
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. జూన్20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె ఇటీవల ఇథియోపియాలోని చిన్నారులను కలిశారు. వారితో గడిపిన క్షణాలను భావోద్వేగపూరిత వీడియో ద్వారా షేర్ చేస్తూ ‘‘ఈ ప్రపంచం భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లో ఉంది. కానీ, వాస్తవం ఏమిటంటే... ఈ అమాయక పిల్లలు ప్రస్తుతం తమ భవిష్యత్ పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా జీవనం సాగిస్తున్నారు.
అనేక కుటుంబాలు హింస, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను విడిచి, వలస బాట పడుతున్నారు. మనం వారి పక్షాన నిలబడి, వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’’ అని అన్నారు. అదేవిధంగా ‘‘ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం కావునా ప్రపంచంలోని శరణార్థులందరికీ నా ప్రేమను పంచుతున్నాను. మీరు మీ ప్రతి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని కాంక్షిస్తున్నాను’’ అని 36 ఏళ్ల ప్రియాంక అన్నారు. యూనిసెఫ్‌లో భాగంగా ప్రియాంక జోర్డాన్, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిభిరాలకు వెళ్లి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment