create
-
మిమిక్రీ శాయవలే... ముంబైలో ఫ్లాట్ కొనవలే!
ఆలియా భట్ గొంతును అనుకరిస్తూ బోలెడు పాపులారిటీ సంపాదించింది 24 సంవత్సరాల కంటెంట్ క్రియేటర్ చాందిని భాబ్డా. ఈ పాపులారిటీనే ఆమెను ముంబైలో ఒక ఫ్లాట్‌కు ఓనర్‌ను చేసింది. సంప్రదాయ రీతిలో గృహప్రవేశంతో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాందిని. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2022లో ఆన్–పాయింట్ మిమిక్రీ క్లిప్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది చాందిని. సొంత ఇంటి కలతో మిమిక్రీ కళను నమ్ముకొని డబ్బులను పొదుపు చేసేది. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఈ ఫ్లాట్ కొనడానికి ఎన్నో ఇష్టాలను వదులుకొని, ఎలా డబ్బు పొదుపు చేసిందీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వివరించింది చాందిని. ‘ఫ్రెండ్స్ విదేశాలకు వెళుతున్నప్పుడు నాకు కూడా వెళ్లాలనిపించేది. బర్త్‌డే ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకోవాలనుకునేదాన్ని... ఇలాంటి ఎన్నో సందర్భాలలో ఇంటికల గుర్తుచ్చేది. పొదుపు చేయడం ఎప్పుడూ మానలేదు’ అని రాసింది చాందిని. -
మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"..
మనిషి తన టాలెంట్‌ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్‌ని సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్ పాట "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు. తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్‌లోని అల్బానీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్ పాడిన "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. అవి బ్రెయిన్లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్కోడింగ్ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్ ఆధారిత నమునాలను ఉపయోగించారు. తద్వారా స్పెక్ట్రోగ్రామ్(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్‌కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్‌ని ప్లే చేసి మరి ఆపరేషన్లు చేసిన ఉందంతాలను చూశాం. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023 -
వన్డేల్లో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డు
-
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..
ఇన్స్టాగ్రామ్ ‘2022 రీక్యాప్’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్లెట్తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్ రీల్’ హైలెట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్’ చేసేసుకోండి. దీని కోసం... 1. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్‌లోని ప్లేబటన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి 2. న్యూ రీల్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లోని కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి 3. రీల్ క్రియేషన్ టూల్స్ ఓపెన్ అయిన తరువాత స్క్రీన్ బాటమ్‌లో నచ్చిన టెంప్లెట్‌ను ఎంపిక చేసుకోవాలి 4. స్క్రీన్ బాటమ్‌లోని యూజ్ టెంప్లెట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే! -
కలెక్షన్ల సునామి సృష్టించనున్న సలార్
-
మరో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: వస్తువుల, సేవల పన్ను (జిఎస్టి) అమలుకారణంగా భారీగా ఉద్యోగాలు లభించనున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బందరు దత్తాత్రేయ చెప్పారు. జీఎస్టీ వల్ల కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే లాభం చేకూరదని భారీగా ఉద్యోగాలను సృష్టించనుందని ఆయన చెప్పారు. తదుపరి మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని శనివారం మీడియాకు తెలిపారు. ప్రధానంగా అకౌంటెన్సీ రంగంలో దాదాపు 60వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలున్నాయని మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకటించారు. జీఎస్టీ అమలే ఒక చారిత్రక అధ్యాయమని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా బోర్డర్ చెక్ పోస్టులను రద్దు చేయడంతో, వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా ఆలస్యం కాదని పేర్కొన్నారు. జీడీపీ 7 నుంచి 9 శాతానికి పెరగనుందనీ, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని చెప్పారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు నేపథ్యంలో వివిధ సంస్థలతో అనుబంధంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన జీఎస్టీ వర్క్‌షాపు నిర్వహించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలకు 1,118 వర్క్ షాప్‌లను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో జిఎస్టీ ప్రయోగ కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై దత్తాత్రేయ మండిపడ్డారు. -
ట్రంప్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి
బెంగళూరు: యుఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంపై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని వ్యాఖ్యానించారు. దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు శనివారం వరుస ట్వీట్లలో ఐటీ కంపెనీల సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటా తదితర అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు. బెంగళూరులో దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు. బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో భారతీయ ఐటి కంపెనీలు ప్రపంచాన్ని జయించాయి, ఇప్పుడు భారతదేశంవైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ‘డిజిటల్ ఇండియా’తో విస్తృత మార్కెట్ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలవైపు చూడాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. కాగా బై అమెరికా, హైర్ అమెరికా అంటూ హెచ్-1బీ వీసాల విధానంపై కఠిన వైఖరి అనుసరిస్తున్న ట్రంప్ ఇటీవల కొత్త కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. తమ ఉద్యోగాలు తమకే కావాలన్న నినాదంతో వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. Opportunities in emerging areas of Artificial Intelligence, big data etc present a huge opportunity for Indian IT companies. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 Indian IT companies create jobs they do not steal jobs either in USA or in any other country. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 -
ట్రంప్ ఎఫెక్ట్: అమెరికాలో 15 వేల ఉద్యోగాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలకు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా ప్రభావితం కానుంది. అమెరికాలో 15,000 ఉద్యోగాలను కల్పించనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. అలాగే అమెరికాలో ఉద్యోగుల శిక్షణకోసం 10 ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీనికోసం 1.4 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. దీంతో 2020 నాటికి 65 వేలమందికిపైగా ఉద్యోగులతో అమెరికాలో తమ కంపెనీల ఉద్యోగుల శాతం 30శాతానికి పెరగనుందని పేర్కొంది. డబ్లిన్, ఐర్లాండ్ రాష్ట్రాల్లో టెక్ సేవలను అందిస్తున్న యాక్సెంచర్ భారతదేశంలోనే ఎక్కువ సిబ్బంది కలిగివుంది. దేశీయంగా 3 లక్షల ఎనభైవేలకు పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. కాగా హెచ్1బీ వీసాల ఆంక్షలు, అమెరికాలోని ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్న ట్రంప్ నిబంధనలతో ప్రముఖ ఐటీ, ఇతర సంస్థలు, భారత ఐటీ పరిశ్రమ ఆందోళన పడిపోయిన సంగతి తెలిసిందే. -
నకిలీ వీసాలు సృష్టిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏకంగా నకిలీ వీసాలనే సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురు సభ్యుల ముఠాను మల్కాజ్గిరి డీసీపీ రామచంద్రారెడ్డి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 45 నకిలీ పాస్‌పోర్ట్‌లు, రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
’షార్ట్ ఫిలిమ్స్‌తో గిన్నిస్ రికార్డ్స్‌కి ఎక్కాడు’
-
గ్రూప్ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..
గ్రూప్ భళి... అడ్మిన్ బలి - తేడా వస్తే..ల్లో అశ్లీల, అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు తెలిసీ తెలియక షేర్ చేస్తున్న ‘సోషల్ వినియోగదారులు’ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత హద్దు దాటితే శిక్ష తప్పదు సిటీబ్యూరో: మహారాష్ట్రలోని మరాట్వాడ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఏమిటో తెలుసా? ‘అడ్మిన్’గా ఉండటమే. ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన ఓ సందేశం ప్రచారమైంది.గ్రూప్ సభ్యురాలిగా ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పోస్ట్ చేసిన సభ్యుడితో పాటు గ్రూప్ అడ్మిన్నూ కటకటాల్లోకి పంపారు. వాట్సాప్ గ్రూప్‌లు ‘క్రియేట్’ చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన చెబుతోంది. విస్తరిస్తున్న వాట్సాప్... వాట్సాప్... సోషల్ మీడియాలో ఓ ప్రభంజనం. నెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఫోన్లోనూ ఇదీ ఉంటోంది. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత పరిమాణంలో ఉన్న వాయిస్, వీడియో ఫైల్స్‌తో పాటు ఫొటోలను మార్పిడి చేసుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంది. దీంతో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఇటీవల కాలంలో గ్రూపులూ పెరుగుతున్నాయి. ఒక సందేశాన్నో, ఫొటో/వీడియోనో ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి ఈ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యక్తిగతం నుంచి అధికారికం వరకు... స్నేహితులు.. ఓ ప్రాంతానికి చెందిన వారు... ఒకే రకమైన ఆలోచనా ధోరణి కలిగిన వారు... ఇలా ఎవరికి వారు వ్యక్తిగతమైన వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ కారణాలతో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ వెబ్ అందుబాటులోకి వచ్చాక గ్రూపుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గ్రూపులు ఇలా... వాట్సాప్‌లో ఓ గ్రూపును ఏర్పాటు చేయడం ఒకరి చేతిలోనే ఉంటుంది. గ్రూప్ క్రియేట్ చేయాలని భావించిన వ్యక్తి తన హ్యాండ్సెట్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటర్ (అడ్మిన్)గా వ్యవహరిస్తాడు. ఈ అవకాశాన్ని గ్రూపులో ఉండే మరికొందరికీ ఇచ్చే సౌలభ్యం ప్రధాన అడ్మిన్‌కు ఉంటుంది. ఆ గ్రూపులో ఎవరిని చేర్చుకోవాలి? అనేది అడ్మిన్ల చేతిలో ఉంటుంది. ఫోన్లో నిక్షిప్తం చేసిన పేర్లలోని ఎవరినైనా గ్రూపులో చేర్చుకోవచ్చు, తొలగించవచ్చు. సభ్యులందరికీ షేరింగ్ సౌలభ్యం... ఓ గ్రూపులో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ గ్రూప్‌లో సందేశం, ఫొటో, వీడియో, ఆడియోను షేర్ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్ అనుమతి, వారి ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్ అడ్మిన్‌కు తెలియకుండానే జరిగిపోతుంటాయి. వాటిని గ్రూప్‌లో చూసుకునే వరకు అడ్మిన్‌కు కూడా తెలిసే అవకాశం లేదు. అది నేరమే అడ్మిన్ అనుమతి... ప్రమేయం లేకుండా గ్రూపులోని సభ్యులు అభ్యంతరకర, అశ్లీల పోస్టింగ్, షేరింగ్ చేసినా అడ్మినిస్ట్రేటర్‌దే పూర్తి బాధ్యత. ఆ గ్రూపునకే చెందిన లేదా వేరే వ్యక్తులెవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే కటకటాల్లోకి చేరాల్సిందేనని మర్చిపోకూడదు. ఈ చర్యలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ కింద నేరాలే అవుతాయి. నిబంధనలు తెలుసా...? వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే డిస్క్లైమర్ను అంగీకరిస్తాం. అందులోని నిబంధనల ప్రకారం వాట్సాప్ సభ్యుడు, అడ్మిన్ కొన్ని రకాలసందేశాలు, ఫొటోలు, వీడియోలు హోస్ట్ చేయడం, పోస్ట్ చేయడం, డిస్ప్లేలు... మార్పు చేర్పులు... అప్డేట్ చేయడం... షేర్ చేయడం నిషేధం. అవి ఏంటంటే... 1. అధికారికంగా మరో వ్యక్తికి చెందినవి. 2. ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన అభ్యంతరకమైనవి. 3. ఓ మతం, వర్గం, వర్ణం, కులం, జాతులను కించపరిచేవి. 4. రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు రెచ్చగొట్టేవి. 5. మైనర్లకు హానికరమైనవిగా పరిగణించేవి. 6. శాంతిభ్రదతలు, ప్రజా జీవితానికి భంగం కలిగించేవి. 7. దేశ, జాతి, రాష్ట్ర సమగ్రతకు ముప్పుగా మారే పుకార్లు 8. కేసుల దర్యాప్తునకు ఆటంకంగా మారేవి. 9. వ్యక్తులు, గ్రూపులను టార్గెట్‌గా చేసుకుని బెదిరింపులు, హెచ్చరికలు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తాం వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యు లేట్ అవుతున్న అభ్యంతరకర, అశ్లీల, చట్ట వ్యతిరేక కంటెంట్ పై ప్రాథమిక సాక్ష్యాధారాలతో ఎవరు ఫిర్యాదు చేసినా ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఆ గ్రూప్‌లో దాన్ని షేర్ చేసిన వ్యక్తితో పాటు దాని అడ్మిన్ సైతం నిందితుడే అవుతాడు. ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంటుంది. - పి.రాజు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత ఓ గ్రూప్‌లో సర్క్యులేట్ అయిన అభ్యంతరకర, అశ్లీల కంటెట్‌కు దాని అడ్మినే బాధ్యుడు. గ్రూపులో ఉన్న సభ్యుడిని నొప్పించేలా పోస్టింగ్స్ ఉన్నా అంతే. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదవుతాయి. ఎంత మంది అడ్మిన్లు ఉన్నా... గ్రూప్ క్రియేట్ చేసిన ప్రధాన అడ్మిన్‌దే పూర్తి బాధ్యత. మిగిలిన వారికీ కొంతమేర బాధ్యత ఉంటుంది. - రామ్మోహన్ వేదాంతం ఐటీ యాక్ట్ న్యాయవాది, సైబర్ నిపుణుడు ఫేస్బుక్ తరహాలో ఉంటే మేలు మన ప్రమేయం లేకుండానే స్నేహితులు, ఇతరులు తమ వాట్సాప్ గ్రూప్లలోకి చేర్చుకోవడం అభ్యంతరకరం. గ్రూప్‌లలో పోస్టయ్యే సమాచారం, వీడియోలు, మెసేజ్‌లు, జోక్‌లు, కామెంట్స్ కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వీటికి గ్రూప్‌ను నిర్వహించే అడ్మిన్ బాధ్యత వహించాలనే విషయం చాలామందికి తెలియదు . కొన్నిసార్లు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫేస్‌బుక్‌లా రిక్వెస్ట్ పంపడం... ఆమోదించడం తరహాలో వాట్సాప్ యాజమాన్యం కూడా స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నియమ నిబంధనలు రూపొందించాలి. - అల్లిపురం రాజశేఖర్‌రెడ్డి, ఎమ్డీ, పైసా వసూల్ డాట్‌కామ్ అనుమతి అవసరం వాట్సాప్ గ్రూప్‌లతో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ఒక మెసేజ్‌ను పలువురు స్నేహితులకు పంపించడం ఇబ్బందిగా ఉంటుంది. నెట్ నూ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌లో అయితే క్షణాల్లో అందరికీ సమాచారం పంపవచ్చు . ఇక మనకు తెలియకుండానే గ్రూప్‌లో చేర్చుకోవడం, అసభ్య మెసేజ్‌లు చూడాల్సిరావడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం గ్రూప్ నుంచి ‘లెఫ్ట్’ అయితే ఆ జాబితాలో మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్ యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టి గ్రూప్‌లో చేర్చుకునేటప్పుడు మన అనుమతి ఉండేలా మార్పులు చేస్తేమంచిది. -గిరీష్మ, విద్యార్థిని, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ -
నానోసైన్స్ల్యాబ్ను రూపొందించిన ఎడ్యుల్యాబ్ సంస్థ
-
కావ్య ఆచూకీ కనిపెట్టేదెన్నడో..
