ఇన్‌స్టాగ్రామ్ ‘2022 రీక్యాప్’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్‌లెట్‌తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్ రీల్’ హైలెట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్’ చేసేసుకోండి.
దీని కోసం...
1. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్‌లోని ప్లేబటన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి
2. న్యూ రీల్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లోని కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి
3. రీల్ క్రియేషన్ టూల్స్ ఓపెన్ అయిన తరువాత స్క్రీన్ బాటమ్‌లో నచ్చిన టెంప్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి
4. స్క్రీన్ బాటమ్‌లోని యూజ్ టెంప్లెట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి.
క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
Comments
Please login to add a commentAdd a comment