
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్‌లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో..
Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD
— Neeraj M (@being_happyyy) July 27, 2023