
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు.
పొట్టి దుస్తుల్లో వీరు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయి చివరకు ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉంటుంది సుప్రిత. తాజాగా తన జీవిత భాగస్వామిని నెటిజన్లకు పరిచయం చేసి షాకిచ్చింది.
ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అతని ప్రేమకు ఓకే చెప్పాను అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీతం షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సుప్రీత ప్రియుడి పేరు రాకీ జోర్డాన్ కాగా అతను నటుడు, ర్యాపర్ అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment