డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్‌లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు.
అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment