bull
-
ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!
పురాతన ఆచారాలు, సంస్కృతులు కాస్త వింతగా ఉంటాయి. అందులోనూ తవ్వకాల ద్వారా బయటపడ్డవి అయితే ఓ పట్టాన అర్థం కావు. చాలా విస్తుపోయాలా ఉంటాయి ఆనాటి ఆచారాలు. అలాంటి విచిత్రమైన ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. నాటికాలాలతో అంత్య క్రియలు ఇలాచేసేవారా..!అని నోరెళ్లబెడతారు..టర్కిలోని థార్సా నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల ఏళ్ల నాటి సమాధిని కనుగొన్నారు. ఇది అడయమాన్ శాన్‌ల్యర్ఫా హైవేపై కుయులు గ్రామానికి సమీపంలో ఉంది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో అత్యంత విచిత్రమైన సమాధి బయటపడింది. రోమన్ కాలాం నాటిదిగా గురించారు. ఈ సమాధి నాటికాలంలోని చరిత్రపై కొత్త ఆశను అందిస్తోంది. నాటికాలంలో ఉండే పురాతన నాగరికత, శ్మశాన వాటికల గురించి ఒక అవగాహన ఏర్పడేందుకు ఈ సమాధి దోహదపడుతుంది. థార్సా నగరంలోని నెక్రోపోలి ప్రాంతంలో 2024 నుంచి జరిపిన తవ్విన తవ్వకాల్లో ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రముఖంగా ఎద్దుల తల బొమ్మలతో అలంకరించినట్లు ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఎద్దు తలల పరివేక్షణలో సమాధి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాటి రోమన్ అంత్యక్రియలు, ఆచారాలు కాలక్రమేణ అభివృద్ధి చెందాయని తెలుస్తోంది. నేటి కాలంలో దహనం చేయడం వంటివి చేస్తున్నారు, కానీ క్రీస్తూ శకం రెండో శతాబ్దంలో అంత్యక్రియ ఆచారాలు వేరుగా ఉండేవని వెలుగులోకి వచ్చిన సమాధిని బట్టి తెలుస్తోందని చెప్పారు పురావస్తు శాస్త్రవేత్తలు. నాటికాలంలో మరణాంతరానికి సంబంధించిన ప్రబలమైన నమ్మకాలు బలంగా ఉండేవని ఈ సమాధి అలంకరణే అందుకు నిదర్శనమేనని అన్నారు.(చదవండి: ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..) -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్‌కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్‌పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది. ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. Bangalore: The bull suddenly attacked the scooty rider. The person fell under the truck coming from the front. The truck driver immediately applied the brakes. The man narrowly escaped being hit by the tire of the truck. pic.twitter.com/Jpiei3CoIL — Mayank Arhat 𝕏 (@iMayankIndian_) April 6, 2024 -
నీ సంబడం సంతకెళ్లి పోను
‘గుర్రపు స్వారీ’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. అయితే ‘దున్నపోతు స్వారీ’ అనే మాట వింటే మాత్రం ‘సారీ’ అంటాం. ‘బుల్ రైడర్ 007’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హెల్మెట్ ధరించిన ఒక యువకుడు దున్నపోతుపై కూర్చొని రోడ్డుపై పరుగులు తీస్తుంటాడు. ఆన్లైన్ యూజర్ల తిట్లు, శాపనార్థాల సంగతి ఎలా ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ రైడర్‌తో సెల్ఫీలు దిగడానికి రోడ్డు పక్కన ఉన్న జనాలు పరుగెత్తుకు రావడం మరో వినోద విడ్డూరం. ‘నో పెట్రోల్–నో సర్వీస్–నో లైసెన్స్’లాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది జంతు హింస తప్ప మరొకటి కాదు’ ... లాంటి కామెంట్స్ కనిపించాయి. -
ఎస్బీఐలోకి ఎద్దు ఎంట్రీ! ఆపై..
ఓ ఎద్దు.. తాపీగా బ్యాంకులోకి నడుచుకుంటూ వచ్చింది. ఆ దృశ్యం చూసి బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు జడుసుకుని ఓ మూలకు వెళ్లారు. అయినా అది బెదరకుండా ముందుకు వెళ్లపోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు లాఠీతో దానిని వెనక నుంచి బయటకు తోలేసే యత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా షాగంజ్ ఎస్బీఐ బ్యాంకులో బుధవారం ఈ చిత్రం జరిగింది. అంతకు ముందు బ్యాంక్ బయట అది మరో ఎద్దుతో పోట్లాడిందట. ఈ క్రమంలోనే ఆ ఎద్దు బ్యాంక్ ఎంట్రెన్స్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వచ్చేసిందని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. ఆ సమయంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని మేనేజర్ అంటున్నారు. Bull Steals the Spotlight: Unlikely Visitor Creates Stir at SBI Bank in Unnao, Uttar Pradesh. 😂 🐂 Watch the viral video 📽️#SBI #Unnao #UttarPradesh #ViralVideo pic.twitter.com/lzonqeuXw9 — Lokmat Times (@lokmattimeseng) January 11, 2024 VIDEO CREDITS: Lokmat Times కిందటి ఏడాది ఏమో అనుకుంటాం.. అసోం దుభ్రిలో ఓ ఎద్దు షాపింగ్‌మాల్ మొత్తం కలియదిరిగి తెగ వైరల్ అయిపోయింది. -
4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం
సాక్షి, హైదరాబాద్/అడ్డాకుల: దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులోని ఓ గుట్ట చిటారు గుండుపై రాయితో చెక్కిన ఎద్దు బొమ్మ ఇది. 4 వేల ఏళ్ల క్రితంనాటి చిత్రమిది. మహబూబ్‌నగర్‌కు చేరువలో ఉన్న మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపైనున్న ఈ బొమ్మను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానిక రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసే పనిలో భాగంగా ఆదివారం ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 400 అడుగుల ఎత్తున్న గుట్ట పైభాగానికి చేరుకోగా, అక్కడున్న గుండుపై ఈ చిత్రం కనిపించింది. 10 సెం.మీ. పొడవు, 8 సెం.మీ.ఎత్తుతో ఉన్న ఈ బొమ్మ దిగువన మరికొన్ని జంతువులు, మనుషుల చిత్రాలు కూడా ఉన్నాయి. వాతావరణ ప్రభావానికి గురై అవి కొంతమేర మసకబారిపోయాయని ఆయన తెలిపారు. గుట్టపై నాటి మానవుల్లో ఓ సమూహం నివాసంగా ఉండి ఉంటుందని, ఆ క్రమంలోనే నిత్యం కలిసి ఉండే పశువులను చూసి ఈ చిత్రాలు చిత్రించి ఉంటారని పేర్కొన్నారు. -
Pritam Bull:కోటి రూపాయల ఎద్దును కాపాడారోచ్!
నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్ఎఫ్. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్ వన్ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ప్రీతమ్ అనే గిర్ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్లీ వ్యవహారమే!. భారత్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!. #आपदासेवासदैवसर्वत्र Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 #आपदासेवासदैवसर्वत्र#animalrescue Team @8NdrfGhaziabad conducting flood rescue and evacuation.This is our country's philosophy:-No one should be left behind in times of need.NdRF rescue people as well as animals at Noida@noida_authority@HMOIndia@NDRFHQ@ndmaindia@ANI pic.twitter.com/e7j8sTEixz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 -
చిరు ఫైట్ సీన్ కోసం 6000 కుండలు.. అప్పట్లోనే 50 వేల ఖర్చు!
మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆపద్బాంధవుడు ఒకటి. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ చిరంజీవికి మాత్రం మంచి గుర్తింపుతో పాటు నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం ఓ ఫైట్ సీన్‌ని పెట్టారు విశ్వనాథ్. అది ఎద్దుతో జరిగేది. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్ అప్పట్లోనే రూ. 50 వేలు ఖర్చు చేసిందట. ఫైట్ సీన్ కోసం ఆరు వేల కుండలను తెప్పించారట. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారట. పగిలిపోయిన కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారట. ఇక ఈ ఫైట్ సీన్ ముగింపు దశకు వచ్చేసరికి కుండల కొరత ఏర్పడిందట. (చదవండి: అభిమానులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా: చిరంజీవి) అప్పటికే మద్రాస్‌లో తయారు చేసిన కుండలన్నీ కొనుగోలు చేశారట. మరిన్ని కుండల కోసం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కొనుక్కోచ్చారట. ఎంతో కష్టపడి తీసిన ఈ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్ 9న అపద్బాంధవుడు చిత్రం విడుదలైంది. చిరంజీవితో పాటు ఉత్తమ డైలాగ్స్ రచయితగా జంధ్యాల, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా భూషన్ లకంద్రి, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా బి. చలం, అరుణ్ బి.గోడ్వంకర్‌లకు నంది అవార్డులు లభించాయి. -
వైరల్ వీడియో : రిషికేష్‌లో ఎద్దుపై యువకుడి స్వారీ.. ప్రభుత్వం సీరియస్
-
అందాల పోటీల్లో కేశనపల్లి గిత్తకు ప్రథమ స్థానం
మలికిపురం: రాష్ట్ర స్థాయిలో జరిగిన అందాల పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం అడబాల లక్ష్మీనారాయణ (నాని)కి చెందిన పుంగనూరు గిత్త ప్రథమ స్థానం పొందింది. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లిలో జరిగిన ఈ పోటీలలో ఈ గిత్తకు రూ.30 వేల బహుమతి లభించింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ బహుమతి అందుకున్నారు. దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఎత్తు 13 అంగుళాలు.. పొడవు 19 అంగుళాలు మలికిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సోమవారం అరుదైన పుంగనూరు గిత్త దూడ జన్మించింది. పెద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తికి చెందిన పుంగనూరు ఆవుకు ఈ దూడ జన్మించింది. దీని ఎత్తు 13 అంగుళాలు, పొడవు 19 అంగుళాలు ఉంది. పుంగనూరు దూడలన్నీ సాదారణంగా ఇదే సైజులో జన్మిస్తాయి. (క్లిక్ చేయండి: మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!) -
వైరల్ వీడియో: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
-
Viral Video: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..
-
వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
ఇటీవల వివాహ వేడుకల్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక యువకుడు సినిమాలో హీరో మాదిరిగా ఓ వేడుకకి వచ్చి హాయిగా భోజనం చేసి వెళ్లిపోవాలనుకున్నాడు. గానీ అక్కడ ఉన్న పెళ్లివారు పనిష్మెంట్గా ఆ యవకుడితో ప్లేట్లు కడిగించారు. అంతకుముందు అమెరికాలోని ఓ వివాహ వేడుకలోకి ఎలుగుబంటి వచ్చి అక్కడ ఆహార పదార్థలన్నింటిని తినేసి పెద్దపెద్ద కలకలం సృష్టించింది. ఆ ఘటనలను మరువక మునుపే మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక ఎద్దు వివాహ వేడుక ఎంట్రీ వద్ద ఉన్న గేటును ఢీకొట్టి మరీ పెళ్లిమండపంలోకి వచ్చేసింది. అక్కడు ఉన్న ఒకతను ఆ ఎద్దును బయటకు పంపించేందుకు యత్నించినా వెళ్లకపోకపోగా... అతనిపైనే దాడి చేసేందుకు వచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. పైగా అక్కడ ఉన్న విందు వద్దకు వచ్చి హంగామా సృష్టించింది. అనంతరం అక్కడే స్టాల్స్ ఉన్న అద్దాల గదికి వెళ్లేందుకు కూడా యత్నించి...విఫలమై వెనక్కు వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడ నుంచి ఎద్దు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి) -
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
కాంగ్రెస్ సభలో ఎద్దు బీభత్సం.. బీజేపీ కుట్రేనటా!
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. ఎటు వెళ్లాలో తెలియక అటూఇటు పరుగులు పెట్టడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతంలో మంగళవారం జరిగింది. వేదికపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతున్న క్రమంలో ఓ నల్లటి కొమ్ములు తిరిగిన ఎద్దు ఆ సభలోకి ప్రవేశించింది. దీంతో పలువురు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఎద్దు బెదిరిపోకుండా అంతా నిశబ్దంగా ఉండాలని సీఎం అశోక్ గెహ్లట్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీజేపీ సభ్యులు కావాలనే ఎద్దులు లేదా ఆవులను వదులుతున్నారని ఆరోపించారు. సభను చెదరగొట్టేందుకు ఎద్దును బీజేపీనే పంపించిందన్నారు. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ సమావేశాలను భంగపరచాలనే దురుద్దేశంతో తరుచుగా ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉండనుంది. మంగళవారంతో తొలివిడత 89 స్థానాల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. गुजरात मे @ashokgehlot51 की सभा में घुसा सांड!! सीएम बोले.... मैं बचपन से देखता आ रहा हूं, ये भाजपा भेजती है मेरी सभा में सांडों को. pic.twitter.com/RkB8oSmowx — Sharad (@DrSharadPurohit) November 28, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
బెడిసి కొట్టిన రావణ దహనం.. వీడియో వైరల్
లక్నో(యూపీ): ముజఫర్‌నగర్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమం బెడిసి కొట్టింది. దిష్టి బొమ్మ నుంచి బాణాసంచా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో అంతా పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. బుధవారం సాయంత్రం ముజఫర్‌నగర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో రావణ దహన కార్యక్రం ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి వందల మంది చేరుకున్నారు. అయితే.. దహనం అనంతరం దిష్టిబొమ్మ నుంచి బాణాసంచా మిస్సైళ్ల మాదిరి దూసుకురావడంతో ప్రజలతో పాటు పోలీసులు పరుగులు తీశారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాణాసంచా తర్వాత.. ఒక ఎద్దు మైదానంలో వీరంగం సృష్టించింది. దీంతో జనాలు తలోవైపు పరుగులు తీశారు. చివరకు అధికారులు ఆ ఎద్దును ఎలాగోలా లొంగదీసుకుని.. పక్కకు తీసుకెళ్లారు. मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022 #NewsNonstop: मुजफ्फरनगर में रावण दहन के वक्त हुआ हादसा | तेज रफ्तार में देखिए, देश-विदेश की 50 अहम खबरें @Anant_Tyagii #UttarPradesh #MuzaffarNagar #Dussehra #Dussehra2022 pic.twitter.com/4JFB3b7j3d — Times Now Navbharat (@TNNavbharat) October 5, 2022 Video Credits: TNNavbharat హర్యానాలోని యమునా నగర్లోనూ ఇదే తరహాలో ఘటన జరిగింది. రావణ దహనం తర్వాత దిష్టిబొమ్మ జనాల వైపుగా పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు. -
Viral Video: మనతో మాములుగా ఉండదు.. పులిని బెంబేలెత్తించిన ఎద్దు
అడవిలో ఏ జంతువైనా పులి, సింహాన్ని చూసి భయపడాల్సిందే. వీటి దాడి నుంచి తప్పించుకోవడం కష్టం. చిన్నా పెద్ద తేడా లేకుండా వేటినైనా క్రురంగా వెంటాడి, చంపేసి ఆహరం చేసుకుంటాయి. పొరపాటున పులి కంటపడితే.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. అయితే తాజాగా ఓ జంతువు పులిని భయపెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఓ ఎద్దు దాని మానాన అది పరుగెత్తుకెళుతుంది. ఇంతలో రోడ్డు పక్కన దాక్కున్న పులి ఎద్దుని చూసి దాని మీదకు దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. పులిని చూసిన ఎద్దు ఎంతమాత్రం బెదరలేదు. అంతేగాక ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు పులిని భయపెట్టింది. దీంతో ఎద్దుని చూసి బెంబేలెత్తిన పులి తొకముడుచుకొని వెనక్కి పారిపోయింది. తర్వాత ఎద్దు వెళ్లిపోయాక పులి దాని దారిలో అది వెళ్లిపోయింది. చదవండి: కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్ ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నిరోజులు ఒకేలా ఉండవు.. పరిస్థితులు మారుతాయి. ఎవరైనా జాగ్రత్త పడాల్సిందే..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Courage is found in unlikely places… Bull scares away the tiger. This is not the behaviour apex predator that we know. Pressure of human presence is perhaps having a huge role. WA fwd pic.twitter.com/6A4kx39yVc — Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022 -
ఆవిష్కరణ..: పవర్ బుల్స్ సృష్టించారు!
గాలి మార్పు కోసం సొంత గ్రామానికి వెళ్లారు ఈ దంపతులు. గాలిలో మార్పు సంగతి ఏమిటో గానీ... పేదరైతు జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టే యంత్రాన్ని ఆవిష్కరించారు. ‘ఎలక్ట్రిక్ బుల్’ ఇచ్చిన ఉత్సాహంతో సామాన్య రైతుకు ఉపయోగపడే మరిన్ని యంత్రాల రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు... కోవిడ్ కరకు మేఘాలు దట్టంగా అలుముకున్న రోజులవి. ఎటు చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్లే! ‘ఊరెళదామా... కాస్త మార్పుగా ఉంటుంది’ భర్త తుకారామ్‌ను అడిగింది సోనాలి వెల్జలి. ‘ఇది సరిౖయెన టైమ్. కచ్చితంగా వెళ్లాల్సిందే’ అన్నాడు తుకారామ్. మార్పు సంగతి ఏమిటోగానీ, ఊరికెళ్లాలి అనే వారి నిర్ణయం పేదరైతు వ్యవసాయంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. వృత్తిరీత్యా పుణె(మహారాష్ట్ర)లో నివసించే సోనాలి–తుకారామ్ దంపతులు తమ స్వగ్రామం అందేర్సల్కు వెళ్లారు. పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లినా... ఇలా వెళ్లి అలా వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా తీరిక దొరికింది. ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. సోనాలి ఏ రైతుకుటుంబాన్ని పలకరించినా ఒకేలాంటి కష్టాలు. పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు. అలా అని పశువులు అందుబాటులో లేవు. కూలీల కొరత మరో సమస్య. కూలీలు అందుబాటులో ఉన్నా డబ్బు మరో సమస్య. ఒకరోజు చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది సోనాలి. దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్‌పై పనిచేయడం మొదలు పెట్టారు. విషయం తెలిసి ఊళ్లో వాళ్లు గుంపులు గుంపులుగా వీరి ఇంటికి వచ్చేవాళ్లు. వారందరూ పేదరైతులే. పనిలో పనిగా తమ సమస్యలను ఏకరువు పెట్టేవాళ్లు. ‘నా పొలంలో ట్రాక్టర్‌లాంటి పెద్ద యంత్రాలను ఉపయోగించడం వీలు కాదు. ఎద్దుల ద్వారా మాత్రమే సాధ్యం అయ్యే వ్యసాయం మాది. కానీ అవి మా దగ్గర లేవు’ అన్నాడు ఒక రైతు. నిజానికి ఇది ఈ రైతు సమస్య మాత్రమే కాదు ఎందరో రైతుల సమస్య. తయారు కాబోతున్న ‘ఎలక్ట్రిక్ బుల్’ గురించి పేదరైతుల ఆసక్తి గమనించిన తరువాత సోనాలి– తుకారామ్లలో పట్టుదల మరింతగా పెరిగింది. వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది. సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది. పేదరైతులకు అందుబాటు ధరలలో ఉండే ఈ బుల్‌తో విత్తనాలు చల్లడం నుంచి పిచికారి చేయడం వరకు ఎన్నో పనులు చేయవచ్చు. రైతుకు ఖర్చు బాగా తగ్గు తుంది. ఒక్కసారి ఫుల్‌గా రీఛార్జి చేస్తే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది. ‘ఆరు, ఏడు మంది కూలీలతో మూడు రోజులలో చేసే పొలం పనిని ఈ యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాను. ట్రాక్టర్ కొనలేని, అద్దెకు తెచ్చుకోలేని చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు సుభాష్ చవాన్ అనే రైతు. పరీక్షదశలో భాగంగా అతడు ఎలక్ట్రిక్ బుల్‌ను ఉపయోగించి ‘శభాష్’ అంటూ కితాబు ఇచ్చాడు. తమ స్టార్టప్ ‘కృషిగటి’ ద్వారా ఎలక్ట్రిక్ బుల్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు. ‘నాలోని ఇంజనీరింగ్ స్కిల్స్ పేదరైతులకు మేలు చేయడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ బుల్ దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. రైతులకు రకరకాలుగా ఉపయోగపడే ఆరు రకాల యంత్రాలను రూపొందించనున్నాం. మన దేశంలోనే కాదు, ఎన్నోదేశాల్లో ఉన్న రైతులకు ఉపకరించే యంత్రాలు రూపొందించాలనేది మా భవిష్యత్ లక్ష్యం’ అంటుంది సోనాలి. -
చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు..
సాక్షి, ఖమ్మం: చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానానికి బయలుదేరాడు. ఈమేరకు ఆయన మంగళవారం సాయంత్రం బోనకల్‌కు చేరుకోగా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు. అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరగా, బోనకల్లో పలువురు సంఘీభావం ప్రకటించారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
సైకిల్ రైడర్లపై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!: వైరల్ వీడియో
Cyclist Tossed In The Air By Raging Bull: ఇంతవరకు ఎద్దు దాడికి సంబంధించిన వీడియోలను చూశాం. సాధారణంగా ఎద్దు దాడి చేయదు. తన దారికి అడ్డు వచ్చినప్పుడో లేక మరే ఏ ఇతర కారణాల వల్లనే ఒక్కోసారి చాలా భయంకరంగా దాడి చేస్తుంది. అచ్చం అలానే ఒక సైకిల్ రైడర్ పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్ల పై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్ రైడర్ పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది. అదృష్టవశాత్తు వారికి ఏం కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. అయితే వారు రేసింగ్ మొదలు పెట్టినప్పుడు ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమి వైపుకి చాలా దూరం తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అది తిరిగి వచ్చి మరీ వాటి పై దాడి చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sam Ames (@therockcobbler) (చదవండి: హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!) -
వేములవాడ: రాజన్న కోడెకు ఎంత కష్టం..!!
-
తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా
-
చిల్లర లేదు అనొద్దు.. నా దగ్గర ఫోన్ పే ఉంది!
సాక్షి హైదరాబాద్: సంక్రాంతికి డూడూ బసవన్నలు సందడి చేస్తుంటాయి. వీటిని ఆడించే గంగిరెద్దుల వారికి జనం తమకు తోచినంత నగదు ముట్టజెబుతుంటారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఉండటంతో చాలా మంది డిజిటల్ పేమెంట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బసవన్నలకు గూగూల్‌పే, ఫోన్‌పే స్కానర్లను గంగిరెద్దుల వాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం బంజారాహిల్స్‌లో ఫోన్ పే తగిలించిన డూడూ బసవన్న ఆకట్టుకుంది. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) -
FSBS: వీర్యోత్పత్తిలో ఘన కీర్తి బనవాసి
ఎమ్మిగనూరు రూరల్: నాణ్యమైన పశు వీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కర్నూలు జిల్లాలోని బనవాసి ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం. మన రాష్ట్రంలో నంద్యాల, విశాఖపట్నం, బనవాసిలలో, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో ఘనీకృత పశు వీర్యోత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బనవాసి కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏటా లక్షల డోసుల నాణ్యమైన పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలుగా మేలు జాతి పశు సంతతి అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడుతోంది. దీంతోపాటు గొర్రెలు–మేకల పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో యంగ్ బుల్ (ఒంగోలు జాతి ఎద్దులు) పెంపక కేంద్రం ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఐఎస్వో గుర్తింపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ఫారంలో 1986వ సంవత్సరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8.98 ఎకరాల్లో ఈ కేంద్రం విస్తరించి ఉంది. మేలు జాతి ఆబోతుల నుంచి నాణ్యత గల వీర్యాన్ని ఉత్పత్తి చేయటం, తద్వారా అధిక పాల దిగుబడినిచ్చే పశు సంతతిని అభివృద్ధి చేయటం, కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా నాణ్యమైన దూడలను ఉత్పత్తి చేయటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. బనవాసి ఆబోతు వీర్య కేంద్రానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ 2010 అక్టోబర్‌లో ఐఎస్వో సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అలాగే, 2020 మార్చిలో గ్రేడింగ్ చేయటానికి వచ్చిన కేంద్ర బృందం ఈ కేంద్రానికి ‘ఏ’ గ్రేడ్ ఇచ్చింది. మేలు జాతి పశు సేకరణ మొదలు పర్యవేక్షణ, వీర్య ఉత్పత్తి, వీర్యాన్ని భద్రపరచటం, సరఫరా చేయటం వంటి ప్రతి అంశం ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతుంది. ప్రత్యేక పర్యవేక్షణ బనవాసి వీర్యోత్పత్తి కేంద్రంలో ప్రధానంగా పశువుల వ్యాధి నిరోధకతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ పశువుల ఆరోగ్య పరిరక్షణను అనుభవజ్ఞులైన వైద్యాధికారులు, వీర్య సేకరణ పరీక్షలను నిపుణులైన శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఆబోతులకు నాణ్యమైన దాణా సరఫరా చేయటం, క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయటం, గొంతు వాపు, గాలికుంటు వ్యాధి, తెలిరియస్, అంత్రాక్స్ వంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించటం చేస్తుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమునాలు, పేడ, మూత్రంను బెంగళూరులోని ఎస్ఆర్డీడీఎల్ ల్యాబ్‌కు పంపుతారు. అదే విధంగా రాష్ట్రంలోని వీబీఆర్ఐ–హైదరాబాద్, ఏడీడీఎల్–కర్నూల్ వారికి పంపి వ్యాధి నిర్ధారణ, పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. వీర్యోత్పత్తి – సరఫరా బనవాసి ఆబోతు వీర్య కేంద్రంలో నెలకు సరాసరి లక్షన్నర నుంచి రెండు లక్షల డోసుల వరకు నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 2018–2019లో 21,59,442 వీర్యాన్ని ఉత్పత్తి చేయగా 20,44,098 డోసులను పంపిణీ చేశారు. 2019–2020లో 17,61,951 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తే, 13,61,985 డోసులను పంపిణీ చేశారు. 2020–2021 (నవంబర్ వరకు)లో 14,48,713 డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేయగా, 13,28,803 లక్షల డోసులను పంపిణీ చేశారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యాన్ని గతంలో మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏడాది నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు మాత్రమే వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు. 87 రకాల పశువులు మేలి రకం జాతి సంతతి పశువులను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జాతులకు చెందిన 87 రకాల పశువులు ఉన్నాయి. ఇందులో ముర్రా జాతి సంతతికి చెందిన 39 రకాలు, జెర్సీ జాతి రకాలు 12, హోల్స్టీమ్ ఫ్రీషిమన్ జాతి (హెచ్ఎఫ్) 9, క్రాస్ బీడ్ జెర్సీ జాతి (సీబీజేవై) 14, సీబీహెచ్ఎఫ్ రకాలు 7, జీఐఆర్ రకం 2, సహివాల్ రకం 1, మేహసన 3 చొప్పున మొత్తం 87 రకాల పశువులు ఇక్కడ ఉన్నాయి. మేలి రకం పశుగ్రాసం సాగు బనవాసి కేంద్రంలో వినియోగించే పశుగ్రాసం సాగుకు 400 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 210 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, జొన్నతోపాటు సూపర్ నేపియర్, పారాగడ్డి వంటి నాణ్యమైన పశుగ్రాసాలను పండిస్తున్నారు. మంచి డిమాండ్.. దేశంలో బనవాసి ఘనీకృత ఆబోతు వీర్య కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న వీర్యానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. మేలు జాతి పశువుల అభివృద్ధి, ఆబోతుల పరిరక్షణకు ప్రత్యేక పద్ధతులు పాటిస్తూ లక్ష్యాన్ని సాధిస్తున్నాం. – డిప్యూటీ డైరెక్టర్, బనవాసి ఆబోతు కేంద్రం -
ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఒక ఎద్దు విలువ రూ.కోటి, మేక విలువ రూ.7 లక్షలు. బెంగళూరు జీకేవీకే అవరణలో శుక్రవారం ప్రారంభమైన వ్యవసాయ మేళాలో వీటిని రైతులు ప్రదర్శనకు ఉంచారు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన రైతు బోరేగౌడ వ్యవసాయ ప్రదర్శనకు తను పోషిస్తున్న ఈ ఎద్దును ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీని వయస్సు మూడున్నర సంవత్సరాలు. దీని వీర్యాన్ని వారానికి ఒక రోజు సేకరిస్తారు. ఒక డోస్‌ను రూ.వెయ్యితో విక్రయిస్తున్నట్లు రైతు తెలిపారు. ఇక దక్షిణ ఆఫ్రికాలోని బోయర్ జాతికి చెందిన మేకపోతును తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లికి చెందిన జితిన్ ఆగ్రో ఫారం యజమాని వెంకటేశ్ ప్రదర్శనలో ఉంచారు. పూణె నుంచి తెప్పించిన ఈ మేకపోతు 70 కేజీల బరువు ఉంది. 135–140 కేజీల వరకు వృద్ధి చెందుతుంది. ఈ మేకపోతును సంతానోత్సత్తికి ఉపయోగిస్తారు. -
చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’
ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కొసారి అనూహ్యంగా మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సమయంలోనే సమయస్పూర్తితో వ్యవహరించి ఆ ఆపద నుంచి సురక్షితంగా బయటపడాలి. అచ్చం అలానే చేశాడు ఇక్కడొక ఆస్ట్రేలియన్ వ్యక్తి. బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని 60 ఏళ్ల వ్యక్తి కైర్న్స్కి సమీపంలోని హోప్ వేల్ నగరంలోని ఒక నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అతను పని ముగించుకుని తిరిగి నదిఒడ్డుకి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న ఎద్దుని అదిలించాడు. దీంతో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మొసలి క్షణాల్లో అతని పై దాడిచేసింది. పైగా ష్యూస్ వేసుకుని ఉన్న అతని రెండు కాళ్లను బలంగా లాగడానికి ప్రయత్నించింది. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) అతను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను సైతం పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే అతను ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడంతో చేసేదేమి లేక చివరికి అతని పాకెట్లో ఉన కత్తితో అదే పనిగా దాడిచేశాడు. దీంతో అతను కొద్దిమొత్తంలో గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లినట్లు క్వీన్స్లాండ్ పర్యావరణ విభాగం పేర్కొంది. (కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్
స్టాక్మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ సెషన్ కూడా లాభాలతోనే ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్ వార్షిక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కి బూస్ట్‌ని అందించాయి. అయితే రికార్డు స్థాయి హైలలో కొనసాగుతున్న సూచీలు ఏ క్షణమైనా కరెక్షన్ అవచ్చనే అభిప్రాయం కూడా మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం 9:15 గంటలకి బీఎస్ఈ సెన్సెక్స్ 321 పాయింట్లు లాభపడి 60,369 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రారంభంలో లాభాలు పొందిన వెంటనే పాయింట్లు నష్టపోయి 17,853 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. చదవండి : Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
ఎద్దు అంతిమ సంస్కారం.. 3 వేల మంది హాజరు
లక్నో: మరణించిన ‘బాబూజీ’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పూజారి మంత్రాలు పఠిస్తున్నాడు. అక్కడ గుమికూడిన ప్రజలు పూజారి ఆజ్ఞల ప్రకారం చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాలు బాబూజీ అంతిమ సంస్కారాలకు హాజరు అయ్యారు. ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న బాబూజీ ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంటున్నారా.. అయితే అక్కడే ఉంది ట్విస్ట్. ఇంత భారీ ఎత్తున జనాలు హాజరయ్యింది మనిషి కర్మకాండ కార్యక్రమానికి కాదు.. ఎద్దుది. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది వాస్తవం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్ కుర్ది గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గ్రామస్తులు ముద్దుగా ‘బాబూజీ’ అని పిలుచుకునే ఎద్దు గత 20 ఏళ్లుగా కుర్ది గ్రామంలో ఉంటుంది. గ్రామస్తులు ఆ ఎద్దును భగవంతుడి బహుమతిగా భావించేవారు. ఇక బాబూజీ కూడా సాధు స్వభావం కల్గి ఉండి.. ఎవరికి ఏ హానీ చేసేది కాదు. పిల్లలైతే బాబూజీ దగ్గరకు వెళ్లి ఎలాంటి భయం లేకుండా దానితో ఆడుకునేవారు. అలా 20 ఏళ్లుగా గ్రామస్తుల కుటుంబంలో భాగస్వామిగా ఉన్న బాబూజీ ఈ నెల 15న మృతి చెందింది.(చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన) బాబూజీ మరణం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. చాలా మంది తమ ఇంట్లోనే వ్యక్తి మరణించినట్లే భావించారు. ఇక బాబూజీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. ఇంటికింత అని చందా వేసుకుని డబ్బు పోగు చేశారు. అలా జమ అయిన డబ్బుతో ఘనంగా బాబూజీ అంత్యక్రియలు నిర్వహించడమే కాక.. అంతిమసంస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. (చదవండి: కట్నంకోసం, నడివీధిలో అమానుషం: షాకింగ్) ఈ క్రమంలో ఆదివారం బాబూజీకి కర్మకాండ కార్యక్రమం నిర్వహించగా.. దీనికి ఏకంగా 3 వేల మంది హాజరయ్యారు. బాబూజీ మృతికి సంతాంప తెలిపారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్ల క్రితం బాబూజీ మా గ్రామానికి వచ్చింది. మా ఊరిలో పవిత్ర ప్రదేశంగా భావించే స్థలంలో బాబూజీ కనిపించడంతో.. దాన్ని దేవుడి బహుమతిగా భావించాం. చాలా మంది దాన్ని నందిగా భావించేవారు. ఇక బాబూజీ గ్రామంలో తిరుగుతున్నంకాలం మా జీవితాలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు అనిపించేది. బాబూజీ మృతి మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. మా కుటుంబ సభ్యుడే మరణించినంత బాధగా ఉంది’’ అని తెలిపాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు యువకులు బాబూజీ కటౌట్ ఏర్పాటు చేసి.. దాని మెడలో పూల దండలు, కరెన్సీ నోట్ల దండలు వేశారు. -
షేర్ మార్కెట్లో రికార్డుల హోరు.. 54 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై: షేర్ మార్కెట్లో బుల్ రంకెలు వేస్తోంది. బుల్ జోరుతో షేర్ మార్కెట్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇటు నిఫ్టీ, అటు సెన్సెక్స్‌లు లైఫ్‌టైం హైలను నమోదు చేశాయి. 54 వేలు క్రాస్ బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ కొత్త ఎత్తులకు చేరుకుంది. తొలిసారిగా 54 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. ఫస్ట్‌వేవ్ తర్వాత మార్కెట్ పరిస్థితులు చక్కబడటంతో ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో తొలిసారిగా సెన్సెక్స్ 50 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. అయితే ఆ తర్వాత సెకండ్ వేవ్ రావడంతో మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. తాజాగా సెకండ్ ప్రభావం పూర్తిగా తగ్గడం, ఆర్థిక వ్యవస్త పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు జోరుమీదున్నారు.దీనికి తోడు సెకండ్ క్వార్టర్ ఫలితాల్లో మెటల్, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సెక్టార్లో చాలా కంపెనీలు మెరుగైన పనితీరు కనబరచడంతో మార్కెట్‌పై విశ్వాసం పెరిగింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడం కూడా కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్ 54 వేలు క్రాస్ చేసింది. బుల్ జోరు నిన్న సాయంత్రం 53,823 పాయింట్లతో మార్కెట్ క్లోజయ్యింది. అయితే ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉండటంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభం కావడమే 54071 పాయింట్లతో మొదలైంది. ఇక అప్పటి నుంచి సెన్సెక్స్ జోరు కొనసాగుతూనే ఉంది ఉదయం 11:30 గంటల సమయానికి 505 పాయింట్లు లాభపడి 54,329 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక మంగళవారం తొలిసారి 16వేల మార్క్‌ని క్రాస్ చేసిన నిఫ్టీ అదే జోరుని బుధవారం కూడా కొనసాగిస్తోంది. -
ఆహారం కోసం వెళ్లి కరెంట్ పోల్స్ మధ్య ఇరుక్కుపోయిన ఎద్దు
-
మీ ఇంట్లో భూతం ఉంది.. ఎద్దుతో తరిమేస్తాం!
భువనేశ్వర్ : ఇంట్లో ఉన్న భూతాన్ని శివుడి వాహనం నంది(ఎద్దు)తో తరిమి వేస్తామని చెప్పి, ఓ వివాహితను నట్టేట ముంచింది దుండగుల ముఠా. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంది సాయంతో జాతకం చెబుతామంటూ మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తుల ముఠా జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇదే పేరుతో పలు కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే తరహాలో మహేశ్వర కాలనీకి చెందిన మార్వాడీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో మగవారు ఎవరూ లేకపోగా.. మార్వాడీ భార్య పింకీ సూరానాతో మాట్లాడి, మీ ఇంట్లో భూతం ఉందని నమ్మించారు. ఆ కారణంతోనే అశాంతి నెలకొందని, రూ.50 వేలు ఇస్తే నంది సాయంతో భూతాన్ని తరిమేస్తానని నమ్మించాడు. పూజ చేయాలని డబ్బు తీసుకొని, సామగ్రి కోసం బయటకు వెళ్లి, తిరిగి రాకుండా పరారయ్యారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. తన భర్తకు విషయం చేరవేసింది. దీనిపై మల్కన్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పట్టణ శివారులో మహారాష్ట్రాకు చెందిన నలుగురు నిందితుల ముఠా తోపాటు నందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మూగజీవాన్ని జిల్లా కేంద్రంలోని గోశాలకు తరలించారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
జల్లికట్టు ఎద్దును రాళ్లతో కొడుతూ టిక్‌టాక్!
చెన్నై : టిక్‌టాక్ వీడియో కోసం మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు జల్లికట్టు ఎద్దును దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన వెట్రివేల్ అనే వ్యక్తికి కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉంది. కొద్దిరోజుల క్రితం అది గాయాలపాలై మృతి చెందింది. ప్రమాదవశాత్తు అది మరణించి ఉండొచ్చని వెట్రివేల్ భావించాడు. అయితే గురువారం ముగ్గురు తాగుబోతు యువకులు ఎద్దు చుట్టూ చేరి రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసిస్తున్న ఓ టిక్‌టాక్ వీడియోను అతడు చూశాడు. ఆ వెంటనే ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెట్రివేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా! ) ఆ వీడియోలో.. కొందరు తాగుబోతు యువకులు చెట్టుకు కట్టేసి ఉన్న ఎద్దు చుట్టూ చేరారు. దాన్ని రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసించసాగారు. అది ఆగ్రహంతో వారిపై ఉరకటానికి ప్రయత్నించి. ఈ నేపథ్యంలో రాళ్లు దాని ముఖానికి తగల సాగాయి. దీంతో తల భాగంలో తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రెండు కొమ్ములు కూడా దెబ్బతిన్నాయి. ( జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి ) -
బేర్ మార్కెట్ ర్యాలీ ఇది: బీవోఎఫ్‌ఏ సర్వే
దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న రికవరీని పలువురు నిపుణులు బేర్ మార్కెట్ ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. రెండో దశలో కరోనా వైరస్ విస్తరిస్తే పరిస్థితులు మరింత వికటించవచ్చునంటూ అంచనా వేస్తున్నారు. ఒకవేళ కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే స్టాక్ మార్కెట్లలో ‘వీ’షేప్ ర్యాలీకి చాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశీ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్‌ఏ) సెక్యూరిటీస్ ఈ నెల 7-14 మధ్య సర్వే చేపట్టింది. దీనిలో భాగంగా 223 మంది గ్లోబల్ ఫండ్ మేనేజర్లను ప్రశ్నించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 651 బిలియన్ డాలర్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగిన పలు ఫండ్ మేనేజర్ల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ వివరాలు చూద్దాం.. 68 శాతం ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్లలో బేర్ ర్యాలీ నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు వేగంగా బౌన్స్‌బ్యాక్ అయిన నేపథ్యంలో ఇది బుల్ ర్యాలీనే అంటూ 25 శాతం మంది పేర్కొన్నారు. రెండో దశలో మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తే స్టాక్ మార్కెట్లకు షాక్ తగలవచ్చని 52 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరిగితే.. నిరుద్యోగం ప్రబలడం, యూరోపియన్ యూనియన్ చీలిపోవడం, రుణ మార్కెట్ దెబ్బతినడం వంటి రిస్కులు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ వెలువడితే.. మార్కెట్లు వేగవంత రికవరీని సాధిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. కాగా.. మే నెలలో ఫండ్స్ వద్ద నగదు స్థాయిలు 5.7 శాతానికి చేరినట్లు సర్వే పేర్కొంది. ఫిబ్రవరిలో ఇవి 4 శాతంగా నమోదుకాగా.. ఏప్రిల్ కంటే స్వల్పంగా తక్కువని తెలియజేసింది. భారీ పతనం చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ యూరోప్, అమెరికాసహా పలు దేశాలకు పాకడంతో మార్చి నెలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం విదితమే. 2019 చివర్లో ప్రారంభమైన కోవిడ్-19 సంక్షోభం ఈక్విటీలలో భారీ అమ్మకాలకు కారణమైంది. దీంతో చరిత్ర సృష్టిస్తున్న అమెరికన్ ఇండెక్సులు డోజోన్స్, ఎస్అండ్పీ.. 11 ఏళ్ల బుల్ రన్‌కు ఒక్కసారిగా చెక్ పడింది. దేశీయంగానూ సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతేకాకుండా సాంకేతికంగా బేర్ ట్రెండ్‌లోకి ప్రవేశించాయి కూడా. ఇండెక్సులు 20 శాతం పతనమైతే బేర్ దశగా భావించే సంగతి తెలిసిందే. అయితే వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ప్రకటించిన భారీ సహాయక ప్యాకేజీల కారణంగా ఏప్రిల్‌లో మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. ప్రధానంగా ఇటీవల హెడ్జ్ ఫండ్స్ ఈక్విటీలలో కొనుగోళ్లు చేపడుతున్నట్లు సర్వే పేర్కొంది. మే నెలకల్లా 34 శాతం లాంగ్ పొజిషన్లు తీసుకున్నట్లు తెలియజేసింది. 2018 జూన్ తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే స్వల్పంగా తక్కువని వివరించింది. -
విషాదం : ఎద్దును తప్పించబోయి..
జైపూర్ : రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న మినీ బస్సుకు ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించబోయి చెట్టును బలంగా డీకొట్టడంతో 12 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్ నుంచి హర్యానాలోని హిసార్‌కు వెళ్లేందుకు శుక్రవారం మద్యాహ్నం మినీ బస్సులో 22మంది బయలుదేరారు. ఈ నేపథ్యంలో మినీ బస్సు నాగౌర్ జిల్లాలోని కచ్‌మన్ జాతీయ రహదారి వద్దకు రాగానే ఒక ఎద్దు ఎదురుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఎద్దును తప్పించడానికి సడెన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే బస్సు ఓవర్‌స్పీడ్ ఉండడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తో సహ 12 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని స్ధానికుల సాయంతో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా మిగతా 10 మందిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జైపూర్‌లోని ఎస్‌మ్మెఎస్ ఆసుపత్రికి తరలించగా, మిగతావారిని నాగౌర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నడిరోడ్డుపై ఎద్దు బీభత్సం
-
వైరల్: నడిరోడ్డుపై ఎద్దు బీభత్సం
పాట్న: కోపంతో ఉన్న ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా పలు వాహనాలను తన కొమ్ములతో దాడిచేసి బోర్లాకొట్టించింది. ఒక్కసారిగా చుట్టపక్కల ఉన్న వాహనదారులు, జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన బీహార్‌లోని హజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ఎద్దు తీవ్రమైన కోపంతో, భయంకరంగా అరుస్తూ రోడ్డుపై బీభత్సం చేసింది. రోడ్డు మీద పార్క్ చేసిన ఓ ఆటోను తన కొమ్ములతో బలంగా పొడుస్తూ పోర్లాపడేసింది. ఎద్దును వెళ్లగొట్టడానికి ఓ వ్యక్తి నీళ్లు పోసినా ఆటోను పడేయటం ఆపలేదు. దీంతో పాటు ఓ తోపుడు బండిని తన తలతో తోసుకుంటా నడిరోడ్డు మీదకి వచ్చింది. వాహనాదారులకు తీవ్రంగా ఆటంకం కలిగించింది. అనంతరం ఆదే స్థాయి కోపంతో నిలిచిఉన్న కారును తన కొమ్ములతో పొడుస్తూ.. బోర్లాపడేసే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ నీళ్లు పోస్తూ, మరో వ్యక్తి పొడవాటి కర్ర సాయంతో బెదిరిస్తూ.. ఎద్దును వెళ్లగొట్టారు. ఆ ఎద్దు సృష్టించింన బీభత్సంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నాటుబాంబును కొరికిన ఎద్దు
చిత్తూరు,పలమనేరు: మండలంలోని కృష్ణాపురం కౌం డిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన నాటుబాంబును కొరికింది. దీంతో ఎ ద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతోంది. దీన్ని గమనించిన కాపరి ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని తెలిపాడు. -
ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం
ముంబై: ఓ ఎద్దు మహిళ మంగళసూత్రాన్ని మింగేసిన వింత సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఆగస్టులో ‘బెయిల్ పోలా’(ఎద్దుల పండుగ) పేరుతో ఓ పండుగ జరుగుతుంది. మన దగ్గర కనుమ నాడు ఏ విధంగానైతే ఎద్దులను అలంకరించి, పూజలు నిర్వహిస్తామో.. అలానే ఈ రాష్ట్రాల్లో కూడా బెయిల్ పోలా పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించి.. వాటికి పూజలు చేసి.. ప్రత్యేకంగా చేసిన ప్రసాదం తినిపిస్తారు. అంతేకాక బంగారు ఆభరాణాన్ని ఎద్దు నుదురుకు తాకిస్తే మంచిదని నమ్ముతారు. ఈ క్రమంలో గత నెల 30న మహారాష్ట్రలోఈ బెయిల్ పోలా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ రోజు సాయంత్రం ఓ రైతు తన ఎద్దులను అందంగా అలంకరించి పూజ నిమిత్తం ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య ఓ పళ్లెంలో హరతి, ప్రసాదంతో పాటు తన బంగారు మంగళసూత్రాన్ని కూడా తీసుకుని వచ్చింది. ముందు ఎడ్లకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. మంగళసూత్రాన్ని ఎద్దుల నుదురుకు తాకించి.. ప్రసాదం పెడదామని అనుకుంటుండగా ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దాంతో లోపలికి వెళ్లి క్యాండిల్ తీసుకుని వచ్చి చూడగా.. ప్లేట్లో ఉంచిన ప్రసాదంతో పాటు.. బంగారు మంగళసూత్రం కూడా కనిపించలేదు. ఓ ఎద్దు ప్రసాదం తినడం కనిపించింది. కంగారుపడ్డ దంపతులు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ మంగళసూత్రం మాత్రం కనిపించలేదు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఎద్దు ప్రసాదంతో పాటు మంగళసూత్రాన్ని కూడా మింగేసి ఉంటుందని చెప్పారు. పేడతో పాటు వస్తుందని సూచించారు. దాంతో ఆ దంపతులు ఓ వారం రోజుల పాటు ఆ ఎద్దు పేడను జాగ్రత్తగా దాచి ఉంచారు. కానీ లాభం లేకపోవడంతో చివరకు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పారు. దాంతో వైద్యులు ఎద్దుకు స్కాన్ చేయగా.. దాని కడుపులో మంగళసూత్రం కనిపించింది. ఈ క్రమంలో ఈ నెల 8న ఎద్దుకు ఆపరేషన్ చేసి దాని కడుపులో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. 40గ్రాముల బరువున్న ఈ మంగళసూత్రం ఖరీదు రూ.1.5లక్షలుంటుందని సదరు రైతు తెలిపాడు. ప్రస్తుతం ఎద్దు ఆరోగ్యం బాగానే ఉందని.. నెల రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందిగా వైద్యులు సూచించారని పేర్కొన్నాడు. -
ఎద్దు కనబడుట లేదు!
సాక్షి, పలమనేరు: ఎద్దు కనబడటం లేదంటూ కరపత్రాలు, వాల్పేపర్లు ముద్రించి గాలిస్తున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లిలో ఈ నెల 25న మైలేరు (ఎడ్ల పరుగు పందెం పోటీలు)ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచేగాక.. తమిళనాడు నుంచి కూడా భారీగా ఎద్దులను తెచ్చారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పనమడుగుకు చెందిన ఎద్దును దాని యజమాని కొందరితో కలిసి లారీలో తెచ్చారు. పండుగలో దాన్ని వదలిపెట్టే క్రమంలో మూడో రౌండ్లో అది కనిపించకుండా పోయింది. దాని కోసం గ్రామం చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండా పోయింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కౌండిన్య అడవిలో మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. దీంతో పట్టణంలోని పలు చోట్ల ఎద్దు కనిపించడంలేదంటూ వాల్పోస్టర్లంటించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దు ఆచూకీ కోసం కరపత్రాలను ముద్రించి పంచుతున్నారు. ఆచూకీ లభిస్తే సెల్ : 09585172143కు సమాచారం ఇవ్వాలని కూడా వాటిలో కోరారు. మైలేరు పండగల్లో బహుమతులు తెచ్చే ఈ ఎద్దులకు భలే గిరాకీ ఉంది. దీని ఖరీదు రూ.మూడు లక్షల దాకా పలుకుతుందట. తప్పిపోయిన ఎద్దు పేరు ఎక్స్ప్రెసిడెంట్. ఇది గతంలో పలు బహుమతులను సాధించింది. -
ప్రత్యేక ఆకర్షణగా సినిమాలోని ఎద్దు
సాక్షి,పెద్దవూర : ప్రముఖ హీరో పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో ఉన్న ఎద్దు పందేలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివరాత్రి సందర్భంగా దున్న ఇద్దాస్ ఆరాధనోత్సవాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎద్దుల పందేలను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన సోమవారం నిర్వహించిన సీనియర్ సైజు విభాగంలో కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన నవనీతకృష్ణ ఎద్దులు పాల్గొన్నాయి. చివరికి ఆ ఎద్దులు 3200 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతిని గెల్చుకున్నాయి. -
మోదీ ఓ ఎద్దు.. స్మృతి బలిష్టమైన ఆవు
మథుర: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కోసీకలాన్‌లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. -
వైరల్ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు
ఇస్లామాబాద్ : గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్‌తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈద్ అల్ అధా/ బక్రీద్‌ను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇబ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇవ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్‌ను జరుపుకోనున్నారు. -
వృషభం ఎక్కడికి పోతుంది?
హరికథా పితామహుడిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసు ఇంట్లో ఉన్నప్పుడు గోచీ మాత్రమే కట్టుకునేవారు. బయటికి వెళ్తే మాత్రం పట్టు వస్త్రాలు ధరించేవారు. గంధపు పూత, కొప్పుకు పూదండ, ఆభరణాలు, హారాలు... చాలా దర్జాగా ఉండేది వ్యవహారం. ఆ వేషధారణలో ఓసారి విజయనగరం ఆస్థానానికి వెళ్లారు. అసలే మనిషి ఎత్తు. ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండేవారు. దానికి తగిన లావు. ఈ ఆహార్యాన్ని చూసి, సంస్థానాధీశుడు శ్లేషగా, ‘కవి వృషభులు ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు’ అని పలకరించాడు. కవి కేసరి, కవి కోకిల లాంటి బిరుదులు ఇవ్వడం మన సాంప్రదాయమే. ఆ కోవలో కవి వృషభులు అనడం ఆదిభట్లను గౌరవించడమూ అదే సమయంలో వృషభంలా ఉన్నావు అని వెక్కిరించడమూ కూడా. మరి ఆదిభట్ల తక్కువవాడా? రాజు అంటే అన్నీ ఇచ్చేవాడు కదా! ఆ అర్థం వచ్చేట్టుగానూ మరో భావం స్ఫురించేట్టుగానూ చమత్కారంగా ఇలా జవాబిచ్చారు. ‘ఇంకెక్కడికి ప్రభూ, కామధేనువు లాంటి మీ దగ్గరికే’. -
ఎద్దు మాంసం అమ్ముతున్నారని..
భోపాల్ : ఎద్దు మాంసం అమ్ముతున్నారనే నెపంతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని అమ్‌ఘర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి బాదేరా పోలీసు స్టేషన్ పరిధిలో రియాజ్(45), షకీల్ (33)లు తమ ఊరికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు వీరికి ఎదురయ్యారు. రియాజ్, షకీల్ వద్ద ఎద్దు మాంసం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు వారు మాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రియాజ్ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న షకీల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. సంఘటనా స్థలంలో ఒక ఎద్దు కళేబరంతో పాటు మూటకట్టి ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అమ్మాయిల మెప్పు కోసం జల్లికట్టు ..
సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో సాహస క్రీడ జల్లికట్టుకు ఇప్పటినుంచే దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులుదిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈసారి మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రతా ఆంక్షల మధ్య సాగనుంది. ఆమేరకు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ఒక్క ఎద్దు హింసకు గురికాకుండా. ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు నిబంధనల రూపకల్పన చేస్తోంది. అతి నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడలను నిర్వహించేందుకు ఏడబ్ల్యూబీఐ ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, చెన్నై: ‘ముత్యాల ముగ్గులు, రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. బోగి మంటలు, పొంగళ్లతో ఇంటిల్లి పాది సంబరాలు’ ఇది సంక్రాంతి సందడి. అయితే, తమిళనాట ఈ సంబరాలకు తోడుగా వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు పెద్ద పీట వేయడం ఆనవాయితీ. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తూ, తమ పౌరుషాన్ని చాటుకునే క్రీడాకారులతో ఈ క్రీడ సాగుతుంది. అయితే, ఈ సారి ఈ జల్లికట్టు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రత ఆంక్షల మధ్య సాగనుంది. ఇందుకు తగ్గ కార్యాచరణను అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియ (ఏడబ్ల్యూబీఐ) రూపొందిస్తున్నది. రాష్ట్రంలో సాహస, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు పేరుగడించింది. ఈ క్రీడ ఎప్పటి నుంచి సాగుతోందో అన్నది ఓ ప్రశ్నగానే మిగిలింది. ఒకప్పుడు తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చేబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడను మంజు విరాట్, వడి మంజువిరాట్, వెల్లి విరాట్, వడం విరాట్ పేర్లతోనూ పిలుస్తుంటారు. ‘‘సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా ...చివరకు జల్లికట్టుగా’ ఈ సాహస క్రీడ రూపాంతరం చెందినట్టుగా పురాణాలు చెబుతుంటాయి. తొలి నాళ్లల్లో యువతుల్ని మెప్పించేందుకు యువకులు సాహసాన్ని ప్రదర్శిస్తే, రాను రాను ఇదో రాక్షసక్రీడగా మారిందని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా కనుమనాడు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటు వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు ఉన్నారు. తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరు అయితే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరి కొందరు. ఈ క్రమంలో కదన రంగంలోకి దిగే ఎద్దులను హింసించడం పెరిగింది. తప్పించుకునే క్రమంలో క్రీడా కారులపై తమ ప్రతాపాన్ని ఎద్దులు చూపించడం, వాటి దాటికి బలైన వారెందరో ఉన్నారు. అలాగే, కదనరంగంలో దిగే బసవన్నలు రంకెలు వేసే విధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడం వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో జల్లికట్టుకు దూరంగా రెండేళ్లు గడపాల్సిన పరిస్థితి. కోర్టు స్టే విధించడంతో జల్లికట్టు ఇకలేనట్టే అన్న పరిస్థితి తప్పలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో దేశమే తమిళనాడు వైపుగా చూసే స్థాయిలో సాగిన ఉద్యమంతో మళ్లీ జల్లికట్టు తమిళుల సొంతం అయింది. జల్లికట్టు కట్టుదిట్టం: గట్టి భద్రత నడుమ ఈ సారి జల్లికట్టును జరుపనున్నారు. అయినా, జల్లికట్టుకు నిషేధం లక్ష్యంగా పీట తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ సంక్రాంతి పర్వదినం వేళ సమీపిస్తుండడంతో ఇప్పటి నుంచే సాహస క్రీడ జల్లికట్టుకు దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. ఇప్పటి నుంచి వాటికి మంచి ఆహారంతో పాటు, శిక్షణ మెళకువల్ని ఇస్తూ గెలుపు బావుటాకు వాటి యజమానులు సిద్ధం అవుంటే, రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులు దిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈ సారి మరింత కట్టుదిట్టంగా నిబంధనల అమలు మీద ఏడబ్ల్యూబీఐ దృష్టి పెట్టింది. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఆర్ గుప్తా ప్రధానంగా జల్లికట్టుకు కొత్త ఆంక్షలు, నిబంధనల రూపకల్పన మీద దృష్టి పెట్టారు. ఏ ఒక్క ఎద్దు హింసించ బడకుండా ఉండే రీతిలో, ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు తగ్గట్టుగా ఈ సారి నిబంధనల రూపకల్పన సాగనుంది. అతిపెద్ద మైదానం, భారీ భద్రతతో, సందర్శకుల భద్రత నిమిత్తం ప్రత్యేక గ్యాలరీలతో పాటుగా అన్ని రకాల నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడల్ని నిర్వహించే విధంగా ముందుకు సాగునున్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నిబంధనలు నివేదిక రూపంలో చేరనుంది. ఆ తదుపరి నిర్వాహకులు, క్రీడాకారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యాచరణతో ఈ సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టును విజయవంతం చేయబోతున్నారు. -
ర్యాకింగ్ జోష్..
సానుకూల పరిణామాలతో మార్కెట్లలో బుల్ పరుగు కొనసాగుతోంది. సూచీలు కొంగొత్త గరిష్ట స్థాయిలు చేరుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు వ్యాపార సానుకూలతల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్–100లోకి చేరడం దేశీ సూచీలకు మరింత జోష్ని చ్చింది. బుధవారం నిఫ్టీ తొలిసారిగా 10,400 పాయింట్ల ఎగువన ముగియగా, సెన్సెక్స్ 387 పాయింట్లు ఎగిసింది. కీలకమైన మౌలిక రంగం సెప్టెంబర్‌లో 6 నెలల గరిష్టమైన 5.2 శాతం వృద్ధి నమోదు చేయడం కూడా మార్కెట్ల పరుగుకు దోహదపడింది. అలాగే, మరికొన్ని కంపెనీలు అంచనాలకన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుండటం సైతం స్టాక్ మార్కెట్లు ఎగియడానికి తోడ్పడ్డాయి. విస్తృతంగా కొనుగోళ్లు.. దాదాపు అంతటా కొనుగోళ్ల ఊతంతో నిఫ్టీ ఇంట్రా డేలో 10,450 పాయింట్ల స్థాయిని తొలిసారిగా దాటింది. చివరికి 1.02 శాతం లాభంతో 105 పాయింట్లు పెరిగి 10,440.50 వద్ద క్లోజయ్యింది. అక్టోబర్ 30న నమోదు చేసిన 10,363.65 పాయింట్ల క్లోజింగ్ రికార్డును అధిగమించింది. అటు దూకుడుగానే ప్రారంభమైన సెన్సెక్స్ సైతం ఇంట్రాడేలో మరో కొత్త గరిష్ట స్థాయి 33,651.52 పాయింట్లకు చేరింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ.. 387 పాయింట్ల పెరుగుదలతో 33,600 వద్ద ముగిసింది. అక్టోబర్ 30న నమోదైన 33,266 పాయింట్ల రికార్డును దాటేసింది. ర్యాంకు చలవే..: వరల్డ్ బ్యాంక్ రూపొందించిన వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ ఏకంగా 130వ స్థానం నుంచి 100వ స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మెరుగైన మౌలిక రంగ గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పరిణామాలు సైతం దేశీ సూచీలకు ఊతమిచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఇక రూపాయి బలపడటం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంజీసీ రంగాలపై సెంటిమెంటు మెరుగుపడటం కూడా మద్దతునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద (బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్) మరో రూ. 1.08 లక్షల కోట్ల మేర పెరిగి రూ. 145 లక్షల కోట్లకు చేరింది. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఎయిర్టెల్ 8 శాతం జంప్.. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో కొనుగోళ్లు గణనీయంగా జరిగాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు భారీ లాభాలతో మిగతా స్టాక్స్‌కి సారథ్యం వహించింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ లాభాలు భారీగా తగ్గినప్పటికీ.. షేరు మాత్రం 8 శాతం పైగా పెరిగింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ 4.58 శాతం దాకా పెరిగాయి. స్మాల్‌క్యాప్ సూచీ 0.55 శాతం, మిడ్‌క్యాప్ 0.35 శాతం పెరిగాయి. బీఎస్ఈలో రూ. 5,318 కోట్ల టర్నోవర్ నమోదైంది. అమెరికాలో కీలక వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆసియా, యూరప్ మార్కెట్లలో కూడా లాభాల ట్రెండ్ కనిపించింది. రిలయన్స్@ 6 లక్షల కోట్లు మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ వేల్యుయేషన్ రూ. 6 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది. మార్కెట్ వేళలు ముగిసేసరికి రూ.6,03,097.82 లక్షల కోట్లుగా నమోదైంది. దేశీయంగా మార్కెట్ క్యాప్ రూ. 6 లక్షల కోట్లు దాటేసిన తొలి కంపెనీగా ఆర్ఐఎల్ నిల్చింది. అక్టోబర్ 24న రిలయన్స్ మార్కెట్ క్యాప్ స్వల్ప సమయం పాటు ఈ మార్కును దాటినప్పటికీ నిలదొక్కుకోలేదు. అయితే, బుధవారం ట్రేడింగ్‌లో మాత్రం రూ. 6 లక్షల కోట్లు దాటేసి ముగిసింది. బీఎస్ఈలో కంపెనీ షేరు 1.22% పెరిగి రూ.952 వద్ద క్లోజ య్యింది. లావాదేవీల పరిమాణం బట్టి చూస్తే బీఎస్ఈలో 4.56 లక్షలు, ఎన్ఎస్ఈలో 80 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ ప్రకారం టాప్ 5 స్థానాల్లో ఆర్ఐఎల్ తర్వాత టీసీఎస్ (రూ. 4.98 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 4.70 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 3.28 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ. 2.79 లక్షల కోట్లు) ఉన్నాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ వేల్యుయేషన్ మరోసారి రూ. 2 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో రైతు చిన్న తిక్కన్నకు చెందిన ఒక ఎద్దు మృతిచెందింది.అలాగే తెలుగు లక్ష్మన్నకు చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బతినింది. గ్రామంలో పదికిపైగా టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు రంగన్న, లక్ష్మన్న, బుడ్డ వెంకటేష్ తదితరులు వాపోయారు.గాలివానకు ఒక ట్రాన్స్ఫారం, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌కో ఏఈ ప్రియాంక గ్రామాన్ని సందర్శించి సిబ్బందితో విద్యుత్లైన్లను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేశారు. నోడలాఫీసర్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ అదెయ్య, ఏఓ అక్బర్‌బాషా, పశువైద్యాధికారులు నిర్మలమ్మ, చంద్రమౌళి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత రైతును పరామర్శించి సాయం నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. -
స్టాలిన్@65.. బహుమతిగా నల్లటి ఎద్దు
చెన్నై: తమిళనాడు డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ 65వ పడిలోకి అడుగుపెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఆయన తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో బహుమతులు అందించారు. అందులో భారీ సంఖ్యలో పుస్తకాలు ఉండటంతోపాటు ఓ భారీ ఎద్దు కూడా ఉంది. ఎద్దును ఎందుకు బహుమతిగా ఇచ్చారంటే.. జల్లికట్టు నిర్వహించేలా ప్రభుత్వంపై ప్రజల పక్షాన తీవ్ర ఒత్తిడి చేసి విజయం సాధించినందుకు గుర్తుగా అందించినట్లు చెప్పారు. ఎద్దు సామర్థ్యానికి గుర్తు అని, ప్రజా సమస్యల విషయంలో స్టాలిన్ కూడా ఎంతో సమర్థతతో ముందుకెళతారని అందుకే ఆయనకు ఇలాంటి బహుమతి ఇచ్చినట్లు చెప్పారు. డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో నల్లటి ఎద్దును దాని కొమ్ములకు డీఎంకే పార్టీ రంగులు వేసి చక్కగా అలంకరించి స్టాలిన్‌కు బహుమానంగా అందించారు. దీనిని అందుకుంటూ తనకు దక్కిన గొప్ప బహుమతి అంటూ స్టాలిన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
వృషభం ధర రూ. 4లక్షలు
పోలకల్(సి.బెళగల్) : ఈ వృషభం రూ. 4 లక్షలు ధర పలికింది. ఇది మండలపరిధిలోని పొలకల్ గ్రామానికి చెందిన మహేంద్ర నాయుడు అను రైతుది. జిల్లాస్థాయిలో జరిగే బండలాగుడు పోటీలలో పాల్గొనే ఈ వృషభానికి సరైన జోడి లేకపోవడంతో శిరివెళ్ల మండలం వీరిరెడ్డి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి అనే రైతుకు విక్రయించాడు. -
పండుగ శోభ
పంట సాగులో కీలకమైన పశువులంటే అన్నదాతలకు మక్కువ ఎక్కువ. పండుగలు వస్తే వాటి పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ అంటే తమ ఇంట ఉన్న పశువులను ప్రత్యేకంగా అలంకరించి మురిసిపోతుంటారు. ఇందులో భాగంగానే వాటికి సంబంధించి ఇంతకాలం భద్రంగా దాచి ఉంచిన అలంకరణ సామగ్రిని బయటకు తీశారు. వృషభాల కొమ్ములకు రంగులు అద్దడం. రంగురంగుల ఉలన్తో చేసిన కుచ్చులతో సింగారిస్తున్నారు. అద్దాలు పొదిగిన ఫణికట్లను కపాలభాగానికి అమర్చారు. మెడలో గంటల పట్టీ, మెడ కింద నల్లదారాలు, వీపుపై గోపురానికి రంగురంగుల కుచ్చులు... కాళ్లకు గజ్జెలు.. రంగుల ముకుతాడు... ఇలా ప్రత్యేకంగా అలంకరించిన వృషభాలు పల్లెసీమలో పండుగకు నూతన శోభను తీసుకొస్తున్నాయి. - ఆత్మకూరు -
ఈ బర్రె ఏ హీరో ఫ్యానో తెలుసా?
హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. కొందరు హీరోలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరికొందరు హీరోలంటే అమ్మాయిలు పడిచస్తారు. ఇంకొందరి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడతారు. ఇలా చెప్పుకుంటూపోతే ఫ్యాన్ ఫాలోయింగ్‌లోనూ రకాలు ఉంటాయి. కానీ ఓ స్టార్ హీరోను బర్రె ఫాలో కావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదా! కానీ బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ అంటే బర్రెలు పడి చస్తాయట. ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. సహజంగా అందరు హీరోలకు మనుష్యులు అభిమానులుగా ఉంటారు. కానీ వెరైటీగా నాకు బర్రెలు అభిమానులైపోయాయి. నేను ఏడికిపోతే ఆడికి వచ్చేస్తున్నాయి. ప్రేమను నేను స్వాగతిస్తున్నానంటూ తన కారు వెంట ఫాలో అవుతున్న బర్రెలతో సెల్ఫీ దిగి మరీ ట్విట్టర్లో పెట్టాడు అక్కీ. ఆ మధ్య ఓ పాకిస్థాన్ జర్నలిస్టు బర్రెను ఇంటర్వ్యూ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా మన అక్కీ కూడా బర్రెల నాడీ పట్టేసినట్టున్నాడు. ఓ అభిమాన బర్రెతో ఆయన నవ్వుతూ సెల్ఫీ దిగుతుండగా.. ఆ బర్రె ఆయనను ఎంత ఆసక్తిగా చూస్తుందో చూడండి. నిజమే మనమిప్పుడు ఒప్పుకోవచ్చు ఈ బర్రె డెఫినెట్‌గా అక్కీ ఫ్యానే అయి ఉంటుందని అభిమానులు ఎక్కసెక్కమాడుస్తున్నారు! అన్నట్టు మన అక్కీ భాయ్ లేటెస్ట్ సినిమా 'రుస్తుం' ఈ శుక్రవారమే వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో బిజిగా ఉన్న అక్షయ్‌కుమార్ ట్విట్టర్ నిండా ఈ సినిమా కబుర్లతో నింపేస్తున్నాడు. All love is welcome. People have fan following,I have bull following...seriously this is not bullsh*t! Look -
ఎద్దు పొడిచి వ్యక్తి మృతి
కన్నబిడ్డల సాకుతున్న ఎద్దు పొడవడంతో.. రైతు మృతిచెందాడు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రానికి చెందిన నర్సింహులు ఆదివారం ఉదయం పశువులను మేత కోసం తీసుకెళ్తుండగా.. ఆయన ఎద్దు కొమ్ములతో దాడి చేసింది. దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. -
'బాద్షా మిస్సింగ్.. జాడ చెబితే 50 వేలు'
వారణాసి: కొందరు బంధుత్వాలకు బానిసలు. ఆ బంధుత్వాలు మనుషులతో బలహీనంగా ఉంటాయేమోగానీ, మూగజీవాలతో అయితే మాత్రం చాలా గాఢంగా ఉంటాయి. ఎందుకంటే తమకు ఇష్టమైన మూగజీవం కనిపించడం లేదని రోజుల తరబడి తిండితిప్పలు మానేసిన సందర్భాలు కోకొల్లలు. వాటికోసం కాలం చేసినవారు లేకపోలేరు. అంత గాఢంగా మూగజీవాలతో అనుబంధం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఈ ఘటన కూడా మూగజీవాలకు మనుషులకు మధ్య ఉన్న ప్రేమ ఏమిటో తెలియజేస్తుంది. తప్పిపోయిన తన ఎద్దును గుర్తించి తిరిగి తమకు అప్పగించిన వారికి రూ.50 వేలు రివార్డును ప్రకటించాడు వారణాసికి చెందిన ఓ వ్యక్తి. వారం రోజులపాటు దానికోసం చెప్పులు అరిగేలా తిరిగి ఆచూకీ కనిపించకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఎద్దు పోస్టర్లను పలు ప్రాంతాల్లో గోడలకు అంటించి దానిని గుర్తించినవారికి రూ.50 వేలు పారితోషికం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అయితే, కేసును మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న పోలీసులు ఏ మాత్రం ముందడుగు వేయలేదు. కానీ, సమాజ్‌వాది పార్టీ నేత అజాంఖాన్ బర్రెలు పోయినప్పుడు మాత్రం మొత్తం సీనియర్ పోలీసు పటాలమంతా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సారనాథ్‌కు చెందిన మనోజ్ కుమార్ పాండే అని వ్యక్తికి ఒక మూడేళ్ల ఎద్దు ఉంది. అది కొంచెం నలుపు, తెలుపు ఎరుపుతో ఉంది. అదంటే అతడికి ఎంతో ప్రేమ కావడంతో చాలా బాగా చూసుకున్నాడు. దీంతో అది చాలా బలిష్టంగా ఆకట్టుకునేలా తయారైంది. దానికి అతడు ముద్దుగా 'బాద్ షా' అని పేరు కూడా పెట్టుకున్నాడు. వారం రోజుల కిందట తన బాద్షా కనిపించకుండా పోయాడు. దీంతో తొలుత తనకు పరిచయం ఉన్న అన్ని చోట్లలో వెతికిన పాండే చివరకు పోలీసులను ఆశ్రయించి రివార్డు కూడా ఇస్తానని ప్రకటన చేశాడు. మరో విచిత్రం ఏమిటంటే వారు భోజనం చేసే ముందు ఆ ఎద్దు కిచెన్‌కు వస్తుందట. తను నిద్రపోయే సమయంలో బెడ్ రూంలోకి వచ్చి పడుకుంటుందని, తన దృష్టిలో అది కేవలం ఎద్దు మాత్రమే కాదని, తమ కుటుంబ సభ్యుడు అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
సగం తెగిన గంగడోలుతో రోడ్డుపై పరుగు..
'అంబా..' అని ఆర్తనాదం కూడా చేయలేని స్థితితో.. సగం తెగిపోయిన గంగడోలు(మెడ కింది భాగం)తో రోడ్డుపై నిల్చున్న మూగజీవిని ఆదరించి అక్కున చేర్చుకున్నాడో మానవతావాది. సోమవారం అర్ధరాత్రి నగరంలోని నాచారం పారిశ్రామిక ప్రాంతం పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ అనుమతితో నడుస్తోన్న కబేళాల్లో అర్ధరాత్రి ఎద్దులు, బర్రెలను కోసి ఉదయానికల్లా దుకాణాలకు మాసం సరఫరా చేస్తుంటారు నిర్వాహకులు. అలా సోమవారం రాత్రి నాచారంలోని కబేళాలో ఎద్దును కోసేందుకు ప్రయత్నించగా, అది తప్పించుకుని రోడ్డుపైకి వచ్చేసింది. రక్తం ధారలా కారిపోతూ తెగిన మెడతో దీనంగా నిల్చున్న ఎద్దును శివప్రకాశ్ అనే వ్యక్తి గుర్తించాడు. వెంటనే ఆ ఎద్దును తన ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశాడు. మంగళవారం పొద్దున్నే ఎద్దును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మూగజీవి పూర్తిగా కోలుకున్న తర్వాత మేడ్చల్‌లోని గోశాలకు దానిని అప్పగిస్తానని ప్రకాశ్ తెలిపారు. ఆపదలో ఉన్న మనుషులను సాటి మనుషులే ఆదుకోలేకపోతోన్న నేటికాలంలో మూగజీవాన్ని ఆదరించిన ప్రకాశ్ ను పలువురు అభినందించారు. -
బిగ్ (హర్న్స్) రెడ్907
ఫొటో చూడగానే అర్థమైపోలే.. దీని ప్రత్యేకత ఏమిటో.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొమ్ములు కలిగిన ఎద్దు. పేరు బిగ్ రెడ్907. నివాసం అమెరికాలోని టెక్సాస్. రెండు కొమ్ముల పొడవు ఈ మూల నుంచి ఆ మూలకు లెక్కేస్తే.. 115.6 అంగుళాలు(9.6 అడుగులు) ఉంటుంది. -
సై.. సై.. బసవన్నా!
-
ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఎండింది..
అప్పుల బాధతో 10 మంది రైతుల ఆత్మహత్య ముస్తాబాద్/మంథని: ఎద్దు ఏడ్చిన ఎవుసానికి.. రైతు ఏడ్చిన రాజ్యానికి కష్టకాలమే మిగులుతుంది. ఇంటిల్లిపాదీ ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసి కష్టపడ్డా.. వర్షాభావంతో పం ట లెండి, కనీసం పెట్టుబడి కూడా దక్కక.. అప్పులెలా తీర్చాలనే వేదనతో అన్నదాతలు ఉసురుతీసుకుంటున్నారు. పంట నష్టం, అప్పులబాధతో గురువారం తెలంగాణ జిల్లాల్లో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మం డలం పోత్గల్‌కు చెందిన నీరటి రాములు(28), మంథని మండలం కూచిరాజ్‌పల్లికి చెందిన రైతు అంబటి సంపత్(35), మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెం దిన బి.రవీందర్‌రెడ్డి(45), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన నాగరబోయిన ఓదేలు(30), మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన నూనె వెంకన్న(55), రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం డబీల్‌పూర్ గ్రామానికి చెందిన యువరైతు సత్యనారాయణ(26), పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన కావలి తిరుమలయ్య(50), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన పత్తి రైతు రాయల వీరన్న(50), నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట గ్రామానికి చెందిన రైతు కొడిపాక సాయిబాబా (37), కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో శనిగరం మధునయ్య బల వన్మరణాలకు పాల్పడ్డారు. -
కడియం చెప్పిన 'ఎద్దు-కుక్క' కథ!
* ఎర్రబెల్లిని పరోక్షంగా కుక్కతో పోల్చిన డిప్యూటీ సీఎం * తన కులం తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలపై సమాధానం చెప్పడం ఇష్టం లేకపోయినా ప్రజల కోసం చెప్పాల్సి వస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. తాను చెబితేనే కడియంకు మంత్రి పదవి వచ్చిందని, అది తన భిక్షే అంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను కొందరు విలేకరులు ప్రస్తావించగా కడియం స్పందించారు. దయాకర్‌రావును ఉద్దేశించి ఎద్దు-కుక్క కథను చెప్పుకొచ్చారు. ‘‘ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో మెలుక్కొని ఇంటికి వస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయాసం వచ్చి బండి కింద నీడలో నడుస్తూ ఇంటి వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. బయటకు వచ్చి అదే బండిని లాక్కొచ్చిన ఎద్దు వైపు చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది. ‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట..’’ అని కడియం చెప్పారు. ‘మీరు ఎర్రబెల్లిని కుక్కతో పోల్చుతున్నారా’ అని ప్రశ్నించగా.. ఆ మాట తాను అనలేదని, మేధావులైన మీకు అర్థమై ఉందనుకుంటానని విలేకరులతో అన్నారు. ‘‘ఆయన నా పుట్టుకను, నా కులాన్ని, రాజకీయాన్ని కాంట్రవర్సీ చేయాలని చూస్తాడు. అవకాశాలు కలిసి వచ్చాయి. నేనేం చేయాలి’’ అని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు, కులాన్ని తప్పుగా చూపించినట్లు ఆధారాలతో వస్తే పదవికి రాజీనామా చేస్తానని, ప్రజలకు క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు. ఓసారి ఎర్రబెల్లి, మరోసారి మోత్కుపల్లి, ఇంకోసారి సర్వే తన గురించి, తన కులం గురించి మాట్లాడుతున్నారన్నారు. తనను, తన కులాన్ని అవమానిస్తే చట్టపరంగా చర్యలు చేపడతానన్నారు. -
అసలు బుల్ మార్కెట్ ముందుంది..!
* ఇది ట్రయల్ మాత్రమే: ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా * కమోడిటీ ధరలు ఇక పతనమే 80 డాలర్లలోపే చమురు ధరలు * ఆయిల్ షేర్లపై దృష్టి... పెట్టుబడికి ఓఎన్జీసీ అత్యుత్తమం ముంబై: ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దేశీ స్టాక్ మార్కెట్లలో అసలుసిసలు బుల్ దశ మొదలైందంటూ వ్యాఖ్యానించారు. ఇది మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అంటూ చెప్పిన రాకేష్ దీపావళి సందర్భంగా ఒక చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి మార్కెట్లపై అత్యంత ఆశావహంగా స్పందించారు. బిగ్‌బుల్‌గా ప్రసిద్ధులైన రాకేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... ‘దేశీ స్టాక్ మార్కెట్ సినిమాలో ట్రయిలర్ మాత్రమే మొదలైంది. అసలు సినిమా ముందుంది. అయితే తీవ్ర కరెక్షన్లకు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్ మార్కెట్లో దిద్దుబాట్లు సహజం’. ఇప్పుడే చెప్పలేం మోడీ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేం. మనది ప్రజాస్వామ్య దేశం. మార్పులు సహజం. అయితే ఆరు నెలల్లోనే మోడీ అద్భుతాలు చేస్తారని ఆశించడం తప్పు. అయితే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు కనిపించే అవకాశముంది. చమురు ధరలు లేదా కమోడిటీల పతనానికి అందరూ అనుకంటున్నట్లు వినియోగం తగ్గడం కారణంకాదు. గత 15ఏళ్లలో కమోడిటీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం ఇది అంతమైనట్లే. ఇకపై కమోడిటీల్లో భారీ దిద్దుబాటు(కరెక్షన్) జరిగే అవకాశముంది. అంతేకాదు. ఇది బేర్ ట్రెండ్‌కు దారితీయొచ్చుకూడా. పతనమవుతున్న చమురు ధరలు బ్యారల్‌కు 70-80 డాలర్ల ధరలో స్థిరపడే అవకాశముంది. నా అంచనా ప్రకారం దీర్ఘకాలంపాటు ఇదే స్థాయిలో ధరలు కొనసాగవచ్చు. ఆయిల్ షేర్లు భేష్ ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ లబ్దిపొందనున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఓఎన్జీసీ పట్ల బుల్లిష్‌గా ఉన్నాను. ఇప్పటికే ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేశాను కూడా. 2016 తరువాత ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని పూర్తిగా తొలగించే అవకాశముంది. ఇందువల్ల ఆయిల్ ధరల పతనం నుంచి బాగా లాభపడేది ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అని చెప్పొచ్చు. అంచనా వేయలేం దేశీ మార్కెట్లు సాధించబోయే వృద్ధి పట్ల నేను చూపుతున్న ఆశావహ థృక్పథానికి బిగ్బుల్, మ్యాడ్‌బుల్ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు. అయితే సైక్లికల్ అప్‌ట్రెండ్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో వ్యవస్థాగత బుల్‌ట్రెండ్ కనిపించనుంది. 2017-18 తరువాత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని సాధించనుంది. ఇది ఎన్నేళ్లు కొనసాగుతుందన్నది అంచనా వేయలేం. విదేశీ అంశాల ఎఫెక్ట్ తక్కువే కమోడిటీల పతనం, ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు వంటి సమస్యలను ప్రస్తుతం ధనిక దేశాలు ఎదుర్కొంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశమెక్కడ ఉంది? ఒకవేళ పెంచినా ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే. ఇండియా గరిష్ట స్థాయిలో వృద్ధి సాధించనున్న దేశం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయ్. సంస్కరణలు పుంజుకుంటే పెట్టుబడుల వెల్లువెత్తుతాయ్. రేర్ ఎంటర్‌ప్రజైస్ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే రాకేష్ గత ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలపై ఇటీవల ఒక పత్రిక లెక్కకట్టింది. ట్రేడింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి గంటకూ రాకేష్ రూ. 35 లక్షలు సంపాదించారంటూ పేర్కొంది. -
ఆ ఎద్దు పొలంలో దిగితే..
రాయదుర్గం రూరల్: ఒంటెద్దు గొర్రు అని చిన్నచూపుచూడొద్దు.. తన ఎద్దు తలచుకుంటే జోడెద్దుల గొర్రునే తలదన్నుతుందని నిరూపించాడు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలానికి చెందిన వన్నూరుస్వామి. రాయదుర్గం మండలం కొంతానపల్లిలో ఆదివారం ఒంటెద్దు గొర్రుతో ఏకంగా 12 ఎకరాల్లో వేరుశెనగ విత్తనాలు విత్తి ఔరా అనిపించాడు. సూర్యుడు ఉదయించి.. అస్తమించే లోపు ఈ పని పూర్తిచేశాడు. సాధారణంగా జోడెద్దుల నాలుగుసాళ్ల గొర్రుతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల్లో విత్తనం వేయవచ్చు. అయితే.. వన్నూరుస్వామి ఒంటెద్దు గొర్రుతోనే 12 ఎకరాల్లో విత్తనం వేయడాన్ని రైతులు ఆసక్తిగా గమనించారు. ఈ దృశ్యాన్ని పరిసర ప్రాంత రైతులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించారు. -
మార్కెట్ కళ్లన్నీ ఎన్నికల ఫలితాలపైనే...
ముంబై: గత మూడేళ్లలోలేని విధంగా ఈ ఏడాది జనవరి నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును అందుకున్నాయి. ఇందుకు అనేక అంశాలు దోహదపడినప్పటికీ ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న సానుకూల అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తూ వచ్చాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీ సాధించి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు అనుగుణంగా దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐలు కుమ్మరిస్తున్న భారీ పెట్టుబడులు ప్రధాన ఇండెక్స్‌లను పరుగు పెట్టిస్తున్నాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 23,000 పాయింట్ల సమీపానికి చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,800ను అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మార్కెట్లు కొంత వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ తగిన మెజారిటీని సాధించలేకపోవచ్చునంటూ తాజాగా విశ్లేషణలు వెలువడుతుండటమే దీనికి కారణం. ఈ అంశాల నేపథ్యంలో ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత మార్కెట్ల కదలికలపై వివిధ బ్రోకింగ్ సంస్థలు, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.... ఎన్డీఏకి మెజారిటీ రాకపోతే 10-15% పతనం కావచ్చు... కరెంట్ ఖాతా లోటు భారీగా తగ్గడం, ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్టానికి దిగిరావడం వంటి అంశాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఆరు నెలల క్రితంతో పోలిస్తే దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వాల ఏర్పాటుకు, మార్కెట్ల పనితీరుకు అంతగొప్ప లింకు లేనప్పటికీ, స్వల్ప కాలంలో ఎన్నికల ఫలితాలు ఇండెక్స్‌లను భారీ ఒడిదుడుకులకు లోను చేస్తాయి. అంచనాలకు భిన్నంగా ఎన్డీఏకు మెజారిటీ రాకపోతే 10-15% వరకూ మార్కెట్లు పతనం కావచ్చు. రాజకీయ కారణాలను పక్కనపెడితే ఆర్థిక అంశాల రీత్యా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. - జ్యోతివర్థన్ జైపూరియా, ఎండీ, బీవోఎఫ్‌ఏ మెరిల్లించ్ 9 ఎన్నికల్లో 7 సార్లు లాభాలే... మార్కెట్లు ఖరీదైనవిగా లేవు. గత ఐదేళ్ల సగటులోనే ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇది సరైన సమయం. కొంతమంది ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నా, ఎన్నికల ఫలితాల కోసం మార్కెట్లు వేచిచూస్తున్నాయి. 1980 నుంచి చూస్తే 9 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తరువాత రెండేళ్ల కాలవ్యవధిలో 7 సార్లు మార్కెట్లు సానుకూలంగానే స్పందించాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత రెండు మూడు నెలల్లో మార్కెట్లలో జరిగేవాటికి ప్రాధాన్యం ఇవ్వబోము. - సంజయ్ చావ్లా, సీఐవో, బరోడా పయనీర్ ఏఎంసీ నిఫ్టీ 7,200ను తాకే చాన్స్... అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడితే అంటే ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తే మే నెలాఖరుకల్లా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,200ను అధిగమిస్తుంది. సుమారు ఐదేళ్ల తరువాత బుల్ మార్కెట్ మొదలైంది. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన పరపతి విధానాలు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తున్నాయ్. ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు కట్టడి ఎఫ్ఐఐల నమ్మకాన్ని పెంచింది. - సుదీప్ బందోపాధ్యాయ్, ప్రెసిడెంట్, డెస్టిమనీ సెక్యూరిటీస్ 5 శాతం పుంజుకుంటాయ్... ఎన్డీఏకు మెజారిటీ వస్తే మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్న ర్యాలీ కొనసాగుతుంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే... ప్రధాన ఇండెక్స్‌లు మరో 5%మేర పుంజుకుంటాయ్. ఒకవేళ ఎన్డీఏకు 230-270 మధ్య సీట్లు పరిమితమైతే మార్కెట్లు కొంతమేర దిద్దుబాటుకు లోనవుతాయి. ఇవన్నీ స్వల్పకాలిక మార్పులే. మధ్య, దీర్ఘకాలానికి ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు మరింత పటిష్టపడతాయ్. - వికాస్ ఖేమానీ, సీఈవో, ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ ఈ మే నెలకు ప్రాధాన్యం సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ ఏడాది మే నెలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 2009 మే నెలలో 28% లాభపడింది. ఇక 2004 మే నెలలోనూ 17% ఎగసింది. ఇక 2011, 2012లలో 3-6% స్థాయిలో నష్టపోయినప్పటికీ, తిరిగి 2013 మే నెలలో అయితే 1% పెరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 14 పీఈలో ట్రేడవుతోంది. దీర్ఘకాలిక సగటు 15కంటే ఇది తక్కువేకాగా, ప్రోత్సాహకర ఎన్నికల ఫలితాల వంటి పరిస్థితుల్లో ఇంతకంటే బాగా అధిక స్థాయిల్లోనూ ట్రేడైన సందర్భాలున్నాయి. ఇప్పటికే నిఫ్టీ ఇటీవల 400 పాయింట్లు లాభపడ్డ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇన్వెస్ట్‌మెంట్‌కు దిగడం ఉత్తమం. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారీటీ లభించని పక్షంలో మే 16 తరువాత కనీసం రెండు వారాలు మార్కెట్లలో కరెక్షన్కు అవకాశముంటుంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు వివిధ రంగాలు, కంపెనీలపై దృష్టిపెట్టవచ్చు. - జయంత్ మాంగ్లిక్, రిటైల్ పంపిణీప్రెసిడెంట్, రెలిగేర్ సెక్యూరిటీస్ -
బేర్ 'విశ్వ' రూపం !
సెన్సెక్స్ 426 పాయింట్లు డౌన్ 5 నెలల్లో అతిపెద్ద పతనం పడగొట్టిన విదేశీ కారణాలు బ్యాంకింగ్, రియల్టీ విలవిల కుప్పకూలిన చిన్న షేర్లు రూపాయి క్షీణత ఎఫెక్ట్ కూడా కొద్ది రోజులుగా బుల్ ధోరణిలో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లకు సోమవారం షాక్ తగిలింది. చలికాలంలో సైతం ఇండియా మొదలు ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లకు అమ్మకాల సెగ తగిలింది. దీనికి గత వారం చివర్లోనే బీజం పడగా... సోమవారం నష్టాలు ఉధృతమయ్యాయి. వెరసి అమెరికా, ఆసియా, యూరప్ ఇండెక్స్‌లు 1-3% మధ్య నష్టపో గా, దేశీయ మార్కెట్లు 2% స్థాయిలో పతనమయ్యాయి. మూడు వారాల కనిష్టం చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా డీలాపడ్డాయి. ఐదు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 426 పాయింట్లు పతనమైంది. 20,707 వద్ద ముగిసింది. ఇది 3 వారాల కనిష్టంకాగా, ఇంతక్రితం 2013 సెప్టెంబర్ 3న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 651 పాయింట్లు దిగజారింది. కాగా, నిఫ్టీ కూడా 131 పాయింట్లు పడిపోయి 6,136 వద్ద నిలిచింది. ఇది 2 నెలల కనిష్టంకావడం గమనార్హం. మార్కెట్ల పతనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు శాసించినప్పటికీ, జనవరి నెల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారం(30న) ముగియనుండటంతో ట్రేడర్లు అమ్మకాలకు పరుగు తీశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు డాలరుతో మారకంలో రూపాయి10 వారాల కనిష్టానికి చేరడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రారంభమే నష్టాలతో బలహీనపడ్డ సెంటిమెంట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 235 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆపై ఏ దశలోనూ కోలుకోకపోగా కనిష్టంగా 20,688ను తాకింది. ఇది దాదాపు 450 పాయింట్ల నష్టం! దీంతో పాటు వర్థమాన మార్కెట్ల కరెన్సీలు, స్టాక్ మార్కెట్లు కూడా క్షీణించాయి. యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.5-1% మధ్య నష్టపోగా, ఆసియాలో తైవాన్, చైనా, సింగపూర్, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా 1-2.5% మధ్య పడ్డాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు 2%పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వడ్డీ భయాలు... సోమవారం ట్రేడింగ్‌లో ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు బిత్తరపోయాయి. వడ్డీ రేట్ల నిర్ణయాలలో రిటైల్ ద్రవ్యోల్బణానికి ప్రాధాన్యం ఇవ్వమంటూ ఆర్బీఐ కమిటీ సూచించడం ప్రభావం చూపింది. బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ ఏకంగా 7% కుప్పకూలగా, బ్యాంకెక్స్ 4% పతనమైంది. రియల్టీలో హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, యూనిటెక్, అనంత్‌రాజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీబీ, ఒబెరాయ్ 5-13% మధ్య నీరసించాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్బీ, కెనరా, బీవోబీ, ఇండస్ఇండ్, బీవోఐ, యస్ బ్యాంక్ 4-8% మధ్య నేలచూపులు చూశాయి. ఎఫ్ఐఐలు వెనక్కి... శుక్రవారం రూ. 231 కోట్ల విలువైన షేర్లను అమ్మిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ)లు తాజాగా రూ. 1,334 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 151 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. చిన్న షేర్లలో జేపీ, డిష్‌మ్యాన్, జేపీ పవర్, జీఎంఆర్ ఇన్ఫ్రా, ఐఆర్బీ ఇన్ఫ్రా, దివాన్ హౌసింగ్, ఏబీజీ షిప్‌యార్డ్, కోరమాండల్ ఇంటర్నేషనల్, యూకో బ్యాంక్ వంటివి 14-8% మధ్య పతనమయ్యాయి. పతనానికి ప్రధాన కారణాలివీ.. గత వారం చివర్లో వెల్లడైన గణాంకాలు మళ్లీ చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలిచ్చాయి. మంగళవారం నుంచీ పరపతి సమీక్షను చేపడుతున్న అమెరికా ఫెడ్... సహాయక ప్యాకేజీలలో కోతను పెంచవచ్చుననే అంచనాలున్నాయి. అదే జరిగితే షేర్లు, కరెన్సీ తదితర రిస్క్ అధికంగా గల ఆస్తుల నుంచి పెట్టుబడులు తరలిపోతాయనే భయాలున్నాయి. దేశీయంగా ఆర్బీఐ పాలసీ సమీక్ష కూడా మంగళవారమే ఉంది. ద్రవ్యోల్బణాన్ని వినాశకర వ్యాధిగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పోల్చటంతో... వడ్డీ రేట్లు తగ్గిస్తారనే ఆశలు ఆవిరయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై తాజాగా సందేహాలు నెలకొనడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మామూలు క్షీణత కాదు.. బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలూ నేలచూపులు చూశాయి. ప్రధానంగా మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆటో రంగాలు సైతం 3% స్థాయిలో పడ్డాయి. సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యంవహించే 30 షేర్లలో ఐటీసీ, సిప్లా మాత్రమే నిలదొక్కుకోగా, ప్రోత్సాహకర ఫలితాలతో హెచ్‌యూఎల్ దాదాపు 2% లాభపడింది. బ్లూచిప్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్ 6% చొప్పున దిగజారగా, టాటా పవర్ 4% క్షీణించింది. ఈ బాటలో మారుతీ, సెసా స్టెరిలైట్, ఆర్ఐఎల్, ఎల్అండ్టీ, హిందాల్కో, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్‌లు 4-2 శాతం మధ్య నష్టపోయాయి. ట్రే డైన షేర్లలో 1,952 తిరోగమిస్తే... కేవలం 643 బలపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిలో 52 షేర్లు ఏడాది కనిష్టాలను తాకాయి. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలకు చెందిన ఇండెక్స్‌లు దాదాపు 3 శాతం మేర తిరోగమించాయి. -
సీల్ పిల్లని ఏమంటారు?
అరణ్యం ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి! జీవితంలో చాలాభాగం ఇవి నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి! ఆక్సిజన్ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి! నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది! మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి సీల్స్! వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవో, ఓడో వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట! ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయి. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు! వీటి చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు! ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట! సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా వీటికి తెలిసిపోతుంది. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి! సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికయితే ఎంతో డిమాండ్ ఉంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది! రంగులు మార్చే పిట్ట! స్కార్లెట్ ఇబిస్... ఈ ఎర్రటి విహంగం పేరు! ఇబిస్ పక్షులు అమెరికాలో ఉంటాయి. వీటిలో రెండే రెండు రకాలు ఉంటాయి. మొదటిది క్రెస్టెడ్ ఇబిస్. ఇది తెల్లగా ఉంటుంది. ఎంత తెలుపంటే... పాలు అంత! ఇక రెండోది స్కార్లెట్ ఇబిస్. ఇది ఎర్రగా ఉంటుంది. ఎంత ఎర్రగా అంటే... రక్తమంత! నిజానికి స్కార్లెట్ ఇబిస్లు పుట్టినప్పుడు ముదురు గోధుమరంగులో ఉంటాయట. కానీ ఎదిగేకొద్దీ ఆ రంగు వెలిసిపోయిన ట్టుగా అవుతుంది. తర్వాత వీపుమీద ఎర్రగా చిన్న మచ్చలా వస్తుందట. ఆపైన ఆ రంగు ఒళ్లంతా పాకి, చివరికిలా ఎర్రగా తయారవుతాయి. ఎర్రగా ఉండే పూలు, ఆకులు ఎక్కువగా తింటాయని, అందువల్లే వాటి శరీరం అలా అవుతోందని మొదట్లో అనుకునేవారు. కానీ వాటి జన్యువుల్లో వచ్చే మార్పుల కారణంగానే అలా తయారవుతున్నాయని పరిశోధకులు అన్నారు. అయితే అసలైన కారణం మాత్రం ఇంతవరకూ తెలియలేదు!