
ట్రయల్‌రన్ చేస్తుండగా పడిపోయిన వైనం.. ‘దేవాదుల’ నీటి విడుదలకు మళ్లీ బ్రేక్
నీళ్లు ఎత్తిపోయడానికి ఆటంకం
రిపేర్లు చేసి ఆ్రస్టియా వెళ్లిపోయిన ఇంజనీర్ల బృందం
మళ్లీ వారొచ్చి మరమ్మతులు చేస్తేనే నీటి విడుదల
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్‌పర్తి: దేవాదుల ఎత్తిపోతలలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్ చెరువులోకి నీటి విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. ట్రయల్‌రన్‌లో భాగంగా పంప్‌హౌస్ నుంచి చెరువులోకి నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో మంగళవారం గేట్‌వాల్వ్‌లు పడిపోయాయి. దీంతో అధికారులు మోటార్లు ఆపేయగా, నీటి విడుదల ప్రక్రియ మరో 4 రోజులపాటు వాయిదా పడింది.
వారం రోజులుగా ఆటంకాలే...
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో నాలుగు నియోజక వర్గాల్లో ఎండిపోతున్న వరి పంటలపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండింగ్ క్రాప్‌ను కాపాడేందుకు దేవాదుల ప్రాజెక్ట్ థర్డ్ ఫేస్‌లోని దేవన్నపేట పంప్‌హౌస్ వద్ద పనులు పూర్తయిన ఒక మోటార్‌నైనా ప్రారంభించాలని నిర్ణయించారు.
దేవన్నపేట పంపుహౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి నాలుగు నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ , పొంగులేటి పంప్‌హౌస్‌లో మోటార్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, సాంకేతికలోపం కారణంగా మోటార్ ఆన్ కాలేదు.
ఆస్ట్రియా బృందం మళ్లీ వస్తేనే...
ఈ నెల 22వరకు శ్రమించిన 15 మంది ఆస్ట్రియా టెక్నికల్ బృందం.. నీటి ప్రవాహం, మోటార్ల పనితీ రును పరిశీలించి ఏమైనా లోపాలు తలెత్తితే వెంటనే సంకేతాలు ఇచ్చేలా ‘స్కాడా’విధానంలో సరిచేశా రు. ఆదివారం ట్రయల్‌రన్ కూడా చేసిన ఆ బృందం తిరిగి ఆ్రస్టియాకు వెళ్లింది.
బుధవారం (26న) మోటార్లు ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేసిన అధికారులు.. మంగళవారం ట్రయల్‌రన్‌గా ఆన్ చేయడంతో నీటి పంపింగ్‌కు కీలకమైన గేట్‌వాల్వ్ లు పడిపోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిoది. కాగా పడిపోయిన గేట్‌వాల్వ్ మరమ్మతుల కోసం ఆ్రస్టియా ఇంజనీర్ల బృందం రావాల్సి ఉందని, వారు మరమ్మతులు చేశాకే నీటి విడుదల జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.