Instagram Videos
-
భార్యకు రీల్స్ మోజు.. భర్త చేతిలో హతం
దొడ్డబళ్లాపురం: ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. -
ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకౌంట్ ఆప్టిమైజేషన్ అకౌంట్‌కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్‌గా అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్‌ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ల వాడకం మీ అకౌంట్‌ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి. కచ్చితమైన సమయంలో.. రోజులో ఏ సమయానికి పోస్ట్‌లు అప్లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్‌లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి. లైవ్ వీడియోస్ చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్‌కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! కంటెంట్‌పై దృష్టి కొంతమంది తమ బ్రాండ్‌ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్‌పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి. -
ఇన్స్టాగ్రామ్ రీల్స్ .. థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
థర్డ్ పార్టీ యాప్‌తో అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ (అండ్రాయిడ్, ఐవోఎస్)లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి.. ∙ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తరువాత డౌన్లోడ్ చేయాలనుకున్న ‘రీల్’ ప్లే చేయాలి. ∙షేర్ ఐకాన్(పేపర్ ప్లేన్) క్లిక్ చేయాలి. యాడ్ రీల్స్–క్లిక్ నెక్ట్స్ పేజీ టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ క్లిక్ చేయాలి. ‘సేవ్ నౌ’ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ‘రీల్’ ఇన్స్టాగ్రామ్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ అవుతుంది. మోటో వాచ్ మోటోరోలా త్వరలో మోటో వాచ్ 200 తీసుకురానుంది. దీని వివరాలు..డిస్ప్లే: 1.78 అంగుళాలు బ్యాటరీ: 355 ఎంఏహెచ్ 5 ఏటియం వాటర్‌ప్రూఫ్; హార్ట్‌రేట్ మానిటర్ ఎస్పీవో2 మీటర్ బ్లూటూత్: 5.3 ఎల్ఈ; బిల్డ్–ఇన్ జీపిఎస్ మైక్రోఫోన్, స్పీకర్ కలర్స్: బ్లాక్ అండ్ గోల్డ్ వివో ఎక్స్90 ప్రో డిస్ప్లే: 6.78 అంగుళాలు రిజల్యూషన్: 2800“1260 పిక్సెల్స్ రిఫ్రెష్‌రేట్: 60 హెచ్జడ్, 120 హెచ్జడ్ బ్లూటూత్: 5.3 బ్యాటరీ: 4,870 ఎంఏహెచ్ కలర్: లెజెండర్ బ్లాక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా: 32–మెగా పిక్సెల్స్ -
లగ్జరీ కారు, బైక్‌లతో హల్చల్.. 77వేలు ఫైన్ వేసి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యూత్.. బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా కొందరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఓవరాక్షన్ చేయగా ట్రాఫిక్ పోలీసులు వారిని ఏకంగా 77వేల జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో హాపూర్‌లో నడిరోడ్డుపై కొందరు యువకులు హల్చల్ చేశారు. బెంజ్ కార్లు, బైక్‌లపై వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం నానా హంగామా క్రియేట్ చేశారు. హైస్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ పక్కన వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియోలు హాపూర్ ఎస్సీ అభిషేక్ వర్మ దృష్టికి చేరాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారి వాహనాలు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను గుర్తించి యువకులకు రూ.77,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ ప్రకారం.. వారికి జరిమానా విధించినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు. లేకపోతే భారీ జరిమానాలు సహా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు హెచ్చరించారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..
ఇన్స్టాగ్రామ్ ‘2022 రీక్యాప్’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్లెట్తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్ రీల్’ హైలెట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్’ చేసేసుకోండి. దీని కోసం... 1. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్‌లోని ప్లేబటన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి 2. న్యూ రీల్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లోని కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి 3. రీల్ క్రియేషన్ టూల్స్ ఓపెన్ అయిన తరువాత స్క్రీన్ బాటమ్‌లో నచ్చిన టెంప్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి 4. స్క్రీన్ బాటమ్‌లోని యూజ్ టెంప్లెట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే! -
ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్
Surekha Vani Trolled By Netizens For Instagram Video: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన వివిధ రకాల వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ నటించి సరైనోడు చిత్రంలోని 'తెలుసా తెలుసా' సాంగ్‌కు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ వయ్యారంగా వీడియో చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్స్ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. 'ఆంటీ అవసరమా ఈ సాంగ్స్ మీకు', 'ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు', 'సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే చేసుకుంటాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.' అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు. చదవండి: అతడెవరని అడిగిన నెటిజన్‌కి సుప్రిత స్ట్రాంగ్ కౌంటర్ View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
ఓర్నీ ఇదేందయ్యా ఇది.. నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు
Belly Dance.. పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు కదా.. ఈ సామెతను న్యాయం చేశారు. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైనా పార్టీలోనే జోష్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన తర్వాత సంతాప సభలో బెల్లి డ్యాన్స్‌లు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. చనిపోయిన ఓ వ్యక్తికి నివాళి సభ జరుగుతోంది. మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు సభను ఏర్పాటు చేశారు. ఈ నివాళి సభకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు విచ్చేశారు. ఇంతలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యేలా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పోకిరీ(హిందీ రీమేక్) సినిమాలోని ఐటెమ్ సాంగ్‌ను ప్లే చేశారు. ఇంతవరకు బాగానే.. పాట ప్లే అయిన వెంటనే కొందరు యువతులు స్టేజ్ మీదకు వచ్చి బెల్లీ డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో సభలో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. సంతాప సభలో ఇదేం పని రా నాయనా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోరిక మేరకు ఇలా వైరటీగా ప్లాన్ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meemlogy (@meemlogy) ఇది కూడా చదవండి: వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్! కారణం ఉందండోయ్.. -
ఇన్‌స్టా రీల్స్ సోషల్ మీడియలో పెడతానంటూ.. లైంగిక వేధింపులు
సాక్షి, తమిళనాడు: నమ్మి స్నేహం చేసిన యువతిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకోవాలని చూశాడో వ్యక్తి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్ గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురైకి చెందిన ఓ యువతికి సంతోష్ కుమార్ అనే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో రెండేళ్ల క్రింతం పరిచియం ఏర్పడింది. వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు(రీల్స్) చేయడం మొదలుపెట్టారు. వారిద్దరు కలసి సన్నిహితంగా ఉంటూ చేసిన పలు వీడియోలను సోషల్ మీడియోలో పెడతానని సంతోష్ బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించాడు. అంతటిలో ఆగకుండా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని యువతి తన తల్లిదండ్రులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. యువతి తల్లి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మరో ఫీచర్, ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
వినియోగదారులకు అనుగుణంగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు డెస్క్ టాప్‌పై దర్శనమివ్వబోతున్నాయి."మాకు తెలుసు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ తో పాటు డెస్క్‌టాప్‌లో రీల్స్‌ను షేర్ చేయాలని చూస్తున్నారు. వారి కోసమే డెస్క్‌టాప్ ఫీచర్‌ను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రీల్స్‌ను రికార్డ్ చేసి.. డెస్క్ టాప్ ద్వారా అప్లోడ్ చేయోచ్చు"అని ఇన్స్టాగ్రామ్ స్పోక్ పర్సన్ అధికారికంగా ప్రకటించారు. రీల్స్‌ను ఎలా అప్లోడ్ చేయాలి. ♦ ఇన్స్టాగ్రామ్ ను మీకంప్యూటర్లో, లేదంటే ల్యాప్‌ట్యాప్ లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ ఇంటర్ ఫేస్‌లో ప్లస్ సింబల్‌ను క్లిక్ చేయాలి ♦ క్లిక్ చేసి సెలక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ♦ అనంతరం మీకు కావాల్సిన ఒరిజనల్ స్కైర్,ల్యాండ్ స్కేప్, పోట్రేట్ సైజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ సెలక్ట్ చేసుకున్న అనంతరం క్లిక్ నెక్ట్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. ♦ అలా ట్యాప్ చేస్తే ఫిల్టర్, ఎడిట్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. ♦ అనంతరం మీ వీడియోలకు, ఫోటోలకు క్యాప్షన్ రాసి, లోకేషన్ యాడ్ చేయాలి. ఆ తరువాత వీడియోని షేర్ చేసుకునే సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్ కల్పించింది. చదవండి: రేజర్‌పేతో ట్విటర్ జట్టు -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే...
భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్‌ను అదనుగా తీసుకున్న ఫేస్బుక్ తన వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది నెటిజన్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ మధ్యలో 30 సెకన్ల పాటు యాడ్స్ రానున్నాయి. జూన్ 18 నుంచి ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో రీల్స్ చూస్తోన్న యూజర్లకు కాస్త చికాకును కల్పించనుంది కాగా ఇన్స్టాగ్రామ్ ఏప్రిల్‌లోనే భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీల్లో తొలిసారిగా యాడ్ రీల్స్‌ను పరీక్షించింది. ఇది విజయవంతం కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సదుపాయాన్ని లాంచ్ చేసింది. యూజర్లకు కొత్త కంటెంట్‌ను కనుగొనడానికి, క్రియేట్ చేయడానికి రీల్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జస్టీన్ ఓసోఫ్స్కీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నిర్ణయంతో కంటెంట్ క్రియేటర్లకు మాత్రం పండగే..! ఇన్స్టాగ్రామ్ రీల్స్ మధ్యలో వచ్చే యాడ్స్‌తో కంటెంట్ క్రియేటర్లు డబ్బును సంపాందించనున్నారు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..! -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యూనివర్సల్ బాస్..
మాల్దీవ్స్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మైదానంలో ఉన్నా, మైదానం వెలుపల ఉన్నా సందడి మాత్రం కామన్‌గా కనిపిస్తుంటుంది. క్రికెట్ గ్రౌండ్లో బౌండరీలు, సిక్సర్లతో అలరించే ఈ విండీస్ విధ్వంసకర వీరుడు.. మైదానం వెలుపల రకరకాల డ్యాన్సులు చేస్తూ, తనలో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను బయటపెడుతూ.. ఫ్యాన్స్ కావాల్సిన కనువిందును అందిస్తుంటాడు. భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడటంతో మాల్దీవుల్లో సేదతీరేందుకు బయల్దేరిన ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. అక్కడ తనలో దాగి ఉన్న మరో కళను ఆవిష్కరించాడు. ఎగిసిపడుతున్న సముద్రపు అలలపై జెట్ స్కీయింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రచ్చరచ్చ చేశాడు. స్కీయింగ్ చేస్తూ, చేతిలో సిగార్‌తో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా గంటల వ్యవధిలో 1.3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో అతని స్టామినా ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా, దానికి కూడా రెండు లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే, తమ దేశంలో అంక్షల కారణంగా ఐపీఎల్లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లు కూడా కొద్ది రోజుల పాటు మాల్దీవుల్లోనే గడిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్లంతా స్వదేశానికి చేరుకోగా యూనివర్సల్ బాస్ మాత్రం మరికొద్ది రోజులు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడట. చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్.. View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) -
'బేబీ! నేను ఎప్పటికి నీదాన్నే'
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్‌లోనే ఉంటాడు. తను పెట్టే పోస్టులతో పాటు తన భార్య సాక్షి సింగ్ పెట్టే పోస్టుల్లోనూ తరచుగా కనిపిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ధోని కంటే సాక్షినే సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉంటారన్న సంగతి చెప్పనవసరం లేదు. తన భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన అభిమానులతో పాటు ధోని అభిమానుల మనసును గెలుచుకుంటారు. తాజాగా ధోని అభిమానులు తమ ట్విటర్లో ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ధోని తన భార్య సాక్షినుద్ధేశించి' నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్ జాబితాలో నన్ను కూడా చేర్చావుగా' అంటూ ట్రోల్ చేశాడు. దీంతో రూంలో ఉన్న మిగతావారు గొల్లున నవ్వేసరికి సాక్షి ధోని దగ్గరకు వచ్చి ' బేబీ ! నాకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికి నీ దాన్నే' అని పేర్కొన్నారు.(‘ధోని సీటును అలానే ఉంచాం’) కాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గతేడాది జూన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఒక్క మ్యాచ్ ఆడని ధోనికి బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్‌లో చోటు లభించలేదు. దీంతో అతని కెరీర్‌పై అభిమానుల్లో సందిగ్థత నెలకొన్న ఇప్పటి వరకు ధోని తన రిటైర్మంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. .@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai... @SaakshiSRawat : All your followers love me also no.. Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH — MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020 -
శరణార్థి దినోత్సవం రోజు ప్రియాంక స్పెషల్ వీడియో
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. జూన్20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె ఇటీవల ఇథియోపియాలోని చిన్నారులను కలిశారు. వారితో గడిపిన క్షణాలను భావోద్వేగపూరిత వీడియో ద్వారా షేర్ చేస్తూ ‘‘ఈ ప్రపంచం భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లో ఉంది. కానీ, వాస్తవం ఏమిటంటే... ఈ అమాయక పిల్లలు ప్రస్తుతం తమ భవిష్యత్ పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా జీవనం సాగిస్తున్నారు. అనేక కుటుంబాలు హింస, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను విడిచి, వలస బాట పడుతున్నారు. మనం వారి పక్షాన నిలబడి, వారి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలి’’ అని అన్నారు. అదేవిధంగా ‘‘ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం కావునా ప్రపంచంలోని శరణార్థులందరికీ నా ప్రేమను పంచుతున్నాను. మీరు మీ ప్రతి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని కాంక్షిస్తున్నాను’’ అని 36 ఏళ్ల ప్రియాంక అన్నారు. యూనిసెఫ్‌లో భాగంగా ప్రియాంక జోర్డాన్, బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిభిరాలకు వెళ్లి వచ్చారు. View this post on Instagram The truth is quite simple...the future of this world lies in the hands of the children of today. But the harsh reality is that there is an entire generation of innocent children growing up right now without any prospects for thier future...these children are affected by displacement due to serious conflict and emergencies in thier various regions. When families are forced to leave their homes due to violence, persecution, and natural disasters, they are torn apart and it's the children that end up suffering the most. The numbers are staggering, yes...but we have to continue to stand for them, in whatever capacity we can as individuals. They are the future and we need to help. Join me and @unicef by clicking the link in my bio to help keep refugee children safe. #AChildIsAChild #WorldRefugeeDay A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 19, 2019 at 10:41pm PDT -
ఆస్ట్రేలియా కెప్టెన్ ఇరగదీశాడు!
న్యూయార్క్: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా క్రికెట్ ప్రేమికులకు చెప్పాల్సిన అవసరం లేదు. మైదానం నలుమూలల షాట్లు బాదుతూ పరుగులు పిండుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. స్మిత్ వికెట్ తీయడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా ఆడుతూ జట్టును గట్టెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. అత్యున్నత ప్రతిభతో స్వల్ప కాలంలోనే ఆసీస్ జట్టుకు నాయకుడిగా ఎదిగారు. న్యూయార్క్‌లో తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో స్మిత్ పోస్టు చేశారు. ఒక్క బంతిని కూడా వదలకుండా స్మిత్ ఆడిన షాట్లు అభిమానులను అలరిస్తున్నాయి. అయితే క్రికెట్ బ్యాటుతో కాకుండా సన్నగా ఉండే బేస్‌బాల్ బ్యాటుతో ఒక్క బాల్ కూడా మిస్ కాకుండా స్మిత్ కొట్టడం విశేషం. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయినా ఎడమచేతితోనూ బంతిని బలంగా బాదడం మరో విశేషం. టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్మిత్ వన్డేల్లో 13వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన ఆయన ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గానూ రాణించారు. That's outta here ⚾️⚾️⚾️ A post shared by Steve Smith (@steve_smith49) on Jun 27, 2017 at 7:24pm PDT