
పాట్న: కోపంతో ఉన్న ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా పలు వాహనాలను తన కొమ్ములతో దాడిచేసి బోర్లాకొట్టించింది. ఒక్కసారిగా చుట్టపక్కల ఉన్న వాహనదారులు, జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన బీహార్‌లోని హజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ఎద్దు తీవ్రమైన కోపంతో, భయంకరంగా అరుస్తూ రోడ్డుపై బీభత్సం చేసింది. రోడ్డు మీద పార్క్ చేసిన ఓ ఆటోను తన కొమ్ములతో బలంగా పొడుస్తూ పోర్లాపడేసింది. ఎద్దును వెళ్లగొట్టడానికి ఓ వ్యక్తి నీళ్లు పోసినా ఆటోను పడేయటం ఆపలేదు. దీంతో పాటు ఓ తోపుడు బండిని తన తలతో తోసుకుంటా నడిరోడ్డు మీదకి వచ్చింది. వాహనాదారులకు తీవ్రంగా ఆటంకం కలిగించింది. అనంతరం ఆదే స్థాయి కోపంతో నిలిచిఉన్న కారును తన కొమ్ములతో పొడుస్తూ.. బోర్లాపడేసే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ నీళ్లు పోస్తూ, మరో వ్యక్తి పొడవాటి కర్ర సాయంతో బెదిరిస్తూ.. ఎద్దును వెళ్లగొట్టారు. ఆ ఎద్దు సృష్టించింన బీభత్సంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment