ఈ మధ్య కాలంలో అందరూ ఓ మూవీ గురించి తెగ మాట్లాడుకున్నారు. స్టిల్ ఇప్పటికీ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. అదే 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత‍్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో జోరు చూపిస్తోంది. అలానే చాలామందిని ఎమోషనల్ చేస్తోంది. ఇప్పుడు సురేఖావాణి కూతురిది కూడా అదే పరిస్థితి.
'బేబీ' కథ
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల స్పూర్తితో తీసిన 'బేబీ'. కథ విషయానికొస్తే.. బస్తీలో ఉండే ఓ అమ్మాయి స్కూల్ చదువుతూ ఎదురింట్లో ఉండే కుర్రాడిని లవ్ చేస్తుంది. పదో క్లాస్ పాస్ అయి, ఈమె కాలేజీకి వెళ్తుంది. మనోడు ఫెయిలై, ఆటో డ్రైవర్ అవుతాడు. ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన ఆ అమ‍్మాయి.. అక్కడ మరో అబ్బాయితో రిలేషన్‌లోకి వెళ్తుంది. ఇది ఆటో డ్రైవర్ కుర్రాడికి తెలుస్తుంది. చివరకు ఏమైందనేది 'బేబీ' స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?)
అంతలా ఏడ్చాను
ఈ సినిమా చూసిన వాళ్లలో యూత్ చాలామంది 'బేబీ'కి కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రీత మూవీ చూసింది. తన అభిప్రాయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. 'ఏమైన్నా సినిమానా ఇది. ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సీన్‌కి కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఇది చెప్పగలను. ఒట‍్టేసి చెబుతున్నా. వైష్ణవి చైతన్య అదరగొట్టేసింది. ఆమెని చూస్తే గర్వంగా ఉంది. ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఈ మధ‍్య నేను ఇంతలా ఏడ్చిన సినిమా మరొకటి లేదు' అని సుప్రీత రాసుకొచ్చింది.
'బేబీ' కలెక్షన్స్
సింపుల్ బడ‍్జెట్‌తో తీసిన 'బేబీ' అనుహ్యంగా కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈచిత్రం.. ఆరో రోజు కూడా అదే టెంపో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.43.8 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప‍్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా.. వసూళ్లు ఒకేలా వస్తుండటం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment