
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత దాదాపు తెలుగువారికి సుపరిచితమే. ఆమె త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుంది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు విషెస్ తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. ఇంతకీ సుప్రీత చేసిన తప్పేంటి। ఎందుకు క్షమాపణలు చెప్పిందో తెలుసుకుందాం.
ఇటీవల కొద్ది రోజులుగా పలువురు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీత సైతం తాను కూడా తెలిసో, తెలియక బెట్టింగ్ ప్రమోట్ చేశానని తెలిపింది. ఇక నుంచి అలా చేయడం లేదని.. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎవరూ కూడా అలాంటి యాప్స్‌ను ఎంకరేజ్ చేయొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు.. అలాంటి వారికి సోషల్ మీడియాలో కూడా దూరంగా ఉండండి అంటూ వీడియో సందేశం ఇచ్చింది.
సుప్రీత మాట్లాడుతూ..' కొంతమంది తెలిసో, తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. అందుకే ఈ విషయంలో అందరికీ క్షమాపణలు కోరుతున్నా. ఎవరైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవీ చూసి వాటిని అనుసరించకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. వారిని సోషల్ మీడియాలో ఫాలో కావొద్దు. అందరికీ థ్యాంక్యూ. అలాగే మీ అందరికీ మరోసారి సారీ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment