
Surekha Vani Trolled By Netizens For Instagram Video: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన వివిధ రకాల వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అల్లు అర్జున్ నటించి సరైనోడు చిత్రంలోని 'తెలుసా తెలుసా' సాంగ్‌కు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ వయ్యారంగా వీడియో చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్స్ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. 'ఆంటీ అవసరమా ఈ సాంగ్స్ మీకు', 'ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు', 'సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే చేసుకుంటాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.' అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు.
చదవండి: అతడెవరని అడిగిన నెటిజన్‌కి సుప్రిత స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment