
ఇటీవల వివాహ వేడుకల్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక యువకుడు సినిమాలో హీరో మాదిరిగా ఓ వేడుకకి వచ్చి హాయిగా భోజనం చేసి వెళ్లిపోవాలనుకున్నాడు. గానీ అక్కడ ఉన్న పెళ్లివారు పనిష్మెంట్‌గా ఆ యవకుడితో ప్లేట్లు కడిగించారు. అంతకుముందు అమెరికాలోని ఓ వివాహ వేడుకలోకి ఎలుగుబంటి వచ్చి అక్కడ ఆహార పదార్థలన్నింటిని తినేసి పెద్దపెద్ద కలకలం సృష్టించింది. ఆ ఘటనలను మరువక మునుపే మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...ఒక ఎద్దు వివాహ వేడుక ఎంట్రీ వద్ద ఉన్న గేటును ఢీకొట్టి మరీ పెళ్లిమండపంలోకి వచ్చేసింది. అక్కడు ఉన్న ఒకతను ఆ ఎద్దును బయటకు పంపించేందుకు యత్నించినా వెళ్లకపోకపోగా... అతనిపైనే దాడి చేసేందుకు వచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. పైగా అక్కడ ఉన్న విందు వద్దకు వచ్చి హంగామా సృష్టించింది. అనంతరం అక్కడే స్టాల్స్ ఉన్న అద్దాల గదికి వెళ్లేందుకు కూడా యత్నించి...విఫలమై వెనక్కు వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడ నుంచి ఎద్దు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment