trial run
-
కశ్మీర్‌కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రానున్న ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల నుంచి 35 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తీసుకొస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించిన రెండో పంప్‌హౌజ్‌లో ఆదివారం ఆయన మోటార్ల ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. మోటారు స్విచ్ వేయగానే గోదావరి నీళ్లు గ్రావిటీ కెనాల్లోకి చేరి పంప్‌హౌజ్ –3 దిశగా పరుగులు పెట్టాయి. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఉత్తమ్ గోదావరి జలాలకు పూజలు చేశారు. కాగా, ఇదేరోజు జరగాల్సిన మూడో పంప్‌హౌజ్ ట్రయల్‌రన్‌ను వాయిదా వేశారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..రెండో పంప్‌హౌజ్‌లో ట్రయల్‌రన్‌ను ప్రారంభించాక మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి రంగంపై రూ.1.80 లక్షల కోట్లను వెచ్చించినా నామమాత్రంగానే కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును అందుబాటులోకి తేవాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, గోదావరి నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. కానీ ఈ అంశంపై తాము దృష్టి సారించి, కేంద్రంతో చర్చించామని.. మరో పది, పదిహేను రోజుల్లో కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. ఈనెల 15వ తేదీన ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు వైరాలో జరిగే సభలో రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.పీవీ హయాం నుంచిగోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందించాలని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం నుంచి ప్రయత్నాలు జరగ్గా.. అవి ఇన్నాళ్లకు నెరవేరుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రధాన కాల్వ వెంట డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు వెంటనే ప్రారంభించేలా అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కనీసం రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందే విధంగా పనులు జరగాలని ఆదేశించారు. తలాతోక లేకుండాగతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జల యజ్ఞం ద్వారా రూ.3,500 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన ఓ మహానుభావుడు (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) తలాతోక లేకుండా రీ డిజైన్ పేరుతో ఆ వ్యయాన్ని రూ.18 వేల కోట్లకు పెంచారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో పొంతన లేకుండా అక్కడో పని, ఇక్కడో పని చేయడంతో రూ.8వేల కోట్లు వెచ్చించినా ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లోపాలు సవరిస్తూ, పరిస్థితులను చక్కదిద్దుతున్నామని తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి టన్నెళ్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేసి పొలాల్లోకి గోదావరి నీరు పారిస్తామని చెప్పారు. -
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
సాక్షి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌లను మంత్రులు పరిశీలించారుఅనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్న ఉత్తమ్.. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ అన్నారు.‘‘గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఎటువంటి అనుమతులు లేవు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని వచ్చాం. సీతారామ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నాం. 2026న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తాం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేలు సాగులోకి వస్తుంది. పాలేరు లింకు కెనాల్‌కి నీళ్లు అందిస్తాం. పాలేరు కింద నాగార్జున సాగర్ కింద భూములకు నీరు అందుతుంది. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేలా చేస్తాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సిద్ధం అయింది. జూన్‌లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్‌ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్‌వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
కృష్ణమ్మ రాకతో చెరువుల్లో జలకళ
శాంతిపురం: కుప్పం కాలువలోకి వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువుకు నీరు వదలటంతో అది నిండుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారుల ట్రయల్ రన్‌తో కాలువ కింది భాగంలోనూ నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి వద్ద పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద నీరు ముందుకు సాగటంతో స్థానిక రైతులు రాత్రి పూట సైతం గంగ పూజలు చేశారు. అదే క్రమంలో వెంకటేష్ పురం వద్ద ఉన్న చెరువుకు ఉన్న ఓటీ పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నంలోగా ఈ చెరువు పూర్తిగా నిండిపోయింది. మిట్టపల్లి వద్ద గల మద్దికుంట చెరువుకు మంగళవారం అధికారులు నీరు విడుదల చేయటంతో చెరువు క్రమంగా నిండుతోంది. జలకళతో కనువిందు చేస్తున్న ఈ రెండు చెరువులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు. కృష్ణా జలాలపై తప్పుడు రాజకీయం తగదు హంద్రీనీవా కుప్పం కెనాల్లో నీటి ప్రవాహంపై తప్పుడు రాజకీయం చేయడం తగదని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద బ్రాంచి కెనాల్ నుంచి కుప్పం నియోజకవర్గానికి నీటిని విడుదల చేసినట్టు తెలిపింది. క్రాస్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను వదిలి 70.10 కిలోమీటర్ వద్ద తూము గుండా మద్దికుంట చెరువుకు నీటిని తరలించినట్టు వెల్లడించింది. శాంతిపురం మండలంలో 75.75 కిలోమీటర్ల వద్ద గల వెంకటేష్‌పురం శెట్టివానికుంట చెరువును పూర్తిగా నీటితో నింపినట్టు తెలిపింది. గుండిశెట్టిపల్లి వద్ద గంగ పూజలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో కాలువలోని 84వ కిలోమీటరు వరకూ నీటిని విడుదల చేసినట్టు వెల్లడించింది. పూజల అనంతరం నీటిని పూర్తిగా మద్దికుంట చెరువుకు మళ్లించి, అది నిండిన తర్వాత నాగసముద్రం, మణీంద్రం చెరువుకు నీటిని పంపే ఏర్పాట్లలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారని తెలిపింది. కానీ.. కొందరు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జలాలు ఆగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువై శ్రీశైలంలో కనీస నీటి నిల్వ ఉన్నప్పటికీ అక్కడి నుంచి 27 చోట్ల ఎత్తిపోతల ద్వారా 733 మీటర్ల ఎత్తులో.. 676 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ప్రాంతానికి ప్రభుత్వం నీటిని ఇస్తోందన్నారు. భగీరథ ప్రయత్నంతో అధికారులను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదని జల వనరుల శాఖ పేర్కొంది. మాట ప్రకారం నీళ్లిచ్చారు ఏడాది క్రితం కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నది నీటిని కాలువలోకి విడుదల చేశారు. దీంతో మా ఊరి చెరువు కూడా పూర్తిగా నిండింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. ఆయన తలచుకుంటే ఎప్పుడో మాకు నీటి కష్టాలు లేకుండా చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఓట్లేసే బానిసలుగానే చూశాడు. – మంజునాథ్, రైతు, వెంకటేష్ పురం నీళ్లు రాలేదంటే కళ్లుపోతాయి మా ఊరి దగ్గర హంద్రీనీవా కాలువలో సోమవారం నుంచి నీళ్లు పారుతున్నాయి. నీళ్లు వస్తున్నా రాలేదని గంగమ్మ తల్లితో రాజకీయాలు చేస్తే కళ్లుపోతాయి. ఈ ప్రభుత్వం కుప్పానికి నీరు రావటానికి కాలువను సిద్ధం చేసింది. రేపు కృష్ణా నదిలో నీళ్లు వస్తే మా ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వస్తాయి. – జయరామిరెడ్డి, రైతు, దండికుప్పం -
వివాద రహితంగా ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకుని, సంబంధిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతివారం సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్‌ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్‌ను అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్‌లు, జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గం చెరువు ఎస్టీపీ సిద్ధం
హైదరాబాద్: దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. మహానగర పరిధిలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 31 కొత్త మురుగు నీటిశుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 15 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన కోకాపేట ఎస్టీపీ ప్రారంభం కాగా.. సుమారు 7 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన దుర్గం చెరువు మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఆరు నెలలుగా దీని ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఎస్బీఆర్ సాంకేతికతతో.. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో దుర్గం చెరువు ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. ఎస్బీఆర్ టెక్నాలజీ ఎస్టీపీని నిర్మించడంతో ఒకే చాంబర్లో అయిదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి జరుగుతుంది. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే మెరుగ్గా మురుగు నీటి శుద్ధి జరుగుతుంది. మూడు ప్యాకేజీల్లో.. మహానగరంలో మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో సుమారు రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యం గల 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. ► ప్యాకేజీ–1 లో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. రోజువారీగా 1950 ఎంఎల్డీల మురుగునీరు.. హైదరాబాద్ అర్బన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీలు ఉండగా, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టారు. 2036 సంవత్సరం వరకు ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేయవచ్చు. వాసన కట్టడికి చర్యలు నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికతను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మొత్తం 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా, (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి. -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్‌ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్‌లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్‌కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
Icon Of The Seas: టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ► ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది ► రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. ► నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు, ► ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించగలరు ► ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. ► నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి బయల్దేరే ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది. ► ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీనికి కేటగిరీ 6 అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ► ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. ► జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ► నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. ► కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంథనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ► వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (రూ. 3 లక్షలకు పైన ) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ► కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. ► వినోదమే ప్రధానంగా రూపొందించిన ఈ షిప్లో జరీ్నకి సర్వత్రా ఆసక్తి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మల్కపేట రెండో పంపు వెట్‌రన్ సక్సెస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మే 23న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్‌రన్‌ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్‌రన్ విజయవంతమైనట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు. సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్‌రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు మల్కపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు. దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్‌ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. -
రాత్రి వేళల్లోనే మోటార్లు రన్!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గత నెలలోనే ట్రయల్ రన్లు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి రెండు మోటార్లతో ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. గురువారం రెండో రోజు రాత్రి 9 గంటల నుంచి రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మీపంపుహౌస్లో 1, 2, 3 వరుస క్రమంలోని మోటార్లతో 6,600 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లాలోని సరస్వతీ పంపుహౌస్‌లో 2 మోటార్లతో 6 వేల క్యూసెక్కులు, పార్వతీ బ్యారేజీలో రెండు మోటార్లతో 5,800 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు ఈఎన్సీ తెలిపారు. కాగా, రాత్రే మోటార్లు నడిపిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని.. డిమాండ్ కూడా తక్కువగా ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రోజూ రాత్రి పూటనే మోటార్లు నడిపించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు ఈఎన్సీ తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 9 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 16.17 టీఎంసీల సామర్థ్యానికి 13.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతీ బ్యారేజీలో 10.87 టీఎంసీ సామర్థ్యానికి 9.20 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడానికి రాత్రిపూట అనుకూలంగా ఉండడంతో రాత్రి 9 గంటల నుంచి 10 మధ్య అరగంటకు ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. వారి వెంట ఈఈ తిరుపతిరావు, డీఈఈ సూర్యప్రకాశ్, ఏఈఈలు భరత్, వంశీరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ఉన్నారు. -
‘హై’.. రన్ వే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం చేపట్టిన విమానాల తొలి ట్రయల్ రన్ వియవంతమైంది. పిచ్చకలగుడిపాడు–రేణింగవరం గ్రామాల వద్ద 16వ నంబర్ హైవేపై 4.1 కిలోమీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్‌వే మీదుగా విమానాలు గాల్లోకి దూసుకువెళ్లాయి. నాలుగు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక కార్గో విమానం ఐదు అడుగుల ఎత్తులో తిరుగుతుండగా.. రాడార్ సిగ్నల్స్‌తో పాటు రన్‌వే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనువుగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని వైమానిక దళ అధికారులు పరిశీలించారు. సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలందుకుంటూ ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రన్‌వే వద్దకు చేరుకున్నారు. విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 10.51 గంటలకు ప్రారంభమైన ట్రయల్ రన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరిగింది. బాపట్ల జిల్లా పిచ్చకలగుడిపాడు–రేణంగివరం మధ్య హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ దేశంలోనే మూడవది.. వైమానిక దళ అధికారి ఆర్ఎస్ చౌదరి మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. రన్‌వేకు ఇరువైపులా ఫెన్సింగ్, గేట్లు పెట్టిన తర్వాత విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై బాపట్ల–నెల్లూరు జిల్లాల మధ్యలో రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొరిశపాడు మండలంలోని ఈ రన్‌వే.. దక్షిణ భారతదేశంలోనే మొదటిదని.. దేశంలోనే మూడవదని చెప్పారు. వచ్చే ఏడాది దీనిని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో ఇప్పటికే రెండు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఏపీ, యూపీ, రాజస్తాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ట్రయల్ రన్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని తెలిపారు. కార్యక్రమంలో వాయుసేన అధికారి వి.ఎం.రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.ఎస్.దినేశ్‌కుమార్, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు. -
విజయవాడ-ఒంగోలు మధ్య ఎన్‌హెచ్ 16పై విమానాల ట్రయల్ రన్ సక్సెస్ (ఫొటోలు)
-
హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్ కెప్టెన్ ఆర్.ఎస్. చౌదరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు? -
హైవేపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్
జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్‌వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్ జెట్ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రన్‌వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించారు. -
ఐదు రోజుల్లో ఇలా.. విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా ఈ నెల 21 నుంచి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం ట్రయల్ రన్ జోరుగా కొనసాగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే 26 జిల్లాల్లోని 3,160 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఐదు రోజుల్లో 89,705 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులిచ్చారు. చదవండి: AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు పక్షవాతంతో, నరాల బలహీనతలతో నడవలేని వారి ఇళ్లకు డాక్టర్లు, వైద్య సిబ్బం ది స్వయంగా వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం ప్రతి పీహెచ్సీలో ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్‌తో సహా సిబ్బంది, డాక్టర్‌తో పాటు ఆశా వర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల్లో.. ♦ఓపీల ద్వారా 37,309 మందికి సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. ♦జ్వరంతో బాధపడుతున్న 11,247మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ♦3,540 మంది గర్భిణులకు యాంటినేటల్ కేర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ♦607 మంది బాలింతలకు, వారి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ♦2,956మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ♦ఇక జీవనశైలి జబ్బులతో పాటు అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న 34,046 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ♦మరోవైపు.. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ ♦క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ అమలును ప్రత్యేక యాప్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ట్రయల్ రన్లో ఎదురయ్యే ఇబ్బందుల ఆధారంగా వాటిని సరిచేసుకుని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విధానంపై పల్లెల్లోని అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. జగన్‌బాబుకు రుణపడి ఉంటాం నేను బీపీ, షుగర్, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాను. రెండు మూడుసార్లు ప్రైవేట్ ఆçస్పత్రిలో చూపించుకున్నాను. వెళ్లినప్పుడల్లా రూ.4వేలకు పైగా అవుతోంది. ఈసారి మా విలేజ్ క్లినిక్‌లో డాక్టర్‌కి చూపించాను. పరీక్షించి మందులిచ్చారు. ఊర్లోనే డాక్టర్ వైద్యం చేయడం మాలాంటి వృద్ధులకు మంచిది. సీఎం జగన్ బాబుకు రుణపడి ఉంటాం. – సన్యాసిదేవుడు, గన్నవరం, అనకాపల్లి జిల్లా మాలాంటి వారికి ఒక వరం సీఎం పుణ్యాన ఉచితంగా వైద్యం చేయడంతోపాటు ఇంటి వద్దకే వైద్యుడు రావడం సంతోషంగా ఉంది. మాలాంటి బీద వారికి ఫ్యామిలీ డాక్టర్ పథకం ఒక వరం. ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన బాధలేదు. – లక్ష్మీదేవి, ముద్దినాయనపల్లి, అనంతపురం జిల్లా ఫ్యామిలీ ఫిజీషియన్కు మంచి ఆదరణ ఈ పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. ఇందుకు ఉద్యోగులుగా మా సహకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అందిస్తాం. ఇప్పటివరకు పేదలు అప్పులుచేసి పట్టణాల్లో వైద్యం చేయించుకునేవాళ్లు. ఇప్పుడొక ఎంబీబీఎస్ డాక్టర్ నేరుగా ఇంటివద్దే వైద్యం అందించడం గొప్ప విషయం. ప్రజల్లో దీనిపై అవగాహన కలి్పస్తాం. – జక్కల మాధవ, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ట్రయల్ రన్లో దూసుకెళ్లిన ‘వందే భారత్’.. 180 కిలోమీటర్ల వేగంతో రికార్డ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ మూడో ప్రాజెక్ట్ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. ఈ ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి ఔరా అనిపించింది. ట్రయల్ రన్లో రైలు వేగాన్ని చూపుతున్న వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. 2019లో తొలి వందేభారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ- వారణాసి మధ్య దీన్ని నడుపుతున్నారు. ఢిల్లీ- జమ్మూలోని వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా- మధ్యప్రదేశ్‌లోని నగ్దా మధ్య మూడో రైలు నడపనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది ట్రైను. రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్ చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. आत्मनिर्भर भारत की रफ़्तार… #VandeBharat-2 at 180 kmph. pic.twitter.com/1tiHyEaAMj — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 Superior ride quality. Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 ఇదీ చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు -
ఐదేళ్ల తరువాత నిరవధిక విచారణ
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో విచారణ పునఃప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల కిందట... సెప్టెంబరు 05, 2017 రాత్రి గౌరీలంకేశ్ ఆఫీసు నుంచి రాజరాజేశ్వరినగరలో ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు ఆమెను పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉన్నారు. కుట్రదారు అమోల్ కాళే, కాల్పులు జరిపిన పరశురామ్ వాగ్మోరా, బైక్ నడిపిన గణేశ్ మిస్కిన్ తో పాటు 17 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరి తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి పలు చార్జిషీట్లను దాఖలు చేశారు. మతాన్ని కించపరచడమే హత్యకు కారణంగా ప్రకటించారు. ప్రతి రెండోవారంలో ఐదు రోజులు కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కర్ణాటక నేరాల నియంత్రణ చట్టం (కేసీఓసీఏ– కోకా) కోర్టు న్యాయమూర్తి సీఎం.జోషి శనివారం మార్గదర్శకాలను నిర్ణయించారు. విచారణ కొన్ని వారాల పాటు జరుగుతుంది. నెలలో ప్రతి రెండోవారంలో ఐదురోజుల పాటు విచారిస్తారు. తొలుత జూలై 4 నుంచి జూలై 8 వరకు వాదనలు నిర్వహిస్తామని న్యాయమూర్తి జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో భౌతికస్థితిలోనే విచారణ జరపాలని నిందితుల తరఫు లాయర్లు కోరగా, జడ్జి ఏకీభవించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సాగుతుందని తెలిపారు. నిందితులు కొందరు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో, మరికొందరు ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. న్యాయవాదులు నిందితులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జడ్జి సూచించారు. (చదవండి: ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ) -
19 నెలల తర్వాత తెరచుకోనున్న ‘పాపికొండలు’
పోలవరం: ఘోర ప్రమాదం జరిగిన 19 నెలల తర్వాత పాపికొండలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. ఆ ప్రమాదం అనంతరం పాపికొండల పర్యటన ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి పాపికొండల సందర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే పాపికొండలు సందర్శించేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాపికొండలను వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకూ ఏపీ పర్యాటక శాఖ బోటులో ట్రయల్ రన్ నిర్వహించారు. పర్యాటక, పోలీస్, సాగునీటి, రెవెన్యూ అధికారులు ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో పాపికొండల విహారయాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 19 నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ప్రయాణికుల భద్రతే పరమావధిగా విహార యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ట్రయల్ రన్‌పై నివేదికను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని, త్వరలో టూరిజం మంత్రి అనుమతితో పాపికొండలు విహార యాత్ర ప్రారంభమవుతుంది అని ఏపీ టూరిజం జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పట్లో సందర్శకులను అనుమతించే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. -
గేట్ల ట్రయల్ రన్ విజయవంతం
-
పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి..
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయన్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. 24 పవర్ ప్యాక్ లకు గానూ 5పవర్ ప్యాక్‌లు బిగింపు పూర్తయ్యింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. 10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10గేట్ల అమరిక, 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్ల అమర్చడం పూర్తి అయింది. ఇప్పటికే 44,43వ గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటిగా 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందకి అధికారులు దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5మీటర్లు ఎత్తే విధంగా రూపొందించారు. 2400 టన్నుల వత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్ చేశారు.ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, మిశ్రా,బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి ఎ.నాగేంద్ర పరిశీలించారు. చదవండి: ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ -
బండీకూట్ అనే నేను..
నగరానికి వచ్చేశా... సోమవారం సాయంత్రం రామ్‌నగర్ రహదారిలో ట్రయల్ రన్లో పాల్గొన్నాను. మ్యాన్‌హోల్స్‌ను చిటికెలో శుభ్రం చేసేశాను. త్వరలోనే నగరంలోని అన్ని మ్యాన్‌హోల్స్‌ను క్లియర్ చేసేందుకు సిద్ధమవుతున్నాను. నా పనితీరు, సామర్థ్యం గురించి చెబుతా మరి – సాక్షి, విశాఖపట్నం హాయ్... సిటిజన్స్... ఐయామ్ బండీకూట్.. వెర్షన్ 2.0.. మేడిన్ ఇండియా.. నీ స్పెషల్ ఏంటి బండీకూట్..? ఇన్నాళ్లూ.. ఎంతో మంది మనుషుల ప్రాణాలు హరించిన మ్యాన్‌హోల్స్‌ని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఒంటిచేత్తో శుభ్రం చేయగలను. ఎలాంటి పనులు చెయ్యగలవ్..? ఒక మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి స్కావెంజర్లు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా..? సఫాయి కార్మికులు లోపలికి దిగి, శుభ్రం చేసి తిరిగి పైకి చేరుకునే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తుంటారు. నేనలా కాదు.. ఒన్స్ ఇన్ ఫీల్డ్ మ్యాన్‌హోల్ క్లీన్ అవ్వాల్సిందే. అవునా.. మరి నీకేం కాదా...? జీవీఎంసీ పరిధిలో 781 కిలోమీటర్ల యూజీడీ నెట్ వర్క్ ఉంది. నగర పరిధిలో మొత్తం 38,700 మ్యాన్‌హోల్స్ ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు 500 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. మ్యాన్ హోల్ క్లియర్ చేసేందుకు లోపలికి దిగుతున్న కార్మికులు అందులోంచి ఉత్పన్నమయ్యే విషవాయువుల కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. నేను రోబో కదా ఏ చిన్న ప్రమాదానికి గురికాకుండానే క్లీన్ చేసేస్తాను. నీ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది.? ఎలా పనిచేస్తావ్..? నేను స్పైడర్ టెక్నాలజీతో పనిచేస్తాను. మ్యాన్‌హోల్ బ్లాక్ అయితే సెన్సార్ ద్వారా సమాచారం తెలుసుకొని అధికారులు నన్ను ఆ మ్యాన్‌హోల్ దగ్గరికి తీసుకెళ్తారు. నాలో ఇన్‌బిల్ట్ కెమెరా ఉంటుంది. నైట్ విజువల్‌తో రాత్రి సమయంలోనూ మ్యాన్‌హోల్ లోపల స్పష్టంగా కనింపిచేలా వాటర్‌ప్రూఫ్ కెమెరాలు నాలో ఉన్నాయి. ముందుగా... కెమెరాల ద్వారా.. ప్రోబ్లెమ్ ఎక్కడో గుర్తిస్తాను. మీకు చేతులున్నట్లుగానే.. నాకూ ఉంటాయి. అవి బయట 45 సెంటీమీటర్ల విస్తీర్ణంతో కనిపిస్తాయి. కానీ.. మ్యాన్హోల్లోకి వెళ్లాక.. ఎంత కావాలంటే అంత పెద్దగా విస్తరించగలను. ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని నిమిషాల వ్యవధిలో శుభ్రం చేసేస్తాను. అవరోధాల్ని బయటికి తీసి పారేస్తాను. 30 నుంచి 50 అడుగుల లోతున్న మ్యాన్ హోల్స్‌ని క్లియర్ చేయగలను. ఎంత టైమ్‌లో క్లియర్ చేయగలవు.? సాధారణంగా ఒక మ్యాన్హోల్ని ఇద్దరు సఫాయి కారి్మకులు 3 గంటలు క్లీన్ చేస్తారు. నేను గంటకు రెండు చొప్పున ఏకధాటిగా.. 4 గంటల్లో 8 మ్యాన్ హోల్స్‌ని క్లియర్ చేయగలను. ముందుగా మ్యాన్‌హో ల్లో ఉత్పన్నమయ్యే అమ్మోనియం నైట్రేట్, మీథేన్, హైడ్రోక్లోరిక్ సలై్ఫడ్.. ఎంత మోతాదులో ఉన్నాయని గుర్తించి బరిలో దిగుతాను. వైజాగ్ ఎప్పుడు వచ్చావ్..? ∙పైలట్ ప్రాజెక్టుగా నన్ను తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం రామ్‌నగర్ రహదారిలో జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, నీటి సరఫరా విభాగం ఎస్ఈ వేణుగోపాల్ పర్యవేక్షణలో ట్రయల్ రన్లో పాల్గొన్నాను. నా పనితీరుని కమిషనర్ మెచ్చుకున్నారు తెలుసా.. ఇంతకీ మా వీధిలోకి ఎప్పుడొస్తావ్..? నెలరోజుల్లో నగరమంతటా తిరుగుతా.. మీ మ్యాన్‌హోల్స్ మొత్తం క్లీన్ చేస్తా. మురుగు ముంచెత్తకుండా క్లియర్‌గా ఉంచుతా. (చదవండి: గ్యాస్‌తో పంటకు నీరంట..!) రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్ -
ట్రయల్ షూట్!
రాజమౌళి ట్రయల్ షూట్ ప్లాన్ చేశారు. ప్రçపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’లాంటి సినిమా తెరకెక్కించిన రాజమౌళికి ట్రయల్ షూట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ ఏ సినిమా కోసం ఈ ట్రయల్ షూట్ అనుకుంటున్నారా? మరేం లేదు... కరోనా ఎక్కడికీ వెళ్లలేదు. మనతోపాటే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నారు. కొన్ని నియమ నిబంధనలు సూచించి, షూటింగ్స్ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమవారికి అనుమతి ఇచ్చాయి. తక్కువమంది సభ్యులతో షూటింగ్ చేయాలి, భౌతిక దూరం పాటించాలి.. వంటివన్నీ గైడ్‌లైన్స్‌లో ఉన్నాయి. ఇవి పాటిస్తూ... షూటింగ్స్ ఎలా చేయాలి? అని ఓ నిర్ణయానికి రావడం కోసమే ఈ ట్రయల్ షూట్ అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ట్రయల్ షూట్ జరపనున్నారట. 50 మంది సభ్యులతో డూప్ ఆర్టిస్టులతో ఈ షూట్‌ని ప్లాన్ చేశారని భోగట్టా. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అజయదేవగన్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత. -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటి దర్శనానికి అనుమతి
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రేపటి నుంచి ముక్కంటి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు(బుధవారం) ఆలయంలో స్వామి, అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. 11 నుంచి స్థానికులు దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 12 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆధార్ కార్డు తీసుకురావడంతో పాటు మాస్కు ధరించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భక్తుల మధ్య క్యూలైన్లలో ఆరడగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలు ఉంటాయన్నారు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు అన్ని రకాల టికెట్లతో కలిపి మొత్తం గంటకు 300 మందికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అర్జీత సేవలు, అభిషేకాలు, కల్యాణోత్సవం, హోమ పూజలు చేసుకోవడానికి భక్తులకు అనుమతి లేదని చెప్పారు. నిత్యాన్న ప్రసాదం, ఉచిత ప్రసాదం పంపిణీ నిలిపివేశామని వెల్లడించారు. తీర్థం, అర్చనలు రద్దు చేశామని తెలిపారు. వృద్ధులు, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశం లేదని ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కొనసాగుతున్న శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ రెండో రోజు ప్రారంభమయింది. నేడు కూడా టీటీడీ ఉద్యోగులతో రాత్రి 7 గంటల వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. నిన్న శ్రీవారిని 6,360 మంది దర్శించుకోగా, నేడు మరో ఆరువేల మంది టీటీడీ ఉద్యోగులు దర్శించుకోనున్నారు. రేపు స్థానికులకు అవకాశం కల్పించనున్నారు. 11 నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం నుంచి స్వామివారి దర్శనం పునఃప్రారంభం కాగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ముందుగా దర్శించుకున్నారు. ఆలయంలో టీటీడీ అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో నాలుగు చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. (దర్శనానికి వేళాయె) దర్శన క్యూలైన్లతో పాటు అన్న ప్రసాద కేంద్రంలో కూడా ఫుట్ ఆపరేటడ్ కుళాయిలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించే భక్తులు నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు దగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేయడంతో పాటు, ప్రతి రెండు గంటలకు ఒకసారి లడ్డూ ప్రసాదాల విక్రయ కౌంటర్లను మార్చేవిధంగా చర్యలు చేపట్టారు. టీటీడీ ఆలయ పరిసరాలు, దర్శన క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ప్రతి రెండు గంటలకు శానిటైజ్ చేస్తున్నారు భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పీపీఈ కిట్లతో క్షురకులు విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు భౌతికదూరం పాటించేలా బస్టాండ్ వద్ద ఏర్పాట్లు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలైన వకుళామాత, యోగ నరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాలైన శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాపవినాశనం, జపాలి, ఆకాశగంగకు అనుమతి లేదు. కాణిపాకంలో రెండో రోజు ట్రయల్ రన్ చిత్తూరు: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నేడు రెండో రోజు ట్రయల్ దర్శనాలు కొనసాగుతున్నాయి. సోమవారం 3100 మంది స్వామివారిని దర్శించుకున్నారు.నేడు ఉద్యోగులు,స్థానికులు, ఉభయ దారులను దర్శనానికి అనుమతించనున్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రమాణాలు చేయించడం లేదని, స్వామివారికి నిర్వహించే అర్జిత సేవలకు 30 శాతం భక్తులను అనుమతి ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ గుడిలో ట్రైల్ రన్
-
ట్రయల్ రన్ తర్వాత స్థానికులకు దర్శనం
-
11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: లాక్డౌన్ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. క్యూలైన్ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించారు. వందమంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించగా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పరిశీలించారు. (టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం) వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 7 వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. టీటీడీ చర్యలకు భక్తులు సహకరించాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు తీర్థం చఠారి రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వైవీ సుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► ఈనెల 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శనం ► ఈనెల 10న తిరుపతి స్థానికులకు దర్శనానికి అనుమతి ► ఈనెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ► పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి ► ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం ► ఆన్లైన్లో 3వేల మంది భక్తులకు అనుమతి ► ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ► ఉ.6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి ► ఉ.6 నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి ► అలిపిరి నుంచి మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి ► శ్రీవారిమెట్టు మార్గం నుంచి ప్రస్తుతానికి అనుమతి లేదు ► నేరుగా వచ్చే భక్తులకు అలిపిరి వద్ద టికెట్ కౌంటర్ ► అలిపిరి, తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్స్ ► 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు ► పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదు ► మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి ► దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో భక్తులు దర్శనాలకు రావద్దు -
‘అనంతగిరి’కి గోదారమ్మ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్‌మానేరు దిగువన పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్‌పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్‌సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరనున్నాయి. 90 మీటర్లు ఎగిసిపడిన జలాలు.. మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్‌మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్‌ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్‌కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్‌కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్‌ను నింపుతామని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. 25 నాటికి కొండపోచమ్మకు.. రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్‌హౌస్‌ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్సీ హరిరామ్ వెల్లడించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్‌పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్సీ -
‘బెంజి’పై రయ్..రయ్
సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్‌రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్‌రన్ సక్సెస్ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్‌రన్ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్ మీదుగా ఏపీ39–టీహెచ్ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. -
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై నేటి నుంచి ట్రయల్‌రన్
-
విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ అక్కరకు రానుంది. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై సోమవారం నుంచి ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయింది. అయితే, ఫ్లైఓవర్ ప్రారంభానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రావాల్సి ఉంది. ఆయన రాష్ట్రానికి వచ్చే తేదీపై స్పష్టత లేకపోవడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు. కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ ఆదివారం ‘సాక్షి’కి చెప్పారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎన్హెచ్ఏఐ అధికారులు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌ను సందర్శించనున్నారు. నితిన్ గడ్కరీ రాక తేదీ ఖరారయ్యాక అధికారికంగా ఆయనతో ప్రారంభోత్సవం చేయించనున్నారు. (చదవండి: ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక) -
‘ఉదయ్’ వచ్చేసింది..
ఉదయ్ పట్టాలెక్కింది. వాల్తేరు డివిజన్ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్లో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ 11.45 గంటలకు కోరుకొండ స్టేషన్‌కు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఉదయ్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రాకపోకల వేళలు ఖరారైనప్పటికీ విజయవాడ డివిజన్ నుంచి టైమ్ స్లాట్ రాకపోవడంతో ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం, తాటిచెట్లపాలెం: 27 రోజుల సుదీర్ఘ కాలయాపన తర్వాత ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ ఎక్స్‌ప్రెస్(ఉదయ్) ట్రయల్ రన్ జరిగింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు కొత్త రైలుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత ట్రయల్ రన్ నిర్వహించకుండా నేరుగా ప్రారంభించేందుకు వాల్తేరు డివిజన్ అధికారులు సన్నాహాలు చేశారు. ఉదయ్‌కు సంబంధించి 18 డబుల్ డెక్కర్ కోచ్‌లు, 4 పవర్ కార్లు వచ్చాయి. ఇందులో 9 కోచ్‌లను, 2 పవర్ కార్లను రెండు వారాల క్రితం చెన్నై పంపించారు. ఈ కోచ్‌లు విశాఖ–విజయవాడ మార్గంలోనే పంపించడంతో దాన్నే ట్రయల్ రన్‌గా తొలుత భావించారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం కచ్చితంగా ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించడంతో మంగళవారం ఉదయం మర్రిపాలెంలోని కోచింగ్ కాంప్లెక్స్ నుంచి ట్రయల్ నిర్వహించారు. తొలుత విజయనగరం వరకు పంపించాలని భావించినా చివరి నిమిషంలో కోరుకొండ వరకూ మాత్రమే ఉదయ్ రైలు నడిపారు. ట్రయల్ రన్ ఇలా.... ఉదయం 9.55 గంటలకు మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్ నుంచి ఉదయ్ డబుల్ డెక్కర్ బయలుదేరింది. ఈ ట్రయల్ రన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఇంజినీర్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, కోచ్ డిపో ఆఫీసర్ పర్యవేక్షించారు. 11.45 గంటలకు కోరుకొండ చేరుకుంది. కోరుకొండ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 3.30 గంటలకు మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. ట్రయల్ రన్లో ఎక్కడా ఎలాంటి అవరోధాలు ఎదురవ్వలేదని అధికారులు తెలిపారు. ఇంకా కుదరని ముహూర్తం.. వాల్తేరు డివిజన్ నుంచి ప్రతిష్టాత్మకంగా నడవనున్న ఉదయ్ రైలు పట్టాలెక్కే సుమహూర్తం ఇంకా కుదరలేదు. ఏ సమయంలో నడపాలన్న వేళల్ని వాల్తేరు రైల్వే అధికారులు ధృవీకరించినా.. ఎప్పటి నుంచి సర్వీస్ ప్రారంభించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయవాడ డివిజన్ నుంచి తేదీ ఇంకా ఖరారు చెయ్యకపోవడం వల్లే.. ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆ డివిజన్ నుంచి స్పష్టమైన ప్రకటన మరో వారం రోజుల్లో వచ్చేస్తుందని వాల్తేరు అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లోపే ఉదయ్ పట్టాలపై పరుగులు పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు ఉదయ్ నడపనున్నారు. వారానికి 5 రోజుల పాటు ఈ రైలు పరుగులు తీయనుంది. ఆది, గురువారాలు మినహాయించి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు ఈ డబుల్ డెక్కర్ రైలు బయలుదేరి 10.50 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అదేవిధంగా విజయవాడ నుంచి సాయంత్రం 5.45కి బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనుంది. ట్రయల్ రన్ విజయవంతంపై హర్షం.. ఉదయ్ సర్వీసు ప్రారంభమైతే, రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు వ్యాపారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అ లాంటి వారందరికీ ఈ డబుల్ డెక్కర్ సరైన ట్రైన్‌గా భావిస్తున్నారు. త్వరగా ఉదయ్ సర్వీసు ప్రా రంభించాలని విశాఖ ప్రజలు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లీకేజీల పరిశీలనకు వైజాగ్ డైవర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వహిస్తున్న ట్రయల్‌రన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ని నీటితో నింపి లీకేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌ను 124.5 మీటర్ల వరకు నీటితో నింపి లీకేజీలను గుర్తించేందుకు ప్రాజెక్టు అధికారులు వైజాగ్ షిప్ యార్డ్ నుంచి నైపుణ్యంగల డైవర్లను రంగంలోకి దింపారు. 8 మంది డైవర్ల బృందం నీటిలోకి దిగి సర్జ్‌పూల్‌నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్‌ల్లోకి నీరు ఎక్కడైనా చేరుతోందా అన్నది పరిశీలించారు. సర్జ్పూల్కు ఉన్న ఏడు గేట్ల పరిధిలో మూడు గేట్ల లీకేజీలను శనివారం తనిఖీ చేశారు. మిగతా నాలుగు గేట్ల పరిశీలన ఆదివారం కొనసాగనుంది. ఇప్పటివరకు ఎలాంటి లీకేజీలు గుర్తించలేదని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ల నేతృత్వంలో పరిశీలన కొనసాగుతోంది. ఈనెల 24న మోటార్లకు వెట్‌రన్ నిర్వహించనున్నారు. ఈ మోటార్ల వెట్‌రన్ జరిగితే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఏడు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా నీరు బయటకు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో డెలివరీ సిస్టర్న్ నుంచి 3,200 క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశం ఉంది. మొత్తంగా 22,400 క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటి ప్రవాహం ఉండనుంది. 24న ‘కాళేశ్వరం’పై సీఎం ఏరియల్ సర్వే? కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లిలోని మేడిగడ్డ పంపుహౌస్, గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ నిర్మాణాలపై సీఎం కేసీఆర్ నెల 24న ఏరియల్ సర్వే చేయనున్నట్టు సమాచారం. సీఎం ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ, మహారాష్ట్ర భూభాగంలో పోచంపల్లి వైపు ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నిర్మిస్తున్న అప్రోచ్ కెనాల్ పనులు, పంపుల ద్వారా నీటిని తరలించే గ్రావిటీకాల్వ, అన్నారం బ్యారేజీ పనులను వీక్షించనున్నట్లు ఇరిగేషన్‌శాఖ అధికారుల ద్వారా తెలిసింది. అలాగే ఈనెల 26, 27 తేదీల్లో కన్నెపల్లిలోని మోటార్లకు వెట్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం మరో సారి ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. -
హైస్పీడ్ రైలుపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’పై రాళ్ల దాడి జరిగింది. ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బోగీ అద్దం దెబ్బతింది. సకూర్‌బస్తీ నుంచి రాత్రి 11.03 గంటల ప్రాంతంలో బయలుదేరి రాత్రి 11.50కు న్యూఢిల్లీ చేరుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురు రైల్వే పోలీసులు అందులో ప్రయాణించారు. (ట్రైన్ 18 ఇక ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’) లాహొరి గేట్ పోస్ట్ పరిధిలోని సర్దార్ ప్రాంతంలో రాళ్ల దాడి జరిగిందని ఉత్తర రైల్వే ఒక ప్రకటన చేసింది. 188320 బోగీ టీ-18 విండో గ్లాస్ దెబ్బతిందని తెలిపింది. సర్దార్ ప్రాంతంలో రైల్వే పోలీసులు గాలించారని, అనుమానితులు ఎవరూ కనిపించలేదని ప్రకటించింది. ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. -
విమానం వచ్చిందోచ్..
ఓర్వకల్లు: ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విమానం దిగింది. సోమవారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఈ నెల 7న ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రయల్‌రన్ కోసం విజయవాడ నుంచి బయలుదేరిన చిన్నపాటి విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇక్కడికి చేరుకుంది. అందులో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, నెల్లూరు ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ ఉమేష్, పైలెట్, కో–పైలెట్‌తో సహా ఐదుగురు విచ్చేశారు. వారికి కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరçప్ప, ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ వీరేందర్‌సింగ్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమానం వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం వారు రన్‌వే, అప్రోచ్ రోడ్డు, విమానాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. మీడియా సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడుతూ పారిశ్రామిక హబ్, ఎయిర్‌పోర్టు, అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రాజెక్టులతో కర్నూలు జిల్లాకు భవిష్యత్‌లో మహర్దశ రానున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టుకు 2017 జూన్ 21న శంకుస్థాపన చేశామని, జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం 18 నెలల్లోనే దాదాపు అన్ని పనులు పూర్తిచేశామని అన్నారు. వంద శాతం పనులు పూర్తికావడానికి మరో మూడు నెలలు పడుతున్నందున ఏప్రిల్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమావేశంలో ఎయిర్‌పోర్టు జీఎం వంశీకృష్ణ, కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నరేంద్రనా«థ్‌రెడ్డి, ఎంపీడీఓ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. వీక్షకులకు నిరాశ ట్రయల్‌రన్‌ను వీక్షించేందుకు ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఉదయాన్నే ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే.. వారిని పోలీసులు జాతీయ రహదారిపై గల ప్రధాన గేటు వద్దనే నిలువరించారు. పనులు పూర్తి చేయకుండానే విమానాశ్రయాన్ని ప్రారంభిస్తుండడంతో ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని ఎవరినీ లోపలికి అనుమతించలేదంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
విమానాశ్రయంలో హడావుడి పనులు
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు విమానాశ్రయం అసంపూర్తి పనులతోనే ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. కొంత వరకు రోడ్లు వేయడం మినహా ఎటువంటి పురోగతి లేదు. టెర్మినల్ ప్లాంట్, ప్రయాణికుల విశ్రాంతి భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయం తదితర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కేవలం రన్‌వే, ఎప్రోచ్ రోడ్డు, విమానాల పార్కింగ్ మాత్రమే పూర్తి చేశారు. జనవరి 7వ తేదీన ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్‌కు సెస్నా సైటేషన్ సీజే2 (CESSANA CITATION CJ2) మోడల్ విమానం ఓర్వకల్లుకు రానుంది. ఈ మోడల్ విమానం అతి చిన్నది. ఇందులో నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి 1.30 గంటల మధ్య ట్రైయల్ రన్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్ సత్య నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అరకొర పనులతోనే విమానం ట్రయల్ రన్, జనవరి 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఓర్వకల్ విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం వందల మంది విమానాశ్రయం చూసేందుకు వచ్చారు. అక్కడ అరకొర పనులు చూసి విమానాశ్రయాన్ని ప్రారంభించినా రెగ్యులర్‌గా విమానాలు ఎగురడానికి చాలా కాలం పడుతుందని పలువురు చర్చించుకున్నారు. -
‘బాహుబలి’ రన్ విజయవంతం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపుల డ్రై రన్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ అయిన ప్యాకేజీ–8లోని 5వ మోటార్ డ్రై రన్ శుక్రవారం నిర్వహించగా అది విజయవంతమైంది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం చేసిన మేఘ ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం స్పీడ్ ట్రయల్‌రన్, డ్రై రన్‌ను చేపట్టి విజయవంతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తోందని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. మోటార్ స్పీడ్ క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ఈ స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మోటార్ ఆర్పీఎం (రివల్యూషన్ పర్ మినిట్) సామ ర్థ్యం 214.5 ఆర్‌పీఎంలు కాగా శుక్రవారం ఉదయా నికి మోటార్ 170 ఆర్పీఎంలకు చేరుకుందని అధికారులు తెలిపారు. మేఘ ఇంజనీరింగ్, బీహెచ్ఈఎల్, జర్మనీకి చెందిన సీమన్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ట్రయల్‌రన్ కొనసాగుతోంద ని వెల్లడించారు. శనివారం నుంచి నాలుగో మోటార్ స్పీడ్ ట్రయల్‌రన్, డ్రై రన్ ప్రారంభం అవుతుందని, ఆదివారం నాటికి రెండు మోటార్లు పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయని ప్రకటించారు. ఈ ట్రయల్ రన్‌ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ వెంకట రాములు, ఈఈ శ్రీధర్, సీమెన్స్ ఇండియా నుంచి సందీప్, భెల్ నుంచి అనిల్ కుమార్ పురే (భోపాల్), శరవణన్ (బెంగళూరు), సుమిత్ సచ్ దేవ్ (ఢిల్లీ), మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు వచ్చిన వెంటనే పంపింగ్ చేసేందుకు ఈ మోటార్ల డ్రై రన్, స్పీడ్ ట్రయల్ రన్ పూర్తి చేశారు. వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా ఈ మోటా ర్లు సిద్ధం చేస్తున్నారు. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 12.58 టీఎంసీలు నిల్వలుండ గా, ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆగస్టు నుంచి కాళేశ్వరంలోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు, అటు నుంచి ప్యాకేజీ–7 టన్నెల్, గ్రావిటీ కెనాల్ ప్యాకేజీ–8లోని రెండు మోటార్ల ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలిం చేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. -
నేలపై.. నీటిలో..
విశాఖ సిటీ, తగరపువలస (భీమిలి): దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ రామకృష్ణ బీచ్‌లో వచ్చే నెల నుంచి హోవర్‌క్రాఫ్ట్‌లు పర్యాటకులను అలరించనున్నాయి. ఇప్పటికే హోవర్ డాక్ సంస్థ ప్రతినిధులు బీచ్‌లో హోవర్‌క్రాఫ్ట్‌లు తిరగడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి ప్రభుత్వపరమైన అనుమతులు పొంది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యా నుంచి రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను దిగుమతి చేసుకున్న నిర్వాహకులు భోగాపురం మండలం రెడ్డి కంచేరు తీరంలో ఉంచి రష్యాకు చెందిన నిపుణులతోనే శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేలపైన, నీటిలోనూ తిరగగలిగే హోవర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటి వరకు యూరప్ దేశాలు, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలోనే అందుబాటులో ఉన్నాయి. పర్యాటక నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖకు ఏడాదికేడాది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వేసవిలో విశాఖకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి విశేషంగా పర్యాటకులు వస్తుంటారు. విశాఖలో ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే వీటిని అయిదు వరకు పెంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయిదుగురు ప్రయాణించగల హోవర్‌క్రాఫ్ట్ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించగల వాహనాన్ని రూ.1.70 కోట్లకు నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఇప్పటికే విశాఖ తీరంలో సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం, కైలాసగిరి నుంచి అప్పుఘర్‌కు రోప్ వే వంటివి పర్యాటకులను అలరిస్తుండగా ఇటీవల హెలీ టూరిజమ్ పేరుతో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో నగర సందర్శన పర్యాటకులను ఆకర్షించలేకపోయింది. నేలపై నుంచి నేరుగా నీటిలోకి దూసుకుపోయే హోవర్‌క్రాఫ్ట్‌లను నేవీలో వినియోగిస్తుంటారు. విశాఖలో హోవర్‌క్రాఫ్ట్ తయారీ పరిశ్రమ.. నగరంలో హోవర్‌క్రాఫ్ట్ సేవలు పర్యాటకులను ఆకర్షించగలిగితే ఇక్కడే హోవర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలతో తయారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రష్యాలోని క్రిస్టి హోవర్‌క్రాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇవి కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే కాకుండా తుఫానులు, వరదల సమయంలో వీటిలో బాధితులను జాగ్రత్తగా ఒడ్డుకు చేరవేయవచ్చు. మామూలు పడవలు ఎక్కువ లోతు గల నీటిలోనే ప్రయాణించగలవు. హోవర్‌క్రాఫ్ట్‌లు నీటిమట్టంతో సంబంధం లేకుండా నేలమీద కూడా ప్రయాణించగలవు కాబట్టి వీటిని సముద్రాలలోనే కాకుండా సరస్సులపై కూడా వినియోగించవచ్చు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎదురయ్యే విషసర్పాలు, తేళ్లు, మొసళ్ల బారి నుంచి కూడా హోవర్‌క్రాఫ్ట్‌లు రక్షణగా ఉపయోగపడతాయి. పర్యాటకులు సముద్రంపై దీనిలో ప్రయాణించడానికి పది నిముషాలకు రూ.300 నుంచి 500 వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. -
‘ట్రయల్’.. ట్రబుల్
బూర్గంపాడు: గోదావరి జలాలను కేటీపీఎస్కు తరలించే పైప్‌లైన్ మోరంపల్లిబంజర సమీపంలో లీకైంది. అక్కడే ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు గోదావరి జలాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునేందుకు బూర్గంపాడు నుంచి కేటీపీఎస్ వరకు పైప్‌లైన్ వేశారు. అధికారులు గోదావరి జలాలను తరలించేందుకు మంగళవారం ముందస్తుగా ట్రయల్ రన్ వేయగా.. పైప్‌లైన్ లీకైంది. సుమారు రెండు గంటల పాటు నీరు ఇలా రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. -
లాంచీలో సాగర్ టు శ్రీశైలం
సాక్షి, నాగార్జునసాగర్ : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తొలిసారిగా శ్రీశైలానికి నదీ మార్గం ద్వారా వెళ్లేందుకు బుధవారం లాంచీ ట్రయల్ రన్ వెళ్లనుంది. లాంచీలు నడవడానికి సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరు ఉంది. అధిక శాతం పర్యాటకులు కార్తీక మాసంలో తెలంగాణ నుంచే శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. వారంతంలో, సెలవు దినాల్లో మాత్రమే నాగార్జునకొండకు నాలుగైదు ట్రిప్పులు లాంచీలను నడుపుతున్నారు. మిగిలిన ఐదు రోజులు పర్యాటకులుంటే కొండకు ఒక ట్రిప్పు వెళ్తుంది. లేకుంటే జలాశయం తీరంలోనే లాంచీలుంటున్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ అదనపు ఆధాయాన్ని సమకూర్చుకునేందుకు నదీమార్గంలో శ్రీశైలం రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్లాన్ చేశారు. జలాశయం తీరం వెంటగల అమ్రాబాద్–నల్లమల అడువుల ప్రకృతి సహజ అందాలను ఆస్వాదించడంతో పాటు సెల్ఫోన్ల గడబిడ లేకుండా రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలోనే శ్రీశైలం మళ్లిఖార్జునస్వామి దర్శనం రాత్రి బస ఏర్పాటు, మరికొన్ని దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు సౌకర్యం కల్పించనున్నారు. క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం జలకళతో కళకళలాడుతోంది. మంగళవారం 573.20అడుగులకు చేరింది. 264.6026టీఎంసీలకు సమానం. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు కాగా 312.24 టీఎంసీలకు సమానం. శ్రీశైలం జలాశయం నుంచి గడిచిన 24గంటల్లో 19,635 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 883.90 అడుగులుండగా 46,852 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి తాగునీటికోసం మోటార్ల ద్వారా కేవలం 1800క్యూసెక్కులు అక్కంపల్లి జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదన ద్వారా వచ్చే ప్రతినీటిబొట్టును నిల్వ చేస్తున్నారు. -
పట్టాలపైకి ‘హంసఫర్’
- గుంతకల్లు–తిరుపతి మధ్య ట్రయల్ రన్ గుంతకల్లు : సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. 2016–17 రైల్వే బడ్జెట్లో రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తిరుపతి నుంచి ఉత్తరాది రాష్ట్రంలోని జమ్మూతావి క్షేత్రంలోని వైష్ణవిదేవి ఆలయం సందర్శనార్థం హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతి మధ్య శుక్రవారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అమితాబ్ ఓజా, ఏడీఆర్ఎం సుబ్బరాయుడు తదితర అధికారుల బృందం గుంతకల్లులో రైలును పరిశీలించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ సాధారణ ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారన్నారు. కోచ్‌లను జీపీఎస్ (గ్లోబుల్ పొజిషన్ సిస్టం) బేస్డ్ ప్యాసింజర్ పద్ధతిన నిర్మించినట్టు చెప్పారు. ప్రయాణ సమయంలో ముందస్తు రైల్వేస్టేషన్ వివరాలు, ప్రయాణ దూరం తెలియజేస్తూ ఆటోమెటిక్ డిస్ప్లే అవుతుందన్నారు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కావడంతో వేగాన్ని పరిశీలించడానికి ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. ట్రయల్ రన్లో డివిజనల్ అధికారులు, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఈఈ (మెయింటెనెన్స్) అంజయ్య, సీనియర్ డీఈఈ (టీఆర్డీ) విజయేంద్రకుమార్, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) మనోజ్‌కుమార్, ఏసీఎంలు రాజేంద్రప్రసాద్, ఫణికుమార్, స్టేషన్ మాస్టర్ లక్ష్మానాయక్, సీటీఐ వై ప్రసాద్, సీఎంఎస్‌లు ఫజుల్ రహిమాన్, ఖాదర్‌భాషా పాల్గొన్నారు. ‘హంసఫర్’ ప్రత్యేకతలు - రైలులో 18 త్రీటైర్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ 6 సీసీ కెమెరాలు, కోచ్ ప్రధాన ద్వారం రెండు వైపులా 2 చొప్పున సీసీ కెమెరాలు ఉంటాయి. - అగ్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాల కారణంగా పొగలు తదితరాలు ఏర్పడితే ఆటోమెటిక్ అలారం మోగుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం అలారం యంత్రంలో డిస్ప్లే అవుతుంది. - బోగీలో సీటు సీటుకు ప్రత్యేక కర్టెన్ - అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయ రంగులతో ప్రత్యేక మరుగుదొడ్లు - బాత్రూంలో కూడా అందుబాటులో సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు - బోగీ నుంచి బోగీకి మధ్య ఆటోమెటిక్ డోర్ కంట్రోల్ సిస్టం - హాట్కేస్ భోజన, అల్పాహార సదుపాయం - ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీ, పాలు ఇతర తేనీటి విందు ఏర్పాటు - హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలు ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీల కంటే 20 శాతం అదనం -
నేడు కదిరిదేవరపల్లికి ట్రయల్ రైలు రన్
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు మంగళవారం రైలు ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు చీఫ్ ఇంజినీర్ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ నెలలో కళ్యాణదుర్గం వరకు ట్రయల్ రన్ నిర్వహించి, ఇక్కడి నుంచి రాయదుర్గం, బళ్లారి మీదుగా తిరుపతికి రైలు రాకపోకలు సాగిస్తోందన్నారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు 23 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. దీంతో ఇక్కడ రైలు ట్రయల్ రన్ చేపడుతున్నామని కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ(సీఆర్ఎస్) ఉన్నతాధికారి కేఏ మనోహరన్ రానున్నట్లు సీఈ తెలిపారు. సంబంధిత అధికారి పనులను పరిశీలిస్తారన్నారు. ట్రయల్ రన్ అనంతరం వారం రోజుల తర్వాత రైలు రాకపోకలను కదిరిదేవరపల్లి వరకు పొడిగిస్తామన్నారు. -
పరుగులు పెట్టిన రైలు
రాయదుర్గం–కళ్యాణదుర్గం మార్గంలో 110 కిలోమీటర్ల స్పీడ్‌తో ట్రయల్ రన్ విజయవంతం వారం రోజుల్లోగా సౌత్ వెస్ట్రన్ రైల్వే జీఎంకు నివేదిక నెలాఖరులోనే ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం? రాయదుర్గం టౌన్: రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు నిర్మించిన కొత్త రైలు మార్గంలో ప్రత్యేక తనిఖీ రైలు శుక్రవారం అధికారికంగా పట్టాలెక్కింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల వేగంతో రైలును ప్రయోగాత్మకంగా నడిపి పరీక్షించారు. ట్రయల్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైనట్లు రైల్వే సేఫ్టీ అధికారులు తెలిపారు. 40 కిలోమీటర్ల మధ్య దూరం గల ఈ మార్గంలో తొలుత రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గానికి ఉదయం 9.30 గంటలకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రత్యేక రైలు కళ్యాణదుర్గం స్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు అదే వేగంతో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా విజయవంతంగా రాయదుర్గం స్టేషన్‌కు వెళ్లింది. మొదటి రోజు ఆరు మోటార్ ట్రాలీలలో సీఆర్ఎస్ తనిఖీలు నిర్వహించిన సౌత్ వెస్ట్రన్ రైల్వే, రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు రెండో రోజైన శుక్రవారం ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఇంజినీర్లను, రైలు గార్డులు, డ్రైవర్లు, అధికారులను అభినందించారు. రాయదుర్గం చేరుకున్న తరువాత విలేకర్లతో రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అశోక్ గుప్తా, చీఫ్ సేఫ్టీ కమిషనర్ మనోహర్, ఏడీఆర్ఎం పునిత్ మాట్లాడారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని, ఆథరైజేషన్ నివేదికను వారం రోజుల్లోగా సౌత్‌వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌కు అందజేస్తామన్నారు. సేఫ్టీ తనిఖీల్లో అన్ని పారా మీటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. మార్గంలో రైలు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అన్ని రకాలుగా ట్రాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. నెలాఖరులో లేదా జనవరిలో ఒక ప్యాసింజర్ రైలు నడిపించే అవకాశం ఉందన్నారు. రాయదుర్గం నుంచి టుంకూరుకు 207 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం వరకు రైలు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఆంధ్రా పరిధిలోని 94 కిలోమీటర్లకు గాను ఇంకా 23 కిలోమీటర్ల పరిధిలో భూమి అక్విజేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, కర్ణాటక పరిధిలోనూ ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. -
ట్రయల్ రన్లో మెట్రో రైళ్లు ఢీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చి ఢీకొన్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 2017 ఏడాది మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జానక్‌పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్‌ను నిర్మిస్తున్నారు. మెట్రో అధికారులు ఇటీవల ఈ లైన్‌పై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే తాజాగా ఇదే లైన్‌పై నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. -
సింగూరు పారాలే.. సిరులు పండాలే!
దివంగత నేత వైఎస్ హయాంలో 50 శాతం ప్రాజెక్టు పూర్తి రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసిన కేసీఆర్ సర్కార్ 40 వేల ఎకరాలకు సాగు నీరు.. నేడు ప్రారంభం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మూడు దశాబ్దాల మెతుకుసీమ రైతాంగం ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. వైఎస్ఆర్ జలయజ్ఞంతో పునాదులు వేసుకున్న సింగూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతోంది. శుక్రవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లా సింగూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 4 పంపులు ప్రారంభించి 450 క్యుసెక్కుల సాగు జలాలను వదిలి దిగువన 47 చెరువులను నింపుతారు. అక్కడి నుంచి పొలాలకు విడుదల చేస్తారు. 2005లో వైఎస్ఆర్ అంకురార్పణ 2005లో వైఎస్ఆర్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి బీజం వేశారు. 139 ఉత్తర్వుల ద్వారా రూ.89.98 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్థారిస్తూ జీఓ నెంబర్ 136 జారీ చేశారు. 2006 జూన్ 7 తేదిన కాల్వల నిర్మాణానికి వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాలకు 2500 ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా అందోల్, పుల్కల్, రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. మొదటి విడత కింద రూ.35 కోట్లు వైఎస్ఆర్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత మూడేళ్ల వరకు ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2012లో అప్పటి ప్రభుత్వం రూ.16.50 కోట్లు కేటాయించింది. కానీ, వాటిలో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తిరిగి అవే ని«ధులను 2014 బడ్జెట్లో కేటాయించారు. ఈ నిధులు వినియోగించి ఎడమకాల్వ లిఫ్ట్ పనులు అసంపూర్తిగా ఉన్న సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ట్రయల్‌రన్ నిర్వహించింది. అప్పటి ఉప-ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 2014, ఫిబ్రవరిలో సింగూరు తూముల నీళ్లు వదిలారు. కొద్దిపాటి జల ఉధృతికే తట్టుకోలేక కాల్వలు తెగిపోయాయి. దీంతో అధికారులు శాశ్వతంగా గేట్లు మూసివేశారు. 24 కి.మీ.ల ట్రయల్‌రన్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. గతంలో ట్రయల్‌రన్ నిర్వహించిన సమయంలో కొట్టుకపోయిన 24 కిలోమీటర్ల మేర కాల్వలను కట్టుదిట్టం చేశారు. గతంలో పూర్తి చేయకుండా వదిలేసిన 60 కిలోమీటర్ల ప్రధాన కాల్వని పూర్తిచేసి.. పిల్ల కాల్వలను అనుసంధానం చేశారు. మలి విడత పనులు ప్రారంభించిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. శుక్రవారం 4 పంపుల ద్వారా 450 క్యూసెక్కుల జలాలను దిగువకు వదలనున్నారు. ఈ నీళ్లతో ముందుగా ఆందోల్ పెద్ద చెరువును నింపుతారు. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతారు. హైదరాబాద్‌కు నీళ్లు నిలిపివేత మిషన్ భగీరథ జలాలు, కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్‌కు అందుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రాజెక్టులో 9 టీఎంసీల జలాలలు మిగులుతాయి. మరోవైపు గజ్వేల్, దుబ్బాక ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ జలాలు వస్తుండటంతో ఇక్కడ మరో టీఎంసీలు మిగిలే అవకాశం ఉంది. ఈ మొత్తం జలాలను మెతుకుసీమ రైతాంగం సాగు అవసరాలకే వినియోగిస్తామని నీటిపారదల శాఖ అధికారులు చెప్పారు. -
దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు
-
దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు
న్యూఢిల్లీ: హైస్పీడ్ స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైంది. న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్ రెల్వే స్టేషన్ కు 12 గంటల్లోపు చేరుకుంది. 11 గంటల 48 నిమిషాల్లో ముంబైకు చేరుకుందని రైల్వే శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 1384 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరిన టాల్గో రైలు ఆదివారం తెల్లవారుజామున 2.33 గంటలకు ముంబై చేరుకుందని వివరించారు. ఇదే మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ కు 130 కిలోమీర్ల వేగంతో ప్రయాణించడానికి 15 గంటల 50 నిమిషాలు పట్టింది. ముందు నిర్వహించిన ఐదు ట్రయల్ రన్ లో టాల్గో రైలు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్సీడ్ రైలు మన దేశంలో పట్టాలెక్కడానికి రెండుమూడేళ్లు పడుతుంది. -
85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది
మధుర: భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వేగాన్ని స్పెయిన్ నుంచి తీసుకొచ్చిన టాల్ గో ట్రైన్ అధిగమించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు మధుర-పాల్వాల్ మధ్య ప్రయాణాన్ని 38 నిమిషాల్లో ముగించింది. రెండోసారి నిర్వహించిన ఈ ట్రయల్ లో ఇప్పటి వరకు భారత్ లో అత్యధిక వేగంగా వెళ్లే గతిమాన్ (గంటకు 160 కిలోమీటర్ల వేగం) రికార్డును ఇది చెరిపివేసింది. స్పెయిన్ నుంచి ఉత్తర మధ్య రైల్వే విభాగం ఈ రైలును దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ రైలు పనితీరుపై ట్రయల్స్ వేస్తున్నారు. అందులో భాగంగా రెండుసార్లు ఖాళీ రైలుతో ట్రయల్ వేశారు. మరికొన్నిసార్లు ఇసుక బస్తాలు వేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ టాల్గోఘో మోస్తరు వేగం గంటకు 160 నుంచి 250 కిలో మీటర్లు ఉండగా.. అత్యధిక వేగం 350 కిలోమీటర్లు ఉండనుంది. -
అంత ‘స్మార్ట్’ కాదు..!
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ సర్వే ఎలా చేయాలో నిర్ధరించుకోవడానికి నిర్వహించిన ట్రయల్ రన్ అట్టర్ ఫ్లాపైంది. యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, వివరాలు తెలిపేందుకు ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో సర్వే సందిగ్ధంలో పడింది. ఈ సర్వే బుధవారం నుంచే ప్రారంభం కానుండడం విశేషం. జిల్లాలోని 38 మండలాలను, 5 మున్సిపాలిటీలను, శ్రీకాకుళం నగరపాలక సంస్థను జనాభా ప్రాతిపదికన బ్లాక్‌లుగా విభజించారు. వీటిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించే పద్ధతిని జిల్లాలోని కొందరు అధికారులకు మాస్టర్ ట్రైనర్స్‌తో శిక్షణ ఇప్పించారు. వీరి ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో ఇద్దరు ఉద్యోగులు, పురపాలక సంఘాల్లోని నలుగురు ఉద్యోగులకు మాస్టర్ ట్రైనీస్‌గా శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా అన్ని మండలాల్లోని ఎన్యూమరేటర్లు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం వివిధ డిపార్టుమెంట్లకు అందజేసిన ట్యాబ్‌లకు బయోమెట్రిక్ పరికరం అమర్చి వాటి ద్వా రా సర్వే వివరాలు సేకరించనున్నారు. ట్రయల్ రన్‌లోనే అవాంతరాలు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నడిచే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన రె వెన్యూ డివిజన్లోని ఓ పట్టణం, ఓ గ్రామంలో గత బుధ, గురు వారాల్లో ఎన్యూమరేటర్లు పర్యటించారు. సిగ్నల్ లేక అసలు యాప్ ఓపెన్ కాలేదని ఆయా ప్రాంతాల్లో సర్వే జరిపిన ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. యాప్ పూర్తిగా పనిచేయాలంటే 3జీ సిగ్నల్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లలో 2జీ సిమ్లే ఉండటంతో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. అలాగే ప్రతి కుటుంబానికి సుమారు హౌస్‌హోల్డ్, వ్యక్తిగత, ఇతర వివరాల కింద సు మారు 77 కాలమ్స్‌ను టచ్ ప్యాడ్ ద్వారా డేటాను ఎంటర్ చేయడానికి గంట సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక యాప్ పనిచేయకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో యాప్ ద్వారా వివరాలు సేకరిస్తుంటే సర్వర్ బిజీ అయి ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు ట్రయల్ రన్ చేసిన ఎన్యూమరేటర్లు అంటున్నారు. ప్రచారం శూన్యం... సర్వేకు సంబంధించి ప్రచారం కల్పించకపోవడం వల్ల వివరాలు చెబితే ఏం జరుగుతుందో, చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ప్రజల్లో ఏర్పడింది. సమాచారంతోపాటు 20 రకాల ధ్రువపత్రాలను అడుగుతుండడంతో అవేవీ తమ వద్ద లేవని, తమ వివరాలు నమోదు చేయనవసరం లేదని ప్రజల నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంటోంది. ఇల్లు ఎంత స్థలంలో కట్టారు, ఎన్ని గదులున్నాయి, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఉన్నాయా, విద్యార్హత, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థ నుంచి పొందినదా, సబ్సిడీ లోన్, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్ వంటి వివరాలు సేకరించడంపై కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన సర్వేకు ప్రజల సహకారంపై స ర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
రెస్ట్ హౌస్ నుంచి సేఫ్ హౌస్
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సీఎం సేఫ్ హౌస్ (తాడేపల్లి పోలీసుస్టేషన్), సేఫ్ హాస్పటల్ (మణిపాల్ ఆస్పత్రి)కు మంగళవారం పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. తొలుత సీఎం సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి ఉండవల్లి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి కూడలి, తాడేపల్లి ప్రధాన రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్ వరకు, తిరిగి పాత జాతీయ రహదారి ముగ్గురోడ్డు, పోలకంపాడు మీదుగా ఉండవల్లి ఊరు దాటిన తరువాత కొండవీటి వాగు వంతెన మీదుగా కరకట్టపై ఉన్న సీఎం నివాసానికి కాన్వాయ్ చేరుకుంది. కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, బోటు యార్డు, ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్‌పేట మీదుగా జాతీయ రహదారి వెంబడి వారధి వద్ద ఉన్న సేఫ్ హాస్పిటల్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్కి సేఫ్ హాస్పటల్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, సేఫ్ హౌస్‌కు చేరుకోవడానికి 9 నిమిషాలు, తిరిగి నివాసానికి చేరుకోవడానికి పది నిమిషాల సమయం పట్టింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది, నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సీఐ హరికృష్ణ, ఎస్ఐలు వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మంజీరా నీటి ట్రయల్ రన్లో అపశృతి
హైదరాబాద్ : నగరంలోని పుప్పాలగూడ వద్ద మంజీరా నీటి ట్రయల్ రన్లో అపశృతి చోటుచేసుకుంది. గేట్వాల్ కప్పుపై నిల్చుని వాల్ తిప్పుతుండగా శ్లాబ్ విరిగి మీద పడటంతో పంచాయితీ పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న మల్లేష్ అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురు కిందపడ్డారు. శ్లాబ్ మల్లేష్ నడుముపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో మల్లేష్‌ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గోదావరి పరుగు
{పయోగ పరీక్ష విజయవంతం ముర్మూరు నుంచి బొమ్మకల్‌కు సరఫరా 30 ఎంజీడీల నీరు పంపింగ్ మరో రెండు నెలల్లో నగరానికి... సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీర్చే గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ప్రయోగ పరీక్ష (ట్రయల్ రన్) విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 58 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు మంగళవారం 30 ఎంజీడీల నీటిని పంపింగ్ చేశారు. ఈ నీటిని 3000 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ద్వారా బొమ్మకల్‌కు తరలించారు. పైప్లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్లైన్ల ఎయిర్‌వాల్వ్‌లు, జాయింట్లను పరిశీలించారు. ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా తరలించిన విషయం విదితమే. అక్కడి నుంచి బొమ్మకల్- మల్లారం - కొండపాక- ఘన్పూర్ మార్గంలో రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్లతో పాటు సుమారు 186 కి.మీ మార్గంలో పైప్లైన్ల పనులు పూర్తయిన విషయం విదితమే. గోదావరి తొలిదశ ద్వారా గ్రేటర్‌కు 172 ఎంజీడీల జలాలను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 30 ఎంజీడీల నీటిని ఒకే మోటారు ద్వారా పంపింగ్ చేస్తున్నారు. మొత్తం పంపింగ్‌కు అవసరమైన 9 మోటార్లను ముర్మూరు పంప్ హౌస్ వద్ద సిద్ధంగా ఉంచారు. -
మెట్రో ట్రయల్ రన్
కేపీహెచ్‌బీ కాలనీ : మియాపూర్‌లోని మెట్రో రైల్ డిపో నుంచి ఎస్.ఆర్.నగర్ వరకు ట్రయల్ రన్లో భాగంగా గురువారం మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. సుమారు 12 కిలోమీటర్ల మేర ట్రాక్‌పై మెట్రో రైళ్లు రాకపోకలు సాగించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మియాపూర్ నుంచి భరత్ నగర్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ భరత్‌నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంతకాలంఎస్.ఆర్.నగర్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలు కాలేదు. ఇటీవల బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు అవకాశం దక్కింది. ఈ ట్రయల్ రన్‌ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎమ్‌డీవీబీ గాడ్గిల్ జెండా ఊపి ప్రారంభించారు. 50 కేఎంపీహెచ్ వేగంతో రైలును నడిపారు. రైలు వేగం, సిగ్నలింగ్, ట్రాక్‌లతో పాటు 18 రకాల ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు
ట్రయల్ ‘రన్’ హైదరాబాద్: రిచ్ లుక్ తో వచ్చాడు.. ఖరీదైన బైక్ వివరాలడిగాడు.. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు.. షాపు యజమానులకు షాక్ ఇస్తూ ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...హార్లీ డేవిడ్సన్ బైక్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనంగా పేరుంది. ఒక రకంగా యువత కలల బైక్ కూడా ఇదేనని చెప్పొచ్చు. ఇలాంటి బైక్‌లు కొనలేని వారు వాటిని షోరూంలో చూసి, వీలుంటే ట్రయల్న్ ్రవేసి, సెల్ఫీలు తీసుకొని తెగ ఆనందపడిపోతుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే ఈ ఖరీదైన బైక్‌ను సొంతం చేసుకునేందుకు పథకం పన్నాడు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో ఓ యువకుడు వచ్చాడు. అక్కడివారిని కొత్త బైక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అని నెలకు రూ.లక్షన్నర జీతం ఉంటుందని నమ్మబలికాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 23లో నివాసముంటున్నట్లు చెప్పాడు. కొత్తగా వచ్చిన హార్లీడేవిడ్సన్ స్ట్రీట్ 750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. క్రెడిట్‌కార్డులను కూడా చూపించాడు. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు. ఇంకేముంది తప్పకుండా కొనుగోలు చేస్తాడని షోరూం నిర్వాహకులు భావించారు. అతడికి బైక్ తాళం చెవి అప్పగించారు. దర్జాగా ట్రయిల్ రన్‌కు వెళ్లండి అంటూ టాటా చెప్పారు. అంతే యమా స్పీడ్‌తో అక్కడ నుంచి దూసుకెళ్లిన తాహీర్ తిరిగిరాలేదు. మూడు గంటలు గడిచినా షోరూం నిర్వాహకులకు పరిస్థితి అర్థం కాలేదు. చివరికి అతడు వచ్చింది కొనడానికి కాదు కొట్టేయడానికి అని ఆలస్యంగా తెలియడంతో వెంటనే అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. స్విచ్చాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ సీఐ పి. మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. యువకుడి ఊహాచిత్రాన్ని రూపొందిస్తున్నారు. -
త్వరలో నంద్యాల- ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు
సంజామల: నంద్యాల- ఎర్రగుంట్ల మార్గంలో త్వరలో రైళ్ల రాకపోక లు కొనసాగనున్నట్లు రైల్వేశాఖ గుంతకల్లు డీఆర్ఎం గోపీనాథ్ మాల్య చెప్పారు. గురువారం ఈ మార్గంలో మండలంలోని నొస్సం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నొస్సం రైల్వేస్టేషన్లో స్టేషన్, ఫ్లైఓవర్, క్వార్టర్స్, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు, క్రాసింగ్స్, సిగ్నల్స్, ఫ్లాట్‌ఫాం, తదితర పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసి బనగానపల్లెవరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో మారు ట్రయల్న్ ్రనిర్వహించి వచ్చే ఏడాది మార్చికంతా రైళ్ల రాకపోకలు జరిగేలా పనులను వేగవంతం చేశామన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో పెండింగ్ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు చురుగ్గాసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఈఓ మనోజ్‌కుమార్, స్థానిక నేతలు మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గాధంశెట్టి వెంకటేశ్వర్లు, శంకర్, వాసుదేవరెడ్డి,పాల్గొన్నారు. సంజామల రైల్వేస్టేషన్‌కు పెండేకంటి పేరు పెట్టండి: సంజామల రైల్వేస్టేషన్‌కు, ప్యాసింజర్ రైలుకు బీహార్, కర్నాటక రాష్ట్రాల గవర్నర్, కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరు పెట్టాలని ఆయన వంశస్తుడైన పెండేకంటి కిరణ్‌కుమార్ కోరారు. గురువారం రైల్వే పనులను పరిశీలించేందుకు వచ్చిన డీఆర్ఎం గోపీనాథ్ మాల్యాను కలిసి వినతిపత్రం అందజేశారు. -
ట్రయల్ రన్ వేయండి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం కొవ్వూరులో పుష్కర పనుల పరిశీలన గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లపై సంతృప్తి కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు ఆదివారం అన్ని శాఖలు ట్రయల్ రన్ నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో శనివారం సాయంత్రం ఆయన పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. స్నానఘట్టంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఘాట్‌లో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా, భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంచాలని ఆదేశించారు. ఘాట్లలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నదిలో పిండ ప్రదానాలు చేసిన సామగ్రి, పూజా ద్రవ్యాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా రూపొందించిన వలతో నదిలోని చెత్త, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఈతగాళ్లు ఎలా తొలగిస్తారో సీఎంకు చూపించారు. అనంతరం సమాచార శాఖ రూపొందించిన పుష్కర కరపత్రాలను సీఎం ఆవిష్కరించారు. జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం కొవ్వూరులో ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంగణాలను, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను, బారికేడ్లను సీఎం పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సింటెక్స్ ట్యాంకును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వెల్డన్ ఏర్పాట్లు బాగున్నాయని అని కలెక్టర్ కె.భాస్కర్‌ను ప్రశంసించారు. గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లు బాగా చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి మురళీ మోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, కలువపూడి శివ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూర్యదేవర రంజిత్, నీటిపారుదలశాఖ సీఈ ఎస్.హరిబాబు, ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాలకొల్లు ఆర్వోబీపై ట్రయల్ రన్
పాలకొల్లు :పాలకొల్లు పట్టణ శివారు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో 18 ఏళ్లుగా సాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. నరసాపురం కాలువపై వంతెన, రైల్వే ట్రాక్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, అప్రోచ్‌రోడ్డు పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ఆర్వోబీపై ట్రయల్న్‌గ్రా వాహనాల ప్రయాణానికి అనుమతిచ్చారు. నరసాపురం, ఆచంట, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు పాలకొల్లు పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్వోబీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్రోచ్ రోడ్డుకు మట్టి, గ్రావెల్ పనులు పూర్తికాగా తారురోడ్డు నిర్మాణం చేపట్టాల్సి వుంది. అయితే రోడ్డు కొంతమేరకు దిగబడే అవకాశం వున్నందున ముందుగా ట్రయల్ రన్‌గా వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. మార్చి నెలాఖరునాటికి రోడ్డు నిర్మాణం పూర్తిచేసి పూర్తి స్థాయిలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ఆర్అండ్బీ డీఈ అడబాల శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల్లో పూర్తి: ఎంపీ గంగరాజు పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభోత్సవం మరో మూడు నెలల్లో జరుగుతుందని ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. బుధవారం స్థానిక ఆర్వోబీ అప్రోచ్‌రోడ్డు పనులు పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైల్వే, ఆర్అండ్బీ అధికారులతో సంప్రదించి పనులు పూర్తి చేసేందుకు కృషి చేశానన్నారు. ఇంకా అప్రోచ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించాల్సి వుందన్నారు. ఇప్పటికే మట్టి, గ్రావెల్ పనులు పూర్తయ్యాయని, దీంతో బుధవారం నుంచి వాహనాల ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్టు గంగరాజు తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వడలివానిపాలెం నుంచి ఆచంట బైపాస్‌రోడ్డు మీదుగా ఆర్వోబీకి రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలని దీనికి ఎంపీ గంగరాజు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్పర్సన్ కర్నేన రోజారమణి, ఆర్అండ్బీ డీఈ అడబాల శ్రీనివాస్, ఏఈ మూర్తి, టీడీపీ నాయకులు అడబాల వెంకటరమణ, గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, కర్నేన గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మెట్రో రైల్ టెస్ట్ రన్
-
నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు
అష్ట దిగ్బంధంలో విజయవాడ అధికారుల ట్రయల్ రన్ తరలిరానున్న ప్రముఖులు నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు రానుండటంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో విజయవాడలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్, ఐదుగురు ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, 15 మంది కేంద్ర మంత్రులు వస్తారని అంచనా. వీరంతా గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఏఎన్‌యూ ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా కనకదుర్గ వారధి మీదుగా ట్రయల్ రన్ నిర్వహించారు. హోటళ్లు అన్నీ హౌస్‌పుల్! విజయవాడ నగరంలో సుమారు 100 హోటళ్ల వరకు ఉండగా వాటిని ఇటు అధికారులు, అటు తెలుగుదేశం నాయకులు బుకింగ్ చేశారు. దీంతో సాధారణ యాత్రికులు నానా ఇబ్బందులు పడ్డారు. హోటళ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు. నగరంలోనూ ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరానికి వీఐపీలు, అధికారులు తాకిడి ఎక్కువ కావడంతో దుర్గగుడిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచే రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
‘కోరమాండల్’ హాల్ట్ కొనసాగింపు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంలో హాల్టును కొనసాగిస్తూ గురువారం ఉత్తర్వులు వచ్చాయి. ట్రయల్ రన్ ప్రాతిపదికన ఈ రైలుకు తొలుత ఆరు నెలలపాటు హాల్టు ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆరు నెలల అనంతరం రైలు ఎక్కే, దిగే ప్రయాణీకులు, టికెట్లపై వచ్చే ఆదాయం తదితర కోణాలలో సమీక్షించుకొని రైలు హాల్టు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనేది నిర్ణయిస్తామని హాల్టు కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో గత నెల 28 నుంచి గూడెంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హాల్టును ఎత్తేశారు. ఈ రైలు ప్రారంభమయ్యాక అదనపు హాల్టు ఒక్క తాడేపల్లిగూడెంకు మాత్రమే ఇవ్వటం విశేషం. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు చొరవే దీనికి కారణం. హాల్టు రద్దు కాకుండా చూసుకోవాలని అప్పట్లో బాపిరాజు ఇక్కడి ప్రయాణీకులకు, వ్యాపార సంఘాలకు చెప్పారు. ఈ రైలులో ప్రయాణించటానికి 500 కిలోమీటర్ల కనీస పరిమితి ఉంది. ఇక్కడ నుంచి అటు చెన్నైకి, ఇటు బరంపురం ఆపై స్టేషన్లకు మాత్రమే టికెట్ ఇస్తా రు. ఈ రైలు నడిచే మార్గంలో 500 కిలో మీటర్ల కనీసం దూరం మినహాయింపును ఒక్క రాజమండ్రి స్టేషన్ కే ఇచ్చారు. అక్కడి నుంచి ఈ రైలు హాల్టున్న ఏ స్టేషన్‌కైనా టికెట్ ఇస్తారు. అలాంటి మినహాయింపునే గూడెంకు ఇవ్వాలని ప్రయాణికులు, పలు స్వ చ్ఛంద సంఘాలు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాయి. వాటిని రై ల్వే శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు నెలలు కావటంతో కోరమాండల్ హాల్టును రద్దు చే స్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రయాణికులు నిరాశపడ్డారు. ఈ రైలు హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గూడెం రైల్వే స్టేషన్లో హాల్టు ఇచ్చిన స్వర్ణజయంతి హాల్టును గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి. అన్ని రైళ్ల హాల్టుల గడవు పొడిగింపు తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్టు ఇచ్చిన నాందేడ్- విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్(18509-18510)కు సెప్టెంబరు 30 వరకు, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్ప్‌ప్రెస్ (12863-12864) హాల్టును ఆగస్టు 7 వరకు, అమరావతి ఎక్స్‌ప్రెస్ (18047-18048) హాల్టును ఆగస్టు 13 వరకు, గరీబ్ రథ్(12739-12740) హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు గూడెంలో హాల్టు నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపైనే ఉంది. సంత్రాగచ్చి, కాకినాడ టౌన్-లోకమాన్యతిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్‌లకు గూడెంలో హాల్టులను రెగ్యులరైజ్ చేశారు, -
పట్టాలెక్కని డబుల్‌డెక్కర్
నాలుగు నెలలు గడిచినా ఊసే లేని వైనం సాక్షి, సిటీబ్యూరో: నెల రోజుల్లోనే అందుబాటులోకొస్తుందన్నారు. ఎంతో ఆర్భాటంగా పరిచయం చేశారు. కానీ ఇప్పటి వరకు డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కలేదు. నగరం నుంచి తిరుపతి, గుంటూరు స్టేషన్లకు న డిపేందుకు ఇటీవల డబుల్ డెక్కర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసింది. భద్రతాపరమైన పరీక్షలు, ట్రయల్ రన్ అనంతరం ఇది పట్టాలెక్కేస్తుందని అప్పట్లో రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా డబుల్ డెక్కర్‌లో కదలిక లేదు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరీక్షలు నిర్వహించలేదు. గతేడాది నుంచి ఊరిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు... కనీసం ట్రయల్న్‌క్రు కూడా నోచుకోకపోవడం నిజంగా విస్మయం కలిగించే విషయమే. భద్రతా కమిషన్ నివేదిక అందితే గానీ రైలు అందుబాటులోకి రావడం అసాధ్యమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ రైలు ఉండీ లేనట్లే అయింది. దేశంలో ప్రస్తుతం నడిచే డబుల్ డెక్కర్ రైళ్లన్నింటి కంటే మరింత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు కాచిగూడ నుంచి తిరుపతికి, కాచిగూడ నుంచి గుంటూరుకు నడపాలని ప్రతిపాదించారు. దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైలు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రద్దీ మార్గాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. సీటింగ్ సదుపాయం మాత్రమే ఉన్న ఈ రైలు అన్నివిధాలుగా సురక్షితమైంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసే అలారమ్ వ్యవస్థను మొట్టమొదటిసారి ఇందులో ప్రవేశపెట్టారు. దేశంలో ఆరోది... ప్రస్తుతం దేశంలో ఐదు డబుల్‌డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. నగరానికి ప్రకటించింది ఆరోది. ఇందులో 14 ఏసీ చైర్కార్లు, 3 పవర్ బోగీలు ఉంటాయి. పూర్తిగా ఏసీ. ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48, అప్పర్ డెక్‌లో 50, మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి బోగీకి 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్ కాచిగూడ-గుంటూరు బై వీక్లీ, కాచిగూడ -తిరుపతి బై వీక్లీగా నడువనుంది. కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ పగటి పూట మాత్రమే నడుస్తుంది. -
మళ్లీ ట్రయల్న్
చెన్నై, సాక్షి ప్రతినిధి:మెట్రోరైల్ ప్రయాణపు అనుభవాలను ఆస్వాదించేందుకు నగర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడమేగాక నగరానికి మరింత శోభను చేకూర్చే మెట్రోరైలు నిర్మాణ పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. 14,500 కోట్ల అంచనాతో ఆరంభించిన మెట్రోరైల్ ప్రాజెక్టును 2015 నాటికి సిద్ధం చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందుగానే అందిస్తామని మెట్రో అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాకలిపేట- మీనంబాకం ఎయిర్‌పోర్టు వరకు 22.1 కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్- పరంగిమలై వరకు 22 కిలోమీటర్లతో మొత్తం 45.1 కిలో మీటర్ల పొడవున రెండు మార్గాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. చాకలిపేట-సైదాపేట వరకు 11 రైల్వేస్టేషన్లతో సొరంగమార్గం, ఆరు రైల్వే స్టేషన్లతో సైదాపేట-మీనంబాకం వరకు ఆకాశవంతెన మార్గం సిద్ధమవుతోంది. సెంట్రల్- అన్నానగర్ టవర్ వరకు సొరంగమార్గం, తిరుమంగళం నుంచి కోయంబడే, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడు తాంగల్ వరకు ఆకాశవంతెన మార్గంలో రైలు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 8 రైల్వే స్టేషన్లు సిద్ధమవుతున్నాయి. తొలి, మలి ట్రయల్ రన్ నాలుగు బోగీలతో కూడిన మెట్రోరైలు బ్రెజిల్ నుంచి ఆరు నెలల క్రితమే చెన్నై చేరుకోగా 800 మీటర్ల ట్రయల్న్‌న్రు గత ఏడాది నవంబరు 6వ తేదీన నిర్వహించారు. రిమోట్ కంట్రోలు ద్వారా సచివాలయం నుంచే అన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కానిచ్చే సీఎం జయలలిత నేరుగా హాజరై ట్రయల్న్‌క్రు జెండా ఊపారు. రైలు బోగీలోకి ఎక్కి వసతులను పరిశీలించారు. 2014వ సంవత్సరంలో కోయంబేడు-పరంగిమలై (సెయింట్ థామస్ మౌంట్) నడుమ ప్రయాణికుల కోసం మెట్రోరైలు పరుగులు పెడుతుందని ట్రయల్న్ నాడే అధికారులు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరిలో మళ్లీ పాతమార్గంలోనే ట్రయల్న్‌క్రు సిద్ధమవుతున్నారు. అయితే గత ఏడాది కేవలం 800 మీటర్లు మాత్రమే ట్రయల్న్ సాగింది. ఈ సారి 11 కిలోమీటర్ల దూరం వరకు అంటే రెండు ప్రధాన రైల్వే స్టేషన్ల నడుమ ట్రయల్న్ నిర్వహించనున్నారు. -
శ్రమించారు..సాధించారు
ఆత్మకూర్, న్యూస్‌లైన్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం ట్రయల్ రన్ విజయవంతమైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు నిపుణులు, అధికారులు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి యూనిట్లో 300 క్యూసెక్కుల నీటిని వినియోగించి సన్నాహక పరీక్షలు నిర్వహించారు. మొదట టర్బయిన్లలో ఆయిల్ లీకేజీ, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్రయల్న్‌ల్రో కొన్ని ఆవాంతరాలు ఏర్పడ్డాయి. సాయంత్రం వరకు చిన్నచిన్న సమస్యలను అధిగమించి రాత్రి 7.30గంటల ప్రాంతంలో మొదటి టర్బయిన్‌లో 18 నిమిషాల పాటు ట్రయల్న్‌న్రు విజయవంతంగా చేపట్టారు. దీంతో జెన్కో అధికారులు, కార్మికులు ఆనందాల్లో మునిగితేలారు. ఈ ప్రక్రియను జెన్కో మాజీ డెరైక్టర్ ఆదిశేషుల బృందం పర్యవేక్షించింది. అనంతరం జెన్కో సీఈ(హెచ్పీసీ) రత్నాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో అనుకున్న సమయానికే పనులు పూర్తిచేశామని వివరించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సన్నాహక పరీక్షలు గురువారం రాత్రితో విజయవంతమయ్యాయని చెప్పారు. మరో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో చిన్నపాటి సాంకేతిక సమస్యలను అధిగమించి మొదటి యూనిట్‌ను రన్ చేస్తామని, మరో పదిరోజుల్లోపు రెండవ యూనిట్‌ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దిగువ జూరాలలో ఇదివరకే 294మీటర్ల మేర నీటిని నిల్వఉంచామన్నారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ సన్నాహక పరీక్షల్లో 18నిమిషాల పాటు మొదటి యూనిట్‌ను రన్ చేసినట్లు వెల్లడించారు. అనుకున్న ప్రకారం త్వరలోనే దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేపడతామన్నారు. అంతకుముందు పవర్‌హౌజ్, వీయర్స్ను సందర్శించారు. జనవరి కల్లా 240మెగావాట్ల విద్యుదుత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీఈ సివిల్ సూర్యలక్షి్ష్మ, ఎలక్ట్రికల్ ఎస్ఈ శ్రీనివాస్, ఎస్సీ సివిల్ శ్రీనివాస్, ఈఈలు రమణమూర్తి, రామభద్రరాజు, డీఈ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణరెడ్డి, రూపేష్, పవన్‌కుమార్, ఆనంద్, శ్రీనివాస్, సునిల్, వీఆర్స్క్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రయల్ రన్‌కు ‘మెట్రో’ రెడీ
సాక్షి, చెన్నై: నగరంలో ట్రయల్ రన్‌కు మెట్రో రైలు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ప్రయోగాత్మకంగా రైలును నడపనున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇంజిన్‌తో కూడిన నాలుగు బోగీలతో కూడిన రైలును పట్టాలు ఎక్కించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును రూ.15 వేల కోట్లతో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదాపేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కిలోమీటర్లు ఒక మార్గం, సెంట్రల్ నుంచి కోయంబేడు మీదుగా సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కిలోమీటర్లు మరో మార్గంలో ఈ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెంట్రల్ - కోయంబేడు - సెయింట్ థామస్ మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తయింది. ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. భూగర్భ మార్గం పనులు జరుగుతున్నాయి. మరో మార్గంలో వంతెన, భూగర్భ మార్గం పనులు వేగం పుంజుకున్నాయి. ముగింపు దశలో పనులు: కోయంబేడు నుంచి మౌంట్ వరకు దాదాపు నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయి. విద్యుద్దీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్‌లో ఈ మార్గం లో రైలు నడపాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో కొంతదూరం ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని హంగులతో సిద్ధమైన నాలుగు బోగీలతో కూడిన రైలును కోయంబేడు వద్ద పట్టాలు ఎక్కించారు. ఆ రైలు పనితీరును, అందులోని యంత్రాలు, పరికరాలు, ఏసీ బోగీలోని పరికరాలు, వాటి ఉపయోగానికి సం బంధించిన పరిశీలనలో అధికారులు ఉన్నారు. విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఇత ర సాంకేతిక సంబంధిత పనులు చేస్తున్నారు. ఈ పనులు మరికొద్ది రోజుల్లో ముగియనుండడంతో కోయంబేడు మార్గంలో 850 మీటర్ల మేరకు తొలి విడతగా రైలును ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి నుంచి మూడు నెలలు ఆ మార్గంలో పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నామని, ఏప్రిల్‌లో ప్రయాణికులతో రైళ్లు పరుగులు తీస్తాయని ఆ ప్రాజెక్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. సెంట్రల్ - కోయంబేడు- మౌంట్ మార్గం, తిరువొత్తియూరు - సైదాపేట మీదుగా మీనంబాక్కం మార్గంలో 42 రైళ్లను నడపాలన్న నిర్ణయంతో పనులు వేగవంతం చేశామన్నారు. మరికొద్ది రోజుల్లో రెండు, మూడో రైలు బ్రెజిల్ నుంచి చెన్నైకు రానున్నాయని వివరించారు. రైలు రెడీ: బ్రెజిల్లో రూపుదిద్దుకున్న నాలుగు బోగీలతో కూడిన మెట్రో రైలును ఇటీవల చెన్నైకు తీసుకొచ్చారు. ఒక్కో బోగీలో కిటికీలకు ఇరు వైపులా ప్రయాణికులు కూర్చునేందుకు సీట్లు ఏర్పాటుచేశారు. మధ్య భాగంలో నిలబడే వారి కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించారు. వికలాంగులు, వృద్ధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రైలును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నగర శివారులోని పారిశ్రామికవాడలో కొద్ది రోజులు ఉంచారు. ప్రస్తుతం అన్ని హంగులతో రైలు సిద్ధమైంది. కోయంబేడు వద్ద పట్టాలెక్కిన మెట్రో రైలును చూడ్డానికి జనం తీవ్ర యత్నాలు చేస్తున్నా, దరిదాపుల్లోకి ఎవర్నీ రానివ్వకుండా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి
తిరుమల: తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు. కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది.