నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు | Will be sworn in today | Sakshi
Sakshi News home page

నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు

Published Sun, Jun 8 2014 12:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు - Sakshi

నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు.

  • అష్ట దిగ్బంధంలో విజయవాడ
  •  అధికారుల ట్రయల్ రన్
  •  తరలిరానున్న ప్రముఖులు
  • నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు రానుండటంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
     
    సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో విజయవాడలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్, ఐదుగురు ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, 15 మంది కేంద్ర మంత్రులు వస్తారని అంచనా.

    వీరంతా గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఏఎన్‌యూ ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా కనకదుర్గ వారధి మీదుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
     
    హోటళ్లు అన్నీ హౌస్‌పుల్!

    విజయవాడ నగరంలో సుమారు 100 హోటళ్ల వరకు ఉండగా వాటిని ఇటు అధికారులు, అటు తెలుగుదేశం నాయకులు బుకింగ్ చేశారు. దీంతో సాధారణ యాత్రికులు నానా ఇబ్బందులు పడ్డారు. హోటళ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

    నగరంలోనూ ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  గన్నవరం విమానాశ్రయం నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరానికి వీఐపీలు, అధికారులు తాకిడి ఎక్కువ కావడంతో దుర్గగుడిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచే రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement