
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం(జనవరి 7న) నాడు కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె అనంతరం ఏడుకొండల వెంకన్నను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది. ఈ క్రమంలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంది. దర్శనానంతరం సురేఖావాణి గుండుతో కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె ఈ మధ్య మాత్రం సినిమాల సంఖ్య తగ్గించేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. అటు సురేఖ కూతురు కూడా నెట్టింట తెగ హడావుడి చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment