refugee camp
-
గాజాలో ఆకలి కేకలు
ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్న గాజాలో పాలస్తీనియన్లు పడుతున్న అంతులేని అగచాట్లకు నిదర్శనం ఈ ఫొటోలు. కనీసం ఆహారం సైతం దొరక్క వాళ్లు అలమటిస్తున్నారు. శుక్రవారం ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం సమీపంలోని ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఆహారం కోసం ఇలా పోటీ పడ్డారు. వారి దురవస్థ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రత నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐరాస సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. దాంతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలాకాలంగా వారంతా ఐరాస సాయంపైనే ఆధారపడి బతుకీడుస్తూ వస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటి కారుచీకట్లలోనూ ఒక కాంతిరేఖ మిణుకుమంటోంది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలైనట్టు హమాస్ ప్రతినిధి బస్సెమ్ నయీమ్ తాజాగా చెప్పారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు వస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు. -
గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని స్కూల్ భవనంపై గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు, 18 ఏళ్ల మహిళలున్నారని పాలస్తీనా వైద్య విభాగం తెలిపింది. ఘటనలో గాయపడిన మరో 42 మంది దగ్గర్లోని ఔదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్ భవనాలపై దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 42 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు మృతి చెందారు. క్షతగాత్రులు లక్ష వరకు ఉంటారని అంచనా. తాము 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను చంపేశామంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ సంబంధిత ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య యుద్ధం కారణంగా గాజాలోని 23 లక్షల మందిలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉత్తర గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ చేస్తున్న దాడులతో నివాసాలు నేలమట్టమవుతున్నా యి. వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాదిగా నిరాశ్రయులవుతున్నారు. మళ్లీ బలం పుంజుకుంటున్న హమాస్ సాయుధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. అయితే, ఈ దాడుల్లో గాయపడిన ఇంటెన్సివ్ కేర్‌లోని 14 మంది చిన్నారులు సహా సుమారు 150 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉత్తర గాజాలోని కమాల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ హొసమ్ అబూ సయేఫ్ తెలిపారు. వైద్య సిబ్బంది, మందుల కొరత కారణంగా గంటకొకరు చొప్పు న తుది శ్వాస విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.ముగ్గురు లెబనాన్ సైనికులు మృతి బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం జరిపిన దాడిలో లెబనాన్ ఆరీ్మకి చెందిన ముగ్గురు చనిపోయారు. యటెర్ పట్టణంలో క్షతగాత్రులను తరలిస్తున్న ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు సిబ్బంది చనిపోయినట్లు ఆ దేశ ఆర్మీ ‘ఎక్స్’లో తెలిపింది. సెప్టెంబర్‌లో హెజ్»ొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర పోరు మొదలయ్యాక యటెర్పై దాడి జరగడం ఇది ఎనిమిదోసారని పేర్కొంది. -
Israel-Hamas war: ఆగని దారుణ దాడులు
డెయిర్ అల్ బాలాహ్: గాజా భూతలంపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్ బాలాహ్ పట్టణంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్ జోన్’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్ అల్ బాలాహ్ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం. దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తులు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. -
Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
ఖాన్ యూనిస్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి. పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది. -
Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ దాడులు... 18 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్‌లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్‌లోని స్కూల్‌పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది. -
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేత కుమారుల మృతి
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘ జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కలి్పంచే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని అల్జజీరాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
Israel-Hamas war: ‘అల్–మగజి’పై అసాధారణ దాడులు
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
యుద్ధం విధ్వంసమే కాదు.. వ్యాధుల్ని కూడా కలగజేస్తుందా!
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఏడాదికి పైగా కావొస్తోంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంది. వేలాదిమందికి పైగా నిరాశ్రయులయ్యారు. మరోవైపు యుద్ధం బీభత్సానికి బీతిల్లి లక్షలాదిమంది వలసలు వెళ్లిపోయారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉన్నవారందర్నీ ఆ భయం వెన్నాడుతూనే ఉంది. వాళ్లు ఇంకా ఆ సంఘటనల తాలుకా ఆందోళన, ఒత్తిడి కారణంగా చెపుకోలేని మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ శరణార్థులంతా 'సర్వైవర్ సిండ్రోమ్' అనే మానసిక రుగ్మతతో అల్లాడుతున్నారు. ఇంతకీ 'సర్వైవర్ సిండ్రోమ్' అంటే ఏమిటంటే..? సర్వైవర్ సిండ్రోమ్ అంటే.. ఇతరులు మరణించిన లేదా హాని కలిగించే పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత అపరాధం చేసిన భావనలో ఉండటం. విపత్కర పరిస్థితుల్లోంచి తన వాళ్ల కంటే భిన్నంగా బయటపడిన తర్వాత నుంచి వారిని వేధించే ఒక రకమైన మానసిక ఆవేదన. ఏ తప్పు చేయకపోయినా తమ కారణంగానే వారు దూరమయ్యారని కుంగిపోతుంటారు. ఇందులోంచి వారు బయటపడకపోతే గనుక ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత స్థితికి చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే లిసెట్స్కా అనే మహిళ తన ఏడేళ్ల కొడుకుతో పొరుగున ఉన్న మోల్డోవాకు పారిపోయింది. ఐతే ఆ సమయంలో ఆమె తన భర్తను, స్నేహితులను వదిలి రోమేనియా సరిహద్దుకు సమీపంలోని నిస్పోరేని వద్ద ఉన్న మోల్డోవన్ శరణార్థి కేంద్రం వద్దకు చేరుకుంది. తన కొడుకుని సురక్షితంగా ఉంచేందుకు ఆమె ఈ ధైర్యం చేయక తప్పలేదు. కానీ ఆ తర్వాత నుంచి తన మాతృభూమికి ద్రోహం చేశానని, తన వాళ్లను మోసం చేశానేమో అనే ఆవేదనతో కుంగిపోవడం ప్రారంబించింది. శరీర స్ప్రుహ లేకుండా తిండి తిప్పలు లేకుండా జీవచ్ఛవంలా మారిపోయింది. ఇలా అక్కడ ఉంటున్న దాదాపు లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులంతా ఇలాంటి మానసిక రుగ్మతతోనే బాధపడుతున్నారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడి గురవ్వుతున్నారు. ఆయా శరణార్థులకు డాక్టర్స్ ఆఫ్ ది వరల్డ్‌తో సహా దాదాపు 40 ప్రధాన మానవతా సంస్థలు వారికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. వారందరికీ ఆర్ట థెరఫీ ఇచ్చి ఆ మానసిక రుగ్మత నుంచి బయటపడేలా చేయడమే గాక వారికి మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. తాము ఒంటరి అనే భావనను తుడిచిపెట్టి ఇక్కడ ఉన్నవారంతా ఓ కుటుంబంలా.. ఓ కొత్త జీవితానికి నాంది పలకాలంటూ ప్రోత్సహించడంతో ఇప్పుడిప్పుడే వారిలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం ప్రారంభమైంది. ఆయా శరణార్థుల నైపుణ్యాలను బట్టి వారికి తగిన ఉద్యోగాలివ్వడం, కొందరి చేత పేయింటింగ్ వంటి పనులతో నిమగ్నమయ్యేలా చేశారు. దీంతో వారు ఫేస్ చేస్తున్న మానసిక సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి సదరు మానవతా సంస్థలు. ఈ మేరకు ఆయా మానవతా సంస్థల జనరల్ కోఆర్డినేటర్ లిజ్ డివైన్ మాట్లాడుతూ..మోల్డోవాలోని ఉక్రేనియన్ శరణార్థులలో 86 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు. వారి భర్తలు, కుమారులు, సోదరుడు ఉక్రెయిన్‌లో పోరాడటానికి లేదా ఇతర సహాయ నిమిత్తం అక్కడే ఉన్నారు. దీంతో వారిలో సహజంగా 'ఒంటరి' అనే భావన కలుగుతుంది. ఆ తర్వాత తెలయకుండానే ఆందోళనతో కూడిన ఒత్తిడికి గురై ఈ సర్వైవర్ సిండ్రోమ్కి గురవ్వుతారు. అందుకే వారిని ఏదో ఒక పనిలో బిజీ చేసి చుట్టు ఉన్నవాళ్లే తమ వాళ్లుగా స్వీకరించేలా సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు లిజ్ డివైన్. (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
వెస్ట్‌బ్యాంక్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్‌బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్‌లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్‌లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్‌నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్‌బ్యాంక్‌లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్‌ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్‌లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్‌లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్స్‌లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు నెతన్యాహూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ
కుటుపలోంగ్: మయన్మార్ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని కుటుపలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే మయన్మార్ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు. -
శరణార్థి దినోత్సవం రోజు ప్రియాంక స్పెషల్ వీడియో
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. జూన్20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె ఇటీవల ఇథియోపియాలోని చిన్నారులను కలిశారు. వారితో గడిపిన క్షణాలను భావోద్వేగపూరిత వీడియో ద్వారా షేర్ చేస్తూ ‘‘ఈ ప్రపంచం భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లో ఉంది. కానీ, వాస్తవం ఏమిటంటే... ఈ అమాయక పిల్లలు ప్రస్తుతం తమ భవిష్యత్ పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా జీవనం సాగిస్తున్నారు. అనేక కుటుంబాలు హింస, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను విడిచి, వలస బాట పడుతున్నారు. మనం వారి పక్షాన నిలబడి, వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’’ అని అన్నారు. అదేవిధంగా ‘‘ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం కావునా ప్రపంచంలోని శరణార్థులందరికీ నా ప్రేమను పంచుతున్నాను. మీరు మీ ప్రతి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని కాంక్షిస్తున్నాను’’ అని 36 ఏళ్ల ప్రియాంక అన్నారు. యూనిసెఫ్‌లో భాగంగా ప్రియాంక జోర్డాన్, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిభిరాలకు వెళ్లి వచ్చారు. View this post on Instagram The truth is quite simple...the future of this world lies in the hands of the children of today. But the harsh reality is that there is an entire generation of innocent children growing up right now without any prospects for thier future...these children are affected by displacement due to serious conflict and emergencies in thier various regions. When families are forced to leave their homes due to violence, persecution, and natural disasters, they are torn apart and it's the children that end up suffering the most. The numbers are staggering, yes...but we have to continue to stand for them, in whatever capacity we can as individuals. They are the future and we need to help. Join me and @unicef by clicking the link in my bio to help keep refugee children safe. #AChildIsAChild #WorldRefugeeDay A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 19, 2019 at 10:41pm PDT -
ముస్లింలను పరామర్శిస్తావా...?
ముంబై : మంచి పని చేసినా దానికి మతం రంగు పులమడం నిజంగా విచారకరం. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటి ప్రియంక చోప్రా. ఈ బాలీవుడ్ హీరోయిన్ను యూనిసెఫ్ బంగ్లాదేశ్ పిల్లల హక్కుల ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓ వైపు ప్రియాంక పోస్టు చేసిన ఈ ఫోటోలకు దాదాపు 6 లక్షలకు పైగా లైక్స్ రాగా, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఇది సెల్ఫీ స్టంట్లా, పబ్లిసిటీ స్టంట్లా ఉందంటూ విమర్శలు గుప్పించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ముస్లిం పిల్లలకు సహయం చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక మన దేశంలో ఉన్న శరణార్ధులను ఎప్పుడైనా కలుసుకున్నారా?. కాశ్మీరీ పండిట్లు స్వయంగా మన దేశంలోనే శరాణార్ధులుగా బతుకుతున్నారు. వారిని ఎప్పుడైనా సందర్శించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించగా, మరికొందరు మాత్రం ప్రియాంక చేసిన పనిని మెచ్చుకున్నారు. యూనిసెఫ్ టీ షర్టుతో చిన్నారులను పలకరిస్తున్న ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాక ఈ ఫోటోలో ఒక చిన్నారి తాను ఆడుకునే బొమ్మ టీ కప్పును ప్రియాంకకు ఇవ్వగా, ప్రియాంక ఆ కప్పును తీసుకుని తాగుతున్నట్లు చేశారు. ఈ ఫోటోతో పాటు ప్రియాంక ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయిన ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి వద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. మనం వారి పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. -
అక్కడ మగవారూ అత్యాచార బాధితులే...
వాషింగ్టన్ : యుద్ధం ఎంతో ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది.. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఇవన్ని ప్రపంచానికి కనిపించే నష్టాలు. యుద్ధం మాటున ప్రపంచానికి కనపడని హింస ఎంతటి భయంకరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే సిరియాలో తాండవిస్తున్నాయి. యుద్ధంలో సైనికులు ఒక్కసారే చస్తారు, కానీ అక్కడి ప్రజలు ప్రతినిత్యం చస్తూ బతుకుతున్నారు. యుద్ధంలో కొందరు శరీరావయవాలను కోల్పోతారు, కానీ అక్కడ ఆత్మనే కోల్పోతున్నారు. మనకు మనమే మలినమయ్యామనే భావన ఎంత భయంకరమో అత్యాచారాలకు గురవుతున్న సిరియా మహిళలు చెప్తారు. ఎందుకంటే సిరియా అంతర్యుద్ధంలో పావులుగా మారి బలవుతున్నది వారే కాబట్టి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ఒళ్లు గగుర్పొడిచే నిజాలను వెల్లడించింది. ఆ నివేదిక చూస్తే మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం వస్తుంది. ఈ నివేదికలో హింసకే హింసను చూపించే సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచాన్ని నివ్వెరపరిచే అరాచకాలకు సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ నివేదికలో. బషర్ అసద్ నేతృత్వంలో సిరియన్ ప్రభుత్వ దళాలు చేస్తున్న అరాచకాలను బయటపెట్టింది ఈ నివేదిక. తన శత్రువులను అవమానించడానికి, బాధించడానికి వారు లైంగిక వేధింపులను, అత్యాచారాలనే మార్గంగా ఎన్నుకున్నారు. ఈ రిపోర్టులో ఉన్న కథనాలన్ని ఊహించి రాసినవి కాదు. దాదాపు 450మందితో మాట్లాడి, తెలుసుకున్న వారి భయంకరమైన అనుభవాలే ఈ కథనాలు. అన్ని భయంకరమైన లైంగిక వేధింపులకు సంబంధించినవే. ఇంటిని సోదా చేసే నెపంతో ప్రభుత్వం తమ ఒంటిని ఎలా ఆక్రమిస్తుందో తెలిపే విషాదగాథలు. ఇక్కడి వ్యవస్థ అత్యాచారం, లైంగిక అవమానాలను తప్పుగా పరిగణించట్లేదు. పైగా వాటినే ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ సాయుధ దళాలను, కుటుంబ వ్యవస్థను నిర్విర్యం చేస్తుంది. ఈ నివేదిక బాధితులు ఎంత భయంకరంగా అత్యాచారాలకు గురియ్యారో వెల్లడిస్తుంది. తమను శత్రువులుగా భావించి ఇంటిని సోదా చేయాలనే నేపంతో అధికారులు ఎలా తమపై అత్యాచారాలు చేశారో వివరించారు బాధితులు. ఒక మహిళ వీటి గురించి చెప్తూ ‘నా ఇంటిని సోదా చేశారు. ఒక సెక్యూరిటీ అధికారి నన్ను నా గదిలోకి వెళ్లమని చెప్పి నా వెనకే వచ్చాడు. అతను నన్ను తిడుతూ, అతను చెప్పినట్లు చేయమని ఆదేశించాడు. అతడు నన్ను అపవిత్రం చేశాడు...నేను ఇక ఎన్నటికీ పవిత్రంగా మారలేను. నేను చాలా అరిచాను, కానీ ఎవ్వరూ నన్ను కాపాడ్డానికి రాలేదు’ అంటూ విలపించింది. కొన్నిసార్లు వారిని నగ్నంగా వీధుల్లోని యుద్ద ట్యాంకులకు ముందు నడిపించారు. తనను తన అన్న కళ్లముందే అత్యాచారం చేశారని ఒక స్త్రీ ఇంటర్వ్యూ చేసేవారితో చెప్పింది. తనను తన భర్త, ముగ్గురు పిల్లల ఎదుటే అత్యాచారం చేశారని మరో స్త్రీ చెప్పింది. తమ కుటుంబాల్లోని మగవారిని లొంగిపోయేలా వారిని ఒప్పించడం కోసం కొన్నిసార్లు స్త్రీలను, బాలికలను నిర్భంధ గృహాలకు తీసుకెళ్లెవారు. ప్రత్యర్థులు ఉండే ప్రాంతాల్లో, గవర్నమెంట్ చెక్పాయింట్లలో ఉండే అధికారులు కూడా మహిళలను, పిల్లలను ఇలానే వేధించేవారు. వీరందరిరిని గుంపులుగా తరలించే సమాయాల్లో కొందరిని వేరు చేసి వారిపై అత్యాచారాలు జరిపేవారు. కేవలం మహిళలు, పిల్లలే కాదు మధ్యవయస్సు స్త్రీలను కూడా వారు వదల్లేదు. వారిని కూడా ‘సునిశితంగా వెతికేవారు’. ‘ఒక మిలిటరీ అధికారి నన్ను బెస్మెంట్లోకి తీసుకెళ్లి కొట్టాడు, అతడు నా ఛాతీ, జననాంగాలను తాకాడు’ అంటూ ఒక మధ్యవయస్కురాలు తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. మరో స్త్రీ తనకు ఎదురైన మాటలతో చెప్పడానికి వీలుకాని అత్యంత హేయమైన చేదు అనుభవాన్నివివరించింది. నిండా 9ఏళ్లు లేని బాలికల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ స్త్రీలనే కనికరం కూడా చూపలేదు. వారిపై కూడా అత్యాచారాలను కొనసాగించారు. ఎన్నో ప్రాణాలు తల్లి కడుపులోను తుదిశ్వాస విడిచాయి. మహిళందరినీ నగ్నంగా చేసి జనాల ముందు నిలబెట్టెవారు. అంతటితో ఆగక మగ అధికారులు వారి జననాంగాలను తాకుతు హేయంగా ప్రవర్తించేవారు. నిర్బంధ గృహాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, వారి సున్నిత శరీరావయవాలను కరెంటు షాక్‌కు గురిచేసేవారు. కొందరు సామూహిక అత్యాచారాలకు గురయ్యారు. ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే. వారి చేతుల్లో మలినమవ్వకుండా ఉండేందుకు ఒక స్త్రీ తానే తన శరీరాన్ని రక్తం, మూత్రము, పురుగులతో కప్పుకుంది. వేలాది మంది మహిళలను, పిల్లలను నిర్బంధించారు. వారిలో లాయర్లు, జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తల బంధువులు ఉన్నారు. వారిని కూడా ప్రత్యర్థులుగా, సాయుధ దళాలకు చెందిన వారిగా అనుమానిస్తూ నిర్బంధించేవారు. కేవలం స్త్రీలే కాదు నిర్బంధ గృహాల్లోని పురుషులపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అధికారులు వారి వినోదం కోసం బంధించిన మగవారి శరీరంలోని సున్నిత ప్రదేశాల్లోకి పైపులను, రాడ్లను తోస్తున్నారు. వారి మగ బంధువులతో కలవమంటున్నారు. ఈ మధ్య ప్రభుత్వ దళాలు వాయుదాడులకు మారడంతో 2015 నుంచి ఈ సంఘటనలు కాస్తా తగ్గాయి. ఇవన్ని ఒక్కచోట జరిగిన సంఘటనలు కావు. దారా, హామ్స్, డమాస్కస్, లటాకియా దాదాపు ఇలా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు. జరిగిన నేరాలన్నీ బాధితుల మీద ఎలాంటి ప్రభావం చూపాయి అన్నది ఈ నివేదికలోని మరో ముఖ్యమైన అంశం. జరిగిన సంఘటనలు వారి మనసులో తప్పుచేశామనే భావాన్ని నింపాయి. వారంతా జీవితం పట్ల నిరాశాతో ఉన్నారు. మహిళలు, పిల్లలు తమను తాము తమ కుటుంబాలకు అగౌరవంగా భావిస్తున్నారు. ఒక స్త్రీ అత్యాచారానికి గురికావడం కంటే చనిపోవడం మేలని భావించే వాతావరణంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతుండటంతో.. కొన్ని సందర్భాల్లో బాధితుల కుటుంబసభ్యులే వారిని అవమానిస్తున్నారు. వారినే నిందితులుగా చూస్తున్నారు. కొంతమంది పురుషులను నపుంసకులుగా మార్చారు. దీనివల్ల వారు అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి మిగితా వారితో కలవలేకపోతున్నారు. అత్యాచారానికి గురైన చాలామంది స్త్రీలు, బాలికలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. లైంగిక వేధింపులకు భయపడి చాలా కుటుంబాలు వేరే ప్రదేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. సిరియా ప్రభుత్వం వీటన్నింటి గురించి తెలిసి కూడా తెలియనట్లు నటిస్తుంది. ఈ అకృత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు అనేదే ఇప్పుడు ప్రపంచదేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న! -
పొరపాటున బాంబేశారు..100 మంది మృతి
నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్ గవర్నమెంట్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. -
ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికులు మృతి
నీయామీ: శరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. ఈ ఘటన నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతం టస్సారా వద్ద చోటుచేసుకుంది. మాలి శరణార్దులకు రక్షణ కల్పిస్తున్న సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. అయితే ఈ ఘటనపై నైగర్ ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ.. నైగర్స్ నేషనల్ టెలివిజన్ గురువారం రాత్రి సైనికులపై దాడి జరిగిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైనికులు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు మాలి ఉత్తరప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు.