టెల్ అవీవ్: హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.
కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్ ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం.
During a speech at the Knesset, Prime Minister Benjamin Netanyahu said that Israel is “committed to the Israeli proposal that President Biden endorsed” on Monday. pic.twitter.com/NGoVdercZw
— Middle East Eye (@MiddleEastEye) June 25, 2024
హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్నారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు.
అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment