Nagarjuna University
-
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్, నాయకుడు పి.రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో విజయసాయిరెడ్డి
-
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్‌యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్‌రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్‌యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్‌యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్‌యూ -
నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం
ఏఎన్‌యూ: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకు ఉందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ సందేశం ఇస్తూ మానవాళి ప్రయోజనాలు పరిరక్షించే నూతన ఆవిష్కరణలకు యువత కృషిచేయాలని సూచించారు. చదువు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైతికత, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు. యువత నేర్చుకునే సాంకేతిక, నైపుణ్యం కేవలం తమ సొంతానికి మాత్రమే కాకుండా సమాజ హితం కోసం వాడాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సంక్షోభాలకు పరిష్కారం చూపే వైవిధ్యభరితమైన ఆవిష్కరణలు చేయడంతోపాటు వాటి ద్వారా అపారమైన అవకాశాలు సృష్టించాలని సూచించారు. ప్రపంచానికి స్టార్టప్ హబ్‌గా భారత్ నిలిచిందని, ఇది మంచి పరిణామమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే నిరుద్యోగంతోపాటు అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం నుంచి బయోటెక్నాలజీ వరకు ప్రతి అంశం మానవాళికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఏఎన్‌యూ అభివృద్ధి నివేదికను సమర్పించారు. అనంతరం ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. పలువురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందించారు. అడిషనల్ డీజీ రవిశంకర్‌కు డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు డాక్టరేట్ పట్టాను గవర్నర్, వీసీ అందించారు. ఏఎన్‌యూ కామర్స్ విభాగంలో ఆచార్య జీఎన్ బ్రహా్మనందం పర్యవేక్షణలో రవిశంకర్ అయ్యన్నార్ పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఏపీ : సాయినాథ్ వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యలపై తాను 2001–2002 కాలంలో అధ్యయనం చేశానని చెప్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీ సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి నిశితంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. ఆ సేవలకు దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్‌ను భావిస్తానని సాయినాథ్ తెలిపారు. -
నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీహెచ్డీ స్కాలర్స్‌కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ నజీర్ ప్రదానం చేశారు. -
నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
మరోసారి తన తీరుతో వార్తలో నిలిచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బుధవారం(మార్చి 15న) గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్‌కు వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చదవండి: క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ? అదే విధంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ ఏం లేకపోతే ఎలా.. అందుకే ఆ చాన్స్ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా’ అన్నాడు. ఒకవేళ స్వర్గంలో రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఇక తాను చనిపోయిన తర్వాత ప్రపంచమంత మరో క్షణంలో అంతమైన తాను లెక్కయనన్నాడు. ఎందుకంటే తాను కేవలం తన కోసమే బ్రతుకుతానన్నాడు. మీ భవిష్యత్తు ఏంటీ? మీరు ఎంత బాగా చదువుతున్నారనేది తాను కేర్ కూడా చేయనన్నాడు. చదవండి: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే తనకు మోక్షం కలుగుతుందంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో వర్మ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక వర్మ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న మహిళా లెక్చరర్లు షాక్ అయ్యారు. అయితే ఆర్జీవీ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అంతా గట్టి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయారు. -
ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలి: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు జిల్లా: దిశా యాప్‌తో మహిళలకు భద్రత, భరోసా వచ్చిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రతీ మహిళ దిశా యాప్‌ను వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనను చూసి ఏపీలో దిశ చట్టం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఆమె అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆడ పిల్లలను గౌరవించాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశిష్ట పురస్కారం అందుకోవడం తన అదృష్టమని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని మంత్రి రోజా అన్నారు. ‘‘నేను ఎంచుకున్న రెండు రంగాలు సవాళ్లతో కూడుకున్నవి. పురుషాధిక్యత ఉన్న ఈ రంగాల్లో రాణించేందుకు నా తండ్రి, సోదరులు, భర్త అండగా నిలిచారు. నాకు తోడబుట్టకపోయినా నేనున్నానని భరోసా కల్పించిన అన్న సీఎం జగన్. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు సక్సెస్ వచ్చి తీరుతుంది. చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లంటే చిన్నచూపు ఉంటుంది. మగ పిల్లాడిని ఒకలా.. ఆడ పిల్లను మరోలా చూస్తారు. ఇల్లు, బడి, ఉద్యోగం అన్ని చోట్లా మహిళలను గౌరవించాలి’’ అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
నాగార్జున వర్సిటీకి ప్రతిష్ఠాత్మక యూఐ గ్రీన్ మెట్రిక్ అవార్డు
-
ఏఎన్‌యూకి హరిత వర్సిటీ ర్యాంకు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్‌యూ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్‌యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్‌యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్‌యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్‌ను అభినందించారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
సీఎం జగన్ గుండె ధైర్యం ఎంతో గొప్పది
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుండె ధైర్యం ఎంతో గొప్పదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రశంసించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఎస్ఆర్ఏ) ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రోజులపాటు జరిగిన ఏపీ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఏఎన్‌యూలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవీందర్‌రెడ్డి ప్రసంగిస్తూ భూములు రీ సర్వే చేయించాలంటే ఆ ముఖ్యమంత్రికి ఎంతో దమ్ముండాలని చెప్పారు. ఏపీలో భూముల రీ సర్వే ప్రారంభించిన సీఎం ఎంతో ధైర్యవంతుడన్నారు. రెవెన్యూకి సంబంధించిన సంస్కరణలు, సేవల్లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోందని, ఎన్నో అంశాలలో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.గౌతంకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూకి పూర్వవైభవం తెచ్చిన మహోన్నత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు, పాలకులు రెవెన్యూని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టినా.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కొత్త ఉద్యోగాలు కల్పించడం, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వంటి ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూకి జీవం పోశారని చెప్పారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రెవెన్యూలో ఆదర్శవంతమైన సంస్కరణలు తెస్తున్నారని ప్రశంసించారు. -
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్‌తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్‌గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
బయటి ప్రపంచాన్ని చూడండి
సాక్షి, అమరావతి: విద్యార్థులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచాన్ని చూడాలని.. సామాజిక ఉద్యమాల్లో సైతం పాలుపంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పిలుపునిచ్చారు. తామంతా కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అలాంటి ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. గతంలో విశ్వ విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలపై చర్చలు జరిపే వారని, ఇప్పుడు అలాంటి సమావేశాలేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే అసలైన సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా బోధన ఉండాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ తదితరుల సమక్షంలో జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ చేతుల మీద గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు భిన్నత్వానికి చిరునామాలని, తాను చదివిన విశ్వవిద్యాలయం నుంచే ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాముఖ్యతను కోల్పోతుండటం భయం కలిగిస్తోందని చెప్పారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యా సంస్థలు పాఠాలు నేర్పే ఫ్యాక్టరీలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఎవరిని, ఎందుకు నిందించాలో అర్థం కావడం లేదని, విద్యార్థులు సామాజిక సంబంధాలపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని సూచించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అనేక సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం చూపగలమని తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చని స్పష్టం చేశారు. సీజేఐ ఇంకా ఏమన్నారంటే.. పాఠాలొక్కటే ప్రధానం కాదు ► విద్యాలయాలు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల ఆలోచనలకు, ఆశయాలకు పరిచయ వేదికలుగా ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి గత నాలుగు దశాబ్దాల్లో వివిధ కోర్సులు అందించే 450 అనుబంధ కాలేజీలు ఏర్పడ్డాయి. ► మన దేశంలో వృత్తి విద్య విషయానికొస్తే.. ఎక్కువ జీతాలు, లాభదాయకమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు వచ్చే కోర్సులనే బోధిస్తున్నారు. హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, చరిత్ర, అర్థశాస్త్రం, భాషలు తదితర కోర్సులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రొఫెషనల్ యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదిలో పాఠాలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప, బయట ప్రపంచాన్ని చూడటం లేదు. ► అసలు విద్య ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వ్యక్తి కోసమా? సమాజం కోసమా? వాస్తవానికి ఈ రెండూ ముఖ్యమైనవే. విద్య ద్వారా వ్యక్తులు దార్శనికులుగా, నాయకులుగా మారుతారు. ఇదే సమయంలో విద్య మనల్ని సమాజ అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. నా మూలాలు మర్చిపోలేదు.. ► నాలుగు దశాబ్దాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చెట్ల కింద, క్యాంటీన్, డైనింగ్ హాల్లో మా ఆలోచనలు, సిద్ధాంతాలు, రాజకీయాలు, సమాజ సమస్యలపై చర్చించే వాళ్లం. ఆ చర్చలు, మా క్రియాశీలత ప్రపంచం పట్ల మా అభిప్రాయాలను మార్చాయి. ► అప్పట్లో ఈ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉండేవి. వాటిపై వర్సిటీ ఉద్యోగ సంఘం పోరాడేది. వారి వల్లే నేను అప్పట్లో ఈ వర్సిటీలో చేరాను. ఓ వ్యక్తి గొంతుక, అభిప్రాయాల తాలుక విలువ అప్పుడు మాకు తెలిసింది. ఈ రోజుకీ నేను నా మూలాలను మర్చిపోలేదు. ► మన విద్యా వ్యవస్థ రూపాంతరీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక సంబంధాలు, పౌర హక్కుల విలువలను నేర్పించేలా విద్యా వ్యవస్థ ఉండాలి. ఆర్థిక పురోగతి లక్ష్య సాధనలో మన సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతలను విస్మరించకూడదు. మమ్మల్ని దాటి ఆలోచించండి. సామాజిక అవసరాల పట్ల స్పృహ కలిగి ఉండండి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విద్యా శాఖ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలలను సాకారం చేసుకోండి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకునేంత వరకు వాటిని వెంటాడాలి. ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపొద్దు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జ్ఞాన కేంద్రాలుగా భాసిలుతున్నాయి. మన జీవితంలో చూస్తున్న చాలా ఆవిష్కరణలు యూనివర్సిటీల్లోనే పుట్టాయి. పరిశోధన, బోధన సమాంతరంగా సాగినప్పుడే విశ్వవిద్యాలయాలు విజయం సాధించగలుగుతాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ పోటీని తట్టుకునేలా విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. కార్యదీక్షతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని ఆయన నిరూపించారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
గుంటూరు (వేమూరు) నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని గోవాడకు చెందిన కనపర్తి దినేష్ ఈనెల 9న వైఎస్సార్ సీపీ ప్లీనరీకి వెళ్లి వస్తూ నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పార్టీ తరఫున వలంటీర్ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం.. మంత్రి మేరుగ నాగార్జున బుధవారం సాయం అందించారు. జగనన్న బీమా పథకం ద్వారా కూడా లబ్ధి వచ్చేటట్టు చూస్తామన్నారు. దినేష్ తల్లిదండ్రులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ గ్రాండ్ సక్సెస్
-
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
తుది దశకు వైఎస్సార్సీపీ ప్లీనరీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017 జూలై 8, 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే.. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేస్తోంది. ప్లీనరీకి ప్రతినిధులను ఆహ్వానించడం దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ 20 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 20 కమిటీలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, హోం మంత్రి తానేటి వనతి, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐటీ త్రివిక్రమ వర్మతో కలిసి బందోబస్తును, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ప్రతి ఊరికీ ప్రాతినిధ్యం ప్రతి ఊరికీ ప్లీనరీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ శ్రేణులకు వైఎస్సార్సీపీ ఆహ్వానాలు పంపింది. గ్రామ, వార్డు సభ్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్లీనరీకి ఆహ్వానిస్తూ పేరు పేరునా సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. తమను ప్లీనరీకి ఆహ్వానిస్తూ సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విస్తృతంగా శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి చూసినా స్పష్టంగా కన్పించేలా వంద అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 మీటర్ల ఎత్తుతో అత్యంత భారీ వేదిక నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారీ వర్షం కురిసినా ఏ ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ నిర్మించారు. టిఫిన్లు, భోజనాల తయారీ కోసం భారీ ఎత్తున వంట శాలల ఏర్పాట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కసారి ఎనిమిది వేల మందికిపైగా టిఫిన్లు, భోజనాలు చేయడానికి వీలుగా భారీ టెంట్‌ను నిర్మించారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో సమాధి వద్ద మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ► ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భాంచాక తొలి సారిగా 2011 జూలై 8–9న ఇడుపులపాయలో ప్లీనరీ నిర్వహించింది. 2017 జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించి ప్రజలకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అదే వేదికపై నుంచి చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రకటించారు. ► ప్లీనరీ వేదికగా ఇచ్చిన భరోసాకు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చాక ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారు. మూడేళ్లలో ఏ దశలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఘన విజయాలు కట్టబెట్టారు. ప్రజల జీవన ప్రమాణాల్లో పెను మార్పులు ► రెండో ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడం వల్ల ఈ మూడేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటాన్ని మదింపు చేసి.. ప్లీనరీలో వివరించనున్నారు. ► విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, పారిశ్రామికాభివృద్ధి–ఉపాధి కల్పనకు చేపట్టిన చర్యలు, సామాజిక న్యాయం–సాధికారత, మహిళా సాధికారత–భద్రతలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా తీసుకున్న చర్యలు, నవరత్నాలు–డీబీటీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన తీరుపై చర్చించనున్నారు. ► ప్రజలు మెచ్చేలా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కూడిన దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పిలుపునివ్వనున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
YSRCP Plenary 2022: ప్రజాభ్యుదయమే అజెండా
సాక్షి, అమరావతి: గతాన్ని మననం చేసుకుని.. వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడమే అజెండాగా ప్లీనరీ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. పార్టీ ఆవిర్భవించాక 2011, జూలై 8, 9న ఇడుపులపాయలో నిర్వహించిన తొలి ప్లీనరీ.. 2017, జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన రెండో ప్లీనరీలోనూ ప్రజాభ్యుదయమే అజెండాగా చేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చాక నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేవరకూ సుమారు పదేళ్లపాటు దేశ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, అటుపోట్లు, దాడులను వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొంది. ప్రజల తరఫున నిలబడి పోరాడింది. ప్రజల హృదయాలను గెలుచుకుని 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదేళ్ల పోరాటంలో ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతం అమలుచేసింది. ప్రజాభ్యుదయం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ప్లీనరీలో ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ముడిపడిన విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం–సామాజిక సాధికారత, మహిళా సాధికారత–రక్షణ, నవరత్నాలు–డీబీటీలు, పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పనపై చర్చించి.. వాటిని మరింత మెరుగ్గా అమలుచేయడంపై తీర్మానాలు చేయనున్నారు. జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించి పేదరికం నుంచి ప్రజలను గటెక్కించడం.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికార, సామాజిక సాధికారత సాధించడం ద్వారా రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలపడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడేళ్లలో పలు రంగాల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా.. విద్యారంగం.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆధునీకరించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన, గోరుముద్ద, నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంలో రూ.52,676.98 కోట్లను ఖర్చుచేశారు. ప్రపంచ విద్యార్థులతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటా రూ.24 వేల వరకు ఖర్చయ్యే.. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేయనుంది. వైద్యరంగం.. ప్రజలకు వైద్య సేవలను మెరుగ్గా అందించడానికి ప్రభుత్వాస్పత్రులను కూడా నాడు–నేడు కింద సీఎం వైఎస్ జగన్ ఆధునీకరిస్తున్నారు. వీటిల్లో 40,180 ఉద్యోగాలను భర్తీచేసి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఓ వైద్య కళాశాల ఏర్పాటుచేయాలనే లక్ష్యంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయం.. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు తోడునీడగా నిలవడం ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఉచితంగా పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ.. అధిక దిగుబడులు సాధించడానికి బాటలు వేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. పంటల బీమా కింద రైతులకు పరిహారం అందిస్తూ పంట పండినా.. ఎండినా.. తడిసినా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టారు. సామాజిక న్యాయం–సాధికారత.. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం చేయడం ద్వారా ఆ వర్గాలు సాధికారత సాధించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. తొలిసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి, సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. అలాగే, దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ అమలుచేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశమిచ్చారు. శాసనమండలి చైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి.. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు ఇచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే సింహభాగం అవకాశమిచ్చి.. సామాజిక న్యాయం, సాధికారతలో వైఎస్ జగన్ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచారు. మహిళా సాధికారత–రక్షణ.. మహిళా సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నావడ్డీ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. తొలి కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో నలుగురికి అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారు. ఇక 30.56 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను మహిళల పేర్లతోనే ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పన.. పారిశ్రామికరంగ ప్రోత్సాహకానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, పర్యావరణ హిత గ్రీన్ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వారు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రిస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలతో కలిపి రూ.2,086 కోట్లు వరుసగా రెండేళ్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది కూడా ఆగస్టులో చెల్లించనున్నట్లు సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో.. పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రాంరంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశలో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.126 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది. చరిత్ర మెచ్చేలా మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,21,518 మందికి ప్రభుత్వ కొలువులిచ్చి సొంత ఊరిలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించింది. నవరత్నాలు–డీబీటీ.. పేదరికం నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నవరత్నాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా మూడేళ్లలో రూ.1,41,247.94 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.43,682.65 కోట్లను పేదల కోసం ఖర్చుచేశారు. దుష్టచుతుష్టంపై సమరభేరి ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా.. సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే అధిక మెజార్టీ వైఎస్సార్సీపీకి రావడమే అందుకు తార్కాణం. ఇది చూసి ఓర్వలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మూకుమ్మడిగా అవాస్తవాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఈ దుష్టచతుష్టయంపై యుద్ధంచేసి.. దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా పిలుపునివ్వనున్నారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా లక్షలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి వేలాది వాహనాల్లో శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ముఖ్యమంత్రి అధికారిక విధులు నిర్వర్తించడానికి వేదిక వెనుకవైపు తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ వంటకాలతో విందు ప్లీనరీకి హాజరయ్యే లక్షలాది పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సంప్రదాయ వంటకాలతో జూలై 8, 9న టిఫిన్, విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల బాధ్యతను దేశంలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాఇందుపల్లి వాసులకు అప్పగించారు. దీనికి సమీపంలోనే విశాలమైన భోజనశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ వేడి వేడిగా ఫలహారాలు, కాఫీలు, భోజనాలు వడ్డిస్తారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7 నాటికి ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని రఘురాం చెప్పారు. -
పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ.. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ సిమ్యులేటర్ ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్లు టార్గెట్ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీడీఎంఏ ట్రాన్స్ రిసీవర్ ఈ ప్రాజెక్టును డీఆర్డీఓ (డిఫెన్స్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్ చేయకుండా ఈ రిసీవర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. శాటిలైట్ డేటా ఎనాలసిస్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్ సిమ్యులేటర్ అనే ప్రత్యేక లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్‌యూలోనే అందుబాటులో ఉంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలో రూ.5 కోట్ల వ్యయంతో త్రీడీ ఆటోమేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్‌యూ రాష్ట్ర స్థాయి నోడల్ సెంటర్‌గా కూడా కొనసాగుతోంది. వీఎల్‌ఎస్‌ఐలో పేటెంట్ స్థాయి పరిశోధనలు ఇంజినీరింగ్ కళాశాలలోని వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌లెన్సీ సెంటర్)ను ఇన్టెల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో ఏఎన్‌యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్ కూడా లభించింది. ఈ సెంటర్‌కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్, పరికరాలను ఓ కంప్యూటర్ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది. -
ఏఎన్‌యూలో ఉర్దూ ప్రత్యేక విభాగం ఏర్పాటు
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేలు బాటలు వేస్తోంది. మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తించింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉర్దూ కోర్సు విభాగం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి మరో ముందడుగు వేసింది. అంతేగాకుండా అరబిక్ కోర్సును ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్‌యూ(గుంటూరు): ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం, యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. ముస్లిం యువతీయువకులు అధికంగా అరబిక్, ఉర్దూ భాషల్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అరబిక్, ఉర్దూ భాషల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ప్రత్యేకంగా విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ముస్లిం యువతీయువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు చేపడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. పదేళ్లుగా ముస్లిం సంఘాలు వినతి రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం ముస్లిం వర్గాల వినతులను పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంఘాల వినతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కలిసి విన్నవించుకోగా ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్‌యూ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూలో ఉర్దూ కోర్సు నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా కార్యాచరణ పూర్తి చేసింది. పరిశీలనలో అరబిక్ కోర్సు వినతులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేసి అరబిక్ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను విన్నవించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చింది రాష్ట్రంలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉర్దూ, అరబిక్ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రంలో ఈ కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల ముస్లిం యువతీయువకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. – డాక్టర్ మస్తాన్ ఆలీ, ముస్లిం సంఘాల జేఏసీ సభ్యుడు ముస్లిం సంఘాల హర్షం ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ప్రారంభించడం, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అరబిక్ విభాగ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, ఉర్దూ భాషను ఐచ్చిక ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మదరసాలలో ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థులతోపాటు, అరబిక్, ఉర్దూ బోధకులుగా స్థిరపడాలనుకునే వారికి, ధార్మిక పండితులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా
సాక్షి, ఏఎన్‌యూ: జన క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్ సీపీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఆ పార్టీ యువతరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు నాందిపలికింది. నిరుద్యోగులతోపాటు కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో పలు రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారికి అవకాశాలను చేరువచేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది. భారీ స్పందన ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి 90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాబ్‌మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్ అడ్రస్‌కు రెజ్యూమ్ పంపవచ్చు. కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్‌యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జాబ్‌మేళా నిర్వహణకు ఏఎన్‌యూలోని డాక్టర్ వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్ బ్లాక్ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్మీడియెట్ చదివిన వారికి ఒక బ్లాక్‌లోనూ, డిగ్రీ, పీజీ కోర్సులకు మరో భవనంలోనూ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల వారికి ఇంకో భవనంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీనికోసం ఈ భవనాల్లోని 100కుపైగా గదులను ఇప్పటికే సిద్దం చేశారు. 500 మంది వలంటీర్ల నియామకం మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులకు సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్‌కు ఆన్లైన్ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు. చదవండి:‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’ విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. యువత కోసమే.. నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కారుమూరి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసమే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో విజయవంతం చేస్తాం... జాబ్‌మేళా ఏర్పాట్లకు సహకారం అందించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖలూ పూర్తి సహకారం అందిస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరి సహకారంతో జాబ్‌మేళాను విజయవంతం చేస్తాం. – ఎ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జాబ్‌మేళా పర్యవేక్షకులు -
అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తేనే సమాజాభివృద్ధి
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు చేయూతనందించి.. వారిని తీర్చిదిద్దితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సాంఘిక సంక్షేమ పథకాల అమలు’పై గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలు, తదితర అట్టడుగు వర్గాలు తమకు కావాల్సినవాటిని హక్కుగా అడిగేలా.. అవసరమైతే ప్రశ్నించేలా వారిని తీర్చిదిద్దినప్పుడే మెరుగైన సమాజం సాధ్యమన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా సాధించుకోలేని స్థితిలో తరతరాలుగా అట్టడుగు వర్గాలు అలక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సంక్షేమ ఫలాలు అందించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ మహాయజ్ఞాన్ని సీఎం జగన్ మరింత వేగంగా చేపట్టారని చెప్పారు. వైఎస్ ఆశయాలు, సీఎం వైఎస్ జగన్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా ఎస్సీలు అభివృద్ధి పథంలో నడిచేలా మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరైనా చనిపోతే ఆ ఖాళీలోనే కొత్త పెన్షన్ ఇచ్చేవారని సజ్జల గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోటా, వాటా అనే మాటలకు తావులేకుండా.. పరిమితి, కాలపరిమితి చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వానికి నిధుల అడ్డంకి లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎస్సీ కుటుంబం సగర్వంగా తలెత్తుకుని జీవించేలా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల స్థితిగతులను మార్చేందుకు సీఎం చేపడుతున్న కార్యక్రమాలను దేశంలో మరే రాష్ట్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, తదితరులు మాట్లాడారు. -
మే 1, 2 తేదీల్లో వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఏఎస్ఎన్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ జాబ్‌మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్‌యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు) -
గుంటూరు: 30న, మే 1న మెగా జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న, వచ్చే నెల 1న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడ్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
అన్నీ రంగాల్లో మహిళకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు
-
కోవిడ్ కారణంగా పరీక్షల వాయిదా కుదరదు
సాక్షి, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 20 నుంచి జరగాల్సిన బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను కోవిడ్ కారణంతో వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నాగార్జున వర్సిటీ బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా కోరుతూ ఒడిశా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఏవీ శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఒడిశా విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరవుతున్నారని, కోవిడ్ వల్ల రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ తరఫు న్యాయవాది కొప్పినీడు రాంబాబు వాదనలు వినిపిస్తూ.. పరీక్షల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తూ విశ్వవిద్యాలయం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ, కోవిడ్ మన జీవితాల్లో భాగమైపోయిందన్నారు. కోవిడ్‌ను కారణంగా చూపుతూ ఎంత కాలం వేచి చూడగలమని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు చేసినందున, పరీక్షల వాయిదా సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పరీక్షల వాయిదా కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. -
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్‌లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్‌ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ).. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–03, నాన్ టీచింగ్ పోస్టులు–04. ► టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్. అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్–01, నర్సు(ఏఎన్ఎం)–02, కౌన్సిలర్– 03, డేటాఎంట్రీ ఆపరేటర్–01, వార్డ్బాయ్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్(ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి. ► వయసు: 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021 ► వెబ్సైట్: ananthapuramu.ap.gov.in గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► పోస్టుల వివరాలు: వాచ్మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02. ► అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: spsnellore.ap.gov.in -
నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా
సాక్షి, గుంటూరు: ‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి’ అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ చరిత్రకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని నాగార్జున కొండ, అనుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా.. ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తోంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన సామాన్య శక పూర్వం (క్రీస్తు పూర్వం) 2వ శతాబ్దం నాటి బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శన శాలలో భద్రపరిచారు. ఇది ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శన శాలలు అన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల. బుద్ధునిదిగా చెప్పబడుతున్న దంతావశేషం ఇందులో చూడదగ్గవి. బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, స్థూపాలు కొండపై గల ఐలండ్ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని అనుపులో దర్శనమిస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు దేశ, విదేశాల బౌద్ధ ఆరాధకులు, పర్యాటకులతో ఈ ప్రాంతాలు కళకళలాడుతుండేవి. కరోనా వ్యాప్తి కారణంగా ఏడాది కాలంగా ఇక్కడ పర్యాటక శోభ తగ్గింది. 144 ఎకరాల విస్తీర్ణంలో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జున కొండ. ఈ కొండపై 1966లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలండ్ మ్యూజియం ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అనుపులో పదిలంగా ఉన్నాయి. విజయపురి సౌత్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని అనుపులో విశ్వవిద్యాలయం ఉంది. మహాయాన బౌద్ధమత ప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కృష్ణా నది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తాయి. విశ్వవిద్యాలయ ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు కృష్ణా నది లోయలో విద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు. రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్టు ఆధారాలున్నాయి. చరిత్రకారులు పాహియాన్, హ్యుయాన్‌త్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది. నాగార్జునుని మరణానంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్టు ఆధారాలున్నాయి. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, శ్రీలంక, మలేషియా, టిబెట్, భూటాన్, థాయ్‌లాండ్, బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ, అనుపు సందర్శనకు వస్తారు. ఆర్థికంగా నష్టపోయాం కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి పర్యాటకుల తాకిడి లేదు. దీంతో వ్యాపారాలు లేవు. ఆర్థికంగా చితికిపోయాం. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వాలు పర్యాటకంగా మా ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలి. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరచాలి. – వెంకట్రావు, హోటల్ నిర్వాహకుడు, విజయపురి సౌత్ -
‘అనంత’లో చూచిరాత బాగోతం..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘మీకు డిగ్రీ సర్టిఫికెట్ కావాలా! అయితే, మా సెంటర్లో చేరండి.. కచ్చితంగా పాస్’’ తరహా ప్రకటనలతో దూరవిద్య కేంద్రాలు డబ్బు పోగేసుకుంటున్నాయి. జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. సుమారు 3వేల మంది విద్యార్థుల వరకూ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే, పరీక్షల్లో పాస్ చేస్తామని ముందుగానే అడ్మిషన్లు తీసుకున్న సెంటర్లు .. పరీక్షల సమయంలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాపిస్తామంటూ అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేశారు. ఈ విధంగా వసూలు చేసి.. ఇందులో యూనివర్సిటీ అధికారులకు కూడా మామూళ్లు ఇచ్చి ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఎన్‌యూకు అనుబంధంగా అనంతపురంతో పాటు తాడిపత్రి, ధర్మవరం, పామిడిల్లో కేంద్రాలుండగా..ఆయా చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగానే ఆయా సెంటర్లలో ఎవరు కూడా నేరుగా రాకుండా గేట్లు వేసి మరీ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తున్నట్టు తెలిస్తే లోపల ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. తద్వారా ఆ సమయంలో కాపీయింగ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత యథావిధిగా తమ పని కానిస్తున్నారు. మొత్తంగా దూరవిద్య పేరుతో కొన్ని సెంటర్లు డబ్బుల దందాకు తెరలేపి చదువుకు మరీ విలువ లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.60 లక్షలకు పైమాటే.. జిల్లాలో మొత్తం 3వేల మంది వరకూ ఏఎన్‌యూ దూర విద్యకు హాజరువుతున్నారు. వీరికి కనీసం పుస్తకాలు కూడా సకాలంలో అందించలేదు. దీంతో పరీక్షకు ఎవ్వరూ సిద్ధమయ్యే పరిస్థితి లేదు. తీరా పరీక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షల్లో పాసు కావాలన్నా.. చూసి రాయలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇవ్వాలని సదరు దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరీక్షలు రాస్తున్న 3వేల మంది విద్యార్థులు కాస్తా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారు చూచి రాసేందుకు అనుమతించడం లేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా పక్కన కూర్చోబెట్టి చూసిరాసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 వేల మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున లెక్కిస్తే రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో యూనివర్సిటీ దూరవిద్య అధికారులకు కూడా భారీగానే ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పరిశీలకులు ఎక్కడ?.. వాస్తవానికి దూరవిద్య పరీక్షలు జరిగే సమయంలో సదరు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది పరిశీలకులుగా వస్తారు. పరీక్షలు జరిగే సమయంలో అక్కడే మకాం వేసి కట్టుదిట్టంగా పరీక్షలు జరిగేలా చూడాలి. అయితే, ఏఎన్‌యూ దూర విద్యలో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరిశీలకులు ఎక్కడా కనిపించని పరిస్థితి. కనీసం సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
పరీక్ష రాస్తుండగా పేపర్ లాగేశారు
ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది. మారని అధికారుల తీరు.. జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు. కనిపించని సమన్వయం.. జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్) 18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. – ఎఎన్యూ పరీక్షల విభాగం -
ఏబీకే ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశిష్ట కార్యక్రమానికి గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ చాన్స్‌లర్ హోదాలో హాజరయ్యారు.యూనివర్శిటీ డైక్మెన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వీసీ రాజశేఖర్, రిజిస్ట్రార్ రోశయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.180 మంది స్కాలర్స్‌కు వివిధ విభాగాల్లో డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశారు. పరిశోధన, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అద్భుత ప్రతిభ చూపిన 249 విద్యార్థులకు గవర్నర్ హరిచందన్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. -
ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?
సాక్షి, కృష్ణా : ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం శిథిలాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి వైభవాన్ని ఈ శిథిలాలు చాటిచెబుతున్నాయి. నాగార్జునసాగర్‌లోని విజయపురిసౌత్‌కు 8కిలోమీటర్ల దూరంలోని అనుపులో ఈ విశ్వ విద్యాలయం ఉంది. ప్రతి రోజూ నాగార్జున సాగర్‌కు వందలమంది సందర్శకులు వస్తున్నా ఈ ఆనవాళ్ల గురించి ఎవరికీ తెలియదు. కనీసం లాంచీ స్టేషన్ సమీపంలో నైనా దీనిగురించి వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం విచారకరం. సాగర్ నుంచి బెల్లంకొండవారిపాలెం మీదుగా మాచర్ల వైపునకు ఉన్న రహదారికి కిలోమీటరు దూరం లోపల ఈ ప్రదేశం ఉంది. ఇదే శ్రీపర్వత విహారంగా ప్రసిద్ధి పొందింది. ఈ విద్యాపీఠంలో ఆనాడు వివిధ దేశాల విద్యార్థులు విద్యనభ్యసించారు. మహాయాన బౌద్ధమత ప్రచారంలో ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భూమిక నిర్వహించింది. కృష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో ఈ విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. 1976కు ముందు ఈ పాత అనుపు నుంచే పర్యాటకశాఖ లాంచీ సర్వీసులు నాగార్జునకొండకు నడిపేవారు. దీంతో అనుపును పర్యాటకులు సందర్శించటానికి సౌకర్యంగా ఉండేది. ఆ తరువాత విజయపురిసౌత్(రైట్‌బ్యాంక్)కి లాంచీస్టేషన్‌ను మార్చటంతో పాత అనుపు వద్దకు పర్యాటకులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. దీంతో ఆ ప్రదేశం నిరాదరణకు గురైంది. దీనిని సందర్శించాలనే ఆపేక్ష ఉన్నా తగిన ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో సాగర్‌కు వచ్చిన పర్యాటకులు దీనిని చూడకుండానే వెళ్లిపోతున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు క్రీ.శ.3వ శతాబ్దంలో ఇక్కడ కృష్ణానదీ లోయలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ విహారం ఐదు అంతస్తులు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. బౌద్ధమతానికి చెందిన అనేక గ్రంథాలు రెండవ అంతస్తులో ఉండేవి. చైనా, జపాన్, శ్రీలంక, భూటాన్ తదితర వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించేవారు. ఇక్కడ రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ.7వ శతాబ్దంలో హ్యూయాన్‌స్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంత కాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర పుటలు చెబుతున్నాయి. నాగార్జునుడి మరణానంతరం కూడా ఈ విశ్వ విద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్లు ఆదారాలున్నాయి. ఇంత ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయం ఆనవాళ్లను సందర్శించేందుకు రవాణా సౌకర్యం లేకపోవటం విచారకరం. కనీసం శని, ఆదివారాల్లోనైనా మాచర్ల డిపో బస్సులను అనుపు ప్రాంతానికి నడిపితే పర్యాటకులు దీనిని సందర్శించటానికి వీలవుతుందని విహార యాత్రికులు కోరుతున్నారు. కనీసం టూరిజం పరిధిలో ఉన్న మినీ బస్సులనైనా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. -
రూసా నిధుల్లో చేతివాటం!
సాక్షి, ఏఎన్‌యూ(కృష్ణా) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూసా(రాష్ట్రీయ ఉచ్చాతర్ శిక్షా అభియాన్) పథకం కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మంజూరైన నిధుల వినియోగంలో గందరగోళం నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని, అన్న(మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు) అండదండలను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వర్సిటీ లైబ్రేరియన్ కోడెల వెంకటరావు రూసా పథకం కింద పుస్తకాలు కొనుగోలు విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూసా నిధుల కింద పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు సమర్పించిన బిల్లులకు చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండగా, వీటిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా ఈ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పుస్తకాల కొనుగోలుపై అభ్యంతరాలు: రూసా పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు నిధుల కోసం ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లో రూ.18 లక్షలు పుస్తకాల కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపారు. రూసా నుంచి ఏఎన్‌యూకి 2018లో ఈ నిధులు వచ్చాయి. దీంతో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదించిన రూ.18 లక్షల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో ప్రతిపాదిత సంవత్సరాల్లో తాను రూ.11.90 లక్షలకు పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు వర్సిటీకి బిల్లులు సమర్పించారు. బిల్లులు పరిశీలించిన రూసా అధికారులు పుస్తకాలు అవసరమంటూ విభాగాధిపతులు, సబ్జెక్ట్ ఎక్స్‌ఫర్ట్స్, అధ్యాపకులు, బీఓఎస్ చైర్మన్లు, విద్యార్థులు ఎవరైనా కోరినట్లు లేఖలు ఉండాలని, ఎవరూ కోరకుండా ఎలా పుస్తకాలు కొనుగోలు చేశారో స్పష్టం చేయాలని కోరినట్లు సమాచారం. చెల్లింపులపై ఒత్తిడి పుస్తకాల కొనుగోలుకు సమర్పించిన రూ.11.90 లక్షల బిల్లులకు రూసా నిధుల నుంచి చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులు చేయాలంటూ ఉన్నతాధికారులు సంబంధిత ఫైలుపై లిఖిత పూర్వకంగా రాస్తే తమకు అభ్యంతరం లేదని కూడా రూసా అధికారులు పేర్కొన్నారు. ఏ విధంగానైనా పని జరగాలని చూసిన కొందరు అధికారులు రూసాకు ప్రతిపాదనలు పంపిన సంవత్సరాలకు గాను పుస్తకాల కొనుగోలుకు దాదాపు రూ.7 లక్షలకు యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లింపులు చేశామని, ఈ మొత్తాన్ని రూసా ఫండ్ నుంచి యూనివర్సిటీ జనరల్ ఫండ్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎకౌంట్స్ విభాగం కోరినట్లు తెలిసింది. తీరా ఆ బిల్లులను పరిశీలిస్తే వాటిలో రూ.3 లక్షలు పుస్తకాల బైండింగ్‌కు చెల్లింపులు చేశామని పేర్కొన్నట్లు సమాచారం. ఏఎన్‌యూ లైబ్రరీలో బైడింగ్ విభాగం, దానిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండగా, బయట వ్యక్తులతో బైండింగ్ చేయించినట్లు బిల్లులు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కొన్ని పుస్తకాలకు 28 శాతం వరకు డిస్కౌంట్, కొన్ని పుస్తకాలకు 20 వరకు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణాలతోనే చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. కోడెల తీరుపై విమర్శలు లైబ్రరీకి పుస్తకాల కొనుగోలు విషయంలో లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తకాల కొనుగోలు చేయాలని కొందరు కోరారని చెబుతూ తన సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు అధ్యాపకులు, తనకు అనుకూలంగా నడుచుకునే ఓ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి లేఖలు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ ఆంజనేయులును వివరణ కోరగా, రూసా నిధుల పుస్తకాల కొనుగోలు బిల్లుల చెల్లింపు విషయం కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. బిల్లులపై ఆరోపణల విషయం తనకు తెలియదని తెలిపారు. చెల్లింపులు చేయమని ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా ఆదేశాలిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని వివరించారు. -
క్యాంపస్ కోడెల అధికార దుర్వినియోగం
సాక్షి, ఏఎన్‌యూ(గుంటూరు) : గౌరవ ప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన బంధువుగా చెప్పుకునే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు యూనివర్సిటీలో అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడ్డారనే అంశం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు రాష్ట్రంలో చక్రం తిప్పారు. కే–ట్యాక్స్‌ల పేరుతో అమాయక జనాన్ని పట్టిపీడించారు. పశువుల గడ్డి నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ వరకూ దేన్ని వదలకుండా దోచేశారు. అన్న కుటుంబం రాష్ట్రంలో దోచేస్తోంది. నేనెందుకు ఊరికే ఉండాలి అనుకున్నాడే ఏమో మరి ఏఎన్‌యూలోని లైబ్రేరియన్ కోడెల వెంకట్రావు. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. విలువలు, సిద్ధాంతాల్లో సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన యూనివర్సిటీని సొంత సామ్రాజ్యంలా మార్చుకుని పలు అక్రమాలకు తెరతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా.. యూనివర్సిటీలో లైబ్రేరియన్ అయిన కోడెల వెంకట్రావు కోడెల శివప్రసాదరావుకు వరుసకు తమ్ముడు. ఈయన యూనివర్సిటీలో పలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు యూనివర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం, మాజీ స్పీకర్ కోడెల నుంచి పూర్తి సహకారం అందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లైబ్రేరియన్ల డిజిగ్నేషన్స్ను ప్రొఫెసర్‌గా మార్చుతూ రీ డిజిగ్నేషన్స్ కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడెలకు ప్రొఫెసర్‌గా రీ డిజిగ్నేషన్ కల్పిస్తూ 2011లో అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఆయన వేతనం, సర్వీస్ కండీషన్స్‌లో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొన్నారు. కాని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పాలకమండలి(ఈసీ)లో యూనివర్సిటీ టీచర్ల కోటాలో కోడెలను సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. టీచర్ కాని వ్యక్తిని టీచర్ల కోటాలో ఈసీ మెంబర్‌గా నియమించడంపై అప్పట్లో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డాక్టర్ కోడెల వెంకటరావు అధ్యాపకుడా కాదా అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతుంటే మూడున్నరేళ్ల కిందట ఆయనకు అధ్యాపకుడి కోటాలో ఈసీ సభ్యత్వం ఇవ్వడం, అప్పటి యూనివర్సిటీ పాలకులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. ఈ అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగానే మిగిలింది. ఎప్పుడో మూసేసిన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని తాను ఈసీ మెంబర్‌గా నియమితుడైన తర్వాత 2017లో మరలా ప్రారంభించేందుకు పాలకమండలిలో ఆమోదింపజేసుకున్నాడు. తాను అధ్యాపకుడిని అనిపించుకునేందుకే ఆయన లైబ్రరీ సైన్స్ విభాగాన్ని ప్రారంభించాడనే విమర్శలూ ఉన్నాయి. సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్‌గా.. పాలకమండలి సభ్యుడిగా చక్రం తిప్పి ఎంఎల్ఐఎస్సీ విభాగానికి అనుమతి తెచ్చుకున్న డాక్టర్ కోడెల వెంకటరావు ఆ విభాగానికి మూడేళ్లకు పైగా సెల్ఫ్ డిక్లేర్డ్ హెడ్(స్వయం ప్రకటిత విభాగాధిపతి)గా చక్రం తిప్పాడు. ఏ విభాగంలోనైనా రెగ్యులర్ అధ్యాపకుడు మాత్రమే ఆ విభాగానికి అధిపతిగా వ్యవహరించే నిబంధనలు ఉన్నాయి. కాని లైబ్రేరియన్న్డాక్టర్ కోడెల ఎంఎల్ఐఎస్సీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి అధ్యాపకుడు)గా పనిచేస్తూ రెమ్యునరేషన్ తీసుకుంటూ అదే విభాగానికి హెడ్‌గా వ్యవహరించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రెగ్యులర్ అధ్యాపకులు లేని విభాగానికి సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను విభాగాధిపతిగా నియమించాల్సిన ఉన్నతాధికారులు ఏ విధమైన ఉత్తర్వులు లేకుండానే ఆ విభాగాన్ని పాలించుకోమన్నట్లు అప్పజెప్పారు. దీంతో ఎంఎల్ఐఎస్సీలో అతిథి అధ్యాపకుల నియామకంలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. నేటికీ అదే తీరు.. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల వెంకట్రావు చేసిన అధికార దుర్వినియోగానికి టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అండదండలు అందించిందని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు మాత్రం నేటికీ ఆయనకు పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నారని విమర్శలూ ఉన్నాయి. కేవలం ప్రొఫెసర్ హోదా మాత్రమే ఉన్న ఈయనకు సర్వీస్ విషయాల్లో ఎలాంటి మార్పు ఉండదని, నిబంధనల్లో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం, రీ డిజిగ్నేషన్స్ తర్వాత కూడా అధ్యాపకేతర ఉద్యోగులు తీసుకునే సరెండర్ లీవ్స్‌ను ఎన్‌క్యాష్ మెంట్ చేసుకోవడం వంటివి జరిగినా న్యాయస్థానాల్లో వాటిని యూనివర్సిటీ బలంగా చూపడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. కోడెల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఇప్పటికే కొందరు లోకాయుక్తను ఆశ్రయించగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దీనిపై డాక్టర్ కోడెల వెంకటరావును వివరణ కోరగా నేను దీనిపై స్పందించనని స్పష్టం చేశారు. -
డార్లింగ్ గారు
అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్మెట్లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. ఇన్స్టిట్యూట్కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు. డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్‌లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్‌లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్‌గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్‌కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్‌గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!! నవ్వుల కెమిస్ట్రీ! అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఎక్స్పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్‌లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్‌గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు! – డి.వి.తులసి, విజయవాడ – నక్కా రాజశేఖర్, కఠెవరం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. -
‘అరుదైన’ పదవిలో తెలుగుతేజం
తెనాలి: ఆచార్య నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడు, బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ ‘వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్’ (వార్మ్స్) ఎడిటర్‌గా నియమితులయ్యారు. భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో డేటాబేస్ నిర్వహణ ‘వార్మ్స్’ సంస్థ ప్రధాన కార్యక్రమం. 2008లో ఏర్పాటైన ఈ ప్రపంచ సంస్థ, బెల్జియంలోని ఓస్టెండ్ నగరంలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ జాబితా తయారీకోసం 40 దేశాలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలతో కూడిన సంపాదక బృందం నిరంతరం కృషిచేస్తోంది. ఈ బృందంలో భారతదేశం నుంచి ఎంపికైన తొలి శాస్త్రవేత్తను తానేనని డాక్టర్ షాబుద్దీన్ సోమవారం వెల్లడించారు. ‘బేథినిల్లేసియా’ అనే నీటి కీటక జాతికి ప్రాతినిథ్యం వహిస్తూ, కొత్త జాతులు, అధికారిక సమాచారం, ఆసక్తికరమైన ప్రాంతీయ జాతుల కొరత, వాటి ఆవాసాలు వంటి అదనపు సమాచారాన్ని పొందుపరిచేందుకు ‘వారŠమ్స్’ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ షాబుద్దీన్ వివరించారు. మెకానిక్ కొడుకుగా.. షాబుద్దీన్ షేక్ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్. తల్లి రహమతూమ్ గృహిణి. షాబుద్దీన్ చిన్నతనంనుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్ మొహిద్దీన్ బాచ్చా దగ్గర పెరిగాడు. ఇంటర్ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. జువాలజీలో బంగారుపతకం సాధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ‘వార్మ్స్’ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా షాబుద్దీన్‌కు అవకాశం లభించింది. డాక్టర్ రంగారెడ్డి నేతృత్వంలో షాబుద్దీన్ ప్రకృతి సహజ గుహల్లో కటిక చీకటి మాటున దాగున్న జీవరాశులను అన్వేషిస్తూ డాక్టర్ షాబుద్దీన్, ఆంధ్రాలోని బెలూమ్, బొర్రా, గుత్తికొండ గుహలు, మేఘాలయాలోని భారీ గుహల్లో పరిశోధన సాగించారు. ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు. అందులో ఒక జీవికి ‘ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్’గా నామకరణం చేశారు. 18 జీవుల గురించి అంతర్జాతీయ ప్రీ రివ్యూ జర్నల్స్‌లో పబ్లిష్ చేశారు. గుహలలోని జీవవైవిధ్యంపై షాబుద్దీన్ చేసిన పరిశోధనకు నాగార్జున యూనివర్సిటీ 2017లో పీహెచ్డీ ప్రదానం చేసింది. ఆ థీసిస్‌ను అధ్యయనం చేసిన ‘ఎడ్యుడికేటర్స్’, ఉత్తమ థీసిస్ అవార్డుకు సిఫార్సు చేయటం మరో విశేషం. జాతీయస్థాయిలో ప్రతిష్టాకరమైన డాక్టర్ కేవీరావ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2016), డాక్టర్ నాగరాజు మెమోరియల్ రీసెర్చ్ అవార్డును షాబుద్దీన్ అందుకున్నారు. విశాఖలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ సభల్లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు స్వీకరించారు. ఈ యువశాస్త్రవేత్తకు వివిధ అంతర్జాతీయ శాస్త్ర సంస్థలోనూ సభ్యత్వముంది.ఇటీవలే ఆయనకు జువాలజీ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ లభించింది. -
తనఖా భూములనూ మింగేస్తున్న లింగమనేని
-
14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ నెల 14న గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షు డు పవన్‌కల్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మహాసభను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 14న మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
తాత్కాలిక హైకోర్టుకు వసతుల పరిశీలన
ఏఎన్‌యూ (పొన్నూరు)/తుళ్లూరు రూరల్/ ఇబ్రహీంపట్నం (మైలవరం) : తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందం శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవనాలను పరిశీలించింది.ఈ బృందంలో న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ సునీల్‌చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఉన్నారు. -
నాగార్జున వర్సిటీలో హైకోర్టు జడ్జిల బృందం
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి శనివారం హైకోర్టు జడ్జిల బృందం చేరుకుంది. రాష్ట్ర హైకోర్టు ను ఏపీ రాజధానిలో ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఏఎన్‌యూలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ఉన్న మౌలిక వసతులు, పరిస్థితులను జడ్జిల బృందం పరిశీలిస్తోంది. జిల్లా కలెక్టర్ శశిధర్ తో కలసి జడ్జిలు యూనివర్సిటీ పరిశీలన చేస్తున్నారు. అనంతరం వర్సిటీ ఉన్నతాధికారులతో జడ్జిల బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించనుంది. మరోవైపు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాధన కమిటీ వినత పత్రం అందజేసింది. -
ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదా లు ఉన్నాయని ప్రకృతి శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ వద్ద ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసా యం’పై రైతులకు ఇస్తున్న రాష్ట్ర శిక్షణ సదస్సులో సోమవారం రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ విదేశీ వానపాములు, వర్మికంపోస్టు దుష్ఫలితాల గురించి, స్వదేశీ వానపాముల వలన లాభాలను వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నాలుగు అంశాలు వివరించారు. ముఖ్యంగా పంటకయ్యే ఖర్చు అంతర్ పంటల ఆదాయంతో భర్తీ చేయవచ్చని తెలిపారు. మొక్కల పెంపుదలకు కావాల్సిన ఏ ముడిపదార్ధాలు కొనుగోలు చేయకుండానే తయారు చేసుకోవచ్చని వివరించారు. యోగ వ్యవసాయ గురించి, దీనివల్ల కలిగే మోసాలు, అగ్నిహోత్ర గురించి ప్రత్యేకంగా తెలిపారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, జాయింట్ కలెక్టర్ –2 ముంగా వెంకటేశ్వరరావు, జేడీ విజయభారతితోపాటు రైతులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్ పాలేకర్ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్ మేనేజర్‌గా మారి దాన్ని ప్రమోట్ చేస్తానని బాబు వివరించారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతే నా ధ్యాస రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఐఈఏ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి
సాక్షి, గుంటూరు: ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ధి ఉత్సవాలను బుధవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ' భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు' పేరిట నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగునుంది. ఈ కార్యక్రమంలో గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దేశ , విదేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చిన ఆర్థిక వేత్తలు 7 ప్యానళ్లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చిస్తారు. కీలకమైన 16 అంశాలపై ప్రముఖ ఆర్థిక వేత్తలు కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా, అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో నాగార్జున వర్సిటీకి చేరుకున్నారు. ఐఈఏ సదస్సు అనంతరం సచివాలయంలో ఫైబర్‌గిడ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. -
రెండేళ్లైనా.. మాయని మచ్చ!
► రిషితేశ్వరి కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటులో జాప్యం ► అమలుకు నోచుకోని చంద్రబాబు హామీ ► ఇప్పటివరకు ర్యాగింగ్ దోషులకు పడని శిక్ష సాక్షి, వరంగల్: ర్యాగింగ్ పేరిట వేధించి తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తులు ఏవేని కారణాలతో శిక్ష నుంచి తప్పించు కుం టారేమోనని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూలై 14తో రిషితే శ్వరి మరణించి రెండేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆవేదనను రిషితేశ్వరి తల్లి దం డ్రులు ఎం.మురళికృష్ణ, దుర్గాబాయి ‘సాక్షి’కి తెలిపారు. ఆవేదన వారి మాటల్లోనే.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నాగా ర్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి 2015 జూలై 14న క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుంది. జూలై 30న ఏపీ సీఎం చంద్రబాబును కలి శాం. ‘దోషులకు శిక్ష పడాలి. మరొకరు ర్యా గింగ్ పేరుతో జూనియ ర్లను వేధించకూడదు. క్యాంపస్‌లో తొలి ఏడాది విద్యార్థులు నవ్వుతూ చదువుకోవాలి’ అని మేం చంద్ర బాబుకు చెప్పాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసు నీరుగారిపోతోంది రిషితేశ్వరి కేసులో ముగ్గురు సీనియర్లు ముద్దాయిలుగా ఉన్నారు. ఆమె స్నేహితులు సాక్షులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మూడో ఏడాది రెండో సెమిస్టర్లో ఉన్నారు. మరో రెండునెలల్లో ఫైనల్ ఇయర్లోకి వెళ్తారు. సాధారణంగా బీఆర్క్ చేసిన విద్యా ర్థులు విదేశాల్లో ఎంఆర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు విదే శాలకు వెళితే కోర్టు విచారణకు హజరు కావడం కష్టం. సాక్షులు లేకపోతే ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి. మిడిల్ మేనేజ్మెంట్తో సమస్య రిషితేశ్వరి మరణం తర్వాత నాగార్జున క్యాంపస్‌లో సీసీ కెమెరాలు పెట్టారు, ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబరు అందు బాటులోకి తెచ్చారు. పై స్థాయిలో ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలంటే మిడిల్ మేనేజ్మెంట్ సరిగా ఉండాలి. రిషితేశ్వరి చనిపోయాక తొలి వర్దంతికి నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సదస్సు పెడతామని కోరాం. అధికారులు కేవలం బ్యా చిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ విద్యార్థుల (200)తో సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. రిషితేశ్వరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు సంతోషంగా తిరుగుతున్నారు. మేం అనాథల్లా బతుకుతున్నాం. నిన్న విజయ వాడలో ర్యాగింగ్ వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయిందన్న వార్త టీవీల్లో చూసి తల్లడిల్లిపోయాం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాం. మా రిషితేశ్వరి కళ్ల ముందు కని పించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడే ఇతరుల్లో మార్పు వస్తుంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చులే అనే భావన సమాజంలో పెరగడం మంచిది కాదు. -
‘ఏఎన్‌యూ’లో పీఎఫ్ ఉఫ్!
► ఈపీఎఫ్ వ్యవహారాలపై పర్యవేక్షణ శూన్యం ► గతంలో ఖాతాల అంకెలు మార్చి లోన్ పొందిన ఉద్యోగులు ► గత ఏడాది వెలుగు చూసిన మరో పీఎఫ్ కుంభకోణం ► తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిధులు స్వాహా చేసిన నిర్వాహకుడు ► కమిటీలతో కాలక్షేపం చేస్తున్న ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్రమాలకు ఏఎన్‌యూ నిలయంగా మారుతోంది. ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన పీఎఫ్ నిధులను కొందరు అక్రమార్కులు చేతివాటంతో అడ్డదారిన తమ జేబులు నింపేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఏఎన్‌యూలో వరసగా పీఎఫ్ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఎన్‌యూ : ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పీఎఫ్ ఖాతాల నిర్వహణను పగడ్బందీగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండటంతో కుంభకోణాలు వరుసగా జరుగుతున్నాయి. గతంలో పలు కుంభకోణాలు.. యూనివర్సిటీలో పీఎఫ్ ఖాతాలకు సంబంధించి పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ ఎకౌంట్స్ విభాగంలో పీఎఫ్ వ్యవహారాలు చూసే ఇద్దరు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో అంకెలు మార్పు చేసి అధిక మొత్తంలో లోన్ పొందిన ఘటన ఆరేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చింది. తమ ఖాతాలో వేలాది రూపాయలను లక్షల్లో చూపి ఆ ఇద్దరు లోన్ పొందటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన అప్పటి వీసీ విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. కానీ పీఎఫ్ ఖాతాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోలేదు. దీంతో గత ఏడాది మరో పీఎఫ్ ఘటన వెలుగులోకి వచ్చింది.దీనిపై అతి కష్టంగా స్పందించిన ఉన్నతాధికారులు కుంభకోణంపై విచారణ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల నుంచి పీఎఫ్ మొత్తాలను వసూలు చేస్తూ ఏజెన్సీ నిర్వాహకుడు సకాలంలో వారి ఖాతాల్లో జమ చేయని ఘటనలూ గతంలో జరిగాయి. ఉద్యోగులు నిలదీయటంతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను జమ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి.. ఈపీఎఫ్‌కు సంబంధించిన మరో భారీ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. యూనివర్సిటీ వాటర్ వర్క్స్ విభాగంలో పనులను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించేందుకు అనుమతి పొందిన తెనాలికి చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ఏళ్ళ తరబడి ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయకుండా భారీగా నిధులు మింగేశాడు. తమ పీఎఫ్ మొత్తాలను జమ చేయకుండా నిర్వాహకుడు మింగేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది గత నెల 21న గుంటూరులోని ఈపీఎఫ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎఫ్ కమిషనర్ వచ్చి పరిశీలించి కుంభకోణం నిజమేనని తేల్చే వరకు యూనివర్సిటీ అధికారులు మిన్నకుండటం విశేషం. కుంభకోణం వెలుగులోకి రావటంతో గత నెల 24న ఏజెన్సీ నిర్వాహకుడు తన తప్పును పీఎఫ్ కమిషనర్ వద్ద లేఖ రూపంలో అంగీకరించాడు. ఫిబ్రవరి 28 లోగా జమ చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో జమ చేయలేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. వరసగా చోటు చేసుకుంటున్న ఈపీఎఫ్ కుంభకోణాలకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యయే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది చోటు చేసుకున్న పీఎఫ్ ఘటనపై విచారణ కమిటీని నియమించి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు గత నెలలోని కుంభకోణంపై కనీసం స్పందించకపోవటం దీన్ని తేటతెల్లం చేస్తోంది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు పీఎఫ్ ఖాతాల నిర్వహణలో పారదర్శకతను పెంచి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగులు కోరుతున్నారు. -
నాగార్జున వర్సిటీలో దూరవిద్య కోర్సులు
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కో-ఆర్టినేటర్ వై జయపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 2017లో జరిగే వార్షిక పరీక్షలు రాయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, బీయస్సీ, బీకామ్, బీఏ, బ్యాచ్‌లర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరదల్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98491 44925, 99599 74064 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా విజయరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఏఎన్‌యూ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ ఎస్ విజయరాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితమే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పదవీకాలం పూరైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చివరకు విజయరాజును చైర్మన్‌గా నియమించింది. విజయరాజు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలల కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1979లో ఏఎన్‌యూలో అధ్యాపకునిగా విధుల్లో చేరారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పటి వరకు 24కు పైగా పీహెచ్‌డీలు, నాలుగు ఎంఫిల్ డిగ్రీలు పరిశోధకులకు ప్రదానం చేశారు. -
అంతా చూచిరాతే..
నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బీఈడీ కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓపెన్ పీజీ, డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. శనివారం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షలు చూచిరాతలను తలపిస్తు న్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’బృందం శనివారం పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బృందం అక్కడి వెళ్లగానే పరీక్ష రాస్తున్న అభ్యర్థులు చిట్టీలు బయటపడేశారు. పాస్ గ్యారెంటీ అని హామీ ఇస్తూ ఏజెంట్లు విద్యార్థులకు చెప్పి గుంటూరుకు చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రంలో ప్రవే శాలు ఇప్పిస్తున్నారు. పరీక్షకు హాజరైతే ఒక రేటు.. హాజరు కాకుంటే మరోరేటు అం టూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పరీక్షల ను ఉద్యోగులు ప్రమోషన్ల కోసం డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అవసర మున్నందున డబ్బులు ఖర్చు చేసి పరీక్షలు రాస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ డంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు చాలామందికి రానున్నాయి. ఇటీవల మహబూబాబాద్ తహసీల్దార్ విజయ్‌కుమార్ తనిఖీలకు వెళ్లి ముగ్గురు అభ్యర్థులను డిబార్ చేశారు. -
'నాగార్జున' లో మరోసారి ర్యాగింగ్
-ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్ నాగార్జున యూనివర్సిటీ : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వివరాలు.. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం సివిల్ స్టూడెంట్ జయంత్‌ను గురువారం రాత్రి ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆచార్య పి. సిద్ధయ్య ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన శంకర్, నవీన్, వెంకట కృష్ణ, కల్యాణ్, మనోజ్ కుమార్ లను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జయ్యారంలో ఆదిమానవుల ఆనవాళ్లు
మరిపెడ : మండలంలోని జయ్యారంలో ఆదిమానవులు జీవించినట్లుగా భావిస్తున్నా రు. ఈ మేరకు సమాధులు బయటపడినట్లు చెబుతుండ గా.. ఆచార్య నాగార్జున యూ నివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఇస్లావత్ సుధాకర్ ఆదివారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తన పరిశోధనలో భా గంగా గతంలోనూ పలుచోట్ల ఆదిమ మానవుల సమా«ధులను గుర్తించానన్నారు. ప్రస్తుతం జయ్యారంలో గుర్తించినవి కూడా మూడు వేల ఏళ్ల క్రితం నాటివన్నారు. అప్పట్లో ఓ వ్యక్తి మృతి చెందితే గొయ్యి తవ్వి మృతదేహాన్ని నాలుగు రాళ్ల మధ్య ఉంచి చుట్టూ బండలు ఏర్పాటు చేసేవారని, మృతుల ఆయుధాలు, పరికరాలు సమాధిలో పూడ్చేవారన్నారు. వీటిని ఇనుపయుగం సమాధులుగా పిలుస్తారన్నారు. ఇలాంటి సమాధులు జయ్యారం శివారులో వంద వరకు ఉండగా.. పలువురు రైతులు వ్యవసాయం చేయడంతో యాభై వరకు మిగిలాయి. -
అనర్హతతోనే ఫిరాయింపులకు చెక్
- జనచైతన్య వేదిక సదస్సులో మేధావుల స్పష్టీకరణ - చర్య తీసుకునేందుకు స్పీకర్‌కు నిర్దిష్ట గడువు విధించాలి - వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలి - ప్రజలు ప్రశ్నించేలా చైతన్యం పెంపొందిస్తూ ఉద్యమం చేపట్టాలి - పార్టీ ఫిరాయించిన వారిని సంఘ బహిష్కరణ చేయాలి సాక్షి, విశాఖపట్నం: ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అనర్హులుగా చేయడం ద్వారానే పార్టీ ఫిరాయింపులను నిరోధించవచ్చని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ఫిరాయించిన వారిని ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా చేయాలన్నారు. ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల కమిషన్‌కు ఉండాలని స్పష్టం చేశారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన విశాఖ పౌర గ్రంథాలయంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం సాయంత్రం జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యార్థి సంఘాల నేతలు, రిటైర్డు ఉద్యోగులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా ఉద్యమం చేపట్టాలి ఫిరాయింపుదార్లపై ప్రజా ఉద్యమం చే పట్టాలని ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌కు నిర్దిష్టమైన గడువు విధించేలా చట్టంలో మార్పు తేవాలని నాగార్జున వర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ తెలిపారు. ఫిరాయింపుదార్లను మూడు నెలల పాటు జైలులో పెడితే భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడరని సీనియర్ న్యాయవాది అప్పారావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులను చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తేవాలని రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు సూచించారు. ప్రజా చైతన్యం ద్వారా వీటిని అరికట్టవచ్చని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ అన్నారు. ప్రజలు ప్రశ్నించకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయని ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ రఫీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల నుంచి తెలంగాణ పునర్నిర్మాణం పేరిట టీఆర్ఎస్లోకి, ఏపీలో అభివృద్ధి పేరిట టీడీపీలోకి ఎమ్మెల్యేలు మారుతున్నట్టు సమర్థించుకుంటున్నారు. ఈ కారణాలు చూస్తే వాటి వెనక ఏ ప్రభావం ఉందో అందరికీ అర్థమవుతుంది. -ప్రొఫెసర్ జి.హరగోపాల్, పౌరహక్కుల సంఘం నేత సుప్రీంకోర్టుకు లేఖ రాశా డబ్బు, మద్యం, హామీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఐదేళ్లూ తమనేమీ చేయలేరన్న భావనతో ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై జోక్యం చేసుకోవాలని, ఫిరాయింపులను నిలువరించాలని గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు లేఖ రాశాను. కానీ అటు నుంచి స్పందన లేదు. - ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరిఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలి. ప్రభుత్వం నుంచి వారికి వచ్చే అన్ని ప్రయోజనాలు, నిధులూ నిలిపేయాలి. ప్రతి మూడు నెలలకోసారైనా తమ గ్రామాలకు ఏం చేశారని ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలను నిలదీయాలి. -ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు స్పీకర్లు కీలు బొమ్మలుగా మారడం వల్లే ఈ దుస్థితి అధికార పార్టీ చేతిలో స్పీకర్లు కీలుబొమ్మలుగా మారడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. మేధావులు మౌనంగా ఉండకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా చూడాలి. బలమైన పౌర సమాజం ద్వారా ఫిరాయింపులను నిరోధించవచ్చు. -వి. లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, జనచైతన్య వేదిక ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇవ్వాలి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై చర్య తీసు కునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల కమిషన్‌కు ఉండాలి. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుంది. ఫిరాయింపుదార్లను సంఘ బహిష్కరణ చేయాలి. అలాంటి వారికి పాలు, నీరు అందకుండా గృహ నిర్బంధం చేయాలి. -వి.వి.రమణమూర్తి, అధ్యక్షుడు, రైటర్స్ అకాడమీ -
'పైసలిస్తే పాస్ చేయిస్తా'
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.ఎస్.ఆర్.చంద్రమూర్తి డబ్బులిస్తేనే పాస్ చేయిస్తానని చెబుతున్నారని విద్యార్థులు సోమవారం ప్రిన్సిపాల్‌కు, వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ సెల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్బులు చెల్లించనివారిని చెప్పి మరీ ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో ఎంటెక్ ఈవెనింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇటీవల పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ పరీక్షల్లో మిమ్మల్ని పాస్ చేయిస్తానంటూ ఆయన ట్రిపుల్ ఈ బ్రాంచ్ విద్యార్థుల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేశారని ఆరోపించారు. 13 మంది సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష రాశారని, ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లిస్తే పాస్ చేయిస్తానని ఆయన బేరమాడారని తెలిపారు. ముడుపులు చెల్లించని ఎనిమిదిమంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. ఇక్కడ చదివే ఇరాక్ విద్యార్థుల నుంచి కూడా ఆయనకు బహుమతులు అందినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయాలను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. -
ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు
నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బాబురావును ఎట్టకేలకు పెదకాకాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను ప్రోత్సహించినందుకు ఆయనను అరెస్టు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేయడంతో అమెరికాకు పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి ఇండియాకు వచ్చిన ఆయనను గుంటూరులోని ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని రెండు వారాల రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
28లోగా కళాశాలల డేటా అప్లోడ్ చేయాలి
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలన్నీ ఈనెల 28లోగా వెబ్సైట్లో తమ కళాశాలల డేటాను అప్లోడ్ చేయాలని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చెర్మైన్ ఆచార్య పి.నరసింహారావు సూచించారు. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వేకు అవసరమైన సమాచారాని కళాశాలలు అందించే అంశంపై గురువారం ఆచార్య నాగార్జున యూనివర్సిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, డీన్ సీడీసీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కళాశాలలు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కళాశాలలు 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలకు సంబంధించిన డేటాను ఠీఠీఠీ.్చజీటజ్ఛి.జౌఠి.జీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. సమాచారం అప్లోడ్ చేయని కళాశాలపై యూజీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయని విద్యాసంస్థలకు యూజీసీ ఇచ్చే నిధుల్లో 25 శాతం కోత విధించటంతోపాటు పలు శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్లోడ్ చేయటానికి ప్రతి కళాశాలకు మూడు వేల రూపాయల ఆర్దిక ప్రోత్సాహకం ఇస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలు పారదర్శకమైన పూర్తి సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, కేఎల్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, కృష్ణా, విక్రమసింహపురి యూనివర్సిటీల డీన్‌సీడీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థిని స్నానం చేస్తుండగా.. చిత్రించిన వ్యక్తి అరెస్ట్
నాగార్జున యూనివర్సిటీ అతిథి గృహంలో స్నానం చేస్తున్న విద్యార్థినిని ఓ యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గుర్తించిన యువతి బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘జెర్మి ట్రైన్ ద ట్రైనీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఛత్తిస్‌గఢ్ రాయ్‌పూర్ నుంచి విద్యార్థినుల బృందం నాగార్జున యూనివర్సిటీకి వచ్చింది. వీరికి యూనివర్సిటీ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఓ విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తుండగా.. తలుపు పై భాగం నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యలను తన సెల్ఫోన్లో బంధించాడు. ఇది గుర్తించిన విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. దీంతో అతిథిగృహ సిబ్బంది యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియల్ టూర్ కోసం వచ్చిన ఓ కళాశాలకు చెందిన బీబీఏ విద్యార్థులు ఈ ఘటనకు ప్పాలడి ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనుమానం వచ్చిన అందరి సెల్ఫోన్లను సేకరించి అందులోని చిత్రాలను పరిశీలించారు. ఈ దర్యాప్తులో సాయి శ్రీకర్ అనే విద్యార్థి ఈ చర్యకు పల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీకర్ అనంతపురం జిల్లా పామిడి కి చెందిన వాడిగా గుర్తించారు. -
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
నాగార్జున యూనివర్సిటీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. -
నేటి నుంచి 78వ బైబిల్‌మిషన్ మహోత్సవాలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నుంచి 78వ బైబిల్ మిషన్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు ఈ మహోత్సవాలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. -
కీచకుడికే గురువులు!
♦ మసకబారుతున్న ఎస్వీయూ ప్రతిష్ట ♦ కనువిప్పు కలిగించని నాగార్జున యూనివర్సిటీ ఘటన ♦ విద్యార్థులను వేధిస్తున్న ఆచార్యులు ♦ రోజుకో విభాగంలో ఆరోపణలు గురు సాక్షాత్ పరబ్రహ్మ.. అంటూ గురువులను కీర్తిస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత వారికి ఇస్తాం. ఇపుడు గురుదేవుల పాత్రలో విద్యార్థుల భవితకు మార్గదర్శనం చేయాల్సిన కొందరు కీచకుడి అవతారమెత్తుతున్నారు. వారి వెకిలి చేష్టలను భరించలేని విద్యార్థినులు, సహోద్యోగులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తే వీరు కీచకుడికే గురువులనాల్సిన దుర్గతి పడుతోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. సాక్షి, ప్రతినిధి తిరుపతి: విద్యార్థినులను వేధిస్తున్న గురువుల ఉదంతాలు తరచూ ఎస్వీ యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయి. వివిధ విభాగాల్లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు గురుదేవుల పాత్రపై నీలినీడలు కమ్ముకుంటూ, సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. బాధితులు పోలీసులు, మీడియాను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏడు విశ్వవిద్యాలయాలు, 146 డిగ్రీ కళాశాలలు, 35 ఇంజినీరింగ్ కళాశాలలు, 32 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దీనికితోడు నర్సింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర కళాశాలలతో పాటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. ఘన చరిత్ర ఉన్న ఎస్వీయూలో.. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఎస్వీ యూనివర్సిటీలో విచారకర ఘటనలు జరుగుతుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రిషితేశ్వరి ఘటనను మరువకముందే ఎస్వీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. కొన్ని ఉదాహరణలు.. - 2012లో జువాలజీ విభాగానికి ప్రొఫెసర్ రాజేశ్వరరావు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. - 2013లో ఆక్వాకల్చర్‌కు చెందిన ఓ విద్యార్థిని రిటైర్డ్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. - ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ నరేంద్ర వ్యవహార శైలిపై అక్కడి పోస్టు డాక్టోరల్ ఫెలో ఒకరు సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. - సాంఖ్యకశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ రాజశేఖర్‌రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని పీజీ విద్యార్థిని నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రొఫెసర్ డి.ఉషారాణి ఆధ్వర్యంలో 15 మందితో కమి టీ వేసింది. ఈనెల 19వ తేదీన విచారణ జరగనుంది. - రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసులు తనను వేధిస్తున్నారని పరిశోధక విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో మూడురోజుల క్రితం ఎస్వీయూ క్యాంపస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు మానసికంగా వేధిస్తున్నారని గత నవంబర్ 9న నలుగురు పరిశోధక విద్యార్థులు ఎస్వీయూ వీసీకి ఫిర్యాదు చేశారు. ఇతర ఫిర్యాదులూ.. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఘటనలే కాకుండా ఇతర కేసులు కూడా ఎక్కువయ్యాయి. గతనెల 17న ఎస్జీఎస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రెడ్డెప్పరెడ్డి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి రూ.31వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తెలుగు విభాగంలో అధ్యాపకులు, పోస్టు డాక్టోరల్ ఫెలోలు పరస్పరం రూం కేటాయింపులో ఎస్వీయూ క్యాంపస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇలాంటి విషయాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నా.. చాలా విషయాలు సద్దుమణిగిపోతున్నాయి. వెలుగులోకి రాని ఘటనలు మరిన్ని ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనల వల్ల ఎస్వీ యూ ప్రతిష్ట మసకబారుతోంది. భవిష్యత్తులో ఎస్వీయూకు ఎలాంటి మచ్చ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. -
రిషితేశ్వరి కేసు విచారణకు ద్విసభ్య కమిటీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఏఎన్‌యూ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజయలక్ష్మిలతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి ఘటనకు దారితీసిన కారణాలు, రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై గతంలో విచారణ జరిపిన కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యంను కూడా వీరిద్దరితోపాటు ఏఎన్‌యూలో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. పూర్తిస్థాయి వీసీ, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం 50శాతం భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కొత్త విద్యాలయాలు ప్రారంభమైయ్యాని.. వచ్చేఏడాది మరో 3 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేఏడాది ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తున్నామని అన్నారు. -
NUలో మరోసారి ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్ధులు సస్పెన్షన్
-
నాగార్జున మహిళా హాస్టల్ వద్ద ఆగంతకుడి కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ మహిళా హాస్టల్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కలకలం రేపాడు. మహిళా హాస్టల్ సమీపంలోని కరెంటు స్తంభంపైన రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉండటం హాస్టల్ లోపల ఉన్న విద్యార్థినులు గమనించారు. వారు వెంటనే ఆవిషయాన్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ అప్రమత్తమయ్యేలోగానే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెంటనే దిగి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కాగా, హాస్టల్ ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ ఉందని సమాచారం. -
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
-
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్‌గా ఉన్నారు. గతంలో వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు పలుమార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. 77 రోజుల తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
నాగార్జున యూనివర్సిటీని పరిశీలించిన మంత్రి గంటా
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్‌ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్‌లలోని రిషితేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు. ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్‌షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
నాగార్జున యూనివర్సిటిలో మళ్లీ ర్యాగింగ్
-
నాగార్జున యూనివర్సిటీలో కలకలం!
-
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ విద్యార్థి బాలయ్య ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. గత వారం రోజులుగా తనను ప్రేమించాలంటూ బాలయ్య వేధిస్తున్నాడని రత్నమంజరి గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
-
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం కులగజ్జితో కుళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీ కులానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బాబురావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో సమయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక నారాయణ కాలేజీలో దాదాపు పదిహేనుమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇవి చదువులకు నిలయాలా చావులకు కర్మాగారాల అని ఆమె నిలదీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో మరో టీచర్‌ను కొడతారా అని నిలదీశారు. సహచర టీచర్ మీద కనీస గౌరవం లేకుండా చెప్పుతో కొట్టారంటే ఆమె సంస్కారమేమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రిషితేశ్వరిది ఆత్మహత్యకాదని ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. -
రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్- 88888 17666, హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్‌చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్‌కు బయల్దేరాం. రవళి బుక్స్‌ను ఆమె క్లాస్‌రూమ్‌లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్‌కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్‌ఫొటో) -
నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి
నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ కొత్త ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఉదయలక్ష్మి గురువారం మధ్యాహ్నం వర్సిటీలో పర్యటించారు. ముందుగా ఆమె డీన్లు, వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. వర్సిటీ గురించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యపై ఆమె ఆరా తీయగా.. అధికారులెవరూ స్పష్టంగా చెప్పలేకపోవటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాస్టళ్లలో పురుష సిబ్బంది పనిచేస్తుండటాన్ని గమనించారు. వారిని వెంటనే బదిలీ చేయాలని చెప్పారు. కొందరు విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్న సమస్యలు ఏకరువు పెట్టడంతో అందుకు కారకులైన సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. -
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
-
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన రితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ఆయన స్థానంలో నియమించనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముంది. ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో విఫలమయ్యారని సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సాంబశివరావు స్థానంలో ప్రొఫెసర్ సింహాద్రిని వీసీగా నియమిస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం అందజేసింది. -
ఎఎన్ యూలో మద్యం బాటిళ్ల కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో కొంతమంది సీనియర్ విద్యార్థులు మద్యం బాటిళ్లతో హల్ చల్ చేశారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ, సాయి చరణ్, అబ్బాస్ లు బుధవారం రాత్రి క్యాంపస్ హాస్టల్లోకి మద్యం సీసాలు తెచ్చేందుకు యత్నించారు. అయితే వీరిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. గురువారం ఉదయం వర్సిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల సంజాయిషీ, తల్లిదండ్రుల హామీ ఉంటేనే వారిని తిరిగి కళాశాలలోకి అనుమతించే విషయం పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. -
నాగార్జున వర్సిటీలో పటిష్ట భద్రత
గుంటూరు: పదిరోజులు సెలవుల అనంతరం బుధవారం నుంచి నాగార్జున యూనివర్సిటీ కళాశాలల తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో యూనివర్సిటీకి పదిరోజుల సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవుల్లో విచారణ చేయటాన్ని పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో రుషితేశ్వరి ఘటనపై బాల సుబ్రహ్మణ్యం కమిటీ వర్సిటీలో మరోసారి విచారణ చేపట్టనుంది. కాగా బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా ప్రధాన ద్వారం వద్ద ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులు కూడ ఆందోళన ఉధృతం చేసే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా రుషితేశ్వరి మృతికి కారణమైన వారందరిపై కేసు నమోదు చేసి, శిక్షించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?
-
రిషితేశ్వరి ‘ఆత్మహత్య’పై ఆరా
గవర్నర్‌కు వివరాలు తెలిపిన గంటా హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన, తదనంతర పరిణామాలపై గవర్నర్ నరసింహన్ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వస్తుండడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ వినతులు అందాయి. ఈ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ , టీఆర్ఎస్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి వినతులిచ్చాయి. ఈ నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్యపై వర్సిటీల చాన్స్‌లర్ అయిన గవర్నర్ ప్రభుత్వం నుంచి వివరాలు అడిగారు. దీంతో మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాబ్భవన్లో గవర్నర్‌ను కలసి రిషితేశ్వరి ఆత్మహత్య, అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఆత్మహత్య ఘటనపై పోలీసుల విచారణతో పాటు ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రిషితేశ్వరి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఇంటిస్థలం మంజూరు చేసిన విషయాన్నీ వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి చేపడుతున్న చర్యలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. తెలంగాణ అన్యాయం చేస్తోంది..: విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు వర్సిటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని గంటా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ చర్యలతో లక్షలాది ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. వర్సిటీల్లో సిబ్బంది నియామకం, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు, ఏపీ వర్సిటీల చట్టంలో మార్పులు తదితర అంశాలు మంత్రి గవర్నర్‌కు వివరించారు. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వంతో తాను మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు. -
'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'
-
పులులు చంపిన లేడికూన!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పాపం.. పుణ్యం.. ప్రపంచమార్గం ఏమీ తెలియదు. మనుషులు, మనస్తత్వాలు అర్థం కావు. చుట్టూ ఉన్న మనుషులు అందరూ మంచివారేననే అమాయకత్వం. స్కూల్లో, కాలేజిలో అంతా సవ్యంగా ఉందనే భ్రమ. పరిస్థితులను అర్థం చేసుకోలేని తెలియనితనం. ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల్లోంచి ఒకేసారి పెద్ద ప్రపంచంలోకి.. యూనివర్సిటీల్లోకి.. అంతా గందరగోళంగా కనపడుతుంది. అమాయకమైన నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. రోజుల్లో పరిస్థితులు తలకిందులవుతాయి. ఆప్తులుగా అనుకున్నవారు వెంటాడి వేధిస్తారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మనసు విప్పి చెప్పుకున్నవారు నట్టేట ముంచేస్తే ఏం చేయాలో అర్థం కాదు. రెండు పదులు కూడా సరిగా నిండని వయసులో ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అనిశ్చితిలో.. సీలింగ్ ఫ్యానో, పంట కాలువో, స్లీపింగ్ పిల్సో, దూసుకొచ్చే రైలో... ఏదో ఒకటి ఆసరా అయితే.. తప్పెవరిది? నిరుత్సాహంతో, నిర్వేదంతో, అవమానంతో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరిదా? తనకు భరోసా కల్పించలేకపోయిన.. తోటి విద్యార్థులదా, ఉపాధ్యాయులదా.. విద్యావ్యవస్థదా? రిషితేశ్వరి డైరీలోని అంశాలు చాలా ప్రశ్నల్ని లేవనెత్తాయి. చిన్నతనంలో తాను అనుభవించిన ఒంటరితనం ఆ అక్షరాల్లో కనపడుతోంది. పిల్లల్ని ప్రేమగా పెంచితే సరిపోతుందా? ప్రేమగా పెంచడం అంటే ఏమిటి? ఆప్యాయంగా అడిగినవన్నీ కొనిపెడితే సరిపోతుందా! పిల్లల మనసులోని భావాలను పట్టించుకోవాలి కదా! ''నువ్వెందుకు, నేను చేసి పెడతాను.. నేను తీసుకొస్తాను.. నువ్వు ఇలా ఉండు.. నువ్వు ఆ పని చేయకు..'' ఇలా ప్రతి అడుగు తల్లిదండ్రుల పర్యవేక్షణలో కొనసాగితే.. బాహ్యప్రపంచం అనుపానులు తెలిసేదెప్పుడు.. తెలియకపోతే జరిగే అనర్థానికి ఎవరిది బాధ్యత? చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటుచేసి ప్రొటెక్ట్ చేస్తూ 18 సంవత్సరాల పాటు పెంచి ఒకేసారి అడవిలో వదిలిపెడితే పులులు, సింహాలు సంచరించే చోట లేడికూనకి ఎంత కష్టం! రిషితేశ్వరి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న లేడికూనే. నమ్మిన మనిషి చేసిన ద్రోహం ఆ డైరీలోని అక్షరాల్లో కన్నీరై ప్రవహించింది. మంచేదో చెడేదో తెలుసుకోలేని అమాయకత్వం.. ఆ దుర్మార్గం ముందు తలవంచింది. చేయి వేస్తే ఆ చేయి నరికేయొచ్చనే హక్కు, ఆత్మగౌరవం తన సొత్తు అనే చిన్న విషయం కూడా తెలియని బేలతనం.. ''నాన్నకి ఎలా చెప్పను''.. అనే మధ్యతరగతి అభిమానం.. 'రిషితేశ్వరి' సమూహంలో కూడా ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న రిషితేశ్వరికి సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోడానికి, సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించే వ్యవస్థ లేకపోవడం మన విద్యావ్యవస్థలో ఉన్న లోపం.. రిషితేశ్వరి లాంటి లేడికూనల పాలిట శాపం. చదువు, పరీక్ష, ఫలితాలు, సర్టిఫికెట్లు తప్ప బతుకు పోరులో ఎదురయ్యే సమస్యల్ని వివరించి విడమరిచే వ్యవస్థ ఊసే లేకపోవడం అన్యాయమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవహరించే పద్ధతి ఒకటే.. విచారణ కమిటీ, నివేదిక. మా పని అయిపోయింది అని చేతులు దులుపుకొన్నట్లుగా పదో, పరకో విదిలింపు. ఇలాంటివి సహించం.. కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం లాంటి హుంకరింపులు. విద్యార్థులతో కలిసి తాగి చిందులేసిన గురువర్యులు అలాగే ఉంటారు. మాకెందుకులే జీతాలు వస్తే చాలనుకునే సాధారణ ఉపాధ్యాయులు అలాగే కొనసాగుతారు. రిషితేశ్వరి ఘటన కొద్ది రోజుల్లో మరుగున పడిపోతుంది. ఆమె చావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైనవారు అదే క్యాంపస్‌లో కాలరెగరేసుకుంటూ తొందరలోనే కనపడతారు. విచారణ కమిటీ నివేదికకు చెదలు పట్టేస్తాయి. ఇప్పుడు కాకపోయినా.. కొద్ది రోజులకైనా రిషితేశ్వరి హాస్టల్ రూమ్ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. అమాయకంగా బిక్కుబిక్కుమంటూ మరో పసికూన క్యాంపస్ మెట్లు ఎక్కుతుంది... -ఎస్. గోపినాథ్ రెడ్డి -
'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'
గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ రాజు అన్నారు. ప్రశ్నించిన వారిని, నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి క్లాసుకు వస్తారని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాప్ రూమ్‌లోనే నిద్రపోతారని, అమ్మాయిలతో బాబూరావు అసభ్యకరంగా వ్యవహిరించే మాట వాస్తవమని డేవిడ్ రాజు అన్నారు. విద్యార్థులు ప్రతివారం ప్రిన్సిపాల్‌కు మందు పార్టీ ఇవ్వాలని, లేదంటే విద్యార్థులకు మార్కులు వేయరని, ఇలాంటి చరిత్ర ఉందనే గతంలో బాబురావు పని చేసిన కాలేజీల యాజమాన్యాలు తరిమేశాయని, ఫ్రెషర్స్ పార్టీలో ఆయన మద్యం సేవించి డాన్స్ చేశారని, బాబూరావు బాధలు తట్టుకోలేక ఇద్దరు మహిళా ఫ్యాకల్టీలు వెళ్లిపోయారని, రిషితేశ్వరి చనిపోయిన రోజు... ఇంకా బతికే ఉందని లెటర్ కోసం వర్సిటీ మెడికల్ ఆఫీసర్‌పై ఒత్తిడి తెచ్చారని డేవిడ్ రాజు తెలిపారు. -
ర్యాగింగ్‌ను నిరోధిద్దాం
జడలు విప్పుతున్న భూతం ఆందోళనలో తల్లిదండ్రులు కట్టడిలో కళాశాలల పాత్ర కీలకం త్వరలో ఇంజినీరింగ్ కాలేజీలు షురూ.. పరిచయ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నారుు.. అండగా ఉండాల్సిన వారే అఘాతంలోకి తోస్తున్నారు. వికృతక్రీడతో విషాన్ని చిమ్ముతున్నారు. ఇలా.. విద్యా సమూపార్జన దశలో కొందరు విగతజీవులవుతున్నారు. అవమానభారంతో చనిపోయే విద్యార్థి ప్రాణాన్ని కోల్పోతుండగా, దీనికి బాధ్యులు ఉజ్వల భవిష్యత్‌ను పణంగా పెట్టాల్సివస్తోంది. ర్యాగింగ్ భూతం దుష్పరిణామాలివీ. మొన్న హన్మకొండకు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో బలవన్మరణం.. నెల్లూరులో ఇంటర్ విద్యార్థి కె. మధువర్ధన్‌రెడ్డి మృతి నేపథ్యంలో అందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి. పోచమ్మమైదాన్: మొదట్లో కళాశాలలకు కొత్తగా వచ్చే విద్యార్థులను సీనియర్లు పరిచయం చేసుకునేందుకు ఫ్రెషర్స్ పార్టీలు జరిగేవి. ఇవి రానురాను ర్యాగింగ్‌గా మారారుు. కొందరి వ్యవహార శైలి అందరికీ చేటు తెస్తోంది. సామరస్య పూర్వక వాతావరణంలో జరగాల్సిన పరిచయ కార్యక్రమాలు రాత్రివేళల్లో గదుల్లో.. అమాయకులను భయపెట్టేలా, బాధపెట్టేలా వికృతరూపం దాల్చుతున్నారుు. ఈ కారణంగా పలువురు ఆత్మన్యూనతభావంతో కళాశాలలను వీడుతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నెల 6న ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది. మరేం చేయాలి? కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పుడే యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించాలి. ఇందులో అధ్యాపకులతో పాటు సీనియర్లు, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. ర్యాగింగ్ చేస్తే విధించే జరిమానా, పడే శిక్షలు, విద్యాసంవత్సరం నష్టపోయే తీరు.. తల్లిదండ్రులకు కలిగే దుఖం తదితర అంశాలు అందరికీ తెలిసేలా తరగతి గదులు, హాస్టళ్ల ఆవరణల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి. పోలీసు అధికారులు, మానసిక నిపుణులు, గతంలో ర్యాగింగ్ వల్ల నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పలు సమావేశాల్లో చెప్పించాలి. విద్యార్థులు కళాశాలలో చేరినప్పుడే స్టాంప్ పేపర్‌పై బాండ్లు రాయించుకోవాలి. ర్యాగింగ్ బాధ్యులుగా తేలితే ఫీజు వాపస్ ఇవ్వబోమని, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేయూలి. కళాశాల నుంచి డిబార్ తదితర చర్యలు తీసుకున్నా ఒప్పుకుంటామని తల్లిదండ్రులు, విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటే కొంత వరకు కట్టడి చేయొచ్చు. ఈ విధానాన్ని నగరంలోని చాలా కళాశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లోనే మార్పు రావాలి తాము గతంలో జూనియర్లమేననే స్పృహ సీనియర్లకు ఉండాలి. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వారసత్వంగా జూనియర్లకు ఆపాదించొద్దు. అజమారుుషీకి ప్రయత్నించొద్దు. పెద్ద మనిషి తరహాలో, మార్గదర్శిగా మాత్రే ఉంటేనే హుందాతనం. ఎక్కువగా మహిళ హాస్టళ్లలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ మాత్రం క్షేమకరం కాదు. ఇబ్బంది ఎదురైతే.. ర్యాగింగ్‌కు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాంపస్‌లో కానీ హాస్టళ్లలో కానీ ఒంటరిగా కాకుండా తోటి వారితో కలిసి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు లేదా తల్లిదండ్రులకు సమాచారమివ్వాలి. ప్రతి కళాశాలలో సమీప పోలీస్ స్టేషన్ వారు హెల్ప్‌లైన్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. నిత్యం అందులో విద్యార్థులు వేసే విజ్ఞాపన పత్రాలను పరిశీలించాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందడమేనా? ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడమూ కారణమని పలువురి అభిప్రాయం. ఇప్పుడంతా ఇంటర్నెట్ హల్చల్ చేస్తున్న రోజులు. ర్యాగింగ్ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి సామాజిక వెబ్సైట్లలోకి పంపడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యా సంస్థల బాధ్యత విద్యా సంస్థలలో తెలంగాణ ప్రొబిషన్ యాక్ట్ 1997/26 ప్రకారం కి ంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.విద్యాసంస్థలో ఏ రూపంలో ర్యాగింగ్ జరిగినట్లు దృష్టికి వస్తే విస్మరించొద్దు. ర్యాగింగ్ చేస్తూ దొరికిన,ర్యాగింగ్‌ను ప్రో త్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. యూజమాన్యం వారు ఆడియో విజువల్ ద్వారా ర్యాగింగ్ నిషేధిత, బాధ్యులపై తీసుకునే చర్యలను ప్రసారం చేయూలి. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో సీనియర్లు, జూనియర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ను చేర్చాలి. వారి ఫోన్ నంబర్లు, సమీప ఠాణా సీఐ, ఎస్సై ఫోన్ నంబర్లు రాసి ఉంచాలి.అడ్మిషన్ తీసుకునే సమయంలోనే విద్యార్థితో వాంగ్మూల పత్రం తీసుకోవాలి. మరోక వాంగ్ముల పత్రం తల్లితండ్రుల నుంచి సైతం తీసుకోవాలి. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారమివ్వాలి. ర్యాగింగ్ చేస్తే శిక్షలు తోటి విద్యార్థిని వేధించినా, ఆత్మన్యూనతకు గురిచే సినా ఆర్నెల్ల జైలు, రూ. వెరుు్య జరిమానా.దాడి , క్రిమినల్ చర్యలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా.అక్రమ నిర్బంధం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా. తీవ్రంగా గాయపరచడం, లైంగికదాడి, కిడ్నాప్ వంటి అసాధారణ చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా. హత్య చే సినా, ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు, రూ. 50 వేల వరకు జరిమానా. రెండూ విధించవచ్చు. అకడమిక్ చర్యలు చట్టం నిర్దేశించిన శిక్షలే కాదు.. మరికొన్ని శిక్షలూ పడతారుు.ర్యాగింగ్ చేసిన విద్యార్థి తరగతులకు రానివ్వకుండా నిషేధించాలి. అడ్మిషన్ రద్దు చేయాలి. బాధ్యుడు పరీక్ష రాసి ఉంటే ఫలితాలను ఆపివేయాలి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం వరంగల్‌లోని అన్ని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, మెడికల్ కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యల తీవ్రత ఏ స్థారుులో ఉంటుందో సీనియర్ విద్యార్థులకు వివరిస్తాం. ఆయూ కళాశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక బ్యానర్లు కట్టిస్తాం. కుటుంబం నుంచే విద్యార్థులపై ర్యాగింగ్ వ్యతిరేక భావన అలవర్చాలి. -సురేంద్రనాథ్, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీనియర్లకు అవగాహన కల్పిస్తున్నాం ఏటా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్ చేస్తే ఊరుకునేది లేదు. తరచూ సీనియర్లకు ఈ మేరకు అవగహన కల్పిస్తున్నాం. త్వరలో మా కళాశాలకు జూనియర్లు రానున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే సీనియర్లను మోటివేట్ చేస్తున్నాం. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా చుస్తున్నాం. -డాక్టర్ శ్యామల, అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల కఠినంగా శిక్షించాలి ర్యాగింగ్ చేస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారినైనా కఠినంగా శిక్షించాలి. కళాశాలల యూజమాన్యాలు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలి. పోలీసులు సైతం నిఘా పెట్టాలి. విద్యార్థులకు అవగహన సదస్సులు ఏర్పాటు చేయాలి. పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా! -కూనురు శ్రీమతి- శేఖర్ గౌడ్ ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి ర్యాగింగ్ భూతాన్ని విద్యార్థులు తరిమికొట్టాలి. కేయూలో క్యాష్(కమిటీ అగెనెస్ట్ సెక్స్‌వల్ హరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలి. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి అందులో విద్యార్థులు, అధ్యాపకులను, విద్యార్థి సంఘాలను సభ్యులుగా చేర్చాలి. కళాశాలల యూజమాన్యాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేయూలి. - చిలువేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అలాంటి వారితో జాగ్రత్త విద్యార్థుల్లో 3 నుంచి 5 శాతం మంది సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారే ర్యాగింగ్‌కు పాల్పడుతుంటారు. యుక్త వయస్సులో కీజోఫియా అనే వ్యాధి కూడా వీరిని అలా ప్రేరేపిస్తుంది. వీళ్లు వ్యక్తిత్వం, సంబంధాలను అర్థం చేసుకోలేరు. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేసుకోలేరు. మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతారు. ఇలాంటి వారితో జూనియర్లు జాగ్రత్తగా ఉండాలి. -డాక్టర్ యైశ్రీధర్ రాజు, సైక్రియూట్రిస్టు -
ర్యాగింగే రిషితేశ్వరి ప్రాణం తీసింది
సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణమని నిర్ధారణ అవుతోంది. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రహ్మణ్యం తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్టుగా సమాచారం. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వివరించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేసిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై సేకరించిన ప్రాథమిక ఆధారాలను వివరించారు. అయితే వివరించిన అంశాలతో మధ్యంతర నివేదికను సమర్పించాల్సిందిగా సీఎస్ కమిటీకి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఎవరెవరు కారణమనే విషయాన్ని కూడా బాల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. రిషితేశ్వరి అమాయకురాలని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరెవరి చర్యలు కారణమనే వివరాలతో బాలసుబ్రహ్మణ్యం త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనున్నారు. -
నాగార్జున యూనివర్సిటీ వద్ద వైసీపీ ధర్నా
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ ముందు జిల్లా వైఎస్సాసీపీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై నిజనిర్ధారణ కోసం వైసీపీ నాయకులు ఈ రోజు యూనివర్సిటీ కి వచ్చారు. అయితే పోలీసులు వారిని వర్సిటీ లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ సందర్శన కోసం ఆదివారమే అనుమతి తీసుకున్నామని నేతలు తెలిపారు. అయినా పోలీసుల తీరు మారకపోవడంతో వారు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు దిగివచ్చారు. యూనివర్సిటీ లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ధర్నా విరమించారు. -
నాగార్జున యూనివర్సిటీ వద్ద వైసీపీ ధర్నా
-
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉంది
-
'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే
ఆర్కిటెక్చర్ కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి స్పష్టీకరణ సాక్షి, గుంటూరు, ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది. దీంతో ఐదుగురు విద్యార్థినుల్ని హాస్టల్నుంచి పంపించేశాం. అయితే వారిపై విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని తెలిపారు. ప్రిన్సిపల్ బాబూరావు ఆదేశాలతోనే విద్యార్థులు రిషితేశ్వరి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారన్నారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. మృతదేహాన్ని తరలించాలని తానెవర్నీ ఆదేశించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకే పార్టీలో డ్యాన్స్ చేశా నన్నారు. హాస్టల్ వార్డెన్ రాజీనామా.. వర్సిటీలో బాలికల వసతిగృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూపరాణి జూలై 30నే రాజీనామా చేసినట్టు వెల్లడైంది. రిషితేశ్వరి ఘటన అనంతరం తనపై విమర్శలు రావడంతో కలత చెంది రాజీనామా చేసినట్లు ఆమె తెలిపింది. తాను వార్డెన్‌గా నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ చేయాలని కోరినా కొనసాగించారన్నారు. కాగా రిషితేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వరకు వార్డెన్‌గా కొనసాగానన్నారు. విచారణ కమిటీ గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నియమించిన విచారణ కమిటీ గడువును ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
'హాస్టల్ లో ర్యాగింగ్ వాస్తవమే'
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నాగార్జున యూనివర్సిటీ బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూప రాణి స్పందించారు. ఆమె కేసు విషయమై శనివారమిక్కడ జిల్లా లోక్ అదాలత్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే రిషితేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వార్డెన్ చెప్పారు. 'రిషితేశ్వరి మృతి చెందిన రోజు నేను హాస్టల్ కు వచ్చేసరికి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అప్పటికే రిషితేశ్వరి చనిపోయిందని వర్సిటీ వైద్యాధికారి ధృవీకరించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు' అని స్వరూపరాణి తెలిపారు. -
రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!
-
రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా రిషితేశ్వరితో పాటు మిగిలిన విద్యార్థులు మంగళగిరిలో సినిమా చూడలేదని, విజయవాడలోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్లో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాత్రి 11 గంటలకు రిషితేశ్వరితో పాటు మిగతా విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారని, అనంతరం ఆమె భోజనం చేసి పడుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్‌తో పాటు హాస్టల్లో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి!
హైదరాబాద్ : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు గంటా ఒక్కసారి మాత్రమే యూనివర్సిటీకి వెళ్లడమేంటని బాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినపుడు... ఇలా వ్యవహరించడం సరైన పద్ధతేనా అని మంత్రి గంటాను చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికైనా యూనివర్సిటీలో ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి గంటాకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు రిషితేశ్వరి మృతి ఘటనపై విచారణ శుక్రవారంతో ముగిసింది. మూడో రోజు విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐజీ సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రోజుల్లో కమిటి సభ్యులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. -
రిషితేశ్వరి మృతిపై ముగిసిన కమిటీ విచారణ
-
రిషితేశ్వరి మృతిపై ముగిసిన కమిటీ విచారణ
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ శుక్రవారం ముగిసింది. రెండురోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ కమిటీ జూలై 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థల నాయకులను విచారించింది. శుక్రవారం గుంటూరులో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇన్చార్జి వీసీ కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్‌లతో సమావేశమైన కమిటీ వారి నుంచి వివరాలు సేకరించింది. రెండురోజుల్లో ప్రభుత్వానికి నివేదిక... రిషితేశ్వరి కేసులో మూడు రోజులపాటు అధికారులతోపాటు అనేకమందిని విచారించాం. కీలకమైన వివరాలు, డాక్యుమెంట్లను సేకరిం చాం. విద్యార్థులకు పది రోజులపాటు సెలవులివ్వడంతో వారు లేకుండా విచారణ జరుపుతున్నారనే ఆరోపణల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతాం. సర్కారు అనుమతిస్తే విద్యార్థులు కళాశాలలకు తిరిగి వచ్చాక విచారణ చేపడతాం. రెండురోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తాం. - బాలసుబ్రహ్మణ్యం, కమిటీ చైర్మన్ -
బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?
రిషితేశ్వరి మరణంపై రోజా ప్రశ్న మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా.. ఇపుడు నోరెందుకు మెదపలేదు? హైదరాబాద్: ప్రతిదానికీ మీడియా ముందుకొచ్చి ప్రచారంకోసం తాపత్రయపడే ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా నిలదీ శారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిపోయి నిందితులైన విద్యార్థులకు అధికారపక్షం అండగా ఉందన్నారు. మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో వచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు బాబు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటిదిపుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నిం చారు. రిషితేశ్వరి కేసులో నిందితుల్ని శిక్షించేలా చర్యలు తీసుకునేలా కోరడానికి ఆమె తల్లిదండ్రులు ఏపీ సీఎం వద్దకు వెళితే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవడానికి వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు. అసలిలాంటి విద్యా మంత్రి, సీఎం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్సిటీకి వెళ్లిన విచారణ కమిటీ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడిస్తున్నారని ఆమె తప్పుపట్టారు. అక్కడ వ్యవహారమంతా కులాల కుంపటిగా చేశారని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని నిందితులుగా చేశారని, వాస్తవానికి వర్సిటీ వైస్‌చాన్సలర్‌ను తొలి ముద్దాయిగా, ప్రిన్సిపల్‌ను రెండో ముద్దాయిగా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న మహిళాసంఘాలు, విద్యార్థులపై టీడీపీ మద్దతుదారులు దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణమైనందునే ఆ పార్టీ ప్రమేయముందని తాము చెబుతున్నామన్నారు. ర్యాగింగ్‌ను నివారించడానికి 2009, మే 8న సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని, వాటిని వర్సిటీ అధికారులు పాటించలేదన్నారు. నిజనిర్ధారణ చేసి రిషితేశ్వరి కుటుంబం తరఫున పోరాడేందుకు వైఎస్సార్సీపీ మహిళా, విద్యార్థి విభాగం, ఎమ్మెల్యేలు ఆగస్టు 6న నాగార్జున వర్సిటీకి వెళుతున్నామని వెల్లడించారు. జర్నలిజానికే మచ్చ..: పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన అనని మాటల్ని అన్నట్లుగా ఓ పత్రిక రాయడం జర్నలిజానికే మచ్చని రోజా దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ వంటి అంశాల్ని చర్చించాంగానీ ఆ పత్రికలో రాసినట్లుగా మరే చర్చా జరగలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ హైదరాబాద్: నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై నిగ్గు తేల్చడానికి వైఎస్సార్సీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కె.పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్.కె.రోజా, మేరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ ఇందులో ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ప్రిన్సిపల్, ఇతర నిందితుల ప్రమేయం, కులవివక్ష, దర్యాప్తులో ప్రభుత్వ వైఫల్యం, వర్సిటీలో బోధన సిబ్బంది కొరత తదితర అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి పార్టీ అధ్యక్షునికి నివేదిక సమర్పిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
-
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి టీవీ' సంపాదించింది. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ప్రేమించాలంటూ రిషితేవ్వరిపై సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో శ్రీనివాస్, జయచరణ్‌లు కలిసి రిషితేశ్వరిపై వదంతులు ప్రారంభించారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ర్యాగింగ్‌లో భాగంగా హాస్టల్ నుంచి రిషితేశ్వరిని రూమ్మెట్స్ బయటకు నెట్టారని, వార్డెన్ స్వరూపరాణి, ఆఫీస్ అసిస్టెంట్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిందని, ఏప్రిల్ 18న కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా రిషితేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు వచ్చిందని, అదేరోజు రిషితేశ్వరి పట్ల శ్రీనివాస్, జయచరణ్ అసభ్యంగా ప్రవర్తించారని, ర్యాగింగ్ శృతి మించడంతో జులై 14న హాస్టల్లో చున్నీతో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో ఉంది. చున్నీకి వేలాడుతున్న రిషితేశ్వరిని మొదటగా విద్యార్థినులు... సుజాత, కుసుమలత, గౌరిలు చూశారని, మధ్యాహ్నం 2.30గంటలకు యూనివర్సిటీ అంబులెన్స్‌లో ఆమెను గుంటూరుకు తరలించారని,ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో 2 నైలాన్ తాడులు గుర్తించామని, నిందితులపై ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్నామని, ఈ నెల 16న యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రిషితేశ్వరి కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
గుంటూరులో వైఎస్సార్సీపీ నేతల అరెస్టు
గుంటూరు: గుంటూరులో విద్యా సంస్థల బంద్ సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం గుంటూరులో విద్యా సంస్థల బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చాయి. దీంతో శుక్రవారం విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. బంద్‌లో పాల్గొనాలని కోరుతున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య, నగర అధ్యక్షుడు మణికంఠ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీలతోపాటు 45 మంది వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. -
'బాధ్యులు ఎవరైనా వదిలేది లేదు'
విజయవాడ: నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులు ఎంతటి వారైనా వదలబోమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ హోటల్లో బస చేసిన మంత్రిని రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయ్ కలిశారు. తమ కుమార్తె మరణానికి కారణమై, తమకు తీవ్ర వేదన మిగిల్చిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. ' మా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రాకూడదు' అంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు మంత్రి వద్ద బోరున విలిపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రిషితేశ్వరి ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేధిక ఆధారంగా బాధితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. -
'కీలక సమాచారం సేకరించాం'
-
'కీలక సమాచారం సేకరించాం'
గుంటూరు: ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం యూనివర్సిటీ లో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను అవసరమైతే మరో 2 రెండు రోజులు పొడిగించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.బుధవారం అధికారులతో మాట్లాడినపుడు కొంత కీలక సమాచారం సేకరించామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రిషతేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు. కాగా రెండోరోజు జరుగుతున్న విచారణకు పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి...విద్యార్థులు ఎవరూ లేకుండానే విచారణ పేరుతో అధికారులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
‘‘నాన్నా ప్లీజ్ ఏడవకండి!’’
పోగొట్టుకున్న ఈ బంగారుతల్లి కోసం మనం... పోరాటం చేయలేమా! ► పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే నవ్వును హత్య చేశారు! ► విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే నమ్మకాన్ని హత్య చేశారు! ► ఆచార్యులు అంటే విద్యాబుద్దులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే భరోసాను హత్య చేశారు! ► సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే ఆశను హత్య చేశారు! ► క్యాంపస్‌లో, క్యాంటీన్లో, హాస్టల్లో స్నేహం గుబాళిస్తుందన్న అమాయకత్వాన్ని హత్య చేశారు! ► ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ మానవత్వాన్ని హత్య చేశారు! ► కనిపెంచిన అమ్మపై, నాన్నపై, చదువుతున్న చదువుపై పెంచుకున్న ప్రేమను హత్య చేశారు! ► బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశయాన్ని హత్య చేశారు! ► ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా వ్యక్తిత్వాన్ని హత్య చేశారు! ► కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా ధైర్యాన్ని హత్య చేశారు! ► యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు! ► ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని మంచితనాన్నీ హత్య చేశారు! ► రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు! నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది.సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది. అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ర్యాగింగ్ ఉరి బిగించింది! నిర్జీవమైన చదువుల తల్లి రిషితేశ్వరి గళ్ల చొక్కాలో ఉన్న ఆ అమ్మాయి కళ్లు పూర్తిగా మూత పడలేదు. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని, అద్భుతంగా ఉండబోయే తన భవిష్యత్తును దర్శించాలని ఆశ పడుతున్న వాటిలా సగం సగంగా తెరుచుకునే ఉన్నాయి. ముగ్ధంగా అమాయకంగా ఉన్న ముఖం... కన్నవారు అపురూపంగా పెంచుకోవడం వల్ల వచ్చిన లావణ్యమైన రూపం... అవన్నీ జీవాన్ని కోల్పోయి కదలికను మానేసి తమ అచేతన నుంచి ఒక చేతనను లేవదీయడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల విద్యార్థిని రిషితేశ్వరి తను ప్రాణాలు కోల్పోయి... లక్ష ప్రాణాలతో వికటాట్టహాసం చేస్తున్న ఒక దుష్ట సంస్కృతి సంహారానికి పిలుపునిస్తూ ఉంది. దీనిని ఇంతటితో ఆఖరు చేయండి అని విన్నవిస్తూ ఉంది. చనిపోయే చివరి క్షణాలలో కూడా... తనకు అన్యాయం జరిగిందని తెలిసీ కూడా... ఆ పిలుపులో ద్వేషం లేదు. ప్రేమ ఉంది. సంస్కారం ఉంది. మనసులు, మనుషులు మారాలి అన్న కన్సర్న్ ఉంది. రిషితేశ్వరి మరణం ఈ వ్యవస్థను బోనులో నిలబెట్టింది. కుప్ప కూలిన పునాది! ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే నిర్మాణ శాస్త్రం. తన భవిష్యత్తును ఆ చదువుతో నిర్మించుకుందామని నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చేరింది రిషితేశ్వరి. యూనివర్సిటీ అంటే చదువుల ఆలయం అనీ అక్కడ అందరూ చదువులో నిమగ్నమై ఉంటారని అనుకుంది. కాని మొదటి రోజే చేదు అనుభవం! హాస్టల్లో చేరిన రోజు రాత్రే కొంత మంది అమ్మాయిలు వచ్చి రూమ్ ఖాళీ చేయాలని అన్నారు. ఇది తమ రూమ్ అనీ తెల్లారే సరికల్లా ఖాళీ చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని భయపెట్టారు. ‘వాళ్లు బెదిరించిన రోజే రిషి మాకు ఫోన్ చేస్తే తెల్లారే సరికల్లా వరంగల్ నుంచి గుంటూరు (పెదకాకాని)కి చేరుకున్నా’ అని చెప్పారు తండ్రి మురళీకృష్ణ. ‘ఇక్కడ ప్రిన్సిపాల్ తాము చెప్పిందే చేస్తాడు. స్టూడెంట్స్ తమ వర్గం వారే ఉంటారు. తమని కాదని ఎవరూ ఏమి చేయలేరు అని సీనియర్లు మా అమ్మాయిని భయపెట్టారు’ అని కూడా చెప్పారు. అయితే ఆ తండ్రి అప్రమత్తమైనట్టుగా ఆ యాజమాన్యం అప్రమత్తం కాలేదు. ఇలాంటి ర్యాగింగ్ పద్ధతులను నివారించడానికి ప్రయత్నించలేదు. ‘నేను మౌఖికంగా ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్‌గారు చూస్తామండీ అన్నారు. ఆయన దృష్టిలో చూస్తాను అంటే మీడియాలో రాకుండా చూస్తాను అని అర్థం. లోపల ఏం జరిగినా ఆయనకు పట్టదు. బయట గోల జరక్కుండా మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వర్గం విద్యార్థులను ఇతర విద్యార్థుల మీదకు వదిలేసినట్టుగా అనిపించింది’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదనగా అన్నారు. పేరెంట్స్ మీటింగ్ లేదు! ఫ్రెషర్స్ వచ్చాక కాలేజ్‌లో అధికారికంగా ప్రెషర్స్ మీటింగ్ జరగాలి. రిషితేశ్వరి చేరాక అలాంటిదేమీ జరగలేదు. రిషితేశ్వరి చనిపోయాక ప్రిన్సిపాల్ హడావిడిగా కొంతమంది పేరెంట్స్‌నీ టెంపరరీ ఫ్యాకల్టీని పిలిపించి ఏదో అయ్యిందంటే అయ్యింది అనిపించారు. ‘ఆ మీటింగ్ గురించి నాకు చెప్పకపోయినా నేను వెళ్లాను. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో, మా అమ్మాయి ఎలా ఆ నరకం అనుభవించిందో చెప్పాను. టెంపరరీ ఫ్యాకల్టీ దీనిని ఖండించారు. అయితే నేను పర్మినెంట్ ఫ్యాకల్టీలో ఉన్న ఒక అధ్యాపకుణ్ణి పిలుచుకువస్తే ఆయన నా వాదనను సమర్థించి తన ఉద్యోగం పోయినా సరే రిషితేశ్వరికి న్యాయం జరగాలని అందరి ముందూ ప్రకటించారు. ఆ తర్వాత ఆ అధ్యాపకుణ్ణి టెర్మినేట్ చేసినట్టు పేపర్లో చదివాను. ఇంత దారుణంగా సత్యాన్ని తొక్కేయడం ఎక్కడా చూడలేదు’ అని మురళీకృష్ణ అన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు ఉంది... భోజనానికి లేదు... మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రిషితేశ్వరి ఒక్కర్తే అమ్మాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరితో ఎక్కువగా చనువుగా ఉంటారు. అలా రిషితేశ్వరికి తండ్రి దగ్గర చనువు ఎక్కువ. ప్రతిదీ తండ్రితో పంచుకునేది. ఆయన గొంతు వినకుండా ఏ రోజూ రిషితేశ్వరికి గడవలేదు. జూలై 14న ఉదయం కూడా తండ్రికి కాల్ చేసింది. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా... అని చెప్పింది. అవే ఆమె ఆఖరి మాటలు అని తండ్రి ఊహించలేదు. ఆయన ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఒంటిగంట ప్రాంతంలో వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. కూతురి నుంచే. అలా ఎప్పుడూ ఆ టైమ్‌లో రిషితేశ్వరి మెసేజ్ పెట్టి ఎరగలేదు. ఓపెన్ చేస్తే ‘ఐ లవ్ యూ నాన్నా’... అని ఉంది. మరికొద్ది సేపటికే యూనివర్సిటీ నుంచి ఫోన్. రిషితేశ్వరి చనిపోయిందని. రోజూ భోజనానికి మెస్‌లో కనిపించాల్సిన రిషితేశ్వరి కనిపించకపోయేసరికి రూమ్మేట్స్ రూమ్‌కి వెళ్లి చూశారు. అప్పటికే ఆ నిండు ప్రాణం... స్నేహం, సామరస్యం, సమభావన అనే క్షుద్బాధను అనుభవిస్తూ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంది. ఏం జరిగింది? ఒక స్నేహితురాలు ఇద్దరు అబ్బాయిలను పరిచయం చేసింది. పరిచయం చేసిన ఆ అబ్బాయిలు ఎప్పుడూ ప్రిన్సిపల్ వెంట కనిపించేవారని తెలుస్తోంది. వారితో స్నేహం రానురాను ఇబ్బందిగా భారంగా మారిందని, ఆ ఒత్తిడి భరించలేకే రిషితేశ్వరి ప్రాణం తీసుకుందని స్నేహితుల ద్వారా తెలుస్తోంది. చివరి క్షణాలు రిషితేశ్వరికి డైరీ రాయడం అలవాటు. ఆమె తనకు నచ్చిన, నచ్చని విషయాలు డైరీ రాసుకుంటుంది. చనిపోయే ముందు కూడా ‘మై లాస్ట్ నోట్స్’ పేరుతో ఆ డైరీలోనే మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘నవ్వడం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం’ అని మొదలయ్యే ఆ నోట్... యూనివర్సిటీ జీవితం నరకప్రాయం అయ్యి నవ్వాలంటే భయపడే స్థితికి ఆమె ఎలా చేరుకుందో తెలుపుతోంది. తల్లినీ తండ్రినీ ఉద్దేశిస్తూ వాళ్లేమేం పనులు చేయాలో రాసిన రిషితేశ్వరి... తండ్రి తన ముగ్గురు ప్రాణమిత్రులకు చేయవలసిన సాయాన్ని కూడా తెలిపింది. అయితే ఆమె తన చావుకు కారణమైనవారి పేర్లను రాయలేదు. ‘ఈ పరిస్థితికి కారకులెవరో వారికి నా చావు కనువిప్పు కావాలి’ అని రాసింది. పాఠ్యాంశాలను రాయాల్సిన చేతులు మరణవాంగ్మూలాన్ని రాయాల్సి రావడమే అతి పెద్ద విషాదం. ఆత్మహత్య... కాదు హత్య... ఇది ఆత్మహత్య అని భావిస్తున్నవారు ఎందరున్నారో, హత్య అని అనుమానపడుతున్నవారు కూడా అంతేమంది ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించినవారు అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదనీ, గది ఎత్తునూ, ఫ్యాన్ వేలాడుతున్న ఎత్తునూ పరిశీలిస్తే అంత ఎత్తున ఉన్న ఫ్యాన్‌కు చున్నీని వేలాడగట్టుకోవడం చాలా కష్టమనీ అభిప్రాయపడుతున్నారు. మెడపై చున్నీ నలిగిన గుర్తులు కూడా లేవని చెబుతున్నారు. రిషితేశ్వరి రాసే డైరీ తప్ప ఆమె పుస్తకాలు కూడా అదృశ్యమయ్యాయి. ‘సూసైడ్ నోట్లో ఉన్న రాత మా అమ్మాయిదే. అయితే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని తండ్రి మురళీకృష్ణ అంటున్నారు. ‘హత్య అయినా ఆత్మహత్య అయినా నా కూతురి ప్రాణం పోయింది మాత్రం ర్యాగింగ్ వల్లనే. ముందు అది చావాలి. తర్వాత నా కూతురి చావుకు కారణమైనవారికి శిక్ష పడాలి’ అని ఆయన అన్నారు. ఆ మాట అన్నప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. అయితే అవి పోయిన తన కూతురి కోసం మాత్రమే అనిపించలేదు. ఇప్పుడు చదువుతున్న లక్షలాదిమంది ఆడపిల్లల కోసం కూడా అనిపించాయి. కలిసిన గొంతులు రిషితేశ్వరి మరణం అప్పటికప్పుడు దావానలంలా వ్యాపించలేదు. కార్చిచ్చులా సమస్తాన్ని దహించేయలేదు. కానీ అది మెల్లమెల్లగా రాజుకున్న మహా అగ్నిధారలా ఇవాళ సమస్త సమాజిక అంతరాల్లో ప్రశ్నను లేవదీస్తోంది. ‘ఇవాళ రిషితేశ్వరి... రేపు మన ఇంటి ఆడపిల్లే కావచ్చు’ అనే నినాదంతో ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో విపరీతమైన నిరసన కొనసాగుతూ ఉంది. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ రిషితేశ్వరి మరణానికి జవాబు అడిగేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. - సాక్షి ఫ్యామిలీ టీమ్ మిస్ పర్ఫెక్ట్: ‘‘రిషితేశ్వరి మంచి స్టూడెంట్. తన పనేదో తాను చూసుకొనేది. ప్రతిభ, నిజాయతీ లాంటి గుణాలను ఆమెలో చూసిన సీనియర్లు రిషితేశ్వరికి ఈ ఏడాది ‘మిస్ పర్ఫెక్ట్’ టైటిల్ కూడా ఇచ్చారు.’’ - జి. సాయిదీప, బీఆర్క్ సెకండియర్, రాజమండ్రి ఆ అమ్మాయికి నాన్నే సర్వస్వం: ‘‘రిషితేశ్వరిది ఫ్రెండ్లీ నేచర్. ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ నాన్నకు చెప్పుకొనేది. ఎవర్నీ హర్ట్ చేయదు. ఏదన్నా అంటే, గట్టిగా జవాబిచ్చే ఆమె ఆత్మహత్య చేసుకుందంటే, నమ్మశక్యం కావడం లేదు.’’ - పి. అవినాశ్, బీఆర్క్ థర్డ్ ఇయర్, రాజంపేట చాలా సెన్సిటివ్: ‘‘రిషితేశ్వరి చాలా సెన్సిటివ్. ర్యాగింగ్‌తో ఇబ్బంది పడుతున్నానని మాతో అన్నప్పుడు చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఇలా అవుతుందనుకోలేదు. క్యాంటీన్‌కు వెళ్ళినప్పుడు తాను తినకుండా మా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తున్నాయి.’’ - దుర్గాప్రసాద్, బీఆర్క్ సెకండ్ ఇయర్, కర్లంపూడి భయమే ఈ ప్రభుత్వ సందేశమా? రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు. బాబుగారూ... ఎక్కడున్నారు? నాడు ఇదే నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్యాంధ్రను నిర్మిస్తానని నారా చంద్రబాబు నాయుడు ప్రతిన చేశారు. నేడు అదే నాగార్జున యూనివర్సిటీలో భవిష్యత్తును నిర్మించుకోడానికి ఆర్కిటెక్చర్ కోర్సులో చేరి, ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి మరణంపై స్పందించకపోగా, ఆమె తల్లితండ్రులకు కనీస సానుభూతిని కూడా ప్రకటించలేకపోయారు చంద్రబాబు! ⇔ఆమె డైరీ వెల్లడిస్తున్న గుండెను పిండేసే అంశాలు... రిషితేశ్వరి డైరీ అందరి గుండెలను పిండి వేసే అంశాలను వెల్లడించింది. పోలీసులు ఆ డైరీని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. పాఠకులకు ‘ది హిందూ’ దినపత్రిక ఈ విషయాలను ప్రత్యేకంగా అందించింది. రిషితేశ్వరి రాసిన ప్రకారం విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఫైనల్ ఇయర్ విద్యార్థి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ధోరణి ఎంతగా బాధించిందంటే ‘‘అప్పుడే నాకు చచ్చిపోవాలనిపించింది’’ అని ఆమె రాసుకుంది. - ‘ది హిందూ’ కథనం, 25 జూలై 2015 ⇔ఆత్మహత్య కేసుపై ఆగని నిరసనలు... రిషితేశ్వరి ఆత్మహత్యతో సంబంధం ఉందనే ఆరోపణపై కాలేజ్ ప్రిన్సిపాల్ జి. బాబూరావు సస్పెండ్ అయినా క్యాంపస్‌లో నిరసనల వెల్లువ ఆగలేదు.ఆత్మహత్యకు కారకులైన వారి మీద ఇంకా చర్యలు తీసుకోనందుకు యూనివర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ శుక్రవారం నాడు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు వైస్ చాన్సలర్ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్చేస్తేనో.. అతని రాజీనామా అంగీకరిస్తేనో సరిపోదని... ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన అతనిని జైలుకి పంపాలని డిమాండ్ చేశారు. - ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, 25 జూలై 2015 ⇔ర్యాగింగ్ శక్తులపై నిరసన... ‘‘...నిరసనలు పెరగడంతో, పరిస్థితిని అదుపులో ఉంచడం కోసం నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు పది రోజులు సెలవులు నిర్ణయించారు. ...ర్యాగింగ్ కేసులో నిందితులైన విద్యార్థులనూ, అధికారులనూ కాపాడడం కోసమే తరగతులు రద్దు చేసి, సెలవులు ప్రకటించారని పి.డి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఎస్.ఎఫ్.ఐ. నాగార్జున యూనివర్సిటీ కమిటీ ప్రెసిడెంట్ డి.ఏసురాజు తదితర నేతలు ఆరోపించారు...’’ - ‘దక్కన్ క్రానికల్’ కథనం, 26 జూలై 2015 ⇔ రిషితేశ్వరి మరణం: ఆత్మహత్యా? హత్యా? ‘‘రిషితేశ్వరి డైరీని బట్టి... సీనియర్లు రెగ్యులర్‌గా రిషితేశ్వరిని హింసించేవారని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ...విద్యార్థుల నుంచి డబ్బులు పోగుచేసి, ప్రిన్సిపాల్ క్రమం తప్పకుండా పార్టీలు నిర్వహిస్తుంటారని యూనివర్సిటీ స్టూడెంట్లు ఆరోపించారు. విద్యార్థినులతో కలసి ప్రిన్సిపాల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాల వీడియోను వారు అందించారు. రిషితేశ్వరి వ్యవహారం గురించి చాలాసార్లు ఆయనకు చెప్పినా, స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు.’’ - ‘మెట్రో ఇండియా’ కథనం, 26 జూలై 2015 విద్యార్థులు లేకుండా విచారణలా? రిషితేశ్వరి చనిపోయాక విద్యార్థులకు పదిరోజులు సెలవులిచ్చి ఆ తరువాత కమిటీలు వేశారు. విద్యార్థులు లేకుండా కమిటీ ఎవరిని విచారిస్తుంది? కళాశాలలు మళ్లీ మొదల య్యాక విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించాలి. గతంలోనూ యూనివర్సిటీలో అనేక కమిటీలేశారు. ఏ కమిటీ ద్వారా సక్రమంగా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. - పవన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు ప్రిన్సిపాల్‌ను రక్షించే ప్రయత్నం రిషితేశ్వరిది ఆత్మహత్యేనని యూనివర్సిటీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఘటన వెనుక కారణాలను కప్పిపుచ్చేందుకే కమిటీ ఇలా నివేదికలు ఇస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ ప్రక్షాళన పేరుతో ఈ కేసులో వాస్తవాలు చెబుతున్నవారిని బెదిరిస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. - వెన్నెల, విద్యార్థి జేఏసీ నాయకురాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు ప్రభుత్వం నియమించిన కమిటీ తనకు అనుకూల వర్గాల వాదనను విని, అదే ప్రభుత్వానికి నివేదించే కుట్ర జరుగుతోంది. ఈ కమిటీతో మృతురాలికీ, న్యాయం కోసం పోరాడుతున్న స్టూడెంట్స్‌కూ ఎలాంటి న్యాయమూ జరగదు. కమిటీ ముందు ఎవరైనా మాట్లాడుతుంటే వారిని వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలి. బహిరంగంగా న్యాయ విచారణ జరపాలి. - షేక్ బాజీసైదా, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నాతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించి, క్షుణ్ణంగా విచారణ జరిపి ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెవెన్యూ, పోలీసు, యూనివర్సిటీ అధికారులతో సమావేశమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం. - బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
రిషితేశ్వరి ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు మద్దతుగా నిలిచారు. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి ఇప్పటికే 10 వేల లైక్‌లు వచ్చాయి. (చదవండి: రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ) -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం ఉధృతమవుతోంది. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి అనూహ్య స్పందన వస్తోంది. రిషితేశ్వరి మృతికి సంబంధించి పలు ప్రశ్నలను కూడా సంధించారు. రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు... 1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? 2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? 3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? 5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? 6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? 7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? 8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? 11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది? 12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు? -
నాగార్జున వర్సిటీ ఘటనపై త్రిసభ్యకమిటీ
-
నాగార్జున యూనివర్సిటీ ఘటనలపై త్రిసభ్య కమిటీ!
సాక్షి, హైదరాబాద్: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి, అందుకు దారితీసిన కారణాలు, తదనంతర పరిణామాలపై విచారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కమిటీ సభ్యుల పేర్లపై పరిశీలన చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, విక్రమసింహపురి వీసీ ప్రొఫెసర్ వీరయ్య, ఆర్. సుదర్శనరావులను ఈ కమిటీలో నియమించవచ్చని తెలుస్తోంది. -
నాగార్జున వర్సిటీకి ఆగస్ట్ 4వరకూ సెలవులు
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయాన్ని నేటినుంచి వచ్చే నెల 4 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు ...పదిరోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం లోగా హాస్టల్స్ ఖాళీ చేయాలంటూ... సెలవులకు సంబంధించి నోటీసులను యూనివర్సిటీ అంతటా అంటించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు రిషికేశ్వరి కేసును నీరుగార్చేందుకే వర్సిటీకి సెలవులు ప్రకటించారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. -
విద్యార్థి ఉద్యమం
-
నాగార్జున వర్సిటీకి ఆగస్ట్ 4వరకూ సెలవులు
-
నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం
పరస్పర ఆరోపణలకు దిగిన విద్యార్థులు ♦ రెండు వర్గాల మధ్య ఘర్షణ ♦ సర్దిచెప్పిన పోలీసులు, కమిటీ సభ్యులు ♦ పోలీసుల మోహరింపు ♦ ప్రిన్సిపల్ సస్పెన్షన్ ♦ పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాక్షి, ఏఎన్‌యూ, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కళాశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ గురువారం వర్సిటీలో నిర్వహించిన బహిరంగ విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. కమిటీ ముందు విద్యార్థి సంఘాలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులు బాహాబాహీకి దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చే తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింపజేశారు. వర్సిటీకి చెందిన పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, బీసీఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు తమ వాదనలు వినిపించాయి. కమిటీ సభ్యులు ఘటన కు సంబంధించిన సూచనలు, సలహాలు, ఆధారాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఫ్రెషర్స్ పార్టీ పేరుతో హాయ్ లాండ్లోను, ఇతర సందర్భాల్లోనూ విద్యార్థులతో కలిసి నృత్యం చేశారని, ఆ దృశ్యాలతో కూడిన డీ వీడీ తమ వద్ద ఉందని దానికి కమిటీకి సమర్పిస్తామని దానికి ముందు బహిరంగంగా ఆ దృశ్యాలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన కమిటీ డీవీడీని ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు. ఈలోగా ఓ అధ్యాపకుడు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్‌పై ఆరోపణలు చేశారు. దీనికి వ్యతిరేకంగా అదే కళాశాలకు చెందిన కొందరు సీనియర్ విద్యార్థులు ఆరోపణలకు దిగారు. దీంతో విద్యార్థి సంఘాలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులకు మధ్య పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కమిటీ హాలులో గాజు పరికరాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణ పడుతున్న విద్యార్థులను కమిటీ సభ్యులు, పోలీసులు సర్దిచెప్పి కమిటీ హాలు నుంచి బయటకు పంపారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.బాబూరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు తెలిపారు. అప్పటికే ప్రిన్సిపల్ రాజీనామా సమర్పించారని, బుధవారం కళాశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో తనపై వచ్చిన అభియోగాలకు కలత చెంది, నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఈనెల 22వ తేదీతో ఆయన లేఖ సమర్పించారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులూ జారీ చేశామని తెలిపారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి డాన్సులు చేసిన సీడీలను విడుదల చేసిన నేపథ్యం వల్లనే రాజీనామా చేశారని కొందరు విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థినిది ఆత్మహత్యా ? హత్యా? రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు రిషితేశ్వరిది హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డది హత్యేననే అనుమానాలు వ్యక్తం చేస్తుం డడంతో పాటు పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో పోలీసులు హత్యా కోణంలోనూ విచారణ ప్రారంభించారు. లేడీస్ హాస్టల్ వద్ద ఉన్న సెల్‌టవర్ సిగ్నల్‌ను పరిశీలించి రిషితేశ్వరి వృుతి చెందిన సమయంలో అక్కడ మరో ఫోన్ ఏమైనా వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శృతిమించిన ర్యాగింగ్ తట్టుకోలేకే.. రిషితేశ్వరి మృతికి ముందురోజు ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కలిసి మంగళగిరిలోని ఓ థియేటర్లో ఫస్ట్‌షో సినిమాకు వెళ్లింది. అక్కడ ఓ సీనియర్ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక సినిమా నుంచి మధ్యలోనే హాస్టల్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత హాస్టల్లో రిషితేశ్వరిని ఓ సీనియర్ అర్థనగ్నంగా తిప్పిందని, సీనియర్ అబ్బాయిల మాట విననందుకు ఇది పనిష్మెంట్ గా అలా చేశారని రిషితేశ్వరి చెప్పిందని పలువురు విద్యార్థులు చెప్పుకుంటున్నారు. అర్ధనగ్న దృశ్యాలను వీడియో తీసిన ఆ సీనియర్ విద్యార్థిని తాను రిషితేశ్వరికి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా నమ్మించేందుకు 14వ తేదీ ఉదయాన్నే సీనియర్ అబ్బాయిలకు ఆ దృశ్యాలను చూపినట్లు సమాచారం. వాటిని అబ్బాయిలు కొందరు తమ సెల్ఫోన్లలోకి అప్లోడ్ చేసుకుని చూస్తున్న విషయం తెలుసుకున్న రిషితేశ్వరి అవమానాన్ని తట్టుకోలేక కాలేజీ నుంచి మధ్యలోనే వచ్చేసి హాస్టల్లోని తన గదికి వెళ్లి డైరీలో లాస్ట్నోట్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ పార్టీలో కొందరు విద్యార్థులు ఈ విషయాలను బయటపెట్టడంతో సమాచారం బయటకు పొక్కింది. రిషితేశ్వరి మృతితో సదరు సీనియర్ విద్యార్థులు తమ సెల్ఫోన్లలోని వీడియోలను డిలీట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ దిశగా విచారణ ప్రారంభించారు. -
సీడీలు చూస్తుంటే.. కరెంటు పోయింది!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషికేశ్వరి మరణంపై విచారణలో హైడ్రామా చోటుచేసుకుంది. రిషికేశ్వరి మరణంపై వర్సిటీలో నిజనిర్ధారణ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ గతంలో సాగించిన లీలలకు సంబంధించి సీడీల రూపంలో విద్యార్థులు కమిటీకి ఆధారాలు సమర్పించారు. కానీ ఆ సీడీలు చూస్తుండగా మధ్యలో రెండుసార్లు కరెంటు పోయింది. సరిగ్గా.. ఈ సమయంలోనే ప్రిన్సిపల్ అనుకూల వర్గానికి చెందిన విద్యార్థులు అక్కడకు ప్రవేశించారు. అక్కడే ఉన్న మీడియాపైన, విద్యార్థి సంఘాల నేతలపైన వాళ్లు దాడి చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. నిజనిర్ధారణ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా కొద్దిసేపట్లోనే ముగిసిపోయింది. ప్రిన్సిపల్ బాబూరావుపై సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ఆయన అనుకూల విద్యార్థులు నినాదాలు చేశారు. -
బాబూరావు సస్పెన్షన్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రిషికేశ్వరి ఆత్మహత్యపై ఏపీ ఉన్నత విద్యా మండలి స్పందించింది. ప్రిన్సిపాల్ బాబూరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు ఉన్నత విద్యా మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బాబూరావు వైఖరిపై పోలీసులు, నిజనిర్ధారణ కమిటీలు విచారణ సాగిస్తున్నాయి. రిషికేశ్వరి జూలై 14న హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. తర్వాత దిగ్బ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో స్పందించిన ఉన్నత విద్యా మండలి రిషికేశ్వరి ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. -
ఆ ప్రిన్సిపాల్ ఉంటే న్యాయం జరగదు.. తొలగించాలి
గుంటూరు: తమ కూతురు ఆత్మహత్యపై నియమించిన నిజనిర్దారణ కమిటీపై తమకు ఏమాత్రం నమ్మకంలేదని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య విచారణకు యూనివర్సిటీ వేసిన నిజనిర్దారణ కమిటీపై తొలిసారి సాక్షితో మాట్లాడిన పేరెంట్స్ మురళీకృష్ణ, దుర్గాభాయి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటే ఇంకేం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సమాజ సేవకులు, విద్యార్థులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లను కమిటీలో వేయాలని వారు డిమాండ్ చేశారు. ముందు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఆయన ఉద్యోగంలో ఉంటే తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఏడాది నుంచి తాము కాలేజీకి వస్తున్నా ఇంతవరకు హాస్టల్ వార్డెన్ ఎవరో కూడా తమకు తెలియదని, ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదని చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమె కనిపించలేదని అన్నారు. అంతా అయిపోయాక హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెడతామంటే ఏం లాభమని ప్రశ్నించారు. -
ఆ నిందితులను బహిష్కరించాలి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి మృతి కారణమైన వారిని వెంటనే కాలేజీ నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రిషికేశ్వరి మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. -
ఆత్మహత్య!
-
విద్యార్థినిని మింగేసిన ర్యాగింగ్ భూతం
ఏఎన్‌యూ : తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రథమ సంవత్సరం విద్యార్థిని మొండి రిషికేశ్వరి (18) మంగళవారం వర్సిటీ వసతి గృహంలో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్లో ఆమెపై తోటి విద్యార్థులు చేసిన ఆరోపణలు, వేధింపులు, వర్సిటీలో ర్యాగింగ్ భూతాన్ని ప్రస్ఫుటం చేశాయి. సీనియర్ విద్యార్థుల వేధింపులు, అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు అర్థమవుతుంది. తన అవయవాలను దానం చేయాలని నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది ఆ విద్యార్థిని ఔన్నత్యానికి నిదర్శనమని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. రిషికేశ్వరి మృతదేహాన్ని చూసిన తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చదువులో ముందే.. రుషికేశ్వరి చదువులో మెరిట్ విద్యార్థినిగా కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థినులు చెబుతున్నారు. బీఆర్క్ మొదటి సెమిస్టర్లో 1200 మార్కులకు 799 మార్కులు సాధించింది. చదువులో చురుగ్గా, మిత్రులతో చలాకీగా ఉండేదని పేర్కొన్నారు. కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి బాధపడేదని తెలిసింది. తన బిడ్డ పరిస్థితి తెలుసుకున్న తండ్రి పది రోజుల క్రితం యూనివర్సిటీకి వచ్చి రుషి కేశ్వరికి నచ్చజెప్పి, కళాశాల అధికారులతో మాట్లాడి వె ళ్లారని సిబ్బంది పేర్కొన్నారు. బోరున విలపించిన తండ్రి ... వరంగల్ నుంచి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసిన రిషికేశ్వరి తండ్రి మురళీకృష్ణ బోరున విలపించారు. ఒకే ఒక సంతానమైన తన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తె తనతో సంభాషించిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోయారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావు తదితరులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు... విద్యార్థిని మృతిపై వాస్తవాలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివ రావు మంగళవారం సాయంత్రం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన అనంతరం యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యూనివర్సిటీ బాలుర, బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్లు, విద్యార్థినుల ప్రతినిధులుగా వి. జ్యోతి ( జర్నలిజం), కె. నిర్మల (పరిశోధకురాలు), డాక్టర్ కె. వీరయ్య (జువాలజీ), డాక్టర్ జిమ్మీరాణి ( యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్)తో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇస్తుందని తెలిపారు. కొవ్వొత్తుల ర్యాలీ .. విద్యార్థిని మృతికి సంతాపసూచకంగా, ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి విద్యార్థినీవిద్యార్థులు యూనివర్సిటీలో కొవొత్తుల ర్యాలీ చేశారు. తొలుత ఇండోర్ స్టేడియం వద్ద మౌనం పాటించి విద్యార్థిని మృతికి నివాళులర్పించారు. ఆమ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ర్యాలీలో ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ డెరైక్టర్ ఆచార్య పి. శంకర పిచ్చయ్య, న్యాయవాది వై. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌తో విద్యార్థిని ఆత్మహత్య?
నాగార్జున వర్సిటీ (గుంటూరు) : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన మొండి రుషికేశ్వరి(18) ఆర్కిటెక్చర్ ఫస్టియర్ చదువుతోంది. క్యాంపస్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాస్టల్లో ఆమె మరో ఇద్దరు విద్యార్థినులతో కలసి ఉంటోంది. కాగా మంగళవారం కళాశాలకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయిన రుషికేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం స్నేహితులు తిరిగి వచ్చి చూడగా ఆమె విగతజీవిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కొన్ని రోజులుగా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట పెట్టిన వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వద్ద లభించిన సూసైట్ నోట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో జోరుగా మాస్‌కాపీయింగ్
-
వీసీ ఎంపికకు సెర్చ్ కమిటీ
హైదరాబాద్: గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఉపకులపతి నియామకానికి సంబంధించి ప్రభుత్వం గురువారం సెర్చికమిటీని నియమించింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితాదావ్రా ఉత్తర్వులు జారీచేశారు. ముగ్గురు సభ్యుల గల ఈ కమిటీ వీసీ పదవికి దరఖాస్తులను ఆహ్వానించి అందులో నుంచి ముగ్గురి పేర్లను వీసీ పోస్టుకోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. -
‘నాగార్జున’లో కొనసాగుతున్న పీజీ కౌన్సెలింగ్
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ కొనసాగుతోంది. యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో బుధవారం ఎమ్మెస్సీ కెమికల్ సైన్స్‌లో 1201 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. అలాగే, ఫిజికల్ సైన్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 200వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. దీంతోపాటు కామర్స్‌లో ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 500 ర్యాంకు వరకు ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ఏపీ పీసెట్ షెడ్యూల్ విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామ విద్యా కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీసెట్- 2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారని పీసెట్ కన్వీనర్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన పీసెట్ కమిటీ సమావేశంలో పీసెట్ షెడ్యూల్ ఖరారు చేశామని తెలిపారు. నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందనీ, దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 30 ఆఖరు తేదీ అని, అపరాధ రుసుముతో ఏప్రిల్ 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు ఈ ఏడాది మే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు మే నెల 7వ తేదీ నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
'పే స్కేలు పెంచకుంటే ఉద్యమమే'
గుంటూరు: నాగార్జున వర్సిటీలో అసిస్టెంట్ సీమాంధ్ర కాంట్రాక్టు లెక్చరర్ల భవిష్యత్తుపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు యూనివర్సిటీల కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో పాటు పే స్కేల్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..!
నాగార్జున విశ్వవిద్యాలయం పేరెత్తగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ ఉలిక్కిపడుతున్నారట! అక్కడ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుపుదామన్న ప్రతిపాదన వచ్చింది. సభాపతి కోడెల శివప్రసాదరావు అక్కడకు వెళ్లి పరిశీలించి కూడా వచ్చారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పలువురు ఆ యూనివర్సిటీకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాతే రాజకీయంగా నష్టపోయారన్నది ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం వాడుకలోకి వచ్చాక స్నాతకోత్సవాలకు కూడా గవర్నర్లు రావడం లేదని ఇక్కడి ఉద్యోగులు సైతం అంటుంటారు. పక్కనే కృష్ణా విశ్వవిద్యాలయానికి హాజరవుతున్న గవర్నర్లు నాగార్జున వర్సిటీకి మాత్రం రావడం లేదు. దీన్ని బాగా నమ్ముతున్న కారణంగానే చంద్రబాబు సైతం ఆ వర్సిటీ పేరెత్తగానే కంగారు పడుతున్నారని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గుంటూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు కోసం అధికారులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతిథి గృహాన్ని తీర్చిదిద్దారు. అయితే జ్యోతిష్యుల సూచనల మేరకు ఆయన ఆ అతిథి గృహంలో అడుగుపెట్టలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రదేశానికి పక్కనే హుటాహుటిన మరో విశ్రాంతి గదిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తర్వాత సెప్టెంబర్ 5న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఈ యూనివర్సిటీలోనే జరపాలని నిర్ణయించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యే తరుణంలో ఆఖరు నిమిషంలో వేదికను గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఇప్పుడు మూడోసారి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను యూనివర్సిటీలోని ఆడిటోరియంలోనే జరపాలని భావించి సభాపతి కోడెల ఉత్సాహం ప్రదర్శిస్తే.. ఆ ప్రతిపాదనను నీరుగార్చుతూ మరోసారి చూద్దామని బాబు చెప్పారట! మతలబేంటబ్బా...! కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారనగానే మిత్రపక్షమైన టీడీపీలో అప్పట్లో పెద్ద కలకలమే రేగింది. మోదీ తన కేబినెట్లో తొలిసారి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పిం చగా.. విస్తరణలో రెండో బెర్త్ ఇస్తున్నట్టు సమాచారం రాగానే పార్టీ ఎంపీల్లో చర్చ మొదలైంది. ఎంపీల్లో సీనియర్లలో బీసీలే ఉన్నందున వారిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును ప్రధానమంత్రికి సూచించారు. మిత్రపక్షమైన టీడీపీకి ఒక బెర్త్ ఖాయం చేసిన మోదీ ముందుగానే ఒక శాఖను ఎంపిక చేసుకున్నారు. అయితే చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును సూచించడంతో ఆ వెంటనే శాఖను కూడా మార్చారట. కొందరు టీడీపీ నేతలే రాత్రికి రాత్రి సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణల చిట్టాను కేంద్రానికి చేరవేశారు. అప్పటికే కేంద్రం వద్ద ఉన్న సమాచారానికి టీడీపీ నాయకులు పంపిన చిట్టా చేరడంతో సుజనాకు ఇవ్వాలనుకున్న శాఖను మార్చి అంతగా ప్రాధాన్యం లేని శాస్త్ర సాంకేతిక శాఖ (సహాయ మంత్రి)ను మోదీ కట్టబెట్టారని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది!! హమ్మయ్య.. బదిలీ అయ్యాడా.. ‘ఆ అధికారి బదిలీ అయ్యాడా.. హమ్మయ్య!’.. ఇదేదో ప్రభుత్వ ఆఫీసులో ఏదో పని కోసం వెళ్లి విసిగి వేసారిన సగటు మనిషి నిట్టూ ర్పుకాదు.. తెలంగాణలో సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి నిస్సహాయత. ఏవో పనుల కోసం తన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యేలకు సాయం చేసేందుకు సదరు మంత్రివర్యులు ఓ డీఎస్పీకి ఫోన్ చేస్తే... అతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినలేదు.. పనికాలేదని తెలిసి మంత్రిగారు చెడా మడా తిట్టినా కదలిక లేదు. ఇక చేసేది లేక తన ఓఎస్డీని పిలిపించుకుని ‘ఆ డీఎస్పీ మాట వినడం లేదు, ఏం చేద్దా’మంటే... ‘ఏం చేయడమెందుకు సార్.. బదిలీ జాబితాలో ఉన్నాడు. వారం రోజులు ఆగితే చాలు’ అని ఓఎస్డీ సలహా ఇచ్చాడు. ఓ వారం అయ్యాక డీఎస్పీ బదిలీ అయ్యాడు. ఈ సంగతి తెలిసిన మంత్రివర్యులు.. ‘హమ్మయ్య.. ఇప్పుడు వచ్చిన అధికారి అయినా మాట వింటాడంటావా?..’ అని నిట్టూర్చారు. రాష్ట్రంలో ఓ శాఖను పర్యవేక్షించే మంత్రి మాటకే అధికారుల వద్ద విలువ లేకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏమిటో.. అంటూ ఓ శాసనసభ్యుడు అసలు విషయం చెప్పాడు. -
నాగార్జున వర్శిటీలోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
* శాసనసభ స్పీకర్ కోడెల వెల్లడి * ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత 15 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసన సభ అధికారులు, ఎమ్మెల్యేలు, యూనివర్సిటీ అధికారులతో కలిసి ఆయన సోమవారం వర్సిటీ భవనాలను పరిశీలించారు.డైక్మన్ ఆడిటోరి యం అసెంబ్లీ నిర్వహణకు అనుకూలమైనదిగా గుర్తించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడిటోరియంలో స్వల్ప మార్పులు చేసి అసెంబ్లీగా వాడుకోవచ్చని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాక భద్రత, సభ్యులకు వసతి తదితర ఏర్పాట్లు పూర్తిచేస్తామని చెప్పారు. విజయవాడ, గుంటూరుల్లో ఎమ్మెల్యేల కు బస ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీలోని డైక్మన్ హాలులో జరుగుతాయి. శాసనమండలి సమావేశాలు కూడా ఇదే హాలుకు అనుబంధంగా ఉన్న సమావేశ మం దిరంలో జరుగుతాయి. డిసెంబర్ తొలి వారంలో అయితే పదిరోజులు జరగవచ్చు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో సీఎంకు బస సీఎంకు విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నాగార్జున వర్శిటీలోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
-
రేపు నాగార్జున వర్సిటీని సందర్శించనున్న కోడెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. దీంతో ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తారా అనే చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ముందుగా 9 శాఖల తరలింపు
హైదరాబాద్: ఏపికి సంబంధించిన 9 ముఖ్యమైన శాఖలను గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, విజయవాడ, గొల్లపూడిలకు తరలించాలని నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన హెచ్డీఓల తరలింపు కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ తరువాత తొలివిడతగా ప్రభుత్వ శాఖలను తరలించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ముందుగా హొం, విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక, రెవిన్యూ, మునిసిపల్, మత్స్య, అగ్నిమాపక శాఖలను తరలించాలని నిర్ణయించారు. ** -
వేగంగా విజయవాడకు...
-
వేగంగా విజయవాడకు..
తాత్కాలిక రాజధానికి కార్యాలయాల తరలింపునకు చర్యలు నాగార్జున వర్సిటీలో సచివాలయం, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల ఏర్పాటుకు ప్రతిపాదనలు గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ కార్యాలయం! సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ-గుంటూరు నడుమ రాజధాని నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్‌లు అజేయ్ కల్లం, శాంబాబ్, సాంబశివరావులతో కూడిన కమిటీ గుంటూరు, విజయవాడల్లో పర్యటించి తక్షణం కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను, ఉన్న సౌకర్యాలను పరిశీలించింది. నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు లాంఫాం, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు, కెనాల్ గెస్ట్‌హౌస్, మేథా టవర్, కానూరులోని నాలుగు అపార్టుమెంట్లను ఈ బృందం పరిశీలించింది. గొల్లపూడిలో మార్కెటింగ్ శాఖ, విజయవాడ కెనాల్ గెస్ట్‌హౌస్‌లో మరికొన్ని కీలక శాఖలు, మేధా టవర్‌లో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. నాగార్జున వర్సిటీలో రాష్ట్ర సచివాలయం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడికే రెవెన్యూ శాఖను కూడా తరలించాలన్న భావిస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్న మంత్రులకు అధికారుల కమిటీ పర్యటన ఊతమిచ్చినట్టయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులకు వారున్న చోటనే కార్యాలయాల ఏర్పాటుకు అవకాశమేర్పడింది. కృష్ణా జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు తొలుత విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఈఎన్సీ కార్యాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించడంలేదు. గుంటూరు లాంఫాంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు మంత్రి ప్రతిపాటి పుల్లారావు యోచిస్తున్నారు. నాగార్జున వర్సిటీలో సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రతిపాదించినట్టు తెలిసింది. -
ఏపీ తాత్కాలిక సచివాలయంగా నాగార్జున వర్సిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీని ఎంపిక చేశారు. కొత్త రాజధాని కోసం భూ సేకరణ జరిపే గ్రామాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల కమిటీ యూనివర్సిటీలోని భవనాలను పరిశీలించింది. యూనివర్సిటీలోని కొన్ని శాఖలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుంటూరు జిల్లాలోనే నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారులు, నాయకులు ఇప్పటికే భూ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
విజయవాడలో డీజీపీ క్యాంప్ ఆఫీస్?
విజయవాడ: త్వరలో విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) క్యాంప్ కార్యాలయం ప్రారంభం కానున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలోని రాష్ట్ర అతిథిగృహంలో సీఎం చంద్రబాబు అధికారిక కార్యకలాపాలు ప్రారంభించేలోగా డీజీపీ క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మొదట గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలో మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో డీజీపీ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేయాలనుకున్న విషయం విదితమే. అయితే సీఎం క్యాంప్ ఆఫీసు విజయవాడకు మారిననందున డీజీపీ ఆఫీసు కూడా బెజవాడకు మారే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
పోలీసులపై తిరగబడిన టిడిపి కార్యకర్తలు
-
పోలీసులపై తిరగబడిన టిడిపి కార్యకర్తలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక వద్ద తెలుగుతమ్ముళ్లుపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. వేదిక వద్ద వీఐపీ గ్యాలరీల్లోకి చొచ్చుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు పోలీసులపై తిరుగబడ్డారు. కుర్చీలు తీసుకొని విసిరివేశారు. వాటిని విరగగొట్టారు. దీంతో వేదిక వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నేడు బాబు ప్రమాణ స్వీకారంభారీగా ఏర్పాట్లు
అష్ట దిగ్బంధంలో విజయవాడ అధికారుల ట్రయల్ రన్ తరలిరానున్న ప్రముఖులు నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు రానుండటంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో విజయవాడలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్, ఐదుగురు ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, 15 మంది కేంద్ర మంత్రులు వస్తారని అంచనా. వీరంతా గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఏఎన్‌యూ ఎదురుగా ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా కనకదుర్గ వారధి మీదుగా ట్రయల్ రన్ నిర్వహించారు. హోటళ్లు అన్నీ హౌస్‌పుల్! విజయవాడ నగరంలో సుమారు 100 హోటళ్ల వరకు ఉండగా వాటిని ఇటు అధికారులు, అటు తెలుగుదేశం నాయకులు బుకింగ్ చేశారు. దీంతో సాధారణ యాత్రికులు నానా ఇబ్బందులు పడ్డారు. హోటళ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు. నగరంలోనూ ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నందున ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరానికి వీఐపీలు, అధికారులు తాకిడి ఎక్కువ కావడంతో దుర్గగుడిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచే రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
నిఘా నీడలో..
వీవీఐపీలకు మూడంచెల భద్రత వీఐపీల బస వద్ద ప్రత్యేక బృందాలు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో పోలీసు నిఘా భారీగా పెంచారు. వీవీఐపీలు, వీఐపీలు బసచేసే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు ముమ్మరం చేశారు. విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడలో నిఘా భారీగా పెరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ పార్టీల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రముఖులు (వీవీఐపీ), ప్రముఖులు (వీఐపీ)లు బసచేసే ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఐజీలు ఎన్వీ సురేంద్రబాబు, గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు భద్రత చర్యలపై దృష్టిసారించారు. శనివారం ఉదయంలోగా అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులకు హాజరుకానున్నారు. నగర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ, ప్రత్యేక బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. నగర పోలీసు కమిషనరేట్‌లో 10 కంపెనీల సీఆర్పీఎఫ్, 2 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలు అందుబాటులో ఉన్నాయి. మరో 20 ప్లాటూన్ల బలగాలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. పొరుగు జిల్లాల పోలీసులను కూడా అందుబాటులో ఉంచారు. రెండువేల మందితో విడిది కేంద్రాలకు భద్రత.. పలువురు ప్రముఖులు అతిథి గృహాలు, ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు. శనివారం నుంచే వీరు వచ్చే అవకాశముంది. ఆయా వ్యక్తుల హోదాను బట్టి అతిథి గృహాలు, హోటళ్లను రెవెన్యూ అధికారులు కేటాయిస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ల వద్ద రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రముఖులను కలిసేందుకు వచ్చేవారిని నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించనున్నారు. వీరు బసచేసే ప్రాంతాల్లో భద్రత చర్యల్లో భాగంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస కేంద్రాలకు సమీపంలో నివసించే వారి వివరాలు సేకరించారు. కొత్తగా వచ్చిన వారి వివరాలను సైతం పోలీసు అధికారులు తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీఐపీల కాన్వాయ్‌లు సిద్ధం.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖుల కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా జరిగింది. శనివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏ కాన్వాయ్‌లో ఎవరు విధులు నిర్వహించాలనే విషయాన్ని అధికారులు ఖరారు చేశారు. కంట్రోల్ రూం.. గన్నవరం విమానాశ్రయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రముఖుల రాకపోకలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు. తద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమంది.. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యిమందిని వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించనున్నారు. పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రమాణ స్వీకారం రోజున ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టారు. బెజవాడతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మీదుగా ఏ విధమైన వాహనాలూ రాకుండా గుంటూరు, ఒంగోలు, హనుమాన్‌జంక్షన్, రాజమండ్రి ప్రాంతాల మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం గన్నవరం నుంచి విశ్వవిద్యాలయం వరకు వెళ్లే మార్గంలో అనుమతి ఉంటేనే వాహనాలను పంపుతారు. ఆరోజు ఆ మార్గంలో ఏ విధమైన ప్రయాణాలూ పెట్టుకోరాదంటూ ఇప్పటికే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నందున కీలక ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర నిఘా బృందాలు విజయవాడలో బస చేసే ఆయా ప్రాంతాలపై దృష్టిసారించాయి. -
బాబుతో 15 మంది మంత్రుల ప్రమాణం?
*ప్రధాని వస్తే మాత్రం చంద్రబాబు ఒక్కరే.. మోడీ రాక అనుమానమేనంటున్న పార్టీ వర్గాలు హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే చంద్రబాబు ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదంటే మంత్రులు కూడా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ప్రధాని రాక అనుమానమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదో తేదీ ఉదయం పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ కార్యక్రమానికి ఆయన తప్పక హాజరు కావాల్సి ఉండటమే దీనికి కారణం. మోడీ రానిపక్షంలో తనతోపాటు ఆరు నుంచి 15 మందికి తగ్గకుండా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గౌతు శ్యామసుందర శివాజీ (శ్రీకాకుళం), పతివాడ నారాయణస్వామి నాయుడు(విజయనగరం), అయ్యన్నపాత్రుడు(విశాఖపట్నం), యనమల రామకృష్ణుడు(తూర్పు గోదావరి), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), దేవినేని ఉమామహేశ్వరరావు (కృష్ణా), కోడెల శివప్రసాదరావు(గుంటూరు), సిద్ధా రాఘవరావు(ప్రకాశం), పి.నారాయణ (ఎస్పీఎస్ఆర్ నెల్లూరు), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(చిత్తూరు), కేఈ కృష్ణమూర్తి (కర్నూలు)లకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ముద్రించిన ఆహ్వానపత్రాల్లో కోరింది. మరోవైపు తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన, పోటీచేయని నేతలు చంద్రబాబు ముందు క్యూ కడుతున్నారు. పరాజితులైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పోటీచేయని టీడీ జనార్దనరావు, కరణం బలరామకృష్ణమూర్తి వీరిలో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి పయ్యావుల కేశవ్ గురువారం రాత్రి బాబును కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తదితరులు పాల్గొన్నారు. మనకు విద్యుత్ కష్టాలు తప్పవు: అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు రానున్న కాలంలో విద్యుత్ కష్టాలు తప్పవని చంద్రబాబుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉందని, అదే సమయంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు గ్యాస్ లేదని తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు తయారు చేయాల్సిందిగా చంద్రబాబు వారికి సూచించారు. చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల భేటీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు జేఏ చౌదరి నేతృత్వంలో గురువారం రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రూ.5,600 కోట్లతో 12 రకాల పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలో విజయవాడలో పెట్టుబడుల సమ్మిట్ ఏర్పాటు చేస్తామన్నారు. -
హైమాస్ట్ లైట్లు...రెయిన్ ప్రూఫ్ టెంట్లు
*చంద్రబాబు ప్రమాణానికి చకచకా ఏర్పాట్లు గుంటూరు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వేదిక ఏర్పాట్ల పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాంగణంలో తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం రాత్రి వేళ జరగనున్న క్రమంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి నడికుడి మీదుగా వచ్చే రైళ్లకు ప్రాంగణం సమీపంలోని నాగార్జుననగర్ వద్ద హాల్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రానికి ప్రాంగణమంతా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు చెప్తున్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బృందాలు ఈ పనులను స్వయంగా పరిశీలిస్తున్నాయి. 70 ఎకరాల ప్రాంగణంలో 50 ఎకరాల్లో వేదిక, బహిరంగ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మిగిలిన 20 ఎకరాలు పార్కింగ్‌కు కేటాయించారు. తొలుత వీఐపీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, ప్రధాన సభకు మూడు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వీఐపీల వేదికను రద్దు చేసి కేవలం రెండు వేదికలనే నిర్మిస్తున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం.దానకిషోర్, అర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించి, అవసరమైన ఆదేశాలు జారీచేశారు. డీఐజీ రామకృష్ణ, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు సత్యనారాయణ, గోపీనాథ్‌లు బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఐదు వేల మందికి వీఐపీ పాస్‌లు... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం 5,000 మంది వీఐపీలకు పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్ర నేత మన్నవ సుబ్బారావుతో ప్రత్యేకంగా సమావేశమై వీఐపీల పాస్‌ల జారీ విషయమై చర్చించారు. పార్టీ ఎంపీ మొదలుకొని మాజీ ఎమ్మెల్యే వరకు, పార్టీ ముఖ్య నేతలందరికీ వీఐపీ పాస్‌లు జారీ చేయాలని రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు కలెక్టర్‌ను కోరారు. పార్టీ అధ్యక్షులు సూచించిన వారికే జిల్లాల వారీగా పాస్‌లు జారీ చేయనున్నారు. ఇదిలావుంటే.. ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు కాకుండా వేదికపై 40 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాణ స్వీకార అనంతరమే మిగిలిన వారిని వేదికపైకి అనుమతిస్తామన్నారు. రాజ్‌నాథ్ పర్యటన ఖరారు... చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు తెలిపారు. రాజ్‌నాథ్‌తో పాటు ముగ్గురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన ఖరారైందని, అలాగే కేంద్రమంత్రులు కొంతమంది కార్యక్రమానికి వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకారం బందోబస్తుకు అదనంగా రూ.1.5 కోట్లు మంజూరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంజూరు చేసిన దానికి ఇది అదనమని జీవోలో వివరించింది. ఈ నిధుల్ని పోలీసు సిబ్బంది డైట్ చార్జీలు, వాహనాల అద్దె, ఆహారం, మంచినీరు సరఫరా, నిఘా కోసం అద్దె కెమెరాలు సమకూర్చుకోవడంతో పాటు షామియానాల అద్దెకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఏఎన్‌యూలో ఎస్‌డీఏఏ కేంద్రం ప్రారంభం
గుంటూరు: ఇస్రో సాంకేతిక సహకారంతో నడిచే ఎస్‌డీఏఏ (శాటిలైట్ డేటా అనాలసిస్ అండ్ అప్లికేషన్) కేంద్రాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య కె.వియన్నారావు ప్రారంభించారు. ఇస్రో నుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని సమాజానికి, పరిశోధనలకు, విద్యాపరమైన అంశాలకు ఉపయోగించటానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే భూగర్భ జలాలు, ఖనిజాలు, కోతకు గురయ్యే ప్రాంతాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సారవంతమైన భూమిని గుర్తించటం, అటవీ సంపదను గుర్తించి దాన్ని పరిరక్షించటం, వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ముందే సమాచారాన్ని చేరవేయటం, కోత ప్రాంతాలను గుర్తించటం వంటి చర్యలను ఈ కేంద్రం ద్వారా నిర్వహిస్తారు. ఇస్రో నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించి దాన్ని అవసరమైన విధంగా ఆయా జిల్లాల ప్రభుత్వ అధికారులకు ఏఎన్‌యూ పరిశోధన కేంద్రం అందిస్తుంది. ఇస్రో అనుసంధానంగా నడిచే పరిశోధన కేంద్రాన్ని ఒక విశ్వవిద్యాలయానికి మంజూరు చేయటం దేశంలోనే ఇదే మొదటిసారని పరిశోధన కేంద్రం కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సిద్దయ్య చెప్పారు. -
తెలుగు జాతిరెండు ముక్కలు
విభజన పూర్తి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తెలంగాణ 8న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాజధాని కోసం ఎదురుచూపులు అక్షరక్రమంలోనే కాదు.. అన్నింటా ముందువరుసలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఒకటి.. దేశ రాజకీయాలను శాసించే సత్తాగల రాష్ట్రమిది.. ఆర్థికంగా, సామాజికంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్.. ఇలా ఇప్పటి వరకు గొప్పగా.. గర్వంగా చెప్పుకొన్న మాటలు ఇకమీదట చెప్పుకోలేం. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నిలువునా చీలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. కొన్నాళ్లుగా ఈ పరిణామాలను నిశ్శబ్దంగానే గమనిస్తూ వచ్చిన జిల్లావాసులు మాత్రం స్తబ్దుగానే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగిసింది. తెలుగు జాతి అధికారికంగా రెండు ముక్కలు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తెలంగాణ 29వ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. రెండు రాష్ట్రాలకు రెండు ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. తెలంగాణ అంతటా సోమవారం ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్‌లో స్తబ్దత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల ఎనిమిదిన విజయవాడ - గుంటూరు మధ్య నాగార్జునా యూనివర్సిటీ వద్ద ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఈ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్... తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్ల కోసం ఎనిమిది కోట్ల తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసింది. తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మంటగలిపింది. భావోద్వేగాల కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదన్న ఇందిరా గాంధీని మాటలను కూడా గంగలో కలిపింది. ‘రాష్ట్రం విడిపోదు.. మాకు స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నాడు’ అన్న పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ధీమాకు గండి కొట్టింది. దీంతో ఆయన తాను ముందుగా చెప్పిన ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కుటిల యత్నాలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు వంత పాడాయి. తెలుగుజాతిని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రధాన భూమిక పోషించాయి. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం మాత్రమే నిబద్ధతతో పోరాడాయి. నిన్నటి వరకు సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బీజేపీ నేతలు... నేడు తెలంగాణ ఇవ్వడంలో తమ వాటానే ఎక్కువని నిస్సిగ్గుగా చెప్పుకొంటూ సీమాంధ్ర ప్రజల్ని రోడ్డున పడేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేశారు సీమాంధ్ర ప్రజలు. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. హామీల అమలుపైనే ఆశలు... విభజన ప్రక్రియ అనంతరం రాష్ట్రానికి కేంద్రం ఇస్తానన్న హామీల అమలుపైనే జిల్లా వాసులు ఆశ పెట్టుకున్నారు. రాష్ట్రంలో జాతీయస్థాయి ప్రాధాన్యమున్న ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐఎస్ఐఆర్, సెంట్రల్ యూనివర్సిటీ వంటివి జిల్లాకు వచ్చే విధంగా స్థానిక నేతలు కృషిచేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి బోధనా సంస్థలను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. గన్నవరం విమానాశ్రయం స్థాయిని పెంచేందుకు కృషిచేయాలనేది స్థానికుల ఆకాంక్ష. కొత్త రైల్వే జోన్‌తో పాటు మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాట్లను నెరవేరిస్తే.. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న జిల్లా వాసుల మనోభావాలు కొంత కుదుటపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మౌనంగా బెజవాడ... దేశవ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా స్పందించే విజయవాడ నగరం అన్యాయంగా జరిగిన విభజనను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. జూన్ రెండో తేదీ అపాయింటెడ్ డే ప్రకటన జారీ అయినప్పటినుంచి విభజన ప్రక్రియ అంశాలను జిల్లా వాసులు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. ఒకపక్క రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పదవీ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ఈ ప్రక్రియ ఏవిధంగా జరుగుతోంది.. ఎవరి పర్యవేక్షణలో జరుగుతోందనే అంశాలను పరిశీలిస్తున్నారు. విభజనలో ముఖ్య ఘట్టాలు... 2009 డిసెంబర్ తొమ్మిదిన అప్పటి హోంమంత్రి చిదంబరం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందంటూ ప్రకటన చేశారు. దీనిని తీవ్రంగా నిరసిస్తూ పదో తేదీ నుంచి సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. 2010 జనవరి 12న రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వాన కమిటీని వేసింది. 2010 మార్చి నాలుగు నుంచి ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించింది. 2012 డిసెంబర్ 5న అఖిలపక్షం వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. 2012 డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం జరిగింది. 2013 జూలై 30న యూపీఏ సమన్వయ కమిటీ. సీడబ్ల్యూసీ విడివిడిగా సమావేశమై తెలంగాణ ఆవిర్భావానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. 2013 ఆగస్టు 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె 66 రోజులు కొనసాగింది. 2013 అక్టోబర్ 3న తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2013 డిసెంబర్ 6న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. 2013 డిసెంబర్ 16న శాసనసభ, శాసనమండలిలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి ఒకటిన మూజువాణి ఓటుతో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బిల్లును వ్యతిరేకించాయి. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2013కు లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2014 ఫిబ్రవరి 28న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయించారు. 2014 జూన్ 2న అపాయింటెడ్ డేతో రాష్ట్ర విభజన పూర్తయింది. -
సజావుగా ఐసెట్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఐసెట్-2014 జిల్లాలో సజావుగా ముగిసింది. జిల్లా నుంచి 1551 మంది దరఖాస్తు చేసుకోగా 1370 మంది(88.33 శాతం) హాజరయ్యా రు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 500 మందికి 439 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 551 మందికి 478 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో 300 మందికి 274 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో 200 మందికి 179 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకురాలు ప్రొఫెసర్ అనిత, జిల్లా ఐసెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, పరిశీలకులు డాక్టర్ కూన అచ్యుతరావు, డాక్టర్ సంతోష్ రంగనాథ్‌లు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష జరిగిన తీరును పరిశీలించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు బమ్మిడి పోలీస్, కె.మైథిలి, పాలిటెక్నిక్‌ల విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, సత్యనారాయణలు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. -
యువతకు గాలం
యువతీ యువకులపైనే రాజకీయపార్టీల దృష్టి మునిసిపల్ ఎన్నికల నుంచే మచ్చిక చేసుకునే యత్నం 6,70,564 మంది ఓటర్లలో సగం మంది 25 ఏళ్లలోపు వారే తాయిలాల ఎర వేస్తున్న రాజకీయ పార్టీల నేతలు తమ ప్రతినిధి జగన్ అంటున్న నేటి యువతరం సాక్షి, గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో మొదటి అంకం ముగిసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీలన్నీ యువత ఓట్లకు గాలం వేసేందుకు పోటీలు పడుతున్నాయి. పట్టణాల్లో యువజన సంఘాలకు తాయిలాల ఎర వేస్తున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా వీరిని తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ నేతలు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి గుంటూరు జిల్లా చుక్కాని అయింది. అన్ని పట్టణాల్లో ప్రధానంగా యువత కదం తొక్కింది. కళాశాలల విద్యార్థులు గళమెత్తి నినదించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై యువతలో ఏహ్యాభావం గూడు కట్టుకుంది. చైతన్యవంతమైన పట్టణాల్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణబద్ధులయ్యారు. లేఖ ఇచ్చి చంద్రబాబు విభజనకు కారణమయ్యారని యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్ కుదేలు కాగా, టీడీపీ యువతను ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతోంది. యువత ఓట్లు మున్సిపాలిటీలలో కీలకం కావడంతో తాయిలాల ఎర వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో యువతను తమవైపునకు తిప్పుకుంటే, సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చనే ఆలోచనతో టీడీపీ నేతలు వున్నారు. దీంతో యువజన సంఘాలను క్రికెట్ కిట్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో ఆకట్టుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తరహా వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. టీడీపీకి ప్రధాన మద్దతుదారుగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కళాశాలల్ని ఎంచుకుని యువత ఓట్లకు గాలమేస్తున్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ కారణం కాదని చెప్పుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు వయస్సు 65కి చేరడంతో యువతపై ఆయనకున్న విజన్ ఏంటని పలు కళాశాలల్లో ప్రశ్నించడం గమనార్హం. యువత ఓట్లను ఆకర్షించడానికి గతంలోనే చంద్రబాబు కళాశాలల వెంట తిరిగినప్పుడు ఆయనకు తలంటిన సందర్భాలు గుర్తు చేస్తున్నారు. యువతరానికి ప్రతినిధి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, చంద్రబాబుకు, జగన్‌కు మధ్య వయస్సు తేడాను ఈ సందర్భంగా యువత గుర్తు చేయడం పరిశీలనాంశం. 25 ఏళ్లలోపు వారే మున్సిపల్ ఓటర్లలో అధికం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 6,70,564 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3 లక్షలకు పైగా యువత ఉన్నట్లు అంచనా. - తెనాలిలో 1,28,234 మంది ఓటర్లుంటే, 18-19 సంవత్సరాల ఓటర్లు 3,653 మంది, 20-29 సంవత్సరాల ఓటర్లు 33,693 మంది, 35 ఏళ్ల లోపు ఓటర్లు 30,974 మంది ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 70,684 మంది ఓటర్లుంటే, 20 ఏళ్ల లోపు 6,552 మంది, 30 ఏళ్ల లోపు 27,904 మంది వున్నారు. ఇక 30 ఏళ్లలోపు ఓటర్లు... నరసరావుపేటలో 81,250 మంది ఓటర్లుకు 30 ఏళ్ల లోపు ఓటర్లు 42 వేల వరకు ఉన్నారు. బాపట్లలో 50,321 మంది ఓటర్లకు 22,119 మంది, పొన్నూరులో 47,108 మంది ఓటర్లకు 19,076 మంది, రేపల్లెలో 32,866 మంది ఓటర్లకు 14,098 మంది, మాచర్లలో 44,894 మంది ఓటర్లకు 13,789,మంగళగిరిలో 51,614 మంది ఓటర్లకు 25 వేలకు పైగా, సత్తెనపల్లిలో 41,038 మందికి 21,022 మంది, వినుకొండలో 41,038 మందికి 17,157, పిడుగురాళ్లలో 46,852 మందికి 23వేలు, తాడేపల్లిలో 34,665 మందికి 14,919 మంది యువ ఓటర్లున్నారు. -
ఐదు రైళ్లకు అదనపు బోగీలు
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న నాగార్జుననగర్‌లో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చే భక్తుల కోసం గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక ప్రయాణ సదుపాయాలను ఏర్పాటు చేశారు. పలు ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నర్సాపూర్-గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్ ైరె లుకు 26వ తేదీ నుంచి 29 వరకు ఏకంగా 10 జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. కాకినాడ-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-మాచర్ల, డోన్-గుంటూరు స్టేషన్ల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లకు ఒకటి లేదా రెండు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైలును గుంటూరు స్టేషన్ వరకూ పొడిగించారు. ఈ బండికి సభలు జరిగే నాగార్జుననగర్ స్టేషన్లో హాల్టు కూడా కల్పించారు. అదేవిధంగా కాకినాడ-విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలుబండిని కూడా నాలుగు రోజుల పాటు గుంటూరు వరకూ నడపనున్నారు. గుంటూరు నుంచి వయా విజయవాడ మీదగా సికింద్రాబాద్ వరకూ నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు కూడా నాగార్జుననగర్స్టేషన్లో రెండు నిమిషాల హాల్టును ఏర్పాటు చే సినట్లు గుంటూరు రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు. -
కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు
పెదకాకాని: నాగార్జున వర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విజయనగరానికి చెందిన ఓ విద్యార్థిని బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తోంది. ఆ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకిషోర్ ఈనెల 15న విద్యార్థిని ఫోన్‌కు ఓ మెసేజ్ పెట్టాడు. 16న డిపార్ట్మెంట్కు ఒక్కదానివే రావాలని, పర్సనల్‌గా మాట్లాడాలని అందులో ఉంది. ఆమె సహ విద్యార్థినిని తోడు తీసుకుని వెళ్లగా ఆమె ను బయటకు పంపి, బాధిత విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, మరో వ్యక్తితో ఆమె కలసి ఉండటం ముగ్గురం చూశామనీ, వారితోనూ మాట్లాడమని చెప్పాడు. ఇంకా లాప్టాప్లో విద్యార్థిని ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను చూపాడు. అతడినుంచి తప్పించుకుని వచ్చిన వి ద్యార్థిని ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. 16వ తేదీ రాత్రి కూడా కృష్ణకిషోర్ మెసేజ్ పెట్టడంతో మంగళవారం తండ్రిని రప్పించి తనతో కలసి పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి డిఎస్పీ ఎం మధుసూదనరావు తెలిపారు. -
డూప్లి‘కేటు’ ఎస్‌ఏలకు ఉచ్చు
=ఓ వైపు సీబీసీఐడీ.. మరోవైపు లోకాయుక్త = పూర్తిస్థాయి వివరాల కోసం విద్యాశాఖ అధికారుల కసరత్తు =ఎస్జీటీలుగా మారనున్న సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు ఖమ్మం, న్యూస్‌లైన్: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) లుగా పదోన్నతి పొందిన కొందరు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు ఉచ్చు బిగుసుకుంటోంది. ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడిన’ చందంగా వారి పరిస్థితి తయారవుతోంది. 2009లో ఇంగ్లిష్ ఎస్ఏలుగా పదోన్నతి పొందిన వారిలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి రివర్షన్ త ప్పదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తప్పును కప్పిపుచ్చుతూ ఇంతకాలం విధులు నిర్వహిస్తున్న సంబంధిత ఇంగ్లిష్ టీచర్ల వ్యవహారంపై ఓవైపు లోకాయుక్త, మరోవైపు సీబీసీఐడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ విచారణతో తమ గు ట్టు ఎక్కడర ట్టవుతుందోనని సంబంధిత ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. తమ సర్టిఫికె ట్లు నకిలీవని తేలితే శిక్షతో పాటు పరువు గం గలో కలుస్తుందని ఆందోళన చెందుతున్నారు. 2009తో జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించారు. ఎస్జీటీలుగా ఉన్నవారికి సీనియార్టి, అదనపు అర్హతల ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో రాష్ట్రవ్యాప్తంగా 2,650 మంది, జిల్లాలో 80 మందికి పైగా నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రమోషన్ పొందారని పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వినాయక మిషన్ యూనివర్సిటీ అండ్ రిసెర్చ్ నుంచి 35 మంది, మనోవినం సందర్నార్ విశ్వవిద్యాలయం నుంచి పది మంది, కువ్వెంపు యూనివర్సిటీ నుంచి 27 మంది, ఓ ఇద్దరు ఇగ్నో, 15 మంది ఉస్మానియా, నలుగురు కాకతీయ, ఒక్కరు నాగార్జున యూనివర్సిటీల నుంచి తెలుగు, ఇంగ్లిష్ పీజీ, బీఎడ్ సర్టిఫికెట్లు సమర్పించి ఎస్ఏలుగా పదోన్నతి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి క మిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూనం మాలకొండయ్య స్పందించారు. 14 అంశాలతో ఆర్సీ నంబర్ 09/డి1/డి2/2009, తేదీ 31.03.2010 పేరిట ఆర్డర్ జారీ చేసి 9.4.2010న సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులను పంపించారు. విచారణ ముమ్మరం.. అడ్డదారిలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల భరతం పట్టేందుకు ఓవైపు సీబీసీఐడీ, మరోవైపు లోకాయుక్త కసరత్తు ప్రారంభించింది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి విద్యాశాఖనే బురడి కొట్టించారని ‘ఒరిజనల్ టీచర్స్ అధికారులు’ లోకాయుక్తతోపాటు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు. జిల్లాలో పలువురు అధికారులు వారికి వత్తాసు పలికి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని, ఇలా అయితే నిజాలు తేలవని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ విచారణ చేపట్టాల్సిందిగా సీబీసీఐడీని కోరింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సీబీసీఐడీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి పూర్తివివరాలు తెప్పించుకున్నారు. జిల్లాలో 66 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. మరోవైపు లోకాయుక్త కూడా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన పూనం మాలకొండయ్య సూచించిన 14 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, డిప్యూటీ డీఈఓల ద్వారా సేకరించిన విచారణ రిపోర్టును అందజేయాలని లోకాయుక్త ఆదేశించింది. ఆ నివేదికలో సూచించిన విధంగా స్టడీ సెంటర్ల నిర్వహణ, ఒకే సంవత్సరంలో పీజీ పూర్తిచేయడం, యూనివర్సిటీ మార్కుల జాబితా వివరాలను అధికారులు పరిశీలించారు. డెక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యూనివర్సిటీల సర్టిఫికెట్లు, పరీక్షల సమయంలో సెలవుపెట్టకుండా ఎగ్జామ్స్ ఎలా రాశారని, సంవత్సరకాలంలో రెండు డిగ్రీలు ఎలా పొందారనే వివరాలతో జిల్లా అధికారులకు ఫైల్ పంపించారు. నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందిన వార్ని ఇంతకాలం కాపాడుతూ వచ్చిన జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు ఇప్పుడు చేతులు ఎత్తివేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదికలు అందజేయక తప్పదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయి నివేదికలతో తమ ఉద్యోగులను మంగళవారం హైదరాబాద్ పంపించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి పాతఫైల్స్ను బూజుదులిపే పనిలో ఉన్నారు. నకి‘లీలలు’ బయటకొస్తే ఎస్ఏలుగా పొందిన అదనపు వేతనంతో పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.