రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలన్నీ ఈనెల 28లోగా వెబ్‌సైట్‌లో తమ కళాశాలల డేటాను అప్‌లోడ్ చేయాలని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌చెర్మైన్ ఆచార్య పి.నరసింహారావు సూచించారు. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వేకు అవసరమైన సమాచారాని కళాశాలలు అందించే అంశంపై గురువారం ఆచార్య నాగార్జున యూనివర్సిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లు, డీన్ సీడీసీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్ని కళాశాలలు యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కళాశాలలు 2014-15, 2015-16 విద్యాసంవత్సరాలకు సంబంధించిన డేటాను ఠీఠీఠీ.్చజీటజ్ఛి.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు. సమాచారం అప్‌లోడ్ చేయని కళాశాలపై యూజీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. డేటాను అప్‌లోడ్ చేయని విద్యాసంస్థలకు యూజీసీ ఇచ్చే నిధుల్లో 25 శాతం కోత విధించటంతోపాటు పలు శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు.
డేటాను అప్‌లోడ్ చేయటానికి ప్రతి కళాశాలకు మూడు వేల రూపాయల ఆర్దిక ప్రోత్సాహకం ఇస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలు పారదర్శకమైన పూర్తి సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, కేఎల్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, కృష్ణా, విక్రమసింహపురి యూనివర్సిటీల డీన్‌సీడీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.