ధం. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని పేర్కొంది. అక్కడ కాలనీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ''It is a big blow to Israel as a state, as an establishment, as a government, as settlers.''Palestinian officials welcomed the International Court of Justice’s opinion that called for an end to Israel’s occupation of the Palestinian territories.pic.twitter.com/pIzavp1ZGq— Rachael Swindon #WeAreCollective (@Rachael_Swindon) July 20, 2024 ఇదే సమయంలో 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమణలు కరెక్ట్ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెం ప్రాంతాలపై నియంత్రణ, సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. అన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని మండిపడింది. వెంటనే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావాలని ఆదేశించింది.ఇక, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్పందించారు. కోర్టు తీర్పు హస్యాస్పదమని ఖండించారు. ఆక్రమిత మూడు ప్రాంతాలు యూదుల చారిత్రాక మాతృభూమిలో భాగమన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టబడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. కోర్టు చారిత్రాక విషయాలను వక్రీకరించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలోని హమాస్ కీలక నేతలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో దాదాపు 80 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
వెస్ట్ బ్యాంక్ జెనీన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు..
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వెస్ట్ బ్యాంక్ నగరం జెనిన్ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఇక, చనిపోయిన వారిలో ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందినట్టు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సెటిల్మెంట్లలో దాదాపు 5,300 భవానాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ యాంటీ సెటిల్మెంట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపిన మరుసటి రోజే ఇలా వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా పేర్కొంది. When one of the injured victims was taken from inside a house in the Al-Zahra`a neighborhood in the city of Jenin after he was shot by a zionist occupation sniper. pic.twitter.com/tfmUig7kc2— Jordan 🇮🇩🇵🇸 (@Mhmmd_Jordan) July 5, 2024ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి వెస్ట్ బ్యాంక్ సిటీలో హింస చెలరేగింది. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ కాల్పుల్లో 500 మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, హింసాత్మక ఘటనల సమయంలో చాలా మంది మరణించారు. చనిపోయిన వారిలో యూదు వలసదారులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ఇజ్రాయెల్ Vs హమాస్.. నెతన్యాహు సంచలన ప్రకటన!
టెల్ అవీవ్: హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్ ఓ మీడియా ఛానెల్లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. During a speech at the Knesset, Prime Minister Benjamin Netanyahu said that Israel is “committed to the Israeli proposal that President Biden endorsed” on Monday. pic.twitter.com/NGoVdercZw— Middle East Eye (@MiddleEastEye) June 25, 2024 హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు. అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. -
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్.. శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు. -
Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ దాడులు... 18 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్‌లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్‌లోని స్కూల్‌పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది. -
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు. -
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..
ఇజ్రాయెల్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్ తెలిపింది. قطعت رؤوس الأطفال وحرقت الأجساد 😭😭جنون اسرائيل لن ينتهي الا باقتلاعه من الجذورونهايتهم قريب باذن الله#رفح_الان #Rafah #ابو_عبيدة pic.twitter.com/BjbNdA9aRF— حماة الأقصى في بلاد الحرمين (@aqsa_saudi3n) May 27, 2024 ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. Israel commits a massacre in #Rafah this evening, dropping several 2,000 pound bombs on civilian tents and #UN compounds, murdering dozens of civilians seeking shelter. This was Israel’s response to the @CIJ_ICJ ruling Friday that it must halt its offensive on Rafah. pic.twitter.com/vS1ouUU8Oj— Husam Zomlot (@hzomlot) May 26, 2024 ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే!
జెరూసలెం: ఈజిప్టు– ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ సోమవారం ప్రకటించింది. గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. -
ఇజ్రాయెల్ నెతన్యాహుకు ఊహించని షాక్!
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. -
Israel-Hamas war: అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు. -
గాజాపై దాడుల ఎఫెక్ట్.. అమెరికాలో బైడెన్‌కు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడుల ఘటన తాజాగా అమెరికాను తాకింది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అగ్ర రాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో, ఉద్రిక్తత నెలకొనడంతో 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో విద్యార్థులు నిరసనలకు దిగారు. రోడ్లకు మీదకు వచ్చి భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. *BREAKING NEWS* Israel supporters put up pictures of people killed on October 7th outside the pro Palestinian encampment at Columbia University. Meanwhile, over 400 students have been arrested as division continues to grow. pic.twitter.com/YFCU9IU9YN— MorrisNews (@morrisnews12) April 24, 2024 కాగా.. అమెరికాలోని యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 133 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీలో తరగతి గదులను మూసివేశారు. మిగిలిన సెమిస్టర్‌కు హైబ్రీడ్ పద్దతిని అనుసరించనుంది. ఇక, తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తామని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ తెలిపారు. A view from the Mario Savio steps of Sproul Hall, where I’m standing with Faculty and Staff for Justice in Palestine. Happening now at UC Berkeley! #Divest #BDS #FromTheRiverToSeaPalestineWillBeFree #UCDivest #StudentsForJusticeInPalestine #UCBerkeley pic.twitter.com/zmbyUaryrV— Brooke Lober (@brookespeeking) April 22, 2024 ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. ఇక, సోమవారం విద్యార్థులతో పాటు. ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అరెస్టులకు నిరసనగా, బోస్టన్, హార్వర్డ్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. Puluhan Mahasiswa dan Dosen Pengajar New York University ditangkap kepolisian Amerika karena mendukung dan melakukan aksi solidaritas terhadap Gaza dan Palestina. Selasa (23/4)Sumber: QudsN pic.twitter.com/cjN0F93cEl— Lembayung Senja 🐾👣 (@Lembayungsyahdu) April 24, 2024 న్యూయార్క్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, పలువురు విద్యార్థులను అరెస్టుచేసినట్టు తెలుస్తోంది. ఇక, కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు 15 గుడారాలను ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఆందోళనను వైట్ హౌస్ ఖండించింది. Hundreds of faculty members at Columbia University in New York held a mass walkout on Monday in solidarity with students advocating for Palestine. #WeAreAllGaza pic.twitter.com/2L1UBOWaH1— MuslimWomensCouncil (@MWC_Bradford) April 24, 2024 -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేత కుమారుల మృతి
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘ జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కలి్పంచే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని అల్జజీరాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
గాజాలో దారుణం: తిండి కోసం ఎదురు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్
గాజా: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో చిధ్రమైన గాజాలో తిండికోసం ఎదురు చూస్తున్న శరణార్థులపై మరో దారుణం జరిగింది. విమానం నుంచి జారవిడిచిన ఆహారపొట్లాలతో కూడిన పారాచూట్ తెరచుకోకపోవడంతో ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులపై భారీ పార్సిళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా 10 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆల్షిఫా ఆస్పత్రికి తరలించారు. అయితే పారాచూట్ జారవిడిచింది తాము కాదని విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలు జార విడుస్తున్న జోర్డాన్, అమెరికాలు స్పష్టం చేశాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా చేపట్టిన సాయంలో భాగంగానే ఈ ప్రమాదం జరిగనట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై గాజా ప్రభుత్వం స్పందించింది. విమానాల ద్వారా ఆహారపొట్లాలు జారవిడవడం కేవలం ప్రచార ఆర్భాటం కోసం తప్ప ఎందుకు పనికిరాని ప్రయత్నమని మండిపడింది. గాజాలో పౌరుల ప్రాణాలకు ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఇదివరకే హెచ్చరించినట్లు తెలిపింది. ఇప్పుడు పారాచూట్‌లోని భారీ పార్సిళ్లు పడి ఐదుగురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం నుంచి జారవిడవడం కంటే రోడ్డు మార్గం ద్వారా గాజాకు ఆహారం పంపేందుకు మరిన్ని ట్రక్కులను అక్కడికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే కోరింది. పది రోజుల క్రితమే ఆకలితో అలమటిస్తూ ఆహారపొట్లాల కోసం ఎగబడ్డ గాజా వాసులపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వందల మంది మరణించడం అందరి హృదయాలతను ద్రవింపజేసింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాలస్తీనాలోని గాజా, ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో గాజా మొత్తం ధ్వంసమై అక్కడి ప్రజలు చెల్లాచెదురై ఇళ్లు కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఇదీ చదవండి.. నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్ -
ఆ కెనాల్ కోసమే ఉత్తర గాజాపై దాడి
గాజాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపమని ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా అమెరికా అండతో ఇజ్రా యెల్ బేఖాతరు చేస్తోంది. లక్షలాది ప్రజా నీకాన్ని గాజాలో ఉత్తర ప్రాంతం నుండి దక్షిణాదికి తరుముతూ ఇప్పటి వరకూ 20 వేల మందిని చంపింది. యుద్ధానికి ప్రధాన రహస్య ఎజెండా ‘బెన్ గురియన్ కెనాల్ ప్రాజెక్ట్’ను నిర్మించటమే అనే అనుమానం నిజమౌతోంది. ‘సూయజ్ కెనాల్’ చుట్టూ ఉన్న క్లిష్టమైన భౌగోళిక రాజకీయ వ్యూహాలను విశ్లేషిస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. 1948 ఊచకోత (నక్బా) సమయంలో ప్రథమ ప్రధానమంత్రిగా బెన్–గురియన్, లక్షమంది పాలస్తీనియన్లను చంపించి, 7 లక్షల పాలస్తీనియన్ అరబ్బులను బలవంతంగా దేశం నుండి బహిష్కరించి ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపన చేశాడు. పాలస్తీనాలో యూదులకూ, అరబ్బులకూ సమాన రాజకీయ హక్కులనుకల్పించే ప్రజాస్వామ్య గణతంత్ర స్థాపనను వ్యతిరేకించాడు. అన్ని యూదు మిలిటరీ సమూహాలను ఒక కేంద్ర సంస్థగా ఏకం చేస్తూ ఇజ్రాయెల్ రక్షణ దళాలను స్థాపించాడు. 1956లో గాజా, సినాయ్‌పై దాడికి ఆదేశించాడు. ఈజిప్టు నియంత్రణ నుండి సూయజ్ కాలువను స్వాధీనం చేసుకునేందుకు ఫ్రాన్స్, బ్రిటన్లు చేసిన ప్రయత్నంలో భాగస్వామిగా మారాడు. అందుకే బెన్ గురియన్ జియోనిస్ట్ ప్రభుత్వం అరబ్బులను మాతృభూమి నుంచి తరిమివేసినా పశ్చిమ దేశాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేదు. 1963లో ‘బెన్ గురియన్ కెనాల్ ప్రాజెక్ట్’ సముద్ర రవాణా మౌలిక సదుపాయాల చొరవగా భావించబడింది. ఈ ప్రాజెక్టుకు దేశ వ్యవస్థాపకుడు అయిన ‘డేవిడ్ బెన్–గురియన్’గా నామ కరణం జరిగింది. ప్రతిపాదిత బెన్ గురియన్ కాలువ తూర్పు మధ్యధరా తీరం వరకు విస్తరించి, గాజా ఉత్తర సరిహద్దు దగ్గర మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. కనుకనే గాజాలోని ఉత్తర ప్రాంత పాలస్తీనియన్లను ఏరివేసే పనిచేపట్టింది ఇజ్రాయెల్. యూరప్–ఆసియా మార్గంలో ఈజిప్ట్‌ను సవాలు చేస్తూ ప్రపంచ సముద్ర మార్గాలను పునర్నిర్మించటానికి ఈ నూతన కాలువను ‘గల్ఫ్ ఆఫ్ అకాబా’ (ఎర్ర సముద్రం యొక్క తూర్పు భాగం) నుండి ప్రారంభించి ‘నెగెవ్ ఎడారి’ (ఇజ్రాయెల్) ద్వారా నిర్మించా లనే ప్రతిపాదన ఉంది. గల్ఫ్ ఆఫ్ అకాబా నాలుగు దేశాలు (ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, సౌదీ అరేబియా) పంచుకున్న తీర రేఖను కలిగి ఉంది. ఈ ప్రతిపాదిత కాలువ నిర్మాణంతో ఒనగూరే ఆర్థిక అవకాశాల కోసం ఇజ్రాయెల్ ప్రస్తుతం పాలస్తీనాపై యుద్ధం చేస్తుందనిపిస్తోంది. సూయజ్ కెనాల్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి అమెరికా సరఫరా చేసే 520 అణుబాంబులను ఉపయోగించాలనే ప్రతిపాదనను ఇజ్రాయెల్ 1963లో పరిగణన లోకి తీసుకున్నది. ఒక డీ క్లాసిఫైడ్ మెమోరాండం ప్రకారం... ఇజ్రా యెల్ నెగెవ్ ఎడారి గుండా సముద్ర మట్ట కాలువకు 160 మైళ్ల కంటే ఎక్కువ త్రవ్వకాలు జరిపి ఉండేదని చరిత్రకారుడు అలెక్స్ వెల్లర్ స్టెయిన్ అంటున్నాడు. ప్రతి మైలుకు నాలుగు 2–మెగా టన్నుల పరికరాలు అవసరమని మెమోరాండం అంచనా వేసింది. ‘‘దీనిని వెల్లర్‌స్టెయిన్ ‘520 న్యూక్స్’ అని వ్యవహరిస్తా’’రని అలెక్స్ వెల్లర్ స్టెయిన్ ట్వీట్ చేశాడు. ఈ ప్రణాళికను ‘సూయజ్ కెనాల్‌కు ప్రత్యమ్నాయ ప్రతిపాదన’గా పేర్కొన్నాడు. సూయజ్ కెనాల్ 1869లో ప్రారంభించబడిన మానవ నిర్మిత జలమార్గం. ఇది ఈజిప్ట్‌లోని సూయజ్ యొక్క ఇస్త్మస్ మీదుగా ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తూ, మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతోంది. యూరప్ ఆసియా మధ్య నౌకా యాన దూరాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా నుండి వేరు చేసే ఈ కాలువ 150 సంవత్సరాల క్రితం తవ్వినది. కాలువ ప్రారంభంలో బ్రిటిష్, ఫ్రెంచ్ ప్రయోజనాలకు ఉపయోగపడేది. అయితే ఈజిప్ట్ 1956లో దీన్ని జాతీయం చేసింది. దీంతో ఈ కాలువపై ఈజిప్టు ఆధిపత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈజిప్టు జీడీపీలో దాదాపు 2 శాతం వాటా ఈ కాలువ ద్వారా సరుకు రవాణా చేసే నౌకలపై విధించిన టోల్ రుసుము ద్వారానే లభిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం సూయజ్ కెనాల్ గుండా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో బెన్–గురియన్ కాలువ నిర్మాణం జరిగితే ప్రపంచ వాణిజ్య, భౌగోళిక రాజకీయాలపై గణనీయమైన ప్రభావం పడుతుంది. యూరప్– ఆసియా మధ్య కొత్త నౌకా రవాణా మార్గాన్ని సృష్టించి ప్రపంచ నౌకా రవాణాపై ఇజ్రాయెల్ ఆధిపత్యం చెలాయించాలనే తపనతో ఉత్తర గాజా ప్రాంతవాసుల్ని దక్షిణం వైపునకుగానీ, వేరే దేశాలకుగానీ శరణార్థులుగా పొమ్మంటున్నదనే ఆలోచనలు బలపడుతున్నాయి. వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ -
గాజాలో మళ్లీ బీభత్సం
ఖాన్ యూనిస్: హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత గాజా స్ట్రీప్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మళ్లీ యుద్ధ బీభత్సం స్పష్టం కనిపిస్తోంది. జనం చెల్లాచెదురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ తరలివెళ్తున్నారు. హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీపై సోమవారం అర్ధరాత్రి తర్వాత క్షిపణుల వర్షం కురిపించింది. ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 43 మంది మరణించారని హమాస్ వెల్లడించింది. సాధారణ జనావాసాలపై దాడులు చేయలేదని, హమాస్ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉత్తర గాజాలో అతిపెద్ద జబాలియా రెఫ్యూజీ క్యాంప్‌ను తమ సైన్యం చుట్టుముట్టిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ క్యాంప్లోపలి హమాస్ స్థావరాలను నేలమట్టం చేయబోతున్నామని వెల్లడించింది. గాజాలో ఇప్పుడు సురక్షిత ప్రాంతం అంటూ ఏదీ లేకుండాపోయిందని ‘యూనిసెఫ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ పరిస్థితి ప్రతి గంట గంటకూ దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గాజాలో 15,899కి చేరిన మృతులు ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 15,899 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత గత మూడు రోజుల వ్యవధిలోనే 700 మంది మరణించినట్లు తెలుస్తోంది. కలుగుల్లోని ఎలుకలను రప్పించినట్లు.. గాజాలో హమాస్ మిలిటెంట్లు బలమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడే వారి ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలుగుల్లో దాక్కొని ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు దిగుతున్నారు. అందుకే సొరంగాలను ధ్వంసం చేయడానికి , వాటిని సముద్రపు నీటితో నింపేయాలని ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నవంబర్లోనే అల్–షాతీ శరణార్థి శిబిరానికి మైలు దూరంలో 5 భారీ పంపులను ఏర్పాటు చేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గంటకు కొన్ని వేల క్యూబిక్ మీటర్ల నీటిని పంప్ చేస్తాయని, వారాల వ్యవధిలోనే సొరంగాలను నింపుతాయని పేర్కొంది. దీంతో సొరంగాలు పనికిరాకుండాపోతాయి. అందులోని ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు నిరుపయోగంగా మారతాయని ఇజ్రాయెల్ అంచనా. సొరంగాల్లోని మిలిటెంట్లను అంతం చేయడం తేలికవుతుందని భావిస్తోంది. ఇలా ఉండగా, బందీలను సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టిన సంగతి తెలిసింది. వారంతా విడుదలైన తర్వాత సొరంగాలను నీటితో నింపే ప్రణాళికలను అమలు చేస్తారా? లేక ముందే చేస్తారా? అనేది తెలియరాలేదు. -
Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు.. ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు. -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
Israel-Hamas War: ఆ కిరాతకం మీదే..
గాజా స్ట్రిప్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: గాజా సిటీలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఘటనపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరేనని వాదులాటకు దిగాయి. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, ముమ్మాటికీ ఇజ్రాయెల్ సైన్యమే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని హమాస్ ఆరోపించింది. అల్–అహ్లీ ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఎక్కడికి తరలించాలో తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయానని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 12వ రోజుకు చేరింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 3,478 మంది మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 1,300 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నామని, వారు ప్రాణాలతో బయటపడతారన్న నమ్మకం లేదని వెల్లడించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ అ«దీనంలోనే ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు మెట్టు దిగిరావడం లేదు. దాంతో బందీల పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. గత 12 రోజుల్లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 450 రాకెట్లు ప్రయోగించారని అంచనా. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు కొనసాగించింది. భయంకరమైన ఊచకోత: హమాస్ అల్–అహ్లీ హాస్పిటల్లో పేలుడుకు తాము కారణం కాదని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు జరిగిన సమయంలో తాము ఆ ప్రాంతంపై అసలు ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ శ్మశాన వాటిక నుంచి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన ఇస్లామిక్ జిహాద్ సభ్యులు రాకెట్‌ను ప్రయోగించినట్లు తమ రాడార్ గుర్తించిందని తెలిపారు. ఈ రాకెట్ గురితప్పి, ఆసుపత్రి బయట పార్కింగ్ ప్రాంతంలో పేలిందని వెల్లడించారు. ఆసుపత్రిలో పేలుడు ఘటనను ‘భయంకరమైన ఊచకోత’గా హమాస్ అభివర్ణించింది. ఈ దురాగతానికి ఇజ్రాయెల్ సైన్యమే కారణమని పే ర్కొంది. ఈ మారణకాండకు బాధ్యత వహించకుండా ఇజ్రాయెల్ తప్పించుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపించింది. అల్– అహ్లీ ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితమే ఆదేశించిందని గుర్తుచేసింది. ఆసుపత్రిలో పేలుడులో 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆ సంఖ్యను 471గా సవరించింది. బైడెన్‌తో సమావేశాలు రద్దు గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు నిరసనగా జోర్డాన్ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరగాల్సిన సమవేశాన్ని జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 రద్దు చేసుకున్నారు. పాలస్తీనా నేత మొహమ్మద్ అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ కూడా ఇదే బాటలో నడిచారు. బైడెన్‌తో తాము భేటీ కావడం లేదని తేలి్చచెప్పారు. దాంతో బైడెన్ తన పర్యటనను కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని జోర్డాన్ విదేశాంగ మంత్రి సపాధీ చెప్పారు. హమాస్ లావాదేవీలపై ఆంక్షలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, వెయ్యి మందికిపైగా జనాన్ని బలి తీసుకున్న మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలు ప్రారంభించింది. 10 మంది హమాస్ మిలిటెంట్ల బృందం ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. అలాగే హమాస్ ఆర్థిక నెట్‌వర్క్‌పైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. గాజా, సూడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లో ఈ ఆంక్షలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఆంక్షల వల్ల విదేశాల నుంచి హమాస్‌కు నిధులు అందకుండా కట్టడి చేసినట్లు అవుతుందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్ చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తూ, భారీ ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇకపై నిధులు ఇవ్వడం సులభం కాదు. వివిధ దేశాల్లో హమాస్ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ పేలుడుకు కారణం ఇజ్రాయెల్ కాదు: బైడెన్ గాజా హాస్పిటల్లో భీకర పేలుడుకు ఇజ్రాయెల్ ఎంతమాత్రం కారణం కాదని, ‘మరో బృందం’ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన బుధవారం ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, తాజా పరిణామాలు, గాజా ప్రజలకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చించుకున్నారు. అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఉదంతం ప్రస్తావనకు వచి్చంది. ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ప్రయోగించిన రాకెట్ మిస్‌ఫైర్ కావడం వల్లే ఈ పేలుడు జరిగిందన్న ఇజ్రాయెల్ వాదనతో బైడెన్ ఏకీభవించారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల ధైర్యసాహసా లు, అంకితభావం, శౌర్యాన్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానంటూ బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ప్రజల దుఃఖాన్ని అమెరికన్లు సైతం పంచుకున్నారని చెప్పారు. ఇజ్రాయెల్–హమస్ ఘర్షణ మరింత విస్తరించకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఈజిప్టు నుంచి మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వివరించారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల సాయం: బైడెన్ టెల్ అవీవ్: గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల (రూ.832.87 కోట్లు) మానవతా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ప్రకటన బుధవారం ప్రకటించారు. గాజా ప్రజలకు ఇప్పుడు ఆహారం, నీరు, ఔషధాలు, వసతి చాలా అవసరమని అన్నారు. గాజాకు ఇతర దేశాల నుంచి మానవతా సాయం చేరడానికి అంగీకరించాలని ఇజ్రాయెల్ కేబినెట్‌ను కోరానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాము అందించే 100 మిలియన్ డాలర్ల సాయం హమాస్‌కు, ఉగ్రవాద సంస్థలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, బాధిత పాలస్తీనియన్లకు మాత్రమే అందేలా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ పునరుద్ఘాటించారు. -
గాజా ఆస్పత్రిపై భీకర దాడి
ఖాన్ యూనిస్/వాషింగ్టన్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాడి ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయంపొందుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాను ఖాళీ చేయాలని, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లను ఆదేశించిన ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం అదే దక్షిణ గాజాపై భీకర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదులు సంఖ్యలో జనం మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్ నయీం చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్తర గాజాపై భూతల దాడులకు సన్నాహాలు చేస్తూ, మరోవైపు దక్షిణ గాజాపై హఠాత్తుగా వైమానిక దాడులు చేయడం గమనార్హం. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. హమాస్ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా శిథిలాల కిందే మృతదేహాలు ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాల నడుమ పరస్పర దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నపిల్లలేనని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ తెలిపారు. గాజాలో మరో 1,200 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకొని, మృతి చెందినట్లు భావిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ మరణాలు అధికారిక గణాంకాల్లో చేరలేదు. విద్యుత్, పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో శిథిలాలను తొలగించడం సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో దాడులు చేస్తున్నా హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తమ పదాతి దళాలు అడుగు ముందుకేస్తాయని, తమ సైన్యం గాజా సరిహద్దుల్లో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తర గాజా సగం ఖాళీ! ఉత్తర గాజా నుంచి జనం తరలింపు కొనసాగుతోంది. దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. ఉత్తర గాజా సగానికి పైగా ఖాళీ అయినట్లు సమాచారం. ఆసుపత్రుల్లోని వేలాది మంది రోగులు, క్షతగాత్రులు ఇంకా అక్కడే ఉన్నారు. ఆహారం, నీరు, ఔషధాలు పూర్తిగా నిండుకున్నాయని, బాధితుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనియన్ల కోసం ఇతర దేశాలు పంపించిన ఆహారం, నిత్యావసరాలు వారికి అందడం లేదు. రఫా సరిహద్దును ఈజిప్టు మూసివేసింది. నిత్యావసరాలతో కూడిన వాహనాలు గాజాలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఈ సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి. ఈజిప్టు అనుమతిస్తేనే గాజా ప్రజలకు ఆహారం అందుతుంది. రఫా సరిహద్దును తెరిపించేందుకు కొందరు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ మంగళవారం మూడు గంటలపాటు గాజాకు నీరు సరఫరా చేసింది. ఈ నీరు గాజాలో కేవలం 14 శాతం మందికి సరిపోతుంది. గాజాపై దాడులు ఆపండి: ఖమేనీ గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఖండించారు. దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ తీరు మార్చుకోకపోతే హింసాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ వైఖరి పట్ల ఇస్లామిక్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దులో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పైకి యాంటీ–ట్యాంక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో ఇజ్రాయెల్‌లో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దు నుంచి పౌరులను ఖాళీ చేయించాలని ఆదేశించింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా దక్షిణ లెబనాన్‌పై వైట్ ఫాస్పరస్ బాంబులను ప్రయోగించింది. యుద్ధ ట్యాంకులతో బాంబుల వర్షం కురిపించింది. ఇంతలో లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయెల్‌పై మరో రెండు యాంటీ–ట్యాంక్ క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడులు నిర్వహించింది. నలుగురు మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గతవారం లెబనాన్‌లోని ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగుతున్నారు. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరించకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తుర్కియే విదేశాంగ మంత్రి హక్కన్ ఫిదాన్ చెప్పారు. నేడు ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన ఇప్పటికే ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూదులకు సంఘీభావం తెలియజేస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నానని బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జోర్డాన్‌లోనూ పర్యటిస్తానని, ఇస్లామిక్ దేశాల అధినేతలతో భేటీ అవుతానని, గాజాలో తాజా పరిణామాలు, పాలస్తీనియన్లకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చిస్తానని వెల్లడించారు. పాలస్తీనియన్లకు హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించడానికి వీలుగా ఒక ప్రణాళిక రూపొందించాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం చెప్పారు. హమాస్ టాప్ కమాండర్ హతం సెంట్రల్ గాజాలోని బురీజ్ శరణార్థుల శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి కమాండర్ అయమాన్ నొఫాల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ మిలటరీ విభాగం స్వయంగా వెల్లడించింది. నొఫాల్ సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ వ్యవహారాల ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. ఇతర ఇస్లామిక్ దేశాల్లోని మిలిటెంట్ గ్రూప్‌లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. -
ఒక్కడి కోసం వెయ్యి మందిని వదిలిపెట్టి..
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరపోరు పదో రోజు దాటింది. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విరుచుకుపడుతున్నాయి.ఇప్పటి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ దళాలు.. ఏ క్షణమైనా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకుని దాడుల నుంచి తప్పించుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు. తాజాగా తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు(కొందరు విదేశీయలు కూడా) హమాస్ ప్రకటించుకుంది. అందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డానియల్ హగారే చెబుతున్నారు. తొమ్మిది నెలల పాప, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, యువతులు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాదులు కలిగిన వృద్ధులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే.. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్‌ను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి కాదు. 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి యుద్ధ తరహా సంక్షోభాలెన్నింటినో ఎదుర్కొంది. ముఖ్యంగా.. 1955 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఖైదీల పరస్పర మార్పిడి చేపడుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 2011లో జరిగిన ఘటన గురించి.. ఒక్క సైనికుడి కోసం ఏకంగా వెయ్యి మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. కార్పొరల్ గిలాద్ షలిత్(19) వెళ్తున్న ట్యాంక్‌పై దాడి చేసిన హమాస్ సభ్యులు.. అతన్ని బందీగా చేసుకున్నారు. ఐదేళ్లపాటు హమాస్ చెరలో ఉన్న షలిత్‌ను విడిపించాలని బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చేశారు. దీంతో.. షలిత్కి బదులుగా ఏకంగా 1,027 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో 78 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 1955లో.. నలుగురు సైన్య సిబ్బంది కోసం(మరొకరు బందీగా ఉన్నప్పుడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని మృతదేహం కోసం కూడా..) 40 మంది సిరియా పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 1983లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ ఖైదీల్ని విడిపించుకునేందుకు 4,700 మంది పాలస్తీనా-లెబనీస్ ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అందులో మరణశిక్షలు పడ్డ ఉగ్రవాదులు ఉన్నారు. 1985లో ముగ్గురి కోసం మరో 1,150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. 2004 నుంచి 2008 మధ్య కూడా.. ఖైదీల పరస్సర మార్పిడి జరిగింది. అలా.. ఇజ్రాయెల్ తమ పౌరుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో హమాస్‌కు తెలుసు. అందుకే హమాస్ ఇప్పుడు బందీల ప్లాన్ అమలు చేస్తోందా?.. వీళ్ల ద్వారా ఎంతమందిని విడుదల చేయించాలనుకుంటోంది?.. అనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు.. హమాస్ నుంచి తమ దేశస్థుల్ని సురక్షితంగా రప్పించాలంటూ ఇజ్రాయెల్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో.. వాళ్లను విడిపించడం నెతన్యాహూ ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గానే మారనుందనే చెప్పాలి. హమాస్-ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరువైపులా మరణించినవారి సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో 700 మంది పిల్లలతో సహా 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు 1400 మంది మరణించారు. -
గాజాపై ఇజ్రాయెల్ ఆధిపత్యం.. జో బైడెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాషింగ్టన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేల సంఖ్యలో పౌరులు, మిలిటెంట్ల మృత్యువాతపడ్డారు. ఇక, హమాస్ దాడులను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజా వణికిపోతోంది. ఇప్పటికే పలువురు గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. హమాస్ మిలిటెంట్లను కూడా ఇజ్రాయెల్ బంధించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. గాజాను ఇజ్రాయెల్ తన ఆధీనంలో ఎక్కవ కాలం ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే అక్కడి పాలన నిర్వహించాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. హమాస్ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు అని తెలిపారు. US President Joe Biden said that Israel taking control of the Gaza Strip would be 'a big mistake', but Tel Aviv 'must respond' and 'go after Hamas' after the movement launched attacks aimed at entered Israel last weekend. #Israel, #PalestineGenocide, #HamasisISIS, #USA, #Gaza pic.twitter.com/bY0veoQRih — SamTin❤️🍀 (@Dng21509147) October 16, 2023 ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటిస్తారన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ సందర్బంగా వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి. -
Gaza: ప్రాణ భయంతో.. ఉరుకులు పరుగులు!
వైమానిక దాడులతో గాజాను ఛిద్రం చేసిన ఇజ్రాయెల్ బలగాలు.. ఇక భూభాగంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాజా ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని భయంతో పరుగులు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్టలు, పరుపులు కార్ల పైభాగానికి కట్టుకుని.. ఇంతకాలం తమను ఆశ్రయం ఇచ్చిన నేలను వదిలేసి పారిపోతున్నారు గాజా ప్రజలు. కాలినడకన, దొరికిన వాహనం పట్టుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు నార్త్ గాజాకు చెందినవిగా పాలస్తీనాకు చెందిన ఓ రిపోర్టర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. హమాస్ సంస్థను నామారూపాలు లేకుండా చేస్తామని శపథం చేసిన ఇజ్రాయెల్.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బలగాలతో గాజాపై విరుచుకుపడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదే జరిగితే.. గాజాలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి. Gaza | Residents in North Gaza (Gaza City, Beit Lahia, Beit Hanoun, and Jabalia RC) are evacuating their homes in response to the Israeli military's threat that those who stay could face deadly consequences. pic.twitter.com/ZOlU0Rg5Rj — Younis Tirawi | يونس (@ytirawi) October 13, 2023 ‘‘గాజా నగర పౌరులారా.. మీరు, మీ కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లిపోండి. హమాస్ ఉగ్రవాదులకు మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని వాళ్లు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ తన హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. గాజాలో జనావాసాల్లో హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు మొదటి నుంచి ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు గాజా ప్రజల్ని తరలిపోవాలన్న ఇజ్రాయెల్ అల్టిమేటంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అది మరింత వినాశనానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇజ్రాయెల్ హెచ్చరికలపై స్పందిస్తూ.. గాజా ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్ల తరలించడం సాధ్యం కాదన్న విషయాన్ని అక్కడి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని అంటోంది. ముఖ్యంగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను తరలించడం వీలయ్యేది కాదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్ జసరెవిక్ తెలిపారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు తర్వాత వేరు ప్రాంతంగా ఏర్పాటైనా గాజాలో.. 20 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంది. అందులో శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. గత 16 ఏళ్లుగా హమాస్ పాలనలో.. ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు, మరోవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గాజా స్ట్రిప్ ఎదుర్కొంటోంది. ఇక.. గత శనివారం(అక్టోబర్ 7) హమాస్.. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడికి దిగింది. కేవలం 20 నిమిషాల్లో.. ఐదువేల రాకెట్ లాంఛర్లను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 1,300 ఇజ్రాయెల్ పౌరులు, 1800 దాకా పాలస్తీనియన్లు మృతి చెందారు. -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్‌పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్‌తోపాటు అలెప్పీలోని ఎయిర్‌పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్‌కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్‌కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్‌ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్‌లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్‌పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్‌కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!
ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్డేట్ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది. అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది. కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్‌లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్‌తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. -
Israel-Gaza War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా (ఫొటోలు)
-
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
గాజాకు అండగా మేముంటాం: అమెరికా
జెరూసలేం: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన గాజాకు అండగా మేముంటాం అని అమెరికా పేర్కొంది. గాజా అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా మద్దతు కూడగడతామని అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ ప్రకటించారు. అయితే, ఆ సాయం హమాస్ పాలకుల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య 11 రోజలపాటు జరిగిన యుద్ధంలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోగా, అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గాజా నగరం తీవ్ర విధ్వంసాన్ని చవిచూసింది. శుక్రవారం రెండు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బ్లింకెన్ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రాంతంలో మళ్లీ హింస తలెత్తరాదంటే ముందుగా కొన్ని అంశాలను, సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. ముందుగా గాజా పునర్నిర్మాణం ప్రారంభించి, మానవతా సాయాన్ని అందజేయాలి. ఈ విషయంలో అమెరికా ముందుంటుంది. అంతర్జాతీయ మద్దతును కూడా కూడగడుతుంది. పునర్నిర్మాణ సాయంతో హమాస్ లబ్ధి పొందకుండా చూసుకుంటాం’ అని బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలను మళ్లీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని బ్లింకెన్ ఈ సందర్భంగా అన్నారు. జెరూసలేం కాన్సులేట్‌ను తిరిగి తెరుస్తాం జెరూసలేంలోని కాన్సులేట్ కార్యాలయాన్ని మళ్లీ తెరుస్తామని బ్లింకెన్ ప్రకటించారు. పాలస్తీనాతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ఈ కాన్సులేట్ చాలా కాలంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తోంది. అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చిన ట్రంప్ ప్రభుత్వం ఈ కాన్సులేట్ హోదాను తగ్గించడం పాలస్తీనియన్లకు ఆగ్రహం తెప్పించింది. చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు! -
వైమానిక దాడులు తీవ్రతరం
గాజా సిటీ: దాడులు నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజాలోని హమాస్ నేతలు, స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. సోమవారం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్ సొరంగాలను ధ్వంసం చేశామని, 9 మంది హమాస్ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్– హమాస్ మిలటరీ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు శ్రమిస్తున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో గాజాలోని హమాస్ అగ్రనేత ఒకరు హతమయ్యారు. తమ దేశంపై వేలాది రాకెట్ల దాడికి అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజాలో మౌలిక వసతులు ధ్వంసం ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 200 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 59 మంది చిన్నారులు, 35 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో తమ నగరంలోని రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గాజా మేయర్ యహ్యా సర్రాజ్ చెప్పారు. ఇళ్లు ధ్వంసంకావడంతో 2,500 మంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఉన్న ఒకేఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇంధనం నిండుకుంది. కాల్పుల విరమణకు యత్నాలు అమెరికా దౌత్యవేత్త హడీ అమర్ శాంతి చర్చల్లో భాగంగా సోమవారం పాలస్తీనియన్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ను ఒప్పించేందుకు రష్యా, ఈజిప్టు, ఖతార్ తదితర దేశాలు కృషి చేస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ యధ్య పోరాటం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ పాటించాలంటూ ఇరువర్గాలపై తాము ఒత్తిడి తీసుకురాలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం సంకేతాలిచ్చారు. -
Gaza: ఇజ్రాయెల్ నిప్పుల వాన, మరో 42 మంది మృతి
దుబాయ్: ఇజ్రాయెల్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలటరీ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆదివారం అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా 42 ప్రాణాలను బలిగొంది. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 50 మంది గాయపడినట్లు వెల్లడించింది. గాజాలోని హమాస్ అగ్రనేత యాహియే సన్వార్ నివాసాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధం తప్పదన్న సంకేతాలను ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇచ్చారు. హమాస్‌పై పూర్తిస్థాయిలో దాడులు కొనసాగుతాయన్నారు. హమాస్ భారీ మూల్యం చెల్లించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందన్నారు. ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్ దేశాల కూటమి అభిప్రాయపడింది. జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్ దేశాలు తేల్చిచెబుతున్నాయి. హింసను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్ ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ నడుమ రగులుతున్న హింసాకాండను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు భవిష్యత్తును నిర్మించాలని కోరుకోవడం లేదని, కేవలం నాశనం చేయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సూచించారు. యుద్ధ నేరమే: పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, గాజాలో మానవత్వంపై దాడి చేస్తోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్–మాలికీ ఆరోపించారు. ‘పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దారుణాలను వర్ణించడానికి పదాలు లేవు. కుటుంబాలను తుడిచిపెడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలేం నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోందన్నారు. ఇంకెంత మంది చనిపోతే మీరు ఈ దాడులను ఖండిస్తారని ఐరాస భద్రతా మండలిని నిలదీశారు. సంయమనం పాటించాలి: భారత్ మరోవైపు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, దాడులకు పాల్పడవద్దని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలు తగ్గడమే తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.త్రిమూర్తి అన్నారు. పాలస్తీనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. వెంటనే దాడులు ఆగాలన్నారు. This was nothing but an assault on freedom of speech and freedom of press. #Gaza pic.twitter.com/eqA6YKi5SH — Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) May 16, 2021 #Gaza Street. How it was a few days ago and how it is today.#GazaUnderAttak pic.twitter.com/x07DqglXAB — Yara murtaja🇵🇸🇹🇷 (@murtajayara) May 17, 2021 -
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
గాజా సిటీ: పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు సాగిస్తోంది. శనివారం శరణార్థుల క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మరో 10 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో చాలామంది చిన్నారులే కావడం గమనార్హం. హమాస్ గ్రూపు అగ్రనేతల్లో ఒకరైన ఖలీల్ అల్–హయె నివాసంపై బాంబుదాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలకొన్న ఘర్షణలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏడాది పాటు సంధి చేసుకోవాలని, ఘర్షణ ఆపాలని ఈజిప్టు సూచించగా, హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ నో చెప్పింది. గాజాలో తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసింది మాట్లాడారు. స్వీయరక్షణకు ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలను నెతన్యాహు వివరించారు. గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 126 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో శనివారం గాజా సిటీలోని బహుళ అంతస్తుల భవనం ధ్వంసమయ్యింది. 12 అంతస్తులున్న ఈ భవనంలోనే అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్–జజీరా ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థల ఆఫీస్‌లున్నాయి. -
Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
గాజా సిటీ: ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృతరూపం దాలుస్తోంది. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ పెడచెవిన పెడుతున్నాయి. గాజా సిటీలో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడుతుండడంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకొని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు బెంబేలెత్తిపోతున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాఠశాలల్లో తల దాచుకునేందుకు తరలి వస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అందుకే విరుగుడు చర్యగా తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. 9,000 మంది రిజర్విస్ట్ సైనికులను రప్పిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించుతోంది. 126 మంది పాలస్తీనియన్ల మృతి పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,800 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. టాడ్ పట్టణంలో శుక్రవారం యూదు, అరబ్ అల్లరి మూకలు ఘర్షణకు దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 126 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 31 మంది చిన్నారులు, 19 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. అలాగే 950 మంది గాయపడ్డారని వెల్లడించింది. తమ సభ్యులు 20 మంది మృతి చెందినట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లు ప్రకటించాయి. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. శాంతి యత్నాలు విఫలం! ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్టు సాగిస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్యసమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. -
Israel- Palestine: మధ్య ప్రాచ్యం.. మరింత ఉద్రిక్తం
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది. భద్రత అనేదే లేదిక్కడ ‘ మేం చూస్తుండగానే మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ మెట్లు దిగి అపార్ట్మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H — Abier-Almasri (@abier_i) May 12, 2021 -
వైమానిక దాడి : మిలటరీ చీఫ్, భార్య, కుమార్తె మృతి
గాజా: గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డిఫ్, అతడి భార్యతోపాటు చిన్నారి (2) కూడా మరణించారు. ఈ మేరకు హమాస్ నేత మౌస్సా అబూ మర్జోక్ బుధవారం ఫేస్ బుక్‌లో పేర్కొన్నారు. ఈ దాడి మంగళవారం రాత్రి చోటు చేసుకుందని... మహమ్మద్ డిఫ్, అతడి భార్య, కుమార్తెలు అమరులయ్యారని చెప్పారు. హామాస్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని ఆరోపించారు. వారి మిగిలిన పిల్లులు అనాధులయ్యారని చెప్పారు. వైమానిక దాడిలో మరో 45 మంది మరణించారని తెలిపారు. జూలై 8 నుంచి ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య జరుగుతున్న పోరాటలో 2020 మంది పాలస్తీనియన్లు, 67 మంది ఇజ్రాయెల్ వారు మరణించారని చెప్పారు. 2002లో మహమ్మద్ డిఫ్ హమాస్ మిలటరీ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని చెప్పారు. ఆ పదవి చేపట్టిన నాటి నుంచి దాదాపు 5 సార్లు ఆయనపై దాడి జరిగిందని.... ఆయన తృటీలో తప్పించుకున్నారని మౌస్సా అబూ మర్జోక్ వివరించారు.