మేడిగడ్డ 7వ బ్లాక్‌లోని 18, 19 గేట్లను ఎత్తిన అధికారులు
అంతకుముందు మూడు గేట్ల ఎత్తివేత
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు చెందిన మరో రెండు రేడియల్ గేట్లను ఇంజనీరింగ్ అధికారులు గురువారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో 21న మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగి, పగుళ్లు తేలిన విషయం తెలిసిందే.
గత నెల 17న 15వ పియర్‌లోని రేడియల్ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, 20వ పియర్ ముందు బొరియలు ఏర్పడి భారీ శబ్ధం, ధ్వనులు వినిపించాయి. దీంతో బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 6న 7వ బ్లాక్‌లోని 16, 17 రేడియల్ గేట్లను బలంగా పైకి ఎత్తారు. 8వ తేదీన అదే బ్లాక్‌లోని 22వ రేడియల్ గేటును ఎత్తారు. గురువారం 18, 19 గేట్లను 100.50 మీటర్ల మేర ఎత్తారు. దీంతో ఈ బ్లాక్‌లోని మొత్తం 8 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తినట్టయ్యింది.
గేట్ల కటింగ్ పనులు వేగవంతం: ప్రాజెక్టులోని 19, 20, 21 గేట్ల కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20వ గేటును కట్ చేసి విడిభాగాలు తొలగించి, బయటకు తీసుకెళ్లేందుకు వీలుగా చేశారు. ఆ గేట్ల వద్ద ఉన్న కేబుల్స్, ఇతర పరి కరాలు తొలగించడానికి సమ యం పట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా 7వ బ్లాక్‌లో షీట్‌ఫైల్స్ పనుల్లో వేగం పెంచారు.
చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను సరైన స్థానంలో అమర్చుతున్నారు. మంత్రి ఉత్తమ్ పర్యటన అనంతరం మరమ్మతుల్లో వేగం పెరిగిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అటు అన్నారంలో బోర్‌తో డ్రిల్లింగ్ వేసి రంధ్రాలు చేస్తున్నారు. 25 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా కింద మట్టి దృఢంగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment