gate
-
ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..!
గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే ‘గేట్ టు హెల్’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది. (చదవండి: ∙ -
,,,వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్లవి ఏం తీసుకెళ్తార్సార్
-
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
విజయవంతంగా స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, బళ్లారి/ హొసపేటె/హొళగుంద: తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు పూర్తయింది. శుక్రవారం రాత్రి ఈ గేటు తొలి భాగాన్ని బిగించిన సిబ్బంది.. శనివారం ఉదయం నుంచి సాయంత్రంలోగా మరో నాలుగు భాగాలను బిగించారు. దీంతో గేటు ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది. ఓపక్క 71 టీఎంసీల నీరు జలాశయంలో ఉన్నప్పటికీ.. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఇంజినీర్లు, సిబ్బంది సాహసోపేతంగా ఐదు భాగాలను బిగించారు. దీంతో డ్యాం గేట్లను మూసివేశారు. స్టాప్‌లాగ్ గేటు నుంచి మాత్రం కొద్దిపాటి నీరు లీకవుతోంది. దానిని కూడా ఆదివారానికి సరిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కొట్టుకుపోయిన 19వ గేటు భాగాలు డ్యాంకు దిగువన కొంత దూరంలో శనివారం కనిపించాయి.నీరు వృథా కాకుండా..కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటులో ప్రభుత్వం, అధికారులు చూపిన చొరవ 35 టీఎంసీల జలాలు వృథాగా పోకుండా కాపాడగలిగారు. గేటు కొట్టుకుపోయిన వెంటనే డ్యాం అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా 33 గేట్లలో 29 గేట్ల వరకు ఎత్తి దాదాపు లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీటిని వారం పాటు నదిలోకి వదిలాల్సి వచ్చింది. జలాశయంలో ముందుగా 65 టీఎంసీల నీరును ఖాళీ చేస్తే గేట్లు అమర్చవచ్చని అనుకున్నప్పటికీ, అధికారులు కేవలం 30 టీఎంసీలే నీరు నదిలోకి వదిలి గేట్లను పెట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేట్ల నిపుణుడు 81 ఏళ్ల కన్నయ్యనాయుడు కృషితో 71 టీఎంసీల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో 35 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగారు. గేటు కొట్టుకుపోవడంతో పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందారని, స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుతో వారంతా ఊపిరి పీల్చుకున్నారని ఏపీ తుంగభద్ర రైతు సంఘం నేత తప్పెట రామిరెడ్డి అన్నారు. -
తుది దశలో ‘తుంగభద్ర’ గేట్ పనులు
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో హొసపేటె వద్ద తుంగభద్ర జలాశయంలో 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి 40 టీఎంసీలకు పైగా నీటిని వదిలేశారు. మూడు రోజుల నుంచి క్రస్ట్ గేట్ ఏర్పాటుకు డ్యాం అధికారులు, నిపుణులు తీవ్రంగా యత్నిస్తున్నారు. గురువారం ఉదయం జిందాల్ కంపెనీ తయారు చేసిన స్టాఫ్‌లాగ్ గేట్‌లోని హెలిమెట్స్ను తుంగభద్ర డ్యామ్ వద్దకు తీసుకొచ్చారు. డ్యామ్‌పైన భారీ క్రేన్ల సహాయంతో 80 మంది కార్మికులతో గేట్‌ను దింపే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు సూచనలతో స్టాఫ్‌లాగ్ గేట్లను ఏడు సిద్ధం చేశారు. ఒక్కో పీసు 15 టన్నుల బరువుతో తయారు చేస్తున్న వాటిని ఒక్కొక్కటిగా డ్యామ్ వద్దకు చేర్చి క్రస్ట్ గేట్ స్థానంలోకి భారీ క్రేన్ల సహాయంతో దింపుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణం అన్ని విధాలా రక్షించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రేపటిలోపు పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయని బోర్టు అధికారులు చెప్పారు. -
కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు, నిపుణులతో చర్చించాక.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో అత్యవసర గేటు ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ప్రాజెక్టులపై క్రస్ట్ గేటు.. స్టాప్ లాక్ గేటు దించడానికి వీలుగా రెండు గాడి(గ్రూవ్)లు పియర్స్ (సిమెంటు దిమ్మెలు)కు ఏర్పాటు చేస్తారు. కానీ.. తుంగభద్ర డ్యామ్ పాత డిజైన్ కావడంతో క్రస్ట్ గేటు ఏర్పాటుకు ఒకే గాడిని ఏర్పాటు చేశారు. దీని వల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీనిపై సోమవారం తుంగభద్ర డ్యామ్ వద్ద బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి.. నిపుణులు, గేట్ల సలహాదారు కన్నయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ జల వనరుల విభాగం సీఈ (హైడ్రాలజీ) రత్నకుమార్, కర్ణాటక జల వనవరుల శాఖ సలహాదారు మల్లికార్జున గుంబ్లీ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో క్రస్ట్ గేటు గాడిలోనే అత్యవసర గేటును అమర్చాలని నిర్ణయించారు. అత్యవసర గేటు తయారీ పనులను హిందూస్థాన్ ఇంజినీరింగ్ వర్క్స్, నారాయణ ఇంజినీరింగ్ వర్క్స్‌కు అప్పగించారు. ఈ గేటును 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర గేటును 5 భాగాలు (ఎలిమెంట్లు)గా తయారు చేస్తారు. మొదటి ఎలిమెంట్‌ను 2 అడుగుల ఎత్తు, రెండో ఎలిమెంట్‌ను 4 అడుగులు, మూడో ఎలిమెంట్ 6 అడుగుల ఎత్తు.. నాలుగు, ఐదు ఎలిమెంట్లు 4 అడుగుల ఎత్తు, 60 మీటర్ల వెడల్పుతో తయారు చేస్తారు. ఆ ఎలిమెంట్లకు ఇరు వైపులా రోలర్లను అమర్చుతారు. ఆ తర్వాత 19వ గేటు ఉన్న 18, 19 పియర్లకు ఉన్న గాడి(గ్రూవ్)లో మొదటి ఎలిమెంటును దించుతారు. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఎలిమెంట్లను దించడం ద్వారా అత్యవసర గేటు ఏర్పాటు చేస్తారు. గేటు తయారీ ప్రక్రియకు ఐదారు రోజులు పడుతుందని.. రోలర్లు అందుబాటులో ఉంటే.. డ్యామ్‌లో ఎప్పుడు నీటి మట్టం 1,613 అడుగులు (కనీస నీటి మట్టం) స్థాయికి తగ్గినప్పుడు అత్యవసర గేటు అమర్చుతామని అధికారులు చెబుతున్నారు.నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు.. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. డ్యామ్ కనీస నీటి మట్టం 1613 అడుగులు. అదే స్థాయి నుంచి 1633 అడుగుల వరకు 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్ వేకు 33 గేట్లను బిగించారు. ఇప్పుడు అత్యవసర గేటు ఏర్పాటు చేయాలంటే 1613 అడుగుల స్థాయికి అంటే డ్యామ్‌లో నీటి నిల్వను 43.83 టీఎంసీలకు తగ్గించాలి. దాంతో శనివారం నుంచే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తున్నారు. సోమవారం నాటికి డ్యామ్‌లో 97.75 టీఎంసీలు ఉండగా.. డ్యామ్‌లోకి 25,571 క్యూసెక్కులు చేరుతుండగా.. 99,567 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వను 1613 అడుగులకు తగ్గిస్తే సుమారు 61 టీఎంసీల మేర నీరు వృథా అవుతుంది. నీటి వృథాను అరికట్టడానికి నీటి మట్టం 1613 అడుగుల కంటే ఎగువన ఉన్నప్పటికీ అత్యవసర గేటును దించే ప్రయత్నం చేద్దామని నిపుణులు కన్నయ్యనాయుడు సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.నిపుణుల సలహాల మేరకు గేటును అమర్చేందుకు ప్రయత్నిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వేసవిలో పూర్తి స్థాయి క్రస్ట్ గేటును అమర్చాలని బోర్డు నిర్ణయించింది.సక్రమంగా దించకపోవడం వల్లే.. గేట్ల నిర్వహణలో నిపుణులైన అధికారులు, సిబ్బంది అధిక శాతం పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బందిని నియమించారు. వారికి గేట్ల నిర్వహణలో అనుభవం లేదు. స్పిల్ వే 19వ గేటును సక్రమంగా దించపోవడం వల్లే.. అంటే ఒక కొస దిగువకు దిగి, మరొక కొస ఎగువన ఉండటం వల్ల (ఎగుడు దిగుడు) వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయిందని చైన్ తెగడం వల్ల గేటు కొట్టుకుపోయే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మిగతా 32 గేట్లపై సీఈసీఆర్ఐతో అధ్యయనం తుంగభద్ర డ్యామ్ నిర్మాణం పూర్తయి దాదాపుగా 71 ఏళ్లు పూర్తయింది. గేట్ల నిర్వహణ ప్రారంభమై 66 ఏళ్లు పూర్తయింది. ఈ 66 ఏళ్లలో 2.5 మిలియన్ సైకిల్ ద్వారా ఎత్తడం, దించడం చేశారు. ఇప్పుడు కొట్టుకుపోయిన గేటు కాకుండా, మిగతా 32 గేట్ల పనితీరు సవ్యంగా ఉన్నట్లు ఏపీ, కర్ణాటక అధికారులు, నిపుణులు కన్నయ్య నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద ఉధృతితో గేట్లపై ఒత్తిడి పడి, బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే గేట్ల కాల పరిమితిని 45 ఏళ్లు, కాంక్రీట్ కట్టడాల కాల పరిమితి 100 ఏళ్లుగా సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కానీ.. 66 ఏళ్లవుతున్నా గేట్లను ఎందుకు మార్చలేదని కన్నయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగతా 32 గేట్లు సవ్యంగా పని చేస్తున్నప్పటికీ.. వాటి సామర్థ్యంపై తమిళనాడులో కరైకుడిలోని సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఈసీఆర్ఐ)తో అధ్యయనం చేయించాలని బోర్డుకు సూచించారు. సీఈసీఆర్ఐ నివేదిక ఆధారంగా గేట్లకు మరమ్మతులు లేదా కొత్త గేట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టీబీ డ్యాం సర్కారు నియంత్రణలో లేదు సాక్షి, బళ్లారి: తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడం లేదని, అందుకు ప్రత్యేక బోర్డు ఉందని, అందులో తాము సభ్యులం మాత్రమేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో సోమవారం ఆయన తుంగభద్ర డ్యాంను సందర్శించారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి నీటి పారుదల నిపుణులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘డ్యాంను పరిశీలించాను. గేట్ కొట్టుకుపోవడంపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్లతో చర్చించాను. నూతన క్రస్ట్ గేట్‌ను పునరుద్ధరించడానికి ఐదు రోజులు పట్టొచ్చు. ఖరీఫ్ పంటకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య డ్యాంను సందర్శించి నిపుణులతో మాట్లాడతారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ -
కొట్టుకుపోయిన ‘తుంగభద్ర’ గేటు