తేరుకోని కె.తాడేపల్లి గ్రామం ప్రత్యేక గాలింపు బృందాలు ఏం చేశాయంటున్న స్థానికులు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చిట్టినగర్ : స్థానిక కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని యానాదుల పేటలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన పసుపులేటి కావ్య(5) అదృశ్యమై 25 రోజులు దాటినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావ్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో అపహరించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి గాలింపు చర్య లు సత్ఫలితాలు ఇవ్వలేదు. కనీసం చిన్నారి ప్రాణాలతోనైనా ఉందా? అనే అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. పోలీసుల బిజీ షెడ్యూలు, మంత్రుల పర్యటనలు, ఉత్సవాలతో వారి హడావుడి వారిదేనన్నట్లు మారి పోయింది. కావ్య సంగతి తమకు, స్థానికులకు తప్ప ఎవరికీ గుర్తులేదని, పోలీసులు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భయాందోళనలే.. కావ్య అదృశ్యమవడంతో పేటలోని ప్రతి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. చిన్న పిల్లలను ఒంటరి గా బయటకు వదలాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తమ పిల్లలను పక్క ఇంటి వారికి అప్పగించి వెళుతున్నారే తప్ప ఒంటరిగా వదిలి వెళ్లడం లేదు. పోస్టర్లు ఏమయ్యాయి.. కావ్య అదృశ్యమైన ప్పటి నుంచి పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తూ నే ఉంది. ఈ ఘటన జరిగాక చిన్నారి బంధువులను స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేయడంపాటు నామమాత్రం గా గాలింపు చర్యలు చేపట్టారని పలువురు విమర్శిస్తున్నారు. గాలింపు బృందాల ఏర్పాటు విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావ్య ఫొటోతో వాల్ పోస్టర్లను చుట్టుపక్కల గ్రామాలతోపాటు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కావ్య ప్రాణాలతో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుతుందని గ్రామస్తులతోపాటు కుటుంబీకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
సమైక్య సునామి సృష్టిద్దాం
వైవీయూ, న్యూస్‌లైన్ :సమైక్యవాదులు సృష్టించే సునామీలో విభజన వాదం కొట్టుకుపోతుందని ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహ కూడలి వద్ద సర్వమత సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పొటిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముస్లిం, హిందూ, క్రైస్తవ మతపెద్దలు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్సాహెబ్, విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి, ఫాదర్ కనకరాజుల ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీణా అజయ్‌కుమార్ మాట్లాడుతూ కులాలకు, మతాలతకు అతీతంగా మనమంతా ఒక్కటే, మనలక్ష్యం కూడా సమైక్యాంధ్ర ఒక్కటే అన్న నినాదంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు ప్రజలే నాయకులుగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఆందోళనల వేడి ఢిల్లీకి చేరడంతో డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందన్నారు. దీంతో సీమాంధ్ర నాయకులు, ప్రజలు శాంతించారన్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అలుపులేకుండా ఉద్యమాలు చేస్తూనే ఉండటంతో కేంద్రప్రభుత్వం వారిపట్ల మొగ్గుచూపిందన్నారు. అలా కాకుండా అప్పటి నుంచి సమైక్యవాదాన్ని కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ప్రస్తుతం ప్రతికుటుంబానికి హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడిందని, దాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ముస్లిం మతగురువు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్సాహెబ్ మాట్లాడుతూ అఖండ భారతావనిలో రాష్ట్రాలను ముక్కలుగా చేయడం తగదన్నారు. క్రైస్తవ మతగురువు కనకరాజు మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండే తెలుగుజాతిని చీల్చాలనుకోవడం తగదన్నారు. హిందూ మతపెద్దలు విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ ఉద్యమం విజయవంతం అవుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎన్జీఓ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ ఎస్.బి.అంజాద్‌బాషా, కాంగ్రెస్ నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, గౌస్‌పీర్, జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి ప్రసంగించారు. జయనగర్ కాలనీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ‘ఆలోచించండి ఓ విభజన వాదుల్లారా..’ అంటూ చేసిన నృత్యగీతం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్‌వర్మ, షంషుద్దీన్, సురేష్, ప్రకాష్, ఫారుఖ్, నవనీశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, రాణా, లోకా, ఓ. రవి, వై.రవి, సుబ్బారెడ్డి, అమెరికన్ మాంటిస్సోరి విద్యార్థులు, ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు, మార్వాడిసంఘ సభ్యులు పాల్గొన్నారు.