సాక్షి, అమరావతి/హొళగుంద/సాక్షి, బళ్లారి/ఆలూరు: రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల వరదాయిని తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. డ్యాం 19వ గేటు లింక్ చానల్ శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో తెగి గేటు నదిలో కొట్టుకుపోవడంతో భారీఎత్తున నీరు నదిలోకి పోటెత్తింది. దీంతో డ్యాం రక్షణలో భాగంగా అధికారులు 33 గేట్లలో 29 గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటుచేయాలంటే గేటు బిగించే స్థాయి (క్రెస్ట్ లెవల్)కి అంటే 1,613 అడుగులకు నీటిమట్టాన్ని తగ్గించాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అంటే.. అప్పుడు 43.83 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. గేటు కొట్టుకుపోక ముందు డ్యాంలో 1,632.6 అడుగుల్లో 104.18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే.. ఆ స్థాయికి నీటి మట్టాన్ని తగ్గించాలంటే 61 టీఎంసీలను దిగువకు వదిలేయాలి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 9 టీఎంసీల చొప్పున వారంపాటు నీటిని దిగువకు వదిలేస్తే.. డ్యాంలో నీటి మట్టం 1,613 అడుగుల స్థాయికి తగ్గుతుంది. ఆ తర్వాత కొత్త గేటు ఏర్పాటుకు కనీసం వారం రోజులు పడుతుందని తుంగభద్ర బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు నెలాఖరుకుగానీ కొత్త గేటును అమర్చలేరన్నది స్పష్టమవుతోంది. ఈ ఘటనతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కర్ణాటక మంత్రులు డ్యాంను పరిశీలించారు. తుంగభద్ర బోర్డు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడే మకాం వేసింది. హైదరాబాద్, చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు రానున్నారు. నిజానికి.. 71 ఏళ్ల ‘తుంగభద్ర’ చరిత్రలో ఎన్నడూ గేట్లు కొట్టుకుపోయిన దాఖలాల్లేవు. టీబీ బోర్డు నిర్లక్ష్యం.. టీబీ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్యాం భద్రతను మరచి నీటిని నిల్వచేయడంతో నేడు ఎన్నడూలేనంత దారుణ పరిస్థితి జలాశయం ఎదుర్కొంటోంది. డ్యాంలో నీటి చేరిక మొదలుకాక ముందే గేట్లన్నీ పరిశీలించి ట్రయల్ రన్చేసి నీటినిల్వకు అన్ని విధాలా సిద్ధంచేయాల్సిన అధికారులు అలా చేయకపోవడంతో వారి నిర్లక్ష్యం నేడు రైతుల పాలిట శాపంగా మారింది. గతేడాది ఒకే పంటతో సరిపెట్టుకున్న రైతులు ఈ ఏడాది దానికన్నా అధ్వాన పరిస్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆశలు ఆవిరి.. ఇక సాధారణంగా తుంగభద్రలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరులో వరదలు ఉండవు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. డ్యాంలో నీటి లభ్యత తగ్గుతుంది. దీంతో.. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నీటి లభ్యత అధికంగా ఉంటుందని ఆశించిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. నిజానికి.. ఈ జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేది తుంగభద్రే. గడిచిన చాలా ఏళ్లుగా తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గిపోగా ఈ ఏడాది ఆశాజనకంగా నీరు చేరింది. కానీ, తాజా పరిస్థితితో మిగిలిన నీటితో ఖరీఫ్‌లో ఒక పంటకు మాత్రమే బొటాబొటిగా నీళ్లు సరిపోతాయి. యుద్ధప్రాతిపదికన డ్యాం గేటును ఏర్పాటుచేసినా డ్యాం ఎగువ భాగంలో చినుకు జాడలేకపోతే సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీరు కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అందరూ కలవరపడుతున్నారు.17.33 లక్షల ఎకరాలపై ప్రభావంతుంగభద్ర డ్యాం ఆయకట్టు విస్తరించిన రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు వర్షాభావ ప్రాంతాలు. రాయలసీమలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీల కింద 4.42 లక్షల ఎకరాలు, ఉత్తర కర్ణాటకలో 8.96 లక్షల ఎకరాల ఆయకట్టు నేరుగా డ్యాంపై ఆధారపడ్డాయి. డ్యాం దిగువన రాయలసీమలో కేసీ కెనాల్ కింద 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉత్తర కర్ణాటకలో రాయబసవన ఛానల్స్ కింద 24,468 వేల ఎకరాలు.. ఉత్తర, కర్ణాటక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కింద 92,900 ఎకరాల ఆయకట్టు వెరసి 3.95 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్, ఆర్డీఎస్, రాయబసవన ఛానల్స్ కూడా తుంగభద్ర డ్యాంలో నీటి కేటాయింపులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుపై గేటు కొట్టుకుపోవడం తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు.. ఈ ఏడాది రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాలు సాగు, తాగునీటికి ప్రధానంగా ఆధారపడేది హెచ్చెల్సీ (ఎగువ కాలువ) పైనే. ఎల్లెల్సీ (దిగువ కాలువ)పై కర్నూలు, నంద్యాల జిల్లాలు ఆధారపడతాయి. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలతోపాటు కేసీ కెనాల్‌కు నీటి లభ్యత తగ్గితే తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.త్వరలో గేటు పునరుద్ధరణ: డీకేడ్యాం వద్ద కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, గేటు కొట్టుకుపోవడం బాధాకరమని.. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరు అందేలా చూస్తామని, అయితే మళ్లీ డ్యాంలోకి నీరు వచ్చేదాన్ని బట్టి రబీ పంటకు నీటివసతి కల్పిస్తామని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేశాం: నిమ్మల తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లాలో కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. వెంటనే గేటు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు. నిధులు ఇవ్వకపోవడంతో..: విరూపాక్షిడ్యాం మరమ్మతులకు ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడం, ఇంజినీర్ల వైఫల్యంతోనే గేట్ కొట్టుకుపోయిందని ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆరోపించారు. ఆదివారం ఆయన డ్యాం గేట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గేట్ పనులను త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిస్థితి దారుణం: అజ్జప్ప, కౌలు రైతు వర్షాల్లేక పరిస్థితి దారుణంగా తయారైయింది. నేను నాలుగెకరాలను కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నాను. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాను. ఒకవైపు కర్ణాటక రైతులు ఎల్లెల్సీ ఎగువన పైపులు వేసి, గండికొట్టి సాగునీరందకుండా చేస్తుంటే ఇప్పుడు ఏకంగా డ్యాంకే గండి పడింది. ఇలాగైతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. -
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. పోటెత్తిన నీరు
హోస్పేట్/కర్నూలు: కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఊడిపోవడంతో నీరు బయటికి పోటెత్తింది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ సమయంలో 19వ గేటు చైన్ తెగి గేటు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు బయటికి పోతోంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కోరింది. -
మరో రెండు గేట్లు పైకి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు చెందిన మరో రెండు రేడియల్ గేట్లను ఇంజనీరింగ్ అధికారులు గురువారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో 21న మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగి, పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. గత నెల 17న 15వ పియర్‌లోని రేడియల్ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, 20వ పియర్ ముందు బొరియలు ఏర్పడి భారీ శబ్ధం, ధ్వనులు వినిపించాయి. దీంతో బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 6న 7వ బ్లాక్‌లోని 16, 17 రేడియల్ గేట్లను బలంగా పైకి ఎత్తారు. 8వ తేదీన అదే బ్లాక్‌లోని 22వ రేడియల్ గేటును ఎత్తారు. గురువారం 18, 19 గేట్లను 100.50 మీటర్ల మేర ఎత్తారు. దీంతో ఈ బ్లాక్‌లోని మొత్తం 8 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తినట్టయ్యింది. గేట్ల కటింగ్ పనులు వేగవంతం: ప్రాజెక్టులోని 19, 20, 21 గేట్ల కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20వ గేటును కట్ చేసి విడిభాగాలు తొలగించి, బయటకు తీసుకెళ్లేందుకు వీలుగా చేశారు. ఆ గేట్ల వద్ద ఉన్న కేబుల్స్, ఇతర పరి కరాలు తొలగించడానికి సమ యం పట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా 7వ బ్లాక్‌లో షీట్‌ఫైల్స్ పనుల్లో వేగం పెంచారు. చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను సరైన స్థానంలో అమర్చుతున్నారు. మంత్రి ఉత్తమ్ పర్యటన అనంతరం మరమ్మతుల్లో వేగం పెరిగిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అటు అన్నారంలో బోర్‌తో డ్రిల్లింగ్ వేసి రంధ్రాలు చేస్తున్నారు. 25 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా కింద మట్టి దృఢంగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది. -
గుండ్లకమ్మ రెండో గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. మిచాంగ్ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు 8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు. డెడ్ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ.. ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు. -
గుండ్లకమ్మకు ‘చంద్ర’ గండం!
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం శాపంలా పరిణవిుంచింది! గత సర్కారు నిర్వాకాలతో గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటులో దిగువన తుప్పు పట్టిపోయిన భాగం (8.4 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల ఎత్తు) శుక్రవారం రాత్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, రంగులు పేరుతో టీడీపీ హయాంలో 2014 –2019లో పనులు చేయకుండానే రూ.3.57 కోట్లు దిగమింగేయడం దీనికి కారణం. సుందరీకరణ పేరుతో మరో రూ.1.58 కోట్లు వెరసి రూ.5.15 కోట్లు స్వాహా చేశారు. గేట్లకు రంగులు పూయకపోవడం వల్ల తుప్పు పట్టి బలహీనంగా మారాయి. దీంతో వరద ఉద్ధృతికి గతేడాది ఆగస్టు 31న మూడో గేటు కొట్టుకుపోగా తాజాగా రెండో గేటులో అడుగు భాగం కొట్టుకుపోయింది. చంద్రబాబు హయాంలో నిధులు కాజేయకుండా గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరమ్మతు టెండర్ ఖరారైన రోజే.. గతేడాది మూడో గేటు కొట్టుకుపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రభుత్వం రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడింది. మరో రెండు గేట్లు బలహీనంగా ఉండటంతో యుద్ధప్రాతిపదికన రూ.1.11 కోట్లు వెచ్చించి మరమ్మతు చేసింది. మిగతా 10 గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం, దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, కొత్త వైర్ రోప్‌లు, గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు పనులకు రూ.9.14 కోట్లతో టెండర్లు పిలిచింది. వాటిని అధికారులు శుక్రవారం ఖరారు చేశారు. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఆ పనులను రాజస్థాన్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ సంస్థ దక్కించుకుంది. గేట్ల మరమ్మతు టెండర్ ఖరారైన రోజే వరద ఉద్ధృతికి రెండో గేటు కొట్టుకుపోయింది. టీడీపీ సర్కార్ అవినీతితో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద చేపట్టిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 80,060 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. గేట్ల మరమ్మతులు, రంగులు పూయడం పేరుతో నిధులు కాజేసింది. దీంతో గేట్లు తుప్పు పట్టిపోయాయి. దీని ఫలితంగానే పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు, గుండ్లకమ్మలో రెండు గేట్లు కొట్టుకుపోయాయి. యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాగ్ గేటు గుండ్లకమ్మ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 24.380 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు. ప్రాజెక్టు స్పిల్ వేకు 8.4 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో కూడిన 12 గేట్లను అమర్చారు. మిచాంగ్ తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ పది వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చింది. గేట్లు బలహీనంగా ఉండటంతో 2.30 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ సమయంలో రెండో గేటు, పదో గేటు మరీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఒక్కో స్టాప్ లాగ్ ఎలిమెంట్‌ను అడుగు భాగంలో దించారు. అయితే బలహీనంగా ఉన్న రెండో గేటులో 4 మీటర్ల ఎత్తుతో కూడిన ఒక భాగం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.30 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో శనివారం పూర్తి స్థాయి స్టాప్ లాగ్ గేటు అమర్చి నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడతామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. -
పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?
నూతన పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లోని ఆరు ద్వారాలకు జంతువుల పేర్లు పెట్టారు. వీటిలో కొన్ని మనకు కనిపించేవి. మరికొన్ని పౌరాణిక సంబంధమైనవి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ ద్వారాలకు ఉన్న చిహ్నాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. నేటి కథనంలో ఆ ద్వారాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. గజ ద్వారం నూతన పార్లమెంట్ ప్రాగణ ద్వారానికి గజ ద్వార్ అనే పేరు పెట్టారు. ఈ ద్వారం జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపున ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ బుధునికి సంబంధించినది. దీనిని మేధస్సుకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ద్వారంపై ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి శ్రేయస్సును, సంతోషాన్ని అందిస్తాయి. అశ్వ ద్వారం పార్లమెంట్‌లోని మరో ద్వారానికి అశ్వ ద్వారం అని పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం. ఇది శక్తి, బలం, ధైర్యానికి చిహ్నం. గరుడ ద్వారం మూడవ ద్వారానికి పక్షుల రాజైన గరుడుని పేరు పెట్టారు. గరుడుని విష్ణువు వాహనంగా భావిస్తారు. త్రిమూర్తులలో రక్షకునిగా పేరొందిన విష్ణువుతో అనుబంధం కలిగిన గరుడ పక్షి.. శక్తి, కర్తవ్యాలకు చిహ్నమని చెబుతారు. గరుడ ద్వారం నూతన పార్లమెంటు భవనానికి తూర్పున ఉంది. మకర ద్వారం మకర ద్వారం అనేది పురాణాలలో పేర్కొన్న సముద్ర జీవిని గుర్తుచేస్తుంది. ఇది వివిధ జంతువుల కలయిక. మకర శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో కనిపిస్తాయి. మకరం అనేది వివిధ జీవుల కలయికతో దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ద్వారాల వద్ద కనిపించే మకర విగ్రహాలను రక్షకులని చెబుతారు. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు కనిపిస్తుంది. శార్దూల ద్వారం ఐదవ ద్వారానికి పురాణాల్లో పేర్కొన్న శార్దూలం అనే పేరు పెట్టారు. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. గుర్రం, ఏనుగు, చిలుక తలను కలిగి ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూలం ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్లో పేర్కొన్నారు. హంస గేట్ నూతన పార్లమెంటులోని ఆరవ ద్వారానికి హంస గేట్ అనే పేరు పెట్టారు. జ్ఞాన దేవత అయిన సరస్వతీమాత వాహనంగా హంస గుర్తింపు పొందింది. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుండి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్‌లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్‌లో బుష్‌ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్‌లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్‌ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్‌వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
నేటి నుంచి పులిచింతల గేటు అమర్చే పనులు
అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్ట్‌కు అమర్చిన 16వ నంబరు రేడియల్ గేటు 2021 ఆగస్ట్ 5న కృష్ణా నది వరదలకు కొట్టుకుపోగా.. కొత్త గేటు అమర్చే పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గేటు కొట్టుకుపోయిన నాటినుంచి ఇప్పటివరకు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌తో 16వ నంబర్ గేటును బ్లాక్‌చేసి ప్రాజెక్ట్‌లో సాగునీటిని నింపుతూ వచ్చారు. కాగా.. కొత్తగేటును అమర్చేందుకు ప్రభుత్వం రూ.22.05 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.7.53 కోట్లతో రేడియల్ గేటు తయారీ, రూ.1.73 కోట్లతో కాంక్రీట్ పనులు, రూ.9.57 కోట్లతో అన్ని గేట్లను క్రమబద్ధీకరించే పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ.3.20 కోట్లతో నడక దారిని ఏర్పాటు చేయాలి. ఆయా పనులు రెండు నెలలుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంక్రీట్, గడ్డర్స్, ఆమ్స్, స్కిన్ప్లేట్స్ పనులను పూర్తి చేశారు. కొత్త రేడియల్ గేటును ప్రాజెక్ట్‌కు అమర్చాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి 16 వరకు 16వ నంబర్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేత పనులకు అంతరాయం ఏర్పడకుండా ప్రాజెక్ట్ మీదుగా మంగళవారం నుంచి 15 రోజులపాటు రాకపోకలను నిలిపివేశారు. రేడియల్ గేటు పైభాగంలో కోల్తార్ పెయింట్స్ వేసి రబ్బరు సీల్స్ బిగించి, గ్రీజింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన వెంటనే రేడియల్ గేట్‌ను ప్రాజెక్ట్‌కు బిగించేందుకు 100 టన్నుల క్రాలర్ హెవీలోడ్ క్రేన్, 80 టన్నుల టైర్మౌంటెడ్ క్రేన్లను సిద్ధం చేశారు. పనులను సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అరుణకుమారి, అసిస్టెంట్ ఇంజినీర్లు విక్రమ్, వెంకటరెడ్డి పర్యవేక్షించనున్నారు. -
అలా చేసి ఉండాల్సింది కాదు: మిశ్రా పక్క సీటు వైద్యుడు షాకింగ్ వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా పక్కసీటు ప్రయాణికుడు చాలా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు మిశ్రా పక్కసీటు వ్యక్తి ఆమెరికాకు చెందిన ఆడియాలజీ వైద్యుడు సుగతా భట్టాచార్జీ నాటి దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ...ఆ రోజు ఆ వృద్ధ మహిళ పట్ల పైలెట్ అలా వ్యవహరించి ఉండకూడదన్నారు. ఆయన ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధితురాలికి ఉపశమనం కలిగించేలా ఏదైనా చేసి ఉంటే ఇంతలా చర్చనీయాంశంగా మారేది కాదన్నారు. ఐతే నిందితుడి తండ్రి ఆ రోజు ఎలాంటి అనుచిత ఘటన జరగలేదంటూ.. వాదించిన నేపథ్యంలోనే సుగతా భట్టాచార్జీ నాటి ఘటన గురించి వివరించారు. ఆ రోజు బాధిత మహిళ చాలా మర్యాదగా వ్యవహరించిందన్నారు. తాను బిజినెస్ క్లాస్‌లో 8A సీటులో కూర్చొన్నాని, మిశ్రా 8Cలో కూర్చొన్నారని చెప్పారు. ఆ రోజు భోజనం చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆరిపోయాయని చెప్పారు. ఆ తర్వాత నిందితుడు శంకర్ మిశ్రా వృద్ధురాలి సీటు9A వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. వాస్తవానికి వాష్ రూమ్ అతని సీటుకి నాలుగు సీట్ల వెనకాల ఉంది. ఈ హఠాత్పరిణామానికి 9A, 9Cలలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు ఇబ్బంది పడటం చూశానని అన్నారు. భట్టాచార్జీ తాను ఆ సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. మిశ్రా తనపై తూలితే.. ఫ్లైట్ వేగంగా వెళ్లడంతో అలా పడ్డాడనుకున్నాం, గానీ ఆ తర్వాత అతను చాలా మత్తులో ఉన్నట్లు గమనించి షాక్ అయ్యాం అన్నారు. పాపం ఆ బాధిత మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా..వారు వచ్చి కేవలం సీటును క్లీన్ చేసి, షీట్లు మార్చి.. మళ్లీ అక్కడే కూర్చొమన్నారని చెప్పుకొచ్చారు. దీంతో తనకు తన నైతిక బాధ్యత గుర్తుకొచ్చి..మరోక సీటు ఇవ్వాల్సిందిగా సీనియర్ హోస్ట్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఐతే ఆమె పైలెట్ అనుమతి తీసుకోవాలని, తాను అలా చేయాలనని చెప్పినట్లు తెలిపారు. ఆ రోజు ఆ సీటు క్లీన్ చేసేంత వరకు రెండు గంటల పాటు ఆ మహిళ అలా నిలబడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్లి సిబ్బందితో చెప్పడంతో ఆమెకు ఒక సిబ్బంది సీటును కేటాయించారు. ఆ రోజు బిజినెస్ క్లాస్‌లో సీటులు ఖాళీగా ఉన్నా కూడా పైలెట్ ఆమెకు మరో సీటు కేటాయించకపోగా..కాసేపటి తర్వాత అదే సీటుకి రావాల్సిందిగా కోరారు. ఐతే ఆమె అందుకు నిరాకరించి..సిబ్బందికి కేటాయించే.. చిన్న సీటులోనే ఉండిపోయిందని చెప్పారు. ఆ సమయంలో పైలెట్ సరైన రీతిలో నిర్ణయం తీసుకుని స్పందించి ఉంటే... ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. విమాన సిబ్బంది ఒక స్త్రీ పరువుతో ఆడుకుని, ఎయిర్ ఇండియా పరువు దిగజార్చరన్నారు. ఇదిలా ఉండగా, ముంబై సమీపంలోని బొయిన్‌సర్‌లో ఉంటున్న నిందితుడు మిశ్రా తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని, తన తల్లి వయసు ఉన్న ఆమెతో అలా వ్యవహరించడంటూ వాదించడం గమనార్హం. కాగా నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అంతేగాదు అతని కస్టడీ కోసం పోలీసుల చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. పైగా బెయిల్ దరఖాస్తును జనవరి 11న పరిశీలిస్తామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
వైరల్ వీడియో: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
-
వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు
ఇటీవల వివాహ వేడుకల్లో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఒక యువకుడు సినిమాలో హీరో మాదిరిగా ఓ వేడుకకి వచ్చి హాయిగా భోజనం చేసి వెళ్లిపోవాలనుకున్నాడు. గానీ అక్కడ ఉన్న పెళ్లివారు పనిష్మెంట్గా ఆ యవకుడితో ప్లేట్లు కడిగించారు. అంతకుముందు అమెరికాలోని ఓ వివాహ వేడుకలోకి ఎలుగుబంటి వచ్చి అక్కడ ఆహార పదార్థలన్నింటిని తినేసి పెద్దపెద్ద కలకలం సృష్టించింది. ఆ ఘటనలను మరువక మునుపే మరో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక ఎద్దు వివాహ వేడుక ఎంట్రీ వద్ద ఉన్న గేటును ఢీకొట్టి మరీ పెళ్లిమండపంలోకి వచ్చేసింది. అక్కడు ఉన్న ఒకతను ఆ ఎద్దును బయటకు పంపించేందుకు యత్నించినా వెళ్లకపోకపోగా... అతనిపైనే దాడి చేసేందుకు వచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు. పైగా అక్కడ ఉన్న విందు వద్దకు వచ్చి హంగామా సృష్టించింది. అనంతరం అక్కడే స్టాల్స్ ఉన్న అద్దాల గదికి వెళ్లేందుకు కూడా యత్నించి...విఫలమై వెనక్కు వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి అక్కడ నుంచి ఎద్దు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి) -
ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుందన్నారు.. కానీ
‘ఆడవాళ్లు ఈ పని చేయలేరు’ అని సమాజంలో కొందరు ఎర్ర జెండా చూప ప్రయత్నిస్తారు. పట్టాలకు అడ్డం పడుకుంటారు. ఆడవాళ్ల ఆత్మస్థయిర్యపు రైలు ముందుకు సాగకుండా విశ్వ ప్రయత్నం చేస్తారు. కాని కొందరు ధీరలు ‘చేయగలం’ అంటారు. తమ జీవితానికి తామే పచ్చజెండా ఊపుకోగలుగుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సల్మా చేసిన పని అదే. భారతదేశపు తొలి రైలుగేట్ ఉమన్‌గా ఆమె నియమితమైనప్పుడు గేటు వేయలేక తీయలేక నాల్రోజుల్లో పారిపోతుందన్నారు. ఇవాళ్టికి పదేళ్లు గడిచాయి. రైళ్లు ఆమె చెప్పినట్టుగా వింటున్నాయి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన సల్మాను చూసి ఆ గేటు మీదుగా వెళ్లే రైళ్లన్నీ శాల్యూట్ చేస్తున్నాయి. ‘బంధువులు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు గట్టిగా నిలబడాలి. నా తల్లిదండ్రులు నిలబడ్డారు. అందుకే ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాను’ అంటుంది సల్మా. ఆమె పూర్తి పేరు మిర్జా సల్మా బేగ్. వయసు 29. భారతదేశపు తొలి మహిళా గేట్ ఉమన్‌గా రైల్వే శాఖలో 2013లో చేరింది సల్మా. ఆమె పని చేసే రైల్వే క్రాసింగ్ లక్నోకు ఆనుకుని ఉన్న మల్హార్ స్టేషన్. ఇప్పుడు ఆ దారిన పోయే రైళ్ల డ్రైవర్లకు, గార్డులకు ఆమె సుపరిచితం అయ్యింది గాని కొత్తగా ఎవరైనా ఆ రైల్వే క్రాస్ గుండా వెళుతుంటే మాత్రం ఆగి సల్మాను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర ఒక స్త్రీ, అందునా హిజాబ్ ధరించిన స్త్రీ, పని చేయడం నేటికీ అరుదు కనుక. ‘మా నాన్న సలీం బేగ్ రైల్వే గేట్ మేన్‌గా పని చేసేవాడు. ఆయన అనారోగ్యం వల్ల చెవుడు వచ్చింది. రైలు గంట వినకపోతే గేట్‌మేన్‌గా పని చేయడం కష్టం. ఆయన వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని నన్ను ఉద్యోగంలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. అమ్మకు పక్షవాతం. నాన్న సంపాదించే స్థితిలో లేడు. గేట్ మేన్ ఉద్యోగం పురుషులకు మాత్రమే అని రైల్వే శాఖ ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆడవాళ్లు ఆ ఉద్యోగం కోసం అప్లై చేయరు. కష్టమైన పని. పైగా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. అయితే ఆ పని నాక్కూడా కష్టమే అని నాకు తెలుసు. కాని రైల్వేలో వేరే ఉద్యోగం ఇమ్మని అడిగితే ఆ ఉద్యోగం నాకు అందడానికి చాలా రోజులే పట్టవచ్చు. అదే మా నాన్న పనే నేను చేస్తానంటే వెంటనే ఇస్తామన్నారు. అలా ఈ ఉద్యోగంలో చేరాను’ అంది సల్మా. ఆమె చేరినప్పుడు ఆమెతో పాటు లక్నోలో 11 మంది పురుష గేట్ మేన్లు ఉండేవారు. వారంతా ‘ఈ అమ్మాయి ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుంది’ అన్నారు. సల్మా పని చేస్తుంటే హేళన చేసేవారు. బంధువులైతే ఇంటికి వచ్చి మరీ సూటి పోటి మాటలు అనేవారు. అమ్మాయి జీవితం నాశనం చేశారని తల్లిదండ్రులను మాటలనేవారు. కాని నాలుగు నెలలు గడిచినా సల్మా బెణకలేదు. బెసకలేదు. తండ్రి సాయంతో అధికారుల సపోర్ట్‌తో పని క్షుణ్ణంగా నేర్చుకుంది. రైలు వచ్చే ముందు గేటు వేసి వెళ్లాక గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుప చక్రం తిప్పాలి. నేర్చుకుంది. సమర్థంగా చేసింది. గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసి విజేతగా నిలిచింది. ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు పత్రికలు తొలి గేట్ ఉమన్‌గా వర్ణిస్తూ పేపర్లలో రాయడంతో బంధువులు చల్లబడి ‘మా అమ్మాయే’ అనడం మొదలెట్టారు. ‘ఆడవాళ్లు చేయలేని పనంటూ ఈ ప్రపంచంలో లేదు. ప్రయత్నించాలి అంతే. నా ఉద్యోగంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇటీవలే మా అమ్మ చనిపోయింది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా నేను మర్చిపోలేను’ అంటుంది సల్మా. గొప్ప గొప్ప విజయాలు ఒక సంకోచంతో నిండిన అడుగు నుంచే మొదలవుతాయి. సంకోచాన్ని ధైర్యంతో దాటాలి. ధైర్యంతోపాటు సంకల్పం తోడు రావాలి. ప్రయత్నం జత పడాలి. ఆ తర్వాత చచ్చినట్టు ‘విజయం’ అనే స్టేషన్ వచ్చి తీరుతుంది. మీరూ ప్రయత్నించండి. (క్లిక్ చేయండి: మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది) -
వారం రోజుల్లో గేట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది ఎదురుచూసే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)–2023 నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదలవ్వనుంది. ఇందుకోసం కాన్పూర్ ఐఐటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గేట్ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో గేట్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే వీలుంది. 2023 ఫిబ్రవరి 4 నుంచి 13 తేదీల మధ్య పరీక్ష నిర్వహించాలని కాన్పూర్ ఐఐటీ నిర్ణయించినట్టు తెలిసింది. దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ కీలకమైంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా గేట్ ర్యాంకు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. బీటెక్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా గేట్ రాస్తారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. గత ఏడాది 7.11 లక్షల మంది గేట్ రాశారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 1.25 లక్షల మంది గేట్ రాస్తుంటారు. -
ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు ఆపదలో ఉన్న బాధితులనే కాదు... మూగజీవులనూ రెస్క్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్ గస్తీ సిబ్బంది సోమవారం ఉదయం గేట్ గ్రిల్లో చిక్కుకున్న ఓ పిల్లికి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేసిన అధికారులు దాంతో పాటు ఓ ప్రశ్నను సంధించారు. దీనికి అనేకమంది నెటిజనుల తమదైన శైలిలో స్పందిస్తూ సలహాలు, సూచలు ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుల్తాన్‌బజార్ ఠాణాకు చెందిన పెట్రో కార్–1 సిబ్బంది సోమవారం ఉదయం తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వీరి వాహనం కుబ్తిగూడలోని థామస్ చర్చి వద్దకు చేరుకునే సరికి ఓ ఇంటి వద్ద హడావుడి కనిపించింది. అక్కడకు వెళ్లిన గస్తీ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఇంటి గేటు గ్రిల్లో పిల్లి తల ఇరుక్కుందని, బయటకు తీసుకోవడానికి అది నానా తంటాలు పడుతోందని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మార్జాలానికి గ్రిల్ నుంచి విముక్తి కల్పించారు. పిల్లి గ్రిల్లో చిక్కుకున్న ఫొటోను పోస్టు చేసిన సిటీ పోలీసు ఫేస్బుక్ పేజ్ దాంతో పాటు ‘పిల్లిని విడుదల చేయడానికి సులభమైన మార్గాన్ని వ్యాఖ్యానించండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి నెటిజనుల నుంచి భారీ స్పందన వచ్చింది. తమకు తోచిన సూచనలు చేశారు. కొందరైతే అలా చిక్కుకున్న పిల్లులను బయటకు తీయడానికి అనుసరించాల్సిన విధానాలతో కూడిన యూట్యూబ్ వీడియోల లింకుల్నీ షేర్ చేశారు. పిల్లి తలకు, గ్రిల్‌కు నూనె పూసి తీయాలని, వెల్డింగ్‌తో కట్ చేయాలని ఇలా సలహాలు ఇచ్చారు. -
‘గేట్’ మనోళ్లదే! ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సొంతం
సాక్షి, హైదరాబాద్/కాజీపేట అర్బన్/మధిర: ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లోని మాస్టర్ డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్)–2022 ఫలితాలను గురువారం ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాచర్ల ప్రణీత్ కుమార్, మణి సందీప్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. గేట్ కోసం దేశవ్యాప్తంగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 7,11,542 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా గేట్ రాశారు. దేశవ్యాప్తంగా 1,26,813 (17.82 శాతం) మంది అర్హత పొందారు. మొత్తం 100 మార్కులుండే ఈ పరీక్షకు ఈసారి 25 మా ర్కులు అర్హత(కటాఫ్)గా నిర్ణయించారు. ర్యాంకుల వివరాలు, డౌన్లోడ్ కోసం gate.iitkgp.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. గేట్లో మొదటి ర్యాంకు సాధించిన వరంగల్ నిట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనలియర్ విద్యార్థి మణి సందీప్‌రెడ్డికి ఆ సంస్థ డైరెక్టర్ ఎన్వీ రమణారావు గురువారం మొక్కను బహూకరించి అభినందించారు. అదేవిధంగా నిట్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హర్దీప్ 42వ ర్యాంకు సాధించాడు. స్వీయశిక్షణతోనే టాప్‌ర్యాంక్:మణి సందీప్‌రెడ్డి గేట్లో మొదటిర్యాంకు పొందడం సంతోషంగా ఉంది. రాజమండ్రికి సమీపంలోని వెదురుపాక సొంతూరు అయినప్పటికీ, టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. మా నాన్న రామగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌తోపాటు షాపు నిర్వహిస్తాడు. అమ్మ ఐశ్వర్య భాగ్యలక్ష్మి గృహిణి. ఇంజనీరింగ్ చేస్తూనే సొంతంగా గేట్‌కు ఆరునెలలపాటు తర్ఫీదు అయ్యాను. మార్కెట్లో దొరికే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌తో నా ప్రిపరేషన్ అయ్యాను. పేద కుటుంబంలో విద్యాకుసుమం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మాచర్ల శ్రీనివాసరావు– రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్‌కుమార్ అలహాబాద్ నిట్‌లో బీటెక్(ఈఈఈ) పూర్తిచేశారు. శ్రీనివాసరావు స్థానిక సీపీఎస్ రోడ్డులో బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని దారాలు, గుండీలు వంటి టైలరింగ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబమే అయినా కష్టపడుతూ కుమారుడిని చదివించారు. మాచర్ల శ్రీనివాసరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి చదివిన ప్రణీత్ జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన పట్టుదలతో చదివినట్లు తెలిపారు. తెనాలి యువకుడికి 21వ ర్యాంకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల శేషసాయిరెడ్డి 21వ ర్యాంకు సాధించారు. ఈయన ప్రస్తుతం కోల్ ఇండియాలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. మరోవైపు యూపీఎస్సీ నిర్వహిం చిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఈయన తల్లి దీపలత సెకండరీ గ్రేడ్ టీచరు కాగా.. తండ్రి ఆళ్ల రవీంద్రారెడ్డి రైతు. శేషసాయిరెడ్డి నాగపూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివా రు. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీటు.. ఎంటెక్ చేయటం, తర్వాత పీహెచ్డీ పూర్తిచేయాలని ఉందని ఆయన చెప్పారు. ఐఈఎస్‌లో జాబ్ వస్తే మరింత సంతోషమన్నారు. -
గేట్ పోస్ట్‌పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
గేట్–2022: ఈ మార్పులు గమనించారా?
గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. గేట్–2022లో మార్పులు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం.. గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి..నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్; జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్–2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన(రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. అర్హత ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/కామర్స్ /సైన్స్/ఆర్ట్స్ విభాగాల్లో.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఆన్లైన్ పరీక్ష ► గేట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. ► మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► రెండు విభాగాలుగా జరిగే గేట్లో.. పార్ట్–ఏ జనరల్ అప్టిట్యూడ్. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ► పార్ట్–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి. ► పార్ట్–బీలోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 10–15 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు.. మూడు రకాలు ► గేట్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు)గా పేర్కొనే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ). మూడో విధానంలో న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్ఏటీ) ప్రశ్నలు. ► ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ► మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన ఉండాలి. ► న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్ కీ ప్యాడ్ ద్వారా సమాధానం టైప్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ విశ్లేషణ ముందుగా అభ్యర్థులు గేట్ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. గత ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. ఆ తర్వాత గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణలు. వెయిటేజీని అనుసరిస్తూ గేట్–2022 పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆరు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. సీరియస్ అభ్యర్థులకు విజయ సాధన దిశగా ఈ సమయం సరిపోతుందనే చెప్పొచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాలను అనుసరించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. గత అయిదారేళ్లుగా గేట్లో లభిస్తున్న వెయిటేజీ, అకడమిక్ వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. బేసిక్స్, అప్లికేషన్ అప్రోచ్ గేట్లో మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబం«ధించి ప్రాథమిక భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అంచనావేయాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. దాంతోపాటు వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. సమయ పాలన గేట్ విజయంలో సమయ పాలన ఎంతో ముఖ్యం. ప్రస్తుత సమయంలో విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు గేట్ ప్రిపరేషన్‌కు కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.వాస్తవానికి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. ఇది కొంత కష్టమైన విషయమే. అయినా సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి. గేట్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్లైన్ పరీక్ష తీరుపై అవగాహన పెంచుకోవాలి. వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగం, ఆన్‌స్క్రీన్ ఆన్సర్స్ రికగ్నిషన్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్లో విజయానికి దోహదపడుతుంది. అకడమిక్స్ ఆలంబనగా గేట్ విద్యార్థులు అకడమిక్ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ముందడుగేయాలి. ఎందుకంటే.. గేట్ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్ పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు.. దానికి సంబంధించి పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మలి దశలో ఇలా గేట్ స్కోర్ అనేది.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు.. ఎస్సే రైటింగ్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే అడ్మిషన్ ఖరారవుతోంది. పీఎస్‌యూలు.. మలిదశ గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు).. మలి దశలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోర్‌కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ లభిస్తోంది. స్కోర్ సాధిస్తేనే గేట్లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్ ఆశించే అభ్యర్థులు... గేట్లో కనీసం 650కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. పలు ఇన్స్టిట్యూట్లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో కోర్ బ్రాంచ్‌లలో ఫైనల్ కటాఫ్ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. గేట్–2022 సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021 ► గేట్ పేపర్ మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేది: నవంబర్ 12, 2021 ► గేట్–2022 ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది. ► గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://gate.iitkgp.ac.in/index.html -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
-
కొట్టుకుపోయిన పులిచింతల గేటు లభ్యం
-
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
సొంతంగా ప్రిపేరయ్యా..
సాక్షి, మహబూబాబాద్: ‘ఎక్కడా కోచింగ్ తీసుకో లేదు.. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివి గేట్ ఇన్ ఇంజినీరింగ్ (గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించా’నని తెలిపాడు సౌరవ్ సింగ్. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరవ్ గేట్లో ప్రతిభ చాటాడు. తన ప్రిపరేషన్, భవిష్యత్ లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. గేట్లో మొదటి ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నమ్మటానికి కొంచెం టైమ్ పట్టింది. ఒకటికి రెండుసార్లు రిజల్ట్ చూసుకున్నా. కుటుంబ నేపథ్యం.. బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్‌పూర్‌కు చెందిన విమల్సింగ్, పూనమ్‌సింగ్ నా తల్లిదండ్రులు. నాకు దివ్య, ప్రతిమ అక్కలు ఉన్నారు. నాన్న గ్రామంలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. పెద్దక్క టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండో అక్క సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రిపరేషన్ ఇలా... నిట్‌లో డాక్టర్ నర్సయ్య సార్ అందించిన ప్రోత్సాహం, నిట్ డైరెక్టర్, ఇతర ప్రొఫెసర్ల చొరవతోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించా. గేట్ ప్రవేశపరీక్షకు సుమారు ఆరు నెలలు కష్టపడి చదివాను. ప్రతిరోజూ నాలుగు గంటలపాటు వివిధ పుస్తకాలను చదివే వాడిని. విషయ పరిజ్ఞానం కోసం అగ్లాసెమ్ వెబ్సైట్ చాలా తోడ్పడింది. సైట్లో గేట్లో విజయం సాధించిన ర్యాంకర్ల ఇంటరŠూయ్వలను పొందుపరిచారు. గత ఏడాది నంబర్‌వన్ ర్యాంకు సాధించిన నితీష్రాయ్ ఇంటరŠూయ్వ స్ఫూర్తినిచ్చింది. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. సొంతగానే నోట్స్ తయారు చేసుకున్నా. ఐఓసీఎల్‌లో ఉద్యోగం చేస్తా.. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. గేట్లో ఆల్ ఇండియా లెవల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన నాకు ఎంటెక్ వైపు కాకుండా ఆయిల్, రీఫైనరీలో ఉద్యోగం చేయాలనుంది. ఆయిల్ కంపెనీల్లో పేరెన్నిక గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఉద్యోగం చేస్తా. ప్రస్తుతం ఐఓసీఎల్‌లో జాయిన్ అవుతా. నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తా.. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. జేఈఈలో 20605 ర్యాంకు సాధించి నిట్ వరంగల్‌లో మెటలర్జికల్ విభాగంలో చేరాను. నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే ఆల్ ఇండియా నంబర్‌వన్ ర్యాంకు సాధించా. నాకు నంబర్‌వన్ ర్యాంకు అందించిన నిట్‌కు రుణపడి ఉంటా. నిరుపేదలకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక చేయూతనందిస్తా. వరంగల్ బ్యూటీపుల్ సిటీ. -
రిమోట్ గేట్
నా పేరు రమ్య. మేము మలేషియాలో ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. సాక్షి ఫన్డే బుక్‌లో ఎప్పుడూ మిస్ కాకుండా కథలన్నీ చదువుతాను. మాకు హార్డ్ కాపీ దొరకదు కాబట్టి ఆన్లైన్లో చదువుతుంటాను. కానీ ఎప్పుడూ చదవడమేనా.. నేనే ఓ కథ రాసి మెయిల్ చేస్తే? ఆలోచన రాగానే రెండు మూడు కథలు రాశా. కానీ అవి నాకే అంతగా నచ్చలేదు. ఈసారి ఎలాగైనా ఓ మంచి కథ రాయాలని పుస్తకం తెరిచా. పెన్నందుకొని పుస్తకంపై ఒక అక్షరం రాయగానే, గేట్ దగ్గర సౌండ్. విండోలోనుంచి చూశా. చిన్నూ ఫ్రెండ్ స్టెల్లా వెయిట్ చేస్తోంది గేట్ దగ్గర. మాది రిమోట్ గేట్. రిమోట్ ప్రెస్ చేయగానే ఓపెన్ అయింది అది. పాప లోపలకి వచ్చింది. చిన్నూ పరుగెత్తుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు. నవ్వుకుంటూ లోపలకి వచ్చింది స్టెల్లా. తను అచ్చం బొమ్మæఉన్నట్లు ఉంటుంది. నాకు తన బుగ్గలంటే చాలా ఇష్టం. గిల్లుతానని త్వరగా నా దగ్గరకు రాదు. నేను కథ రాస్తుంటే అడిగింది.. ‘‘ఆంటీ ఏం చేస్తున్నారు?’’ అని. ‘‘కథ రాస్తున్నాను’’ అన్నా. ‘‘ఓహ్! నేను హెల్ప్ చేయనా ఆంటీ?’’ అంది. నవ్వొచ్చింది. స్టెల్లాకు ఐదేళ్లు. ఇరవై తొమ్మిదేళ్ల నాకే ఏం రాయాలో తెలీట్లేదు. ‘‘సర్లే! మీరు ఆడుకోండి’’ అన్నా. కాసేపు ఆడుకొని స్టెల్లా వెళ్లిపోయింది. చిన్నూకి తొమ్మిది నెలలు ఉన్నప్పట్నుంచే స్టెల్లా ఫ్రెండ్. చిన్నూ వయసే. మా సొసైటీలో ఉన్న ప్లే ఏరియాలో పరిచయం. స్టెల్లా అమ్మా, నాన్నా ఇద్దరూ జాబ్ చేస్తారు. మా ఇల్లు దగ్గరే కావడంతో రోజూ సాయంత్రం వచ్చి చిన్నూతో ఆడుకుంటుంది. అప్పుడప్పుడు చిన్నూ కూడా వాళ్లింటికి వెళ్తుంటాడు. కథ రాయడం పక్కనబెట్టి, డిన్నర్ రెడీ చేసే పనిలో పడిపోయాను. తర్వాత రోజు మధ్యాహ్నం మళ్లీ బుక్ పట్టుకున్నా. ముందుకు కదల్లేదు. వేరే వాళ్లు రాసినవి చదివినపుడు కథ రాయడం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ.. మనమే పెన్ పట్టుకున్నాక కానీ తెలీదు.. అంత ఈజీ కాదని. ఏం రాయాలో అర్థం కాలేదు. స్నానానికి వెళ్లిపోయా అన్నీ పక్కనపెట్టేసి. వచ్చేసరికి లివింగ్ రూమ్‌లో మాటలు వినిపిస్తున్నాయి. ‘వంశీ ఏమైనా త్వరగా వచ్చాడా?’ అనుకున్నా, సెకండ్ కీ తనదగ్గరే ఉంటుంది కాబట్టి. డ్రెస్ చేసుకుని లివింగ్ రూమ్‌కి వచ్చి చూస్తే స్టెల్లా, చిన్నూ ఆడుకుంటున్నారు. కొద్దిసేపేమీ అర్థం కాలేదు పాప లోపలకి ఎలా వచ్చిందో!! గేట్ రిమోట్ బెడ్ రూమ్‌లో ఉంది. చిన్నూ ఓపెన్ చేయలేడు. ‘‘స్టెల్లా! గేట్ ఎలా ఓపెన్ అయింది?’’ అన్నా.‘‘నేను టెన్ మినిట్స్ వెయిట్ చేసాను ఆంటీ. గేట్ ఎవరూ ఓపెన్ చేయలేదు. అందుకే దూకేసి వచ్చా’’ అంది. ‘‘నో స్టెల్లా! ఎప్పుడూ అలా చేయకు. కింద పడితే దెబ్బలు తగులుతాయి. నేను ఓపెన్ చేసేవరకు వెయిట్ చేయాలి’’ అన్నా. ‘‘ఓకే ఆంటీ!’’ అంది. ‘‘ప్రామిస్ చెయ్యి! ఇంకెప్పుడూ గేట్ దూకనని’’ అన్నా. ‘‘ప్రామిస్ ఆంటీ!’’ అంది తల మీద చెయ్యి పెట్టుకుని. తనేం చేసినా చాలా క్యూట్‌గా ఉంటుంది. దగ్గరకెళ్లి బుగ్గలు గిల్లబోయాను. తప్పించుకుంది. ఇద్దరికీ స్నాక్స్ తెచ్చిచ్చాను. ‘‘నాకు వద్దు ఆంటీ! నైట్ ఫుడ్ తినడం లేదని మమ్మీ తిడుతుంది’’ అంది స్టెల్లా. సోఫాలో పడి ఉన్న బుక్‌ని చూసి ‘‘స్టోరీ ఫినిష్ అయిందా?’’ అనడిగింది.‘‘నో స్టెల్లా!’’ ‘‘నేను హెల్ప్ చేస్తానులే ఆంటీ!’’ అంది.‘‘ఓకే అలాగే చేద్దువులే’’ అన్నాను నవ్వుతూ. ఆరవ్వగానే వెళ్ళిపోయింది.తర్వాత రోజు చిన్నూ స్కూల్ నుండి రాగానే ‘‘మమ్మీ! నా క్లాస్‌లో జాన్సన్ ఉన్నాడు కదా.. స్టెల్లా కజిన్.. తను చెప్తున్నాడు.. స్టెల్లా వాళ్ళు ముదీలో ఉన్నారని. మన ఇంటికి వచ్చి ఆడుకుంది అంటే నమ్మడం లేదు వాడు..’’ అని చెప్తూ పోతున్నాడు. స్టెల్లా అంతకుముందు వారం ఊరెళ్తా అని చెప్పింది. నాకే సరిగ్గా గుర్తులేదు.‘‘స్టెల్లా, నువ్వూ ఒకే బస్‌లో వస్తారు కదా? కనిపించలేదా?’’ అనడిగా.‘‘లేదు మమ్మీ!’’ అన్నాడు. ‘‘సరేలే!’’ అని చెప్పి చిన్నూకి స్నాక్స్ ప్రిపేర్ చేసిచ్చా. తినేసి పడుకున్నాడు.ఇక ఈరోజు ఎలాగైనా కథ రాయాల్సిందేనని బుక్ అందుకున్నా. పెన్ అస్సలు కదలడం లేదు. అంతలో గేట్ దగ్గర సౌండ్.. ‘ఇంకెవరు? స్టెల్లానే అయి ఉంటుంది’ అనుకొని మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూశా. తనే! ‘టైమ్ నాలుగయ్యేసరికి వచ్చేస్తుంది ఆడుకోడానికి.. స్కూల్ దొంగ’ అనుకుంటూ గేట్ ఓపెన్ చేశా. లోపలకి వచ్చింది. ‘‘చిన్ను ఎక్కడ ఆంటీ?’’ అంది. ‘‘నిద్ర పోయాడు. నువ్వు స్కూల్‌కి వెళ్లావా స్టెల్లా!?’’ అనడిగా.‘‘వెళ్ళాను అంటీ.. మమ్మీ డాడీ డ్రాప్ చేస్తున్నారు’’ అంది. ‘‘మరి ఆఫ్టర్నూన్ ఎలా వస్తున్నావ్?’’ ‘‘మమ్మీ వాళ్లే తీసుకొస్తున్నారు’’ అంది. ‘ఓహ్! అందుకేనా బస్‌లో కనిపించడం లేదు చిన్నూకి!’ అనుకున్నా. ‘‘ఏదో ఊరెళ్తానన్నావ్? వెళ్లారా?’’‘‘వెళ్లాం ఆంటీ! కానీ బోరింగ్ అక్కడ!!’’స్టెల్లాతో నేను మాట్లాడుతూంటే చిన్నూ నిద్రలేచాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆటలో పడిపోయారు. స్టెల్లా ఆరింటివరకూ ఆడుకుని వెళ్ళిపోయింది. ఏడు గంటలకు వంశీ వచ్చాడు ఆఫీస్ నుండి. ఏదో కంగారుగా ఉన్నాడు. ‘‘రమ్యా నీకో విషయం తెలుసా! ఫైవ్ డేస్ బాక్ హైవే మీద ఒక ఆక్సిడెంట్ జరిగిందంట.. స్పాట్లోనే ఫ్యామిలీ అంతా చనిపోయారంట.. ఇదిగో న్యూస్ పేపర్ ఆఫీస్‌లో ఉంటే చూసి తెచ్చాను.. ఎవరో చూడు షాక్ అవుతావు’’ అని పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ చూడగానే ఒక్కసారే నాకు గుండె పనిచేయడం ఆగినట్లనిపించింది. వళ్లంతా చెమటలు పట్టేశాయి. ఆ పేపర్లో ఉన్నది స్టెల్లా అండ్ ఫ్యామిలీ. వెంటనే మొబైల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఓపెన్ చేసి ‘ముది’ అనే చైనీస్ వర్డ్‌కి ఇంగ్లిష్ మీనింగ్ చూశా. ఇంగ్లీష్‌లో ‘గ్రేవ్‌యార్డ్’ అని వచ్చింది. అంటే స్టెల్లా కజిన్ చెప్పింది నిజమే! చిన్నుని బెడ్రూమ్లో ఆడుకోమని పంపించేశా. ‘‘కానీ స్టెల్లా రోజూ ఆడుకోడానికి వస్తోంది!’’అన్నా.వంశీ నా వైపు వింతగా చూసి పెద్దగా నవ్వాడు. ‘‘ఏంటి ఈ మధ్య నువ్ రాస్తున్న హారర్ కథలని నాకే వినిపిస్తున్నావా?’’ ‘‘ఓకే! నేను చెప్పేది నమ్మకుంటే రేపు ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. నాలుగింటికి ఆ పాప వస్తుంది’’ చెప్పాను.‘‘లేదు. నాకు రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది’’ అన్నాడు. తనకు చెప్పినా నమ్మడానికి రెడీగా లేడు అని అర్థం అయింది. ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు.ఒక ఇరవై సార్లైనా ఆ న్యూస్ చదివి ఉంటా. చిన్ను స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తినిపించి పడుకోబెట్టేశా. టైమ్ నాలుగయింది. గేట్ దగ్గర ‘‘ఆంటీ! ఓపెన్ ద గేట్’’ అంటూ నిలబడ్డ స్టెల్లా కనిపించింది. చిన్ను పడుకున్న రూమ్ డోర్ లాక్ చేసి గేట్ వైపే చూస్తూ కూర్చున్నా. పది నిమిషాలు చూసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను మళ్లీ వంశీతో డిస్కస్ చేయదలుచుకోలేదు. తను ఎలాగూ నమ్మడు. స్టెల్లా అంటే భయం కూడా పోయింది ఇప్పుడు. గేట్ దూకి తను లోపలికి రాలేదు. శని, ఆదివారాలు తప్పించి వరసగా పదిరోజులు నాలుగింటికి గేట్ దగ్గర ఎదురుచూసింది. నాకు గేట్ ఓపెన్ చేసే ఉద్దేశం లేదు. తనకు గేట్ క్రాస్ చేసి వచ్చే ఉద్దేశం అంతకంటే లేదు. ప్రామిస్ చేసింది కదా! మొదటిసారి దెయ్యాలు అంటే భయం బదులుగా గౌరవం వచ్చింది. దెయ్యానికి ఉన్న డిసిప్లిన్ మనుషులకు ఉండుంటే ఎన్నో ఇళ్ల డోర్లు బలవంతంగా తెరుచుకునేవి కాదు. ఎందరి ప్రాణాలో డబ్బు కోసం, నగల కోసం గాలిలో కలిసుండేవి కాదు. మేము అక్కడే ఉంటే తను మమ్మల్ని వదిలి వెళ్లలేదని అర్థం అయింది. పది రోజుల్లోనే వంశీని విసిగించి ఇల్లు మారిపోయాం. ఇదంతా జరిగిన కొన్ని రోజులకు ఐటీ ఎగ్జిబిషన్లో మేము ఖాళీ చేసిన ఇంటి ఓనర్ కనిపించాడు. ‘‘మీరు వెళ్లిపోయాక ఇల్లు రెంట్‌కి ఇవ్వకుండా మేమే ఉంటున్నాం మేడం! నా వైఫ్ రోజూ కంప్లైంట్ చేస్తోంది. సాయంత్రం నాలుగవ్వగానే గేట్ దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయని, ఏదో దెయ్యం అయి ఉంటుందని భయపడుతోంది. తన పిచ్చి కాకుంటే అది దెయ్యమే అయితే గేట్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేస్తుందా? ఎప్పుడో లోపలకి వచ్చేది కదా?’’ అని నవ్వాడు.అక్కడే ఇంక ఉండలేక ఇంటికి వచ్చేశా. చిన్ను లాస్ట్ ఇయర్ బర్త్‌డే ఆల్బమ్ ఓపెన్ చేసిన నాకు, తెలీకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి.. చిన్ను పక్కనే నవ్వులు చిందిస్తూ నుంచుని ఉన్న స్టెల్లాని చూసి.వెంటనేæగట్టిగా డిసైడ్ అయ్యా.. ఇక మీద వంశీ ఆఫీస్ నుండి లేట్‌గా వచ్చినా గొడవ పడడం, అలగడం మానేయలని. మనుషుల్ని చూసి కాకున్నా, దెయ్యాలని చూసి అయినా కొన్ని నేర్చుకోవాలి కదా!!? ఒక ఫ్రెండ్ కోసం దెయ్యం అయి కూడా తను అంతగా వెయిట్ చేస్తుంటే, మనిషిగా ఉన్న నేను హజ్బెండ్ కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? మనుషులను చూసి నేర్చుకోవడం ఎప్పుడో మానేశా. చూసి నేర్చువాల్సినంత గొప్పవాళ్లు కనపyì చాలా ఏళ్లే అవుతోంది. అసలు దెయ్యాలు, ఆత్మలు లాంటివి ఉంటాయంటేనే నమ్మని నాకు ఫస్ట్ టైమ్ వాటిని గౌరవించాలని, వాటిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చని అర్థమయింది.దేవుడి గదికి ఎప్పుడో ఒక్కసారి వెళ్లే నేను.. ఈరోజు ఆ దేవుడి ముందు కూర్చుని ఒక్కటే అడిగాను.. ‘ఆ పాప ఆత్మకు శాంతి కలిగించు’ అని. దెయ్యాలని చూసాక మరి దేవుడు కూడా ఉన్నాడని నమ్మాలికదా!?స్టెల్లా నాకు ఇచ్చిన మాట కూడా తప్పలేదు. ‘‘కథ రాయడానికి హెల్ప్ చేస్తా!’’ అని అప్పుడు అంటే అర్థం కాలేదు.. తనే కథని. - రమ్యరెడ్డి (మలేషియా) -
కలకలం.. కలవరం..
- పెళ్లిబృందం లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 22 మందికి గాయాలు - సురక్షితంగా బయటపడిన వరుడు - త్రుటిలో తప్పిన పెనుముప్పు - ఈతకోట టోల్గేట్ వద్ద ఘటన రావులపాలెం : వివాహ వేడుక వేళ జరిగిన ఓ ప్రమాదం.. వధూవరుల కుటుంబాల్లో కలవరం రేపింది. పెళ్లిబృందంతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు లారీలో ఉన్న 22 మంది గాయపడ్డారు. రావులపాలెం మండలం ఈతకోట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన మర్రి సత్యనారాయణ వివాహం శనివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వధువు ఇంటివద్ద జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లికొడుకు సత్యనారాయణతోపాటు ప్రత్తిపాడు, గోకవరం ప్రాంతాలకు చెందిన అతడి తరఫు బంధువులు సుమారు 80 మంది ఒక లారీలో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో ఈతకోట టోల్గేట్ వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో లారీ వేగాన్ని డ్రైవర్ తగ్గించాడు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అది గమనించకుండా వేగంగా దూసుకువచ్చి పెళ్లిబృందం లారీని ఢీకొట్టాడు. దీంతో పెళ్లిబృందం లారీ అదుపు తప్పి డివైడర్ మీదుగా కుడివైపు రోడ్డులోకి దూసుకుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో లారీలో ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోయి, గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన మహిళలు, పిల్లలు ఆర్తనాదాలు చేశారు. ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్ అందులో చిక్కుకు పోయాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు, ఎస్సై పీవీ త్రినాథ్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. క్షతగాత్రులను హైవే, 108 అంబులెన్సులలో తొలుత కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చెరుకూరి యాకోబు, మేకల మహాలక్ష్మి, కల్లూరి మహేష్, మర్రి రమణలను మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్, మర్రి ముత్యాలరావు, మర్రి త్రిమూర్తులు, చెరుకూరి రాజు, అచ్చిబాబులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. మర్రి సత్తిబాబు, కల్లూరి విజయ్, మర్రి కృపావతి తదితరులు కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుడు సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో వివాహానికి ఆటంకం కలగకుండా అతడితోపాటు కుటుంబ సభ్యులను ప్రత్యేక వాహనంలో పోలీసులు పాలకొల్లు పంపారు. నిర్లక్ష్యమే కారణం! ఈ ప్రమాదానికి టోల్గేట్ అధికారులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. టోల్గేట్ వద్ద ఇరువైపులా స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసినా వాటికి రేడియం స్టికర్లు కానీ రంగు కానీ వేయలేదు. దీంతో రాత్రి వేళల్లో అవి కనిపించడంలేదు. అలాగే టోల్గేట్ వద్ద లైటింగ్ కూడా అంతంతమాత్రంగా ఉంటోంది. గతంలో కూడా ఈ కారణంగా ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. 2015 డిసెంబర్లో టోల్గేట్ ప్రారంభమైన కొత్తలో పొగమంచులో స్పీడ్ బ్రేకర్లు కనిపించక ఒక హైటెక్ బస్సును ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా పలువురు గాయపడ్డారు. టోల్గేట్ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నా ఎలాంటి చర్యలూ కానరావడం లేదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా లారీలో భారీగా జనాన్ని పెళ్లికి తరలించడాన్ని పోలీసు, రవాణా అధికారులు పట్టించుకోకపోడం ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. -
గేట్లో నగేష్ భట్‌కు 132వ ర్యాంక్
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విభాగానికి చెందిన నగేష్ భట్ అనే విద్యార్థి 132వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల సీఈఓ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ వంటి గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి రూ. 5 వేల బహుమతి అందజేసి, అభినందించారు. ఆల్ ఇండియా స్థాయిలో విద్యార్థి మంచి ర్యాంక్ సా«ధించడం తమ కళాశాలకు గర్వకారణమని సాంబశివారెడ్డి తెలిపారు. -
విషాదాన్ని నింపిన రిజర్వాయర్ ఘటన
-
గేట్ మధ్యలో నిలిచిన గూడ్స్
యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లి రైల్వే గేట్ వద్ద ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో గేట్ గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మధ్యాహ్నాం 2.55 గంటలకు వంగపల్లి స్టేషన్‌కు చేరుకునే క్రమంలో సాంకేతిక లోపంతో గేట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వరంగల్ జిల్లా నుంచి యాదాద్రికి వచ్చే వాహనాలన్నీ గేట్ వద్దే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించి సాయంత్రం 5.30 గంటలకు రైలును అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో రాకపోకలు పునప్రారంభం అయ్యాయి. -
గేట్ కళాశాలలో వర్క్‌షాపు
చిలుకూరు: మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఎండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ అటోమిషన్ అనే అంశంపై వర్క్ షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపును కళాశాల చైర్మన్ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వర్క్‌షాపులో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులుకు కళాశాలలో అన్ని హంగులతో వసతులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మైకెల్ ఫారడే పుట్టిన రోజున విద్యార్థులు వర్క్‌షాపు నిర్వహించడం హర్షంచదగిన విషయమన్నారు. వర్క్‌షాపు రెండు రోజుల పాటు జరుగుతుందని ప్రిన్సిపాల్ రామరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు తెరచుకోనున్న రైల్వే గేట్
–మొదలైన పునరుద్ధరణ పనులు –మిఠాయిల పంపిణీ ఆలేరు : ఎట్టకేలకు ఆలేరు రైల్వే గేట్ తెరుచుకోనుంది. గత నెల 9న రైల్వే గేట్ మూసివేశారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పలుమార్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రైల్వే జీఎం, రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఆర్యూబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతించింది. వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ, రైల్వేశాఖ వారు సంయుక్తంగా రూ. 5.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించారు. ఆÆŠయూబీ నిర్మాణానికి 9 నెలల సమయం పడుతుందని నిర్ణయించారు. ఆర్యూబీ నిర్మాణంతో పాటు రైల్వేగేట్‌ను తెరవాలని నిర్ణయించారు. అయితే ఆర్యూబీ నిర్మాణం పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెయింటెన్స్ ఖర్చులు సుమారు రూ. 33 లక్షలు ఖర్చు అవుతాయని, డిపాజిట్ చేయాలని రైల్వేశాఖ కోరింది. దీంతో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన సొంత డబ్బులు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు పలు మార్లు రైల్వే జీఎంలను కలిశారు. మొత్తం మీద రైల్వేగేట్‌ను తెరిచేందుకు పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రైల్వేగేట్‌ను తెరచి యధావిధిగా కొనసాగించనున్నారు. మిఠాయిల పంపిణీ ఆలేరులో రైల్వేగేట్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడంతో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గేట్ వద్దకు చేరుకుని పనులు చేపడుతున్న రైల్వేసిబ్బందికి మిఠాయిలు తినిపించారు. గేట్‌ను తెరిపించేందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, ఎండి సలీం, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కామిటికారి కృష్ణ, దడిగె ఇస్తారి, ఎగ్గిడి శ్రీశైలం, వడ్డెమాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అలీసాగర్ నీటి కోసం ధర్నా
ఎడపల్లి: అలీసాగర్ నీటితో ఎడపల్లి మండలంలోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ విపక్షాల నేతృత్వంలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. శాటాపూర్ గేట్ వద్ద బోధన్–నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించారు. డి–46 కాలువ ద్వారా అలీసాగర్ నీటిని ఎడపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. అలీసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గఫర్‌మియా, ఇరిగేషన్ ఈఈ సత్యశీల్‌రెడ్డి హామీ ఇచ్చినా నేతలు, రైతులు శాంతించలేదు. ఆర్డీవో వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో సమాచారమందుకున్న ఆర్డీవో సుధాకర్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో మట్లాడారు. అలీసాగర్ నీటిని తమ మండలానికి ఇవ్వకుండా, డి–50 కాలువకు విడుదల చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు నీళ్లివ్వాలని ఓ రైతు ఆర్డీవో కాళ్లు పట్టుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి చెరువులు నింపుతామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు బిల్ల రామ్మోహన్, ఎల్లయ్యయాదవ్, నర్సింగ్, అంజాగౌడ్, ఇస్మాయిల్, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు సురేశ్, పోశెట్టి, భాస్కర్‌రెడ్డి, హన్మాండ్లు, శ్రీధర్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
గేట్ తెరిచాకే ఆర్యూబీ పనులు చేపట్టాలి
ఆలేరు : యథావిధిగా రైల్వేగేట్‌ను తెరిచాకే రైల్వే అండర్ బ్రిడ్జ్(ఆర్యూబీ) పనులను చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ఇందిరాకాంగ్రెస్ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన బైపాస్ రోడ్డు పనులు చేపడుతూ ఆర్యూబీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు అయ్యే వరకు రైల్వేగేట్‌ను కొనసాగించాలని కోరారు. వాస్తవ జల దృశ్యం పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రదర్శనలో వాస్తవాలు, విశ్లేషణలు లేవని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు పేర్కొనడం హాస్యస్పదమన్నారు. ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జనగాం ఉపేందర్‌రెడ్డి, కొలుపుల హరినాథ్, నీలం పద్మ, కె సాగర్‌రెడ్డి, ఎండీ.జైనోద్దీన్, నీలం వెంకటస్వామి, ఎలగల కృష్ణ, ఎంఏ.ఎజాజ్, పుట్ట మల్లేశం, ముదిగొండ శ్రీకాంత్, సీస రాజేష్‌గౌడ్, ఎగ్గిడి శ్రీశైలం పాల్గొన్నారు. -
మోదీ పాలన రెండేళ్ళ పండుగ!
న్యూఢిల్లీః మోదీ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న వేడుకలతో ఇండియా గేట్ ప్రాంతం సందడిగా మారింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలనే ఇతివృత్తంగా కొనసాగిన 'మేరా దేశ్ బఢ్ రహా హై... ఆగే బఢ్ రహా హై...' అంటూ సాగిన గీతం ఆహూతులను అలరించింది. 'ఏక్ నయీ సుబహ్' పేరిట నిర్వహిస్తున్న ఐదు గంటల సుదీర్ఘ మెగా ఈవెంట్ లో భాగంగా ఎన్గీఏ పాలనలోని విజయాలు, పథకాలను కేంద్రం వివరిస్తుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతం కార్యకర్తలు, అభిమానులు, ప్రేక్షకులతో కోలాహలంగా మారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'ఏక్ నయీ సుబహ్' కార్యక్రమాలు మనోరంజకంగా కొనసాగుతున్నాయి. ఐదు గంటలపాటు ఏకథాటిగా కొనసాగే కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన బేటీ బచావో, బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలపై చిన్నారులతో ముచ్చటించారు. ఐదు గంటలపాటు జరిగే విజయోత్సవ కార్యక్రమాన్ని మొత్తం పది సెగ్మెంట్లుగా విభజించారు. వీటిలో రెండేళ్ళ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, నెరవేర్చిన హామీలు, పలు పథకాలపై చర్చించేందుకు కేటాయించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు, వారితో జరిపిన ఇంటర్వ్యూలు, పథకాలవల్ల లబ్ధిపొందినవారితో చర్చలు వంటి అనేక కార్యక్రమాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాజధాని ఢిల్లీకి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం కాక, దేశంలో కేంద్ర మంత్రులు ఉన్న షిల్లాంగ్, ముంబై, విజయవాడ, జైపూర్, కర్నాల్, అహ్మదాబాద్ నగరాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం కూడ నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ లోని మంత్రులు, పలువురు సినీ తారలు, హాజరయ్యారు. -
గేట్ ఆన్లైన్ పరీక్షలు యథాతథం
హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, నేరుగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ఆన్లైన్ పరీక్షల్లో భాగంగా శని, ఆదివారాల్లో (ఈ నెల 7, 8 తేదీల్లో) జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు కాన్పూర్ ఐఐటీ పేర్కొంది. ఈ మేరకు గేట్ వెబ్సైట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. గేట్ పరీక్షల్లో భాగంగా గత నెల 31న, ఈ నెల 1నపరీక్షలను నిర్వహించింది. అయితే నేడు, రేపు జరగాల్సిన ఆన్లైన్ పరీక్షలను వాయిదా వేయాలని వచ్చిన విజ్ఞప్తులపై ఎలాంటి వాయిదా వేయడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఆదివారం జాయింట్ అడ్మిషన్ టెస్టు (జామ్)ను నిర్వహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ చర్యలు చేపట్టింది. ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎమ్మెస్సీ (పీహెచ్డీ), డ్యుయల్ డిగ్రీ, ఎమ్మెస్సీ-ఎంఎస్(రీసెర్చ్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. -
గేట్ ర్యాంక ర్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం
రెండు రకాల జాబితాలు పంపిన జేఎన్టీయుూహెచ్ మొదటి జాబితాలో 61 ఫార్మసీ, 145 ఇంజనీరింగ్ కాలేజీలు రెండో జాబితాలో 43 ఫార్మసీ,124 ఇంజనీరింగ్ కాలేజీలు ఆప్షన్లు ఇచ్చుకోవడంలో అభ్యర్థుల అయోమయం హైదరాబాద్: గేట్/జీప్యాట్ ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ప్రారంభమైంది. ఈనెల 6,7 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు అవకాశం కల్పించా రు. అవసరమైన పక్షంలో గడువును పొడిగిస్తామని పీజీ ఈసెట్ అధికారులు తెలిపారు. జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా సకాలంలో కౌన్సెలింగ్ అధికారులకు చేరనందున ఈనెల 10 నుంచి ప్రారంభం కావాల్సిన గేట్/ జీ ప్యాట్ అభ్యర్థుల ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కాగా పీజీ ఈసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటివరకు 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు రెండేసి జాబితాలు ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క జాబితానే కౌన్సెలింగ్ అధికారులకు అందగా, జేఎన్టీయూహెచ్ రెండేసి జాబితాలను పంపడం విశేషం. పీజీ కళాశాలలకు అఫిలియేషన్ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటి జాబితాలో 145 ఇంజనీరింగ్, 61 ఫార్మసీ కళాశాలల పేర్లు ఉండగా, రెండవ జాబితాలో 124 ఇంజనీరింగ్, 43 ఫార్మసీ కళాశాలలున్నాయి. లోపాలున్న కళాశాలల్లో సిబ్బంది, మౌలిక వసతులపై వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీచేశామని అధికారులు తెలిపారు. నివేదికలు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగియగా, 60 కాలేజీలే స్పందించాయి. అభ్యర్థుల అయోమయం వెబ్ కౌన్సెలింగ్‌కు జేఎన్టీయూహెచ్ పంపిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాల్లో ఎలాంటి షరతులతో అఫిలియేషన్ ఇచ్చారో అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. అంతేకాదు.. ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంటూ అభ్యర్థులకు అవగాహన నిమిత్తం కొంత సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టారు. తాము ఆప్షన్లు ఇచ్చిన అన్ని కళాశాలలకు చివరి నిమిషంలో అఫిలియేషన్ రద్దు చేసినట్లైతే తమకు సీట్లు ఎలాగని అభ్యర్థులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పీజీ అడ్మిషన్ల విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం అధికారులు పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి ఈనెల 9న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలమేరకు ఎంటెక్/ఎంఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశానికై వెబ్ కౌన్సెలింగ్‌కు అఫిలియేటెడ్ కళాశాల జాబితాలను రెండేసి చొప్పు న కౌన్సెలింగ్ అధికారులకు పంపాం. జేఎన్టీయూహెచ్/ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు ఆయా క ళాశాలల్లో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధించి అవసరమైన ఫ్యాకల్టీ, మౌలిక వసతుల నివేదిక ఆధారంగానే అఫిలియేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అఫిలియేషన్ రాని కళాశాలల్లో చేరిన విద్యార్థుల విషయుంలో వర్సిటీ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ మేరకు ముందుగానే అండర్‌టేకింగ్ తీసుకుంటాం.హైకోర్టు ఆదేశాల ప్రకారం కళాశాలల నుంచి సమాచారం సేకరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది కోర్సుల నిర్వహణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా అకడమిక్ కేలండర్‌ను అమలు చేయడం ఈ సారి మా నియంత్రణలో లేదు. ఈ విద్యా సంవత్సరం ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్ల మేరకు సీట్ల కేటాయింపు(అలాట్మెంట్లెటర్) లను కేసు ముగిసేవరకు విత్‌హెల్డ్‌లో పెడతాం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతాం. -
ఉన్నత కొలువులకు ‘గేట్’వే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్).. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థిరాయాలనుకునే పరీక్ష! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీలు, నిట్లు తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగానిలిచే ఈ పరీక్ష.. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఎంట్రీ లెవల్ నియామకాలకు గేట్వేగా నిలుస్తోంది. 2015 గేట్ స్కోర్‌తో నియామకాల కోసం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి పరిశ్రమలు ఆశిస్తున్న అన్వయ సామర్థ్యం, సమస్యా సాధన, విశ్లేషించే గుణం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలను పరీక్షించడంలో గేట్‌కు మించిన పరీక్ష మరొకటి లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు.. సొంతంగా నిర్వహించే నియామక ప్రక్రియలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఈ అంశాలను పరీక్షించడం సాధ్యమయ్యేది కాదు. గేట్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు మాత్రమే గేట్లో మంచి స్కోర్ సాధించగలుగుతున్నారు. గేట్‌ను దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. వేర్వేరుగా ప్రకటనలు: ఉద్యోగ నియామకాలకు సంబంధించి పీఎస్‌యూలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటికనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియలో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు తర్వాతి దశలో బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు (కంపెనీని బట్టి ఇవి మారుతుంటాయి) నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్సీఎల్, గెయిల్ వంటి సంస్థలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్ పేరుతో బృంద చర్చలు సైతం నిర్వహించి అందులోనూ రాణించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేస్తాయి. ఈ క్రమంలో దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్లకు కేటాయిస్తున్నాయి. కాబట్టి గేట్లో మంచి స్కోర్ సాధించడం కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా గేట్: ఈ కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గేట్-2015కు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్/ఇంటర్వ్యూకు ఎంపికైతే గేట్ దరఖాస్తు ప్రింటవుట్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ తీసుకువెళ్లాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు గేట్ దరఖాస్తులో ఏ వివరాలైతే (పేరు, పుట్టిన తేదీ, చిరునామా) నింపారో అవే వివరాలను సంబంధిత కంపెనీల దరఖాస్తులోనూ నింపాలి. అయా కంపెనీల్లో ఏ విభాగాల్లో అయితే నియామక ప్రకటనలు వెలువడ్డాయో అదే ఇంజనీరింగ్ బ్రాంచ్ పేపర్‌తో గేట్ రాయాలి. ఎంపిక ప్రక్రియ: తొలుత పీఎస్‌యూలు గేట్ నిర్వహణ తేదీ కంటే ముందుగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. అభ్యర్థులు వీటికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ ఫలితాలు వెలువడ్డాక ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో తదుపరి దశలకు హాజరయ్యేందుకు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి మలి దశలకు అనుమతి లభిస్తుంది. ఇంటర్వ్యూ కాల్: గేట్ స్కోర్ 500లోపు (ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు) ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 700 నుంచి 800 ర్యాంకులోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యరులు 1500 నుంచి మూడు వేల మధ్య ర్యాంకు సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు. ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలు: ఎంపిక ప్రక్రియ తుది దశ ఇంటర్వ్యూలో రెండు ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అవి.. వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌కు సంబంధించి సైద్ధాంతిక అవగాహనతో పాటు బీటెక్ స్థాయిలో అభ్యర్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్స్ వంటి వాటిపైనా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయి. సర్వీస్ అగ్రిమెంట్: కొన్ని పీఎస్‌యూలు ఎంపికైన అభ్యర్థుల నుంచి నిర్ణీత కాలానికి సర్వీస్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ఏడాది వ్యవధిలో ఉంటోంది. అంటే ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు సంస్థలో విధులు నిర్వర్తించాల్సిందే. శిక్షణ: ఎంపికైన అభ్యర్థులు మొదట కొంత కాలంపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి మేనేజ్మెంట్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి హోదాలు కేటాయిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, సౌకర్యాలు, భత్యాలు లభిస్తాయి. వేతనాల విషయానికొస్తే.. ప్రారంభ వేతనం ఏడాదికి సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది. భవిష్యత్తుపై స్పష్టతతో.. తగిన ప్రణాళిక గేట్ ర్యాంకు ఇప్పుడు ఐఐటీల్లో ఉన్నత విద్యకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సాధనంగా మారిన నేపథ్యంలో అభ్యర్థులు భవిష్యత్తుపై స్పష్టతతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్నత విద్య లేదా ఇతర ఉద్యోగాలు లక్ష్యంగా ఆలోచించే అభ్యర్థులు పీఎస్‌యూల్లో దరఖాస్తు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆయా సంస్థల నియామక నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్, ఇతర సర్వీస్ నిబంధనలు అమలు చేస్తున్న సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక.. పీఎస్‌యూల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిపై ఆందోళన చెందక్కర్లేదు. ఇవి సాధారణంగా బీటెక్ స్థాయిలో తమ బ్రాంచ్‌కు సంబంధించిన అంశాలపైనే ఉంటాయి. ఈ నేపథ్యంలో గేట్లో టాప్-500లోపు ర్యాంకు లక్ష్యంగా కృషి చేస్తే.. పీఎస్‌యూ ఆఫర్ గ్యారెంటీ. - ఎ. రవితేజ, గేట్-2013 ఆల్ ఇండియా 2వ ర్యాంకు (ఎలక్ట్రికల్) -
ఏం‘టెక్’ కాలేజీలో..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్కు బోధించాలంటే పీహెచ్డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్‌లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎంటెక్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి. -
ఆ లక్ష్యమే గేట్ దాటించింది!
బీటెక్ మూడో సంవత్సరంలోనే భవిష్యత్ దిశగా ప్రణాళిక.. కెరీర్, ఉన్నత విద్య ఏదైనా ‘గేట్’ దాటాల్సిందే.. దాంతోనే సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకోవడం సాధ్యమవుతుంది.. ఇదే లక్ష్యంగా శ్రమించి.. ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకున్నా అంటున్నారు.. గేట్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో) జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు సాధించిన రాపోలు జయప్రకాశ్. లక్ష్యం దిశగా ప్రకాశించిన అతని సక్సెస్ స్టోరీ.. స్వస్థలం వరంగల్ జిల్లా కేసముద్రం. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఏఐఈఈఈలో ర్యాంకుతో నిట్-వరంగల్‌లో బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)లో ప్రవేశం లభించింది. ఇంటర్మీడియెట్ వరకు అకడమిక్ పరంగా మంచి స్కోర్లు సాధించే వాణ్ని. నిట్‌లో ప్రవేశంతోనే భవిష్యత్ లక్ష్యంపై అవగాహన ఏర్పడింది. ఈ దిశగా అక్కడి ప్రొఫెసర్లు అందించిన సహకారం ఎంతో విలువైంది. ఈ క్రమంలోనే గేట్ ర్యాంకును లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. అంతేకాకుండా గతేడాది గేట్లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రవితేజ మా క్యాంపస్ కావడం కూడా నాలో మరింత స్ఫూర్తినింపింది. మూడో ఏడాది నుంచి: బీటెక్ రెండో సంవత్సరంలోనే గేట్ గురించి ఆలోచన, అవగాహన ఏర్పడినప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించింది మాత్రం మూడో సంవత్సరం నుం చే. మూడో సంవత్సరం(రెండు సెమిస్టర్లు) పూర్తయ్యే నాటికి.. అకడమిక్స్‌తో సమాంతరంగా గేట్ ప్రిపరేషన్ సాగించాను. ఆ తర్వాత వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు కోచింగ్ తీసుకున్నాను. గతేడాది సెప్టెంబర్ నుం చి ఈ ఏడాది మార్చి వరకు సమయాన్ని పూర్తి స్థాయిలో గేట్ కోసమే కేటాయించాను. అకడమిక్ సిలబస్, గేట్ సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ రోజుకు నాలుగైదు గంటలు కష్టపడే వాణ్ని. వారాంతాల్లోనైతే ప్రిపరేషన్ కోసం తొమ్మిది గంటలు కేటాయించాను. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా: గతేడాది నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఎల్ అండ్ టీ సంస్థకు ఎంపికయ్యాను. అయితే గేట్లో ర్యాంకు ద్వారా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లలో ఉద్యోగం సాధించాలని లక్ష్యం ఉండేది. దాంతో గేట్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిచ్చాను. అంతేకాకుండా పీఎస్‌యూలలో ఉద్యోగం చేయడం ద్వారా సమాజానికి పరోక్షంగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో కూడా గేట్ దిశగా అడుగులు వేశాను. ప్రస్తుతం ఉద్యోగానికి ప్రాధాన్యం. నాలుగైదేళ్లు అనుభవం గడించాక ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తాను. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ : లక్షల మంది పోటీ పడే గేట్లో ర్యాంకు సొంతం చేసుకోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పరీక్షలో అడిగే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ ఆధారితంగానే ఉంటాయి. గత ప్రశ్నపత్రాల పరిశీలన, మాక్ టెస్ట్‌ల ఆధారంగా ఈ విషయాన్ని గ్రహించాను. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని థియరీ, ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదువుతూ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకుంటూ ముందుకుసాగాను. ఇలా.. నవంబర్ నాటికి గేట్ సిలబస్‌ను పూర్తి చేశాను. ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలకు సంబంధించి సొంతంగా నోట్స్ రూపొందించుకున్నాను. ఇది రివిజన్‌కు ఎంతో లాభించింది. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం కూడా విజయానికి దోహదం చేశాయి. సలహా: బీటెక్ మూడో సంవత్సరం నుంచి.. గేట్ తేదీకి కనీసం ఆరు నెలల ముందు నుంచి పూర్తిస్థాయిలో ఉద్యుక్తులవ్వాలి. అంతేకాకుండా చివరి నిమిషం వరకు చదవకుండా.. పరీక్షకు రెండు నెలల ముందు సిలబస్ పూర్తి చేసుకుని ఆ తర్వాత సమయాన్ని రివిజన్, మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. విజయాన్ని నిర్దేశించడంలో సమయపాలన కీలక పాత్ర. కాబట్టి ఔత్సాహికులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా నిర్దేశించిన సమయంలో కచ్చితత్వం కూడా సమాధానాలు ఇవ్వడం అలవడుతుంది. ఇలాంటి ప్రణాళికతోనే ప్రిపరేషన్ సరైన మార్గంలో ఉంటుంది. అకడమిక్ ప్రొఫైల్: 2008లో పదో తరగతి (532 మార్కులు) ఉత్తీర్ణత 2010లో ఇంటర్మీడియెట్ (949 మార్కులు) ఉత్తీర్ణత 2010లో ఏఐఈఈఈలో తొమ్మిది వేల ర్యాంకు; ఎంసెట్‌లో 860వ ర్యాంకు; బిట్‌శాట్ స్కోర్ 293 పస్తుతం నిట్-వరంగల్‌లో బీటెక్ ఈఈఈలో ఫైనల్ సెమిస్టర్. -
బీటెక్ టు గేట్.. వయా ఎంబీఏ
సక్సెస్ స్టోరీ గేట్ ఈసీఈ 4వ ర్యాంకర్ ఎంసెట్.. ఏఐట్రిపుల్ఈ.. ఐఐటీ.. బిట్‌శాట్.. ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు. అటు అకడమిక్‌గా పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు మంచి పర్సంటేజీలు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేసి.. తర్వాత ఎంబీఏ చదివి.. మళ్లీ తనకిష్టమైన ఇంజనీరింగ్‌లో పీజీ కోసం దృష్టి సారించి.. అందుకు మార్గంగా గేట్‌ను ఎంచుకుని.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో నిలిచారు కె.కె.శ్రీనివాస్.. నాన్నవృత్తి రీత్యా బరోడా నుంచి హైదరాబాద్ వచ్చాం. ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే చదివాను. అన్ని తరగతుల్లోనూ 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సబ్జెక్ట్‌లను ఇష్టంగా చదవడం వల్లే ఈ ఫలితాలు లభించాయి. అందుకే ఇంటర్మీడియెట్ తర్వాత రాసిన నాలుగు ఎంట్రన్స్లలోనూ (ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ, బిట్‌శాట్) మంచి ర్యాంకులు సొంతమయ్యాయి. అన్నిటికంటే బిట్స్ పిలానీ అంటే ఆసక్తి ఉండటంతో అక్కడ బీటెక్‌లో చేరాను. ఇంజనీరింగ్‌పై మక్కువ తగ్గలేదు: 2011లో బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తిచేసిన వెంటనే ముంబైలోని కె.జె.సోమయ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏలో చేరాను. ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో కోర్సు పూర్తి చేశాను. వాస్తవానికి మేనేజీరియల్ స్కిల్స్ పెంచుకోవాలని ఎంబీఏలో చేరా. కానీ, ఇష్టమైన ఇంజనీరింగ్‌ను వదులుకోలేకపోయా. అందుకే ఎంబీఏ పూర్తి చేశాక మళ్లీ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య ఎంటెక్ కోసం గేట్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. 2013 నుంచి ఏడాదిపాటు హైదరాబాద్‌లో పూర్తిస్థాయి కోచింగ్ తీసుకున్నాను. దీనివల్ల జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు వచ్చింది. రెండేళ్ల విరామం: బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరడంతో రెండేళ్ల విరామం వచ్చింది. అయినా బీటెక్‌లోని అన్ని అంశాలను సమగ్రంగా చదివి ఉండటంతో గేట్ ప్రిపరేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. నా ఉద్దేశంలో బీటెక్ చదివేటప్పుడే అన్ని సబ్జెక్టులను ఔపోసన పడితే గేట్ గురించి ఆందోళన చెందక్కర్లేదు. ప్రతి సబ్జెక్ట్‌కు సొంత ఫార్ములా: గేట్ ప్రిపరేషన్ పరంగా పకడ్బందీ కసరత్తు చేశాను. ప్రతి సబ్జెక్ట్‌లోని ముఖ్యమైన, క్లిష్టంగా భావించిన అన్ని ఫార్ములాలు, కాన్సెప్ట్‌లతో చిన్నపాటి నోట్స్‌లు రూపొందించుకున్నాను. పునశ్చరణకు ఇవి ఎంతో ఉపకరించాయి. అంతేకాకుండా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం కూడా లాభించింది. ఆ మూడు ఇన్స్టిట్యూట్లలో సీటే లక్ష్యం: గేట్ ప్రస్తుత ర్యాంకుతో ఐఐఎస్సీ బెంగళూరు లేదా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ సీటు పొందాలని భావిస్తున్నాను. ఐఐటీల్లో ప్రసిద్ధ క్యాంపస్‌గా గుర్తింపు పొందిన ఐఐటీ-బాంబేలో నా బ్రాంచ్‌కు సరిపడే ఏ స్పెషలైజేషన్‌లో సీటు వచ్చినా చేరతాను. ఎంటెక్ పూర్తి చేశాక మంచి కెరీర్లో అడుగుపెట్టి.. తద్వారా సమాజానికి సాధ్యమైనంత సేవ చేయడమే లక్ష్యం. ఔత్సాహికులకు సలహా: బీటెక్ మూడో సంవత్సరం నుంచే గేట్ కోసం కసరత్తు ప్రారంభించడం వల్ల సత్ఫలితాలు ఆశించొచ్చు. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరవడం మంచిది. మాక్టెస్టుల వల్ల పరీక్ష అంటే భయం పోతుంది. సబ్జెక్ట్‌ల వారీగా కనీసం రెండు గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం మంచిది. పరీక్షకు కనీసం పదిహేను రోజుల ముందునుంచి రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బీటెక్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయిలో కాన్సెప్టుల వారీగా పరిజ్ఞానం సంపాదిస్తే గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించవచ్చు. సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అకడమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. ఉన్నత విద్యావకాశాలకు వీలు కల్పించే గేట్‌కు ఏటా పోటీ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్వీయ ప్రణాళికలు రూపొందించుకొని పరీక్షకు సిద్ధమవాలి. అకడమిక్ నేపథ్యం: పదో తరగతి: 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్: 98.1 శాతం మార్కులు. ఎంసెట్‌లో 131వ ర్యాంకు; ఏఐఈఈఈలో 795వ ర్యాంకు; బిట్‌శాట్‌లో 317వ ర్యాంకు; ఐఐటీ-జేఈఈలో 3210వ ర్యాంకు. 2011లో బిట్స్ పిలానీ నుంచి 9.42 సీజీపీఏతో బీటెక్ (ఈసీఈ) ఉత్తీర్ణత. 2013లో 72 శాతంతో ఎంబీఏ ఉత్తీర్ణత. -
దెయ్యాలున్నాయా?
అభినవ్ (సర్దార్ పటేల్), మధుమిత జంటగా శుభోదయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గేట్’. ‘దెయ్యాలున్నాయి జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. సాయికార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి. లక్ష్మీసౌజన్యగోపాల్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, వినోదం, సందేశం ఉన్నాయని నిర్మాత తెలిపారు. వచ్చే నెల 10న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 18 రోజుల్లో పూర్తి చేస్తామని మే 2న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని అభినవ్ అన్నారు. బలరామ్, సంతోష్, అలీషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎస్. చక్రవర్తిరెడ్డి, సంగీతం: డిజెఎస్. -
నేటి నుంచే ‘గేట్’
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో ఎంటెక్ తదితర పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికిగాను గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2014) ఆదివారం నుంచి నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2, 15, 16, మార్చి 1, 2 తేదీల్లో ఆన్లైన్లో 22 పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. గతేడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారీ అదే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఫలితాలను మార్చి 28న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలివీ: బాపట్ల, చిత్తూరు, దిండిగల్, గూడూరు, గుంటూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, వరంగల్, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం.